సాక్షి, వెబ్‌డెస్క్: ఇంతకాలం విదేశాల నుంచి విమానలు దిగుమతి చేసుకునే దశ నుంచి స్వంతంగా విమానాలు రూపొందించే స్థితికి భారత్ చేరుకుంది. ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) మినీ విమానాన్ని తయారు చేసింది. ఉదాన్ పథకానికి ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇతర పనులు చేసేందుకు వీలుగా మినీ విమానం డిజైన్ చేసింది.
హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్‌ఆర్)
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయంగా రూపొందించిన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్‌ఆర్) విమానం విశేషాలను హాల్ ప్రకటించింది. కాన్పూరులో ఉన్న హాల్ క్యాంపస్‌లో ఈ విమానాన్ని మీడియాకు పరిచయం చేసింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణం చేయవచ్చు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ మినీ విమానాన్ని హాల్ రూపొందించింది. ఇప్పటికే ఈ విమానం కమర్షియల్ ట్రావెల్‌కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అప్రూవల్ సాధించింది. ప్రైవేటు ఆపరేటర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విమానాలు అందిస్తామని హాల్ చెబుతోంది.
ఉదాన్‌కి ఊతం
భవిష్యత్తులో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతందని కేంద్రం అంచనా వేస్తోంది. అందువల్లే వరంగల్, రామగుండం వంటి టైర్ టూ సిటీల్లో విమానయాన అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉదాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నగరాలకు భారీ విమానాల కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న విమనాలు మెరుగనే ఆలోచన ఉంది. ఇప్పుడు హాల్ మినీ విమానం అందుబాబులోకి తేవడంతో ఉదాన్ పథకానికి కొత్త రెక్కలు వచ్చే అవకాశం ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టకు సంబంధించి సాంకేతిక అనుమతులు సాధించేందుకు కేంద్రం, జీఎంఆర్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది.
పలు రకాలుగా
హాల్ రూపొందింన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్‌ఆర్) విమానాన్ని ప్యాసింజర్ రవాణాకే కాకుండా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్, వీఐపీ ట్రాన్స్‌పోర్టు, క్లౌడ్ సీడింగ్, ఫోటోగ్రఫీ, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫోటోగ్రఫీ, షూటింగ్ తదితర అవసరాలకు వినియోగించుకునేలా ఈ విమానం డిజైన్ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ విమానం ప్రజలకు అందుబాటులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment