
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : ఉపాధి కోసం అఫ్గానిస్థాన్‌కు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో.. మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో మంగళవారం రాత్రి నగరానికి తీసుకొచ్చారు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆఫ్గానిస్థాన్‌లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఆయన గాయపడటంతో వెన్నెముక దెబ్బతింది. పరిస్థితి విషమించడంతో అత్యాధునిక వైద్యం అవసరమైంది. ఐసీఏటీటీ హెల్త్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలోని ఎయిర్ అంబులెన్స్ విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. బాధితుడితో వచ్చిన వైద్యులు రాహుల్ సింగ్, శాలినీ నల్వాద్ మాట్లాడుతూ కరోనా సమయంలో హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్ రావడం ఇదే తొలిసారని తెలిపారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా బాధితుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. (కిమ్ ఆరోగ్యంగా స్పందించిన ట్రంప్)
Comments
Please login to add a commentAdd a comment