
న్యూఢిల్లీ: అరవై ఏళ్లు పైబడిన వారి కోసం తమ యాప్ ద్వారా తక్కువ ప్రీమియంలతో వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు జెన్‌ఎస్ లైఫ్ ఫౌండర్ మీనాక్షీ మీనన్ తెలిపారు. సిల్వర్ ప్లాన్ కింద కేవలం రూ. 990కే రూ. 2.5 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ, ప్రమాదం బారిన పడి ఆస్పత్రిలో చేరితే రూ. 50 వేల నగదు లభిస్తుందని పేర్కొన్నారు.
ప్రత్యేక రేట్లపై రూ. 10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ టాప్ అప్‌లు, క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజీలను పొందవచ్చని తెలిపారు. ఇక గోల్డ్ ప్లాన్‌లో రూ. 4,900 వార్షిక ప్రీమియంకు రూ. 5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, ఆస్పత్రిలో చేరితే రూ. 1 లక్ష నగదు, రూ. 5 లక్షల వరకు సైబర్ ఇన్సూరెన్స్ లభిస్తుందని మీనాక్షి వివరించారు.