civil aviation minister
-
70 విమానాలకు బాంబు బెదిరింపులు.. ఎయిర్‌లైన్స్ సీఈఓలతో భేటీ
భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం తీవ్ర కలకలం రేపుతోంది. అటు దేశీయంగా నడిచే వాటితోపాటు విదేశాలకు వెళ్తున్న అనేక ఎయిర్‌లైన్స్ వరసగా బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన ఆరు రోజుల్లో ఏకంగా 70 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయంటే.. వీటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు అధికారులు, కపౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నకిలీ బెదిరింపులపై దర్యాప్తు జరుపుతున్నప్పటికీ పరిస్థితులో మార్పు కనిపించడం లేదు.ఈ క్రమంలో తాజాగా ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (బీసీఏఎస్) అప్రమత్తమైంది. విమానయాన సంస్థల సీఈఓలతో శనివారం సమావేశమైంది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే బెదిరింపులను ఎదుర్కోవడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) అనుసరించాలని సీఈవోలను కోరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్న వేళ.. ప్రయాణికులకు అసౌకర్యం, క్యారియర్లకు నష్టం కలగకుండా ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించింది. బెదిరింపులు, వాటి పట్ల తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయాలని కోరింది.ఇక గత వారం రోజులుగా 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఒక్కరోజే వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు 30కి పైగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకు జరిపిన విచారణలో బెదిరింపులు వచ్చిన బెదిరింపులు వాటిలో ఐపీ (ఇంటర్నెట్ ప్రోటోకాల్) చిరునామాలు లండన్, జర్మనీ, కెనడా, యూఎస్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
పదేళ్లలో గణనీయ వృద్ధి
దేశీయ వైమానిక రంగంలో గత పదేళ్లలో ఆశించినమేర వృద్ధి సాధించిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పదేళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఢిల్లీలో జరిగిన ఆసియా పసిఫిక్ మంత్రుల సదస్సులో మోదీ పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ)తో సహా 29 దేశాలు, ఎనిమిది అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘ఒకప్పుడు విమాన ప్రయాణం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేది. మధ్యతరగతి ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విమాన ప్రయాణాన్ని ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం దేశంలో పరిస్థితి మారిపోయింది. టైర్ 2, 3 నగరాల్లోనూ విమానయానానికి అనువైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. దానివల్ల ఆయా నగరాల్లో ప్రజలు విమాన ప్రయాణాలు చేసేందుకు అవకాశం లభించినట్లయింది. ఈ రంగంలో పదేళ్ల కిందటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’ అని తెలిపారు.ఇదీ చదవండి: వాహన బీమా రెన్యువల్ చేస్తున్నారా..?ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడం, విమానయాన రంగంలో పెరుగుతున్న సవాళ్లను పరిష్కరించడం, పౌర విమానయానంలో స్థిరమైన వృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా ‘ఢిల్లీ డిక్లరేషన్’ పేరుతో కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. వీటిని ప్రధాని నరేంద్రమోదీ ఆమోదించారు. తాజాగా జరిగిన సమావేశంలో ఢిల్లీ డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘విమానయాన రంగంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులతో చర్చించి ఢిల్లీ డిక్లరేషన్‌ను రూపొందించాం. ఐసీఏఓ గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ప్లాన్, గ్లోబల్ ఎయిర్ నావిగేషన్ ప్లాన్, ఏవియేషన్ భద్రత..తదితర అంశాలను అందులో పొందుపరిచాం’ అని మంత్రి తెలిపారు. -
ఉడాన్ స్కీము మరో పదేళ్లు పొడిగింపు!
న్యూఢిల్లీ: ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ స్కీము ఉడాన్‌ను మరో పదేళ్ల పాటు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాగే, సీప్లేన్ కార్యకలాపాల కోసం ఆపరేటర్లకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కల్పించే యోచన ఉన్నట్లు వివరించారు.2017లో ప్రారంభమైన ఉడాన్ స్కీము రెండేళ్లలో ముగియనుండగా దాన్ని అవసరమైతే మరింత మెరుగుపర్చి, పొడిగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా విమానాలు, హెలికాప్టర్లు, సీప్లేన్లను డిజైన్ చేసి, తయారు చేసేలా కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహించనున్నట్లు మంత్రి చెప్పారు.సీప్లేన్ కార్యకలాపాలపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. అక్టోబర్‌లో విజయవాడ నుంచి సీప్లేన్ల డెమో ఫ్లయిట్ల నిర్వహణ ఉంటుందని చెప్పారు. -
200కు పైగా ఎయిర్‌పోర్ట్‌లు అవసరం
న్యూఢిల్లీ: భారత్‌కు వచ్చే ఐదేళ్లలో 200కు మించి ఎయిర్‌పోర్ట్‌లు, హెలీపోర్ట్‌లు, వాటర్ ఏరోడ్రోమ్‌లు అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఇదే కాలంలో ఎయిర్‌లైన్స్ సంస్థలు 1,400 విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. నరేంద్రమోదీ సర్కారు తొమ్మిదేళ్ల హయాంలో విమానయాన రంగం సాధించిన పురోగతిపై బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2014 వరకు 74 ఎయిర్‌పోర్ట్‌లు, హెలీపోర్ట్‌లు, వాటర్‌పోర్ట్‌లే ఉండేవని, ఇవి రెట్టింపై ప్రస్తుతం 148కి చేరినట్టు చెప్పారు. ‘‘2013–14లో దేశీయంగా ఆరు కోట్ల మంది ప్రయాణించారు. ఇప్పుడు దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య 14.5 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో అంతర్జాతీయ ప్రయాణికులు 50 శాతం పెరిగి 4.7 కోట్ల నుంచి 7 కోట్లకు చేరారు. దేశ, విదేశీ కార్గో పరిమాణం ఇదే కాలంలో 2.2 మిలియన్ టన్నుల నుంచి 3.6 మిలియన్ టన్నులకు (65 శాతం అధికం) పెరిగింది. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన ప్రగతిశీల విధానాల ఫలితంగా భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరించింది’’అని మంత్రి వివరించారు. విమానాల సంఖ్య కూడా 2014 నాటికి 400గా ఉంటే, ఇప్పుడు 700కు చేరినట్టు చెప్పారు. ‘‘ఎయిర్ ఇండియా 70 బిలియన్ డాలర్ల విలువైన 470 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇది కేవలం ఆరంభమే. భారత విమానయాన సంస్థలు రానున్న ఐదేళ్లలో 1,200 నుంచి 1,400 విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నాయి. రానున్న ఐదేళ్లలో ఎయిర్‌పోర్ట్‌ల రంగంలోకి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయి’’అని సింధియా పేర్కొన్నారు. 2030 నాటికి దేశీయ ప్రయాణికుల సంఖ్య 45 కోట్లకు (వార్షికంగా) చేరుకుంటుందన్నారు. హెలీకాప్టర్ల వినియోగాన్ని ప్రోత్సాహిస్తామన్నారు. త్వరలోనే అంతర్జాతీయ ఉడాన్ ఫ్లయిట్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. -
‘అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్‌పై దృష్టి పెట్టాలి’
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో భారత ఏవియేషన్ మార్కెట్ రెండంకెల స్థాయిలో వృద్ధి చెందనున్న నేపథ్యంలో దేశీ ఎయిర్‌లైన్స్ సుదీర్ఘ ప్రయాణాల విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. ఇందుకోసం మరిన్ని పెద్ద విమానాలను (వైడ్–బాడీ) సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. ముంబై నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు గురువారం ఎయిరిండియా డైరెక్ట్ ఫ్లయిట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘దాదాపు 86 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ .. భారత్‌కు విమానాలు నడిపిస్తున్నాయి. కానీ మన దగ్గర్నుంచి కేవలం అయిదు సంస్థలకే అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు ఉన్నాయి. అయితే, ఈ అయిదింటికీ 36 శాతం మార్కెట్ వాటా ఉంది. మనం అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్‌పై దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగానే సుదీర్ఘ రూట్ల మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మరిన్ని వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోవాలని మన ఎయిర్‌లైన్స్‌ను కోరుతున్నాను‘ అని మంత్రి చెప్పారు. టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న ఎయిరిండియా.. సుదీర్ఘ రూట్లలో మరింతగా విస్తరించగలదని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2023 తొలినాళ్లలో ఎయిరిండియా.. ముంబై నుంచి న్యూయార్క్, ప్యారిస్, ఫ్రాంక్‌ఫర్ట్‌కు కూడా ఫ్లయిట్స్ ప్రారంభించనుంది. మరోవైపు, 2013–14లో 6.3 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2019–20లో 14.4 కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టులు, వాటర్‌డ్రోమ్‌ల సంఖ్య 145కి పెరిగిందని చెప్పారు. -
పెద్ద విమానాలు సమకూర్చుకోవాలి
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్ద కాలంలో భారత ఏవియేషన్ మార్కెట్ రెండంకెల స్థాయిలో వృద్ధి చెందనున్న నేపథ్యంలో దేశీ ఎయిర్‌లైన్స్ సుదీర్ఘ ప్రయాణాల విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. ఇందుకోసం మరిన్ని పెద్ద విమానాలను (వైడ్–బాడీ) సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. ముంబై నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు గురువారం ఎయిరిండియా డైరెక్ట్ ఫ్లయిట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘దాదాపు 86 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ .. భారత్‌కు విమానాలు నడిపిస్తున్నాయి. కానీ మన దగ్గర్నుంచి కేవలం అయిదు సంస్థలకే అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు ఉన్నాయి. అయితే, ఈ అయిదింటికీ 36 శాతం మార్కెట్ వాటా ఉంది. మనం అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్‌పై దృష్టి పెట్టాలి. ఇందులో భాగంగానే సుదీర్ఘ రూట్ల మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మరిన్ని వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోవాలని మన ఎయిర్‌లైన్స్‌ను కోరుతున్నాను‘ అని మంత్రి చెప్పారు. టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న ఎయిరిండియా.. సుదీర్ఘ రూట్లలో మరింతగా విస్తరించగలదని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2023 తొలినాళ్లలో ఎయిరిండియా.. ముంబై నుంచి న్యూయార్క్, ప్యారిస్, ఫ్రాంక్‌ఫర్ట్‌కు కూడా ఫ్లయిట్స్ ప్రారంభించనుంది. మరోవైపు, 2013–14లో 6.3 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2019–20లో 14.4 కోట్లకు చేరిందని ఆయన తెలిపారు. గడిచిన ఎనిమిదేళ్లలో ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టులు, వాటర్‌డ్రోమ్‌ల సంఖ్య 145కి పెరిగిందని చెప్పారు. -
విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో స్తంభించిపోయిన ప్రజల జీవన వ్యవస్థ ఇటీవల కేంద్రం అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా సడలింపులు ఇస్తుండటంతో మళ్లీ సాధారణ స్థితికి అడుగులు వేస్తోంది. దీంతో అన్నిరంగాలు మెల్లమెల్లగా పుంజుకుంటుంన్నాయి. ఈ క్రమంలో ప్రజా రవాణా సైతం మళ్లీ పరుగులు పెడుతోంది. దాదాపు రెండు నెలలు తర్వాత మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి వరకు పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తుండగా రానురానూ ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో విమానాల రాకపోకలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విమాన ప్రయాణికులకు కేంద్రం శుభ వార్త అందించింది. చదవండి: యూఎస్‌కు నాన్‌స్టాప్ ఫ్లైట్స్: విస్తారా కన్ను మే నుంచి నేటి వరకు భారత విమానయాన సంస్థ ప్రీ-కోవిడ్ దేశీయ ప్రయాణీకుల విమానాలలో 70 శాతం నడిపిస్తుండగా. ఇప్పుడు ఆ సంఖ్యను ఈ రోజు(డిసెంబర్3) నుంచి 80 శాతానికి పెంచినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు. ‘30 వేల ప్రయాణికులతో మే 25న దేశీయ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయి.. నవంబర్ 30వ తేదీ నాటికి ఆ సంఖ్య 2.52 లక్షల గరిష్టాన్ని తాకింది. ఇప్పుడు.. దేశీయంగా ప్రస్తుతం ఉన్న విమానాలు 70 శాతం నుంచి 80 శాతం వరకు నడుపుకోవచ్చు’. అని ట్వీట్ చేశారు. కాగా కరోనా వైరస్ పరిస్థితుల్లోని డిమాండ్ కారణంగా భారత విమానయాన సంస్థలు తమ ప్రీ-కోవిడ్ దేశీయ ప్రయాణీకుల విమానాలలో 70 శాతం వరకు నడపవచ్చని నవంబర్ 11న మంత్రి తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సంఖ్యను మరింత పెంచడంతో మరిన్ని విమానయాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. Domestic operations recommenced with 30K passengers on 25 May & have now touched a high of 2.52 lakhs on 30 Nov 2020. @MoCA_GoI is now allowing domestic carriers to increase their operations from existing 70% to 80% of pre-COVID approved capacity.@PMOIndia @DGCAIndia — Hardeep Singh Puri (@HardeepSPuri) December 3, 2020 -
అందుకే అదానీకి ఇచ్చాం : కేంద్రమంత్రి వివరణ
తిరువనంతపురం: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించే నిర్ణయానికి సంబంధించిన వాస్తవాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆరోపించారు. విమానాశ్రయ ప్రైవేటీకరణపై కేరళ సీఎం పినరయి విజయన్ వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ట్విటర్ ద్వారా స్పందించారు. అంతర్జాతీయ బిడ్డింగ్ ప్రక్రియలో కేరళ ప్రభుత్వం అర్హత సాధించలేదంటూ వరుస ట్వీట్లలో ఈ నిర్ణయంపై వివరణ ఇచ్చారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) రీతిలో 50 ఏళ్లుగా లీజుకు ఇవ్వడానికి కేంద్రం పారదర్శకంగా నిర్ణయ తీసుకుందని (2019లో) వివరించారు. అదానీ ప్రయాణీకుడికి 168 రూపాయల చొప్పున కోట్ చేయగా, కేరళ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ (కెఎస్ఐడీసీ) 135 రూపాయల చొప్పున, మూడవ క్వాలిఫైయింగ్ బిడ్డర్ 63 రూపాయలు కోట్ చేశారన్నారు. 10 శాతం తేడా ఉండి ఉంటే ఈ బిడ్డింగ్ కేరళకే దక్కి ఉండేదని 19.64 శాతం ఉన్న నేపథ్యంలో అదానీని ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. (ప్రైవేటికరణకు ఒప్పుకోం : కేరళ సీఎం) కాగా ప్రధానమంత్రి మోదీ తనకు ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని విజయన్ ఆరోపించారు. స్పెషల్ పర్సస్ వెహికిల్(ఎస్పీవీ)కి ఇవ్వాలని కేరళ పలుసార్లు తాను విజ్ఙప్తి చేసినట్టు విజయన్ గుర్తు చేశారు. 2003లో విమానయానశాఖ ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా కేబినెట్ నిర్ణయం ఉందంటూ ప్రధానికి రాసిన ఒక లేఖలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అటు కేంద్ర నిర్ణయాన్ని కేరళ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండగా, కాంగ్రెస్ నేత తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ స్వాగతించడం గమనార్హం. It was stipulated that if the Kerala State Industrial Development Corporation (KSIDC) bid comes within the 10% range of the winning bid, they would be awarded the work. There was a difference of 19.64% between them & the next bidder when bids were open. — Hardeep Singh Puri (@HardeepSPuri) August 20, 2020 Winning bid quoted ₹168 per passenger, KSIDC quoted ₹135 per passenger & third qualifying bidder was at ₹63 per passenger. Thus, despite special provision of RoFR being given to GoK, they could not qualify in international bidding process carried out in a transparent manner. — Hardeep Singh Puri (@HardeepSPuri) August 20, 2020 -
కంటెయిన్మెంట్ జోన్లవారికి నో ఎంట్రీ
-
విమానయానం.. కొత్త కొత్తగా...
న్యూఢిల్లీ: దేశీయ విమాన సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు పాటించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలను పౌర విమానయాన శాఖ విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేలా పలు ఆంక్షలను ప్రకటించింది. విమానం ప్రయాణించిన కాలం ఆధారంగా కనిష్ట, గరిష్ట చార్జీలను నిర్ధారించింది. దేశవ్యాప్తంగా విమాన మార్గాలను ఏడు బ్యాండ్స్‌గా విభజించామని పౌర విమానయాన మంత్రి హర్దీప్సింగ్ పురి గురువారం వెల్లడించారు. విమాన ప్రయాణ సమయం 40 నిమిషాల లోపు ఉంటే తొలి బ్యాండ్‌గా, 40–60 నిమిషాల మధ్య ఉంటే రెండో బ్యాండ్, 60–90 నిమిషాల మధ్య ఉంటే మూడో బ్యాండ్, 90–120 నిమిషాల మధ్య ఉంటే నాలుగో బ్యాండ్, 120–150 నిమిషాల మధ్య ఉంటే ఐదో బ్యాండ్, 150–180 నిమిషాల మధ్య ఉంటే ఆరో బ్యాండ్, 180–210 నిమిషాల మధ్య ఉంటే ఏడో బ్యాండ్‌గా నిర్ధారించామన్నారు. కనిష్ట, గరిష్ట ధరలను నిర్ధారించేందుకే ఇలా బ్యాండ్స్‌గా విభజించామన్నారు. ఈ విభజన, చార్జీలపై పరిమితి ఆగస్ట్ 24 వరకు అమల్లో ఉంటుందన్నారు. ప్రతీ విమానంలో కనిష్ట– గరిష్ట ధరలకు మధ్య సరిగ్గా సగం ధరకు 40% టికెట్లను అమ్మాల్సి ఉంటుందని విమానయాన శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం 33% ఆపరేషన్లకే అనుమతించామని హర్దీప్ చెప్పారు. కరోనా కట్టడికి, చార్జీల వసూలుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలను అన్ని విమానయాన సంస్థలు ఖచ్చితంగా పాటించాలన్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ‘వందేభారత్’ కార్యక్రమంలో ప్రైవేటు విమానయాన సంస్థలూ త్వరలో పాలుపంచుకుంటాయన్నారు. ఇప్పటివరకు ఎయిర్ఇండియా, ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు మాత్రమే ఈ మిషన్‌లో పాలుపంచుకుంటున్నాయి. దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించిన మార్చి 25 నుంచి విమాన ప్రయాణాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రయాణీకులు పాటించాల్సిన పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవీ నిబంధనలు.. ► 14 ఏళ్ళు దాటిన ప్రయాణికులంతా తమ మొబైల్స్‌లో ఆరోగ్యసేతు యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్దనే సీఐఎస్ఎఫ్, లేదా వైమానిక సిబ్బంది యాప్ ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తారు. యాప్ డౌన్లోడ్ చేసుకోని వారిని ప్రత్యేక కౌంటర్‌కి పంపి, యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తారు. అరోగ్య సేతు స్టేటస్‌లో రెడ్ మార్క్ కనిపిస్తే వారిని లోనికి అనుమతించరు. ► ఫ్లైట్ బయలు దేరడానికి కనీసం రెండు గం టల ముందు ఎయిర్‌పోర్టులో రిపోర్టు చే యాలి. ఫ్లైట్ బయలుదేరేందుకు 4 గంటల ముం దు మాత్రమే టెర్మినల్ బిల్డింగ్‌లోనికి అనుమతిస్తారు. ► కేవలం వెబ్ చెక్–ఇన్ చేసుకున్న వారిని మాత్రమే విమానాశ్రయం లోనికి అనుమతిస్తారు. విమానాశ్రయాల్లో ఫిజికల్ చెక్–ఇన్ కౌంటర్లు ఉండవు. ► కేవలం ఒక చెక్–ఇన్ బ్యాగేజ్‌ని మాత్రమే తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ► ఫ్లైట్‌లో భోజన సదుపాయం ఉండదు. ► ఫ్లైట్ బయలుదేరడానికి గంట ముందు బోర్డింగ్ ప్రారంభం అవుతుంది. ► టెర్మినల్‌లోకి ప్రవేశించడానికి ముందు తగు రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణం మొత్తం మాస్క్, గ్లవ్స్ ధరించడం తప్పనిసరి. ► కంటెయిన్మెంట్ జోన్లలోని వారికి, కరోనా పాజిటివ్ వచ్చినవారికి అనుమతి లేదు. ► ఆరోగ్య సేతు యాప్ ద్వారా, లేదా స్వీయ హామీ పత్రంద్వారా తాము ఆరోగ్యంగా ఉన్నట్టు ధ్రుకరించాలి. ► వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది. ► కోవిడ్–19 అనుమానితులకు పరీక్షలు జరిపేందుకు, వారిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు ప్రత్యేక సౌకర్యాలు విమానాశ్రయాల్లో కల్పించాలి. ► విమానయాన సిబ్బందికి పీపీఈ కిట్లు తప్పనిసరిగా అందించాలి. ► విమానాశ్రయాల్లో పీపీఈ కిట్లు మార్చుకోవడానికి సిబ్బందికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ► అన్ని ప్రవేశ ప్రాంతాల్లో ప్రయాణికులకు శానిటైజర్లు అందుబాటులో ఉండే ఏర్పాటు చేయాలి. ► విమానాశ్రయాల్లో న్యూస్‌పేపర్ గానీ, మ్యాగజైన్లు గానీ అందుబాటులో ఉండవు. అనుమతించరు. ► ఎయిర్‌పోర్టులో ఫుడ్ అండ్ బేవరేజెస్ అందుబాటులో ఉంటాయి. అన్ని కోవిడ్–19 జాగ్రత్తలతో అమ్మకాలు జరగాలి. ► ప్రవేశ ద్వారాల వద్ద ఉన్న ఫుట్ మ్యాట్స్, కార్పెట్స్‌ని నిత్యం శుద్ధి చేస్తుండాలి. ► ప్రయాణికులు విమానాశ్రయంలో, విమానంలో భౌతిక దూరం పాటించాలి. ► విమానాశ్రయ సిబ్బంది ప్రయాణీకుల లగేజ్‌ను వారు టెర్మినల్ బిల్డింగ్‌లోకి వచ్చేముందే శానిటైజ్ చేయాలి. ► డిపార్చర్, అరైవల్ ప్రాంతాల్లో ట్రాలీల వినియోగాన్ని ప్రోత్సహించవద్దు. అవసరమని భావిస్తేనే ట్రాలీ ఇవ్వాలి. ► భౌతిక దూరం పాటించేందుకు వీలుగా సీటింగ్ అరేంజ్మెంట్ ప్రకారం, ప్రయాణికులను విమానంలోనికి అనుమతించాలి. -
విమాన సేవలు ప్రారంభం.. కీలక విషయాలు
న్యూఢిల్లీ : కరోనా కారణంగా భారత్‌లో నిలిచిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఈనెల 25 నుంచి దేశీయ విమానాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విమాన టికెట్లను ధరలను నియంత్రిస్తున్నామని పౌర, విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు. 40 శాతం టికెట్లు మధ్య రకంగా రూ. 6,750 కే అమ్ముకోవాలని, టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేవలం మూడో వంతు విమానాలు మాత్రమే నడుస్తాయని, మధ్య సీటును ఖాళీగా ఉంచమని స్పష్టం చేశారు. దీనివల్ల సోషల్ డిస్టెన్స్ పూర్తికాదని, ప్రతి ప్రయాణానికి ముందు విమానాన్ని పూర్తిస్థాయిలో డిస్ ఇన్ఫెక్షన్ చేస్తామని పేర్కొన్నారు. మధ్య సీటు ఖాళీగా ఉంచితే 33 శాతం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని, అందుకే విమానంలోని అన్ని సీట్లకు టికెట్లు అమ్ముతామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా కూడా మధ్య సీటు ఖాళీగా ఉంచరని మంత్రి అన్నారు. (దేశీయ విమానయానం: పాటించాల్సిన నిబంధనలు ఇవే!) చైనా నుంచి విమానాల రాకపోకలను తొలుత భారత్‌యే ఆపేసిందని కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు. జీవితం, జీవనోపాధి మధ్య సమన్వయం ఉండాలని. చాలా కాలం విమానాలను నడపకుండా ఉండలేమనన్నారు. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసుల రాకపోకలను సమీక్షిస్తున్నామని, ఏవైనా సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అధిగమిస్తామని పేర్కొన్నారు. పరిస్థితులు మెరుగైన కొద్దీ విమాన సర్వీసుల సంఖ్యను పెంచుతామన్నారు. విమాన సర్వీసులు నడిపే అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రులతో కూడా చర్చించామని తెలిపారు. (25 నుంచి దేశీయ విమానయానం) వందే భారత్ మిషన్ కింద విదేశాలలో ఉన్న భారతీయులందరిని తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. వందే భారత్ ద్వారా ఇప్పటికే 20 వేల మంది ప్రయాణికులను తీసుకువచ్చామని, ఇక నుంచి ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా ఈ మిషన్ లో భాగస్వామ్యం అవుతాయని పేర్కొన్నారు. ఫేస్ మాస్కులు, బ్లౌజు, ఫేస్ షీల్డ్‌లు ఇచ్చామని ఇచ్చామన్నారు. మొత్తం విమానయాన సర్వీసులలో 1/3 వంతు సోమవారం (25 మే)నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు. కేవలం వెబ్ చెక్ ఇన్ సౌకర్యం మాత్రమే ఉంటుందని, ఒక చెక్ ఇన్ బ్యాగేజికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. (ఉంపన్: నీట మునిగిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు ) విమానాలలో ప్రయాణించే వారికి ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి అని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. విమానాలలో భోజన సౌకర్యం ఉండదని, రెండు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు మాత్రమే వసూలు చేయాలని పేర్కొన్నారు. విమానాలు నడిచే మార్గాలను, ప్రయాణానికి పట్టే సమయాన్ని బట్టి ఏడు భాగాలుగా విభజించినట్లు మంత్రి తెలిపారు. (బిగ్‌బాస్ కంటెస్టెంట్ తండ్రిపై అత్యాచారం కేసు) ► రూట్ 1: 40 నిమిషాలలోపు ప్రయాణం ► రూట్ 2: 40 నుండి 70 నిమిషాలలోపు ► రూట్ 3 : 70 నుండి 90 నిమిషాలు వరకు ► రూట్ 4: 90 నుండి 120 నిమిషాల వరకు ► రూట్ 5: 120 నుండి 150 నిమిషాల వరకు ► రూట్ 6: 150 నుండి 180 నిమిషా వరకు ► రూట్ 7: 180 నిమిషాల పైన ⇒ దేశ రాజధానికి వివిధ ప్రాంతాల నుంచి కనిష్ట ధర 3.5 వేలు, గరిష్ట ధర 10 వేలు. ⇒ ఢిల్లీ - ముంబాయి కనిష్ట ధర 3.5 వేలు, గరిష్ట ధర 10 వేలు ⇒ విమానాలలో 40 శాతం టికెట్ లను సరాసరి ధరలకు అమ్మాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆదేశించారు. -
జెట్ సంక్షోభంపై స్పందించిన సురేష్ ప్రభు
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించాలని పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం ఆదేశించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా, వారి భద్రతను పరిగణనలోకి తీసుకుంటూ జెట్ ఎయిర్వేస్లో సమస్యలను చక్కదిద్దేందుకు చొవర చూపాలని పౌర విమానయాన కార్యదర్శి ఖరోలాను ఆదేశిస్తూ మంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. మరోవైపు సమస్యలు చుట్టుముట్టడంతో విమానాల సంఖ్యను, సేవలను తగ్గిస్తున్న జెట్ ఎయిర్వేస్ కేవలం 9 విమానాలనే నడుపుతోంది. జెట్ ఎయిర్వేస్ గురువారం తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. రోజంతా అంతర్జాతీయ సేవలను రద్దు చేసింది. జెట్ చర్యతో పెద్దసంఖ్యలో ప్రయాణీకులు పలు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. జెట్ ఇబ్బందులు ప్రస్తుతం ఏ స్ధాయిలో ఉన్నాయంటే విమాన సర్వీసులు రద్దవడంతో కేవలం ప్రయాణీకులకే సంస్థ రూ 3500 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. -
'ఎంపీలు దొరికేస్తారని కలలో కూడా అనుకోలేదు'
మన విమానయాన సంస్థలలో భద్రతా నిబంధనలు చాలా బాగున్నాయని, అయితే ఒక పార్లమెంటు సభ్యుడు ఇలా దొరికేస్తాడని తాను కలలో కూడా ఊహించలేదని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు లోక్‌సభలో వ్యాఖ్యానించారు. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో సిబ్బంది ఒకరిని 25 సార్లు చెప్పుతో కొట్టడం, దాంతో పలు విమానయాన సంస్థలు ఆయనను తమ విమానాల్లో ఎక్కించుకోబోమంటూ నిషేధం విధించిన అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లోను సోమవారం చర్చ జరిగింది. కమెడియన్ కపిల్ శర్మ కూడా బాగా తాగేసి విమానంలో గొడవ చేశాడని, అయితే అతడిపై మాత్రం నిషేధం ఎందుకు విధించలేదని శివసేన ఎంపీ ఆనందరావు అడ్సుల్ ప్రశ్నించారు. నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయని ఈ సందర్భంగా లోక్‌సభలో అశోక్ గజపతిరాజు చెప్పారు. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ను నిషేధించడం ద్వారా విమానయాన సంస్థలు తమ దాదాగిరీ చూపించుకుంటున్నాయని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ రాజ్యసభలో వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద పలు పార్టీలకు చెందిన ఎంపీలు రవీంద్ర గైక్వాడ్‌కు మద్దతుగా నిలిచి తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ప్రయాణికురాలి కోసం కేంద్రమంత్రి త్యాగం
-
అశోక్‌గజపతిరాజుతో కేటీఆర్ భేటీ
న్యూఢిల్లీ : హైదరాబాద్ నుంచి డల్లాస్, న్యూయార్క్ నగరాలకు నేరుగా విమానాలు నడపాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజుకు తెలంగాణ ఐటీ, ఎన్నారై శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి పి.అశోక్‌గజపతిరాజుతో కేటీఆర్ భేటీ అయ్యారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... నిజామాబాద్ , కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే హైదరాబాద్ నగరంలో ఫార్మాసిటీ, ఆలేరు, కాగజ్‌నగర్‌లో హెలిపోర్ట్స్ ఏర్పాటే చేయాలని అశోక్‌గజపతిరాజుకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. -
'అమెరికా ఎందుకు వెనక్కి పంపుతుందో తెలియదు'
న్యూఢిల్లీ : తెలుగు విద్యార్థులను అమెరికా ఎందుకు వెనక్కి పంపుతుందో తెలియదని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి. అశోక్ గజపతిరాజు బుధవారం న్యూఢిల్లీలో తెలిపారు. అమెరికా వర్శిటీల విషయంలో ఆ దేశమే స్పష్టత ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా వెళ్లి తెలుగు విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఎయిరిండియా అడ్డుకుంటుందని చెప్పారు. కష్టాల నుంచి ఎయిర్ ఇండియా సంస్థ గట్టెక్కిందని అశోక్ సంతోషం వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రగతి కోసమే విశాఖ ఎయిర్ పోర్ట్ భూములు బదిలీ చేసినట్లు చెప్పారు. కొత్తగా నాలుగు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌లకు అనుమతి ఇచ్చామని అశోక్‌గజపతిరాజు వెల్లడించారు. -
'ఇప్పటికీ విమానాల్లో అగ్గిపెట్టె తీసుకెళ్తున్నా'
విమానాల్లో అగ్గిపెట్టెలు, సిగరెట్ల లాంటివాటిని అనుమతించరు గానీ, తాను ఇప్పటికీ అగ్గిపెట్టెలను తీసుకెళ్తూనే ఉన్నానని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. విమానాల ఆలస్యం గురించి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మీడియా ప్రశ్నలకు సమాధానంగా ఆయనీ విషయం తెలిపారు. ''నేను సిగరెట్లు కాలుస్తా. విమానశ్రయాల్లో నన్ను తనిఖీ చేయడం మానేయగానే అగ్గిపెట్టెలు కూడా తీసుకెళ్తున్నా'' అన్నారు. అయితే ప్యారిస్ విమానాశ్రయంలో మాత్రం తనిఖీలు గట్టిగా ఉంటాయని, వాళ్లు తన జేబులు చూసిన తర్వాత అగ్గిపెట్టె, సిగరెట్లు, పోర్టబుల్ యాష్ ట్రే అన్నింటినీ తీసేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. తన అగ్గిపెట్టెతో సహా అన్నింటినీ వాళ్లు తనకు తిరిగి ఇచ్చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన తన పోర్టబుల్ యాష్ ట్రేను తీసి చూపించారు. కొన్ని దేశాల్లో అగ్గిపెట్టెలను విమానాల్లో నిషేధిత వస్తువుగా ప్రకటించారని, కొన్ని దేశాల్లో మాత్రం అలా లేదని అన్నారు. భద్రత అనేది అర్థవంతంగా ఉండాలి తప్ప అర్థరహితంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. భారతీయులందరికీ అగ్గిపెట్టెలు తీసుకెళ్లే హక్కు కల్పించాలంటారా అని విలేకరులు ప్రశ్నించగా, పొగ తాగడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు తనకు తెలుసని, అందువల్ల భారతీయులు పొగతాగకూడదనే తాను చెబుతానని మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు. -
అశోక్ గజపతిరాజు ఇంటి ముట్టడి
విజయనగరం: ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం పట్టణంలో పౌర విమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఇంటిని సీపీఐ నాయకులు శుక్రవారం ముట్టడించారు. ముందుగా ఆందోళనకారులు అమర్ భవన్ నుంచి ర్యాలీగా ఆర్టీసీ కాంప్లెక్స్, మయూరి జంక్షన్, ఎత్తుబ్రిడ్జి మీదుగా కేంద్రమంత్రి అశోక్ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట మార్చారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం చేతకాకపోతే కేంద్రమంత్రి పదవికి అశోక్ గజపతిరాజు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ నాయకులు కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఇంటిని ముట్టడించి, లోపలివెళ్లేందుకు ప్రయత్నంచేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. 10మంది సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఎయిరిండియా విమానంలో డమ్మీ గ్రనేడ్!
న్యూఢిల్లీ/విజయనగరం: ఎయిరిండియా విమానంలో డమ్మీ గ్రనేడ్ కలకలం రేపింది. మొదట ఈ వ్యవహారాన్ని తక్కువ చేసి చూపేందుకు యత్నించిన ఎయిరిండియా.. పౌర విమానయాన మంత్రి అశోక్‌గజపతిరాజు జోక్యంతో చర్యలకు దిగింది. ముంబై, హైదరాబాద్‌లో ఇద్దరు సెక్యూరిటీ అధికారులపై వేటు వేసింది. ముంబై నుంచి బయలుదేరిన బోయింగ్ 747-400 ఏఐ-965 విమానం హైదరాబాద్ మీదుగా శనివారం తెల్లవారుజామున సౌదీఅరేబియాలోని జెద్దాకు చేరింది. ల్యాండింగ్ సమయంలో బిజినెస్ క్లాస్‌లోని సీట్ల కింద ప్లాస్టిక్ కవర్లో చుట్టబడి ఉన్న ఓ అనుమానిత వస్తువు కనిపించడంతో పైలట్లు జెద్దా ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ల్యాండ్ అవ్వగానే భద్రతా సిబ్బంది విమానాన్ని స్వాధీనం చేసుకుని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. అనంతరం విమానం యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఎయిర్పోర్ట్ భద్రతాధికారులు అనుమతించారు. ఎయిరిండియా మొదట ఓ ప్రకటనలో స్పందిస్తూ.. విమానంలో కనిపించింది డమ్మీ గ్రనేడ్ కాదని, ఒక ప్లాస్టిక్ కవర్ మాత్రమే అని పేర్కొంది. అయితే మంత్రి అశోక్‌గజపతిరాజు విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎయిరిండియా విమానంలో డమ్మీ గ్రనేడ్ ను గుర్తించడం వాస్తవమే అని పేర్కొన్నారు. గత నెలలో ఎన్ఎస్జీ కమాండోలు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఎయిర్‌పోర్టులు, విమానాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారని, ఆ సమయంలో ఈ గ్రనేడ్ విమానంలో ఉండిపోయినట్టుగా భావిస్తున్నామని చెప్పారు. తనిఖీల సమయంలో వైఫల్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. మొదట తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన ఎయిరిండియా మంత్రి కలుగజేసుకోవడంతో చర్యలకు దిగింది. ముంబై, హైదరాబాద్‌లో ఇద్దరు భద్రతా తనిఖీల అధికారులను సస్పెండ్ చేసింది. మరోవైపు ఈ ఘటనపై ఎయిరిండియా, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీలకు చెందిన సంయుక్త బృందం విచారణ ప్రారంభించింది. అన్ని దశల్లోనూ దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతుందని, ఆ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ విమానం అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కోసం స్టాండ్‌బైగా ఉంచిందంటూ వచ్చిన వార్తలను ఎయిరిండియా కొట్టిపారేసింది. ఆ సమయంలో ఈ విమానాన్ని ఢిల్లీ-ఫ్రాంక్ఫర్ట్ మధ్య నడిపినట్టు పేర్కొంది. -
'డమ్మీ గ్రనేడ్ ను గుర్తించడం వాస్తవమే'
విజయనగరం: ఎయిరిండియా విమానంలో డమ్మీ గ్రనేడ్ ను గుర్తించడం వాస్తవమే అని పౌర విమానాయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. శనివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గత నెలలో ఎన్ఎస్జీ కమాండోలు దేశవాప్తంగా ఎంపిక చేసిన ఎయిర్‌పోర్టులు, విమానాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారని, ఆ సమయంలో ఈ గ్రనేడ్ విమానంలో ఉండిపోయినట్టుగా భావిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా అది డమ్మీ గ్రనేడ్ కాదని, ఒక ప్లాస్టిక్ కవర్ మాత్రమే అని ఎయిర్ ఇండియా వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. మొదట తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన ఎయిరిండియా మంత్రి కలుగజేసుకోవడంతో చర్యలకు దిగింది. ముంబై, హైదరాబాద్‌లో ఇద్దరు భద్రతా తనిఖీల అధికారులను సస్పెండ్ చేసింది. మరోవైపు ఈ ఘటనపై ఎయిరిండియా, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీలకు చెందిన సంయుక్త బందం విచారణ ప్రారంభించింది. అన్ని దశల్లోనూ దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతుందని, ఆ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
విమానంలో గ్రనేడ్పై విచారణ: అశోక్
విజయనగరం: ఎయిర్ ఇండియా విమానంలో దొరికిన గ్రనేడ్పై విచారణ జరుగుతుందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు వెల్లడించారు. శనివారం విజయనగరంలో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఎయిర్ ఇండియా విమానంలో దొరికిన గ్రనేడ్పై ఆయన స్పందించారు. ఎయిర్ ఇండియా సెక్యూరిటీ సిబ్బంది, విమాన భద్రత సిబ్బంది, అధికారుల సమన్వయ లోపమే కారణమంగా కనిపిస్తుందని చెప్పారు. దొరికి గ్రనేడ్ ఇండియన్ ఆర్మీకి చెందినదిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారని అన్నరు. అందుకు బాధ్యలపై చర్యలు తీసుకుంటామని అశోక్‌గజపతి రాజు స్పష్టం చేశారు. -
రాజుగారికి ఎందుకు చిర్రెత్తుకొచ్చిందంటే...
విజయనగరం జిల్లాలో రాజుగారుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన పూసపాటి అశోకగజపతి రాజుగారు నరేంద్ర మోడీ కేబినెట్లో ఇటీవల మంత్రి పదవి చేపట్టారు. మొదటిసారిగా కేంద్రమంత్రి హోదాలో ఆయన సొంత జిల్లాకు విచ్చేశారు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడతారని అంతా భావించారు. కానీ కేంద్ర మంత్రి గారు వస్తుంటే రోడ్లపై ప్రజలు అంతగా కనిపించలేదు. సరికదా జిల్లాకు చెందిన అధికారులు కూడా కనీసం తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని సమాచారం. అంతేకాకుండా మంత్రిగారు తన పర్యటనపై మందుగానే జిల్లా ఉన్నతాధికారులకు వెల్లడించినా.... సదరు అధికారులు ప్రోట్రోకాల్ పాటించడం లేదట. గత ఆదివారం ఉదయం విశాఖపట్నంలో ప్రొగ్రామ్ ఉందని ముందుగా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఉన్నతాధికారులకు వెల్లడించారు. అయినా అధికారులు స్పందించలేదు. దాంతో ఆయనగారికి చిర్రెత్తికొచ్చింది. ఆగ్రహాన్ని ఆపుకోలేక తానే స్వయంగా డ్రైవ్ చేసుకుని సొంతవాహనంలో విశాఖపట్నం ప్రయాణమైయ్యారు. ఆ విషయం తెలుసుకున్న స్థానిక ఆర్డీవో హుటాహుటిన మంత్రి గారి కారును చేజ్ చేసి... సార్ క్షమించాలి అంటూ కేంద్ర మంత్రిని ప్రాదేయపడ్డారట. ఆయన అశోక్‌కు ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఇలాంటి సంఘటనలు పునారవృతమైతే సహించేదిలేదంటూ కలెక్టర్, ఎస్పీకి ఫోన్ చేసి కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు క్లాస్ పీకారు. 1978లో రాజకీయాల్లోకి ప్రవేశించిన అశోక్ గజపతి రాజు ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. అయితే 2004లో మాత్రం ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గెలుపొందారు. ఇక 2014 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా అశోక్ గజపతి రాజు విజయం సాధించారు. మొదటిసారి ఎంపీగా విజయం సాధించడమే కాకుండా మోడీ కేబినేట్లో పౌర విమానాయ శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు బాధ్యతులు చేపట్టారు. అయితే గత ఏడాది అక్టోబర్‌లో సిరిమానోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేగా అశోక్‌గజపతి రాజు ఆ రోజు ఉదయం పైడితల్లి అమ్మవారిని దర్శించేందుకు దేవాలయానికి చేరుకున్నారు. అయితే ఆయన్ని దేవాలయంలో ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యపై అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. దాంతో ఆమ్మ వారి ఆలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి తన నిరసనను తెలిపారు. రాజుగారు రోడ్డుపై యాత్రలు చేయగలరు. అలాగే రోడ్డుపై ధర్నాలు చేయగలరు. -
ఏఐ ప్రైవేటీకరణకు తొందరపడం
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా (ఏఐ) ప్రైవేటీకరణపై తొందరపాటు నిర్ణయం తీసుకోబోమని పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు సూచనప్రాయంగా వెల్లడించారు. మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఏఐ ప్రైవేటీకరణపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికీ రాలేదనీ, దీనికి సంబంధించిన అన్ని అంశాలనూ అధ్యయనం చేస్తామనీ చెప్పారు. ‘వివిధ దేశాల్లోని అనేక ప్రభుత్వ రంగ కంపెనీలు సమర్థంగా పనిచేస్తున్నాయి. కారణం ఏదైనా మనదగ్గర అలా జరగలేదు. కానీ, ఈ అంశాన్ని అన్ని కోణాల్లోనూ పరిశీలించాల్సి ఉంది. ఎయిర్ ఇండియా ప్రభుత్వ అధీనంలో ఉంది. ఆ సంస్థకు కొన్ని సానుకూల అంశాలు, ప్రతికూల అంశాలున్నాయి. ఎయిర్ ఇండియాను ఎలా అభివృద్ధి చేయగలమో ఆలోచించాలి..’ అని ఆయన తెలిపారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ పునఃసమీక్షిస్తారా అని ప్రశ్నించగా, పోస్ట్‌మార్టమ్ వల్ల లాభం ఉండదని బదులిచ్చారు. మునుపటి ప్రభుత్వం అనేక రంగాలకు పలు హామీలిచ్చింది... వాటన్నిటినీ అమలు చేయాలంటే ప్రభుత్వంలో మార్పు ఉండకూడదని వ్యాఖ్యానించారు. విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువచేసే చర్యలు చేపడతామని తెలిపారు. -
ఎయిరిండియా గురించి ప్రధానితో చర్చిస్తా: అశోక్
ఎయిరిండియాను పునరుద్ధరించే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీతో చర్చిస్తానని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తెలిపారు. తన మంత్రిత్వశాఖ ప్రధాన కార్యాలయమైన రాజీవ్ గాంధీ భవన్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎయిరిండియాకు ఎందుకు నష్టాలు వస్తున్నాయో విశ్లేషించాలని, పోటీ వల్లేనా.. మరేదైనా కారణం ఉందా అన్నది తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఎయిరిండియా ఇటీవలే నష్టాల నుంచి కొద్దిమేర బయటపడి లాభనష్టాలు లేని పరిస్థితిలోకి చేరుకుంది. మొత్తం ఎయిరిండియా ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని రాజు చెప్పారు. జెట్ ఇంధనాన్ని నేరుగా దిగుమతి చేసుకోవడానికి అనుమతించడం లాంటి సంస్కరణలు కొన్ని చేపట్టినా, విమానయాన పరిశ్రమ ఇంకా కోలుకోలేకపోతోంది. కొన్ని వివాదాలున్నా, వాటిని తాను అప్పుడే ప్రస్తావించబోనని ఆయన అన్నారు. -
కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అశోక్
సీమాంధ్రకు 15 ఏళ్లు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అశోక్‌గజపతి రాజు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గత ప్రభుత్వం చేసిన హమీలనే కొనసాగించామన్నారు. ముంపు మండలాలన్నీ గతంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాయని అశోక్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వమే పోలవరం ముంపు మండలన్ని సీమాంధ్రలో కలుపుతామని హామీ ఇచ్చిందని చెప్పారు. కొని కారణాల వల్ల పోలవరం ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం చేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే కొంత వరకు సమన్యాయం జరిగినట్లే అని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. పౌర విమానయానం విభాగం మౌలిక సదుపాయాల్లో ఒకటని ఆయన స్పష్టం చేశారు. విమానయాన రంగంలో ఏమైన వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. అలాగే పూర్తి పారదర్శకతతో పని చేస్తామని అశోక్ భరోసా ఇచ్చారు. 1978లో రాజకీయాల్లోకి ప్రవేశించిన అశోక్ గజపతి రాజు ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. అయితే 2004లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.వీరభద్రస్వామి చేతిలో ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గెలుపొందారు. ఇక 2014 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా అశోక్ గజపతి రాజు విజయం సాధించారు. మొదటిసారిగా లోక్‌సభలో అడుగు పెడుతున్న అశోక్ గజపతి రాజుకు మోడీ కేబినెట్లో పౌర విమానాయ శాఖను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం అశోక్‌గజపతి రాజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.