ఢిల్లీలో కూలిన ఎయిర్ అంబులెన్స్ | air ambulance crash in delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కూలిన ఎయిర్ అంబులెన్స్

Published Tue, May 24 2016 3:29 PM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM

ఢిల్లీలో కూలిన ఎయిర్ అంబులెన్స్

ఢిల్లీలో కూలిన ఎయిర్ అంబులెన్స్

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎయిర్ అంబులెన్స్కు ప్రమాదం చోటుచేసుకుంది. పాట్నా నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ అంబులెన్స్ పొలాల్లాంటి ప్రదేశంలో అత్యవసరంగా దిగింది. ఈ దిగే క్రమంలో దాదాపు కూలిపోయినంతపనిజరిగింది. అయితే, అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం ఏడుగురు ఇందులో ఉన్నారు.

గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు. అల్ కెమిస్ట్ పార్మా కంపెనీకి చెందిన సీ-90 అనే ఈ విమానం ఓ రోగితో పాట్నా నుంచి ఢిల్లీకి బయలు దేరి వస్తుండగా అత్యవసరంగా దించేయాల్సి వచ్చి ఢిల్లీలోని నజఫ్ గఢ్ ప్రాంతంలో నడిపొలాల్లో దించివేశారని, ఆ క్రమంలో అది కూలిపోయినంత పనిజరగిందని అధికారులు చెప్పారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 
   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement