హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీనియర్ సిటిజన్స్ కోసం మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ తాజాగా ప్రైమ్ సీనియర్ పేరిట ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టింది. తక్కువ వెయిటింగ్ పీరియడ్, పాలసీ తీసుకున్న 91వ రోజు నుంచీ ప్రీ–ఎగ్జిస్టింగ్ (అప్పటికే ఉన్న) అనారోగ్య సమస్యలకు కవరేజీ మొదలైన ప్రత్యేకతలు ఈ పాలసీలో ఉన్నట్లు సంస్థ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు.
కో–పే, ఉప–పరిమితులు, పాలసీ తీసుకునే ముందు తప్పనిసరి మెడికల్ చెకప్ వంటి బాదరబందీలేమీ ఇందులో ఉండవని వివరించారు. నాన్–మెడికల్ ఐటమ్‌లకు కూడా కవరేజీ లభిస్తుందని, అపరిమిత టెలీ కన్సల్టేషన్, హెల్త్ చెకప్‌లు వంటి ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇది ప్రైమ్ సీనియర్ క్లాసిక్, ప్రైమ్ సీనియర్ ఎలీట్ అని రెండు వేరియంట్లలో ఉంటుందని వివరించారు.
(ఇదీ చదవండి: ట్రాయ్ నిబంధనలు కఠినతరం! కాల్ సేవల నాణ్యత మెరుగుపడేనా?)
Comments
Please login to add a commentAdd a comment