రోడ్డు మరణాలు, ప్రమాదాల్ని తగ్గించేందకు కేంద్ర రక్షణ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది.
జైన్ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ సదస్సులో రోడ్ సెక్రటరీ అనురాగ్ జైన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే మూడు లేదా నాలుగు నెలల్లో దేశవ్యాప్తంగా గాయపడిన రోడ్డు ప్రమాద బాధితులందరికీ నగదు రహిత వైద్య చికిత్సను ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
జాతీయ రహదారులపై ఉన్న అన్ని బ్లాక్‌స్పాట్‌లను తొలగించడం గురించి జైన్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 4000 ప్రమాదాలకు గురయ్యే ఇంజినీరింగ్ లోపాలను సరిచేశామని అన్నారు. మిగిలిన 5,000 బ్లాక్‌స్పాట్‌లకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను రాబోయే మూడు లోపు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కోరినట్లు చెప్పారు. అన్ని డీపీఆర్‌లు మూడు నెలల్లో తయారవవుతాయని, మే 2025 నాటికి అన్ని ఇంజనీరింగ్ లోపాలను సరిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అన్ని ప్రాజెక్టులను ఒకేసారి మంజూరు చేయాలని మేము భావిస్తున్నాము’ అని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment