
తెలంగాణలో పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. మార్చి 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుంతో మే 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. జూన్ 11 నుంచి 14 వరకు తెలంగాణ పీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను కాకతీయ యూనివర్శిటీ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు యూనివర్శిటీ వెల్లడించింది. జూన్ 1న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.