ఏపీ సెట్‌.. ఈజీగా అప్లై చేసుకోండి ఇలా.. | APCET, AP ICET, EAPCET, ECET, EDCET, LAWCET 2021 Notifications, Full Details Here | Sakshi
Sakshi News home page

ఏపీ.. సెట్స్‌కు వేళాయె!

Published Tue, Jul 20 2021 8:10 PM | Last Updated on Tue, Jul 20 2021 8:20 PM

APCET, AP ICET, EAPCET, ECET, EDCET, LAWCET 2021 Notifications, Full Details Here - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించనున్న పలు కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిల్లో ఏపీ ఈఏపీసెట్, ఏపీఈసెట్, ఏపీ ఐసెట్, ఏపీ ఎడ్‌సెట్, ఏపీ పీజీఈసెట్, ఏపీ లాసెట్‌ తదితరాలు ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఆయా సెట్‌లకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. సదరు ఏపీ సెట్‌లకు అర్హతలు, ప్రవేశం కల్పించే కోర్సులు, ప్రవేశ పరీక్షల విధానంపై ప్రత్యేక కథనం...  

ఏపీ ఈఏపీసెట్‌

► ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్‌(ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)–2021కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే ఎంట్రన్స్‌ టెస్టు.. ‘ఈఏపీసెట్‌’ (పూర్వపు ఎంసెట్‌). ఈ ఏడాది ఈఏపీసెట్‌ను జేఎన్‌టీయూ, కాకినాడ నిర్వహిస్తోంది. 

► ప్రవేశం కల్పించే కోర్సులు: ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌(డెయిరీ టెక్నాలజీ), బీటెక్‌(అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌), బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ. 

అర్హతలు
► ఇంజనీరింగ్, ఫార్మసీ(ఎంపీసీ), ఫార్మా డీ, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ ఉత్తీర్ణత/తత్సమాన అర్హత ఉండాలి. డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

► బీఎస్సీ అగ్రికల్చర్‌/బీఎస్సీ హార్టికల్చర్‌/బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/బీఎఫ్‌ఎస్సీ /బీటెక్‌ (ఎఫ్‌ఎస్‌టీ)/బీఎస్సీ(సీఏ అండ్‌ బీఎం)/బీఫార్మసీ/బీటెక్‌(బయోటెక్నాలజీ)(బైపీసీ), ఫార్మా డీ(బైపీసీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్‌ బైపీసీ/తత్సమాన అర్హత ఉండాలి. 

► ఇంజనీరింగ్‌ పరీక్ష విధానం: ఇంజనీరింగ్‌ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌ ) విధానంలో జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్‌ నుంచి 80 ప్రశ్నలు–80మార్కులకు, ఫిజిక్స్‌ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులకు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులకు సెట్‌ నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. 

► అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ పరీక్ష విధానం: అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌(కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌) విధానంలో పరీక్ష జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో బయాలజీ 80 ప్రశ్నలు–80 మార్కులకు(బోటనీ 40, జువాలజీ 40); ఫిజిక్స్‌ 40 ప్రశ్నలు–40 మార్కులకు, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు –40 మార్కులకు పరీక్ష ఉంటుంది. 

► ఈఏపీసెట్‌లో అర్హత సాధించేందుకు కనీసం 25 శాతం మార్కులు రావాలి. ఎంట్రెన్స్‌లో సాధించిన మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌ మార్కులకు 25శాతం వెయిటేజీ కల్పించి.. తుది ర్యాంకు ప్రకటిస్తారు. ఎస్సీ/ఎస్టీలకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు.

ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.07.2021(ఆలస్య రుసం లేకుండా)
► పరీక్ష తేదీలు: ఆగస్టు 19 నుంచి 25 వరకు
► ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/EAPCET/EapcetHomePages/Home.aspx


ఏపీ ఈసెట్‌

ఏపీ ఈసెట్‌(ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఫర్‌ డిప్లొమా హోల్డర్స్‌ అండ్‌ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్‌)ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున అనంతపురంలోని జేఎన్‌టీయూ నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన వారికి బీటెక్‌/బీఈ, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాది(లేటరల్‌ ఎంట్రీ)లో ప్రవేశం లభిస్తుంది. 

అర్హతలు
► డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ఫార్మసీ/బీఎస్సీ(మ్యాథమెటిక్స్‌) అభ్యర్థులు ఈసెట్‌కు దరఖాస్తుకు అర్హులు. కనీసం 45 శాతం మార్కులతో సంబంధిత కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాల అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. 

పరీక్ష విధానం
► ఈసెట్‌ పరీక్ష మూడు విధాలుగా జరుగుతుంది. ఇంజనీరింగ్‌/ఫార్మసీ/బీఎస్సీ విభాగాల అభ్యర్థులకు భిన్నంగా ప్రశ్న పత్రం ఉంటుంది. 200 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. 

► ఇంజనీరింగ్‌ విభాగంలో.. మ్యాథ్స్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, ఫిజిక్స్‌ 25 ప్రశ్నలు–25 మార్కులు, కెమిస్ట్రీ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంజనీరింగ్‌(సంబంధిత బ్రాంచ్‌) 100 ప్రశ్నలు–100 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. 

► ఫార్మసీ విభాగంలో.. ఫార్మాస్యూటిక్స్‌–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మకాలజీ–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మాకోగ్నసీ–50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. 

► బీఎస్సీ(మ్యాథ్స్‌) విభాగంలో మ్యాథమెటిక్స్‌ 100 ప్రశ్నలు–100 మార్కులు, అనలిటికల్‌ ఎబిలిటీ 50 ప్రశ్నలు–50 మార్కులకు, కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 

ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 
► దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021
► పరీక్ష తేది: 19.09.2021 
► వివరాలకు వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx


ఏపీ ఐసెట్‌

ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఐసెట్‌–2021 కు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ఏడాది ఐసెట్‌ను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది. 

అర్హతలు
► 10+2+3 విధానంలో ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు ఎంబీఏకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

► ఎంసీఏకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 

► డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ వర్గాల అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. 

పరీక్ష విధానం
► ఐసెట్‌ పరీక్ష 200 ప్రశ్నలు–200 మార్కులకు ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో జరుగుతుంది. ఇందులో మూడు సెక్షన్‌లు ఉంటాయి. సెక్సన్‌ ఏలో అనలిటికల్‌ ఎబిలిటీ 75 ప్రశ్నలు–75 మార్కులు; సెక్షన్‌ బీలో కమ్యూనికేషన్‌ ఎబిలిటీ 70 ప్రశ్నలు–70 మార్కులకు; సెక్షన్‌ సీలో మ్యాథమెటికల్‌ ఎబిలిటీ55ప్రశ్నలు–55 మార్కు లకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు. 

ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 
► ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.08.2021
► ఏపీ ఐసెట్‌ పరీక్ష తేదీలు: 2021 సెప్టెంబర్‌ 17,18
► వెబ్‌సైట్‌:  https://sche.ap.gov.in/icet

ఏపీ ఎడ్‌సెట్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని యూనివర్సిటీ/గవర్నమెంట్‌/ఎయిడెడ్‌/ప్రైవేట్‌ కాలేజెస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో.. రెండేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ) రెగ్యులర్‌ కోర్సులో ప్రవేశాలకు ఏపీ ఎడ్‌సెట్‌–2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. 

అర్హత
► బీఏ/బీకామ్‌/బీఎస్సీ/బీఎస్సీ/బీబీఎంలో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్‌/బీఈలో 50 మార్కులు తెచ్చుకున్నవారు సైతం బీఈడీలో చేరేందుకు అర్హులు.

పరీక్ష విధానం
► ఎడ్‌సెట్‌ ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు జరుగుతుంది. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2గంటలు. ఇందులో జనరల్‌ ఇంగ్లిష్‌ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ 15 ప్రశ్నలు–15 మార్కులు, టీచింగ్‌ అప్టిట్యూడ్‌10 ప్రశ్నలు–10 మార్కులు; –మెథడాలజీలో మ్యాథమెటిక్స్‌ 100 ప్రశ్నలు–100 మార్కులు/ఫిజికల్‌ సైన్స్‌: ఫిజిక్స్‌–50, కెమిస్ట్రీ–50/బయలాజికల్‌ సైన్స్‌: బోటనీ–50, జువాలజీ–50/సోషల్‌ స్టడీస్‌: జాగ్రఫీ–35, చరిత్ర–30, సివిక్స్‌–15, ఎకనామిక్స్‌–20(మొత్తం 100)/ ఇంగ్లిష్‌: 100 ప్రశ్నలు–100 మార్కులకు ఉంటుంది.  

ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
► దరఖాస్తులకు చివరి తేది: 17.08.2021
► ఎడ్‌సెట్‌ పరీక్ష తేది: 21.09.2021 
► వివరాలకు వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx

ఏపీపీజీఈ సెట్‌
ఆంధ్రప్రదేశ్‌లోని పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఇంజనీరింగ్‌(ఎంటెక్‌/ఎంఈ/ఎంఫార్మా,ఫార్మాడీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ పీజీఈసెట్‌–2021 నోటిఫికేషన్‌ విడుదలైంది.

► అర్హత: బీటెక్‌/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించాలి, రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు 45శాతం మార్కులు వచ్చి ఉండాలి. పరీక్ష ‘ఆన్‌లైన్‌’ విధానంలో ఉంటుంది. మొత్తం 120 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు. ప్రశ్నలు అభ్యర్థి ఏ విభాగంలో పీజీ చేయదలచారో దాని ఆధారంగా ఉంటాయి. 

ముఖ్య సమాచారం
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. 
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.08.2021
► ఏపీపీజీఈ సెట్‌ తేదీలు:27–30 సెప్టెంబర్‌ 2021
► వివరాలకు వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/PGECET

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement