UP Man Bags Mega Prize In Dubai Gets Above 55 Lakhs Per Month - Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో భారత ఆర్కిటెక్ట్ జాక్‌పాట్.. 25 ఏళ్లపాటు, నెలకు రూ.5.59 లక్షలు..

Published Sat, Jul 29 2023 1:28 PM | Last Updated on Sat, Jul 29 2023 7:05 PM

UP Man Bags Mega Prize In Dubai Gets Above 55 Lakhs Per Month - Sakshi

అబుదాబి: యూపీకి చెందిన ఖాన్ దుబాయ్‌లో మెగా ప్రైజ్ గెలుచుకున్నాడు. బహుమతిగా అతను మరో 25 ఏళ్లపాటు నెలకు 25 వేలు దేనారాలు (రూ.5.59 లక్షలు) సొంతం చేసుకోనున్నాడు.

దుబాయ్‌లోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆర్కిటెక్టుగా పనిచేసున్న మహమ్మద్ అడిల్ ఖాన్ టైఖేరోస్ సంస్థ నిర్వహించిన ఫాస్ట్ 5 ఎమిరేట్స్ డ్రాలో మొట్టమొదటి విజేతగా నిలిచాడు. ఈ మేరకు కంపెనీ మార్కెటింగ్ హెడ్ పాల్ చాడర్ మాట్లాడుతూ ఈ డ్రా మొదలుపెట్టిన ఎనిమిది వారాల్లోపే మొట్టమొదటి విజేతను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది.

ఈ మెగా ఎమిరేట్స్ డ్రాలో విజేతగా ఖాన్ పేరును ప్రకటిస్తూ బహుమతిగా ఆయనకు 25 సంవత్సరాల పాటు నెలకు 25 వేలు దేనారాలు (రూ.5.59 లక్షలు) చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. 

యూపీకి చెందిన ఖాన్ మాట్లాడుతూ.. ఈ నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను. మా ఇంట్లో వాళ్లకి ఈ విషయాన్ని చెబితే వారు కూడా నమ్మలేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమన్నారు. మా కుటుంబంలో నేనొక్కడినే పనిచేస్తుంటాను. మా అన్నయ్య కరోనా సమయంలో చనిపోయారు. అన్నయ్య కుటుంబాన్ని కూడా నేనే చూసుకోవాలి. వయసు మీదపడిన తల్లిదండ్రుల తోపాటు నాకొక ఐదేళ్ల పాప కూడా ఉందని, ఈ బహుమతి నాకు సరైన సమయంలోనే అందిందనుకుంటున్నానని అన్నాడు.   

ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement