Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Again questioning AP Police Actions in Kutami Prabhutvam1
ఒక పోలీసు ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది?: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం(Red Book Constitution)తో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రశ్నించే స్వరం ఉండకూడదనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. అయితే ప్రతి చర్యకు ప్రతి చర్య తప్పక ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారాయన. గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తమకే కావాలని చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అధికార అహంకారం చూపుతున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికలు మొన్ననే 57 చోట్ల జరిగాయి. గెలిచే వాతావరణం లేక 7 చోట్ల ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారు. 50 చోట్ల ఎన్నిక జరిగితే 39 చోట్ల వైఎస్సార్‌సీపీనే గెలిచింది. పార్టీ శ్రేణులు, నాయకులు తెగింపుతో గట్టిగా నిలబడి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు మన పార్టీ కేడర్‌ను ఏమీ చేయలేకపోయారు... అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ(YSRCP) స్వీప్‌ చేసింది. అలాంటి చోట్ల బలం లేకపోయినా చంద్రబాబు అధికార అహంకారం చూపారు. పోలీసులను వాచ్‌మెన్లకంటే ఘోరంగా వాడుకున్నారు. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలో 10కి 9 చోట్ల గెలిచాం. మరి అక్కడ గెలవాల్సింది వైఎస్సార్‌సీపీ కదా?. అక్కడ ఎన్నికను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలకు భద్రత ఇవ్వాల్సింది పోయి, పోలీసులే ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు చేశారు. రామగిరి ఎస్సై(Ramagiri SI) ఎంపీటీసీల వాహనం ఎక్కాడు. వీడియో కాల్‌లో ఎమ్మెల్యేతోనూ, ఎమ్మెల్యే కుమారుడితోనూ బెదిరించారు. టీడీపీకి అనుకూలంగా ఓటేయమని బెదిరించారు. మన పార్టీ ఎంపీటీసీలు ఎన్నిక సమయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వేరే మండల కేంద్రానికి తీసుకెళ్లి బైండోవర్‌ చేసే కార్యక్రమం చేశారు. దీనికి వ్యతిరేకంగా ధర్నాచేస్తే మన పార్టీ జిల్లా అధ్యక్షురాలి మీద, ఇన్‌ఛార్జిమీద కేసులు పెట్టారు. దీని తర్వాత మన పార్టీ తరఫున యాక్టివ్‌గా ఉన్న లింగమయ్యను హత్యచేశారు. ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది? అని జగన్‌ ప్రశ్నించారు. ప్రజలు ప్రశ్నిస్తారని చంద్రబాబుగారు, ఆయన పార్టీ దారుణాలకు దిగుతోంది. ప్రశ్నించే స్వరం ఉండకూడదని రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. కానీ, ప్రతి చర్యకు, ప్రతి చర్య ఉంటుంది. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడితే.. అంతే వేగంతో అది పైకి లేస్తుంది. ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్‌కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారు. ఏపీ, తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చే తీర్పులు చూశాం. ఈపక్కన ప్రజలు తంతే.. ఆ పక్కన పడతారు. చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి అని ఉమ్మడి కర్నూలు కేడర్‌ను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ అన్నారు.

Tahawwur Rana Extradition Live Updates2
భారత్‌కు చేరుకున్న తహవూర్‌ రాణా.. ఢిల్లీలో హైఅలర్ట్‌

న్యూఢిల్లీ, సాక్షి: 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్‌ రాణా ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో గురువారం మధ్యాహ్నాం ల్యాండయ్యింది. దీంతో దేశ రాజధాని రీజియన్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే తహవూర్‌ రాణాను ఎన్‌ఐఏ అధికారికంగా అరెస్టు చేసినట్లు సమాచారం. అనంతరం ఎన్‌ఐఏ కోర్టుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఎన్‌ఐఏ న్యాయమూర్తి 2008 ముంబై ఉగ్రదాడి కేసు విచారించనున్నారు. విచారణ అనంతరం.. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు తీహార్‌ జైలుకు తరలిస్తారా? లేదంటే మరోచోట ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా, 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ మరుసటి ఏడాది FBI అతన్ని అరెస్టు చేసింది. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. అయితే ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక.. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో తహవూర్ రాణా(Tahavur Rana)ను భారత్‌కు అప్పగించడానికి అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోదించారు. దీంతో ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే.. ఆ తర్వాత కూడా భారత్‌కు తరలించే అంశంపై రాణా ఊరట కోసం ప్రయత్నించినప్పటికీ.. దారులన్నీ అప్పటికే మూసుకుపోయాయి.

TDP MLA Ganta Srinivasa Rao Verbal Abuse On Sanitary Inspector3
పళ్లు రాలగొడతా రాస్కెల్.. టీడీపీ ఎమ్మెల్యే గంటా తిట్ల పురాణం

సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహనం కోల్పోయారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవిపై నోటి దురుసు ప్రదర్శించారు. పళ్లు రాలగొడతా రాస్కెల్ అంటూ తిట్లు లంకించుకున్నారు. గాడిదలను కాస్తున్నారా? కళ్లు కనిపించడం లేదా అంటూ తిట్ల దండకం అందుకున్నారు. గురువారం ఆయన ఎండాడలో పర్యటించారు. తాగేందుకు నీరు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవంటూ ఎమ్మెల్యేను నిలదీశారు.వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఒక వైపు.. సంక్షేమ పథకాలను అందించడం లేదు. మరో వైపు.. అభివృద్ధి కూడా జరగడం లేదు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక.. ఆ అధికారిపై గంటా నోరు పారేసుకున్నారు. గంటా తీరు పట్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, మంగళవారం.. మున్సిపల్‌ కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ స్థానికంగా నివాసం ఉంటున్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే గంటాకు ఈ అంశంపై వినతిపత్రం ఇచ్చేందుకు ఎంవీపీ కాలనీ సెక్టార్‌– 4లోని ఆయన ఇంటికి వెళ్లారు.ఆయన ఇంట్లోనే ఉన్నప్పటికీ వినతిపత్రం స్వీకరించేందుకు బయటకు రాలేదు. గంటన్నర పాటు నిరీక్షించినా.. స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు గంటాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన తీవ్రం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం గంటా పీఏలు అక్కడికి వచ్చి వినతిపత్రం తమకు ఇవ్వాలని కోరినా కార్మికులు అంగీకరించలేదు.ఓ ప్రజాప్రతినిధి అయివుండీ కార్మికుల సమస్యలు వినడానికి ముందుకు రాకపోవడం దురదృష్టకరమని ఆక్షేపించారు.

AP High Court Angry With Sullurpet Police Granted Relief to Posani4
అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయి?.. సూళ్లూరుపేట పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

అమరావతి, సాక్షి: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారన్న కేసులో సూళ్లూరుపేట పోలీసులు పోసానిని విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తదుపురి చర్యలు నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం స్టే జారీ చేసింది. సూళ్ళూరు పేట పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. కేసుపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో కేసులో విచారణ అధికారిగా ఉన్న సీఐ మురళీ కృష్ణపై న్యాయస్థానం ఆగ్రహాం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను మీరి దర్యాప్తు అధికారి(IO) వ్యవహరించారని, కేసులో అదనంగా 111 సెక్షన్ పాటు మహిళను అసభ్యంగా చిత్రీకరించారని సెక్షన్లు నమోదు చేశారని పేర్కొంది. అసలు ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీఐ మురళీ కృష్ణకు ఫాం-1 నోటీసు జారీ చేసింది. రిప్లై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇస్తూ ఈ నెల 24కి పోసాని పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది.

Jack Movie Review And Rating In Telugu5
Jack Movie Review: ‘జాక్‌’ మూవీ హిట్టా? ఫట్టా?

డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్‌ చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకొని ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు స్టార్‌ బాయ్‌ సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda). హ్యాట్రిక్‌ హిట్‌ కోసం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జాక్‌’తో నేడు(ఏప్రిల్‌ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి సిద్ధు ఖాతాలో హ్యాట్రిక్‌ హిట్‌ పడిందా లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. పాబ్లో నెరుడా అలియాస్‌ జాక్‌ (సిద్ధు జొన్నలగడ్డ) రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌ కావాలని కలలు కంటాడు. తనకున్న టాలెంట్‌ అంతా ఉపయోగించి ఇంటర్వ్యూ వరకు వెళ్తాడు. ఆ రిజల్ట్‌ రాకముందే ఖాలీగా ఉండడం ఎందుకని దేశాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. ఉగ్రవాదులు, హైదారాబాద్‌తో పాటు భారత్‌లోని ఇతర ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్‌ చేస్తున్నారనే విషయం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు జాక్‌ ఏం పని చేస్తున్నాడో కనుక్కోమని ప్రైవేట్‌ డిటెక్టివ్‌ అఫిషాన్‌ బేగం (వైష్ణవి చైతన్య)కు లక్ష రూపాయలు ఇస్తాడు అతని తండ్రి పాన్‌ ఇండియా ప్రసాద్‌(నరేశ్‌). అఫిషాన్‌ బేగం భానుమతి పేరుతో జాక్‌కి దగ్గరై జాక్‌ పనిపై నిఘా పెడుతుంది. టెర్రరిస్టులను పట్టుకునే క్రమంలో పొరపాటున ‘రా’ఏజెంట్‌ మనోజ్‌(ప్రకాశ్‌ రాజ్‌)ని కిడ్నాప్‌ చేస్తాడు జాక్‌. ఆ తర్వాత ఏం జరిగింది? టెర్రరిస్ట్‌ గ్యాంగ్‌ని జాక్‌ పట్టుకోగలిగాడా లేదా? అసలు జాక్‌ ‘రా’ ఏజెంట్‌ కావాలని ఎందుకు అనుకున్నాడు? చివరకు తను కోరుకున్న ఉద్యోగం పొందగలిగాడా లేదా? అనేదే తెలియాలంటే జాక్‌(Jack Movie Review) సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఒక శిలై ఉన్నానని భూమి కుంగునా?నేనొక శిల్పానని దైవం తుళ్లునా?మలిచిన శిల్పం, మలచని రాయి ఈ రెంటిలోన గొప్పది ..శిల్పమా? శిలా? ఏ జవాబు అందినా పోరు ఆగేదేనా..? రెండిటి మధ్యన..!.. సినిమా ఎండింగ్‌లో బొమ్మరిల్లు భాస్కర్‌ చెప్పిన ‘రాయి – శిల్పం’ థియరీ ఇది. ఇందులో నిజంగానే ఏది గొప్పదో చెప్పలేం కానీ ఈ సినిమా విషయంలో మాత్రం శిల్పి(దర్శకుడు) లోపం చాలానే ఉంది. మంచి రాయి( హీరో) ఉన్నప్పటికీ దాన్ని అందమైన శిల్పంగా మార్చడంలో తడబడ్డాడు. బొమ్మరిల్లు భాస్కర్‌ తన స్టైల్‌ కథను పక్కకు పెట్టి తీసిన సినిమా ఇది. ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ రాసుకున్నాడు. హీరో పాత్రను కూడా ఆసక్తికరంగానే తీర్చిదిద్దాదు. కానీ కథనం విషయంలో జాగ్రత్త పడలేదు. దేశానికి ముందుడి ప్రమాదం రాకుండా ఆపేదే ‘రా’ అంటూ ‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్’ గురించి గొప్పగా చెప్పిన భాస్కర్‌.. కథలో మాత్రం ‘రా’ ఏజెంట్లను కమెడియన్ల కంటే తక్కువ చేసి చూపించారు. ‘రా’ , ఉగ్రవాదం ..ఇలాంటి కథలను సీరియస్‌గా చెప్తేనే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ భాస్కర్‌ సీరియస్‌ సబ్జెక్ట్‌ ఎంచుకొని దానికి కామెడీ టచ్‌ ఇచ్చాడు. ఇది పూర్తిగా సఫలం కాలేదు. మదర్‌ సెంటిమెంట్‌ ఉన్నప్పటికీ.. దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయాడు.‘వీడు కొంచెం క్రాక్’ అని సినిమాకు పెట్టిన ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే హీరో క్యారెక్టర్‌ని మలిచాడు. ఫస్టాఫ్‌ అంతా ఫన్‌వేలో నడుస్తుంది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం క్రాక్‌గానే అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో బలమైన సన్నివేశాలు లేనప్పటికీ స్క్రీన్‌ప్లేతో నెట్టుకొచ్చాడు. ఇంటర్వెల్‌ సీన్‌ అయితే మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. నేపాల్‌ ఎపిసోడ్‌ కొంతమేర ఆకట్టుకున్నా.. టెర్రరిస్టులతో జరిగే యాక్షన్‌ డ్రామా రక్తి కట్టించదు. బలమైన కథ లేకపోవడంతో ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. బొమ్మరిల్లు భాస్కర్‌ ఈ శిల్పాన్ని మరింత అందంగా చెక్కాల్సింది.ఎవరెలా చేశారంటే..డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో యూత్‌ని ఆకట్టుకున్న సిద్ధు..మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కొంచెం క్రాక్‌ ఉన్న జాక్‌ పాత్రకు న్యాయం చేశాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. క్లైమాక్స్‌లో ఫైట్‌ కూడా చేశాడు. అయితే జాక్‌ మాటలు, బిహేవియర్‌ చూస్తే ‘టిల్లు’ వద్దన్నా గుర్తుకు వస్తాడు. వైష్ణవి చైతన్య కు స్క్రీన్‌ స్పేస్‌ ఎక్కువే ఉన్నప్పటికీ ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. నటన పరంగాను మెప్పించడానికి అక్కడ స్కోపే లేదు. ఏదో హీరోయిన్‌ ఉండాలి కాబట్టి ఆ క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశారు. ‘రా’ ఏజెంట్‌ మనోజ్‌గా ప్రకాశ్‌ రాజ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆయన పాత్రను అటు సీరియస్‌గాను..ఇటు పూర్తి కమెడియన్‌గాను మల్చలేక రెండింటికి మ‌ధ్య ఊగిస‌లాడేలా తీర్చిదిద్దారు. సుబ్బరాజు పాత్ర కూడా అంతే. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పాటలు అంతగా గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

Look At Prithvi Shaw: Ex Pak Cricketer Strong Warning To Yashasvi Jaiswal6
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. జాగ్రత్త!

ఐపీఎల్‌ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్న ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) ఒకడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ తన అద్భుత ఆట తీరుతో టెస్టుల్లో భారత జట్టు ఓపెనర్‌గా పాతుకుపోయాడు.అరంగేట్రంలోనే శతక్కొట్టిన జైసూ.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 19 టెస్టుల్లో 1798 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు.. రెండు డబుల్‌ సెంచరీలు కూడా విశేషం. టెస్టుల తర్వాత టీ20లలోనూ అరంగేట్రం చేసిన జైస్వాల్‌.. ఇప్పటికి 23 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని 723 పరుగులు సాధించాడు. అయితే, దాదాపు ఏడాది కాలంగా మళ్లీ టీ20 జట్టులో అతడికి చోటు దక్కలేదు.మరోసారి విఫలంగతేడాది ఐపీఎల్‌లోనూ యశస్వి జైస్వాల్‌ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున పదహారు ఇన్నింగ్స్‌లో కలిపి 435 పరుగులు చేయగలిగాడు. ఇక ఐపీఎల్‌-2025 (IPL 2025)లో మాత్రం ఇంత వరకు తన మార్కు చూపలేకపోయాడు. తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు.అహ్మదాబాద్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులే చేశాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్‌ మొత్తంగా 107 (1, 29, 4, 67, 6 )పరుగులే చేశాడు. అంతకు ముందు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లోనూ జైసూ తన స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాడు.తొలి టెస్టులో సెంచరీ (161), ఆఖరి టెస్టులో హాఫ్‌ సెంచరీలు (82, 84) మినహా.. ఆ తర్వాత పెద్దగా రాణించలేదు. తర్వాత రంజీ బరిలో దిగి విఫలమయ్యాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌ సందర్భంగా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చి జైస్వాల్‌.. అరంగేట్రంలోనే తేలిపోయాడు. తన మొదటి వన్డేలో కేవలం పదిహేను పరుగులే చేశాడు.పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు.. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ యశస్వి జైస్వాల్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడి కడుపు నిండిపోయింది. అంటే.. ఇప్పటి వరకు సాధించిన దానితో సంతృప్తి పడిపోయాడు. జైస్వాల్‌ ప్రస్తుతం క్రికెట్‌పై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు.అతడికి ఇదే నా సందేశం.. క్రికెట్‌ను నిన్ను గొప్ప స్థాయికి చేర్చగలదు. అదే సమయంలో.. అదే రీతిలో ఏడిపించగలదు కూడా! ఒక్కసారి పృథ్వీ షా పరిస్థితి చూడు. ఇప్పటికైనా మునుపటిలా క్రికెట్‌ను ప్రేమించు. అదే ప్యాషన్‌తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టు’’ అని బసిత్‌ అలీ జైసూకు సూచించాడు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. జైస్వాల్‌ స్థానం గల్లంతు కావడం ఖాయమని పేర్కొన్నాడు.విరాట్‌ కాస్త తొందరపడ్డాడు.. కానీభారత్‌లో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు కొదువలేదని.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో కొత్త స్టార్లు పుట్టుకు వస్తున్నారు కాబట్టి జైసూ ఇప్పటికైనా జాగ్రత్తపడాలని బసిత్‌ అలీ సలహా ఇచ్చాడు. ఇక ఈ సందర్భంగా.. ‘‘అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలిగి రోహిత్‌, విరాట్‌ మంచి పని చేశారు.నాకైతే విరాట్‌ కాస్త తొందరపడ్డాడు అనిపించింది. అయితే.. సరైన సమయంలో అతడు సరైన నిర్ణయమే తీసుకున్నాడు. ఇండియాలో ప్రతిభకు కొదువలేదు. యువ ఆటగాళ్లు దూసుకువస్తున్న తరుణంలో ఈ ఇద్దరు రిటైర్మెంట్‌ ప్రకటించి వారికి మార్గం సుగమం చేశారు’’ అని బసిత్‌ అలీ పేర్కొన్నాడు. కాగా చిన్న వయసులోనే సత్తా చాటి భారత్‌కు అండర్‌-19 వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్‌ పృథ్వీ షా.. టీమిండియా ఓపెనర్‌గా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వ్యక్తిగతంగానూ క్రమశిక్షణ లోపించి ఐపీఎల్‌ వేలంలో కూడా అమ్ముడుపోని స్థితికి దిగజారిపోయాడు.చదవండి: అతడికి కాస్త మర్యాద నేర్పండి.. చీప్‌ జోకులు వద్దు: సెహ్వాగ్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

Don't give special treatment, biryani to Tahawwur Hussain Rana7
రాణాకు వీఐపీ ట్రీట్మెంట్‌.. బిర్యానీలతో మేపొద్దు

న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి,లష్కరే తోయిబా ఉగ్రవాది తహవుర్‌ రాణా (Tahawwur Hussain Rana) భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన తహవుర్‌ రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండయ్యింది. ఈ తరుణంలో రాణాకు జైల్లో వీఐపీ ట్రీట్మెంట్‌ అంటే ప్రత్యేక సెల్‌, బిర్యానీ వంటి వీఐపీ ట్రీట్మెంట్‌ ఇ‍వ్వకూడదని, అతన్ని ఉరితీయాలని దేశ ప్రజలు సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.తహవూర్‌ రాణాను ఉరితీయాలివారిలో 2008లో ముంబై ఉగ్రవాద దాడుల నుండి అనేక మందిని ప్రాణాలు కాపాడిన స్థానిక టీసెల్లర్‌ ఛోటు చాయ్ వాలా అలియాస్‌ మహ్మద్ తౌఫిక్ సైతం ఉన్నారు. ఉగ్రవాదులను అంతం చేయాలంటే దేశంలో కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పీటీఐతో మాట్లాడారు. అజ్మల్ కసబ్‌కు ఇచ్చినట్లుగా తహవూర్‌ రాణాకు ప్రత్యేక సెల్ లేదా, బిర్యానీ, ఇతర సౌకర్యాలు అందించాల్సిన అవసరం లేదన్నారు#WATCH | Mumbai: On 26/11 Mumbai attacks accused Tahawwur Rana's extradition to India, Mohammed Taufiq, a tea seller known as 'Chhotu Chai Wala' whose alertness helped a large number of people escape the attack, says, "...For India, there is no need to provide him with a cell.… pic.twitter.com/zLqHEt7sHs— ANI (@ANI) April 9, 2025‘రాణాను భారత్‌కు తీసుకుని రావడం శుభపరిణామం. కానీ అతనిని 15 రోజుల్లో లేదా రెండు మూడు నెలల్లో బహిరంగంగా ఉరితీయాలి. ఇలాంటి ఉగ్రవాదులకు ఎటువంటి ప్రత్యేక వసతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అజ్మల్‌ కసబ్‌కు జైల్లో అందించిన వీఐపీ ట్రీట్మెంట్‌ ఇవ్వకూడదు. ఇలాంటి వారిపై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వృధా. రాణాను ఉరితీసేవరకు తాను ఎదురు చూస్తాను. నాటి ఉగ్రదాడి బాధితులకు ప్రభుత్వం సహాయం అందించింది. కానీ డబ్బుతో ప్రాణాల్ని తిరిగి తెచ్చుకోలేం కదా?’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తహవూర్‌ రాణాను భారత్‌కు అప్పగించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రమూకల నుంచి ప్రజల్ని కాపాడి2008 నవంబర్‌లో ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్‌ సమీపంలో మహ్మద్ తౌఫిక్ టీ స్టాల్ నడుపుతున్నారు.ఆ సమయంలో ఉగ్రవాదులు దాడిలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజల్ని చూసిన తౌఫిక్‌ అప్రమత్తమయ్యారు.వెంటనే వారిని ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని,జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారిని సురక్షితంగా ఉగ్రవాదుల నుంచి తప్పించారు. అప్పటికే ముష్కరుల చేతిలో గాయపడిన బాధితుల్ని ఆస్పత్రి తరలించారు.

American Woman Experiences Periods For Over 1000 Days8
వెయ్యి రోజులకు పైగా పీరియడ్స్‌..వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!

సాధారణంగా మహిళలకు రుతుక్రమం నెలలో ప్రతి 27 నుంచి 35 రోజుల్లో వస్తుంది. ఇలా వస్తే ఆరోగ్యంగా ఉన్నట్లుగా పరిణిస్తారు వైద్యులు. కొందరికి హార్మోన్ల ప్రాబ్లం వల్ల రెండు నెలలకొకసారి లేదా ఇర్‌ రెగ్యులర్‌ పీరియడ్స్‌ సమస్యతో బాధపడతారు. ఇది ప్రస్తుత జీవన విధానం, శారీరక శ్రమ లేని ఉద్యోగాలు, కాలుష్యం తదితరాల కారణంగా చాలామంది టీనేజర్లు, మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. ఐతే ఈ మహిళకు మాత్రం మూడేళ్లకు పైగా నిరంతరం రక్తస్రావం(లాంగ్‌ పీరియడ్‌ సైకిల్‌) కొనసాగుతోంది . దాని కారణంగా ఆమె దారుణమైన శారీరక మానసిక సమస్యలతో నరకం అనుభవిస్తోంది. అసలు జీవితంలో ఒక్కసారైనా ఆ ఎరుపురంగుని చూడని రోజు ఉంటుందా..? అని కన్నీరుమున్నీరుగా విలపిస్తోందామె.అమెరికాకు చెందిన టిక్‌టాక్‌​ యూజర్‌ పాపీ వెయ్యి రోజులకు పైగా కొనసాగిన అసాధారణ సుదీర్ఘ రుతుక్రమం బాధను షేర్‌ చేసుకున్నారు. తాను వైద్యులను సంప్రదించినప్పటికీ..అది ఓ మిస్టరీలానే మిగిలపోయిందని వాపోయింది. ప్రతి మహిళలకు సాధారణంగా ప్రతి 21 నుంచి 35 రోజులకు ఒకసారి రుతక్రమం వస్తుంది. రెండు నుంచి ఏడు రోజుల వరకే రక్తస్రావం అవుతుంది. కొందరికి జీవనశైలి, ఒత్తిడి, తగిన వ్యాయమాం లేకపోవడం వల్ల ఇర్‌రెగ్యులర్‌గా వచ్చిన మహా అయితే ఓ 15 నుంచి 20 రోజుల అవుతుందేమో. అది కూడా కొందరికే. ఇది సాధరణమైన సమస్యే. అయితే వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఏర్పడుతుంది అంతే. కానీ పాపీకు మాత్రం వెయ్యి రోజులకు పైగా ఆ రక్తస్రావం(పీరియడ్‌) కొనసాగుతోందట. అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల రెండు వారాలు కొనసాగుతుందట రక్తస్రావం. వైద్యుల సైతం ఆమె పరిస్థితి చూసి ఖంగుతిన్నారట. ఆమె పలు వైద్య పరీక్షలు చేసి ఎందుకు ఇలా జరుగుతుందో కనుగొనే యత్నం చేశారు. అండాశయంపై తిత్తులు ఉన్నట్టు గుర్తించారు గానీ, దానివల్ల ఇంతలా రక్తస్రావం జరగదనే చెబుతున్నారు వైద్యులు. మరేంటి కారణం అనేది అంతుపట్టడం లేదు వైద్యులకు. దీనికారణంగా పాపీ ఐరన్‌ విటమిన్‌ని అధిక స్థాయిలో కోల్పోయి తిమ్మిర్లు, కండరాలు, ఎముకల సమస్యలతో విలవిలలాడుతున్నట్లు తెలిపారు. అయితే ఆమెకు పీసీఓసీ ఉందని నిర్థారణ అయ్యినప్పటికీ..ఇంతలా రక్తస్రావం జరగడానికి ప్రధాన కారణం ఏంటన్నది నిర్థారించలేకపోయారు. చివరికి హిస్టెరోస్కోపీ నిర్వహించారు, గర్భ నిరోధక ఐయూడీని కూడా చొప్పించారు. ఇవేమీ ఆ సమస్యకు ఉపశమనం కలిగించలేదు. ఇలా ఎన్నో వైద్యపరీక్షలు, వివిధ చికిత్సలు, మందులు తీసుకున్నప్పటికీ తీవ్ర రక్తస్రావం సమస్యను అరికట్టలేదు. అల్ట్రాసౌండ్‌, ఎంఆర్‌ఐ వంటి స్కానింగ్‌లలో సైతం కారణం ఏంటన్నది చూపించలేకపోయాయి. చివరికి తన టిక్‌టాక్‌ ఫాలోవర్స్‌ సాయంతో తన సమస్యకు గల కారణాన్ని తెలుసుకుని నివ్వెరపోయింది.ఇంతకీ ఎందువల్ల అంటే..ఆమెకు బైకార్న్యుయేట్ గర్భాశయం అనే అరుదైన పరిస్థితి ఉందని తెలుసుకుంది. దీన్ని గుండె ఆకారపు గర్భాశయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ గర్భాశయం ఒకటి కాకుండా రెండు గదులుగా వేరుచేయబడి ఉంటుంది. ఈ పరిస్థితి.. నూటికి ఒకరో, ఇదరినో ప్రభావితం చేసే అరుదైన సమస్య అట. ఈ పరిస్థితితో ఉన్న చాలా మంది మహిళలకు ఇలానే రక్తస్రావం జరగుతుందా అంటే..ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు ఉంటాయని ఫాలోవర్‌ వివరించడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది. ఇన్నాళ్లకీ తన సమస్యకు ప్రధాన కారణం ఏంటన్నది తెలుసుకోగలిగానని సంబరపడింది. ఇన్నాళ్లు దాదాపు 950 రోజులు పీరియడ్స్‌ ప్యాడ్లలకే డబ్బులు వెచ్చించి విసుగొచ్చేసింది. ఇక ఆ సమస్య ఎందువల్లో తెలుసుకోగలిగాను కాబట్టి..పరిష్కారం దిశగా అగుడులు వేస్తానంటోంది పాపీ. ప్రస్తుతం ఆమె వైద్యులను సంప్రదించి.. తన గుండె ఆకారపు గర్భాశయాన్ని సరిచేసే శక్తచికిత్స గురించి తెలుసుకునే పనిలో ఉంది. అంతేగాదు ఇది గనుక విజయవంతమైతే..ఎరుపు రంగు చూడని స్వర్గం లాంటి రోజులను పొందగలుగుతానంటోందామె. (చదవండి: ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం)

Anand Mahindra Tweet About Dr Nayar9
470 ఎకరాల అడవిని నిర్మించిన నాయర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్

తన ఎక్స్ ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే.. దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. మియావాకి అడవి అంటే ఏమిటో నాకు తెలుసు, కానీ డాక్టర్ నాయర్ గురించి తెలియదు అని పోస్ట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక అడవిని చూడవచ్చు. భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకి అడవిని డాక్టర్ నాయర్ ఎలా సృష్టించారో నాకు తెలియదు. సుస్థిరతకు ప్రాధాన్యం లేని ఈ రోజుల్లో.. మన మధ్య ఇలాంటి హీరోలు ఉండటం గర్వకారణం అని ఆయన ట్వీట్ చేశారు.నాయర్ నిర్మించిన అడవిగుజరాత్‌లోని కచ్‌లో నాయర్ సుమారు 470 ఎకరాల విస్తీర్ణంలో అడవిని నిర్మించారు. ఇందులో 3,00,000 కంటే ఎక్కువ చెట్లు ఉన్నాయి. ఈ అడవిని జపనీస్ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకి టెక్నాలజీ సాయంతో అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిలో సహజ పర్యావరణ వ్యవస్థలను అనుకరించడానికి వివిధ రకాల స్థానిక వృక్ష జాతులను దగ్గరగా నాటడం జరుగుతుంది. దీని ఫలితంగా ఇవి సాధారణ మొక్కలకంటే 10 రెట్లు వేగంగా పెరుగుతాయి.ఎవరీ డాక్టర్ నాయర్డాక్టర్ నాయర్ పర్యావరణవేత్త & ఎన్విరో క్రియేటర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. 2014లో ఈయన 1500 చెట్లతో.. మియావాకి అడవిని ప్రారభించడం మొదలుపెట్టారు. ఇలాంటి అడవులను ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ నిర్మించారు. వీటిలో చెప్పుకోదగ్గది కచ్‌లోని స్మృతివన్ మియావాకి అడవి. దీనిని 2001 గుజరాత్ భూకంప బాధితులకు నివాళిగా నిర్మించారు. కాగా 2030 నాటికి 100 కోట్ల చెట్లను నాటడమే లక్ష్యంగా డాక్టర్ నాయర్ ముందుకు సాగుతున్నారు.మియావాకి పద్దతి1970లో జపనీస్ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకి ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో మొక్కలను దగ్గరదగ్గరగా నాటుతారు. కాబట్టి ఇవి సాధారణ చెట్ల కంటే 10 రేట్లు వేగంగా పెరుగుతాయి. ఈ పద్దతిలో మొక్కలను పెంచడం వల్ల మట్టి కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలుస్తోంది.I knew what a Miyawaki forest was but had no idea about Dr Nair and how he had created the world’s largest such forest in India. At a time when the U.S has taken sustainability off its priority list I am just grateful that we have such heroes amongst us…👏🏽👏🏽👏🏽 pic.twitter.com/WNra4TnhVP— anand mahindra (@anandmahindra) April 9, 2025

Michelle Obama Finally Open Up On Divorce Rumours10
Michelle Obama: ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా(barack obama) సతీమణి మిషెల్లీ విడాకుల ప్రచారంపై ఎట్టకేలకు పెదవి విప్పారు. గత కొంతకాలంగా దేశ మాజీ ప్రథమ పౌరురాలి హోదాలో ఆమె పలు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని బహిరంగంగా బరాక్‌ ఖండించినప్పటికీ.. మిషెల్లీ మాత్రం ఎక్కడా స్పందించకపోవడంతో ఆ అనుమానాలు కొనసాగుతూ వచ్చాయి.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన టైంలో, అంతకు ముందు మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు మిషెల్లీ ఒబామా(michelle obama) గైర్హాజరు అయ్యారు. మాజీ అధ్యక్షులు అయినప్పటికీ సతీసమేతంగా(ఫస్ట్‌ లేడీ కాబట్టి) హాజరు కావడం అక్కడి ఆనవాయితీ. అయితే బరాక్‌ ఒబామా ఒంటరిగా ఆ కార్యక్రమాలకు హాజరు కావడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారాన్ని ఒబామా గత నాలుగు నెలల కాలంలో విడాకుల రూమర్లను(Divorce Rumours) రెండుసార్లు ఖండించారు. ఇప్పుడు మిషెల్లీ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై స్పందించారు.నటి సోఫియా బుష్‌ నిర్వహించే పాడ్‌కాస్ట్‌లో మిషెల్లీ మాట్లాడుతూ.. విడాకుల ప్రచారాన్ని తోసిపుచ్చారు. తన గురించి ఆలోచించే సమయం తనకు ఇప్పటికి దొరికిందని.. అందుకే అధికారిక కార్యక్రమాలకు, రాజకీయపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారామె. ‘‘గత ఎనిమిదేళ్లలో నా జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. కుమార్తెలు పెద్దవాళ్లు అయ్యారు. నా గురించి ఆలోచించుకోవడానికి ఇప్పటికైనా నాకు సమయం దొరికింది. నాకు ఏది మంచో అదే చేయాలనుకుంటున్నా. అంతేకానీ ఇతరులు ఏమనుకుంటున్నారో అది చేయడం కాదు’’ అని అన్నారామె.ఇక్కడ.. ఒక మహిళకు ఉండే స్వేచ్ఛ కోణంలో ఎవరూ ఆలోచించలేకపోయారు. మహిళలుగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవే. ఆమె తన కోసం ఆలోచిస్తోందని, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రజలు గ్రహించలేకపోయారు. కేవలం భర్త నుంచి విడిపోతోందనే చర్చించుకున్నారు అని మిషెల్లీ అన్నారు.ఇదిలా ఉంటే.. ఏప్రిల్‌ 3వ తేదీన హమిల్టన్‌ కాలేజీలో ఓ ఈవెంట్‌కు హాజరైన బరాక్‌ ఒబామా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షునిగా పదవిలో కొనసాగిన కాలంలో పని ఒత్తిడి కారణంగా భార్యతో సఖ్యత చెడిందని బరాక్‌ ఒబామా ఒప్పుకున్నారు. నాటి మనస్పర్ధలను తొలగించుకుంటూ నేడు ఆనందంగా జీవిస్తున్నామన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement