Air Ambulance
-
సుప్రీంకోర్టు జడ్జికి గుండెపోటు.. బాగానే ఉన్నానంటూ మెసేజ్
ఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా గుండెపోటుకు గురయ్యారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉండగా.. గురువారం ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఎయిర్ ఆంబులెన్స్‌లో ఢిల్లీకి తరలించారు. షా అస్వస్థత వార్త తెలియగానే.. సుప్రీంకోర్టు అధికార వర్గాలు హోం మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఎయిర్‌ఆంబులెన్స్‌లో హుటాహుటిన తరలించాయి. అయితే తాను బాగానే ఉన్నానని, రేపో ఎల్లుండో పూర్తిగా కోలుకుంటానని ఆయన చెప్తుండగా.. ఓ షార్ట్ వీడియో బయటకు వచ్చింది. జస్టిస్ షా గతంలో గుజరాత్ హైకోర్టు జడ్జిగానూ పని చేశారు. ఆపై పాట్నా హైకోర్టు సీజేగా విధులు నిర్వహించారు. 2018లో ఆయన్ని సుప్రీంకోర్టుకు ప్రమోట్ చేశారు. మే 15, 2023న ఆయన రిటైర్ కావాల్సి ఉంది. I am stable. There is nothing to worry. I will be reaching Delhi soon. By day after tomorrow, I will be better: Justice MR Shah (Source: Justice Shah's office) pic.twitter.com/zpH6xTInhc — ANI (@ANI) June 16, 2022 -
ఎయిర్ అంబులెన్స్ కూలి నలుగురు మృతి
అబూదాబి: అబుదాబి పోలీసుల ఎయిర్ అంబులెన్స్ యూనైటెడ్ అరబ్ ఎమరైట్స్ రాజధాని అబుదాబిలో కూలిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు వైద్య సిబ్బంది మృతి చెందినట్లు వెల్లడించారు. (చదవండి: రెండో పెళ్లి కోసం తొమ్మిది నెలల పసికందుని 'అమ్మే'సింది) మృతి చెందిన వారిలో పైలట్ ట్రైనర్ ఖమీస్ సయీద్ అల్ హోలీ, లెఫ్టినెంట్ పైలట్ నాసర్ ముహమ్మద్ అల్ రషీది, డాక్టర్ షాహిద్ ఫరూక్ ఘోలం, నర్స్ జోయెల్ క్వియ్ సకార మింటో ఉన్నట్లు అబుదాబి పోలీసులు ధృవీకరించారు. ఈ మేరకు అబుదాబి జనరల్ హెడ్‌క్వార్టర్స్ పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు ఎయిర్ అంబులెన్స్ కూలి మృతి చెందిన వైద్యా బృందానికి, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. (చదవండి: తక్షణమే చర్యలు తీసుకుంటాం!) -
మినీ విమానం వచ్చేసింది.. ఎగిరిపోవడానికి రెడీనా?
సాక్షి, వెబ్‌డెస్క్: ఇంతకాలం విదేశాల నుంచి విమానలు దిగుమతి చేసుకునే దశ నుంచి స్వంతంగా విమానాలు రూపొందించే స్థితికి భారత్ చేరుకుంది. ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్(హాల్) మినీ విమానాన్ని తయారు చేసింది. ఉదాన్ పథకానికి ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఇతర పనులు చేసేందుకు వీలుగా మినీ విమానం డిజైన్ చేసింది. హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశీయంగా రూపొందించిన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానం విశేషాలను హాల్ ప్రకటించింది. కాన్పూరులో ఉన్న హాల్ క్యాంపస్‌లో ఈ విమానాన్ని మీడియాకు పరిచయం చేసింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణం చేయవచ్చు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఈ మినీ విమానాన్ని హాల్ రూపొందించింది. ఇప్పటికే ఈ విమానం కమర్షియల్ ట్రావెల్‌కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి అప్రూవల్ సాధించింది. ప్రైవేటు ఆపరేటర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విమానాలు అందిస్తామని హాల్ చెబుతోంది. ఉదాన్కి ఊతం భవిష్యత్తులో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతందని కేంద్రం అంచనా వేస్తోంది. అందువల్లే వరంగల్, రామగుండం వంటి టైర్ టూ సిటీల్లో విమానయాన అవకాశాలు మెరుగుపరిచేందుకు ఉదాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నగరాలకు భారీ విమానాల కంటే తక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న విమనాలు మెరుగనే ఆలోచన ఉంది. ఇప్పుడు హాల్ మినీ విమానం అందుబాబులోకి తేవడంతో ఉదాన్ పథకానికి కొత్త రెక్కలు వచ్చే అవకాశం ఉంది. వరంగల్ ఎయిర్‌పోర్టకు సంబంధించి సాంకేతిక అనుమతులు సాధించేందుకు కేంద్రం, జీఎంఆర్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోంది. పలు రకాలుగా హాల్ రూపొందింన హిందూస్థాన్-228 (వీటీ-కేఎన్ఆర్) విమానాన్ని ప్యాసింజర్ రవాణాకే కాకుండా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ అంబులెన్స్, వీఐపీ ట్రాన్స్‌పోర్టు, క్లౌడ్ సీడింగ్, ఫోటోగ్రఫీ, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫోటోగ్రఫీ, షూటింగ్ తదితర అవసరాలకు వినియోగించుకునేలా ఈ విమానం డిజైన్ చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ విమానం ప్రజలకు అందుబాటులోకి రానుంది. -
వైద్యురాలికి ఊపిరితిత్తుల మార్పిడి.. లక్నో టు హైదరాబాద్
సాక్షి, రాంగోపాల్‌పేట్: లక్నోకు చెందిన ఓ వైద్యురాలిని ఊపిరితిత్తుల మార్పిడి కోసం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. కిమ్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపిన మేరకు.. లక్నోలోని లోహియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ సుమన్ అనే పీజీ రెసిడెంట్‌కు ఏప్రిల్ 14న కోవిడ్ సోకింది. అప్పటికే ఆమె 8 నెలల గర్భిణి. ఊపిరితిత్తులు దెబ్బతిని పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి మే 1న సిజేరియన్ ద్వారా బిడ్డను కాపాడారు. అనంతరం ఆమెను ఎక్మో సపోర్ట్ మీద ఉంచారు. అయినా ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఊపిరితిత్తుల మార్పిడి తప్ప గత్యంతరం లేదని వైద్యనిపుణులు చెప్పారు. దీంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వైద్యురాలి చికిత్స కోసం రూ.1.5 కోట్లు మంజూరు చేసింది. అనంతరం ఆమెను లైవ్ సపోర్ట్ అంబులెన్స్ ద్వారా లక్నో విమానాశ్రయానికి.. అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. -
టైర్ ఊడినా విమానం క్షేమంగా దిగింది!
-
Air Ambulance: టైర్ ఊడినా విమానం క్షేమంగా దిగింది!
ముంబై: అది గుర్గావ్లోని జెట్ సర్వ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఎయిర్ అంబులెన్స్. గురువారం సాయంత్రం మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ముంబైకి బయలుదేరింది. అందులో ఒక రోగి, అతడి బంధువు, ఒక వైద్యుడు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. మొత్తం ఐదుగురు. విమానం నాగపూర్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక టైర్ ఊడిపోయింది. ఈ విషయాన్ని సిబ్బంది గుర్తించారు. ముంబై ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం చేరవేశారు. విమానాన్ని రన్‌వేపై క్షేమంగా ఎలా దించాలన్నదే సమస్య. నేరుగా దిగితే మంటలు వ్యాపించడం ఖాయం. అందులోని ఐదుగురు ప్రాణాలతో మిగులుతారన్న గ్యారంటీ లేదు. చురుగ్గా ఆలోచించారు. విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. రన్‌వేపై నురగతో కూడిన నీళ్లు చల్లారు. టైర్లు పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి విమానం కడుపు భాగం రన్‌వేపై సురక్షితంగా దిగింది. అందులోని ఐదుగురు నిక్షేపంగా బయటికొచ్చారు. ఇంకేముంది కథ సుఖాంతమయ్యింది. ఇతర విమానాలు యథావిధిగా రాకపోకలు సాగించాయి. ముంబై ఎయిర్‌పోర్టులో ఈ విమానం దిగిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: 'థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం' -
సోనూసూద్ సాయం: హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో
హిమాయత్ నగర్: ప్రభుత్వాలు పట్టించు కోకపోయినా నేనున్నా అంటూ బాధితుల్లో ధైర్యం నింపుతున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన కైలాశ్ అగర్వాల్ నాలుగు రోజుల క్రితం కోవిడ్ బారిన పడ్డారు. ఆక్సిజన్ శాచురేషన్ 60–70 మధ్యలో ఉండటంతో బంధువులు ఆస్పత్రుల్లో చేర్చేందుకు యత్నించగా ఎక్కడా బెడ్లు ఖాళీ లేవు. గ్రామస్తులు ఈ విషయాన్ని ట్విట్టర్లో సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సోనూసూద్ శుక్రవారం ఉదయం కైలాశ్ ఇంటికి అంబులెన్స్ పంపారు. ఇంటి నుంచి ఝాన్సీ విమానాశ్రయానికి తరలించారు. కైలాశ్ అక్కడ నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వచ్చారు. హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి చెందిన అంబులెన్స్ అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కైలాశ్ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని, సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని ఆస్పత్రి ఇంచార్జి మోహన్ వేమూరి తెలిపారు. సోనూసూద్ నాలుగు రోజుల క్రితం కూడా ఝాన్సీ నుంచి ఇద్దరు కరోనా రోగులను హైదరాబాద్‌కు తరలించి సాయం చేశారు. వీరి ఆరోగ్యం కుదుటపడుతుండటం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని సోనూసూద్ ‘సాక్షి’ తెలిపారు. చదవండి: కరోనా: వాట్సాప్ ‘స్టేటస్’ మారిపోతోంది! -
సలాం సోనూ సూద్...మీరో గొప్ప వరం!
సాక్షి, ముంబై: ప్రముఖ నటుడు సోనూసూద్ సేవా నిరతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కరోనా సంక్షోభం ఆరంభమైంది మొదలు.. తనకు కరోనా సోకిన సమయంలో సేవా కార్యక్రమాలనుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తనకు నెగిటివ్ వచ్చిందని ట్విటర్లో షేర్ చేసిన సోనూ.. తాజాగా మరో ఘటనతో వార్తల్లో సంచలన వ్యక్తిగా నిలిచాడు. కరోనా బారినపడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళ(25)ను చికిత్స కోసం నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ఏకంగా ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించి తన మానవత్వానికి ఎల్లలు లేవని చాటుకున్నారు. దీంతో కనిపించే దైవం అంటూ అభిమానులు సోనూసూద్‌ను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నారు. (శుభవార్త చెప్పిన సోనూసూద్) వివరాల్లోకి వెళ్లితే రిటైర్డ్ రైల్వే అధికారి కుమార్తె భారతి కోవిడ్-19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైనారు. ఆమె ఊపిరితిత్తులు దాదాపు 85 నుండి 90శాతం పాడైపోయాయి. మొదట ఆమెను నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి సహాయం చేశాడు సోనూ సూద్. అయితే ఆమెకు ఊపిరితిత్తుల మార్పడి అవసరమని వైద్యులు ప్రకటించారు. అయినా 20 శాతం మాత్రమే బతికే అవకాశాలు ఉన్నాయని కూడా వైద్యులు చెప్పారు. పైగా ఆ అవకాశం ఒక్క అపోలోలో మాత్రమే ఉంది. అయినా సోనూ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. క్షణం ఆలస్యం చేయకుండా చివరివరకు ప్రయత్నిద్దాం అంటూ అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్లతో సంప్రదించి, ప్రత్యేకమైన ఎక్మో సపోర్టు ద్వారా హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించేందుకు సాయపడ్డారు. అంతేకాదు శరీరానికి కృత్రిమంగా రక్తం పంప్ చేసే ఎక్మో చికిత్సలో నిపుణులైన వైద్యబృందాన్ని రప్పించి మరీ ఎయిర్ అంబులెన్స్‌లో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. సోనూ ప్రత్యేకత అదే కదా. ప్రస్తుతం భారతి చికిత్స పొందుతున్నారు. కరోనా పోరులో ఆమె నిలిచి గెలుస్తుందనే ధీమాను వ్యక్తం చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న అభిమానులు, ఇతర నెటిజనులు రియల్ హీరోను ప్రశంసిస్తున్నారు. గ్రేట్ సోనూజీ.. అంచనాలకు అందని మీ మానవత్వం, ఔదార్యం.. మీ మాతృమూర్తి భారతీయులకు అందించిన గొప్పవరం మీరు అంటూ కమెంట్ చేస్తున్నారు. -
అఫ్ఘన్‌లో గాయాలు, ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు
సాక్షి, హైదరాబాద్ : ఉపాధి కోసం అఫ్గానిస్థాన్‌కు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో.. మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో మంగళవారం రాత్రి నగరానికి తీసుకొచ్చారు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆఫ్గానిస్థాన్‌లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఆయన గాయపడటంతో వెన్నెముక దెబ్బతింది. పరిస్థితి విషమించడంతో అత్యాధునిక వైద్యం అవసరమైంది. ఐసీఏటీటీ హెల్త్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలోని ఎయిర్ అంబులెన్స్ విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. బాధితుడితో వచ్చిన వైద్యులు రాహుల్ సింగ్, శాలినీ నల్వాద్ మాట్లాడుతూ కరోనా సమయంలో హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ రావడం ఇదే తొలిసారని తెలిపారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా బాధితుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. (కిమ్ ఆరోగ్యంగా స్పందించిన ట్రంప్) 'స్వీట్హార్ట్.. డిన్నర్ ఎక్కడ చేద్దాం' -
పీఎన్బీ స్కాం : చోక్సీకి ఈడీ కౌంటర్
సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ చోక్సీలను స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అనారోగ్య కారణాలతో విచారణకు రాలేనంటూ కుంటిసాకులు చెబుతూ వస్తున్న చోక్సీకి షాకిచ్చేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక నిర్ణయం తీసుకుంది. విచారణను ఆలస్యం చేసే ఉద్దేశంతో కావాలనే సాకులు చెబుతున్నాడని, చోక్సీకి వ్యతిరేకంగా నాన్ బెయిల్‌బుల్, రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఈడీ ముంబై కోర్టును కోరింది. దర్యాప్తునకు సహకరించకుండా, భారతదేశాని తిరిగి రావడానికి నిరాకరిస్తున్నాడని సీబీఐ, ఈడీ ఆరోపించాయి. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న చోక్సీ అభ్యర్థనను కొట్టివేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో పీఎన్బీ స్కాం విచారణను ఆంటిగ్వాలో జరపాలంటూ మెహుల్ చోక్సీ పెట్టుకున్న విజ్ఞప్తిని ఈడీ శనివారం తిరస్కరించింది. అలాగే ఆంటిగ్వా నుండి చోక్సిని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి వైద్య నిపుణులతో ఎయిర్ అంబులెన్స్‌ను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. దేశంలో అవసరమైన అన్ని వైద్య చికిత్సలను అందుబాటులో ఉంచుతామని కూడా ఇడి కోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు ముంబై కోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అనారోగ్య కారణం పేరుతో చట్టపరమైన చర్యలను ఆలస్యం చేస్తూ, కోర్టును తప్పుదోవ పటిస్తున్నాడని చోక్సీ పై ఈడీ మండిపడింది. భారతదేశం తిరిగి వచ్చేలా అఫిడవిట్ దాఖలు చేయాలని చోక్సీని ఆదేశించాలని కోర్టును కోరింది. అతను తిరిగి రావడానికి ఖచ్చితమైన తేదీని పేర్కొనాలని ఈడీ కోరింది. ఆర్డర్ ఇచ్చిన తేదీ నుండి ఒక నెలలోపు రావాలని పేర్కొంది. కాగా నకిలీ పత్రాలతో పీఎన్బీలో 14వేల కోట్ల రూపాయల మేర రుణాలను తీసుకొని ఎగ్గొట్టి నీరవ్‌మోదీ లండన్‌కు పారిపోగా, మెహుల్ చోక్సీ ఆంటిగ్వాకు చెక్కేసి అక్కడి పౌరసత్వం తీసుకున్న సంగతి తెలిసిందే. -
‘ఎయిర్ అంబులెన్స్’ సేవలు షురూ
హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా ‘ఎయిర్ అంబులెన్స్’సేవలు నగరంలో ప్రారంభమయ్యాయి. ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ (హెచ్‌ఈఎంఎస్)ను శనివారం వింగ్స్ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ వై.ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదం, ప్రకృతి బీభత్సాలు జరిగినప్పుడు తీవ్ర గాయాలైన వారికి సత్వరమే వైద్య సేవలందిస్తే వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, ఇలాంటి వారి కోసమే ఎయిర్ ఎయిడ్ పేరిట సేవలను ప్రారంభించామన్నారు. ఎయిర్ ఎయిడ్ ద్వారా సేవలందించేందుకు అగస్టా వెస్ట్‌ల్యాండ్ 109సీ హెలికాప్టర్‌ను తెప్పించినట్లు చెప్పారు. నలుగురు ప్రయాణించే ఈ హెలికాప్టర్లో వైద్య సేవలు అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. డీజీసీఏ సర్టిఫికెట్ ఉండటంతో అనుకూల ప్రాంతం ఎక్కడున్నా ల్యాండింగ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. 50 మీటర్ల స్థలం ఉంటేచాలు ఈ హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయొచ్చని, దీనిలో ఒకసారి ఇంధనం నింపితే 450 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపారు. రాష్ట్రంతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లోనూ ఎయిర్ ఎయిడ్ సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ హెలికాప్టర్ సేవల కోసం 18007582080 నంబర్‌కు గాని, www. airaidcare.com వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించవచ్చని ప్రభాకర్‌రెడ్డి వివరించారు. -
దేశంలో తొలి గగనతల అంబులెన్స్ ప్రారంభం
-
అపోలో ఎయిర్ అంబులెన్స్ మరిన్ని నగరాలకు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగ సంస్థ అపోలో హాస్పిటల్స్ ఎయిర్ అంబులెన్స్ సర్వీసులను మరిన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించింది. వీటిలో వైజాగ్, కాకినాడ, కరీంనగర్‌తోపాటు మధురై, కరైకుడి, కరూర్, త్రిచ్చి, మైసూర్ ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలను అనుసంధానిస్తూ కంపెనీ ఈ అత్యవసర సేవలందిస్తుంది. బెంగళూరుకు చెందిన ఎయిర్ ఏవియేటర్స్ రెస్క్యూ హెలికాప్టర్లను సమకూర్చింది. అత్యవసర పరిస్థితుల్లో బాధితులు, రోగులకు ప్రాథమిక చికిత్స అందించే శిక్షణ పొందిన బృందం ఎయిర్ అంబులెన్సుల్లో ఉంటారు. బాధితులు, రోగులను మొదట రోడ్డు మార్గంలో అంబులెన్సు ద్వారా సమీపంలోని హెలికాప్టర్ ల్యాండింగ్ జోన్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అపోలో ఆసుపత్రి ఉన్న నగరానికి చేరుస్తారు. పలు ఏవియేషన్ కంపెనీల భాగస్వామ్యంతో ఎయిర్ అంబులెన్స్ సర్వీసులను 2003 నుంచి అపోలో అందిస్తోంది. ఏటా సగటున 125–150 మంది సేవలను వినియోగించుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఎయిర్ అంబులెన్స్‌కు గంటకు రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చార్జీ చేస్తారు. అపోలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ నంబరు 1066కు ఫోన్ చేయడం ద్వారా సేవలను పొందవచ్చు. -
ఎయిర్ అంబులెన్స్ కు ప్రమాదం, పైలట్ మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని నుంచి థాయ్‌లాండ్‌కు వెళుతున్న మేదాంత ఆస్పత్రికి చెందిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. విమానంలో మంటలు అంటుకోవడంతో బ్యాంకాక్ సమీపంలో కూలిపోయిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ ఘటనలో పైలట్ అరుణక్షా నంది అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా బ్యాంకాక్ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె వరుస ట్వీట్లు చేశారు. గాయపడ్డ వారిలో డాక్టర్ శైలేంద్ర, డాక్టర్ కోమల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సుష్మ తెలిపారు. -
అటవీ సిబ్బందికి ఎయిర్ అంబులెన్స్
అపోలో ఆస్పత్రుల ఫౌండేషన్ వైస్‌చైర్‌పర్సన్ ఉపాసన వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లోని అడవుల్లో పనిచేసే అటవీ శాఖ సిబ్బంది, స్థానికులకు అత్యవసర వైద్య సాయం కోసం ఎయిర్ అంబులెన్స్‌ల సేవలను అందిస్తామని అపోలో ఆస్పత్రుల ఫౌండేషన్ వైస్‌చైర్‌పర్సన్ ఉపాసన తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్–ఇండియా కార్యకలాపా లు సాగించే ప్రాంతాల్లో ఈ సేవలతోపాటు వైద్య సాయాన్ని అందుబాటులోకి తెస్తామ న్నారు. ఈ మేరకు ఆ సంస్థతో కొనసా గుతున్న ఒప్పందాన్ని ఏప్రిల్ నుంచి మరో ఏడాదిపాటు పొడిగించుకుంటున్నట్లు వెల్ల డించారు. సోమవారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో ఉపాసన, డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్–ఇండియా సీఈవో రవిసింగ్లు ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. ఉపాసన మాట్లాడుతూ అటవీ సిబ్బంది, స్థానికులు నిత్యం వన్యప్రాణులు, వేటగాళ్ల నుంచి ప్రమాదాలు ఎదుర్కొంటుం టారన్నారు. అటువంటి పరిస్థితుల్లో వారికి వైద్య సాయం ఎంతో అవసరమన్నారు. అత్య వసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఎయిర్ అంబులెన్స్ సేవలతోపాటు నాణ్యమైన వైద్య సాయం అందిస్తామన్నారు. అలాగే వైద్య శిబి రాలూ ఏర్పాటు చేస్తామన్నారు. జంతువుల దాడుల్లో గాయపడటం, కొండల నుంచి జారి పడటం, మలేరియా,డెంగీ వంటి ప్రాణాం తక వ్యాధులేర్పడినప్పుడు, పాము కాట్లు తదితర ప్రమాద సందర్భాల్లో అటవీ సిబ్బం దితోపాటు స్థానికులకు ఈ ఒప్పందం ద్వారా వైద్య సేవలు అందిస్తామన్నారు. గతేడాది నల్లమల అడవుల్లో ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వందలాది మందిని కాపాడ గలిగామన్నారు. తెలంగాణ, ఏపీతోపాటు జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తమిళ నాడు, కర్ణాటక, కేరళ అడవుల్లో పనిచేసే అటవీశాఖ సిబ్బంది సహా స్థానికులకు తక్షణ వైద్య సేవలు అంది స్తామన్నారు. -
అమరావతికి ఎయిర్ అంబులెన్స్ సేవలు
కేంద్రానికి మంత్రి కామినేని వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఎయిర్ అంబులెన్స్ సేవలను రాష్ట్ర కొత్త రాజధాని అమరావతి పరిధిలో అందుబాటులోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజుతో సమావేశమై ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రైల్వేశాఖ కృష్ణా పుష్కరాలకు ప్రాధాన్యమివ్వాలని ఆయన కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభును కలసి విన్నవించారు. వివిధ రాష్ట్రాల నుంచి కృష్ణా పుష్కరాలకొచ్చే భక్తులు, యాత్రికుల సౌకర్యార్థం ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల్ని గుర్తుచేశారు. ధర్మవరంలో నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ ప్రారంభానికి రావాలంటూ సురేశ్‌ప్రభును ఆహ్వానించారు. కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఏపీనుంచి రాజ్యసభకు ఎన్నికైనందున ఎంపీలాడ్స్ నిధులనుంచి 13 జిల్లాలకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తానని రైల్వేమంత్రి హామీ ఇచ్చారని శ్రీనివాస్ తెలిపారు. -
ఢిల్లీలో కూలిన ఎయిర్ అంబులెన్స్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎయిర్ అంబులెన్స్‌కు ప్రమాదం చోటుచేసుకుంది. పాట్నా నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ అంబులెన్స్ పొలాల్లాంటి ప్రదేశంలో అత్యవసరంగా దిగింది. ఈ దిగే క్రమంలో దాదాపు కూలిపోయినంతపనిజరిగింది. అయితే, అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం ఏడుగురు ఇందులో ఉన్నారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు. అల్ కెమిస్ట్ పార్మా కంపెనీకి చెందిన సీ-90 అనే ఈ విమానం ఓ రోగితో పాట్నా నుంచి ఢిల్లీకి బయలు దేరి వస్తుండగా అత్యవసరంగా దించేయాల్సి వచ్చి ఢిల్లీలోని నజఫ్ గఢ్ ప్రాంతంలో నడిపొలాల్లో దించివేశారని, ఆ క్రమంలో అది కూలిపోయినంత పనిజరగిందని అధికారులు చెప్పారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. -
శరద్ పవార్‌కు గాయాలు... ముంబై తరలింపు
-
శరద్ పవార్‌కు గాయాలు... ముంబై తరలింపు
న్యూఢిల్లీ: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు బుధవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో కింద పడిపోయారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. పవార్ కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే నగరంలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ముంబై తరలించాలని వైద్యులు సూచించారు. దాంతో ఆయన్ని ఎయిర్ అంబులెన్స్ విమానంలో ముంబై తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
ఫ్లయింగ్ ఐసీయూ
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మనిషిని అత్యవసరంగా కాపాడేది అంబులెన్స్. పట్టణాల్లో, పల్లెల్లో ప్రమాదాల్లో చిక్కుకున్న ఎందరి జీవితాలనో కాపాడే ఆపద్బంధు అంబులెన్స్! అయితే.. అదే ప్రమాదం అడవుల్లోనో, కొండల్లోనో జరిగితే..? వెంటిలేటర్ మీదున్న రోగిని అత్యవసరంగా అత్యాధునిక వైద్యం కోసం దూరతీరాలకు తీసుకెళ్లాల్సి వస్తే.. అలాంటి సందర్భాల్లోమేమున్నామంటున్నాయి ఎయిర్ అంబులెన్స్‌లు. మహానగరాల్లో వీటికి ట్రాఫికర్ సమస్య ఉండదు. గంటలకు గంటలు ప్రయాణ సమయం ఉండదు. కొడిగడుతున్న దీపాన్ని కొండెక్కకుండా ఎత్తుకెళ్లి అవసరమైన వెద్యం అందే చోట దించుతుంది. ఈ లోపు ఆ మనిషి ప్రాణాలు గాల్లో కలసిపోకుండా.. గగనతలంలోనే ఐసీయూ సేవలు అందిస్తుంది. ఇప్పటి వరకు బెంగళూరు, ఢిల్లీ, ముంబై, గువాహటి, కోల్‌కతా నగరాలకు పరిమితమైన ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్ సేవలు ఇటీవల మన హైదరాబాద్‌లోనూ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్ మిషన్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా బినీష్ పాల్ ‘సిటీప్లస్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అత్యవసరంగా వైద్యం అందాల్సిన వారిని ఆస్పత్రికి తరలించే అంబులెన్స్‌కు ప్రతిక్షణం ఉత్కంఠమే. హైదరాబాద్‌లో అడుగడుగునా అడ్డగించే ట్రాఫిక్ జామ్‌లు, అస్తవ్యస్తమైన రోడ్లు ఒక ప్రాణానికి పరీక్ష పెడుతుంటాయి. ఇవేకాక అంబులెన్స్‌లో అత్యాధునిక సౌకర్యాల లేమితో ఎందరో అవసరమైన వైద్యాన్ని పొందలేక‘పోతున్నారు’. వీటన్నింటికీ పరిష్కారం చూపుతోంది ‘ఎయిర్ అంబులెన్స్’. ప్రాణాన్ని కాపాడేందుకు అందుబాటులో ఉన్న అన్ని సేవ లను ఉపయోగించుకోవడమే తమ లక్ష్యం అంటోంది ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్. పదేళ్ల శ్రమ తార్వాత 2007లో ఆకాశవీధిలో అంబులెన్స్ సేవలను ప్రారంభించామని చెబుతున్నారు బినీష్ పాల్. కొండలు, గుట్టలు, పర్వత ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, అడవుల్లో ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో ఎయిర్ అంబులెన్స్ సేవలు కీలకంగా మారుతున్నాయి. 12 విమానాలు..ఓ చాపర్.. ప్రస్తుతం ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్ దగ్గర 12 విమానాలు, ఓ చాపర్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 7 ప్లాటస్ పీసీ-12, 3 కింగ్ ఎయిర్ బీ- 200, 2 సింటేషన్ ఎక్స్ఎల్ విమానాలున్నాయి. ప్లాటస్, కింగ్ విమానాలను డొమెస్టిక్ పరిధిలో, చాపర్, సింటేషన్ విమానాలను ఇంటర్నేషనల్ పరిధిలో వినియోగిస్తున్నారు. ఇక సిబ్బంది విషయానికొస్తే.. 50 మంది పెలైట్లు, 25 మంది వైద్యులు, ఎయిర్ పోర్ట్‌కు నలుగురు చొప్పున ఇతర స్టాఫ్ అందుబాటులో ఉన్నారు. రైలు, రోడ్డు, అగ్ని ప్రమాదాల్లోని క్షతగాత్రులను, హార్ట్ ఎటాక్‌తో పాటు ప్రాణాల మీదికి వచ్చినప్పుడు రెక్కలు కట్టుకుని వాలిపోతాయి. ప్రథమ చికిత్సతో పాటు అవసరమైన వైద్యసేవలు అందిస్తూ.. సురక్షితంగా, తక్కువ సమయంలో ఆస్పత్రికి తరలిస్తుంది. చార్జి రూ.45 వేలు.. ఎయిర్ అంబులెన్స్ సేవల చార్జీలు ప్రయాణ దూరం, విమానాన్ని బట్టి చార్జి ఉంటుంది. చాపర్, హెలికాప్టర్ (సింగిల్ ఇంజన్) ప్రారంభ ధర రూ.45 వేలు, డబుల్ ఇంజన్ హెలికాప్టర్ అయితే రూ.75 వేలు, అలాగే జెట్ విమానం అయితే రూ.1.80 లక్షలు స్టార్టింగ్ ప్రైస్‌గా నిర్ణయించారు. అంబులెన్స్‌లో సేవల చార్జీలు సమయాన్ని బట్టి లెక్కిస్తారు. ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయను మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్‌లోనే సింగపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి శ్రీనివాస్‌రెడ్డి ఎయిర్ అంబులెన్స్‌లోనే బాగల్పూర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మలయాళ నటుడు జగతి శ్రీకుమార్‌తో పాటు చాలా మంది రాజకీయ ప్రముఖులు ఎయిర్ అంబులెన్స్ సేవలు పొందిన వారిలో ఉన్నారు. అన్ని అనుమతులూ ఉన్నాయి.. ‘ఎక్కడైనా, ఏ సమయంలోనైనా దే శ, విదేశాల్లోని అన్ని విమానాశ్రయాలకు వెళ్లేందుకు వీలుగా అవసరమైన అనుమతిని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖలతో పాటు ఇతర ఏజెన్సీల నుంచి అనుమతి తీసుకున్నాం. అలాగే దేశ, విదేశాల్లోని ఆసుపత్రులకు వెళ్లేందుకు వీలుగా కేంద్ర ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖ అనుమతి కూడా తీసుకున్నాం. అలాగే అందుబాటులో ఉన్న విమానాలను ఎప్పటికప్పుడు మరమ్మతులను చేసేందుకు ప్రత్యేకమైన విభాగం కూడా ఉందని’ చెబుతున్నారు బినీష్ పాల్. మరిన్ని వివరాలు airambulance@ airambulanc-eaviation.com, www.airambulance-aviation.com వెబ్సైట్లలో చూడొచ్చు. -ఆడెపు శ్రీనాథ్ అంబులెన్స్ ప్రత్యేకతలు.. - ఎయిర్ అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న పేషెంట్లు/ క్షతగాత్రుల ప్రాణాలకు ఎటువంటి ముప్పులేకుండా అత్యవసరంగా అందించాల్సిన వైద్య సేవలన్నీ ఉంటాయి - నైపుణ్యం కలిగిన వైద్యుడితో పాటు, ప్రత్యేక శిక్షణ పొందిన పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు - కృత్రిమ శ్వాస వ్యవస్థతో పాటు, పేషంట్ గుండె ఆగిపోతే.. తిరిగి పనిచేసేలా షాక్ ఇచ్చే డిఫిబ్రిలేటర్ ఉంటుంది - రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకునే పల్స్ ఆక్స్ మీటర్ కూడా అందుబాటులో ఉంటుంది - కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ (సీపీఆర్), ఎలక్ట్రోకార్డియోగ్రఫి (ఈసీజీ), వెంటిలేటర్, టెలీ మెడిసిన్, ఇంక్యుబేషన్ వంటి అత్యాధునిక వసతులు ఎయిర్ అంబులెన్స్‌లో సిద్ధంగా ఉంటాయి.