కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్లు పైబడిన వారికి పేద, ధనిక అనే తేడాలేకుండా వైద్యం కోసం ప్రత్యేక బీమా కల్పిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజెఎవై) కింద అక్టోబర్ 30 నుంచి ఆరోగ్య బీమా అవకాశం కల్పిస్తోంది.
అర్హులైన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం కింద కొత్త, విభిన్నమైన కార్డ్ జారీచేస్తారు. ఆధార్ కార్డు ప్రకారం 70 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా... ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కేంద్రం తెలిపింది.
దరఖాస్తు చేసే విధానం...
ఏబీపీఎంజేఏవై పథకంలో లబ్ధి పొందేందుకు పీఎంజేఏవై పోర్టల్ లేదా ఆయుష్మాన్ యాప్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎంజేఏవై పోర్టల్ పీఎంజేఏవైజీవోవీ.ఇన్ లాగిన్ అయి 70 ప్లస్ ట్యాబ్‌ఫై క్లిక్ చేయాలి. దాంతో www.beneficiary.nha.gov.in అనే వెబ్ సైట్‌కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ క్యాప్చా, మొబైల్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత కేవైసీ కోసం వివరాలు నమోదు చేసి ఆమోదం కోసం చూడాలి. ఆయుష్మాన్ కార్డు సిద్ధమైన తర్వాత ఆధికారిక ఆమోదం లభించిన వెంటనే బీమా కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇవీ ఉపయోగాలు..
● అర్హులైన సీనియర్ సిటిజన్లందరికీ ఈ పథకం కింద ఏబీ–పీఎంజేఎవై రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎంపానెల్ అయిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో 1,835 రకాల వ్యాధులకు ఉచితంగా చికిత్సలు పొందవచ్చు.
● లబ్ధిదారులు నమోదు చేసుకున్న మొదటి రోజు నుంచి చికిత్సను యాక్సెస్ చేయడం ప్రారంభించవచ్చు. ఏదైనా వ్యాధి లేదా చికిత్స కోసం వేచి ఉండే కాలం ఉండదు, కాబట్టి కవరేజ్ వెంటనే ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment