సాక్షి,న్యూఢిల్లీ:తెలంగాణ గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియరైంది. గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సోమవారం(ఫిబ్రవరి3) సుప్రీంకోర్టు కొట్టేసింది. గ్రూప్-1 నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అంతకముందు రాష్ట్ర హైకోర్టు తమ పిటిషన్‌లను కొట్టేయడంతో అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు.ఫలితాలు వెల్లడించడంపై తెలంగాణ ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించింది. కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో,త్వరలో టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనుంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత గ్రూప్-1 పరీక్ష తొలిసారిగా జరగడం గమనార్హం.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకవడంతో రద్దయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించింది. అయితే పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఫలితాలు వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment