ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం నగరాల్లో శుక్రవారం జరిగే ఎడ్‌సెట్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఖమ్మం, కొత్తగూడెం ఎడ్‌సెట్ కో ఆర్డినేటర్లు ప్రొఫెసర్ కనకాచారి, ప్రొఫెసర్ కె. శౌరీ తెలిపారు. విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు ఖమ్మంలో 15 సెంటర్లు, కొత్తగూడెంలో ఏడు సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఖమ్మంలో 6,781 మంది, కొత్తగూడెంలో 2,397.. జిల్లాలో మొత్తం 9,178 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు వివరించారు.
విద్యార్థులకు అన్ని వసతులు కల్పించామని అన్నారు. పోలీస్, మున్సిపాలిటి, ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడి వారి సేవలను కోరామని చెప్పారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశామని, మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చూడాలని కఠినమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు పర్యవేక్షకులుగా వచ్చారని వివరించారు.
విద్యార్థులకు సూచనలు..
పరీక్ష సమయానికి ముందుగానే కేంద్రానికి రావాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రం లోనికి అనుమతించరు
విద్యార్థులు హాల్‌టికెట్, హెచ్‌బీ పెన్సిల్, బాల్‌పాయింట్‌పెన్, ఎరైజర్, షార్పనర్ తెచ్చుకోవాలి
సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష హాల్‌లోకి తీసుకురాకూడదు
హాల్ టికెట్ రానివారు, డౌన్‌లోడ్ చేసుకున్న దానిపై ఫొటో రానివారు ఫీజు చెల్లించిన రశీదు, గుర్తింపు కార్డు, రెండు పాస్‌పోర్ట సైజ్ ఫొటోలు తీసుకొచ్చి పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ నుంచి డూప్లికేట్ హాల్ టికెట్ తీసుకోవచ్చని కనకాచారి, శౌరీ వివరించారు.
నేడే ఎడ్‌సెట్
Published Fri, May 30 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM
Advertisement
Advertisement