ప్రవేశ పరీక్షల షెడ్యూలు ప్రకటన
ఎన్నికల ప్రక్రియకు అనుగుణంగా మార్పులు జరిగే అవకాశం
ఈసారి త్వరగా వెబ్ కౌన్సెలింగ్..
‘ఫీజు’లకు ముందే పరిష్కారం
2 నుంచే ఏఎఫ్‌ఆర్సీ సమావేశాలు
2015 నుంచి ‘ఆన్‌లైన్’లో ఎంసెట్ నిర్వహణపై కసరత్తు
ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్-2014ను మే 17న, ఐసెట్-2014ను మే 23న నిర్వహించనున్నట్లు తెలిపింది. 2014-15 విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి పరీక్షల నిర్వహణపై గురువారం ప్రవేశ పరీక్షలకమిటీల సమావేశం జరిగింది. సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్, మం డలి కార్యదర్శి ప్రొఫెసర్ సతీష్‌రెడ్డితో పాటు సెట్ కమిటీల చైర్మన్లు, కన్వీనర్‌లు ఇందులో పాల్గొన్నారు. అనంతరం ప్రవేశ పరీక్షలు, నోటిఫికేషన్లు, ఫలితాల తేదీలతో కూడిన షెడ్యూలును ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఒకవేళ సాధారణ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు వంటివి ఈ తేదీల్లో వస్తే.. వాటికి అనుగుణంగా షెడ్యూలు మారుతుందని చెప్పారు. అడ్మిషన్ల వెబ్ కౌన్సెలింగ్ త్వరగా జరిగేలా ఫీజులకు సంబంధించిన అంశాలన్నింటినీ ముందుగానే పరిష్కరిస్తామని.. ఈ మేరకు అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) జనవరి 2 నుంచే సమావేశాలు ప్రారంభిస్తుందని వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో జరిపే అంశంపై కసరత్తు చేసి.. 2015 నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు.
ఎన్నికలకు పరీక్ష...
వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న ఏప్రిల్, మే నెలల్లోనే రాష్ట్రంలో విద్యార్థులకు పరీక్షలు జరుగనున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు వివిధ పరీక్షలు రాయడంలో నిమగ్నం కానున్నారు. పదో తరగతి పరీక్షలకు 12 లక్షల మంది, ఇంటర్ పరీక్షలకు 20 లక్షల మంది, ఎంసెట్‌కు 4 లక్షల మంది, ఐసెట్‌కు లక్ష మంది, జేఈఈ-మెయిన్స్‌కు లక్ష మంది... వీటితో పాటు పలు రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో కలిపి రాష్ట్రంలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
తేదీలు సెట్.. మే 17న ఎంసెట్, 23న ఐసెట్
Published Fri, Dec 27 2013 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement
Advertisement