
అబూదాబి: అబుదాబి పోలీసుల ఎయిర్ అంబులెన్స్ యూనైటెడ్ అరబ్ ఎమరైట్స్ రాజధాని అబుదాబిలో కూలిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు వైద్య సిబ్బంది మృతి చెందినట్లు వెల్లడించారు.
(చదవండి: రెండో పెళ్లి కోసం తొమ్మిది నెలల పసికందుని 'అమ్మే'సింది)
మృతి చెందిన వారిలో పైలట్ ట్రైనర్ ఖమీస్ సయీద్ అల్ హోలీ, లెఫ్టినెంట్ పైలట్ నాసర్ ముహమ్మద్ అల్ రషీది, డాక్టర్ షాహిద్ ఫరూక్ ఘోలం, నర్స్ జోయెల్ క్వియ్ సకార మింటో ఉన్నట్లు అబుదాబి పోలీసులు ధృవీకరించారు. ఈ మేరకు అబుదాబి జనరల్ హెడ్‌క్వార్టర్స్ పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు ఎయిర్ అంబులెన్స్ కూలి మృతి చెందిన వైద్యా బృందానికి, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
(చదవండి: తక్షణమే చర్యలు తీసుకుంటాం!)
Comments
Please login to add a commentAdd a comment