
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 11 నుంచి మే 20 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 11 నుంచి మే 20 వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది. మే 18 నుంచి 20 వరకు ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.