medanta Hospital
-
ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
సాక్షి, ఢిల్లీ: సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్.. యూపీకి మూడుపర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగానూ ఆయన పని చేశారు. ప్రస్తుతం మణిపురి(యూపీ) పార్లమెంట్ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. అనారోగ్య సమస్యలతో ఈ ఆగస్టు నుంచి మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 2న ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ములాయం సింగ్ యాదవ్.. 1967లో తొలిసారిగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్ నుంచి తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1992లో సమాజ్‌వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగానూ ఉన్నారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ములాయం మృతి పట్ల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించడంతో పాటు సైఫయిలో అధికారిక లాంఛనాలతో ములాయం అంత్యక్రియలకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. -
విషమంగా ములాయం సింగ్ ఆరోగ్యం
లక్నో: సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే.. సోమవారం వరకు ఆయనకు క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స అందించారు వైద్యులు. ఈ క్రమంలో ఇవాళ ఆరోగ్యం విషమించడంతో ఆయన్ని ఐసీయూలోకి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. చికిత్సకు ఆయన శరీరం సహకరించడం లేదని, పరిస్థితి మెరుగుపడడం లేదని వైద్యులు చెప్తున్నారు. ఈ మేరకు హెల్త్ బులిటెన్‌ను పార్టీ వర్గాలు ట్విటర్ ద్వారా ధృవీకరించాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాయి. मेदांता अस्पताल ने जारी किया आदरणीय नेताजी का हेल्थ बुलेटिन। हम सभी आदरणीय नेताजी के जल्द स्वस्थ और दीर्घायु होने की कामना करते हैं। pic.twitter.com/myCZJIzKMY — Samajwadi Party (@samajwadiparty) October 4, 2022 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్.. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా పని చేశారు. ప్రస్తుతం మణిపురి(యూపీ) పార్లమెంట్ స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. అనారోగ్య సమస్యలతో ఈ ఆగస్టు నుంచి మేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఆదివారం(అక్టోబర్ 2న) ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ఇదీ చదవండి: జమ్ములో రక్తపాతమా? ఏమైందిప్పుడు?- అమిత్ షా -
ఎస్పీ నేత ఆజం ఖాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి అఖిలేశ్
లక్నో: ఎస్పీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆజం ఖాన్ గురువారం అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం లక్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. న్యూమోనియా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో ఆజం ఖాన్ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో చేరిన ఆజం ఖాన్‌ను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆజం ఖాన్ ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని, ఆస్పత్రిలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడినట్లు చెప్పారు. చదవండి: దర్యాప్తు సంస్థల దుర్వినియోగమే.. పార్లమెంట్లో రగడ -
ఆసుపత్రిలో మాజీ సీఎం: క్ష్రీణించిన ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీ నొప్పి కారణంగా బుధవారం ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో శ్వాసకోశ విభాగానికి తరలించి సీనియర్ వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న కమల్‌నాథ్ ఆరోగ్యం క్షీణిచిందని కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలుజా ఒక ప్రకటనలో వెల్లడించారు. దీంతో పలువురు కాంగ్రస్ నేతలు కమల్ నాథ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కమల్‌నాథ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. కాగా కోవిడ్-19ను రాజకీయం చేశారనే ఆరోపణలపై కమల్ నాథ్‌పై గత నెల( మే 24న) కేసు నమోంది. కరోనా వాస్తవ లెక్కలను వెల్లడించాలన్నందుకు తనపై కేసులు పెడుతున్నారని, దేశద్రేహి అంటున్నారని కమల్‌నాథ్ బీజేపీ సర్కార్‌పై మండిపడ్డారు. మరోవైపు చాలా కాలంగా ఢిల్లీలో ఉంటున్న కమల్ నాథ్‌కు హనీ ట్రాప్ కేసులో సిట్ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. पूर्व मुख्यमंत्री श्री कमलनाथ जी के अस्वस्थ होने की सूचना मिली है। मैं ईश्वर से प्रार्थना करता हूँ कि वे उन्हें शीघ्र ही पूर्ण स्वस्थ करें। @OfficeOfKNath — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 9, 2021 -
ఎయిర్ అంబులెన్స్ కు ప్రమాదం, పైలట్ మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని నుంచి థాయ్‌లాండ్‌కు వెళుతున్న మేదాంత ఆస్పత్రికి చెందిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. విమానంలో మంటలు అంటుకోవడంతో బ్యాంకాక్ సమీపంలో కూలిపోయిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ ఘటనలో పైలట్ అరుణక్షా నంది అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా బ్యాంకాక్ ఆస్పత్రికి తరలించినట్లు ఆమె వరుస ట్వీట్లు చేశారు. గాయపడ్డ వారిలో డాక్టర్ శైలేంద్ర, డాక్టర్ కోమల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సుష్మ తెలిపారు.