
ప్రముఖ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హతావే చైర్మన్ వారెన్ బఫెట్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. అమెరికాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థల్లో ఒకటైన హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికాను విక్రయించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. పెరుగుతున్న తనఖా రేట్లు, క్షీణిస్తున్న అమ్మకాలు, ఆర్థిక అస్థిరతతో ప్రాపర్టీ మార్కెట్ సతమతమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది దేనికి సంకేతం?
ఎందుకు వదులుకుంటున్నట్టు?
బలమైన కారణం ఉంటే తప్ప బఫెట్ వ్యాపారాలను అమ్మేసుకోడు. మరి ఇప్పుడెందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వదులుకుంటున్నాడు? మార్కెట్ విస్తరణకు పేరొందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం కంపాస్ కు హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికాను విక్రయించేందుకు బెర్క్ షైర్ హాత్వే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బెర్క్ షైర్ హాత్వే హోమ్ సర్వీసెస్, రియల్ లివింగ్ వంటి బ్రాండ్ల ద్వారా పనిచేస్తున్న హోమ్ సర్వీసెస్ కు 5,400 మంది ఉద్యోగులు, 820 బ్రోకరేజీ కార్యాలయాలతో విస్తృతమైన నెట్ వర్క్ ఉంది.
వ్యాపారాన్ని విక్రయించాల్సిన అవసరం కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఎదురుదెబ్బల నుంచి కూటా ఉద్భవించి ఉండవచ్చు. 2024లో హోమ్ సర్వీసెస్ ఆఫ్ అమెరికా 107 మిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రకటించింది. రియల్ ఎస్టేట్ కమిషన్ దావాకు సంబంధించిన 250 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్ దీని వెనుక ముఖ్యమైన కారణం. మార్కెట్ పరిస్థితులు బిగుసుకుపోవడం, లాభదాయకత కుంచించుకుపోవడంతో బఫెట్ వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గే అవకాశమూ ఉంది.
పతనం అంచున అమెరికా హౌసింగ్ మార్కెట్?
అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపుతో ఆకాశాన్నంటుతున్న తనఖా రేట్లు గృహ అమ్మకాలను గణనీయంగా మందగించేలా చేశాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ ప్రకారం, 2023 లో ప్రస్తుత గృహాల అమ్మకాలు దాదాపు 30 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ నుంచి బఫెట్ వైదొలగడం దీర్ఘకాలిక ప్రతికూలతలను ఆయన అంచనా వేస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment