edcet
-
AP: ఒక్క క్లిక్‌తో ఎడ్‌సెట్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఒక్క క్లిక్‌తో ఫలితాలు చూసుకోండిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్)–2024 ఫలితాలను విడుదల చేశారు. బీఈడీ, బీఈడీ(స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. 11384 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి తరపున విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎడ్ సెట్ నిర్వహించారు. -
ఏపీ ఎడ్ సెట్ మొదటి విడత అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాసిన ఏపీ ఎడ్ సెట్ మొదటి విడత అడ్మిషన్లకు గురువారం షెడ్యూల్ విడుదలైంది. ఏపీ ఎడ్ సెట్ అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ కే రామమోహన్ రావు షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఎడ్‌సెట్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్లకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కాన్నట్లు తెలిపారు. ఈ నెల 22 నుంచి 27 వరకు వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టగా.. 26 నుంచి 31 వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగనుందని తెలిపారు. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఈ నెల 27న విజయవాడ లయోలా కాలేజ్‌లో సర్టిఫికేట్లు పరిశీలించన్నట్లు పేర్కొన్నారు. నవంబర్ ఒకటి నుంచి మూడు వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వగా.. నవంబర్ మూడో తేదీన వెబ్ ఆప్షన్లలో మార్పుకి అవకాశం కల్పించారు. ఇక నవంబర్ 5న విద్యార్ధులకు సీట్ల కేటాయించనున్నారు. నవంబర్ 7నుంచి 9లోపు కళాశాలలో చేరేందుకు విద్యార్ధులకు అవకాశం కల్పించారు. నవంబర్ 7 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. -
ఏపీ లాసెట్, ఎడ్‌సెట్- 2022 ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఏపీ లాసెట్, ఏపీ ఎడ్‌సెట్- 2022 ఫలితాలు విడుదలయ్యాయి. లాసెట్, పీజీఎల్ సెట్, ఏపీ ఎడ్‌సెట్ పరీక్షలను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించింది. లాసెట్ ఫలితాల్లో టాప్ టెన్ ర్యాంకుల్లో మొదటి ఆరు ర్యాంకులు సాధించి మహిళలు సత్తా చాటారు. ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు ► బైలాజికల్ సైన్లో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి ఓరం అమర్నాథ్ రెడ్డికి మొదటి ర్యాంకు. ► మాథమ్యాటిక్స్‌లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మల్లెల గిరీష్ కుమార్ రెడ్డికి తొలి ర్యాంకు. ► ఇంగ్లీష్‌లో కేరళ రాష్టానికి చెందిన అంజనాకు మొదటి ర్యాంకు. ► సోషల్ స్టడీస్‌లో నంద్యాల జిల్లాకు చెందిన ఏ శివానీకి మొదటి ర్యాంకు. ► ఫిజికల్ సైన్స్‌లో విజయనగరం జిల్లాకు చెందిన కె.వాణికి మొదటి ర్యాంకు. ఏపీ లాసెట్ ఫలితాల్లో సత్తాచాటిన మహిళలు.. ఏపీ లాసెట్ ఫలితాల్లో మహిళలు సత్తా చాటారు. కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన బి.కీర్తికి లాసెట్ 5 ఇయర్స్ స్ట్రీమ్‌లో మొదటి ర్యాంకు వచ్చింది. టాప్ టెన్ ర్యాంకుల్లో మొదటి ఆరు ర్యాంకులు మహిళలకే దక్కాయి. ఇదీ చదవండి: పాఠం స్కాన్ చేసేయొచ్చు.. మళ్లీ మళ్లీ వినొచ్చు -
Telangana: సీబీఎస్ఈ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పదోతరగతి వరకు తెలుగు సబ్జెక్టు తప్పని సరిగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. తెలుగు సబ్జెక్టు బోధించని స్కూళ్లకు రూ.లక్ష వరకూ జరిమానా విధించే అవకాశముందని స్పష్టం చేసింది. ఈ నిబంధనను ప్రత్యేకించి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ తదితర బోర్డు పాఠశాలల్లో అమలు చేసేందుకు సంబంధించి రూపొందించడం గమనార్హం. కేజీబీవీ సమస్యలు పరిష్కరించాలి: పీఆర్టీయూ సాక్షి, హైదరాబాద్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూ టీఎస్.. విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. సంఘం నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు బుధవారం ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డితో కలిసి మంత్రిని కలిశారు. కేజీబీవీల్లో కేర్టేకర్ల నియామకం, ఆర్థిక, ఆపరేషన్ల గైడ్‌లైన్స్ మార్పు, ఉద్యోగులకు హెల్త్ కార్డులు వంటి సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎడ్‌సెట్–2022 గడువు 22 వరకు పొడిగింపు ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): టీఎస్ ఎడ్‌సెట్–2022 గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు కన్వీనర్ రామకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15తో ఎడ్‌సెట్–2022 గడువు ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు వారం పాటు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశమిచ్చారు. ఇప్పటివరకు ఎడ్‌సెట్‌కు 24 వేలమంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. (క్లిక్: నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!) -
7 నుంచి ఎడ్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్–2022కు ఈ నెల 7 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అప్లికేషన్లను జూన్ 15లోగా, రూ. 500 పెనాల్టీతో జూలై 1 వరకూ పంపొచ్చని స్పష్టం చేశారు. ఇందుకు షెడ్యూల్‌ను సోమవారం తన కార్యాలయంలో ఆయన విడుదల చేశారు. ఎడ్‌సెట్ పరీక్ష జూలై 26, 27 తేదీల్లో 19 ప్రాంతీయ కేంద్రాల్లో జరుగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 17, ఏపీలో విజయవాడ, కర్నూల్ ప్రాంతీయ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఉస్మానియా వర్సిటీ నేతృత్వంలో జరిగే ఎడ్‌సెట్‌కు ఫీజు రూ. 650 (ఎస్సీ, ఎస్టీలు, పీహెచ్‌లకు రూ. 450)గా నిర్ణయిం చినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన బీఈడీ కాలేజీలు 220 ఉన్నాయని, వీటిల్లో 19,600 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. గతేడాది 33,683 మంది బీఈడీలో అర్హత సాధించారని తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ (హోం సైన్స్), బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్), బీటెక్, బీబీఏ లేదా మాస్టర్ డిగ్రీని 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. ఆఖరి సంవత్సరం డిగ్రీ విద్యార్థులు కూడా బీఎడ్ సెట్ రాసేందుకు అర్హులే. ముఖ్యమైన తేదీలు దరఖాస్తుల స్వీకరణ -ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు రూ. 500 పెనాల్టీతో -జూలై 1 వరకు ఫీజు వివరాలు -రూ. 650 (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌లకు రూ. 450) పరీక్ష తేదీలు -జూలై 26, జూలై 27 -
ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయ విశాఖపట్నంలో ఏపీ ఎడ్ సెట్ ఫలితాలను కన్వీనర్ విశ్వేశ్వర్ రావు విడుదల చేశారు. ఈ ఏడాది ఎడ్ సెట్‌కు 15,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,619 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎడ్‌సెట్ ఫలితాల్లో 13,428 మంది అంటే.. 98.60 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టుట్లు కన్వీనర్ విశ్వేశ్వర్రావు వెల్లడించారు. గతేడాది డాటా ప్రకారం 42 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి పేర్కొంది. చదవండి: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ -
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఏపీఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష
-
AP: 21న ఎడ్‌సెట్
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్ (2021 ప్రవేశ పరీక్ష)ను ఈ నెల 21వ తేదీ ఉదయం 10.00 నుంచి 12.00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ ఆచార్య కె.విశ్వేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు 15,638 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వీరికి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 69 కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష జరుగుతుందన్నారు. చదవండి: Sri Lanka: మీ వ్యవసాయ ఉత్పత్తులు కావాలి పరీక్ష సమయానికి గంట ముందు నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని పేర్కొన్నారు. పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వివరాలతో అభ్యర్థులకు సంక్షిప్త సందేశాలు (ఎస్ఎంఎస్)లు పంపిస్తామని చెప్పారు. అభ్యర్థులు www.sche.ap.gov.in/edcet వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావాలన్నారు. -
ఏపీ సెట్.. ఈజీగా అప్లై చేసుకోండి ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించనున్న పలు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిల్లో ఏపీ ఈఏపీసెట్, ఏపీఈసెట్, ఏపీ ఐసెట్, ఏపీ ఎడ్‌సెట్, ఏపీ పీజీఈసెట్, ఏపీ లాసెట్ తదితరాలు ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఆయా సెట్లకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. సదరు ఏపీ సెట్లకు అర్హతలు, ప్రవేశం కల్పించే కోర్సులు, ప్రవేశ పరీక్షల విధానంపై ప్రత్యేక కథనం... ఏపీ ఈఏపీసెట్ ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్(ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)–2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే ఎంట్రన్స్ టెస్టు.. ‘ఈఏపీసెట్’ (పూర్వపు ఎంసెట్). ఈ ఏడాది ఈఏపీసెట్‌ను జేఎన్టీయూ, కాకినాడ నిర్వహిస్తోంది. ► ప్రవేశం కల్పించే కోర్సులు: ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్(డెయిరీ టెక్నాలజీ), బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ. అర్హతలు ► ఇంజనీరింగ్, ఫార్మసీ(ఎంపీసీ), ఫార్మా డీ, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత/తత్సమాన అర్హత ఉండాలి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► బీఎస్సీ అగ్రికల్చర్/బీఎస్సీ హార్టికల్చర్/బీవీఎస్సీ అండ్ ఏహెచ్/బీఎఫ్ఎస్సీ /బీటెక్ (ఎఫ్ఎస్టీ)/బీఎస్సీ(సీఏ అండ్ బీఎం)/బీఫార్మసీ/బీటెక్(బయోటెక్నాలజీ)(బైపీసీ), ఫార్మా డీ(బైపీసీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ బైపీసీ/తత్సమాన అర్హత ఉండాలి. ► ఇంజనీరింగ్ పరీక్ష విధానం: ఇంజనీరింగ్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ) విధానంలో జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు–80మార్కులకు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులకు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులకు సెట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ► అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష విధానం: అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) విధానంలో పరీక్ష జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో బయాలజీ 80 ప్రశ్నలు–80 మార్కులకు(బోటనీ 40, జువాలజీ 40); ఫిజిక్స్ 40 ప్రశ్నలు–40 మార్కులకు, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు –40 మార్కులకు పరీక్ష ఉంటుంది. ► ఈఏపీసెట్‌లో అర్హత సాధించేందుకు కనీసం 25 శాతం మార్కులు రావాలి. ఎంట్రెన్స్‌లో సాధించిన మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ కల్పించి.. తుది ర్యాంకు ప్రకటిస్తారు. ఎస్సీ/ఎస్టీలకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.07.2021(ఆలస్య రుసం లేకుండా) ► పరీక్ష తేదీలు: ఆగస్టు 19 నుంచి 25 వరకు ► ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్: https://sche.ap.gov.in/EAPCET/EapcetHomePages/Home.aspx ఏపీ ఈసెట్ ఏపీ ఈసెట్(ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అండ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున అనంతపురంలోని జేఎన్టీయూ నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన వారికి బీటెక్/బీఈ, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాది(లేటరల్ ఎంట్రీ)లో ప్రవేశం లభిస్తుంది. అర్హతలు ► డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఫార్మసీ/బీఎస్సీ(మ్యాథమెటిక్స్) అభ్యర్థులు ఈసెట్‌కు దరఖాస్తుకు అర్హులు. కనీసం 45 శాతం మార్కులతో సంబంధిత కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. పరీక్ష విధానం ► ఈసెట్ పరీక్ష మూడు విధాలుగా జరుగుతుంది. ఇంజనీరింగ్/ఫార్మసీ/బీఎస్సీ విభాగాల అభ్యర్థులకు భిన్నంగా ప్రశ్న పత్రం ఉంటుంది. 200 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ► ఇంజనీరింగ్ విభాగంలో.. మ్యాథ్స్ 50 ప్రశ్నలు–50 మార్కులు, ఫిజిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, కెమిస్ట్రీ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంజనీరింగ్(సంబంధిత బ్రాంచ్) 100 ప్రశ్నలు–100 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. ► ఫార్మసీ విభాగంలో.. ఫార్మాస్యూటిక్స్–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మకాలజీ–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మాకోగ్నసీ–50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ► బీఎస్సీ(మ్యాథ్స్) విభాగంలో మ్యాథమెటిక్స్ 100 ప్రశ్నలు–100 మార్కులు, అనలిటికల్ ఎబిలిటీ 50 ప్రశ్నలు–50 మార్కులకు, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021 ► పరీక్ష తేది: 19.09.2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx ఏపీ ఐసెట్ ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఐసెట్–2021 కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది ఐసెట్‌ను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది. అర్హతలు ► 10+2+3 విధానంలో ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు ఎంబీఏకు దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఎంసీఏకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ► డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ వర్గాల అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. పరీక్ష విధానం ► ఐసెట్ పరీక్ష 200 ప్రశ్నలు–200 మార్కులకు ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్సన్ ఏలో అనలిటికల్ ఎబిలిటీ 75 ప్రశ్నలు–75 మార్కులు; సెక్షన్ బీలో కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 ప్రశ్నలు–70 మార్కులకు; సెక్షన్ సీలో మ్యాథమెటికల్ ఎబిలిటీ55ప్రశ్నలు–55 మార్కు లకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.08.2021 ► ఏపీ ఐసెట్ పరీక్ష తేదీలు: 2021 సెప్టెంబర్ 17,18 ► వెబ్సైట్: https://sche.ap.gov.in/icet ఏపీ ఎడ్‌సెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీ/గవర్నమెంట్/ఎయిడెడ్/ప్రైవేట్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో.. రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు ఏపీ ఎడ్‌సెట్–2021 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ► బీఏ/బీకామ్/బీఎస్సీ/బీఎస్సీ/బీబీఎంలో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్/బీఈలో 50 మార్కులు తెచ్చుకున్నవారు సైతం బీఈడీలో చేరేందుకు అర్హులు. పరీక్ష విధానం ► ఎడ్‌సెట్ ఆన్లైన్ విధానంలో మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు జరుగుతుంది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2గంటలు. ఇందులో జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు–15 మార్కులు, టీచింగ్ అప్టిట్యూడ్10 ప్రశ్నలు–10 మార్కులు; –మెథడాలజీలో మ్యాథమెటిక్స్ 100 ప్రశ్నలు–100 మార్కులు/ఫిజికల్ సైన్స్: ఫిజిక్స్–50, కెమిస్ట్రీ–50/బయలాజికల్ సైన్స్: బోటనీ–50, జువాలజీ–50/సోషల్ స్టడీస్: జాగ్రఫీ–35, చరిత్ర–30, సివిక్స్–15, ఎకనామిక్స్–20(మొత్తం 100)/ ఇంగ్లిష్: 100 ప్రశ్నలు–100 మార్కులకు ఉంటుంది. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► దరఖాస్తులకు చివరి తేది: 17.08.2021 ► ఎడ్‌సెట్ పరీక్ష తేది: 21.09.2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx ఏపీపీజీఈ సెట్ ఆంధ్రప్రదేశ్‌లోని పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్(ఎంటెక్/ఎంఈ/ఎంఫార్మా,ఫార్మాడీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ పీజీఈసెట్–2021 నోటిఫికేషన్ విడుదలైంది. ► అర్హత: బీటెక్/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించాలి, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 45శాతం మార్కులు వచ్చి ఉండాలి. పరీక్ష ‘ఆన్లైన్’ విధానంలో ఉంటుంది. మొత్తం 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు. ప్రశ్నలు అభ్యర్థి ఏ విభాగంలో పీజీ చేయదలచారో దాని ఆధారంగా ఉంటాయి. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.08.2021 ► ఏపీపీజీఈ సెట్ తేదీలు:27–30 సెప్టెంబర్ 2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/PGECET -
TS EDCET 2021: నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సులు చదివిన వారు మాత్రమే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్) చేరే అవకాశం ఉండగా ఇకపై ఇతర సబ్జెక్టులు చదివిన వారికి బీఎడ్‌లో చేరే అవకాశం వచ్చింది. ఈ మేరకు బీఎడ్ ప్రవేశాల నిబంధనలను ప్రభుత్వం మార్పు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో 16 జారీ చేశారు. ఇప్పటివరకు డిగ్రీలో ఓరియంటల్ లాంగ్వేజెస్ చదువుకున్న వారికి బీఎడ్‌లో చేరే అవకాశం లేకపోగా ఇప్పుడు వారికి కొత్తగా అవకాశం దక్కింది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ (హోంసైన్స్), బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్), బీబీఏ, బీటెక్ చేసిన వారు కూడా బీఎడ్ చదివే వీలు ఏర్పడింది. వారు ఆయా డిగ్రీల్లో 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఇవి చదివిన వారంతా అర్హులే.. ► బీఎడ్ ఫిజికల్ సైన్స్ చేయాలంటే.. బీఎస్సీ విద్యార్థులు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా సంబంధిత సబ్జెక్టును పార్ట్–2 గ్రూపులో చదివి ఉండాలి. బీటెక్ విద్యార్థులు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ; బీసీఏ విద్యార్థులు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ సబ్జెక్టులను ఇంటర్మీడియట్లో చదివి ఉంటే చాలు. ► బీఎడ్ బయోలాజికల్ సైన్స్‌లో చేరాలంటే బీఎస్సీ/బీఎస్సీ (హోంసైన్స్) చేసిన వారు బోటనీ, జువాలజీలో ఏదో ఒక సబ్జెక్టు డిగ్రీలో పార్ట్–2 గ్రూపులో చదివి ఉండాలి. బీసీఏ విద్యార్థులైతే ఇంటర్లో బయోలాజికల్ సైన్స్ చదివి ఉండాలి. ► బీఎడ్ సోషల్ సైన్సెస్ చేయాలంటే బీకాం/బీబీఎం/బీబీఏ/బీసీఏ అభ్యర్థులు ఇంటర్లో సోషల్ సైన్స్ చదివి ఉండాలి. ► ఓరియంటల్ లాంగ్వేజెస్‌లో బీఎడ్ చేయాలనుకునే వారు బీఏలో తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతంను ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా చదివి ఉండాలి. లిటరేచర్ అభ్యర్థులు (బీఏ–ఎల్) తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతం చదివి ఉంటే చాలు. బీఏ ఓరియెంటల్ లాంగ్వేజెస్ వారు తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతం చదివి ఉండాలి. ఎంఏ తెలుగు/ హిందీ/ మరాఠీ/ ఉర్దూ/ అరబిక్/ సంస్కృతం చేసిన వారు కూడా అర్హులే. చదవండి: 10 వేలకు పైగా ఉద్యోగాలు.. ఆశావహులకు తీపికబురు NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో 89 పోస్టులు -
స్కూల్ టీచర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా?
స్కూల్ టీచర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు చక్కటి మార్గం.. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ). ఇందులో ప్రవేశం కోసం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఎడ్‌సెట్–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ హాజరయ్యే ఈ పరీక్షను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. టీఎస్ ఎడ్‌సెట్–2021 నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు,పరీక్ష విధానంపై ప్రత్యేక కథనం.. తెలంగాణ రాష్ట్రంలోని కళాశాలల్లో అందిస్తున్న రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష.. టీఎస్ ఎడ్‌సెట్–2021. ఎడ్‌సెట్‌కు గతేడాది సుమారు 31 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది రెట్టింపు దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీ ర్ణులు దరఖాస్తుకు అర్హులు. ఇంజనీరింగ్ అభ్యర్థులు సైతం బీఈడీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. అర్హతలు ఆన్లైన్లో జరిగే ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం కొన్ని అర్హతలను నిర్దేశించింది. జూలై1 నాటికి 19ఏళ్లు నిండి, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ..బీఏ,బీకామ్,బీఎస్సీ, బీఎస్సీ–హోమ్‌సైన్స్,బీసీఏ,బీబీఏం,బీఏ–ఓరియంటల్ లాంగ్వేజెస్,బీబీఏ లేదా మాస్టర్ డిగ్రీలో కనీసం 50శాతం మార్కులు తప్పనిసరి. బీటెక్/బీఈలో 50 శాతం మార్కులు సాధించినవారు సైతం బీఈడీ కోర్సుల్లో చేరేందుకు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులైన ఎస్సీ/ఎస్టీ/ బీసీలతోపాటు ఇతర ప్రభుత్వ రిజర్వేషన్లు ఉన్న వారు 40శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. అర్హత కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులు సైతం ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీబీఎస్/బీఎస్సీ(ఏజీ)/బీవీఎస్సీ/ బీహెచ్‌ఎంటీ/ బీఫార్మసీ/ఎల్ఎల్బీ వంటి కోర్సుల అభ్యర్థులు బీఈడీలో చేరేందుకు అర్హులు కాదు. గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సు చదవకుండా.. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు బీఈడీలో ప్రవేశం పొందేందుకు అనర్హులు. మెథడాలజీ–అర్హతలు మ్యాథమెటిక్స్: బీఏ/బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఈ/బీటెక్/బీసీఏ అభ్యర్థులు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివినవారు అర్హులు. ఫిజికల్ సైన్స్: బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటికి అనుబంధ సైన్స్ సబ్జెక్టులు చదివినవారు, ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ సబ్జెక్టులు చదివి ఇంజనీరింగ్/బీసీఏ చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. బయోలాజికల్ సైన్స్: బీఎస్సీ/బీఎస్సీ హోమ్ సైన్స్/బీసీఏ చేసినవారు ఇంటర్మీడియట్ స్థాయిలో బోటనీ, జువాలజీ అనుబంధ సబ్జెక్టులు చదివినవారు అర్హులు. సోషల్ సైన్సెస్: బీఏలో సోషల్ సైన్స్, బీకామ్/బీబీఎం/బీబీఏ/బీసీఏ అభ్యర్థులు ఇంటర్మీడియట్ స్థాయిలో సోషల్ సబ్జెక్టులు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లిష్: బీఏ స్పెషల్ ఇంగ్లిష్/ఇంగ్లిష్ లిటరేచర్/ఎంఏ ఇంగ్లిష్ చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓరియంటల్ లాంగ్వేజెస్: బీఏ తెలుగు/హిందీ/ మరాఠి/ఉర్దూ/అరబిక్/సంస్కృతం సబ్జెక్టులు చదివినవారు, ఈ సబ్జెక్టులతో బీఏ లిటరేచర్ చేసినవారు అర్హులు. ఎడ్‌సెట్ సిలబస్ టీఎస్ ఎడ్‌సెట్–2021 పరీక్ష మొత్తం 150 మార్కులకు–150 ప్రశ్నలకు జరుగుతుంది. సబ్జెక్టు/కంటెంట్ 60 ప్రశ్నలు(మ్యాథ్స్–20, సైన్స్–20, సోషల్–20),టీచింగ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లిష్ 20 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ 30 ప్రశ్నలు, కంప్యూటర్ అవేర్నెస్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఎంట్రన్స్ సిలబస్.. ఆయా సబ్జెక్టుల్లో తెలంగాణలో హైస్కూల్ స్థాయిలో పదోతరగతి వరకు ఉన్న సిలబస్ ఆధారంగా ఉంటుంది. దీంతోపాటు జనరల్ ఇంగ్లిష్, టీచింగ్ అప్టిట్యూడ్, మెథడాలజీపైనా ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్టులు–సిలబస్ అంశాలు మ్యాథమెటిక్స్: నంబర్ సిస్టమ్, కమర్షియల్ మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా, జ్యామితి, మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ, డేటా హ్యాండ్లింగ్‌పై ప్రశ్నలు ఉంటాయి. సైన్స్(ఫిజికల్/బయాలజీ): ఆహారం, జీవరా శులు, జీవ ప్రక్రియలు, జీవ వైవిధ్యం, కాలు ష్యం, పదార్థం, కాంతి, విద్యుత్ –అయస్కాంతత్వం, హీట్, ధ్వని, చలనం, వాతావరణం, కోల్ అండ్ పెట్రోల్, స్టార్స్ అండ్ సోలార్ సిస్టం, మెటలర్జీ, రసాయన చర్యలు. సోషల్ స్టడీస్: జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. టీచింగ్ ఆప్టిట్యూడ్: ఆప్టిట్యూడ్ ప్రశ్నలు, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, క్లాస్ రూమ్ అర్థం చేసుకోవడానికి సంబంధించినవి. టీచర్–విద్యార్థి సంబంధానికి ప్రత్యేక రిఫరెన్స్, మేనేజ్మెంట్ అండ్ మెంటారింగ్. జనరల్ ఇంగ్లిష్: రీడింగ్ కాంప్రహెన్షన్, స్పెల్లింగ్ దోషాలు, పదజాలం, పదబంధం రీప్లేస్మెంట్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ వర్డ్ అసోసియేషన్. జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూస్: కరెంట్ అఫైర్స్(ఇండియా అండ్ ఇంటర్నే షనల్), వర్తమాన విద్యా సంబంధ అంశాలు. కంప్యూటర్ అవేర్నెస్: కంప్యూటర్–ఇంటర్నెట్, మెమొరీ, నెట్వర్కింగ్ అండ్ ఫండమెంటల్స్. టీఎస్ ఎడ్‌సెట్ 2021 ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది: ఆలస్య రుసుం లేకుండా జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 ఆలస్య రుసుంతో జూన్ 25 వరకు, రూ.500 ఆలస్య రుసంతో జూలై 5 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో జూలై 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్‌టికెట్ల డౌన్లోడ్: ఆగస్టు 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎంట్రన్స్ టెస్ట్: 2021 ఆగస్టు 24, 25 తేదీల్లో టీఎస్ఎడ్సెట్ జరుగుతుంది. పరీక్ష ఇంగ్లిష్/తెలుగు, ఇంగ్లిష్/ఉర్దూ రెండు భాషల్లో ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.650, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులకు రూ.450 చెల్లించాలి. వివరాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్: https://edcet.tsche.ac.in -
ఏపీ ఎడ్‌సెట్-2019 ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని బీఈడీ కళాశాల్లో ప్రవేశానికి ఈ నెల 6న నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్-2019 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. పరీక్ష ఫలితాలను ఇవాళ ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 11,650మంది రాయగా 11,490మంది అర్హత సాధించారు. 18వ తేదీ నుంచి ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని, జూలై మొదటివారం నుంచి కౌన్సిలింగ్ ప్రారంభం కానుందని ఏపీ ఎడ్‌సెట్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఏపీ ఎడ్‌సెట్‌ను ఈ ఏడాది ఎస్వీ యూనివర్శిటీ నిర్వహించిన విషయం తెలిసిందే. -
ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి : ఉపాధ్యాయ విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఎడ్‌సెట్-2018 ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం సచివాలయంలో విడుదల చేశారు. ఫలితాలను ఆర్టీజీఎస్ వెబ్సైట్లో ఉంచినట్టు తెలిపారు. పరీక్షకు హాజరైన వారిలో 96.75 శాతం విద్యార్థులు ఉతీర్ణత సాధించినట్టు మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌ను వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించింది. -
18 నుంచి ఎడ్‌సెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్ : బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశానికి నిర్వహించనున్న ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఎడ్‌సెట్–2018) షెడ్యూల్‌ను సెట్ కమిటీ ఖరారు చేసింది. ఈ నెల 15న ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన సెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎడ్‌సెట్‌ను ఈ సారి ఆన్లైన్లో నిర్వహించనున్న నేపథ్యంలో పరీక్ష ఫీజును సెట్ కమిటీ పెంచింది. గతేడాది ఎస్సీ, ఎస్టీలకు రూ.200, బీసీ, ఇతరులకు రూ.400గా ఉన్న ఫీజును.. ఈ సారి ఎస్సీ, ఎస్టీలకు రూ.450, బీసీ, ఇతరులకు రూ.650గా నిర్ణయించింది. ఆన్లైన్ పరీక్షలతో నిర్వహణ వ్యయం పెరగనుండటంతో కొంత ఫీజు పెంచాల్సి వచ్చిందని పాపిరెడ్డి పేర్కొన్నారు. -
ప్రారంభమైన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
ఎస్కేయూ: ఎడ్‌సెట్–2017 కౌన్సెలింగ్ గురువారం ప్రారంభమైంది. ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ఎస్కేయూ వీసీ కె.రాజగోపాల్, రిజిస్ట్రార్ సుధాకర్ బాబు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ తిమ్మానాయక్ అభ్యర్థులకు వెరిఫికేషన్స్ రిసీట్‌ను అందించారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం ముగియనుంది. -
ఎడ్‌సెట్‌లో అర్హులు 97.74 %
- మొత్తంగా అర్హత సాధించిన 57,413 మంది విద్యార్థులు - వచ్చే నెలలో కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల 16న నిర్వహించిన ఎడ్‌సెట్–2017లో 97.74 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఎడ్‌సెట్ కోసం 64,029 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా వారిలో 58,738 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 57,413 మంది (97.74 శాతం) అర్హత సాధించారు. అర్హుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వచ్చే నెలలో చేపట్టనున్నట్లు పాపిరెడ్డి తెలిపారు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కూడా కాలేజీల సమగ్ర వివరాలతో కూడిన అఫిడవిట్లు దాఖలు చేసేందుకు కాలేజీ యాజమాన్యా లకు ఈ నెల 31 వరకు గడువు ఇచ్చిందని వెల్లడించారు. దీంతో ఈ నెలాఖరు తరు వాత ఎన్ని కాలేజీలకు ఎన్సీటీఈ గుర్తింపు రద్దు చేసిందో, ఎన్ని కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలన్న విషయంలో స్పష్టత వస్తుందని, ఆ తరువాత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. గతేడాది 184 కాలేజీల్లో 18,400 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఐదు సబ్జెక్టుల్లో ప్రథమ, ద్వితీయ ర్యాంకర్లు వీరే.. గణితం : వేముల మాధురి,కూనారపు రమేశ్ ఫిజికల్ సైన్స్ : గన్నెర్ల సైదాచారి,తాళ్ల అభినయ శరాన్ బయోలాజికల్ సైన్స్: వంశీ సాలిగంటి, మానస దీప్తి ముప్పాళ్ల సోషల్ స్టడీస్ : హనుమాండ్ల లక్ష్మీ వర ప్రసాద్, సాహిక్ లతీఫ్ ఇంగ్లిష్ : తస్నీమ్ సుల్తానా,నిఖత్ పర్వీన్ -
ఏపీ సెట్ల ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధప్రదేశ్ లాసెట్, ఎడ్‌సెట్, పాలిసెట్‌ల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఇందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం www.sakshieducation.comను చూడొచ్చు. ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి. ఎడ్‌సెట్: - హాజరైన వారు 7,152 మంది - అర్హత సాధించినవారు 7,010 మంది - 98.01 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు - ఎడ్‌సెట్‌లో ఉత్తీర్ణులైన వారికి జూన్ చివరి వారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. పాలిసెట్: - పరీక్షకు హాజరైన విద్యార్థులు ఒక లక్షా ఇరవై రెండు వేల మంది - 96155 మంది అర్హత సాధించారు - ఉత్తీర్ణత శాతం 78.20 - 66,191 అబ్బాయిలు, 29,904 అమ్మాయిలు పాలీసెట్‌లో అర్హత సాధించారు - తూర్పు గోదావరికి చెందిన సాయి ప్రవీణ్ గుప్తా మొదటి ర్యాంకు సాధించాడు. కృష్ణా జిల్లాకు చెందిన మధు మురళి రెండో ర్యాంకు సాధించాడు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ జూన్ మొదటివారంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. లాసెట్: ఏపీ లాసెట్‌లో ఐదు సంవత్సరాల కోర్సుకు 85 శాతం మంది, మూడు సంవత్సరాల కోర్సుకు 82 శాతం మంది, 2 సంవత్సరాల కోర్సుకు 92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. -
ఏపీ సెట్ల ఫలితాలు విడుదల
-
మే చివరి వారంలో డైట్‌సెట్, ఎడ్‌సెట్
- ఈ వారంలోనే నోటిఫికేషన్ జారీకి చర్యలు - లక్షన్నర మంది విద్యార్థులకు ఊరట సాక్షి, హైదరాబాద్: ఏడాదిగా అస్తవ్యస్తంగా తయారైన ఉపాధ్యాయ విద్యా ప్రవేశాలను ఎట్టకేలకు గాడిన పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యు కేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుల్లో 2017– 18 విద్యా సంవత్స రంలో ప్రవేశాలకు డైట్‌సెట్, ఎడ్‌సెట్ నోటిఫి కేషన్ల జారీకి ఓకే చెప్పింది.ఈ ప్రవేశ పరీక్షలను మే చివరిలో నిర్వహించనుంది. ఈ మేరకు అధికారులను ఆదేశించింది. మే చివరిలో ఈ పరీక్షలను జరిపితే జూన్‌లో ఫలితాల వెల్లడి, ప్రవేశాల కౌన్సెలింగ్ జరపాలంది. జులై 1 నుంచి తరగతులు ప్రారంభిస్తారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జరిపిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూ స్తున్న దాదాపు లక్షన్నర మంది విద్యార్థులకు ఊరట కలిగింది. గతేడాది డీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వమే జీరో ఇయర్ చేసింది. దీంతో డీఎడ్ కోసం ఎదురుచూసిన వారు విద్యాసంవత్సరం నష్టపోవడంతోపాటు 15 వేల సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. మరోవైపు బీఎడ్ కోర్సులో రెండో దశ ప్రవేశాలకు అను మతించలేదు. మేనేజ్మెంట్ కోటా భర్తీకి ఉత్త ర్వులు జారీ చేయలేదు. దీంతో రెండో విడత కౌన్సెలింగ్ లేకుండానే విద్యా సంవత్సరం గడిచిపోయింది. మేనేజ్మెంట్ కోటా భర్తీకి ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ ఇవ్వకపోయి నా, యాజమాన్యాలే సీట్లను భర్తీ చేసుకున్నా యి. ఫలితంగా మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన 4 వేల మంది విద్యార్థులు, మేనేజ్మెంట్ కోటాలో చేరిన మరో 2 వేల మంది విద్యార్థులతో యాజమాన్యాలు కాలే జీలను కొనసాగించాయి. రెండో విడత కౌన్సె లింగ్లో భర్తీ చేయాల్సిన 8 వేల సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. దీంతో యాజమాన్యాలు హై కోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు చెప్పినా రెండో విడత కౌన్సెలింగ్ చేపట్టకుండా ఆ తీర్పుపై ఉన్నత విద్యాశాఖ గత జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇలా విద్యా సంవత్సరం కూడా గడిచిపోయింది. దీంతో 2017–18 విద్యా సంవత్సరంలో బీఎడ్‌లో ప్రవేశాలకు ఎడ్‌సెట్ నిర్వహణ అంశాన్ని కూడా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. గత జనవరిలో అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించినా ఎడ్‌సెట్–2017 నిర్వహణకు నియమించలేదు. గతేడాది డీఎడ్ కు జీరో ఇయర్ చేసిన ప్రభుత్వం ఈసారి బీఎడ్‌కు అలానే చేస్తుందా? అనే ఆందోళనతో వివిధ సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. దీంతో 2017–18లో డీఎడ్, బీఎడ్‌లో ప్రవేశాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఏడాది బీఎడ్ మేనేజ్మెంట్ కోటాలో యాజమాన్యాలే భర్తీ చేసుకున్న సీట్లకు ర్యాటిఫికేషన్ ఇవ్వనుంది. వర్సిటీల వీసీలతో సమావేశం జరిపి, ఎడ్‌సెట్–2017కు కన్వీనర్‌ను నియమించడంతోపాటు నోటిఫి కేషన్ జారీకి చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి అధికారులను ఆదేశించింది. మరోవైపు డైట్‌సెట్–2017కు ఇప్పటికే కన్వీనర్‌గా శేషుకుమారిని నియమించిన ప్రభుత్వం ప్రవేశాల మార్గదర్శకాలపై ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే నోటిఫికేషన్ వెలువడనుంది. -
ఎడ్‌సెట్ కమిటీ సభ్యురాలిగా వరలక్ష్మి
కోవెలకుంట్ల: 2017 విద్యా సంవత్సర ఆంధ్రప్రదేశ్ ఎడ్‌సెట్ కమిటీ సభ్యురాలిగా కోవెలకుంట్లకు చెందిన వరలక్ష్మి నియమితులయ్యారు. రెండు రోజుల క్రితం గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన ఎడ్‌సెట్ కమిటీ సమావేశంలో కర్నూలు జిల్లా నుంచి స్థానిక శ్రీనివాస బీఎడ్ కళాశాల కరస్పాండెంట్‌కు కమిటీలో చోటు కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది నిర్వహించే ఎడ్‌సెట్‌ను ఆన్లైన్లో నిర్వహించాలని సమావేశంలో చర్చ జరిగిందన్నారు. ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సౌకర్యార్థం తమ కళాశాలలో ఉచిత ఆన్లైన్ నమోదుకేంద్రం ఏర్పాటు చేసి, ఆన్లైన్ పరీక్షపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మహబూబ్‌బాషా, గౌరవ సలహాదారుడు నాగరాజు పాల్గొన్నారు. -
ఎడ్‌సెట్ రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: ఎడ్‌సెట్ రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డికి టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. మంగళవారం పాపిరెడ్డితో బీఎడ్ కాలేజీ యాజమాన్య ప్రతినిధులు, కోదండరాం సమావేశమయ్యారు. 11 కొత్త కాలేజీల అనుమతి విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నందున రెండో దశ కౌన్సెలింగ్ ఉండకపోవచ్చని పాపిరెడ్డి వెల్లడించినట్లు యాజమాన్య సంఘాల ప్రతినిధి కత్తి రాందాస్ తెలిపారు. ఆ కాలేజీలను మినహాయించి మిగతా కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించాలని కోదండరాం కోరారు. -
ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఎస్కేయూ : బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించే ఎడ్‌సెట్–2016 కౌన్సెలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ఎస్కేయూ హెల్ప్‌లైన్ సెంటర్లో జరుగుతున్న సర్టిఫికెట్ల పరిశీలనకు 281 మంది విద్యార్థులు హాజరైనట్లు కోఆర్డినేటర్ ఆచార్య సుధాకర్ తెలిపారు. ఫైబర్‌గ్రిడ్ పనిచేయకపోవడతో ఎస్కేయూలోని ల్యాన్ (లోకల్ ఏరియా నెట్వర్క్) ద్వారా విద్యార్థులకు అవకాశం కల్పించి సర్టిఫికెట్ల పరిశీలన సజీవుగా జరిపినట్లు పేర్కొన్నారు. -
ప్రారంభమైన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
ఎచ్చెర్ల: బీఎడ్ రెండేళ్ల కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఎడ్ సెట్ –2016 ప్రారంభం అయ్యింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కావలసి ఉండగా, జాతీయ సమాచార కేంద్రం నుంచి సర్వర్ అనుసంధానం కాలేదు. అభ్యర్థులు మాత్రం ఉదయం 9 గంటలకే కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఎట్టకేలకు 12.30కి సర్వర్ అనుసంధానం చేశారు. వర్సిటీ ఇన్చార్జి వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య కౌన్సెలింగ్ ధ్రువీకరణ పత్రం విద్యార్థులకు అందజేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు పరిశీలన ప్రారంభించగా, 65 మంది అభ్యర్థులు హాజరయ్యారు. శనివారం గణితం, ఇంగ్లిష్ విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. ఆదివారం ఫిజకల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోమవారం సోషల్ స్టడీస్ అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు షెడ్యూల్ మేరకు ఆప్షన్లు ఇచ్చుకోవలసి ఉంటుంది. ఆదివారం గణితం, ఇంగ్లిష్, 29న ఫిజికల్సైన్స్, బయోలాజికల్సైన్స్, సోషల్ స్టడీస్ అభ్యర్థుల ఆప్షన్లు ఇచ్చుకోవాలి. కౌన్సెలింగ్ ప్రక్రియలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ హెచ్.సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఎన్.శ్రీనివాస్, జేఎల్.సంధ్యారాణి, రోణంకి శ్రీధర్, ప్రొఫెసర్ ఎం.ప్రభాకరరావు, జి.రామకృష్ణ పాల్గొన్నారు. -
మెరిసిన ‘స్వాతి’ముత్యం
ఎడ్‌సెట్‌లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు మేనమామ సహకారంతో చదువులో రాణింపు చీపురుపల్లి: ఎలాంటి ప్రత్యేక శిక్షణ తీసుకోకుండానే ఇంటిదగ్గరే చదువుకుంటూ అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్లిన చీపురుపల్లి పట్టణానికి చెందిన స్వాతిశ్రీదివ్య నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. పేదింటిలో జన్మించిన స్వాతిశ్రీదివ్య తాజాగా ఎడ్‌సెట్(గణితం)లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించి యువతకు మోడల్‌గా నిలిచింది. తండ్రి లేకపోయినప్పటికీ దిగులు చెందకుండా మేనమామ సహకారంతో చదువుకుంటూ ర్యాంకు సాధిం చడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కొత్తఅగ్రహారానికి చెందిన పట్నాల స్వాతిశ్రీదివ్య తండ్రి ఈశ్వరశాస్త్రి పట్టణంలోని ఆంజనేయపురంలో గల శ్రీ మారుతీ హరిహర క్షేత్రంలో ప్రధాన అర్చకునిగా పని చేసేవారు. 2015 జనవరిలో ఆయన అకస్మాత్తుగా మృతి చెందారు. అప్పటికి స్వాతిశ్రీదివ్య డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి మృతి చెందడంతో పిల్లల చదువులు ఆగిపోకుండా స్వాతిశ్రీదివ్య మేనమామ గౌరీశంకరశాస్త్రి వారి బాధ్యత తీసుకుని చదువులు కొనసాగేందుకు పూర్తి సహకారాన్ని అందించారు. ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు పట్టణంలోని పోలీస్‌లైన్ ప్రాథమిక పాఠశాలలోను, 7వ తరగతి నుంచి పదో తరగతి వరకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోను, ఇంటర్మీడియట్ శ్రీనివాసా జూనియర్ కళాశాలలోను స్వాతిశ్రీదివ్య చదువుకుంది. అనంతరం ఎంపీసీ గ్రూపులో డిగ్రీని శ్రీకాకుళం మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తిచేసింది. స్వాతిశ్రీదివ్య తమ్ముడు వెంకటసాయి చైతన్య ఇటీవల ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 470 మార్కులకు గాను 461 మార్కులు సాధించాడు. తండ్రి లేకపోయినప్పటికీ పిల్లలు చదువులో రాణించడం పట్ల తల్లి పద్మకుమారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. -
బీఈడీకి స్పందన అంతంతే..!
► బోధనావృత్తిపై తగ్గుతున్న ఆసక్తి ► ఎడ్‌సెట్‌కు తగ్గిన దరఖాస్తుల సంఖ్య ► గతేడాది 64 వేలు.. ఈ ఏడాది 45 వేలే.. సాక్షి, సిటీబ్యూరో: ఉపాధ్యాయ వృత్తి చేపట్టేందుకు ఉద్దేశించిన ఎడ్‌సెట్ కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గతంలో లక్షల్లో వచ్చే దరఖాస్తుల సంఖ్య.. ఇప్పుడు 50 వేలు దాటడమే గగనమైపోయింది. ఏడాదికేడాది గణనీయంగా ఆసక్తి క్షీణిస్తుండడంతో విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భావితరాలను మహోన్నతులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి.. ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని ఆవేదన చెందుతున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగిసింది. ఈ ఏడాది మొత్తం 45,313 ద రఖాస్తులు మాత్రమే అందాయి. గతేడాది 64 వేలకు పైగా అభ్యర్థులు పోటీపడగా.. చివరకు 13 వేల మంది మాత్రమే బీఈడీలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా 220 కళాశాలల్లో 20,200 సీట్లు అందుబాటులో ఉండగా.. అందులో 7 వేలకు పైగా సీట్లు మిగిలిపోవడాన్ని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 19 వేలకు పైగా దరఖాస్తుల సంఖ్య తగ్గడం బోధనా వృత్తిపై తగ్గుతున్న ఆసక్తికి ఉదాహ రణ. క్రేజీ తగ్గడానికి కారణాలు బీఈడీ చేసేందుకు గతేడాది నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం ఇవ్వగా.. ఈ ఏడాది నుంచి బీబీఎం, బీసీఏ, బీఎస్సీ (హోం సైన్స్) పట్టభద్రులకూ అవకాశం కల్పిస్తూ ఎన్సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) నిర్ణయం తీసుకుంది. అలాగే బీఈడీలో చేరడానికి ఉన్న గరిష్ట వయోపరిమితిని ఎత్తివేశారు. ఫలితంగా ఈ కోర్సుకు మరింత క్రేజ్ పెరగనుందన్న విద్యావేత్తల అభిప్రాయానికి భిన్నంగా దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2015-16 విద్యా సంవత్సరం నుంచి బీఈడీని రెండేళ్ల కోర్సుగా ఎన్సీటీఈ అమలు చేస్తోంది. బోధనలో నాణ్యత పెంచాలన్న సదుద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కోర్సు పట్ల విద్యార్థులు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. రెగ్యులర్ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ చేయకపోవడం, బీఈడీ చేసిన వారికి ఎస్జీటీకి అనర్హులుగా తేల్చడం, కోర్సులో చేరితే కచ్చితంగా తరగతులకు హాజరుకావాల్సి ఉండడం తదితర ఘటనలు.. ఈ వృత్తిపై ఆసక్తి క్షీణించడానికి కారణాలని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ సారి బయోమెట్రిక్.. ఎడ్‌సెట్ పరీక్షలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు చేపట్టామని కన్వీనర్ పి. ప్రసాద్ తెలిపారు. గతంలో ఒకరిబదులు మరొకరు పరీక్షకు హాజరైన ఘటనల నేపథ్యంలో ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈనెల 27న జరిగే ఎడ్‌సెట్‌కు హాజరయ్యే విద్యార్థుల ఫింగర్ ప్రింట్స్‌ని సేకరిస్తామన్నారు. పరీక్షకు గంట ముందు నుంచే ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. రాష్ర్టవ్యాప్తంగా 11 నగరాలు, పట్టణాల్లో మొత్తం 110 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.