
మే2న తెలంగాణ ఎంసెట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కామన్ ఎంట్రెన్స్ టెస్టు తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు సెట్‌ల తేదీలను ప్రకటించారు. ఈ ఏడాది ఎంసెట్, ఈసెట్ నిర్వహణ బాధ్యతలు జేఎన్టీయూ నిర్వహించనుంది. ఎడ్ సెట్, పీజీ సెట్ల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్శిటీకి అప్పగించారు. ఐసెట్, లా సెట్ నిర్వహణ బాధ్యతలు కాకతీయ యూనివర్శిటీ నిర్వహించనుంది.
మే2న ఎంసెట్
మే12న ఈసెట్
మే19న ఐసెట్
మే24న లాసెట్
మే27న ఎడ్ సెట్
మే29 న పీజీసెట్