Hyderabad: Telangana ICET 2023 Results Released Today - Sakshi
Sakshi News home page

TS ICET Results 2023: విడుదలైన ఐసెట్‌ ఫలితాలు.. తొలి పది ర్యాంకులు అబ్బాయిలవే

Published Thu, Jun 29 2023 6:13 PM | Last Updated on Thu, Jun 29 2023 6:45 PM

Hyderabad: Telangana Icet 2023 Results Released - Sakshi

తెలంగాణలోని పలు యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ టీఎస్ ఐసెట్ 2023 ఫ‌లితాల‌ను జూన్ 29వ తేదీ మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు కాక‌తీయ యూనివర్సిటీలో విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల‌లో పాటు ఫైన‌ల్ 'కీ' ని కూడా విడుద‌ల చేశారు.

షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 21 ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ ఫ‌లితాల విడుద‌ల ఆల‌స్యంగా గురువారం (జూన్‌ 29)న విడుదల చే అయింది. తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 26, 27 తేదీల్లో టీఎస్ ఐసెట్-2023 ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష‌కు పరీక్షకు 75 వేల మంది దరఖాస్తు చేసుకుంటే.. 70,900 మంది హాజరయ్యారు.

ఈ సారి ఐసెట్‌లో తొలి 10 ర్యాంకుల్లోనూ అబ్బాయిలే సత్తా చాటారు. వీరిలో మొదటి ర్యాంకు నూకల శరణ్‌కుమార్‌ కైవసం చేసుకోగా.. నాగులపల్లి సాయి నవీన్‌ రెండు, రవితేజ సజ్జ మూడో ర్యాంకులో సాధించారు. టాప్ 10లో ఆ తర్వాతి ర్యాంకుల్లో ఎస్‌.సాయి ఫణి ధనుష్‌, గోపి మల్లికంటి, తిరుగుడు సుమంత్‌ కుమార్‌ రెడ్డి, ఆయాచితుల నితీశ్‌కుమార్‌, వి. సాయి వెంకట కార్తిక్‌, ఎస్‌.నాగసాయి కృష్ణవంశీ, బి.సాయిగణేష్‌ నిలిచారు. 

చదవండి: Hyderabad: అమ్మో ఫాస్ట్‌ఫుడ్‌! పంది కొవ్వు కొని నూనెగా మార్చి తక్కువ ధరకు విక్రయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement