న్యూఢిల్లీ : కరోనా కారణంగా భారత్‌లో నిలిచిపోయిన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ఈనెల 25 నుంచి దేశీయ విమానాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విమాన టికెట్లను ధరలను నియంత్రిస్తున్నామని పౌర, విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు. 40 శాతం టికెట్లు మధ్య రకంగా రూ. 6,750 కే అమ్ముకోవాలని, టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేవలం మూడో వంతు విమానాలు మాత్రమే నడుస్తాయని, మధ్య సీటును ఖాళీగా ఉంచమని స్పష్టం చేశారు. దీనివల్ల సోషల్ డిస్టెన్స్ పూర్తికాదని, ప్రతి ప్రయాణానికి ముందు విమానాన్ని పూర్తిస్థాయిలో డిస్ ఇన్ఫెక్షన్ చేస్తామని పేర్కొన్నారు. మధ్య సీటు ఖాళీగా ఉంచితే 33 శాతం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని, అందుకే విమానంలోని అన్ని సీట్లకు టికెట్లు అమ్ముతామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా కూడా మధ్య సీటు ఖాళీగా ఉంచరని మంత్రి అన్నారు. (దేశీయ విమానయానం: పాటించాల్సిన నిబంధనలు ఇవే!)
చైనా నుంచి విమానాల రాకపోకలను తొలుత భారత్‌యే ఆపేసిందని కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ అన్నారు. జీవితం, జీవనోపాధి మధ్య సమన్వయం ఉండాలని. చాలా కాలం విమానాలను నడపకుండా ఉండలేమనన్నారు. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసుల రాకపోకలను సమీక్షిస్తున్నామని, ఏవైనా సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అధిగమిస్తామని పేర్కొన్నారు. పరిస్థితులు మెరుగైన కొద్దీ విమాన సర్వీసుల సంఖ్యను పెంచుతామన్నారు. విమాన సర్వీసులు నడిపే అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రులతో కూడా చర్చించామని తెలిపారు. (25 నుంచి దేశీయ విమానయానం)
వందే భారత్ మిషన్ కింద విదేశాలలో ఉన్న భారతీయులందరిని తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. వందే భారత్ ద్వారా ఇప్పటికే 20 వేల మంది ప్రయాణికులను తీసుకువచ్చామని, ఇక నుంచి ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా ఈ మిషన్ లో భాగస్వామ్యం అవుతాయని పేర్కొన్నారు. ఫేస్ మాస్కులు, బ్లౌజు, ఫేస్ షీల్డ్‌లు ఇచ్చామని ఇచ్చామన్నారు. మొత్తం విమానయాన సర్వీసులలో 1/3 వంతు సోమవారం (25 మే)నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు. కేవలం వెబ్ చెక్ ఇన్ సౌకర్యం మాత్రమే ఉంటుందని, ఒక చెక్ ఇన్ బ్యాగేజికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. (ఉంపన్: నీట మునిగిన కోల్‌కతా ఎయిర్‌పోర్టు )
విమానాలలో ప్రయాణించే వారికి ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి అని మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. విమానాలలో భోజన సౌకర్యం ఉండదని, రెండు గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు మాత్రమే వసూలు చేయాలని పేర్కొన్నారు. విమానాలు నడిచే మార్గాలను, ప్రయాణానికి పట్టే సమయాన్ని బట్టి ఏడు భాగాలుగా విభజించినట్లు మంత్రి తెలిపారు. (బిగ్‌బాస్ కంటెస్టెంట్ తండ్రిపై అత్యాచారం కేసు)
► రూట్ 1: 40 నిమిషాలలోపు ప్రయాణం
► రూట్ 2: 40 నుండి 70 నిమిషాలలోపు
► రూట్ 3 : 70 నుండి 90 నిమిషాలు వరకు
► రూట్ 4: 90 నుండి 120 నిమిషాల వరకు
► రూట్ 5: 120 నుండి 150 నిమిషాల వరకు
► రూట్ 6: 150 నుండి 180 నిమిషా వరకు
► రూట్ 7: 180 నిమిషాల పైన
⇒ దేశ రాజధానికి వివిధ ప్రాంతాల నుంచి కనిష్ట ధర 3.5 వేలు, గరిష్ట ధర 10 వేలు.
⇒ ఢిల్లీ - ముంబాయి కనిష్ట ధర 3.5 వేలు, గరిష్ట ధర 10 వేలు
⇒ విమానాలలో 40 శాతం టికెట్ లను సరాసరి ధరలకు అమ్మాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment