ఎయిర్‌ అంబులెన్స్ కు ప్రమాదం, పైలట్‌ మృతి | Medanta's air ambulance crash lands near Bangkok, pilot dies | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ అంబులెన్స్ కు ప్రమాదం, పైలట్‌ మృతి

Published Tue, Mar 7 2017 3:27 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

Medanta's air ambulance crash lands near Bangkok, pilot dies

న్యూఢిల్లీ: దేశ రాజధాని నుంచి థాయ్‌లాండ్‌కు వెళుతున్న మేదాంత ఆస్పత్రికి చెందిన ఎయిర్‌ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. విమానంలో మంటలు అంటుకోవడంతో బ్యాంకాక్‌ సమీపంలో కూలిపోయిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు.

ఈ ఘటనలో పైలట్‌ అరుణక్షా నంది అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా బ్యాంకాక్‌ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె వరుస ట్వీట్లు చేశారు. గాయపడ్డ వారిలో డాక్టర్‌ శైలేంద్ర, డాక్టర్‌ కోమల్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సుష్మ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement