'అమెరికా ఎందుకు వెనక్కి పంపుతుందో తెలియదు'
న్యూఢిల్లీ : తెలుగు విద్యార్థులను అమెరికా ఎందుకు వెనక్కి పంపుతుందో తెలియదని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి పి. అశోక్ గజపతిరాజు బుధవారం న్యూఢిల్లీలో తెలిపారు. అమెరికా వర్శిటీల విషయంలో ఆ దేశమే స్పష్టత ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా వెళ్లి తెలుగు విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఎయిరిండియా అడ్డుకుంటుందని చెప్పారు.
కష్టాల నుంచి ఎయిర్ ఇండియా సంస్థ గట్టెక్కిందని అశోక్ సంతోషం వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రగతి కోసమే విశాఖ ఎయిర్ పోర్ట్ భూములు బదిలీ చేసినట్లు చెప్పారు. కొత్తగా నాలుగు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్లకు అనుమతి ఇచ్చామని అశోక్గజపతిరాజు వెల్లడించారు.