ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి సవరించిన ఉడాన్ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-2026లో ఆవిష్కరించారు. ఇది 120 కొత్త గమ్యస్థానాలను కవర్ చేస్తుంది. రాబోయే 10 సంవత్సరాలలో 4 కోట్ల మంది ప్రయాణికులకు వాయు రవాణా అవకాశం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాలలో హెలిప్యాడ్‌లు, చిన్నపాటి విమానాశ్రయాలకు కూడా ఈ పథకం మద్దతునిస్తుందని సీతారామన్ పేర్కొన్నారు. పాట్నా విమానాశ్రయ సామర్థ్యాన్ని విస్తరించడంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని ఆమె తెలిపారు.
బిహార్‌లో 50,000 హెక్టార్లకు పైగా భూమిని సాగుచేస్తున్న రైతులకు ప్రయోజనం చేకూర్చే వెస్ట్రన్ కోస్ట్ సీ కెనాల్ ఈఆర్‌ఎం ప్రాజెక్ట్‌కు ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీతారామన్ ప్రకటించారు. అలాగే విమానాశ్రయం అభివృద్ధి, బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్ట్ ప్రణాళికలను వెల్లడించారు.
ఇదీ చదవండి: బడ్జెట్ 2025-26: రియల్ ఎస్టేట్‌కు బూస్ట్!
అయితే మొత్తంగా చూస్తే పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు గత బడ్జెట్‌లో కంటే ఈ బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయి. 2024 ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్‌లో రూ. 2,922.12 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌లో కేటాయించింది రూ.2,357.14 కోట్లే.
Comments
Please login to add a commentAdd a comment