ఎడ్‌సెట్-2014 ప్రవే శాల గడువును శుక్రవారం వరకు పొడిగించినట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: ఎడ్‌సెట్-2014 ప్రవే శాల గడువును శుక్రవారం వరకు పొడిగించినట్టు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ నిమ్మ వెంకటరావు పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణల్లోని బీఈడీ కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు విద్యార్థులను శుక్రవారం వరకు చేర్చుకోవాలని సూచించారు. తొలుత దీనికి ఈ నెల 5 వరకు గడువు విధించారు. అయితే, అభ్యర్థుల విజ్ఞాపనల మేరకు 7వ తేదీ వరకు అవకాశం కల్పించారు.