icet
-
‘సెట్’ చేసేశారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సంవత్సరం నిర్వహించిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్) నిధులు పక్కదారి పట్టినట్టు ఆరోపణలొస్తున్నాయి. వీసీలు మారడంతో సెట్ కన్వీనర్లపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులొస్తున్నాయి. ‘సెట్’కు కేటాయించిన నిధులు కన్వినర్లు, ఆయా యూనివర్సిటీ వీసీలు అడ్డగోలు లెక్కలతో కాజేశారని పెద్దఎత్తున ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాకతీయ వర్సిటీ నిర్వహించిన ఐసెట్ వ్యవహారం ఇప్పటికే తీవ్ర వివాదంగా మారింది. జేఎన్టీయూహెచ్ నేతృత్వంలో సాగిన ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై మండలి చైర్మన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. వాస్తవాలు తెలియజేయాలని కొత్త వీసీలను కోరారు. అవసరమైతే ప్రత్యేక బృందాన్ని విచారణకు పంపాలని చైర్మన్ భావిస్తున్నట్టు తెలిసింది. అసలేం జరిగింది? రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏటా ఈఏపీ, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్, పాలిసెట్, పీజీసెట్ నిర్వహిస్తారు. వివిధ వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కో సెట్ నిర్వహణను ఒక్కో వర్సిటీకి అప్పగిస్తారు. ప్రతీ సెట్‌కు ఒక కన్వీనర్, కొంతమంది సభ్యులను ఎంపిక చేస్తారు. అతిపెద్ద సెట్ అయిన ఈఏపీ సెట్‌ను సాధారణంగా జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తుంది. మరికొన్ని కీలకమైన సెట్స్‌ను ఉస్మానియా వర్సిటీకి అప్పగిస్తారు. ఐసెట్‌ను కొన్నేళ్లుగా కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగిస్తున్నారు. సెట్ రాసే విద్యార్థుల సంఖ్యను బట్టి ఉన్నత విద్యామండలి కాన్ఫిడెన్షియల్ నిధులు ఇస్తుంది. సెట్ ప్రశ్నపత్రం కూర్పు, ప్రింటింగ్, రవాణా, నిర్వహణకు వీటిని ఉపయోగిస్తారు. ఈ వ్యవహారం మొత్తం రహస్యంగా ఉంటుంది. కాబట్టి ఏ బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నారనేది ముందే చెప్పరు. పరీక్ష పూర్తయిన తర్వాత బిల్లులు పెట్టడం, ఆడిట్ నిర్వహించి, వాటిని ఉన్నత విద్యా మండలి అనుమతించడం ఆనవాయితీగా వస్తోంది. సంబంధం లేని వ్యక్తులు, ఊహించని విధంగా కంప్యూటర్లు, ఇతర వస్తువుల కొనుగోళ్లు చేపట్టినట్టు బిల్లులు ఉండటంతో కొత్త వీసీలు సందేహాలు లేవనెత్తుతున్నారు. ఐసెట్ నిధులు గందరగోళం కాకతీయ వర్సిటీ నిర్వహించిన ఐసెట్ నిధుల లెక్కలపై ప్రస్తుత వీసీ అభ్యంతరాలు లేవనెత్తినట్టు సమాచారం. దీనిపై అందిన ఫిర్యాదులను మండలి చైర్మన్‌కు పంపినట్టు తెలిసింది. ఐసెట్ నిర్వహణ కోసం ఈ వర్సిటీ రూ.99.50 లక్షలు ప్రతిపాదించగా, మండలి రూ. 92.76 లక్షలు మంజూరైంది. ఈ నిధులను కన్వినర్ ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకూ ఖర్చు చేసినట్టు గుర్తించారు. దాదాపు రూ.16 లక్షలు సెల్ఫ్ చెక్కుల ద్వారానే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందని మండలి వర్గాలు సందేహిస్తున్నాయి. సంబంధమే లేని ఓ వ్యక్తికి రూ.2 లక్షలు ఇవ్వడం, అవసరం లేని రవాణాకు రూ. 40 వేలు వెచ్చించడం, కార్యాలయంలో పనిచేస్తున్న ఓ చిన్న ఉద్యోగి ఖాతాలో నగదు జమవ్వడం, ఏ సంబంధం లేని మహిళకు రూ.82 వేలు వెళ్లడం, సరైన ప్రమాణాలు లేకున్నా రూ.87 వేల చొప్పున 6 కంప్యూటర్లు కొనడం అనుమానాలకు తావిస్తోంది.ఇందులో రూ.29 లక్షల వరకూ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈఏపీసెట్ నిర్వహణ నిధుల విషయంలోనూ పలు ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ వ్యవహారంలో మండలి వర్గాలు గోప్యత పాటిస్తున్నాయి. ఈ సెట్ కోసం దాదాపు రూ.3 కోట్లు వెచ్చించారు. పరిశీలిస్తున్నాంకాకతీయ నిర్వహించిన ఐసెట్పై ఆరోపణలు వచ్చిన మాట నిజమే. ఇందులో వాస్తవాలు ఏమిటనేది పరిశీలిస్తున్నాం. ఇతర సెట్ల విషయంలోనూ ఫిర్యాదులు వస్తే విచారణ జరిపిస్తాం. వాస్తవాలు పరిశీలించిన తర్వాత ఏం జరిగిందనేది వెల్లడిస్తాం. – ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
ఒకే ఒక్క క్లిక్‌తో తెలంగాణ ఐసెట్ రిజల్ట్
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 5,6 తేదీల్లో నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కాకతీయ వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు.తెలంగాణ ఐసెట్ ఫలితాలు రిజల్ట్ కోసం క్లిక్ చేయండి -
టీఎస్ ఐసెట్ షురూ
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను టీఎస్ ఐసెట్‌ను బుధవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 116 కేంద్రాల్లో నిర్వహించారు. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ పద్ధతిన జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు నిమిషం నిబంధన ఉండడంతో అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని టీఎస్ ఐసెట్ కార్యాలయంలో ఉదయం 8గంటలకే ప్రశ్నపత్రం సెట్‌ను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12–30గంటల వరకు మొదటి సెషన్ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని111 పరీక్ష కేంద్రాల్లో 27,801మంది అభ్యర్థులకు గానూ 25,086 మంది హాజరు(90.2శాతం) కాగా, ఏపీలోని నాలుగు కేంద్రాల్లో 1,130మంది అభ్యర్థులకు గానూ 896మంది (79.3శాతం) హాజరయ్యారని టీఎస్ ఐసెట్ కన్వీనర్, కాకతీయ యూ నివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంటు కళాశాల ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి వెల్లడించా రు. గురువారం జరిగే మొదటి సెషన్‌తో ఈ ప్రవేశ పరీక్ష ముగుస్తుందని నర్సింహాచారి తెలిపారు. -
TS: విడుదలైన ఐసెట్ ఫలితాలు.. తొలి పది ర్యాంకులు అబ్బాయిలవే
తెలంగాణలోని పలు యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ టీఎస్ ఐసెట్ 2023 ఫలితాలను జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు కాకతీయ యూనివర్సిటీలో విడుదల చేశారు. ఈ ఫలితాలలో పాటు ఫైనల్ 'కీ' ని కూడా విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 21 ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఫలితాల విడుదల ఆలస్యంగా గురువారం (జూన్ 29)న విడుదల చే అయింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 26, 27 తేదీల్లో టీఎస్ ఐసెట్-2023 పరీక్షను నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ పరీక్షకు పరీక్షకు 75 వేల మంది దరఖాస్తు చేసుకుంటే.. 70,900 మంది హాజరయ్యారు. ఈ సారి ఐసెట్‌లో తొలి 10 ర్యాంకుల్లోనూ అబ్బాయిలే సత్తా చాటారు. వీరిలో మొదటి ర్యాంకు నూకల శరణ్‌కుమార్ కైవసం చేసుకోగా.. నాగులపల్లి సాయి నవీన్ రెండు, రవితేజ సజ్జ మూడో ర్యాంకులో సాధించారు. టాప్ 10లో ఆ తర్వాతి ర్యాంకుల్లో ఎస్.సాయి ఫణి ధనుష్, గోపి మల్లికంటి, తిరుగుడు సుమంత్ కుమార్ రెడ్డి, ఆయాచితుల నితీశ్‌కుమార్, వి. సాయి వెంకట కార్తిక్, ఎస్.నాగసాయి కృష్ణవంశీ, బి.సాయిగణేష్ నిలిచారు. చదవండి: Hyderabad: అమ్మో ఫాస్ట్‌ఫుడ్! పంది కొవ్వు కొని నూనెగా మార్చి తక్కువ ధరకు విక్రయం -
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2023 ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023 విద్యా సంవత్సరానికి ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. AP ICET Results 2023 టాప్-10 ర్యాంకర్లు వీళ్లే.. 1. తపల జగదీశ్‌కుమార్‌రెడ్డి (రేణిగుంట) 2. వేదాంతం సాయివెంకట కార్తీక్ (సికింద్రాబాద్) 3. పుట్లూరు రోహిత్ (అనంతపురం) 4. చింతా జ్యోతి స్వరూప్ (విజయనగరం) 5. కానూరి రేవంత్ (విశాఖపట్నం) 6. మహమ్మద్ అఫ్తాద్ ఉద్దీన్ (పశ్చిమగోదావరి) 7. దేవరాపల్లి దేవ్ అభిషేక్ (విశాఖపట్నం) 8. జమ్ము ఫణీంద్ర (కాకినాడ) 9. పిరతి రోహన్ (బాపట్ల) 10. అంబళ్ల మహాలక్ష్మి (పశ్చిమగోదావరి) ఈ ఏపీ ఐసెట్-2023 ఫలితాలను www.sakshieducation.com లో చూడొచ్చు. మే 24, 25 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష రెండు షిఫ్ట్‌లో ఈ పరీక్షను నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించారు. ☛ AP ICET Results-2023 డైరెక్ట్ లింక్ ఇదే (Click Here) -
Telangana: ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ డేట్స్ ఇవే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఎంసెట్, ఈసెట్, లాసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ తదితర కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వాహణ తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు మంత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వీ వెంకటరమణతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాలతో వివరణాత్మక నోటిఫికేషన్‌ను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు. వివిధ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల షెడ్యూల్ కింది విధంగా ఉంది. ► మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. ► మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీలు. ► మే 18న టీఎస్ ఎడ్ సెట్ ►మే 20న టీఎస్ ఈసెట్ ► మే 25న లాసెట్(ఎల్ఎల్బీ), పీజీ లాసెట్ ► మే 26, 27న టీఎస్ పీజీ ఐసెట్ ►మే, 29 నుంచి జూన్ ఒకటి వరకు పీజీ ఈసెట్య నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: తెలంగాణకు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా -
ఏపీ ఐసెట్ 2021; ఇవే విజయానికి కీలకం
ఏపీ ఐసెట్.. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్! ఎంబీఏలో చేరి.. భవిష్యత్తులో మేనేజ్మెంట్ రంగంలో కొలువులు సాధించాలని కలలు కనే విద్యార్థులు; అదే విధంగా ఎంసీఏ పట్టాతో సాఫ్ట్వేర్ రంగంలో కెరీర్ సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులకు చక్కటి మార్గం!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ఏపీ ఐసెట్ ర్యాంకు ద్వారా ప్రవేశం లభిస్తుంది. వేల మంది రాసే ఈ పరీక్ష.. ఈ నెల(సెప్టెంబర్) 17, 18 తేదీల్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో.. ఏపీ ఐసెట్‌లో విజయానికి ప్రిపరేషన్ టిప్స్... ఎంబీఏ, ఎంసీఏ.. ఈ కోర్సుల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి నెలకొంది. గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో కొంతమంది కార్పొరేట్ రంగంలో మేనేజ్మెంట్ కెరీర్ లక్ష్యంగా ఎంబీఏలో చేరుతున్నారు. మరికొందరు ఎంసీఏతో సాఫ్ట్వేర్ కొలువులు సొంతం చేసుకోవాలని టార్గెట్ సెట్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వేల మంది ప్రతి ఏటా ఐసెట్‌కు హాజరవుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఐసెట్‌కు మరో వారం రోజులే సమయం ఉంది. దాంతో విద్యార్థులు ప్రిపరేషన్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏపీ ఐసెట్ పరీక్ష విధానం ఏపీ–ఐసెట్ 2021ను మూడు సెక్షన్లలో 200 ప్రశ్నలు–200 మార్కులకు నిర్వహించనున్నారు. ఒక్కో సెక్షన్లో మళ్లీ ఉప విభాగాలు కూడా ఉంటాయి. సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీ 75 ప్రశ్నలు–75 మార్కులకు; సెక్షన్ బీ కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 ప్రశ్నలు–70 మార్కులకు; సెక్షన్ సీ మ్యాథమెటికల్ ఎబిలిటీ 55 ప్రశ్నలు–55 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. విభాగాల వారీగా ప్రిపరేషన్ ► ప్రస్తుతం సమయంలో విద్యార్థులు ఐసెట్ సిలబస్‌లో విభాగాల వారీగా ముఖ్యాంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. ► డేటా సఫిషియెన్సీ; ప్రాబ్లమ్ సాల్వింగ్ అంశాల్లో బేసిక్ అర్థమెటిక్‌ను పునశ్చరణ చేసుకోవాలి. ► అర్థమెటిక్ విభాగంలో..శాతాలు, లాభ నష్టాలు,నిష్పత్తులు, మెన్సురేషన్,పని–కాలం, పని –సమయం వంటి అంశాలను రివిజన్ చేసుకోవాలి. ► అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ కోసం ట్రిగ్నోమెట్రీ, సెట్స్ అండ్ రిలేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్ వంటి టాపిక్స్‌పై నైపుణ్యం సాధించాలి. ► ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగంలో.. కోడింగ్, డీ–కోడింగ్, బ్లడ్ రిలేషన్, సిరీస్, సిలాజిజమ్, సీటింగ్ అరేంజ్మెంట్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. ► మ్యాథమెటికల్ ఎబిలిటీలో.. ప్రాథమిక సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి. ► స్టాటిస్టికల్ ఎబిలిటీ కోసం ప్రాబబిలిటీ, ఇన్–ఈక్వాలిటీస్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. ► కమ్యూనికేషన్ ఎబిలిటీ విభాగంలో.. రాణించేందుకు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్ నైపుణ్యాలు, వొకాబ్యులరీలను ప్రతి రోజు చదవాలి. ► బిజినెస్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ విభాగంలో.. బిజినెస్ టెర్మినాలజీ, కొత్త వ్యాపార విధానాలు, ఆయా సంస్థలు–వాటి క్యాప్షన్లు వంటివి తెలుసుకోవాలి. ► కంప్యూటర్ టెర్మినాలజీకి సంబంధించి బేసిక్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్, అదే విధంగా కంప్యూటర్ హార్డ్‌వేర్–ముఖ్య భాగాలు, వాటి పనితీరు గురించిన ప్రాథమిక నైపుణ్యం పరీక్ష పరంగా కలిసొస్తుంది. ► రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగం కోసం అభ్యర్థులు ఇంగ్లిష్ దినపత్రికల్లోని ఎడిటోరియల్స్‌పై దృష్టి పెట్టాలి. మాక్ టెస్టులు ఐసెట్ అభ్యర్థులు ప్రస్తుత సమయంలో పరీక్ష విధానంపై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. ఐసెట్ వెబ్‌సైట్‌లోని మాక్ టెస్ట్‌లను రాయాలి. ఫలితంగా పరీక్ష తీరుతెన్నులు తెలుస్తాయి. దాంతో పరీక్ష హాల్లో వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన లభిస్తుంది. మోడల్ టెస్ట్‌లు ఈ వారం రోజుల్లో అభ్యర్థులు వీలైనంత మేరకు మోడల్ టెస్ట్‌లు రాయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు కనీసం ఒక మోడల్ టెస్ట్ రాసి.. ఫలితాలు విశ్లేషించుకోవాలి. ఆ విశ్లేషణ ఆధారంగా తమ బలాలు బలహీనతలపై అవగాహన వస్తుంది. అభ్యర్థులు తాము ఇప్పటికీ బలహీనంగానే ఉన్న టాపిక్స్‌ను వదిలేయాలి. బాగా పట్టు ఉన్న అంశాలపై మరింతగా దృష్టిపెట్టాలి. షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ సమయంలోనే సిలబస్ ఆధారంగా.. ఆయా సబ్జెక్ట్‌లు, టాపిక్‌లకు సంబంధించి ముఖ్యమైన అంశాలు, ఫార్ములాలతో షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఈ షార్ట్ నోట్స్ ఆధారంగా పునశ్చరణ వేగవంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా డేటా సఫిషియన్సీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ, అల్జీబ్రా అండ్ జామెట్రీ, స్టాటిస్టికల్ ఎబిలిటీ విషయంలో షార్ట్ నోట్స్ ఎంతో మేలు చేస్తుంది. పరీక్ష హాల్లో టెన్షన్ లేకుండా పరీక్ష హాల్లో అడుగుపెట్టిన అభ్యర్థులు.. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. ప్రశాంతంగా వ్యవహరించాలి. ప్రశ్న పత్రంలో పేర్కొన్న నిబంధనలు పూర్తిగా చదివి సమాధానాలు ఇచ్చేందుకు ఉపక్రమించాలి. తొలుత సులువుగా భావించే ప్రశ్నలకు, ఆ తర్వాత ఓ మోస్తరు క్లిష్టత ఉన్న ప్రశ్నలకు, చివరగా అత్యంత క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం గుర్తించే ప్రయత్నం చేయాలి. మెరుగైన ర్యాంకుతోనే బెస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు, సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే.. అర్హత సాధించిన అభ్యర్థులకు సీటు దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. కాని యూనివర్సిటీ కాలేజీలు, క్యాంపస్ కళాశాలలు, టాప్–10, టాప్–20, టాప్–50 ఇన్స్టిట్యూట్లలో బెస్ట్ ర్యాంకుతోనే ప్రవేశం లభించే అవకాశం ఉంది. ఏపీ ఐసెట్ 2021 సమాచారం ► అర్హత: కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులు కనీసం 45శాతం మార్కులు సాధించాలి. ఎంసీఏలో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్/డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. అర్హత కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► రూ.అయిదు వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 13. ► హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం: సెప్టెంబర్ 13 నుంచి ► ఏపీ ఐసెట్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 17, 18 (ప్రతి రోజు ఉదయం 9 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు) ► ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 30, 2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/icet/ICET/ICET_HomePage.aspx -
ఏపీ సెట్.. ఈజీగా అప్లై చేసుకోండి ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించనున్న పలు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిల్లో ఏపీ ఈఏపీసెట్, ఏపీఈసెట్, ఏపీ ఐసెట్, ఏపీ ఎడ్‌సెట్, ఏపీ పీజీఈసెట్, ఏపీ లాసెట్ తదితరాలు ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఆయా సెట్లకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. సదరు ఏపీ సెట్లకు అర్హతలు, ప్రవేశం కల్పించే కోర్సులు, ప్రవేశ పరీక్షల విధానంపై ప్రత్యేక కథనం... ఏపీ ఈఏపీసెట్ ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్(ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)–2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యే ఎంట్రన్స్ టెస్టు.. ‘ఈఏపీసెట్’ (పూర్వపు ఎంసెట్). ఈ ఏడాది ఈఏపీసెట్‌ను జేఎన్టీయూ, కాకినాడ నిర్వహిస్తోంది. ► ప్రవేశం కల్పించే కోర్సులు: ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్(డెయిరీ టెక్నాలజీ), బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎఫ్ఎస్సీ, బీఫార్మసీ, ఫార్మా డీ. అర్హతలు ► ఇంజనీరింగ్, ఫార్మసీ(ఎంపీసీ), ఫార్మా డీ, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత/తత్సమాన అర్హత ఉండాలి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► బీఎస్సీ అగ్రికల్చర్/బీఎస్సీ హార్టికల్చర్/బీవీఎస్సీ అండ్ ఏహెచ్/బీఎఫ్ఎస్సీ /బీటెక్ (ఎఫ్ఎస్టీ)/బీఎస్సీ(సీఏ అండ్ బీఎం)/బీఫార్మసీ/బీటెక్(బయోటెక్నాలజీ)(బైపీసీ), ఫార్మా డీ(బైపీసీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ బైపీసీ/తత్సమాన అర్హత ఉండాలి. ► ఇంజనీరింగ్ పరీక్ష విధానం: ఇంజనీరింగ్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ) విధానంలో జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 80 ప్రశ్నలు–80మార్కులకు, ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులకు, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులకు సెట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ► అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్ష విధానం: అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) విధానంలో పరీక్ష జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలు–160 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో బయాలజీ 80 ప్రశ్నలు–80 మార్కులకు(బోటనీ 40, జువాలజీ 40); ఫిజిక్స్ 40 ప్రశ్నలు–40 మార్కులకు, కెమిస్ట్రీ 40 ప్రశ్నలు –40 మార్కులకు పరీక్ష ఉంటుంది. ► ఈఏపీసెట్‌లో అర్హత సాధించేందుకు కనీసం 25 శాతం మార్కులు రావాలి. ఎంట్రెన్స్‌లో సాధించిన మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 25శాతం వెయిటేజీ కల్పించి.. తుది ర్యాంకు ప్రకటిస్తారు. ఎస్సీ/ఎస్టీలకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.07.2021(ఆలస్య రుసం లేకుండా) ► పరీక్ష తేదీలు: ఆగస్టు 19 నుంచి 25 వరకు ► ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్: https://sche.ap.gov.in/EAPCET/EapcetHomePages/Home.aspx ఏపీ ఈసెట్ ఏపీ ఈసెట్(ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అండ్ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున అనంతపురంలోని జేఎన్టీయూ నిర్వహించనుంది. ఇందులో అర్హత సాధించిన వారికి బీటెక్/బీఈ, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాది(లేటరల్ ఎంట్రీ)లో ప్రవేశం లభిస్తుంది. అర్హతలు ► డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఫార్మసీ/బీఎస్సీ(మ్యాథమెటిక్స్) అభ్యర్థులు ఈసెట్‌కు దరఖాస్తుకు అర్హులు. కనీసం 45 శాతం మార్కులతో సంబంధిత కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. పరీక్ష విధానం ► ఈసెట్ పరీక్ష మూడు విధాలుగా జరుగుతుంది. ఇంజనీరింగ్/ఫార్మసీ/బీఎస్సీ విభాగాల అభ్యర్థులకు భిన్నంగా ప్రశ్న పత్రం ఉంటుంది. 200 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ► ఇంజనీరింగ్ విభాగంలో.. మ్యాథ్స్ 50 ప్రశ్నలు–50 మార్కులు, ఫిజిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, కెమిస్ట్రీ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంజనీరింగ్(సంబంధిత బ్రాంచ్) 100 ప్రశ్నలు–100 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. ► ఫార్మసీ విభాగంలో.. ఫార్మాస్యూటిక్స్–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మకాలజీ–50 ప్రశ్నలు–50 మార్కులు, ఫార్మాకోగ్నసీ–50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ► బీఎస్సీ(మ్యాథ్స్) విభాగంలో మ్యాథమెటిక్స్ 100 ప్రశ్నలు–100 మార్కులు, అనలిటికల్ ఎబిలిటీ 50 ప్రశ్నలు–50 మార్కులకు, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021 ► పరీక్ష తేది: 19.09.2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx ఏపీ ఐసెట్ ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఐసెట్–2021 కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది ఐసెట్‌ను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది. అర్హతలు ► 10+2+3 విధానంలో ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు ఎంబీఏకు దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఎంసీఏకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్ లేదా డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ► డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ వర్గాల అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. పరీక్ష విధానం ► ఐసెట్ పరీక్ష 200 ప్రశ్నలు–200 మార్కులకు ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్సన్ ఏలో అనలిటికల్ ఎబిలిటీ 75 ప్రశ్నలు–75 మార్కులు; సెక్షన్ బీలో కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 ప్రశ్నలు–70 మార్కులకు; సెక్షన్ సీలో మ్యాథమెటికల్ ఎబిలిటీ55ప్రశ్నలు–55 మార్కు లకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.08.2021 ► ఏపీ ఐసెట్ పరీక్ష తేదీలు: 2021 సెప్టెంబర్ 17,18 ► వెబ్సైట్: https://sche.ap.gov.in/icet ఏపీ ఎడ్‌సెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీ/గవర్నమెంట్/ఎయిడెడ్/ప్రైవేట్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో.. రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు ఏపీ ఎడ్‌సెట్–2021 నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ► బీఏ/బీకామ్/బీఎస్సీ/బీఎస్సీ/బీబీఎంలో కనీసం 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్/బీఈలో 50 మార్కులు తెచ్చుకున్నవారు సైతం బీఈడీలో చేరేందుకు అర్హులు. పరీక్ష విధానం ► ఎడ్‌సెట్ ఆన్లైన్ విధానంలో మొత్తం 150 ప్రశ్నలు–150 మార్కులకు జరుగుతుంది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2గంటలు. ఇందులో జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు–15 మార్కులు, టీచింగ్ అప్టిట్యూడ్10 ప్రశ్నలు–10 మార్కులు; –మెథడాలజీలో మ్యాథమెటిక్స్ 100 ప్రశ్నలు–100 మార్కులు/ఫిజికల్ సైన్స్: ఫిజిక్స్–50, కెమిస్ట్రీ–50/బయలాజికల్ సైన్స్: బోటనీ–50, జువాలజీ–50/సోషల్ స్టడీస్: జాగ్రఫీ–35, చరిత్ర–30, సివిక్స్–15, ఎకనామిక్స్–20(మొత్తం 100)/ ఇంగ్లిష్: 100 ప్రశ్నలు–100 మార్కులకు ఉంటుంది. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► దరఖాస్తులకు చివరి తేది: 17.08.2021 ► ఎడ్‌సెట్ పరీక్ష తేది: 21.09.2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx ఏపీపీజీఈ సెట్ ఆంధ్రప్రదేశ్‌లోని పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్(ఎంటెక్/ఎంఈ/ఎంఫార్మా,ఫార్మాడీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ పీజీఈసెట్–2021 నోటిఫికేషన్ విడుదలైంది. ► అర్హత: బీటెక్/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించాలి, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 45శాతం మార్కులు వచ్చి ఉండాలి. పరీక్ష ‘ఆన్లైన్’ విధానంలో ఉంటుంది. మొత్తం 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు. ప్రశ్నలు అభ్యర్థి ఏ విభాగంలో పీజీ చేయదలచారో దాని ఆధారంగా ఉంటాయి. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.08.2021 ► ఏపీపీజీఈ సెట్ తేదీలు:27–30 సెప్టెంబర్ 2021 ► వివరాలకు వెబ్సైట్: https://sche.ap.gov.in/PGECET -
నేటి నుంచి ఏపీ ఐసెట్‌కు ఆన్లైన్ దరఖాస్తులు
ఏయూక్యాంపస్(విశాఖ): రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని కన్వీనర్ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు. వివరాలను www.sche.ap.gov.in/icet వెబ్సైట్లో పొందొచ్చని తెలిపారు. -
విద్యా సమాచారం: దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఐటీఐ పూర్తయిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ కింద పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరేందుకు నిర్వహించే ఎల్పీసెట్– 2021 దరఖాస్తుల గడువును జూలై 12వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు దరఖా స్తు చేసుకోవచ్చని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. రూ. 100 ఆలస్య రుసుముతో జూలై 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరీక్షను జూలై 25వ తేదీన నిర్వహిస్తామని వెల్లడించారు. టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పెంపు కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని కళాశాలల్లో 2021– 22 విద్యాసంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువును జూలై 8వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దర ఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఐసెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఆచార్యులు కె.రాజిరెడ్డి పేర్కొన్నారు. పీఈసెట్ దరఖాస్తుల గడువు ఈ నెల 15 వరకు పెంపు సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్ దరఖాస్తుల గడువును జూలై 15వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తుల గడువును జూలై 7వ తేదీ వరకు పొడిగించారు. ఆరో తరగతిలో కొత్త ప్రవేశాలు, 7 నుంచి టెన్త్ వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాలను (https://telanganams.cgg.gov.in) పొందవచ్చని తెలిపింది. -
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్-2020 ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాకతీయ వర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఫలితాలు విడుదల చేశారు. సెప్టెంబర్ 30, అక్టోంబర్ 1న నిర్వహించిన టీఎస్ ఐసెట్ ప్రవేశ పరీక్షకు 45,975మంది హాజరు కాగా, 41,506 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 90.28 శాతం నమోదైందని పాపిరెడ్డి పేర్కొన్నారు. -
సెషన్‌కు సెషన్‌కు మధ్య 3 గంటలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జూలైలో నిర్వహించనున్న వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్స్)లలో ఉదయం సెషన్‌కు మధ్యాహ్నం సెషన్‌కు మధ్య 3 గంటల వ్యవధి ఉండేలా పరీక్షల సమయాన్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేసేందుకు, కుర్చీలు, బెంచీలు కెమికల్‌తో శుభ్రపరిచేందుకు, ఆన్లైన్ పరీక్షలు అయినందున కంప్యూటర్, కీ బోర్డు, మౌస్ వంటివి శుభ్రపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఎంసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షల్లో కొన్ని ఒకే సెషన్‌తో ముగియనుండగా, మరికొన్ని ఎక్కువ సెషన్లలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఎంసెట్ పరీక్షను తీసుకుంటే 6 సెషన్లలో (ప్రతిరోజు ఉదయం ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్) మూడ్రోజులపాటు పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. అలాగే అగ్రికల్చర్ పరీక్షలను రెండు, మూడు సెషన్లలో, ఐసెట్, ఎడ్‌సెట్ వంటి వాటికి రెండేసి చొప్పున సెషన్లలో పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఒక సెషన్‌కు మరో సెషన్ మధ్య 2 గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పుడుతాజాగా పరీక్షల తేదీలను మార్పు చేసిన నేపథ్యంలో 3 గంటల వ్యవధి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరో సెషన్ పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేశారు. అయితే పరీక్ష కేంద్రాల్లో శానిటైజేషన్ చర్యల కోసం మధ్యలో 3 గంటల సమయం ఉండేలా ఉదయం సెషన్ పరీక్షల సమయాన్ని మార్పు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు. -
మేలో ‘సెట్’ల పండుగ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్‌లో (బీఈ/బీటెక్‌లో) ప్రవేశాల కోసం 2020 మే 5, 6, 7 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరంలో (2020–21) ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను మంగళవారం ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. అనంతరం ఆ వివరాలను మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణతో కలసి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఈసెట్, ఎంసెట్, పీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీలాసెట్ పీజీఈసెట్ నిర్వహణ తేదీలను కూడా ప్రకటించారు. మే 2వ తేదీన ఈసెట్‌తో ప్రవేశ పరీక్షలు ప్రారంభం అవుతాయని, అదే నెలలో అన్ని కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను పూర్తి చేస్తామని తెలిపారు. జూలై నెలాఖరులోగా అన్ని కోర్సులకు కౌన్సె లింగ్ నిర్వహించి ప్రవేశాలను పూర్తి చేస్తామని, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని వివరించారు. ఆయా కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన ఇంటర్మీడియట్ ఫలితాలు సకాలంలోనే వస్తుండగా, డిగ్రీ కోర్సుల పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించి, ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలకు లేఖలు రాస్తామని వివరించారు. గతంలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలు (లాసెట్ ద్వారా) ఆలస్యం కాగా, న్యాయ విద్య కాలేజీలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మూడేళ్లకు అనుబంధ గుర్తింపు నేపథ్యంలో ఈసారి వాటిని కూడా సకాలంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులను బట్టి సెషన్స్ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్యను బట్టి సెషన్ల సంఖ్య ఉంటుందని పాపిరెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. ఇంజనీరింగ్ ఎంసెట్‌ను 5 సెషన్లలో నిర్వహిస్తామని, ఒక్కో సెషన్లో 50 వేల మందికి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. గతేడాది ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 1,42,210 మంది దరఖాస్తు చేసుకున్నారని, దాన్ని బట్టి ఈసారి 1.5 లక్షల్లోపు దరఖాస్తులు వస్తే 6 సెషన్లలో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహిస్తామని చెప్పారు. అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్‌ను అభ్యర్థుల సంఖ్యను బట్టి 3 లేదా 4 సెషన్లలో నిర్వహిస్తామన్నారు. ఎడ్‌సెట్‌కు దరఖాస్తులు 50 వేలు దాటితే 23తోపాటు 24న కూడా నిర్వహిస్తామని చెప్పారు. గతేడాది ఈ సెట్స్ నిర్వహించిన యూనివర్సిటీలకే ఈసారి కూడా బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సెట్స్ కన్వీనర్లను త్వరలోనే నియమిస్తామన్నారు. నిమిషం నిబంధన యథాతథం.. ఎంసెట్ తదితర సెట్స్ నిర్వహణలో నిమిషం నిబంధన యథావిధిగా ఉంటుందని పాపిరెడ్డి చెప్పారు. ఎంసెట్ అనేది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష కాబట్టి విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. వికలాంగులకు పరీక్ష ఫీజు తగ్గింపు అంశాన్ని ఆయా సెట్స్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్చిలో సెట్స్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని తెలిపారు. ఈసారి నేషనల్ పూల్ లేదు.. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలను జాతీయ స్థాయి పరీక్ష ద్వారానే చేపట్టాలన్న నిబంధన ఈసారి లేదన్నారు. రాష్ట్ర సెట్స్ ద్వారానే ప్రవేశాలు చేపడతామన్నారు. ఒకవేళ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే జేఈఈ మెయిన్ ద్వారానే అన్ని రాష్ట్రాల్లో ప్రవేశాలు చేపట్టాలని తప్పనిసరి చేస్తే దాన్ని అమలు చేస్తామన్నారు. అయితే ఏడాది ముందుగానే ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్ట సవరణతోనే విదేశీ వర్సిటీలు ప్రస్తుతం ఉన్న పార్లమెంటు చట్టం ప్రకారం యాక్ట్ ప్రకారం విదేశీ యూనివర్సిటీలు దేశంలో యూనివర్సిటీ లేదా ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి వీల్లేదన్నారు. ప్రస్తుతం కేంద్రం తెస్తున్న నూతన విద్యా విధానంలో ఆ అంశంపై చర్చిస్తోందని, అందులో ఓకే చెబితే విదేశీ యూనివర్సిటీలు వచ్చే అవకాశం ఉందన్నారు. -
ఐసెట్‌లో 90 శాతం మంది అర్హత
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఫలితాల ను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 23, 24 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 61,439 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 55,191 మంది హాజరయ్యారని తెలిపారు. అందులో 49,812 మంది (90.25 శాతం) అర్హత సాధించినట్లు తెలిపారు. త్వరలో నిర్వహించే సెట్ కమిటీ సమావేశంలో.. ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలను నిర్ణయిస్తామని వివరించారు. గతేడాది 304 ఎంబీఏ కాలేజీల్లో 32 వేల సీట్లు, 49 ఎంసీఏ కాలేజీల్లో 5,846 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈసారి యూనివర్సిటీలు ఇచ్చే గుర్తింపును బట్టి సీట్ల సంఖ్య తేలుతుందని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యశర్మ తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ పాల్గొన్నారు. ఫిర్యాదులు వస్తే చర్యలు: పాపిరెడ్డి ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనని పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఏదైనా కాలేజీపై ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని, వాటికి ఆధారాలు ఉండాలని తెలిపారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నిబంధనలు జారీ చేశామని, వాటి ప్రకారమే ప్రవేశాలు చేపట్టాలని పేర్కొన్నారు. బీటెక్ విద్యార్థులు కూడా.. ఎంబీఏ, ఎంసీఏ చదివేందుకు బీకాం విద్యార్థులు అత్యధికంగా దరఖాస్తు చేసుకోగా.. తర్వాతి స్థానంలో బీఎస్సీ, బీటెక్ విద్యార్థులు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. అర్హత సాధించిన వారిలోనూ బీఎస్సీ, బీటెక్ విద్యార్థులు ఎక్కువ మందే ఉన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన ఐసెట్
కర్నూలు(సిటీ) : ఐసెట్–2017 ఆన్లైన్ ప్రవేశ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్ష మొట్టమొదటిసారిగా ఆన్లైన్లో నిర్వహించడంతో కొంతమంది అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ సెషన్ వారీగా పరీక్షలు జరిగాయి. జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరులలో ఏర్పాటు చేసిన 12 కేంద్రాల్లో 4,759 మంది విద్యార్థులకు గాను 4,335 మంది హాజరయ్యారు. -
13న ఐసెట్ ఫలితాలు
జేఎన్టీయూ (అనంతపురం) : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్–2017 (ఐసెట్) ఫలితాలను ఈ నెల 13న విడుదల చేస్తున్నట్లు ఏపీ కన్వీనర్ ఆచార్య బి.సుధీర్ తెలిపారు. ప్రిలిమినరీ ‘కీ’ని బుధవారం (నేడు) విడుదల చేస్తామన్నారు. ఇందులో అభ్యంతరాలను ఈ నెల ఆరు వరకు పంపవచ్చునని విద్యార్థులకు సూచించారు. అనంతపురం రీజియన్ కేంద్రంలో 88 శాతం హాజరు నమోదైనట్లు వివరించారు. ఐసెట్ ఆన్లైన్ రాత పరీక్ష మంగళవారం సజావుగా ముగిసిందన్నారు. -
మూడు సెట్ల నోటిఫికేషన్ విడుదల
-
సెట్స్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్..!
-
సెట్స్ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్..!
సర్వీసు ప్రొవైడర్ ఎంపికపై స్పష్టత - ఇక వరుసగా నోటిఫికేషన్లు, దరఖాస్తుల ప్రక్రియ - రేపు లేదా 13న ఎంసెట్ నోటిఫికేషన్ - 14 నుంచి ఐసెట్ దరఖాస్తుల స్వీకరణకు చర్యలు - రెండు మూడు రోజుల్లో మిగతా ప్రవేశ పరీక్షలపైనా స్పష్టత సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణకు మార్గం సుగమమైంది. దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపు తదితర ఆన్లైన్ పనులను నిర్వహించే సర్వీసు ప్రొవైడర్ ఎంపికపై తలెత్తిన వివాదం పరిష్కారమైంది. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి సమావేశమై చర్చించారు. టెండర్లలో తక్కువ రేటు కోట్ చేసిన సర్వీసు ప్రొవైడర్‌కే పనులను అప్పగించాలని కడియం సూచించారు. దీంతో ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణపైనా సెట్స్ కన్వీనర్లు కసరత్తు ప్రారంభించారు. వీటిపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన జారీ చేసే అవకాశముంది. ప్రవేశ పరీక్షల తేదీల్లో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు. 15 రోజుల సమయం వృథా..! సర్వీసు ప్రొవైడర్ ఎంపిక విషయంలో సెట్స్ కన్వీనర్ల కమిటీ నిబంధనలు పాటించలేదంటూ కొందరు సర్వీసు ప్రొవైడర్లు ఉన్నత విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దానిపై ప్రభుత్వం ఉన్నత విద్యా మండలిని, సెట్స్ కన్వీనర్ల కమిటీని వివరణ కోరింది. అయితే తాము గతంలో తరహాలోనే సర్వీసు ప్రొవైడర్‌ను ఎంపికకు చర్యలు చేపట్టామని.. ప్రస్తుతం ఎం చేయమంటారో ప్రభుత్వమే తేల్చాలంటూ ప్రభుత్వానికి విద్యా మండలి వివరణ ఇచ్చింది. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించకపోవడంతో.. గత నెల 27న జారీ కావాల్సిన ఎంసెట్ నోటిఫికేషన్, ఈనెల 3 నుంచి ప్రారంభం కావాల్సిన ఎంసెట్, ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ, 4న జారీ కావాల్సిన లాసెట్ నోటిఫికేషన్ ఆగిపోయాయి. తాజాగా ఈ సమస్య పరిష్కారమైంది. ఈ నేపథ్యంలో ఈనెల 13న ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎంసెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. 15 లేదా 16వ తేదీ నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ దరఖాస్తుల స్వీకరణను ఈనెల 14 నుంచి చేపట్టేలా ఐసెట్ కన్వీనర్ ఓంప్రకాష్ చర్యలు ప్రారంభించారు. షరతుతో ఆయుష్కు దరఖాస్తులు ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి, యోగా వంటి ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలు నీట్ ద్వారా ఉంటాయా, ఎంసెట్ ద్వారా చేపడతారా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలంటూ వైద్యారోగ్య శాఖకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి లేఖ రాసినా సరైన స్పందన రాలేదు. సీబీఎస్ఈ ఇంకా నీట్ ద్వారా ఆయుష్ ప్రవేశాలకు ప్రకటన జారీ చేయనందున ఎంసెట్‌లో చేర్చాలని మౌఖికంగా సూచించినట్లు సమాచారం. అయితే నీట్ ద్వారా ఆయుష్ ప్రవేశాలు చేపడితే విద్యార్థులు నీట్ రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు షరతులతో ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. -
ఎంసెట్, ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా
వాయిదా పడిన ఎంసెట్, ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ సర్వీసు ప్రొవైడర్ ఖరారు కాకపోవడమే కారణం దరఖాస్తుల తేదీలను తరువాత వెల్లడిస్తామన్న సెట్ కమిటీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రవేశపరీక్షలకు నోటిఫికేషన్లు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గందర గోళంగా మారింది. తేదీలు ముందే ప్రకటించినా సర్వీసు ప్రొవైడర్ల ఎంపిక సమస్య కారణంగా వాటిని వాయిదా వేస్తూ వెళుతున్నారు. గత నెల 27న జారీ కావాల్సిన ఎంసెట్ నోటిఫికేషన్ ఆగి పోగా.. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ ఆగిపోయింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 3 నుంచి ఎంసెట్ దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంది. కానీ అసలు నోటిఫికేషనే జారీ కాలేదు. గత నెల 23న జారీ అయిన ఐసెట్ నోటిఫి కేషన్కు సంబంధించి ఈ నెల 3 నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పరీక్షల నిర్వ హణ తేదీలు మాత్రం యథాతథంగా ఉంటాయని ఎంసెట్ కన్వీనర్ యాదయ్య, ఐసెట్ కన్వీనర్ కె.ఓంప్రకాశ్ తెలిపారు. ఇక ఆయుష్ కోర్సులకు సంబంధించిన స్పష్టత కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి రాలేదని ఎంసెట్ కమిటీ వెల్లడించింది. పర్యటనలో విద్యా మండలి.. పట్టించుకోని ప్రభుత్వం సర్వీసు ప్రొవైడర్ ఎంపిక విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో రెండు సెట్స్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. గత నెల 23న ఐసెట్ షెడ్యూల్ ప్రకటించినా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్లు ఉన్నత విద్యలో సంస్కరణల అంశంపై అధ్యయనం చేసేందుకు రాజస్థాన్‌కు వెళ్లారు. దాంతో ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేవారు లేకుండా పోయారు. వారు శుక్రవారం తిరిగి రానున్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. అసలేం జరిగింది? ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో సెట్స్ కన్వీనర్ల కమిటీ గత నెలలోనే సర్వీసు ప్రొవైడర్ ఎంపికకు చర్యలు చేపట్టింది. అయితే ఓపెన్ టెండర్లు పిలవకుండా కన్వీనర్లు తమకు తెలిసిన వారినే పిలిచి సర్వీసు ప్రొవైడర్‌ను ఎంపిక చేస్తున్నారంటూ కొందరు తెలంగాణ సర్వీసు ప్రొవైడర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. గతేడాది తమకు అవకాశమివ్వాలని కోరినా ఇవ్వలేదని, ఈసారైనా ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం ఉన్నత విద్యా మండలిని వివరణ కోరింది. ఇది పరీక్షలకు సంబంధించిన అంశమైనందున తాము పాత పద్ధతిలోనే గుర్తించిన 8 సర్వీసు ప్రొవైడర్లను పిలిచి తక్కువ రేటు కోట్ చేసిన వారికి పనులను అప్పగిస్తున్నట్లు పేర్కొంది. కొత్త వారికి అవకాశమిస్తే పరీక్షల నిర్వహణలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, బహిరంగ టెండర్‌కు వెళితే సమయం సరిపోదని పేర్కొంది. ఈ విషయంలో ఏం చేయాలో తేల్చాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో సర్వీసు ప్రొవైడర్ల ఎంపిక జరగక, దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోయింది. -
ఐసెట్ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
పోచమ్మమైదాన్ / కేయూ క్యాంపస్ : ఐసెట్‌లో అర్హత సాధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం ప్రారంభమైంది. ఈ మేరకు వరంగల్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల్లో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం 1 నుంచి 3వేల వరకు, మధ్యాహ్నం 6001 నుంచి 9వేల వరకు, హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఉదయం 3001 నుంచి 6 వేల వరకు, మధ్యాహ్నం 9001 నుంచి 12వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్లను పరిశీలించారు. పరిశీలన అనంతరం విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో హెల్ప్‌లైన్ సెంటర్ ఇన్చార్జి శంకర్, కోఆర్డినేటర్ అభినవ్, సత్యనారాయణ, రాఘవులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆర్ట్స్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుకర్, ఏటీబీటీ ప్రసాద్, ఎస్ఎం రహమాన్, ఎస్.సుధీర్, డాక్టర్ నహిత, శ్రీలత, అన్వర్‌పాషా, సుధాకర్, అశోక్, శైలజ, రవీందర్‌రెడ్డి, కళాశాల అసిస్టెం ట్ రిజిస్ట్రార్ రాజయ్య పాల్గొన్నారు. నేటి ర్యాంకుల పరిశీలన శనివారం ఉదయం వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో 12,001 నుంచి 15వేల వరకు, మధ్యాహ్నం 18,001 నుంచి 21 వేల వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ఉదయం 15,001 నుంచి 18 వేల వరకు, మధ్యాహ్నం 21,001 నుంచి 24 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. -
ప్రారంభమైన ఐసెట్ కౌన్సెలింగ్
టూటౌన్: నల్లగొండ పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఐసెట్–2016 కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. మొదటి రోజు ఒకటవ ర్యాంకు నుంచి 12000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 222 మంది విద్యార్థులు హాజరు కాగా అధికారులు వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లింగం, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
ఐసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం
ఎచ్చెర్ల : ఎంబీఏ, ఎంసీఏ ప్రథమ ఏడాది ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ రెండో విడత కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పురుషుల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని సహాయ కేంద్రంలో ధృవీకరణ పత్రాలు పరిశీలించారు. తొమ్మిది మంది విద్యార్థులు ధృవీకరణ పత్రాలు పరిశీలనకు హాజరయ్యారు. వీరిలో ఓసీ, బీసీ విద్యార్థులు 8 మంది, ఎస్సీ, ఎస్సీ కేటగిరిలో ఒకరు హాజరయ్యారు. ధృవీకరణ పత్రాలు పరిశీలన పూర్తయిన విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. క్యాంపు ఆఫీసర్ ఆర్.త్రినాధరావు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ టీవీ రాజశేఖర్ కౌన్సెలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్‌కు 768 మంది హాజరు
ఐసెట్ ద్వారా ఎంబీఏలో ప్రవేశానికి గాను సోమవారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 1–5500 ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించగా 484 మంది రిజిస్టరు చేసుకున్నారు. కెమికల్ ఇంజనీరింగు కాలేజీలో 5501–11000 ర్యాంకుల వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరపగా 284 మంది సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో డిగ్రీలో మార్కుల శాతం పరిశీలించాల్సి రావడంతో ఎక్కువ సమయం పట్టింది. దీంతో పాలిటెక్నిక్ కాలేజీలో పొద్దుపోయేవరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మంగళవారం పాలిటెక్నిక్ కాలేజీలో 11,001–16,500 ర్యాంకులు, కెమికల్ ఇంజనీరింగు కాలేజీలో 16,501–22,000 ర్యాంకుల వారికి సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాళ్లు డి.ఫణీంద్ర ప్రసాద్, డాక్టర్ బి.దేముడు కౌన్సెలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఎస్టీ విద్యార్థులు అందరూ పాలిటెక్నిక్ కాలేజీకి హాజరు కావాల్సి ఉంటుంది. -
నేటి నుంచి ఐసెట్ కౌన్సిలింగ్
మురళీనగర్: ఐసెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థులు ఎంబీఏలో చేరడానికి సోమవారం నుంచి కౌన్సిలింగ్ ఐదు రోజుల పాటు నిర్వహిస్తామని పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ డి.ఫణీంద్ర ప్రసాద్ చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజీతో పాటు కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగు కాలేజీలల్లోని కౌన్సెలింగు కేంద్రాలకు అభ్యర్థులు వారికి ర్యాంకులకు కేటాయించిన షెడ్యూల్ ప్రకారం హాజరు కావాల్సి ఉంటుంది. మొదటి రోజు పాలిటెక్నిక్ కాలేజీలో 1–5,500ర్యాంకులు, కెమికల్ ఇంజినీరింగు కాలేజీలో 5,501–11,000ర్యాంకుల వారికి సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. ఎస్టీ కేటగిరి విద్యార్థులు(1–11,000ర్యాంకుల వరకు) అందరూ పాలిటెక్నిక్ కాలేజీకి హాజరు కావాల్సి ఉంటుంది. అయితే డిగ్రీలో ఓసీ విద్యార్థులు 50% (49.50%), బీసీ/ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 45%(44.50%)మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులురూ.500లు, ఇతరులు రూ.1,000లు రిజిస్ట్రేషను ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సర్టిఫికెట్లు: విద్యార్థులు తమతోపాటు ఐసెట్ ర్యాంకు కార్డు, ఐసెట్ హాల్ టికెట్, ఎస్ఎస్సి మార్కుల సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, డిగ్రీ ప్రొవిజనల్/ఓడీ/అన్ని సంవత్సరాల మార్కుల మెమొరాండమ్లు, 9వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్, జనవరి1, 2016తర్వాత పొందిన ఆదాయ ధవపత్రం, కులం ధ్రువపత్రాలు రెండు సెట్ల జెరాక్సి కాపీలు, ఒరిజినల్స్‌తో హాజరు కావాల్సి ఉంటుంది. -
నేటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
జేఎన్టీయూ: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్–2016 కౌన్సెలింగ్ సోమవారం నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఆష్రప్ ఆలీ తెలిపారు. ఎస్కేయూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అనంతపురంలో రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు ఒరిజనల్ మార్క్స్కార్డులతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలన్నారు. -
25 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఐసెట్–2016కు కౌన్సెలింగ్‌ను ఈ నెల 25 నుంచి ఎస్‌జీపీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తామని కోఆర్డినేటర్ వై.విజయభాష్కర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 25 నుంచి 29వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందన్నారు. జూలై 28 నుంచి 30వ తేదీ వరకు కళాశాలలకు ఆప్షన్లు, ఆగస్టు రెండో తేదీ కళాశాలల కేటాయింపు ప్రక్రియ ఉంటుందన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500, బీసీ/ఓసీ విద్యార్థులు రూ.1000 చెల్లించాలన్నారు. ఎన్సీసీ/పీహెచ్సీ/క్యాప్/స్పోర్ట్స్ కేటగిరీ వారికి విజయవాడ బెంజ్ సర్కిల్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఐసెట్–2006 హాల్‌టికెట్, ర్యాంకు కార్డు, ఆధార్‌కార్డు, పది, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితాలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 9 నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్ల ఒరిజినల్స్, రెండు సెట్ల జిరాక్స్ ప్రతులతో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ (www.apicet.nic.in) లో చూడాలన్నారు. -
నేటి ఐసెట్‌కు సర్వం సిద్ధం
► మహబూబ్‌నగర్, వనపర్తిలో కేంద్రాల ఏర్పాటు ► హాజరుకానున్న 2,500మంది అభ్యర్థులు పాలమూరు యూనివర్సిటీ : ఐసెట్ ఎంట్రెన్స్‌కు పీయూ అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో గురువారం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఎంవీఎస్ , ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల, బాలుర జూనియర్ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దానితో పాటు వనపర్తిలో ఉమెన్స్ కళాశాలలో సెంటర్ వేశారు. జిల్లాలో మొత్తం 2,500మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్షను రాయబోతున్నారు. పరీక్ష ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు కొనసాగుతుంది. బయోమెట్రిక్ విధానం ఉండటం వల్ల గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు నిమిషం అలస్యం అయిన పరీక్ష కేంద్రంలోపలికి అనుమతి లేదు. ప్రతి అభ్యర్థి ఐడి కోసం ఆధార్ కార్డు కానీ ఇతర పత్రాలు ఏదైన ఒకటి ఉండాలి. సెల్‌ఫోన్, గడియారం, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి వెంట తీసుకురావద్దు. ప్రతి అభ్యర్థికి సంబంధించిన హాల్‌టికెట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా సెంటర్స్‌లలో పరీక్ష నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీయూ కంట్రోలర్ మధుసూధన్‌రెడ్డి చెప్పారు. ప్రతి కేంద్రంలో ఇద్దరు అధికారులు ఉండి పరీక్షలను పర్యవేక్షించనున్నారు. -
నేడు ఐసెట్ ప్రవేశ పరీక్ష
► నిమిషం ఆలస్యమైనా అనుమతించరు ► రాష్ట్ర వ్యాప్తంగా 138 పరీక్ష కేంద్రాలు ఏయూక్యాంపస్(విశాఖపట్నం): రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సంయుక్త ప్రవేశ పరీక్ష ఐసెట్ 2016ను సోమవారం నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఆచార్య కె.రామ్మోహన్రావు తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షకు 70,065 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం 9.30 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాలలోనికి అనుమతిస్తారు. 10 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని కన్వీనర్ స్పష్టంచేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 138 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. సోమవారం ఉదయం 6 గంటలకు ఏయూ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఐసెట్ ప్రవేశ పరీక్షసెట్ కోడ్ 'విటీఎస్‌టీ' ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఇతర సమాచారం కోసం 8374569978, 0891-2579797 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. -
మే2న తెలంగాణ ఎంసెట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కామన్ ఎంట్రెన్స్ టెస్టు తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు సెట్ల తేదీలను ప్రకటించారు. ఈ ఏడాది ఎంసెట్, ఈసెట్ నిర్వహణ బాధ్యతలు జేఎన్టీయూ నిర్వహించనుంది. ఎడ్ సెట్, పీజీ సెట్ల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్శిటీకి అప్పగించారు. ఐసెట్, లా సెట్ నిర్వహణ బాధ్యతలు కాకతీయ యూనివర్శిటీ నిర్వహించనుంది. మే2న ఎంసెట్ మే12న ఈసెట్ మే19న ఐసెట్ మే24న లాసెట్ మే27న ఎడ్ సెట్ మే29 న పీజీసెట్ -
మే 5న ఏపీ ఎంసెట్
-
మే 5న ఏపీ ఎంసెట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇంటర్ విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా భావించే ఎంసెట్ తదితర పరీక్షల తేదీలు ఈ కింద విధంగా ఉన్నాయి.. ఏపీ సెట్ పరీక్ష తేదీలు ఎంసెట్ మే 5, 2016 (గురువారం) ఈసెట్ మే 9, 2016 (సోమవారం) ఐసెట్ మే 16, 2016 (సోమవారం) ఎడ్‌సెట్ మే 23, 2016 (సోమవారం) పీజీసెట్ మే 26, 2016 (గురువారం) లాసెట్ మే 28, 2016 (శనివారం) పీజీఎల్సీసెట్ మే 28, 2016 (శనివారం) పీఈసెట్ మే 9, 2016 (సోమవారం) -
ముగిసిన ఎంబీబీఎస్ సీట్ల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ శుక్రవారం ముగిసింది. రెండో విడత కౌన్సెలింగ్ తొలిరోజు మొత్తం 753 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే తొలివిడతలో మిగిలిపోయిన 74 ఎంబీబీఎస్ సీట్లు మొదటి రోజే భర్తీ అయ్యాయి. ఇక బీడీఎస్‌లో భర్తీ అయిన సీట్లు పోనూ ఇంకా 78సీట్లున్నాయి. వీటికి శనివారం కౌన్సెలింగ్ జరుగనుంది. ఐసెట్ కౌన్సెలింగ్ పూర్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన ఐసెట్ చివరి దశ కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగిసినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ ప్రకటించారు. తొలి దశ కౌన్సెలింగ్‌లో 26,826 సీట్లకు 20,243 మంది కాలేజీల్లో చేరినట్లు పేర్కొన్నారు. చివరి దశ కౌన్సెలింగ్‌లో 6,583 సీట్లను కేటాయించగా 3,893 సీట్లు మిగిలిపోయాయన్నారు. చివరి దశ లో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 16లోగా ఫీజు చెల్లించి, కాలేజీల్లో ఈ నెల 12 నుంచి 16లోగా చేరాలని, అంతకంటే ముందుగా వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలన్నారు. ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్‌కు చివరి అవకాశం హైదరాబాద్: ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు తత్కాల్ కింద చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు ఈనెల 12 నుంచి 15లోగా పరీక్ష ఫీజుతోపాటు తత్కాల్ కింద అదనంగా రూ. 1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. -
నేటితో ఐసెట్ వెబ్ ఆప్షన్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన తెలంగాణ ఐసెట్ వెబ్ ఆప్షన్లు సోమవారం పూర్తి కానున్నాయి. ఆప్షన్ల ప్రక్రియ ముగియనుండటంతో అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. ఇప్పటివరకు 28,121 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకున్నట్లు తెలిపారు. -
తెలంగాణ లాసెట్, ఐసెట్ ఫలితాల విడుదల
హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించిన లాసెట్, ఐసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ ఐసెట్‌లో కష్ణా జిల్లాకు చెందిన కృష్ణ చైతన్య తొలి ర్యాంక్ సాధించాడు. (ఐసెట్ ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి) (లాసెట్ ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి) -
ఐసెట్/ ఎడ్‌సెట్.. గెలుపు మార్గాలు
ఉన్నత విద్యాకోర్సులుగా విరాజిల్లుతున్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశించాలనుకునే వారు రాయాల్సిన పరీక్ష ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్)! గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించేందుకు అవసరమైన బీఈడీ కోర్సులో చేరేందుకు మార్గం ఎడ్‌సెట్! ఈ రెండు పరీక్షలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నోటిఫికేషన్లు జారీఅయ్యాయి. గతేడాది వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఈ పరీక్షలు ఇప్పుడు వేర్వేరుగా నిర్వహించనున్నారు. ఐసెట్, ఎడ్‌సెట్ పరీక్ష విధివిధానాలు.. విజయానికి మార్గాలు.. ఐసెట్ బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో మేనేజ్మెంట్ పీజీ పూర్తి చేసి కార్పొరేట్ కొలువు సొంతం చేసుకోవాలని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ఐసెట్ రాసే వారి సంఖ్య దాదాపు లక్షన్నరకు పైగా ఉంటోంది. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన పరీక్షలో ఆంధ్రప్రదేశ్‌లోని 61,326, తెలంగాణ రాష్ట్రంలోని 58,453 సీట్లకు 1.42 లక్షల మంది పోటీ పడ్డారు. ఈ ఏడాది కొత్తగా రెండు రాష్ట్రాలు వేర్వేరుగా ఐసెట్ నిర్వహిస్తున్నాయి. అయితే, అదే నిష్పత్తిలో పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. పోటీ తీవ్రత దృష్ట్యా మంచి కాలేజీలో సీటు సాధించాలనుకునే విద్యార్థులు ఇప్పటినుంచే మంచి ర్యాంకు దిశగా కృషి చేయాలి. వాస్తవానికి అందుబాటులోని సీట్లు, ఉత్తీర్ణత శాతం పరిగణనలోకి తీసుకుంటే సీటు గ్యారెంటీ. కానీ మంచి కాలేజ్‌లో సీటు పొందాలంటే మెరుగైన ర్యాంకుతోనే సాధ్యం. పరీక్ష స్వరూపంపై అవగాహన: ఐసెట్ ఔత్సాహిక అభ్యర్థులు పరీక్ష స్వరూపంపై అవగాహన ఏర్పరచుకోవడంతో తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి. ఐసెట్ మొత్తం మూడు విభాగాల్లో(అనలిటికల్ ఎబిలిటీ; మ్యాథమెటికల్ ఎబిలిటీ; కమ్యూనికేషన్ ఎబిలిటీ) 200 ప్రశ్నలకు ఉంటుంది. ఒక్కో విభాగంలో మళ్లీ ఉప-విభాగాలు ఉంటాయి. అనలిటికల్ ఎబిలిటీ ఈ విభాగంలో రెండు ఉప విభాగాలు.. డేటా సఫిషియెన్సీ; ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటిలో డేటా సఫిషియన్సీలో రాణించాలంటే అర్థమెటిక్ అంశాల్లో పట్టు సాధించడం చాలా అవసరం. ‘స్టేట్మెంట్ బేస్డ్’ ప్రశ్నలు ఎదురయ్యే ఈ విభాగంలో.. ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైనదేదో గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం సునిశిత పరిశీలన, గణితంపై ప్రాథమిక అవగాహన అవసరం. రీజనింగ్ ఆధారిత ప్రశ్నలు ఎదురయ్యే ప్రాబ్లమ్ సాల్వింగ్ విభాగంలోని సిరీస్, బ్లడ్ రిలేషన్, ఎరేంజ్మెంట్, కోడింగ్, డీ-కోడింగ్ వంటి అంశాలపై పట్టు సాధించాలి. మ్యాథమెటికల్ ఎబిలిటీ మ్యాథమెటికల్ ఎబిలిటీలో మొత్తం మూడు ఉప విభాగాలు.. అర్థమెటికల్ ఎబిలిటీ; అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ; స్టాటిస్టికల్ ఎబిలిటీ ఉంటాయి. గణితం ప్రాథమిక అంశాలపై పట్టు సాధించడం ద్వారా ఈ మూడు ఉప విభాగాల్లో రాణించొచ్చు. ఇందుకోసం ఆరు నుంచి పదో తరగతి వరకూ మ్యాథమెటిక్స్ పుస్తకాలు సమగ్రంగా అధ్యయనం చేయాలి. స్టాటిస్టికల్ ఎబిలిటీలోని ప్రాబబిలిటీ, ఇనీక్వాలిటీస్ కోసం ఇంటర్మీడియెట్ స్థాయి గణిత పుస్తకంలోని అంశాల అధ్యయనం కలిసొస్తుంది. అర్థమెటిక్ విభాగంలో పర్సంటేజీ, లాభనష్టాలు, జామెట్రీ, మెన్సురేషన్, సింపుల్ ఈక్వేషన్స్‌పై పట్టు మేలు చేస్తుంది. అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ కోసం గ్రాఫ్స్, సూత్రాలను అధ్యయనం చేయడంతోపాటు ప్రాక్టీస్ చేయడం మంచిది. కమ్యూనికేషన్ ఎబిలిటీ విశ్లేషణ నైపుణ్యం, తులనాత్మక పరిశీలన సామర్థ్యం కలిగిన అభ్యర్థులు తేలిగ్గా సమాధానాలు ఇవ్వగల విభాగం.. కమ్యూనికేషన్ ఎబిలిటీ. ఇందులో నాలుగు ఉప విభాగాలు.. వొకాబ్యులరీ; బిజినెస్ అండ్ కమ్యూనికేషన్ టెర్మినాలజీ; ఫంక్షనల్ గ్రామర్; రీడింగ్ కాంప్రహెన్షన్. బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టుతో వొకాబ్యులరీ ప్రశ్నలను సులభంగా సాధించొచ్చు. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఉండే రీడింగ్ కాంప్రహెన్షన్‌లో ఏదైనా ఒక అంశానికి సంబంధించి వ్యాసాలు చదివి, సారాంశాన్ని గ్రహించే నేర్పు సొంతం చేసుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికల్లోని వ్యాసాలు; ఇంగ్లిష్ స్టోరీ బుక్స్ చదవడం ఉపయుక్తం. ఫంక్షనల్ గ్రామర్‌లో అధిక శాతం ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సినానిమ్స్, యాంటానిమ్స్, కొశ్చన్ ట్యాగ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇందుకోసం ఆరు నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ గ్రామర్ బుక్స్ చదవడం మేలు. కంప్యూటర్ అండ్ బిజినెస్ టెర్మినాలజీలో పది ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ సమకాలీనంగా వ్యాపార, వాణిజ్య రంగాల్లో వినియోగించే పదజాలానికి సంబంధించి ఉంటాయి. ఇందుకోసం బిజినెస్ పత్రికలు, కంప్యూటర్ మ్యాగజైన్లు చదవడం లాభిస్తుంది. ప్రాక్టీస్ ఫర్ బెస్ట్ ర్యాంకు ఐసెట్‌లో నిర్దేశించిన విభాగాలు, ప్రశ్నల తీరును విశ్లేషిస్తే ప్రాక్టీస్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అర్థమవుతోంది. కాన్సెప్ట్స్‌ను అవగాహన చేసుకుంటూ ఒక అంశాన్ని భిన్న కోణాల్లో అధ్యయనం చేయడం ఎంతో అవసరం. ముఖ్యంగా మ్యాథమెటికల్, అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ విభాగాల్లో కాన్సెప్ట్స్ అవగాహనతోనే పట్టుసాధించొచ్చు. పదో తరగతి తర్వాత మ్యాథ్స్ సబ్జెక్ట్‌కు దూరంగా ఉన్న విద్యార్థులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రతి రోజు కనీసం పది గంటలు ప్రిపరేషన్ సాగించేలా టైమ్‌ప్లాన్ రూపొందించుకోవాలి. అందులో ప్రాక్టీస్ ఆధారిత విభాగాలకు కొంత ఎక్కువ సమయం కేటాయించాలి. ఇంజనీరింగ్ విద్యార్థులకు దీటుగా ఇటీవల కాలంలో ఐసెట్, క్యాట్ వంటి మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్‌లలో ఇంజనీరింగ్ విద్యార్థుల హవా కనిపిస్తోంది. దీనికి కారణం ఆయా ఎంట్రన్స్‌లలో పేర్కొన్న సిలబస్‌లోని అంశాలు ఇంజనీరింగ్ విద్యార్థుల అకడమిక్స్‌తో అనుసంధానంగా ఉండటమే. దీన్ని చూసి చాలా మంది నాన్-ఇంజనీరింగ్, నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు ఆందోళన చెందుతుంటారు. వాస్తవానికి ప్రతిఒక్కరూ సులువుగా చేయగలిగే విభాగాలు.. రీజనింగ్, డేటా సిఫిషియన్సీ; వొకాబ్యులరీ; బిజినెస్ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ; రీడింగ్ కాంప్రహెన్షన్; ఫంక్షనల్ గ్రామర్.. రిఫరెన్స్ బుక్స్ అర్థమెటిక్: ఆర్.ఎస్.అగర్వాల్, త్రిష్ణ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్: పదో తరగతి లెక్కల పుస్తకం రీజనింగ్: ఆర్.ఎస్.అగర్వాల్, సిజ్వాలి ఇంగ్లిష్: న్యూస్ పేపర్లు, స్టోరీ బుక్స్, వీటితోపాటు మార్కెట్లో లభించే మోడల్ ప్రశ్న పత్రాలు ఐసెట్.. ఏపీ, టీఎస్ ఒకే తీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఐసెట్‌ను వేర్వేరుగా నిర్వహిస్తున్నప్పటికీ పరీక్ష స్వరూపం, అర్హతలకు సంబంధించి ఒకే తీరుగా ఉన్నాయి. వివరాలు.. అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంసీఏ ఔత్సాహికులు ఇంటర్మీడియెట్ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివుండాలి. పరీక్ష స్వరూపం సెక్షన్-ఎ అనలిటికల్ ఎబిలిటీ ప్రశ్నలు మార్కులు ఉప విభాగం-1 డేటా సఫిషియన్సీ 20 20 ఉప విభాగం-2 ప్రాబ్లమ్ సాల్వింగ్ 55 55 సెక్షన్-బి మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉప విభాగం అర్థమెటికల్ ఎబిలిటీ 35 35 ఉప విభాగం అల్జీబ్రా అండ్ జామెట్రికల్ ఎబిలిటీ 30 30 ఉప విభాగం స్టాటిస్టికల్ ఎబిలిటీ 10 10 సెక్షన్-సి కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉప విభాగం వొకాబ్యులరీ 10 10 ఉప విభాగం బిజినెస్ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ 10 10 ఉప విభాగం ఫంక్షనల్ గ్రామర్ 15 15 ఉప విభాగం రీడింగ్ కాంప్రహెన్షన్ 15 15 ముఖ్య తేదీలు ఏపీ ఐసెట్ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 13 ఏప్రిల్, 2015 రూ.500 అపరాధ రుసుముతో: 20 ఏప్రిల్, 2015 ఆన్లైన్ దరఖాస్తు సవరణ: 21 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: ఏప్రిల్ 30, 2015 పరీక్ష తేదీ: మే 16, 2015 వివరాలకు వెబ్సైట్: apicet15.org టీఎస్ ఐసెట్ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 9 ఏప్రిల్, 2015 రూ.500 అపరాధ రుసుముతో: 16 ఏప్రిల్, 2015 ఆన్లైన్ దరఖాస్తు సవరణ: 17 ఏప్రిల్ నుంచి 25 ఏప్రిల్ వరకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: ఏప్రిల్ 30, 2015 పరీక్ష తేదీ: మే 22, 2015 వివరాలకు వెబ్సైట్: www.tsicet.org 16 రీజనల్ సెంటర్లు ఏపీ ఐసెట్ నిర్వహణకు ప్రాథమికంగా 16 రీజనల్ సెంటర్లను నిర్ణయించాం. పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. ఆన్లైన్ దరఖాస్తు విధానం నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే ఆ ప్రక్రియ పూర్తి చేసుకుంటే పొరపాట్లు తలెత్తకుండా ఉంటాయి. దరఖాస్తుల సంఖ్య పరంగా గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పోటీ ఉంటుందని భావిస్తున్నాం. అయితే మంచి కళాశాలలో సీటు సాధించే దిశగా అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. - ప్రొఫెసర్ సి.హెచ్.వి. రామచంద్రమూర్తి, ఏపీఐసెట్ కన్వీనర్ ఉపాధ్యాయ విద్యకు ఎడ్‌సెట్ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనే ఔత్సాహికులకు సరైన కోర్సు బీఈడీ. టీచర్‌గా రాణించేందుకు అవసరమైన నెపుణ్యాలు అందించే ఈ బీఈడీలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష ఎడ్‌సెట్. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 6న; ఆంధ్రప్రదేశ్‌లో మే 28న ఎడ్‌సెట్ జరుగనుంది. బీఈడీ రెండేళ్లు బీఈడీకి సంబంధించి ముఖ్యమైన మార్పు.. ఈ కోర్సు వ్యవధి రెండేళ్లకు పెరగడం. గతేడాది వరకు సంవత్సరం వ్యవధిగా ఉన్న బీఈడీని కేంద్రప్రభుత్వ తాజా నిర్ణయంతో 2015-16 నుంచి రెండేళ్లకు పెరిగింది. దాంతో గతంతో పోల్చితే ఎడ్‌సెట్‌కు దరఖాస్తుల సంఖ్య కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. అది పదిశాతం మేరకే ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన ఎడ్‌సెట్-2014కు 1,65 781 మంది హాజరయ్యారు. అందులో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఓయూ రీజియన్ నుంచే అత్యధికంగా 1,11,742 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో గత సంవత్సరం 13 జిల్లాల నుంచి 54,039 మంది హాజరయ్యారు. ఒకవేళ బీఈడీ రెండేళ్లుగా మారిన కారణంగా ఔత్సాహికుల సంఖ్య తగ్గినా.. పోటీ లక్షకుపైగానే ఉంటుందంటున్నారు. దాంతో ఎడ్‌సెట్ అభ్యర్థులు మంచి ర్యాంకు కోసం ఇప్పటినుంచే కృషి చేయాలి. ఎడ్‌సెట్ తీరు ఇలా ఎడ్‌సెట్ మూడు పార్ట్లు.. పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సిగా ఉంటుంది. ఇందులో పార్ట్-ఎలో జనరల్ ఇంగ్లిష్ 25 ప్రశ్నలు-25 మార్కులు; పార్ట్-బిలో జనరల్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు-15 మార్కులు; టీచింగ్ ఆప్టిట్యూడ్ 10 ప్రశ్నలు-10 మార్కు లు.. ఎడ్‌సెట్ అభ్యర్థులందరూ రాయాల్సిన విభాగాలు. ఇక పార్ట్-సిలో అభ్యర్థులు తమ ఆప్షనల్ సబ్జెక్ట్‌కు అనుగుణంగా పేపర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్ట్-సిలో అయిదు సబ్జెక్ట్ పేపర్స్ ఉన్నాయి. అవి.. మ్యాథమెటిక్స్: 100 ప్రశ్నలు (100 మార్కులు); ఫిజికల్ సెన్సైస్: 100 ప్రశ్నలు. ఇందులో ఫిజిక్స్ నుంచి 50; కెమిస్ట్రీ నుంచి 50 ప్రశ్నలుంటాయి. మార్కులు- 100; బయలాజికల్ సెన్సైస్: 100 ప్రశ్నలు. ఇందులో బోటనీ నుంచి 50; జువాలజీ నుంచి 50 ప్రశ్నలు చొప్పున ఉంటాయి. మార్కులు- 100; అలాగే సోషల్ స్టడీస్- 100 ప్రశ్నలు. ఇందులో జాగ్రఫీ నుంచి 35; హిస్టరీ నుంచి 30; సివిక్స్ నుంచి 15; ఎకనామిక్స్ నుంచి 20 ప్రశ్నలుంటాయి. మొత్తం మార్కులు-100; ఇంగ్లిష్: 100 ప్రశ్నలు-100 మార్కులు. కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ ఎడ్‌సెట్‌లో మెరుగైన ర్యాంకు సొంతం చేసుకోవాలంటే కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్‌ను అలవర్చుకోవాలి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉన్నప్పటికీ ఒక ప్రశ్నకు సంబంధించి నేపథ్యం నుంచి తాజా పరిణామాల వరకు అన్ని కోణాల్లో అవగాహన ఉంటేనే సరైన సమాధానం ఇచ్చే వీలుంటుంది. ముఖ్యంగా ఫార్ములాలు; థీరమ్స్ ఆధారంగా ఉండే మ్యాథమెటిక్స్; ఫిజిక్స్; కెమిస్ట్రీల్లో అప్లికేషన్ ఓరియెంటేషన్ ఎంతో అవసరం. అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉండే ఇంగ్లిష్ విభాగంలో మంచి మార్కుల కోసం బేసిక్ గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా రీడింగ్ కాంప్రహెన్షన్ కోసం స్టాండర్డ్ న్యూస్ పేపర్స్‌లోని వార్తలను, విశ్లేషణలను చదవాలి. జనరల్ నాలెడ్జ్ కోసం కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు, ద్వైపాక్షిక ఒప్పందాలు; అవార్డులు-రివార్డ్‌లు వంటి వాటిపై దృష్టి సారించాలి. ఎడ్‌సెట్ అభ్యర్థులు పరిశీలన నైపుణ్యం, విశ్లేషణ సామర్థ్యంతో దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగే విభాగం టీచింగ్ ఆప్టిట్యూడ్. ఇందులో అభ్యర్థిలోని టీచింగ్ దృక్పథాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. కాస్త సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఈ విభాగంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వొచ్చు. సోషల్ స్పెషల్‌గా సోషల్ స్టడీస్ విభాగంలో సాధారణంగా పోటీ ఎక్కువగా ఉంటుంది. గతేడాది మొత్తం 1,65,781 మంది అభ్యర్థుల్లో సోషల్ ఔత్సాహికుల సంఖ్య దాదాపు 73, 763. కాబట్టి పోటీ తీవ్రంగా ఉన్న దృష్ట్యా సోషల్ విభాగంలో అడిగే హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ అన్నిటికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా ఆయా విభాగాలకు సంబంధించి తాజా పరిణామాల సమాచార సేకరణ కూడా ఎంతో అవసరం. ఇటీవల కాలంలో పర్యావరణ కాలుష్యం, ప్రకృతి విపత్తులు వం టివి చర్చనీయాంశాలుగా మారాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రఫీలో వాటి నేపథ్యాల అధ్యయనం ముఖ్యం. అదేవిధంగా సివిక్స్, ఎకనామిక్స్‌కు సంబంధించి తాజాగా రాజకీయ, ఆర్థిక,వాణిజ్య పరిణామాలపై అవగాహన పెంచుకోవాలి. రిఫరెన్స్ బుక్స్ మెథడాలజీ సబ్జెక్స్కు సంబంధించి ఆరు నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు అకడమిక్ పుస్తకాలు క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఇంగ్లిష్ కోసం ప్రామాణిక గ్రామర్ బుక్‌ను, ఇంగ్లిష్ దిన పత్రికలను చదవాలి. ఇంగ్లిష్ మెథడాలజీ కోసం బ్యాచిలర్ డిగ్రీ స్థాయి ఇంగ్లిష్ అకడమిక్ పుస్తకాలతోపాటు ఇంగ్లిష్ సాహిత్యంలో పేరు గడించిన రచనలు చదవడం లాభిస్తుంది. ఏపీ, టీఎస్ ఎడ్‌సెట్ సమాచారం అర్హతలు మ్యాథమెటిక్స్ మెథడాలజీ: మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్‌గా బీఏ/బీఎస్సీ/బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు, ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్ చదివిన బీసీఏ ఉత్తీర్ణులు. ఫిజికల్ సెన్సైస్: ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా అల్లైడ్ మెటీరియల్ సైన్స్ ఒక సబ్జెక్ట్‌గా బీఎస్సీ/బీటెక్/బీఈ ఉత్తీర్ణులు/ ఇంటర్మీడియెట్‌లో ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్‌గా చదివిన బీసీఏ ఉత్తీర్ణులు. బయలాజికల్ సెన్సైస్: బోటనీ, జువాలజీ లేదా అనుబంధ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్‌లు గ్రూప్ సబ్జెక్ట్‌లుగా బీఎస్సీ/బీఎస్సీ(హోం సైన్స్) ఉత్తీర్ణత. ఇంటర్మీడియెట్‌లో బయలాజికల్ సైన్స్ చదివిన బీసీఏ ఉత్తీర్ణులు. సోషల్ స్టడీస్: బీఏ/ బీకాం/ బీబీఎం ఉత్తీర్ణులు. ఇంగ్లిష్: బీఏ స్పెషల్ ఇంగ్లిష్ / బీఏ లిటరేచర్/ ఎంఏ ఇంగ్లిష్ ఉత్తీర్ణులు. ఆయా కోర్సుల చివరి సంవత్సరం అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ఎడ్‌సెట్ ముఖ్య తేదీలు ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 23 ఏప్రిల్, 2015 రూ. 500 అపరాధ రుసుముతో: 30 ఏప్రిల్, 2015 హాల్‌టికెట్ డౌన్లోడ్: మే 15, 2015 పరీక్ష తేదీ: మే 28, 2015 వివరాలకు వెబ్సైట్: www.ape-dcet.org టీఎస్ ఎడ్‌సెట్ ముఖ్య తేదీలు ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 7 మే 2015 రూ. 500 అపరాధ రుసుముతో: 14 మే 2015 హాల్‌టికెట్ డౌన్లోడ్: 31 మే, 2015 పరీక్ష తేదీ: 6 జూన్, 2015 వివరాలకు వెబ్సైట్: www.tsedcet.org పోటీ తగ్గే అవకాశాలు లేవు బీఈడీ కోర్సు వ్యవధిని రెండేళ్లకు పెంచడంతో ఆ కోర్సు ఔత్సాహికుల సంఖ్య తగ్గుతుందని, ఈ కారణంగా ఎడ్‌సెట్ పోటీ తగ్గుందని భావించొద్దు. ఔత్సాహిక అభ్యర్థులకు డిగ్రీ వార్షిక పరీక్షల తర్వాత కూడా ఆశించదగిన స్థాయిలో సమయం అందుబాటులో ఉంది. ఈ సమయాన్ని ప్రిపరేషన్‌పరంగా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా కొత్త కళాశాలలు, సీట్ల సంఖ్యకు సంబంధించి ఎంట్రన్స్ తేదీ నాటికి స్పష్టత లభిస్తుంది. - ప్రొఫెసర్ పి. ప్రసాద్, టీఎస్ ఎడ్‌సెట్ కన్వీనర్ అకడమిక్ పుస్తకాలు, కాంటెంపరరీ అవగాహనతో ఎడ్‌సెట్ ఔత్సాహికులు అకడమిక్ పుస్తకాల్లోని అంశాల్లో పరిపూర్ణత సాధిస్తే ఎడ్‌సెట్ లక్ష్యం సులభంగా ఛేదించొచ్చు. అంతేకాకుండా సోషల్ స్టడీస్ మెథడాలజీ అభ్యర్థులు అకడమిక్ అంశాలను సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ ప్రణాళిక అనుసరిస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. - నందీశ్వర్ కుమార్, ఎడ్‌సెట్ -2014 (సోషల్) టాపర్ బీఈ, బీటెక్ విద్యార్థులు కూడా బీఈడీకి అర్హులే ఉపాధ్యాయ విద్య కోర్సుల నియంత్రణ సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ తీసుకున్న తాజా నిర్ణయంతో బీఈ, బీటెక్ విద్యార్థులు కూడా బీఈడీ కోర్సు చేసేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అర్హత లభించనుంది. బీఈడీలోని మ్యాథమెటిక్స్, ఫిజికల్ సెన్సైస్ మెథడాలజీ సబ్జెక్ట్‌లకు మాత్రమే అర్హులు. అంతేకాకుండా ఇంటర్మీడియెట్ స్థాయిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివుండాలి. అదే విధంగా బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్‌లో సంబంధిత సబ్జెక్ట్‌లనే ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవాలి. ఎడ్యూన్యూస్ 127 కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సు డిగ్రీ... స్కిల్ డెవలప్మెంట్ పరంగా పలు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వీటికి సంబంధించి యూజీసీ ప్రత్యేక కోర్సుల రూపకల్పనకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ డిగ్రీ పేరుతో అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో వత్తి విద్య కోర్సులు అందించేందుకు దేశ వ్యాప్తంగా 127 కళాశాలలకు అనుమతులు జారీ చేసింది. బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ డిగ్రీ పథకం పరిధిలో 2014-15 విద్యా సంవత్సరం నుంచి 2018-19 విద్యా సంవత్సరం వ్యవధిలో అయిదు వందల ఇన్స్టిట్యూట్లో ఈ కోర్సు ను ప్రవేశపెట్టి దాదాపు 5 లక్షల మందికి నైపుణ్యాలు అందించడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకం పేరుతో ఏర్పాటు చేసిన ఓ్చఠటజ్చి కేంద్రాల ద్వారా వత్తి విద్య విభాగంలో సర్టిఫికెట్ నుంచి రీసెర్చ్ వరకు అందించనున్న కోర్సులకు; కమ్యూనిటీ కాలేజ్ స్కీం లకు అదనంగా బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ డిగ్రీ స్కీంను అమలు చేస్తోంది. -
మే 10న ఉమ్మడి ఎంసెట్
* షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ఉన్నత విద్యా మండలి సాక్షి, హైదరాబాద్: వచ్చే మే 10వ తేదీన ఉమ్మడి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్) నిర్వహించనున్నారు. ఎంసెట్ సహా అన్ని సెట్లనూ ఉమ్మడిగానే మే నెలలో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్) మే 14న, ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్) 16న, ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్)ను 28న, లా కోర్సుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (లాసెట్, పీజీఎల్‌సెట్) 30న నిర్వహించనున్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీ ఈసెట్) మే 25 నుంచి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీఈసెట్) మే 14న నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి తెలిపారు. సోమవారం మండలి కార్యాలయంలో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ విజయ్ ప్రకాశ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ తామే ఎంసెట్‌తో పాటు ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహించి విద్యార0ు్థలకు ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. విభజన చట్టంలోని సెక్షన్ 75, 95ల ప్రకారం రెండు రాష్ట్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించే అధికారం ఏపీ ఉన్నత విద్యామండలికే ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉన్నత విద్యామండలికి చట్టబద్ధత లేదని తేల్చి చెప్పారు. -
అంతా ‘సెట్’రైట్
* పది రోజుల్లో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు * ఇంటర్ బోర్డు ఏర్పాటుతో మార్గం సుగమం * పలు ‘సెట్’ల నిర్వహణ తేదీలపై దృష్టిపెట్టిన ఉన్నత విద్యాశాఖ * ఉన్నత విద్యా మండలి, వర్సిటీలతో ఉన్నతస్థాయి భేటీకి ఏర్పాట్లు * 15 శాతం సీట్లకు ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులకు అవకాశం * తెలంగాణ సెట్స్ రాసిన వారికే మెరిట్‌ను బట్టి అడ్మిషన్లు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాటుతో తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు(సెట్స్) మార్గం సుగమమైంది. ఇంటర్ పరీక్షల వ్యవహారం ఇన్నాళ్లూ తేలకపోవడంతో ఈ నెల తొలి వారంలో ప్రకటించాల్సిన సెట్స్ నిర్వహణ తేదీలు ఖరారు కాలేదు. ప్రస్తుతం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసుకోవడంతో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలపై ఉన్నత విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌తో సంబంధం లేకుండా తెలంగాణలో సొంతంగానే సెట్స్‌ను నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. మరో పది రోజుల్లో ఆయా పరీక్షల తేదీలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. బీటెక్, ఎంబీబీఎస్‌లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ను, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఐసెట్‌ను, ఎంటెక్, ఎంఫార్మసీ కోసం పీజీఈసెట్‌ను, న్యాయ విద్యలో ప్రవేశాలకు లాసెట్‌ను, బీఎడ్‌లో చేరడానికి ఎడ్‌సెట్‌ను, డిప్లొమా విద్యార్థులు నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు(లేటరల్ ఎంట్రీ) ఈసెట్‌ను, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాల కోసం పీఈసెట్‌ను నిర్వహించేందుకు తేదీలను అధికారులు ప్రకటించనున్నారు. త్వరలో ఉన్నతస్థాయి సమావేశం సెట్స్ తేదీల ఖరారుపై త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లతో సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. సెట్స్ నిర్వహణకు సంబంధించిన అంశాలపై యూనివర్సిటీ వర్గాలతో చర్చించి అధికారులు సమగ్ర నివేదిక రూపొందించనున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించాలని వారు భావిస్తున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణలో అనుభవమున్న జేఎన్టీయూహెచ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాలకు కీలక సెట్స్ బాధ్యతలను అప్పగించే అవకాశముంది. కొత్త వర్సిటీలైన పాలమూరు, తెలంగాణ, మహత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీలకు తక్కువ మంది విద్యార్థులు పోటీ పడే సెట్స్‌ను నిర్వహించే బాధ్యతలను అప్పగించాలని అధికారులు యోచిస్తున్నారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. గత పదేళ్లుగా ఎంసెట్‌ను నిర్వహిస్తున్న హైదరాబాద్ జేఎన్టీయూకే ఈసారి కూడా బాధ్యతలను అప్పగించనున్నారు. ఐసెట్ నిర్వహణను కూడా దానికే అప్పగించనున్నారు. కాకతీయ వర్సిటీకి లాసెట్, ఉస్మానియాకు పీజీఈసెట్, ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలను అప్పగించే అవకాశముంది. ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులకు అవకాశం విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపు విషయంలో విభజన చట్టం ప్రకారం నడుచుకుంటామని అధికారులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఓపెన్ కోటాలో 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విద్యార్థులు ఇకపై తెలంగాణలోని విద్యా సంస్థల్లో చేరాలంటే టీ సర్కార్ నిర్వహించే ప్రవేశ పరీక్షలను రాయాలి. కాగా, ఎంసెట్ తుదిర్యాంకు ఖరారులో ఇంటర్ మార్కులకిచ్చే 25 శాతం వెయిటేజీ విషయంలోనూ సమస్య ఉండబోదని అధికారులు అంటున్నారు. ఓపెన్ కోటాలో తెలంగాణలోని విద్యా సంస్థల్లో చేరగోరే విద్యార్థులు ఏపీలో ఇంటర్ చదివితే అక్కడ సాధించిన ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకును ఖరారు చేస్తామంటున్నారు. ఆ ర్యాంకు ఆధారంగానే ఓపెన్ కోటా ను భర్తీ చేసి ఉమ్మడి ప్రవేశాల స్పూర్తిని కొనసాగిస్తామంటున్నారు. దీనిపై అనుమానాలుంటే జేఈఈ మెయిన్‌లో అవలంభించే పర్సంటైల్ విధానాన్ని ఇక్క డా అమలు చేస్తామని గతంలోనే టీ సర్కార్ స్పష్టం చేసింది. మరోవైపు జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ వంటి జాతీయస్థాయి పోటీపరీక్షల్లో రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటారు కనక ఏ రాష్ర్టం విద్యార్థులకైనా నష్టం ఉండదని అధికారులు భావిస్తున్నారు. -
తప్పెవరిది ? శిక్షెవరికి ? Part2
-
తప్పెవరిది ? శిక్షెవరికి ? Part1
-
విద్యార్థుల జీవితాల్తో ఆడుకోవద్దు!
-
ఏ 'సెట్' చూసినా.. అదే జాప్యం!
-
ఏదీ 'సెట్' కాలేదు
సకాలంలో వృత్తి విద్యా ప్రవేశాలు మిథ్య సుప్రీంకోర్టు ఆదేశించినా ఏటా ఇదే పరిస్థితి అన్ని కోర్సుల్లోనూ ప్రవేశాలు గందరగోళమే ఇంజనీరింగ్ ప్రవేశాలు ఇప్పటికీ అసంపూర్ణమే! ఈసెట్, పాలిసెట్ అలాట్మెంట్లు మాత్రమే పూర్తి ఐసెట్, పీజీఈసెట్, డైట్‌సెట్, లాసెట్.. అన్నీ అంతే! అడ్మిషన్ల కోసం లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం.. విధానపర నిర్ణయాల్లో జాప్యం.. తప్పుడు నిర్ణయాల ఫలితం.. ఏదైతేనేం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల పరిస్థితి ఏటా గందరగోళంగా మారుతూనే ఉంది.. అడ్మిషన్లలో తీవ్ర జాప్యం జరుగుతూనే ఉంది.. విద్యా సంవత్సరం ప్రారంభమైనా కౌన్సెలింగ్ కోసమే విద్యార్థులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంటూనే ఉంది.. గడిచిన ఐదారేళ్లలో ఏ విద్యా సంవత్సరంలోనూ సరిగ్గా తరగతులు ప్రారంభమైంది లేదు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశించినా అదే పరిస్థితి. ఈసారి కూడా అదే దుస్థితి. రాష్ట్ర విభజన సమస్యలు, అధికారుల తప్పిదాలు, నిర్లక్ష్యం, ప్రభుత్వాల మొండిపట్టు వంటివన్నీ ప్రవేశాలు ఆలస్యం కావడానికి కారణమయ్యాయి. ఈసారీ పరిస్థితి అంతే. విద్యా సంవత్సరం సకాలంలో ప్రారంభం కావాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల స్ఫూర్తి ఏ ఒక్క కోర్సు ప్రవేశాల్లోనూ కనిపించడం లేదు. జూలై 31 నాటికే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పూర్తి చేసి ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాల్సి ఉన్నా.. కొన్ని కోర్సులకు అయితే ప్రవేశాల షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈసెట్, డైట్‌సెట్, పాలిసెట్, లాసెట్ అన్నింటి పరిస్థితీ ఇంతే. ఏటా ప్రవేశాలు అక్టోబర్ వరకు కొనసాగుతుండటంతో.. లక్షల మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎంసెట్..: విద్యార్థులకు ఆవేదనే! ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్ విద్యార్థులకు ఆవేదనే మిగిల్చింది. కాలేజీలకు అఫిలియేషన్లు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మొండిపట్టు వంటివాటి కారణంగా కౌన్సెలింగ్ జాప్యమైంది. మొదటి విడత సీట్ల కేటాయింపు జరిగినా సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వకపోవడంతో రెండో దశ కౌన్సెలింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. మొదటి దశలో సీట్లు పొందిన వారు ఇతర కాలేజీల్లోకి మారలేకపోయారు, పూర్తిస్థాయిలో ఆప్షన్లు పెట్టుకోక సీట్లు పొందలేకపోయిన అభ్యర్థులకు మరో అవకాశం లేకుండా పోయింది. చివరకు విద్యార్థులే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా అవకాశం వస్తుందో లేదో తెలియదు. మొదటి దశలో చేరిన 1.04 లక్షల మంది విద్యార్థులకు మాత్రం తరగతులు ప్రారంభమయ్యాయి. ఇక ఎంసెట్ మేనేజ్మెంట్ కోటా భర్తీ, బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాల్లోనూ గందరగోళం నెలకొంది. పీజీఈసెట్: అంతా గందరగోళం పీజీఈసెట్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ వ్యవహారం మొత్తం గందరగోళంగా తయారైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏయే కాలేజీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలో, ఏ కాలేజీలో ఆప్షన్లు ఇచ్చుకోవద్దో తెలియని అయోమయంలో అభ్యర్థులు మునిగిపోయారు. మొదట 145 ఎంటెక్, 50 ఎంఫార్మసీ కాలేజీలనే కౌన్సెలింగ్‌లో చేర్చాలని నిర్ణయించారు. అయితే మిగతా కాలేజీల వారు కోర్టును ఆశ్రయించడంతో... మరో 150కి పైగా ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీలను కౌన్సెలింగ్‌లో చేర్చారు. కానీ తుది తీర్పు వెలువడే వరకు వీటిల్లో ప్రవేశాలను ఖరారు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు ఆ కాలేజీల్లో ఆప్షన్ ఇచ్చుకోవాలా? వద్దా? అనే గందరగోళం నెలకొంది. పీజీఈసెట్‌కు 19వ తేదీ వరకూ సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహిస్తుండగా.. 23వ తేదీ వరకు ర్యాంకుల వారీగా వెబ్ఆప్షన్లకు అవకాశం ఉంది. ఎడ్‌సెట్..: అఫిలియేషన్లకే దిక్కులేదు ఉపాధ్యాయ విద్యా కోర్సు అయిన బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్)లో ప్రవేశాలు చేపట్టాల్సిన కాలేజీలకు ఇంతవరకు అఫిలియేషన్ల ప్రక్రియే పూర్తి కాలేదు. ఈ నెల 21వ తేదీ నుంచి 28 వరకు సర్టిఫికెట్ల తనిఖీ, 23వ తేదీ నుంచి అక్టోబరు 1వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినా... ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఈ కౌన్సెలింగ్‌తో తెలంగాణ, ఏపీల్లోని 69,068 బీఎడ్ సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఎడ్‌సెట్‌లో అర్హత సాధించిన 1,47,188 మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణలోని 261 కాలేజీల్లో 27,744 సీట్లు అందుబాటులో ఉండగా... ఆంధ్రప్రదేశ్‌లోని 386 కాలేజీల్లో 41,324 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. డైట్‌సెట్..: పరిస్థితి మరీ దారుణం ఉపాధ్యాయ విద్యా కోర్సు అయిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం డైట్‌సెట్‌లో అర్హత సాధించిన 2,25,000 మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రవేశాలకు సంబంధించి 650కు పైగా ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్ల ప్రక్రియ ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. అఫిలియేషన్లు లభిస్తే తప్ప ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేసే పరిస్థితి లేదు. అనేక డీఎడ్ కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు ప్రభుత్వానికి సిఫారసులు అందాయి. దీంతో ప్రభుత్వాలు ఎన్నింటికి, ఎప్పుడు అనుమతిస్తాయో.. పాఠశాల విద్యా శాఖలు అఫిలియేషన్లు ఇస్తాయో తెలియదు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని సీట్ల భర్తీ కూడా ఆగిపోయింది. 2012లో అయితే ఏకంగా ఫిబ్రవరిలో తరగతులు ప్రారంభించారు. ఇక ఈసారి ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు. పీఈసెట్: ఇంకా రాని షెడ్యూల్ వ్యాయమ ఉపాధ్యాయ కోర్సులైన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ)లో ప్రవేశాల కోసం ఇంకా షెడ్యూల్ జారీ కాలేదు. ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 6వ తేదీ నుంచి చేపట్టాలని మాత్రం నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల్లోని దాదాపు 40 కాలేజీల్లో ప్రవేశాలను చేపట్టాల్సి ఉంది. ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ చేసి.. వచ్చే నెల 6 నుంచి 8 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, 7వ తేదీ నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించాలని, 11న సీట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఐసెట్..: ఆలస్యం తప్పేలా లేదు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ను శనివారం జారీ చేశారు. కానీ కాలేజీలకు అఫిలియేషన్లు లభించాల్సి ఉంది. 17వ తేదీ నుంచి సర్టిఫికెట్ల తనిఖీ, 20వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రవేశాల కోసం ఐసెట్‌లో అర్హత సాధించిన 1,19,756 మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంజనీరింగ్ (బీటెక్) ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యాక దీనిపై దృష్టి సారించాలని భావించడంతో.. దీనికి ఆలస్యం తప్పడం లేదు. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో కలిపి మొత్తం 1.20 లక్షల వరకు సీట్లను భర్తీ చేయాల్సి ఉండగా.. తెలంగాణలోని 539 కాలేజీల్లో దాదాపు 64 వేల సీట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని 628 కాలేజీల్లో 56 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. లాసెట్దీ అదే పరిస్థితి.. లాసెట్‌లో ప్రవేశాలకు షెడ్యూల్‌ను ఇంకా జారీ చేయాల్సి ఉంది. దీనిపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన యూజీ లాసెట్, పీజీ లాసెట్‌లో అర్హత సాధించిన వారు 19 వేల మందికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలీసెట్ సీట్ల కేటాయింపు పూర్తయింది. ప్రవేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇక ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ (ఈసెట్) ప్రవేశాలు పూర్తయి, 12న తరగతులు ప్రారంభమయ్యాయి. పీజీఈసెట్ గందరగోళం పీజీఈసెట్‌లో ప్రవేశాల కౌన్సెలింగ్ వ్యవహారం మొత్తం గందరగోళంగా తయారైంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏయే కాలేజీల్లో ఆప్షన్లు ఇచ్చుకోవాలో, ఏ కాలేజీలో ఆప్షన్లు ఇచ్చుకోవద్దో తెలియని అయోమయంలో అభ్యర్థులు మునిగిపోయారు. మొద ట 145 ఎంటెక్, 50 ఎంఫార్మసీ కాలేజీలనే కౌన్సెలింగ్‌లో చేర్చాలని నిర్ణయించారు. అయితే మిగతా కాలేజీల వారు కోర్టును ఆశ్రయించడంతో... మరో 150కి పైగా ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీలను కౌన్సెలింగ్‌లో చేర్చారు. కానీ తుది తీర్పు వెలువడే వరకు వీటిల్లో ప్రవేశాలను ఖరారు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులకు ఆ కాలేజీల్లో ఆప్షన్ ఇచ్చుకోవాలా? వద్దా? అనే గందరగోళం నెలకొంది. పీజీఈసెట్‌కు 19వ తేదీ వరకూ సర్టిఫికెట్ల తనిఖీ నిర్వహిస్తుండగా.. 23వ తేదీ వరకు ర్యాంకుల వారీగా వెబ్ఆప్షన్లకు అవకాశం ఉంది. -
కొనసాగుతున్న ఐసెట్ పరీక్ష
హైదరాబాద్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు ఐసెట్ ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జరిగే ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,42,464 మంది అభ్యర్థులు హాజరు అవుతున్నారు. ఇందుకోసం అధికారులు 263 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఐసెట్ పరీక్షకు సెట్- బి ప్రశ్నాపత్రంను అధికారులు శుక్రవారం ఉదయం ఎంపిక చేశారు. ఈనెల 26న ఐసెట్ కీ విడుదల చేస్తారు. జూన్ 9వ తేదీన ఐసెట్ ఫలితాలు వెలువడతాయి. -
సెట్ల కాలం
సాక్షి, నల్లగొండ, టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు ముగిశాయి. మరోవైపు ప్రభుత్వం వివిధ ‘సెట్’లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, డైట్‌సెట్, ఎడ్‌సెట్,లాసెట్, పీజీఈ సెట్, పీఈ సెట్, పాలిసెట్ నిర్వహించేందుకు ముందుకొచ్చింది. దీంతో విద్యార్థులు ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లపై దృష్టిసారించారు. ఎంట్రెన్స్లలో మంచి మార్కులు స్కోర్ చేయడానికి పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. వివిధ సెట్లను ఒకసారి పరిశీలిస్తే.. - ఉన్నత విద్యాభ్యాసానికి వరుస ‘ఎంట్రెన్స్’లు - సమాయత్తమవుతున్న విద్యార్థులు - కోచింగ్ సెంటర్లవైపు పరుగులు కోచింగ్ సెంటర్లు ప్రారంభం జిల్లాలో నల్లగొండ పట్టణంతో పాటు సూర్యాపేట, మిర్యాలగూడ, కోదాడ, భువనగిరి పట్టణాల్లో కోచింగ్ సెంటర్లు వెలిశాయి. ఈ సెంటర్లు విద్యార్థులతో సందడిగా మారాయి. విద్యార్థులు సైతం మంచి ర్యాంకు సాధించాలన్న తలంపుతో కృషి చేస్తున్నారు. ఐసెట్ ఈ ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎంబీఏ, ఎంసీఏలలో అడ్మిషన్ పొందవచ్చు. రెండేళ్ల వ్యవధి కలిగిన ఈ కోర్సు చేయడానికి అనేకమంది ఆసక్తి చూపుతున్నారు. రెగ్యులర్‌గా తరగతులకు వెళ్లి విద్యన భ్యసిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యావేత్తలంటున్నారు. ఈ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ నెల 23న పరీక్ష నిర్వహించనుంది. జూన్ 9న ఫలితాలు వెల్లడించనుంది. లాసెట్.. న్యాయవాద వృత్తిలో ఆసక్తి ఉన్నవారు రాసే ఈ ప్రవేశ పరీక్షను ఎస్వీ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎల్ఎల్బీ మూడు లేదా ఐదేళ్ల కోర్సులో ప్రవేశం పొందవచ్చు. దీనికి సంబంధించిన ప్రకటన మార్చి 4న వెలువడింది. జూన్ 8న పరీక్ష ఉంటుంది. జూన్ 19న ఫలితాలు వెల్లడిస్తారు. పీఈసెట్ ఇది వ్యాయామ విద్యకు సంబంధించింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రెండు సంవత్సరాల వ్యవధి గల బీపీఈడీ/యూజీడీపీఈడీ కోర్సు చేయవచ్చు. దీనికి సంబంధించిన ప్రకటన మార్చి 7న వెలువడింది. ఈ నెల 5న పరీక్ష ఉంటుంది. ఫలితాలు వెల్లడించే తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. పరీక్షను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తోంది. పీజీఈ సెట్ ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అర్హత సాధించడం ద్వారా రెండేళ్ల వ్యవధి గల ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎం.అగ్రికల్చరల్ కోర్సుల్లో చేరే అవకాశముంది. పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ(యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్) నిర్వహిస్తోంది. పరీక్ష ప్రకటనను ఫిబ్రవరి 28న వెల్లడించింది. ఈనెల 26న పరీక్ష ఉంటుంది. జూన్ 17న ఫలితాలు విడుదల చేస్తారు. ఎడ్‌సెట్ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడడానికి మొదటి స్టెప్‌గా ఉండే ఈ కోర్సు వ్యవధి ఏడాది. దీనిని ఈ సంవత్సరం ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మార్చి 5న ప్రకటన వచ్చింది. మే 30న పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 23న ఫలితాలు వెల్లడించనున్నారు. ఎంసెట్ ఈ ఎంట్రెన్స్ రాసి ర్యాంకు సాధించిన వారు ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ విభాగ కోర్సులు చేయడానికి అర్హులు. ఈ పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదే శ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పక్షాన నిర్వహించనుంది. ఫిబ్రవరి 10న ప్రకటన వచ్చింది. మే 17న పరీక్ష నిర్వహిస్తారు. జూన్2న పరీక్ష ఫలితాలు వెల్లడించనున్నారు. ఈసెట్ ఈ పరీక్ష రాయడానికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, బీఎస్సీ(మ్యాథ్స్) చేసినవారు అర్హులు. పరీక్షను జేఎన్టీయూ(కాకినాడ) నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఫిబ్రవరి 4న వెలువడింది. ఈ నెల 10న పరీక్ష ఉంటుంది. ఇదే నెల 19న ఫలితాలు వెల్లడించనున్నారు. పాలీసెట్ ఈ ప్రవేశ పరీక్ష ద్వారా మూడు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ చేయవచ్చు. కోర్సు పూర్తి చేసి ఈసెట్ అర్హత సాధిస్తే ఇంజినీరింగ్ సెకండియర్‌లో ప్రవేశం పొందవచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ ఏపీ నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఏప్రిల్ 6న ప్రకటన చేయగా, ఈనెల 21న పరీక్ష ఉంటుంది. ఫలితాలు జూన్ 6న వెల్లడించనున్నారు. -
వచ్చే ఏడది కూడా ఉమ్మడి 'సెట్స్'
-
మే 17న ఎంసెట్, 23న ఐసెట్
-
తేదీలు సెట్.. మే 17న ఎంసెట్, 23న ఐసెట్
ప్రవేశ పరీక్షల షెడ్యూలు ప్రకటన ఎన్నికల ప్రక్రియకు అనుగుణంగా మార్పులు జరిగే అవకాశం ఈసారి త్వరగా వెబ్ కౌన్సెలింగ్.. ‘ఫీజు’లకు ముందే పరిష్కారం 2 నుంచే ఏఎఫ్ఆర్సీ సమావేశాలు 2015 నుంచి ‘ఆన్లైన్’లో ఎంసెట్ నిర్వహణపై కసరత్తు ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్-2014ను మే 17న, ఐసెట్-2014ను మే 23న నిర్వహించనున్నట్లు తెలిపింది. 2014-15 విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి పరీక్షల నిర్వహణపై గురువారం ప్రవేశ పరీక్షలకమిటీల సమావేశం జరిగింది. సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్, మం డలి కార్యదర్శి ప్రొఫెసర్ సతీష్‌రెడ్డితో పాటు సెట్ కమిటీల చైర్మన్లు, కన్వీనర్లు ఇందులో పాల్గొన్నారు. అనంతరం ప్రవేశ పరీక్షలు, నోటిఫికేషన్లు, ఫలితాల తేదీలతో కూడిన షెడ్యూలును ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఒకవేళ సాధారణ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు వంటివి ఈ తేదీల్లో వస్తే.. వాటికి అనుగుణంగా షెడ్యూలు మారుతుందని చెప్పారు. అడ్మిషన్ల వెబ్ కౌన్సెలింగ్ త్వరగా జరిగేలా ఫీజులకు సంబంధించిన అంశాలన్నింటినీ ముందుగానే పరిష్కరిస్తామని.. ఈ మేరకు అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) జనవరి 2 నుంచే సమావేశాలు ప్రారంభిస్తుందని వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో జరిపే అంశంపై కసరత్తు చేసి.. 2015 నుంచి ఆన్లైన్లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ఎన్నికలకు పరీక్ష... వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న ఏప్రిల్, మే నెలల్లోనే రాష్ట్రంలో విద్యార్థులకు పరీక్షలు జరుగనున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు వివిధ పరీక్షలు రాయడంలో నిమగ్నం కానున్నారు. పదో తరగతి పరీక్షలకు 12 లక్షల మంది, ఇంటర్ పరీక్షలకు 20 లక్షల మంది, ఎంసెట్‌కు 4 లక్షల మంది, ఐసెట్‌కు లక్ష మంది, జేఈఈ-మెయిన్స్‌కు లక్ష మంది... వీటితో పాటు పలు రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో కలిపి రాష్ట్రంలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.