group 1
-
TG: గ్రూప్-1 ఫలితాల వెల్లడికి ‘సుప్రీం’ గ్రీన్ సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ:తెలంగాణ గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియరైంది. గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సోమవారం(ఫిబ్రవరి3) సుప్రీంకోర్టు కొట్టేసింది. గ్రూప్-1 నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అంతకముందు రాష్ట్ర హైకోర్టు తమ పిటిషన్లను కొట్టేయడంతో అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు.ఫలితాలు వెల్లడించడంపై తెలంగాణ ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించింది. కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో,త్వరలో టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనుంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత గ్రూప్-1 పరీక్ష తొలిసారిగా జరగడం గమనార్హం.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్ష ప్రశ్నాపత్రం లీకవడంతో రద్దయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించింది. అయితే పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఫలితాలు వెల్లడించనున్నారు. -
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అభ్యర్ధుల అభ్యంతరాలను పక్కన పెట్టడంతో పాటు మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.2022 లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్దమంటూ కొందరు అభ్యర్థులు కోర్టుకెక్కారు. అలాగే.. 2024 గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని, మెయిన్స్‌ను సైతం వాయిదా వేయాలని కూడా కోరారు.అయితే తెలంగాణ హైకోర్టులో వీళ్లకు చుక్కెదురైంది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది. ‘‘కోర్టును ఆశ్రయించిన అభ్యర్ధులు ఎవరూ ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ కానందున మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదు. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరం. దీనివల్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియ తీవ్ర జాప్య మవుతుంది’’ అని జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం అభిప్రాయపడింది. -
అంతులేని కథగా గ్రూప్ 1.. అసలేంటి జీవో 29 !
-
కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బంజారాహిల్స్ నందినగర్‌లోని ఆయన నివాసం వద్దకు సోమవారం(అక్టోబర్21 మధ్యాహ్నం) పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు.గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ఆపాలని కొందరు విద్యార్థులు ఆందోళన చేస్తున్నందున పరీక్ష సజావుగా జరగడానికి పోలీసులు కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. కాగా, సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో గ్రూప్‌వన్ మెయిన్స్ సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైంది.ఇదీ చదవండి: గ్రూప్ వన్ మెయిన్స్ ప్రారంభం.. భారీగా పోలీసు బందోబస్తు -
రిజర్వ్డ్ కేటగిరీలకు నష్టం జరగదు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షల విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్న వాదన పచ్చి అబద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను భరోసా ఇస్తున్నానని, మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి నష్టం జరగలేదని, భవిష్యత్తులో కూడా ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. ఆదివారం గాం«దీభవన్‌లో ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఇతర నేతలతో కలసి మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు గ్రూప్–1 మెయిన్స్ విషయంలో నిరుద్యోగులను రెచ్చగొడుతూ.. లేనిపోని అనుమానాలు, అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. అపోహలు వద్దు ‘పీసీసీ అధ్యక్షుడిగా, బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిగా గ్రూప్–1 అభ్యర్థులందరికీ భరోసా ఇస్తున్నా. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు అన్యాయం జరగదు. ఇది పార్టీ, ప్రభుత్వ పక్షాన మేమిస్తున్న భరోసా. అన్ రిజర్వ్డ్ మెరిట్ జాబితాలోకి వచ్చిన అభ్యర్థులను మళ్లీ రిజర్వ్డ్ కేటగిరీలో లెక్కించరు. మెరిట్ జాబితాలో ఎంపికైన రిజర్వ్డ్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలోనే కొనసాగుతారు. రిజర్వ్డ్ పోస్టుల్లో తక్కువ పడితేనే ఇతర అభ్యర్థులను తీసుకుంటారు. అందుకే సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అసలు నష్టమే జరగదు. అర్థం చేసుకోవాలి’అని మహేశ్‌గౌడ్ వివరించారు. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి గాం«దీభవన్ సేకరించిన సమాచారం ప్రకారం.. మొత్తం అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులే 75 శాతం ఉంటారని మహేశ్‌గౌడ్ చెప్పారు. కానీ బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై పరీక్షల విషయంలో లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. పదేళ్లలో ఎన్ని గ్రూప్–1 ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన బీఆర్ఎస్ది చిత్తశుద్ధా? పది నెలల్లో 50వేల ఉద్యోగాలిచ్చిన కాంగ్రెస్‌ది చిత్తశుద్ధా అన్నది నిరుద్యోగులు ఆలోచించాలన్నారు. ఇంటర్ ఫలితాలను కూడా సక్రమంగా ఇవ్వలేని బీఆర్ఎస్ తమకు బుదు్ధలు చెప్పాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. దేశంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ.. ఎన్ని ఉద్యోగాలిచ్చిందో బండి సంజయ్ చెప్పాలని, ఏ ముఖం పెట్టుకుని బీజేపీ నేతలు ధర్నాలు చేస్తున్నారో చెప్పాలని విమర్శించారు. -
నిరుద్యోగులు రోడ్డెక్కితే.. దురహంకారంతో అణచివేస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నియామక పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. గ్రూప్–1 పరీక్షల రీషెడ్యూల్ కోరుతూ అభ్యర్థులు రోడ్డెక్కితే వారిపై లాఠీలు ఝలిపించి, దురహంకారంతో అణచివేయాలని చూడటం దారుణమని వ్యాఖ్యానించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘గ్రూప్–1 ఉద్యోగాల ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఒకే తరహా నిబంధనలుండాలి. ఆ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఒకే హాల్‌టికెట్ ఉండాలి.కానీ టీజీపీఎస్సీ రెండుసార్లు జారీ చేయడం ఏమిటి? పరీక్షలన్నీ హైదరాబాద్ పరిసరాల్లోనే నిర్వహించడానికి కారణాలు ఏమిటి? ఇలా ఒకేచోట పరీక్షల నిర్వహణపై పలు అనుమానాలు వస్తున్నాయి. గ్రూప్–1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో అమలు చేసిన జీవో 29 విషయంలో అభ్యర్థులకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇందులో ఎలాంటి దాపరికం లేకపోతే స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదు?’’అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీతో కలసి అశోక్‌నగర్‌లో నిరుద్యోగులతో మాట్లాడిన మాటలేమిటి? ఇప్పుడు చేస్తున్న పనులేమిటి? ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని సీఎం రేవంత్‌కు సూచించారు. హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించే యత్నాలు న్యాయం కావాలని రోడ్డెక్కిన నిరుద్యోగులపై లాఠీచార్జి చేయడం, నిరసనలను అణచివేసే ప్రయత్నం చేయడం, అరెస్టులకు దిగడం దారుణమని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా పేదల ఇళ్లను కూలి్చవేస్తూ కాలం గడిపే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. హామీలు అమలు చేసే సత్తా, శక్తి, లేకనే.. కొత్త సమస్యలు సృష్టించి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ పూర్తిగా హిందూ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు.వినాయక చవితి, బోనాలు, దేవీ నవరాత్రుల సందర్భంగా అనేక మందిపై కేసులు పెట్టించారని.. డీజే సౌండ్ పెట్టారంటూ మండపాల నిర్వాహకులను వేధించారని పేర్కొన్నారు. ఇతర వర్గాల ప్రార్థన కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వస్తున్న శబ్దాలు పోలీసులకు, ముఖ్యమంత్రికి వినబడవా? కనబడవా? అని ప్రశ్నించారు. ముత్యాలమ్మ గుడి వద్ద నిరసనకారులపై అత్యంత పాశవికంగా దాడి చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఒక కార్యకర్తకు తీవ్రగాయాలు అయ్యాయని, పోలీసులు అతడిని ఇంట్లో వదిలివెళ్లారని.. కానీ అతడి పరిస్థితి విషమిస్తుండటంతో తాము ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చూశామని చెప్పారు. -
నేటి నుంచే గ్రూప్–1 మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సివిల్ సర్విస్ ఉద్యోగాలుగా పేర్కొనే గ్రూప్–1 కొలువుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. ఈనెల 27వ తేదీ వరకు వరుసగా జరిగే ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు కలిపి.. మొత్తం 46 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.మొత్తం 563 గ్రూప్–1 పోస్టుల కోసం 31,383 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు పరీక్షల నిర్వహణ, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. సహాయకుల (స్క్రైబ్) ద్వారా పరీక్ష రాసే దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట అదనంగా కేటాయిస్తారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు.ఏడు రోజులు... ఏడు పరీక్షలు.. సోమవారం నుంచి 27వ తేదీ వరకు ఏడు రోజులు.. ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రతి పరీక్షకు 3గంటల సమయం ఉంటుంది. ప్రతి పరీక్షకు గరిష్ట మార్కులు 150. జనరల్ ఇంగ్లిష్ మినహా మిగతా పరీక్షలను ఇంగ్లి‹Ù, తెలుగు, ఉర్దూ భాషల్లో ఏదో ఒక దానిలో రాయవచ్చు. అయితే అన్ని పరీక్షలను ఒకే భాషలో రాయాలి. అభ్యర్థులు అన్ని పరీక్షలకు తప్పకుండా హాజరుకావాలి. అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 1.30 గంటలకు పరీక్షా కేంద్రాన్ని మూసివేస్తారు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులను లోనికి అనుమతించరు. అభ్యర్థి తొలి పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలి. డూప్లికేట్ హాల్‌టికెట్ జారీ చేసే అవకాశం ఉండదు. -
TG: ఎందుకీ గ్రూప్-1 వివాదం.. ఏమిటీ జీవో 55.. జీవో 29?
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, జీవో 29ను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్లతో అభ్యర్థులు శనివారం చేపట్టిన సచివాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అభ్యర్థుల ఎంపికకు పాటించిన విధానంతో రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు.జీవో 55 ప్రకారం..గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను.. మల్టీజోన్ వారీగా ఉన్న పోస్టులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరిస్తూ కమ్యూనిటీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, స్పోర్ట్స్ తదితర కేటగిరీల్లో 1:50 నిష్పత్తిలో గుర్తించాలి. ఈ లెక్కన గతంలో 503 పోస్టులకుగాను 1:50 నిష్పత్తిలో ఎంపిక చేపట్టారు. మొత్తం 25,150 మంది అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా.. దివ్యాంగుల కేటగిరీలో రెండు పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో 25,050 మందిని మాత్రమే ఎంపిక చేశారు.జీవో 29 ప్రకారం..రిజర్వేషన్ ప్రకారం కాకుండా.. నేరుగా మల్టీజోన్ పోస్టుల సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థుల ఎంపిక చేపడతారు. ఇలా 50 రెట్ల మందిని ఎంపిక చేసినప్పుడు.. రిజర్వుడ్ కేటగిరీల్లో అభ్యర్థుల సంఖ్య 1:50 నిష్పత్తి కంటే తక్కువగా ఉంటే, తర్వాతి మెరిట్ వారిని కూడా అదనంగా తీసుకుంటారు. తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనల్లోని రూల్ 22, 22ఏ ఆధారంగా వీరి ఎంపిక చేస్తారు. ఈ మేరకు జీవో 55లోని అంశం ‘బి’లో మార్పులు చేసి.. జీవో 29 ఇచ్చారు.వివాదం ఏమిటి?ప్రస్తుతం గ్రూప్–1 కేటగిరీలో మొత్తం 563 పోస్టులు ఉన్నాయి. జీవో 55కు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేపడితే 28,150 మందికి మాత్రమే మెయిన్స్‌కు అవకాశం కల్పించాలి. కానీ ఇప్పుడు జీవో 29 ప్రకారం ఎంపిక చేపట్టారు. అంటే నేరుగా మెరిట్ లిస్టులోని 28,150 మందిని ఎంపిక చేశారు. వీరిని ఓపెన్ కాంపిటీషన్, రిజర్వుడ్ కేటగిరీలు విభజించారు.ఇందులో రిజర్వుడ్ కేటగిరీల్లో 1:50 నిష్పత్తి కంటే తక్కువగా ఉండటంతో.. కింది మెరిట్ ఆధారంగా అదనంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. అంటే 28,150 మందికి మరో 3,233 మంది అదనంగా.. 31,383 మంది అభ్యర్థులను కమిషన్ మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేసింది. 1:50 నిష్పత్తి కంటే అభ్యర్థుల సంఖ్య పెరగడం, అందులో రిజర్వుడ్ కేటగిరీలవారు చాలినంత మంది లేకపోవడమంటే.. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టేనని, ఇది రిజర్వేషన్లకు దెబ్బ అని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళన.. ముట్టడి.. ఉద్రిక్తం! -
గ్రూప్ వన్ ఆందోళనలు.. అశోక్‌నగర్‌లో హై టెన్షన్ (ఫొటోలు)
-
గ్రూప్-1 ఆందోళనలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. శనివారం(అక్టోబర్19) సాయంత్రం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పోలీస్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినపుడే జీవో నెంబర్ 29 ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి గ్రూప్ 1 నియామకాలు జరగలేదన్నారు. కొంత మంది ఉద్యోగాలు పోవడంతో రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్లు గ్రూప్ వన్ ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఉచ్చులో విద్యార్థులు పడొద్దని హితవు పలికారు. కాగా గ్రూప్ వన్ రద్దు చేయాలని శనివారం ఉదయం గ్రూప్ వన్ అభ్యర్థులు హైదరాబాద్ అశోక్‌నగర్‌తో పాటు సచివాలయం వద్ద ఆందోళనలు చేశారు. వీరి ఆందోళనలకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు పలికారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదీ చదవండి: గ్రూప్-1 రగడ..సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత -
రేవంత్, బండి సంజయ్‌లది డ్రామా: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:గ్రూప్ 1పై సీఎం రేవంత్, బండి సంజయ్ డ్రామా ఆడుతున్నారని, బండి సంజయ్‌కి భద్రత ఇచ్చి రేవంత్ రోడ్లపైకి పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.గ్రూప్-1 పరీక్షపై బండి సంజయ్‌ని సీఎం రేవంత్ చర్చలకు పిలవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బండి సంజయ్‌ని చర్చలకు పిలిస్తే ఏం లాభం అని ప్రశ్నించారు. పేపర్ లీక్ చేసిన ఆయనను చర్చలకు ఎలా పిలుస్తారని ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: గ్రూప్ 1 రగడ.. సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత -
TG:గ్రూప్-1 ఆపితే చర్యలు తప్పవు: డీజీపీ
సాక్షి,హైదరాబాద్:గ్రూప్ 1 మెయిన్స్ కోసం బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్షకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ తెలిపారు. పరీక్షను అడ్డుకున్నా ఇబ్బందులకు గురిచేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.కోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి పబ్లిక్కు ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు.పరీక్ష నిర్వహించేందుకు హైకోర్టు ఆదేశాలున్నాయని,మీకు అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు.ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత.. అదుపులోకి బండి సంజయ్ -
గ్రూప్ 1 మెయిన్స్ యథాతథం
-
తెలంగాణ: గ్రూప్-1పై రేపు హైకోర్టు తీర్పు
హైదరాబాద్: గ్రూప్-1పై రేపు (మంగళవారం) హైకోర్టు రిజర్వు చేసిన తీర్పును వెల్లడించనుంది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు ఇవ్వనుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలపై హైకోర్టులో 10కి పైగా పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్- 1పై హైకోర్టులో తీర్పు వెల్లడిపైసస్పెన్స్ వీడనుంది. పలు పిటీషన్లపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పుని రిజర్వ్ చేసింది. గత విచారణలో నేడు తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు చెప్పంది. అయితే సోమవారం విచారణ చేపట్టిన కోర్టు రేపు తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది. ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కోర్టు తీర్పుపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. -
గ్రూప్–1లో రిజర్వేషన్లపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల అమలు తీరుపై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీ ఎస్పీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. గ్రూప్–1 ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించే మెయిన్స్ పరీక్షలకు అర్హుల ఎంపిక విషయంలో మార్పులు చేయాలని టీజీఎస్పీ ఎస్సీ కార్య దర్శి నుంచి గత ఫిబ్రవరి 2, 6 తేదీల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. గతంలోని జీఓ 55లోని పేరా ‘బీ’లో సవరణలు చేయాలని కోరుతూ ఆ ప్రతిపాదనలు పంపగా, వీటికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి జీఓ 29ను ఫిబ్రవరి 8న జారీ చేశారు. ఈ జీవో చట్టవిర్ధుమని, సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కిందకే వస్తుందంటూ సికింద్రాబాద్‌కు చెందిన హనుమాన్‌తోపాటు మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను కేటగిరీల వారీగా 1ః50 నిష్పత్తిని అమలు చేసేలా సర్కార్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గిరిధర్‌రావు వాదనలు వినిపించారు. జీవో 29 చట్టవిరుద్ధం: ‘గ్రూప్–1 మెయిన్స్‌కు ఎంపిక జాబితా 1ః50 నిష్పత్తిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు సరిపోయేలా ఉండాలి. జీవో 55 అదే చెబుతోంది. అయితే దీన్ని సవరిస్తూ తెచ్చిన జీవో 29 ప్రకారం.. తొలుత మెరిట్ జాబితా నుంచి 1ః50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి, ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రకారం లెక్క సరిపోకపోవడంతో మరికొందరిని చేరుస్తూ వెళ్లారు. దీంతో మొత్తంగా ఎంపికైన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. 563 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో జనరల్–209, ఈడబ్ల్యూఎస్–49, బీసీ(ఏ)–44, బీసీ(బీ)–37, బీసీ(సీ)–13, బీసీ(డీ)–22, బీసీ(ఈ)–16, ఎస్సీ–93, ఎస్టీ–52, స్పోర్ట్స్‌కోటా–4, పీహెచ్సీ–24 చొప్పున పోస్టులు రిజర్వు చేసింది. మెయిన్స్‌కు 1ః50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ఎంపికైన అభ్యర్థుల నిష్పత్తి 1ః50ని దాటింది. రిజర్వేషన్లు సరిగా పాటించకపోవడంతో ఇది జరిగింది’ అని చెప్పారు. -
సిరాజ్, నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 ఉద్యోగాలు.. తెలంగాణ కేబినెట్ నిర్ణయం
టీ20 వరల్డ్‌కప్ 2024 గెలిచిన భారత జట్టులోని సభ్యుడు మొహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ఆఫర్ చేసింది. సిరాజ్‌తో పాటు రెండు సార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ కూడా గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఇవాళ (ఆగస్ట్ 1) జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై తీర్మానం చేశారు. సిరాజ్, జరీన్‌కు గ్రూప్-1 కేడర్‌లోని డీఎస్పీ ఉద్యోగంతో పాటు ఆర్ధిక సాయం అందజేయనున్నట్లు తెలుస్తుంది.కాగా, సిరాజ్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. జరీన్ ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటుంది. జరీన్ ఇవాళ జరిగిన ప్రి క్వార్టర్స్ మ్యాచ్‌లో చైనాకు చెందిన టాప్ సీడ్ వు యు చేతిలో ఓటమిపాలై ఒలింపిక్స్ బరి నుంచి నిష్క్రమించింది. ఓటమి అనంతరం జరీన్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమైంది -
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు జరగనున్నాయి.మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇలా..అక్టోబర్ 21-జనరల్ ఇంగ్లీష్(క్వాలిఫయింగ్ టెస్ట్)అక్టోబర్ 22-పేపర్ 1(జనరల్ ఎస్సే)అక్టోబర్ 23-పేపర్ 2(హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)అక్టోబర్ 24-పేపర్ 2 (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గవర్నెన్స్)అక్టోబర్ 25-పేపర్ 4(ఎకానమి అండ్ డెవలప్మెంట్)అక్టోబర్ 26-పేపర్ 5(సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్‌ప్రిటేషన్)అక్టోబర్ 27-పేపర్ 6(తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు) -
ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి 1గం. దాకా పరీక్ష జరిగింది. ఒక్క నిమిషం నిబంధనతో చాలామంది పరీక్ష రాలేకపోయారు. పది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. ఆ అభ్యర్థుల్ని నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. దీంతో చాలామంది నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్–1 ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. గతంలో రెండు సార్లు రద్దు అయిన ఈ పరీక్షను ఎట్టకేలకు ఇవాళ నిర్వహించారు. మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉండగా.. ఎంతమంది హాజరయ్యానే దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జగిత్యాలలో అభ్యర్థుల ఆందోళనజగిత్యాల పట్టణంలో గ్రూప్-1 పరీక్షా కేంద్రం ముందు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అరగంట టైం ఉన్నా కూడా 5 నిమిషాలు మాత్రమే ఉందని ఇన్విజిలేటర్ చెప్పారని, టైం అయిపోయిందని చెప్పడంతో తొందరలో ఆన్సర్ చేశామని ఆవేదన చెందారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు అభ్యర్థులకు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.ఆర్టీసీ ప్రత్యేక బస్సులు గ్రూప్–1 ప్రిలిమ్స్ అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆదివారం ప్రత్యేక బస్సులు నడిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 897 పరీక్ష కేంద్రాలకు బస్సులను నడపాల ని అధికారులను యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు శనివారం సాయంత్రం నుంచే ఎంజీబీఎస్, జేబీ ఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ పాయింట్లనుంచి బస్సు సర్వీసులు నడిపింది. రెండుసార్లు రద్దు.. కమిషన్ తొలిసారిగా 2022 ఏప్రిల్‌లో గూప్–1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కమిషన్‌ను ప్రక్షాళన చేపట్టడంతోపాటు కొత్తగా 60 గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. -
AP : గ్రూప్-1 రద్దు నిర్ణయం రద్దు, హైకోర్టు స్టే
-
గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశాంతం
సాక్షి, అమరావతి/ఒంగోలు అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 18 జిల్లాల్లో ఉదయం, మధ్యాహ్నం జరిగిన (రెండు పేపర్లు) పరీక్షకు 91,463 మంది (72.55 శాతం) హాజరైనట్లు సర్విస్ కమిషన్ తెలిపింది. సెల్‌ఫోన్‌తో పట్టుబడిన అభ్యర్థి గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన ఓ విద్యార్థి సెల్‌ఫోన్‌తో ప్రశ్నపత్రాన్ని ఫొటో తీస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. స్థానిక క్విస్ కాలేజిలోని 121701 వెన్యూకోడ్‌లో హాల్ టికెట్ నంబర్ 121100538 ఉన్న ఒక అభ్యర్ధి ఐఫోన్‌తో ప్రశ్న పత్రాన్ని ఫొటో తీస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఫోన్ తీసుకునేందుకు ఇన్విజిలేటర్ ప్రయత్నించగా ఆ అభ్యర్థి వాదనకు దిగాడు. దీంతో చీఫ్ సూపరింటెండెంట్‌కు తెలపగా ఆయన వచ్చి ఫోన్ తీసుకునేందుకు ప్రయ తి్నంచడంతో కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. అదే సమయానికి పరీక్ష కేంద్రాల తనిఖీకి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ వచ్చారు. దీంతో ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను సేకరించారు. పరీక్ష కేంద్రంలో భద్రతా వైఫల్యంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్న విద్యార్థులు -
ఏపీలో రేపే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష
సాక్షి, విజయవాడ: ఏపీలో రేపు గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. రాష్డ్ర వ్యాప్తంగా 89 పోస్టులకి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వగా, ఈ పరీక్షకు 1,48,881 మంది అభ్యర్ధుల దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లగా గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో గ్రూప్-1 ప్రిలిమనరీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాల్లో 301 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ -1 జనరల్ స్టడీస్ పరీక్ష, ఉదయం 9.45 గంటల వరకు అభ్యర్ధులకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్ -2 జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్షకి 18 జిల్లాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమారాలతో పర్యవేక్షించనున్నారు. గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్ష పర్యవేక్షణకు 18 మంది ఐఏఎస్‌లను నియమించారు. జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందు చేరుకోవాలని అభ్యర్ధులకు ఎపీపీఎస్సీ సూచించింది. గ్రూప్-1 ప్రిలిమనరీ నిర్వహణకు 301 మంది లైజనింగ్ అధికార్లు, 6612 మంది ఇన్విజలేటర్లు నియమించారు. ఏపీపీఎస్సీ నుంచి 39 మందికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఇదీ చదవండి: ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే.. -
Telangana: గ్రూప్ 1, 2, 3 పరీక్షల షెడ్యూల్ విడుదల
-
తెలంగాణలో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ కు లైన్ క్లియర్
-
తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్‌కు లైన్‌క్లియర్
గ్రూప్ 1 నోటిఫికేషన్‌పై కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయ్యింది. గతంలో టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. దీంతో త్వరలో కొత్త గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. కాగా రెండేళ్ల కిందట తొలిసారి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్లింది. అయితే తాజాగా గ్రూప్ 1పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఇక గతంలోని 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కి చేరుకుంది. ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో 503 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని 46 ఏళ్ల వరకు సడలిస్తామని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల కానుంది. -
AP: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 81 గ్రూప్–1 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. గురువారం 897 గ్రూప్–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సర్వీస్ కమిషన్ తాజాగా గ్రూప్–1 పోస్టులకుసైతం నోటిఫికేషన్జారీ చేసింది. అభ్యర్థులు తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ఆధారంగా జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని, ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మార్చి 17న ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు సర్వీస్ కమిషన్ పేర్కొంది. డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది. కమిషన్ ప్రకటించిన గ్రూప్–1 విభాగంలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్ ట్యాక్స్ కమిషనర్స్ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్స్, ఆర్టీవో, గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు సైతం ఆఫ్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహించనున్నారు. మొత్తం పోస్టులు, వేతనం, అర్హతలతో కూడిన పూర్తి సమాచారం కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.inలో ఉంచినట్టు కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. కాగా, ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతినిచ్చిన మరికొన్ని పోస్టులకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేసింది. వివాదరహితంగా పోస్టుల భర్తీ గతంలో ఉండే అనేక న్యాయపరమైన వివాదాలను, చిక్కులను పరిష్కరించి ప్రభుత్వం సర్వీస్ కమిషన్‌లో సంస్కరణలు తీసుకొచ్చింది. దాంతో గతేడాది ఏపీపీఎస్సీ ఇచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి వివాదాలకు తావులేకుండా 11 నెలల కాలంలో పూర్తి పారదర్శకంగా మెయిన్స్, ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసింది. గ్రూప్–1 పరీక్షలు, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక సమర్థవంతంగా నిర్వహించి, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాన్ని అంచనా వేసి ఎంపిక చేశారు. ఈ నియామకాలు అతి తక్కువ సమయంలోనే కమిషన్ పూర్తి చేసింది. ఇదే తరహాలో ఇప్పుడు ప్రకటించిన నోటిఫికేషన్లలో ఇచ్చిన పోస్టులు సైతం సమర్థవంతంగా, సత్వరం భర్తీ చేసేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. -
AP: నెలాఖరులో గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు
సాక్షి, విజయవాడ: ఈ నెలాఖరులోపు గ్రూప్ 1, గ్రూప్ -2 నోటిఫికేషన్లు ఇస్తామని, గ్రూప్-1లో 100, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2022 గ్రూప్ వన్ ప్రక్రియను రికార్డుస్ధాయిలో తొమ్మిది నెలల్లో పూర్తి చేశామని గుర్తు చేశారు. ఈ గ్రూప్ వన్ ప్రక్రియ కూడా తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో రెండు పేపర్ల స్ధానంలో ఒకే పేపర్ ఉంటుందని తెలిపారు. గ్రూప్ వన్ మెయిన్స్ లో అయిదు పేపర్లకు బదులు నాలుగే ఉంటాయన్నారు. ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో, రెండు పేపర్లు డిస్క్రిప్షన్ తరహాలో ఉంటాయని చెప్పారు. లాంగ్వేజ్ లో రెండు పేపర్లకి బదులు ఒక పేపర్ మాత్రమే ఉంటుందన్నారు. సిలబస్ లో ఎటువంటి మార్పులు ఉండవన్నారు. నిరుద్యోగ అభ్యర్ధులకు మేలు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. యూపీఎస్సీ, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్లలో పరీక్షలను పరిశీలించిన తర్వాతే మార్పులు చేశామన్నారు. డిసెంబర్ లో 2200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోనే పరీక్షలు జరిపి జనవరిలో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. APPSC Group-1&2 ఉద్యోగాల స్డడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్, ప్రీవియస్ పేపర్స్, ఆన్లైన్ టెస్టులు, సక్సెస్ స్టోరీల కోసం క్లిక్ చేయండి -
ఏ సర్కారూ పరీక్షలే పెట్టనట్లు కమిషన్ కాకమ్మ కథలు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటిదాకా ఏ సర్కారూ పరీక్షలే పెట్టనట్లు.. ఎవరూ ఉద్యోగాలే ఇవ్వనట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) కాకమ్మ కథలు చెబుతోందని శుక్రవారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. నచ్చినోళ్లకు పదవులు, కావాల్సినోళ్లకు ఉద్యోగాలు.. ఇదే దొర తెచ్చిన బంగారు తెలంగాణ అని విమర్శించారు. చెప్పాలంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్‌ను కాస్త.. దొరలు ప్రగతిభవన్ సర్విస్ కమిషన్ గా మార్చారన్నారు. ‘గ్రూప్ 1 పరీక్షలు ఎంత మంది రాశారో ముందొక లెక్క.. ఓఎంఆర్ షీట్స్ లెక్కిస్తే మరో లెక్క.. ఇది చాలా కామన్ అట. ప్రశ్నపత్రాలనే అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నోళ్లకు ఓఎంఆర్ షీట్స్ తారుమారుచేయడం ఒక లెక్కనా’అని అన్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే కమిషన్‌కు వచ్చిన నష్టం ఏంటని షర్మిల సూటిగా ప్రశ్నించారు. -
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ రద్దు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్స్ పోస్ట్‌ల భర్తీకి ఉత్తర్వులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్- 1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు గ్రూప్-1లో 89 పోస్ట్‌లు, గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ఈరోజు (ఆగస్ట్ 28) ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలను నిర్వహించనుంది. -
ఒకే ఇంట్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావడమే గొప్ప అనుకుంటాం. కానీ ఆ ఇంట్లో ఒకరిద్దరు కాదు, ఏకంగా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబంలో, కన్నవాళ్లు పడే తపనను దగ్గరుండి గమనించి అహర్నిశలు కష్టపడి చదివారు. ఫలితంగా ముగ్గురూ విద్యావంతులయ్యారు. ఒకరు డీఎస్పీగా.. మరొకరు ఆర్డీవోగా, మరో సోదరి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నత కొలువులు సాధించి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపారు. తల్లి పేరుకు తగ్గట్లే ‘సరస్వతీ’ పుత్రికలుగా ఖ్యాతి గడించారు. నందలూరు మండలం టంగుటూరుకు చెందిన సోదరీమణుల విజయగాథే ఈ రోజు ప్రత్యేక కథనం. రాజంపేట: నందలూరు మండలంలోని చెయ్యేటి పరీవాహక గ్రామమైన టంగుటూరు గ్రామంలో కంభాలకుంట సుబ్బరాయుడు, కంభాలకుంట సరస్వతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి సుబ్బరాయుడు ఆర్టీసీలో కండక్టరుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తల్లి సరస్వతి ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. తమ ముగ్గురు బిడ్డలైన లావణ్యలక్ష్మీ, మాధవి, ప్రసన్నకుమారిని బాగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఆ దిశగా ముగ్గుర్ని చదివించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముగ్గురు కూడా కష్టపడి చదివారు. లావణ్యలక్ష్మీ, ప్రసన్నకుమారి ఏఐటీఎస్‌లో బీటెక్ విద్యను పూర్తి చేసిన అనంతరం సివిల్స్‌లో రాణించాలనే పట్టుదలతో పోటీపరీక్షలకు సిద్ధమయ్యారు. తొలి అడుగులో భాగంగా గ్రూప్స్‌లో విజేతలుగా నిలిచారు. లావణ్యలక్ష్మీ.....డీఎస్పీగా తొలి పోస్టింగ్ టంగుటూరు జెడ్పీ హై స్కూల్లో పదో తరగతి పూర్తి చేసిన ఈమె పద్మావతి యూని వర్సిటీ పాలి టెక్నిక్ ఆపై ఏఐటీఎస్‌లో బీటెక్ పూర్తి చేశా రు. 2009లో గ్రూప్–1 విజేత గా నిలిచి మచిలీపట్నంలో డీఎస్పీగా తొలి పోస్టింగ్ చేపట్టారు. విజయవాడలో సెంట్రల్ ఎసీపీగా పనిచేశారు. మార్కాపురం ఓఎస్డీగా పనిచేశారు. 14 యేళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్‌లో ఛీప్ విజిలెన్స్ ఆఫీసర్‌గా తిరుపతిలో చేస్తున్నారు. ఈమె భర్త డా.చంద్రశేఖర్ నెల్లూరు ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్టినేటర్‌గా పని చేస్తున్నారు. మాధవి.. అక్క లావణ్యలక్ష్మీ బాటలోనే మాధవి కూడా గ్రూప్స్‌లో విజేతగా నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజంపేటలోని వైష్ణవీ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేసిన ఈమె ప్రస్తుతం ఏపీటిడ్కోలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త కిరణకుమార్ కడపలో వ్యాపారిగా కొనసాగుతున్నారు. అక్క చూపిన బాటలో.. అక్కను ఆదర్శంగా తీసుకున్న ప్రసన్నకుమారి గ్రూప్–1లో విజేతగా నిలిచింది. టంగుటూరు జెడ్పీహెచ్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేసిన ఈమె , ఇంటర్ తిరుపతిలోని శ్రీ చైతన్యలో, ఆపై ఏఐటీఎస్‌లో బీటెక్ పూర్తి చేశారు. తొలుత టంగుటూరు గ్రామ సమీప ప్రాంతమైన టీవీపురానికి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ప్రసన్నకుమారి గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యారు. ఆర్సీ రెడ్డి ఐఏ ఎస్ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నారు. గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర స్ధాయిలో మూడవ ర్యాంక్ సాధించారు. ఆర్డీఓగా నియమితులయ్యారు. సివిల్స్‌లో విజేత కావడమే తన లక్ష్యమంటున్నారు. ఈమె భర్త చంద్రాజీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నా కలలను బిడ్డలు నిజం చేశారు.. నేడు ఏడవ తరగతి వరకు చదువుకున్నాను. నా భర్త ఆర్టీసీలో కండక్టరుగా పనిచేశారు. బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా కలను నా ముగ్గురు బిడ్డలు నిజం చేశారు. వారికి ఏనాడూ ఇంటిలో పనిచెప్పలేదు. చదువుకోవాలని పదేపదే చెబుతూవచ్చాను. కుమార్తెలను ఉన్నతంగా చూడాలనుకున్నారు. అదే జరిగింది. వారిని నిరంతరం చదువుకోవాలనే ప్రోత్సహించాం. –తల్లి సరస్వతి -
ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల
సాక్షి, కృష్ణా: గ్రూప్-1 పరీక్షా తుది ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. విజయవాడలో బోర్డు చైర్మన్ గౌతం సవాంగ్ ఫలితాలను రిలీజ్ చేశారు. గ్రూప్-1లో ఖాళీల 110 పోస్టులకుగానూ తుది ఫలితాలను ప్రకటించారాయన. నోటిఫికేషన్ నుంచి ఫలితాలు వెల్లడి వరకు పూర్తి పారదర్శకత పాటించిన ఏపీపీఎస్సీ.. అతి తక్కువ సమయంలో వివాదాలకి దూరంగా ప్రక్రియ పూర్తి చేసింది. ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రికార్డు సమయంలోనే గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించాం. గ్రూప్ వన్ ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా పూర్తి చేశాం. మొదటిసారిగా సీసీ కెమెరాలను వినియోగించాం. 111 పోస్టులకి 110 పోస్టుల ఫలితాలు ప్రకటిస్తున్నాం. స్పోర్ట్స్ కోటాలో మరో పోస్టు ఎంపిక జరుగుతుంది. 1:2 కోటాలో ఇంటర్వ్యూలకి అభ్యర్ధులని ఎంపిక చేశాం. 11 నెలల రికార్డు సమయంలో గ్రూప్ వన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం. ఏపీపీఎస్సీ చరిత్రలోనే తొలిసారిగా ఇంత తక్కువ సమయంలో ఎంపిక ప్రక్రియ పూర్తి కావడం ఇదే. ముగ్గురు ఐఐఎం, 15 మంది ఐఐటీ అభ్యర్ధులు ఇంటర్వ్యూలకి వచ్చిన వాళ్లలో ఉన్నారు. ఎంపికైన వారిలో మొదటి పది స్ధానాలలో ఆరుగురు మహిళా అభ్యర్ధులే ఉన్నారు. టాప్ ఫైవ్ లో తొలి మూడు ర్యాంకర్లు మహిళలదే అని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ర్యాంకర్ల వివరాలు ఫస్ట్ ర్యాంకర్- భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష ( బిఎ ఎకనామిక్స్ ఢిల్లీ యూనివర్సిటీ) సెకండ్ ర్యాంకర్ - భూమిరెడ్డి భవాని ( అనంతపురం) మూడవ ర్యాంకర్ - కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న నాలుగవ ర్యాంకర్ - కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి ( అనంతపురం జెఎన్ టియు) అయిదవ ర్యాంకర్ - భానుప్రకాష్ రెడ్డి ( కృష్ణా యూనివర్సిటీ) ఆ పుకార్లు నమ్మొద్దు ఏపీపీఎస్సీ నిర్వహించబోయే పరీక్షల విషయంలో.. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ పుకార్లపైనా చైర్మన్ గౌతమ్ సవాంత్ స్పందించారు. ‘‘సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దని, గ్రూప్ -2 కి వెయ్యి పోస్టులతో నోటిఫికేషన్ ఉండొచ్చని, అలాగే.. గ్రూప్-1 వంద పైనా పోస్టులతో నోటిఫికేషన్ ఉండొచ్చని’’ తెలిపారాయన. గ్రూప్-1 ప్రక్రియ సాగిందిలా.. గత ఏడాది సెప్టెంబర్ 30 న 111 పోస్టులకి నోటిఫికేషన్ విడుదలకాగా.. జనవరి 8 న ప్రిలిమ్స్ నిర్వహించింది ఏపీపీఎస్సీ. కేవలం 19 రోజులలో అంటే.. జనవరి 27 న ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించారు. ప్రిలిమ్స్ కి 86 వేల మంది హాజరు కాగా.. 6, 455 మంది మెయిన్స్ కి అర్హత సాధించారు. జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మెయిన్ పరీక్ష నిర్వహించారు. 111 పోస్టులకిగానూ 220 మంది అర్హత సాధించారు. ఇక.. ఆగస్ట్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది ఏపీపీఎస్సీ. -
గ్రూప్–1 ప్రిలిమ్స్ ‘లీకేజీ’ని సీబీఐకి అప్పగించాలి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్న పత్రం లీకేజీ దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. పిల్‌పై అభ్యంతరాలను పక్కకు పెట్టి, పిటిషన్‌కు నంబర్ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం రిజిస్ట్రీని ఆదేశించింది. ఫైలింగ్ నంబర్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్పీఎస్సీ చైర్మన్, హైదరాబాద్ సీపీ, సీబీఐ డైరెక్టర్‌కు నోటీసులిచ్చింది. అలాగే పేపర్ లీకేజీ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో నివేదిక అందజేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఏప్రిల్‌లో దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలతో ఈ పిల్ దాఖలైంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రిజిస్ట్రీ నంబర్ కేటాయించలేదు. సీజే ధర్మాసనం వద్ద విచారణ సందర్భంగా హోం శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రూపేందర్ వాదనలు వినిపిస్తూ.. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ ఇప్పటికే సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా నిందితులపై కేసు నమోదు, అరెస్టు, దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది.. వంటి అంశాలపై సిట్ మూడు నివేదికలను కూడా కోర్టుకు సమర్పించిందన్నారు. ఈ పిల్ దాఖలు చేసిన పిటిషనర్ బక్క జడ్సన్.. కాంగ్రెస్ పార్టీ నేత అని చెప్పారు. నిష్పక్షపాతంగా సిట్‌ను దర్యాప్తు చేయకుండా ధిక్కరణ పిటిషన్లు కూడా వేస్తూ అడ్డుకుంటున్నారని చెప్పారు. కిందిస్థాయి సిబ్బందిపైనే కేసులు.. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్.శరత్ కుమార్ వాదనలు వినిపించారు. పేపర్ లీకేజీ అంశంలో టీఎస్పీఎస్సీకి చెందిన కిందిస్థాయి సిబ్బందిపైనే సిట్ కేసులు పెట్టిందని.. ఉన్నతాధికారులను మాత్రం వదిలేసిందని చెప్పారు. పాస్వర్డ్ లీక్‌కు కారణమైన టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శిపై ఎలాంటి కేసు పెట్టలేదన్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌తో పాటు మరికొన్ని నియామక పరీక్షల పేపర్లు లీక్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయని వెల్లడించారు. పిల్‌కు నంబర్‌కు వేయాలని రిజిస్ట్రీని ఆదేశించడంతోపాటు దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి వద్ద ఉన్న పిటిషన్‌ను కూడా ఈ పిల్‌కు జత చేసేలా దరఖాస్తు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. -
2 నుంచి గ్రూప్–1 ఇంటర్వ్యూలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వి స్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. జనరల్, స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైనవారికి ఆగస్టు 2 నుంచి మౌఖిక పరీక్షలు ఉంటాయని వెల్లడించింది. నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులకనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. వచ్చే నెల 2న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజయవాడ ఎంజీ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైనవారికి ఈ నెల 27 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. ఏపీపీఎస్సీ గతేడాది సెపె్టంబర్ 30న 111 గ్రూప్–1 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 8న ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) నిర్వహించి.. అదే నెల 27న ఫలితాలను వెల్లడించారు. 5,035 మంది మెయిన్స్ పరీక్షలకు ఎంపికయ్యారు. వీరికి జూన్ 3 నుంచి 10 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో నుంచి పోస్టుకు ఇద్దరు చొప్పున 110 పోస్టులకు 220 మందిని, స్పోర్ట్స్ కోటాలోని ఒక పోస్టుకు 39 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. నోటిఫికేషన్ ఇచ్చిన తక్కువ కాలంలోనే ఎలాంటి వివాదాలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించడం, అంతే వేగంగా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనుండటం ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఇదే తొలిసారి. ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన నాటి నుంచి 19 రోజుల్లో, మెయిన్స్ పరీక్షలు జరిగిన నాటి నుంచి 33 రోజుల్లోనే ఫలితాలను వెల్లడించడం విశేషం. అధికారులకు అర్ధ వార్షిక పరీక్షలు రాష్ట్రంలో పనిచేస్తున్న అఖిల భారత, రాష్ట్ర సర్వీసు అధికారులకు అర్ధ వార్షిక పరీక్షలను నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. వీరికి సెపె్టంబర్ 12 నుంచి 15 వరకు పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఆగస్టు 14లోగా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
నేడు తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్
-
టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ వ్యవహారంలో మరో పేరు వెలుగులోకి వచ్చింది. కమిషన్ మాజీ ఉద్యోగి, తన స్నేహితుడైన సురేశ్‌కూ ప్రవీణ్‌కుమార్ గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం పంపినట్లు తేలింది. దీంతో మంగళవారం సురేశ్‌ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు ప్రశి్నస్తున్నారు. తమ అదుపులో ఉన్న తొమ్మిది మంది నిందితులను కూడా వరసగా నాలుగో రోజూ ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు. 10 మంది కమిషన్ ఉద్యోగులు క్వాలిఫై.. గ్రూప్–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ప్రవీణ్‌కుమార్ గతేడాది జూన్ నుంచి ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. కమిషన్‌లోనే నెట్వర్క్ అడ్మిన్‌గా పని చేస్తున్న రాజశేఖర్ సాయంతో కస్టోడియన్ కంప్యూటర్లో ఉన్న ఈ ప్రశ్నపత్రాన్ని గతేడాది అక్టోబర్ తొలి వారంలో చేజిక్కించుకున్నాడు. దీన్ని వినియోగించి తాను పరీక్షకు సిద్ధం కావడంతో పాటు తన స్నేహితుడైన సురేశ్‌కు వాట్సాప్ ద్వారా పంపాడు. అతడు కూడా మంచి మార్కులతో ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యాడు. దీంతో సురేశ్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసు కుని ప్రశి్నస్తున్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో కమిషన్‌లో పని చేస్తున్న 10 మంది ఉద్యోగులు క్వాలిఫై అయినట్లు సిట్ గుర్తించింది. ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. గ్రూప్–1 అనుభవంతో మిగతా పేపర్ల కోసం.. గ్రూప్–1 పరీక్ష పేపర్లు చేజిక్కించుకున్న అనుభవంతో ప్రవీణ్, రాజశేఖర్‌లు మిగిలిన పరీక్షల సమయంలోనూ తమ ప్రయత్నాలు కొసాగించారు. గత నెల ఆఖరి వారంలో మరో నాలుగు పరీక్షలకు సంబంధించిన పది క్వశ్చన్ పేపర్లు వీరికి చిక్కాయి. అయితే వాటిని ఎలా విక్రయించాలో అర్థం కాని ప్రవీణ్ తనతో సన్నిహితంగా ఉండే రేణుకను సంప్రదించాడు. తన సమీప బంధువైన కానిస్టేబుల్ శ్రీనివాస్ ద్వారా ఏఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్‌లను రేణుక సంప్రదించింది. ప్రవీణ్ నుంచి పేపర్ అందగానే భర్త డాక్యాతో కలిసి స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ తండాకు వెళ్లి, రెండురోజుల పాటు తన ఇంట్లోనే నీలేశ్, గోపాల్‌తో చదివించింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు మంగళవారం రేణుక, డాక్యా నాయక్, నీలేశ్, గోపాల్‌లను ఆ తండాకు తీసుకువెళ్లి సీన్ రీ–కన్స్ట్రక్షన్ చేశారు. రాజశేఖర్ కాంటాక్టుల పైనా ఆరా.. లీకైన ప్రశ్నపత్రాలను ప్రవీణ్‌తో పాటు రాజశేఖర్ సైతం తన పెన్డ్రైవ్లోని కాపీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతను ఎవరికైనా అమ్మడం, షేర్ చేయడం జరిగిందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. రాజశేఖర్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్, వాట్సాప్ గ్రూప్స్‌లో ఉన్న వారితో జరిగిన సంప్రదింపుల వివరాలు ఆరా తీస్తున్నారు. వీరిలో ఎవరైనా గ్రూప్–1 సహా ఇతర పరీక్షలు రాశారా? ఉత్తీర్ణులయ్యారా? తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఏఈ ప్రశ్నపత్రాలు ఇచ్చిన రేణుకకు నీలేష్, గోపాల్ రూ.14 లక్షల వరకు చెల్లించారు. ఇందులో రూ.లక్ష వీరికి కానిస్టేబుల్ శ్రీనివాస్ సర్దుబాటు చేసినట్లు సిట్ గుర్తించింది. నగదు ఇచి్చనందుకు అతడు సైతం ప్రశ్నపత్రాన్ని వీరి నుంచి పొందాడా? ఎవరికైనా పంపాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తోంది. ప్రవీణ్ ఇంట్లో సోదాలు ప్రవీణ్‌కుమార్ నివాసం ఉంటున్న రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట కార్పొరేషన్ 19వ డివిజన్లోని మల్లికార్జుననగర్ కాలనీలో మంగళవారం సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. పేపర్ లీక్‌కు సంబంధించిన ఆధారాల కోసం క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు, కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని విశ్వసనీయ సమాచారం. కాగా కొన్ని వస్తువులను కూడా సిట్ బృందం తమ వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది. చదవండి: కొలువుల కలవరం -
ఒక్కడు చేసిన పాపం.. ఎందరికో శాపం
పరీక్షల రద్దు ప్రకటన వేలాది మందికి అశనిపాతమే అయింది. పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు కేరాఫ్‌గా మారిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, అశోక్‌నగర్, తదితర ప్రాంతాలు పరీక్షల రద్దు ప్రకటనతో ఉలిక్కిపడ్డాయి. అశోక్‌నగర్‌లోని నగర కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్న వేలాది మందిలో గందరగోళం నెలకొంది. ఒక్క సిటీసెంట్రల్ లైబ్రరీలోనే కాదు..అశోక్‌నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అద్దె గదుల్లో, స్టడీరూమ్లలో, కోచింగ్ కేంద్రాల్లోనూ చదువుకుంటున్న లక్షలాది మంది అభ్యర్ధులు కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అశోక్‌నగర్ ప్రాంతంలోనే చిన్నవి, పెద్దవి సుమారు 30కి పైగా కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. వయోపరిమితిలో చివరకు చేరుకొన్న అభ్యర్ధులు మొదలుకొని, ఈ ఏడాదే డిగ్రీ పూర్తయిన విద్యార్థుల వరకు ఒక్కో అభ్యర్థి కోచింగ్‌కు, మెటీరియల్‌కు, ఇళ్ల అద్దె, భోజనం తదితర సదుపాయాల కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులంతా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే మకాంవేసి ఉంటున్నారు.‘పరీక్షల రద్దుతో చదవడం మానేసి ఇంటికి వెళ్లాలా లేకపోతే మరో ప్రకటన కోసం ఎదురు చూస్తూ చదువుకోవాలా’ తేల్చుకోలేకపోతున్నట్లు పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలం అమ్ముకున్నాడు బోధన్ సమీపంలోని కోటగిరి ప్రాంతానికి చెందిన శంకర్ కుటుంబానికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఉన్న కొద్దిపాటి భూమిలో అరఎకరం భూమిని తన చదువుల కోసమే అమ్మేశారు. మరో రూ.6 లక్షలు అప్పు చేయవలసి వచ్చింది. రెండేళ్లుగా కష్టపడి చదువుతున్నాడు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించాడు. మెయిన్స్‌లోనూ విజయం సాధిస్తాననే గట్టి నమ్మకంతో ఉన్నాడు.‘ఐదు రూపాయల భోజనం తిని చదువుకుంటున్నాను. స్టడీమెటీరియల్, కోచింగ్, పరీక్షల కోసమే ఎక్కువ ఖర్చు చేస్తున్నా. ఇటీవల ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. అయినా సరే ఉద్యోగం వస్తే అంతా బాగుంటుందనే ఆశతో ఉన్నాను. కానీ ఇప్పుడు ఇలా అయింది.’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లో ఉండాలా, వద్దా తేల్చుకోలేకపోతున్నట్లు చెప్పాడు. ఏం సమాధానం చెప్పాలి సంగారెడ్డికి చెందిన పద్మావతి ఏడాదిన్నర కాలంగా పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నారు. ఇంటికి, కుటుంబానికి దూరంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈసారి ఎలాగైనా జాబ్ గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు. కానీ ప్రస్తుత పరిణామాలు ఆమె నమ్మకాన్ని వమ్ము చేశాయి. ‘ఎప్పటి వరకు ప్రిపరేషన్ పూర్తవుతుంది. పరీక్షలు ఎప్పుడు రాస్తావు, మళ్లీ ఇంటికి ఎప్పుడొస్తావు అని నాన్న అడుగుతున్నారు. కానీ ఏం సమాధానం చెప్పాలి?’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రద్దు మంచిదే ‘ఒకవిధంగా రద్దు చేయడం మంచిదే. లీకేజీ వల్ల నిజాయితీగా కష్టపడే వాళ్లకు అన్యాయం జరుగుతుంది. కానీ లక్షలాది మంది అభ్యర్ధుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో ఒక ప్రభుత్వ సంస్థ ఇంత బలహీనంగా ఉండడమే ఆందోళన కలిగిస్తోంది’ అని మరో అభ్యర్థిని విజయలక్ష్మి పేర్కొన్నారు. సగటున ఒక అభ్యర్థి ఖర్చులు అంచనా.. నలుగురితో కలిసి ప్రతి నెలా చెల్లించే ఇంటి అద్దె : రూ.3500 నెల భోజనం ఖర్చు : రూ.2900 స్టడీరూమ్ (ఏసీ) రూ.1700 స్టడీరూమ్ (నాన్ ఏసీ) రూ.900 గ్రూప్–1 కోచింగ్ ఫీజు రూ. 75,000 గ్రూప్–2, కోచింగ్ ఫీజు రూ.28,000 స్టడీ మెటీరియల్ రూ.15000 ఒక అభ్యర్ధికి ఏడాదికి అయ్యే ఖర్చు సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు. మరిన్ని అదనపు సదుపాయాలతో చదువుకుంటే రూ.3 లక్షలపైనే ఖర్చవుతుంది. రద్దు అన్యాయం నేను గ్రూప్–1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్‌కు చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న సమయంలో పేపర్ లీక్ అంటూ రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం. ఎవడో తప్పు చేస్తే నిజాయితీగా రాసిన వేలాదిమంది అభ్యర్థులను పరిగణనలోనికి తీసుకోకుండా పరీక్ష పూర్తిగా రద్దు చేయడం అన్యాయం. తప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించాలి కానీ అందరికి శిక్ష వేడం సరికాదు. ఈ విషయంలో పునరాలోచించి మాలాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నా. – పిట్ల సరిత, డిచ్పల్లి, గ్రూప్–1 అభ్యర్థి -
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది టీఎస్పీఎస్సీ. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. శుక్రవారం ఉదయం జరిగిన కమిషన్ ప్రత్యేక సమావేశంలో.. పేపర్ లీకేజీ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సిట్ సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, ఈ ఏడాది జనవరి 22వ తేదీన ఏఈఈ, ఫిబ్రవరి 26వ తేదీన డీఏవో పరీక్షలు జరిగాయి. ఇక రద్దు చేసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11న నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. ఇదిలా ఉంటే.. మరోవైపు జూనియర్ లెక్చరర్స్ పరీక్షలతో పాటు మరికొన్ని ఎగ్జామ్స్‌ను సైతం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది టీఎస్పీఎస్సీ. ఇక రద్దు చేసిన పరీక్షలను మళ్లీ నిర్వహించాలని, వీలైనంత త్వరలో వాటి పరీక్షా తేదీలను ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అయితే.. కమిషన్ తాజా నిర్ణయంపై గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 16వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా, ఆ ఫలితాలను జనవరి 13వ తేదీ (శుక్రవారం) విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. 503 గ్రూప్-1 పోస్టులకు మొత్తం 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి మొత్తం 25,050 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. జూన్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ తొలుత భావించింది. ఈలోపే లీకేజీ వ్యవహారం ప్రకంపనలు రేపడంతో.. ఇప్పుడు అదే జూన్‌లో మళ్లీ రీఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేయడంతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఎస్పీఎస్సీ ముట్టడికి ఎన్ఎస్యూఐ యత్నించింది. NSUI నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో ఎన్ఎస్యూఐ నేతలు వాగ్వాదానికి దిగారు. -
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ రాసినవారిలో మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తంగా 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లతో కూడిన జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టింది. ఈ ఫలితాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఉంటే టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేసి సంప్రదించవచ్చని సూచించింది. ఈ ఏడాది జూన్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని.. ఆ పరీక్ష ప్యాటర్న్‌ను ఈనెల 18న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. 503 గ్రూప్–1 ఉద్యోగాలకు.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తులు స్వీకరించిన టీఎస్పీఎస్సీ అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. మొత్తం 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. అక్టోబర్ నెలాఖరులో టీఎస్పీఎస్సీ అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో పెట్టింది. ప్రాథమిక కీ విడుదల చేసి.. అభ్యంతరాలను స్వీకరించింది. ఐదు ప్రశ్నలను తొలగించి తుది కీని ప్రకటించింది. తాజాగా మల్టీజోన్లు, రిజర్వేషన్లు, జెండర్ వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే మల్టీజోన్–2 పరిధిలో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ (విమెన్), హియరింగ్ ఇంపెయిర్డ్ (జనరల్) కేటగిరీల్లో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులు లేకపోవడంతో ఆ రెండు కేటగిరీలను పక్కనపెట్టింది. మొత్తంగా 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసి జాబితాను వెబ్సైట్లో పొందుపర్చింది. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు.. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా.. నేరుగా 33% రిజర్వేషన్లు కలి్పస్తున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఒకే మార్కులను ఇద్దరు లేదా అంతకు మించి అభ్యర్థులు సాధిస్తే.. వారి స్థానికత ప్రకారం అర్హతను ఖరారు చేసినట్టు కమిషన్ తెలిపింది. ఒకే మార్కులు సాధించిన వారు ఒకే స్థానికతతో ఉన్నప్పుడు అభ్యర్థుల పుట్టినతేదీ ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి హయ్యర్ ర్యాంకు ఇచి్చనట్టు వివరించింది. ఓఎంఆర్ పత్రాల్లో కమిషన్ సూచించిన విధంగా కాకుండా ఇష్టానుసారం బబ్లింగ్ చేసిన వారిని పరిగణనలోకి తీసుకోలేదని కమిషన్ తెలిపింది. వివరాలకు.. టీఎస్పీఎస్సీ వెబ్సైట్: ఠీఠీఠీ.్టటpటఛి.జౌఠి.జీn టీఎస్పీఎస్సీ హెల్ప్‌డెస్క్ నంబర్లు: 040–22445566, 040–23542185, 040–23542187 ఈ–మెయిల్: helpdesk@tspsc. gov. in -
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి టీఎస్పీఎస్సీకి హైకోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి టీఎస్పీఎస్సీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై టీఎస్‌పీఎస్‌స్సీ అప్పీల్స్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలితాలు వెల్లడించవచ్చని చెప్పిన తెలంగాణ హైకోర్టు.. అభ్యర్థి స్థానికత వివాదం తర్వాత తేలుస్తామని తెలిపింది. చదవండి: మోదీ వ్యూహం ఏంటి?.. కేసీఆర్ తడాఖా చూపిస్తాడా? -
వారంలోగా గ్రూప్–2 నోటిఫికేషన్!.. పోస్టులు ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హడావుడి మరింత జోరందుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేస్తుండడంతో నియామక సంస్థలు సైతం ఆ మేరకు వేగాన్ని అందిపుచ్చుకుంటూ ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. నియామకాల ప్రక్రియను ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో కీలక ప్రకటన విడుదలకు సిద్ధమవుతోంది. గ్రూప్–2 కేటగిరీ ఉద్యోగాల భర్తీకి వారం రోజుల్లోనే ప్రకటన విడుదల చేయనుంది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసింది. ఈ కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఉద్యోగాలు 582. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే వివిధ ఉద్యోగ కేటగిరీల మార్పులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో గ్రూప్–2 కేటగిరీలో అదనపు కేడర్లు చేరాయి. దీంతో పోస్టుల సంఖ్య 700కు పైగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టుల స్థాయిలో మార్పులు చేయడం వల్లే గ్రూప్–2 ప్రకటన జారీలో కాస్త జాప్యం జరిగినట్లు కమిషన్ వర్గాల విశ్వసనీయ సమాచారం. పోస్టుల స్థాయి మార్పుతోనే ఆలస్యం ఎస్సీ అభివృద్ధి శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల పరిధిలోని సహాయ సెక్షన్ అధికారి పోస్టులు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జువైనల్ సరీ్వసు జిల్లా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు గ్రూప్–2 కేటగిరీలోకి చేరాయి. ప్రస్తుతం ఈ కేటగిరీల్లోని పోస్టులు 120కి పైగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్దేశించిన పోస్టులకు స్థాయి మార్పుతో జత అయిన పోస్టులన్నీ కలిపి ఒకేసారి ప్రకటన జారీ చేసే క్రమంలో నోటిఫికేషన్ ఆలస్యమైనట్లు తెలుస్తోంది. మే లోగా గ్రూప్–1 మెయిన్స్ గ్రూప్–1 ఉద్యోగ నియామకాల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఇప్పటివరకు గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి ఫలితాలను వెల్లడించిన టీఎస్పీఎస్సీ అతి త్వరలో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. గ్రూప్–1 కేటగిరీలో 503 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. అదే నెల చివరి వారంలో పరీక్ష కీ విడుదల చేసిన కమిషన్.. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు వేగవంతం చేసింది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన టీఎస్పీఎస్సీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. మల్టీజోన్లు, రిజర్వేషన్ కేటగిరీల వారీగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండడంతో ఈ ప్రక్రియలొ కొంత జాప్యం జరిగినట్లు కనిపిస్తోంది. మొత్తానికి వారం లేదా పది రోజుల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని కమిషన్ వర్గాలు యోచిస్తున్నాయి. -
వచ్చే వారంలో గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీ విడుదలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసిన కమిషన్... ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ చేపట్టింది. ఈనెల 4తో ప్రాథమిక కీ అభ్యంతరాల స్వీకరణ పూర్తికాగా, పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. అయితే మొత్తంగా ఎన్ని అభ్యంతరాలు వచ్చాయనే విషయాన్ని కమిషన్ వెల్లడించలేదు. మరోవైపు ప్రాథ మిక కీ పైన వచ్చిన అభ్యంతరాల పరిశీలనకు టీఎస్పీఎస్సీ కార్యాచరణ సిద్ధంచేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను లోతుగా పరిశీలించాలని నిర్ణయించిన టీఎస్పీఎస్సీ.. ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం నుంచి అభ్యంతరాల పరిశీలన చేపట్టనున్నట్లు సమాచారం. వాటిలో సమ్మతమైనవెన్ని?... ప్రశ్నపత్రంలో తప్పొప్పులున్నాయా? తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి తుది కీ ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లోగా పరిశీలన పూర్తి చేయాలని భావిస్తున్న కమిషన్.. ఈ ప్రక్రియ ముగిస్తే వచ్చే వారంలో తుది కీని విడుదల చేయనుంది. ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 3.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈనెల 16న పరీక్షకు 2,85,916 మంది హాజరయ్యారు. -
మరో రసవత్తర సమరం.. సెమీస్‌కు ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాకు శృంగభంగం
టీ20 వరల్డ్‌కప్-2022లో గ్రూప్-1 సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్ తొలి జట్టుగా సెమీస్‌కు చేరుకోగా.. ఇవాళ (నవంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై గెలుపుతో ఇంగ్లండ్ రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించింది. ఫలితంగా సెమీస్‌పై గంపెడాశలు పెట్టుకున్న ఆతిధ్య ఆస్ట్రేలియాకు శృంగభంగం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే సెమీస్‌కు చేరాలని భావించిన ఆసీస్.. ఇంగ్లండ్ గెలవడంతో సూపర్-12 దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా, ఆసీస్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ఓపెనర్ పథుమ్ నిస్సంక (45 బంతుల్లో 67; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంకతో పాటు కుశాల్ మెండిస్ (18), భానుక రాజపక్ష (22) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టోక్స్, క్రిస్ వోక్స్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం నామమాత్రమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు జోస్ బట్లర్ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్), అలెక్స్ హేల్స్ (30 బంతుల్లో 47; 7 ఫోర్లు, సిక్స్) ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. ఓ దశలో ఓటమి దిశగా కూడా సాగింది. అయితే బెన్ స్టోక్స్ (36 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు) బాధ్యతాయుతంగా ఆడి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఇంగ్లండ్.. 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి, 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓడినా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి ఇంగ్లండ్‌ను దాదాపుగా ఓడించినంత పని చేసింది. లంక బౌలర్లలో లహీరు కుమార, వనిందు హసరంగ, ధనంజయ డిసిల్వా చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
APPSC: గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, విజయవాడ: గ్రూప్-1 పరీక్షల కోసం దరఖాస్తు తేదీ పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వివరాలను వెల్లడించారు. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 2వ తేదీ కాగా.. ఆ తేదీని నవంబర్ 5కి మార్చినట్లు వెల్లడించారు. ఎల్లుండి(4వ తేదీ) అర్థరాత్రి లోపు ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు. డిసెంబర్ 18న స్క్రీనింగ్ టెస్ట్, మార్చ్ 2023లో మెయిన్స్ పరీక్షలు ఉంటాయని.. ఈ దరఖాస్తు పొడిగింపును గమనించి వినియోగించుకోవాలని అర్హులకు సవాంగ్ సూచించారు. -
తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమినరీ కీ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈమధ్యే నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన కీ విడుదల అయ్యింది. శనివారం సాయంత్రం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కీను అందుబాటులో ఉంచారు. ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ఉండనుంది. కీ ఓఎంఆర్ షీట్ల డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి -
ప్రశ్నలు మధ్యస్థం... జవాబులు కఠినం!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు పేర్కొన్నారు. ప్రశ్నపత్రాన్ని కొందరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష స్థాయితో పోల్చగా మరికొందరు అంతకుమించి కఠినంగా ఉందని చెప్పుకొచ్చారు. యూపీఎస్సీ పరీక్షలో 100 ప్రశ్నలకు 120 నిమిషాల సమయం ఇస్తుండగా... గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలో 150 ప్రశ్నలకు 150 నిమిషాల సమయమే ఇవ్వడంతో ప్రశ్న చదివి జవాబు రాయడం క్లిష్టంగా మారిందని ఎక్కువ మంది అభ్యర్థులు చెప్పారు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలకు జవాబుల ఎంపికకు ఎక్కు వ సమయం పట్టిందన్నారు. నాలుగు జవాబుల్లో ఏ ఏ మూడు సరైనవి అంటూ ఇచ్చిన ప్రశ్నలు తికమకపెట్టేలా ఉన్నాయన్నారు. ఇక రీజనింగ్ విభాగం నుంచి 10 శాతం లోపే ప్రశ్నలు ఉండాల్సి ఉన్నా 15 శాతానికిపైగా ప్రశ్నలు వచ్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరెంట్ అఫైర్స్‌లో వచ్చి న ప్రశ్నలు లోతైన అంశాలతో అడగటంతో అభ్యర్థులు కంగుతిన్నారు. ఒకట్రెండు ప్రశ్నలు ఆంగ్లం, తెలుగులో వేర్వేరు అర్థాలు వచ్చేలా ఉన్నట్లు చెప్పారు. 50 శాతం పైబడి మార్కులతో కటాఫ్...! ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’ వెలువడే వరకు సమాధానాలను అంచనా వేయడం కష్టంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. జవాబుల సరళిని విశ్లేషిస్తే కనీసం 50% పైబడి మార్కులతో కటాఫ్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పురుషుల కేటగిరీలో 85 మార్కులు, మహిళల కేటగిరీలో 80 మార్కులకు అటుఇటుగా కటాఫ్ ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 75% హాజరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 2,86,051 మంది హాజరైనట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ పద్ధతిలో హాజరును స్వీకరించినట్లు తెలిపింది. స్వరాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న పరీక్ష కావడంతో ఎక్కడా అవకతవకలకు అవకాశం లేకుండా టీఎస్పీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని టీఎస్పీఎస్సీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించింది. ప్రతి జిల్లాకు ఒక కోఆర్డినేటర్‌తోపాటు సిట్టింగ్ స్క్వాడ్లు, 61 మంది లైజనింగ్ అధికారులు, జిల్లా అధికారుల ద్వారా పరీక్ష నిర్వహించింది. 8 పని దినాల్లో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్... అభ్యర్థుల ఓఎంఆర్ జవాబుపత్రాలను స్కానింగ్ చేసి వెబ్సైట్లో అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఇందుకు 8 పనిదినాలు పడుతుందని భావిస్తోంది. ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాకే ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనుంది. ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినందుకు టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి కలెక్టర్లు, అధికారులను అభినందించారు. అభ్యర్థిని సకాలంలో పరీక్షా కేంద్రానికి చేర్చిన పోలీసులు మెదక్ జోన్: మెదక్ జిల్లా కేంద్రంలోని గీతా జూనియర్ కాలేజీలో కిషన్ అనే అభ్యర్థి పరీక్ష రాయాల్సి ఉండగా అతను పొరపాటున అక్కడికి 2 కి.మీ. దూరంలోని సాధన జూనియర్ కళాశాలకు వచ్చాడు. అప్పటికే సమయం ఉదయం 10:13 గంటలు కావడం.. అభ్యర్థులను 10:15 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించే అవకాశం లేకపోవడంతో ఆ యువకుడు ఆందోళన చెందుతూ కనిపించాడు. దీంతో అక్కడే ఉన్న డీఎస్పీ సైదులు, సీఐ మధు తమ ఎస్కార్ట్ వాహనంలో కిషన్‌ను సకాలంలో గీతా కాలేజీకి పంపారు. ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సైరన్ మోగిస్తూ 2 కి.మీ. దూరంలోని గీత కాలేజీకి ఒకటిన్నర నిమిషంలోనే తీసుకెళ్లాడు. గ్రూప్–1 పరీక్ష రాసిన ఖైదీ ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జాదవ్ రమేశ్ అనే యువకుడు నిర్మల్ జిల్లా కోర్టు అనుమతితో ఆదివారం గ్రూప్–1 ప్రిలిమ్స్ రాశాడు. ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న కేసులో అరెస్టయిన రమేశ్ 45 రోజులుగా జిల్లా జైలులో ఖైదీగా ఉన్నాడు. ఆదిలాబాద్‌లో.. పరీక్ష రాసి బయటకు వస్తున్న ఖైదీ జాదవ్ రమేశ్‌తో పోలీసులు చిన్నారికి ఏసీపీ లాలింపు.. ఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్ రోడ్‌లోని ఏఎస్ఎం మహిళా డిగ్రీ కళాశాల కేంద్రానికి 2 నెలల పసిబిడ్డతో వచ్చి ఓ తల్లి పరీక్ష రాస్తుండగా ఆ చిన్నారి ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది. అప్పుడే పరీక్ష కేంద్రాన్ని సందర్శించేందుకు మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్‌తో కలసి వచ్చిన వరంగల్ ఏసీపీ కలకోట్ల గిరికుమార్ ఆ చిన్నారిని ఎత్తుకొని∙కాసేపు లాలించారు. ప్రశాంతంగా పరీక్ష రాయాలని... బిడ్డను క్షేమంగా చూసుకుంటామని పాప తల్లికి చెప్పారు. అక్కడే ఉన్న ఏఎస్సై స్వరూపరాణికి బిడ్డను అప్పగించారు. వరంగల్‌లో.. చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తున్న ఏసీపీ గిరికుమార్ ఆభరణాలు తొలగిస్తేనే ప్రవేశం.. అభ్యర్థులు ఆభరణాలు ధరించి రాకూడదని టీఎస్పీఎస్సీ నిబంధన విధించినా కొన్నిచోట్ల మహిళలు గాజులు, కమ్మలు, చైన్లు, కాళ్ల పట్టీలతో కేంద్రాలకు చేరుకున్నారు. ఇందుకు ఎగ్జామ్ సెంటర్ల నిర్వాహకులు అభ్యంతరం తెలపడంతో వారు ఆభరణాలను తొలగించడం కనిపించింది. కాగా, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాదె రుక్మారెడ్డి పరీక్ష కేంద్రంలో ఒంటి గంటకు ముగించాల్సిన పరీక్షకు.. పది నిమిషాలు ఆలస్యంగా పేపర్లు తీసుకున్నారని కొందరు అభ్యర్థులు ఆరోపించారు. -
గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ఆదివారం గ్రూప్–1 పరీక్ష నిర్వహించనుంది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో ఇప్పటికే 90 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మిగతా అభ్యర్థులు పరీక్ష ప్రారంభం నాటికి డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటును కమిషన్ కల్పించింది. బయోమెట్రిక్ హాజరు నేపథ్యంలో ఉదయం 8:30 గంటల నుంచే అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతిస్తామని... ఉదయం 10:15 గంటలకుమించి ఒక్క సెకన్ ఆలస్యమైనా అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించబోమని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. 3 రోజుల్లో ప్రాథమిక కీ విడుదల... పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీ చేపడుతుండటంతో టీఎస్పీఎస్సీ అత్యంత పారదర్శకంగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి పరీక్షా కేంద్రాన్ని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తోంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రశ్నపత్రం కోడింగ్‌లోనూ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఏ, బీ, సీ, డీ అక్షరాల్లో ప్రశ్నపత్రం కోడ్ ఉండగా ఇప్పుడు 6 అంకెల కోడ్‌ను ఉపయోగిస్తోంది. దీంతో అభ్యర్థులు ప్రశ్నపత్రం కోడ్‌ను నిర్దేశించిన చోట జాగ్రత్తగా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో కాపీయింగ్‌కు ఏమాత్రం అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రిలిమినరీ ‘కీ’ని వారంలో విడుదల చేయాలని అధికారులు ముందుగా భావించినప్పటికీ ఆ తర్వాత 3 రోజుల్లోనే విడుదల చేసేలా చర్యలు తీసుకుంది. ప్రాథమిక ‘కీ’విడుదల తర్వాత వాటిపై అభ్యంతరాలను స్వీకరించి తుది ‘కీ’ని విడుదల చేయనుంది. ప్రతి జిల్లాలో హెల్ప్‌లైన్... గ్రూప్–1 పరీక్షకు సంబంధించి అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ప్రతి జిల్లా కలెక్టరేట్ పరిధిలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాలు, హాల్టికెట్లలో తప్పొప్పులు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తితే సంబంధిత జిల్లా హెల్ప్‌లైన్ కేంద్రానికి ఫోన్ చేసి సంప్రదించాలని అభ్యర్థులకు సూచించింది. పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని... ఎగ్జామ్ సెంటర్లలో గోడ గడియారాలు, డిజిటల్ క్లాక్‌లు కూడా ఉండవని పేర్కొంది. ప్రతి అరగంటకోసారి బెల్ మోగించి సమయాన్ని గుర్తుచేస్తామని తెలిపింది. -
తుది తీర్పునకు లోబడే గ్రూప్–1 ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి గ్రూప్–1 అభ్యర్థులు దాఖలు చేసిన కేసులో తుది తీర్పునకు లోబడే ఫలితాలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సూచించింది. గ్రూప్–1 ప్రాథమిక పరీక్ష ఫలితాల వెల్లడికి ముందే సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ 2022, సెప్టెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 33ను విడుదల చేసిందని.. కొత్త రిజర్వేషన్ల మేరకు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. మెదక్ జిల్లా సర్ధనా హవేలీఘన్పూర్ పోచమ్మరాల్ తండాకు చెందిన జీ. స్వప్న సహా మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. పరిపాలనా విభాగం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ జీవోను వచ్చే ఆదివారం జరిగే ప్రాథమిక పరీక్షకు వర్తింపజేయాలని కోరారు. 503 పోస్టులను భర్తీ చేయడం కోసం ఈ ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. పెంచిన రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్ పాయింట్ల నిర్ణయించకుండానే గ్రూప్–1 ప్రిలిమినరీ నిర్వహిస్తున్నారని.. పాయింట్లు కేటాయిస్తే ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్ కోటా కింద దాదాపు 50 పోస్టులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రస్తుతం ప్రాథమిక పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించారు. అయితే తుది ఫలితాలు మాత్రం తీర్పునకు లోబడే ఉంటాయని పేర్కొంటూ..విచారణ వాయిదా వేశారు. -
గ్రూప్–1 పరీక్షకు ఏర్పాట్లు చేయండి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై మంగళవారం బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు సీఎస్ వివరించారు. స్ట్రాంగ్‌రూమ్‌లను గుర్తించి పోలీసు రక్షణ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పరీక్షాకేంద్రాల వద్ద తాగునీరు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లు చేయాలన్నారు. స్ట్రాంగ్‌రూమ్ ఇన్చార్జీలు, రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం సూచనలను పాటించాలని ఆదేశించారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌రూం కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రిలిమినరీ టెస్ట్ కోసం అభ్యర్థులు హాల్‌టికెట్లను టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు చివరి నిమిషంలో కాకుండా నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు హాజరయ్యే అభ్యర్థుల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఈనెల 16వ తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని టీఎస్పీఎస్సీ కల్పించగా..తొలిరోజే 1,32,406మంది అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకున్నారు.. ఈనెల 16వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1041 పరీక్షా కేంద్రాల్లో జరిగే ప్రిలిమ్స్‌కు 380202 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షను సాఫీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. టెస్ట్ బుక్‌లెట్‌లో మార్పులు...: గ్రూప్–1 పరీక్ష నిర్వహణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెస్ట్ బుక్‌లెట్‌ను కొత్తగా డిజైన్ చేసింది. ఇదివరకు టెస్ట్‌బుక్‌లెట్ సిరీస్ కోడ్ స్థానంలో ఏ,బీ,సీ,డీ ని రాయాల్సి ఉండేది. అలా కాకుండా పరీక్షను మరింత పారదర్శకతతో నిర్వహించేందుకు టెస్ట్‌బుక్‌లెట్ సిరీస్ స్థానంలో ఆరు అంకెల నంబర్‌ను ఏర్పాటు చేసింది. నిర్దేశించిన బుక్లెట్ నంబర్‌ను ఓఎంఆర్ షీట్లో పూరించాల్సి ఉంటుంది. టెస్ట్‌బుక్‌లెట్ నంబర్‌ను ఓఎంఆర్ షీట్లో నిర్దేశించిన స్థానంలో నిర్ణీత పద్ధతిలో బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో గుర్తించే విధానాన్ని వివరణాత్మకంగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
రెండ్రోజుల్లో గ్రూప్–1 హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 పరీక్షల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 16న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా పరీక్షకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లు జారీ చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఇప్పటికే హాల్‌టికెట్ల జారీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కాగా, అధికారులు వాటిని సాంకేతిక కోణంలో మరోమారు పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రెండు రోజుల్లో టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రూప్–1 కేటగిరీలో 503 కొలువులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయగా 3,80,202 మంది దరఖాస్తులు సమర్పించారు. వడపోతలో భాగంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేసేందుకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. -
Deputy Collector Datla Keerthi: సర్కారీ కొలువులు.. కీర్తికి సలాం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విద్యాభ్యాసం నుంచి ఉద్యోగ బాధ్యతల వరకూ విజయనగరంతో ఆమెకు విడదీయలేని అనుబంధం... ఇటీవల వెలువడిన గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తరాంధ్ర టాపర్‌గా నిలిచి విద్యల నగరానికి వన్నె తెచ్చారు. ఒకవైపు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూనే సబ్‌కలెక్టర్ అవ్వాలనే తన కలను సాకారం చేసుకున్నారు. విసుగు లేకుండా 11 ఏళ్ల పాటు నిర్విరామ కృషితో రాష్ట్ర సర్వీసుల్లో ఉన్నత ఉద్యోగాన్ని సాధించి తన సత్తా చాటారు. యువతకు ఆదర్శంగా నిలిచారు. మెటీరియల్ సౌలభ్యం అంతగా లేకపోయినా గ్రూప్–1 వంటి పోటీపరీక్షల్లో భావవ్యక్తీకరణకు మాతృభాష తెలుగు తనకు కలిసిసొచ్చిందని సగర్వంగా చెబుతున్నారు దాట్ల కీర్తి. ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... టీచర్ల ఫ్యామిలీ మాది... మా స్వగ్రామం అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలంలోని రాజులనగరం. మా నాన్న దాట్ల జగన్నాథరాజు తొలుత ఎస్జీటీగా తర్వాత స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి పొంది రిటైర్డ్ అయ్యారు. అమ్మ నిర్మల కూడా టీచరే. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో చోడపల్లి ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్గా పనిచేస్తున్నారు. నేను కూడా ఎమ్మెస్సీ, బీఈడీ చేసిన తర్వాత చిన్న వయసులోనే టీచర్‌ను అయ్యాను. అలా టీచర్ల ఫ్యామిలీ మాది. కానీ మా తాతగారు కోఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో గ్రామాల్లో ఆయనకు ఎంతో గౌరవం ఉండేది. అలా నాకు గ్రూప్–1 రాసి సబ్‌కలెక్టరు పోస్టు సాధించాలనే లక్ష్యం ఏర్పడింది. ప్రభుత్వ బడుల్లోనే చదువు... నాన్న చేయి పట్టుకొనే స్కూల్‌కు వెళ్లడంతో నా విద్యాభ్యాసం మొదలైంది. మా ఊరికి సమీపంలోనే ఉన్న వెంకటాపురం ఎంపీపీ పాఠశాలలో ఆయన టీచర్‌గా పనిచేసేటపుడు అక్కడే నన్నూ చదివించారు.ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ మాకవారిపాలెం జెడ్పీ హైసూ్కల్లో చది వాను. ఏడో తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చింది. తొమ్మిదో తరగతి చదవకుండానే పదో తరగతి పరీక్షలు ప్రైవేట్‌గా రాయించారు మా నాన్న. అలా 13 ఏళ్లకే 1997–98 బ్యాచ్‌లో పదో తరగతి పాస్ అయ్యాను. ఇంటర్ విద్య కోసం విజయనగరానికి... ఇంటరీ్మడియెట్ చదవడానికి తొలిసారిగా విజయనగరం వచ్చాను. శ్రీనివాస జూనియర్ కాలేజీలో బైపీసీ చదివాను. నిరీ్ణత వయసు కన్నా తక్కువ ఉండడంతో అప్పుడు ఎంసెట్ రాయడానికి నిబంధనలు అంగీకరించలేదు. బీఎస్సీ అనకాపల్లి జిల్లా చోడవరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరినా సెకండ్ ఇయర్ మళ్లీ విజయనగరం వచ్చేశాను. ఇక్కడి గాయత్రి డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఆసెట్లో 3వ ర్యాంకు రావడంతో ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బోటనీలో చేరాను. 2005లో గోల్డ్ మెడల్‌తో బయటకు వచ్చాను. అదే సంవత్సరం ఎడ్‌సెట్‌లో ర్యాంకు సాధించడం, 2005–06 బ్యాచ్‌లో బీఈడీ పూర్తి చేయడం కూడా జరిగిపోయాయి. 21 ఏళ్లకే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాను. అధికారిగా శిక్షణ కూడా విజయనగరంలోనే... బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఎనిమిది నెలల శిక్షణ కోసం 2018లో విజయనగరం జిల్లాకే వచ్చాను. తర్వాత పోస్టింగ్ కూడా ఇక్కడికే రావడం నా అదృష్టం. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా 2019 సంవత్సరంలో రెగ్యులర్ అయ్యాను. అప్పటి నుంచి విద్యార్థుల సంక్షేమంపై దృష్టి పెట్టాను. ఉన్నతమైన జీవితానికి విద్య ఒక్కటే మార్గం. ప్రభుత్వం కలి్పంచిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవాలనేది నా సూచన. నాలుగేళ్ల ఎదురుచూపు ఫలించింది... గ్రూప్–1 నోటిఫికేషన్ 2018 సంవత్సరంలో మరోసారి వెలువడింది. ప్రిలిమ్స్ తర్వాత 2020 సంవత్సరంలో మెయిన్స్ రాశాను. ఇంటర్వ్యూ తర్వాత తుది ఫలితాల్లో 325 మంది విజేతల్లో నేనూ ఉన్నాను. వాల్యూషన్ మళ్లీ చేయడంతో వారిలో నాతో పాటు 123 మందికి మాత్రమే ఇంటర్వ్యూకు అవకాశం దక్కింది. తుది ఫలితాల్లో 9వ ర్యాంకు వచ్చింది. ఉత్తరాంధ్రలోనే టాపర్‌గా నిలిచాను. సబ్‌కలెక్టర్ అవ్వాలనే నా కల నెరవేరింది. లక్ష్యంపై గురి తప్పవద్దు... గ్రామీణ నేపథ్యం, తెలుగు మాధ్యమం... ఇవేవీ గ్రూప్–1 లాంటి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించడానికి ఆటంకాలు కానేకావు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన లక్ష్యంపై గురి తప్పకుండా ప్రయత్నం కొనసాగించాలి. ఈ క్రమంలో ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చినా చేరడం మంచిది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భావవ్యక్తీకరణ ప్రధానం గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో భావవ్యక్తీకరణ చాలా ప్రధానం. సిలబస్‌ను దృష్టిలో పెట్టుకొని దినపత్రికలను చదవాలి. అంశాల వారీగా క్లిప్పింగ్స్ ఉంచుకోవాలి. అయితే పరీక్షల్లో ఆ సమాచారాన్ని యథావిధిగా దించేయకూడదు. ప్రశ్న అడిగిన తీరును బట్టి సమాచారాన్ని ప్రెజెంట్ చేస్తూ మన విశ్లేషణ కూడా జోడించాలి. ఎగ్జామినర్‌ను ఇంప్రెస్ చేసేలా భావవ్యక్తీకరణ ఉండాలి. ఇందుకు మాతృభాష తెలుగు నాకు బాగా ఉపయోగపడింది. త్వరలోనే గ్రూప్–1 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రిపేర్ అయ్యేవారికి ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్‌తో పాటు స్వీయ ఆరోగ్యాన్నీ కాపాడుకోవాలి.’’ సబ్‌కలెక్టర్ కావాలన్నదే లక్ష్యం... సబ్‌కలెక్టరు కావాలన్నదే లక్ష్యం. ముందు ఏదో ఒక ఉద్యోగం సాధించాలని డీఎస్సీకి ప్రిపేరేషన్ ప్రారంభించాను. అదే సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రదీప్‌తో వివాహం అయ్యింది. ఆయన ఐటీ రంగాన్ని వదిలేసి స్థిరాస్తి వ్యాపారంలోకి వచ్చేశారు. నేను 2009లో డీఎస్సీలో మూడో ర్యాంకుతో టీచర్ ఉద్యోగం పొందాను. అచ్యుతాపురం మండలంలోని గొర్లి ధర్మవరం యూపీ స్కూల్లో చేరడంతోనే హెడ్మాస్టర్గా పనిచేయాల్సి వచ్చింది. టీచర్‌గా కొనసాగుతూనే గ్రూప్–1 పరీక్షకు సిద్ధమయ్యాను. 2011లో తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. న్యాయవివాదాలతో ఫలితాలు వెలువడలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారం 2016లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి పోస్టుకు ఎంపికయ్యాను. -
Vizianagaram: గ్రూప్–1 ఫలితాలు.. రాణించిన రైతు బిడ్డ
గ్రూప్–1 ఫలితాల్లో విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు, మరో అధికారి ప్రతిభ చూపారు. వీరిలో ఇద్దరు ఉద్యోగాలు చేస్తూనే ఉన్నతోద్యాగాలకు సిద్ధమై విజయం సాధించగా, మరొకరు సివిల్స్ శిక్షణ తీసుకుంటూ గ్రూప్–1 ఉద్యోగానికి అర్హత సాధించారు. డిప్యూటీ కలెక్టర్‌గా కీర్తి విజయనగరం పూల్‌బాగ్: విజయనగరం జిల్లా బీసీ సంక్షేమాధికారి దాట్ల కీర్తి గ్రూప్ –1లో విజేతగా నిలిచారు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపి కయ్యారు. ఆమె రాష్ట్ర స్థాయిలో 8, ఉత్తరాంధ్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఆమె గత మూడేళ్లుగా జిల్లా బీసీ సంక్షేమాధి కారిగా పనిచేస్తున్నారు. గ్రూప్–1 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో ఆమె డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. రెండో ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆమె తల్లి దాట్ల నిర్మల విశాఖపట్నం జిల్లా చోడపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తుండగా, తండ్రి జగన్నాథ రాజు హెచ్‌సీ వెంకటాపురం మండలం జెడ్పీహెచ్ లో స్కూల్ అసిస్టెంట్(సైన్సు)గా పనిచేసి ఉద్యోగవిరమణ పొందారు. కీర్తి స్వస్థలం విశాఖజిల్లా మాకివారిపాలెం మండలంలోని రాజులనగరం. కీర్తికి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. రాణించిన రైతు బిడ్డ గుర్ల: గుర్ల మండలంలోని నాగళ్లవలసకి చెందిన అట్టాడ అప్పలనాయుడు ఓ వైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు గరివిడి ఫేకర్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కుమారుడు వెంకటరమణ మూర్తి చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ చూపడంతో ప్రోత్సహించాడు. ఇప్పుడు ఆయన గ్రూపు–1 ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన గరివిడిలోని గోదావరి స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించడంతో పుటపర్తిలోని శ్రీ సత్యసాయి విద్యాలయాల్లో ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేశారు. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ఢిల్లీలో మూడేళ్లుగా శిక్షణ తీసుకున్నారు. మొదటి ప్రయత్నం విఫలం అయిన నిరాశ చెందకుండా చదువుతున్నారు. సచివాలయ ఉద్యోగానికి ఎంపికైనా చేరలేదు. సివిల్స్‌లో రాణించి ఐఏఎస్ అవ్వాలన్నదే అంతిమ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు అప్పలనాయుడు, పద్మావతి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసిస్టెంట్ ట్రజరీ అధికారిగా సన్యాసిరావు వేపాడ: మండలంలోని బంగారయ్యపేట ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తరిణి సన్యాసిరావు గ్రూపు–1లో విజేతగా నిలిచారు. అసిస్టెంట్ ట్రజరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఆయనది ఎల్.కోట మండలం గొల్జాం స్వగ్రామం. తల్లిదండ్రులు తరిణి రామారావు, ఈశ్వరమ్మల ప్రోత్సాహంతో ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తి చేశారు. 2006లో డీఎస్సీ క్వాలిఫై అయ్యారు. 2008 ఫిబ్రవరి 28న ఎస్.కోట మండలం వెంకటరమణపేట ఎంపీయూపీఎస్‌లో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారు. అక్కడ 2009 వరకు పనిచేశారు. 2009 ఆగస్టు నుంచి 2017 జూలై వరకు ఎంపీయూపీఎస్ జాకేరులో పనిచేశారు. 2017 ఆగస్టు నుంచి నేటివరకు ఎంపీపీఎస్ బంగారయ్యపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన గ్రూపు–1లో విజయం సాధించడంతో తల్లిదండ్రులతో పాటు భార్య పద్మశ్రీ, కుమారై లిఖితరామ్, కుమారుడు భార్గవ్‌రామ్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్: షార్ట్ ఫిలిమ్స్‌లో ఆస్కార్ అవార్డే లక్ష్యం) -
తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీ ఖరారు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీని ఖరారు చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తేదీని ప్రకటించింది. అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ ఉంటుందని టీఎస్పీఎస్సీ పేర్కొంది. తెలంగాణ ఆవిర్బావం తర్వాత తొలిసారి వివిధ శాఖల్లో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంతో పోలిస్తే గ్రూప్ వన్ కోసం ఈసారి భారీగా దరఖాస్తులు అందాయి. రోజుకు సుమారు పది వేల చొప్పున దరఖాస్తులు అందగా.. గడువు పెంచిన తర్వాత చివరి నాలుగు రోజుల్లో సుమారు 30 వేల మంది దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 503 పోస్టులకు గానూ.. 3 లక్షల 80 వేల 202 మంది పోటీపడుతున్నారు. అయితే దరఖాస్తుల తేదీని పొడగించాలన్న విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకోని టీఎస్పీఎస్సీ.. పరీక్ష తేదీ విషయంలో మాత్రం అభ్యర్థుల విజ్ఞప్తులను మాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే జులై-ఆగష్టులో నిర్వహించాలనుకున్న ప్రిలిమినరీ పరీక్షను.. అక్టోబర్‌కు జరిపింది. -
గ్రూప్–1 ప్రిలిమ్స్ కటాఫ్ తీరే వేరు!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటికే నోటిఫికేషన్లో వెల్లడించింది. పరీక్షల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు కూడా మరింత సన్నద్ధతతో దీక్ష చేస్తున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికే మెయిన్ పరీక్షలకు అవకాశం ఉంటుంది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్ పరీక్షలకు ఎంపిక చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 503 గ్రూప్–1 ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 25,150 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. దీంతో ఎక్కువ మార్కులు సాధించిన వారికే మెయిన్స్‌కు అవకాశం దక్కనుండగా.. ఈ ఎంపిక విధానంలోనూ టీఎస్పీఎస్సీ మల్టీజోన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, జెండర్, ఈడబ్ల్యూఎస్, డిజేబుల్, స్పోర్ట్స్ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఒక్కో పోస్టుకు 700 మంది... ఇప్పటివరకు గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో జనరల్ మెరిట్ ప్రకారం ఎంపిక జరిగేది. దీంతో కటాఫ్ మార్కులు ఒక సంఖ్య దగ్గర ఆగిపోయేవి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో తెచ్చిన నూతన జోనల్ విధానంతో ఎంపిక విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో గ్రూప్–1 కటాఫ్ మార్కులు ఒక్కో జోన్లో, ఒక్కో కేటగిరీలో ఒక్కో రకంగా ఉండనున్నాయి. రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు ఉండగా.. ఒక్కో మల్టీజోన్‌లో కటాఫ్ మార్కులు ఒక్కోలా ఉంటాయి. అదేవిధంగా రిజర్వేషన్లు, జెండర్ ప్రకారం కటాఫ్ మార్కులు మరోవిధంగా ఉంటాయి. గ్రూప్–1 కొలువులకు ఇప్పటివరకు 3.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. మరో రెండ్రోజుల్లో దరఖాస్తులు మరిన్ని వచ్చే అవకాశముంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే ఒక్కో పోస్టుకు సగటున 700 మంది పోటీపడుతున్నారు. పోటీ ఎక్కువగా ఉండటం, కటాఫ్ నిర్ధారణలోనూ జోన్ల వారీగా వేర్వేరుగా ఉండటంతో అభ్యర్థులు మరింత కఠిన సాధన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రిలిమ్స్ మార్కులను కేవలం మెయిన్ పరీక్షల ఎంపిక వరకే పరిగణిస్తామని, తుది ర్యాంకింగ్‌లో వీటిని పరిగణించబోమని టీఎస్పీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. కటాఫ్ ఇలా... అభ్యర్థుల స్థానికత ఆధారంగా మల్టీజోన్లను కేటాయిస్తారు. ఈ క్రమంలో గ్రూప్–1 మెయిన్స్‌కు ఎంపిక రెండు మల్టీజోన్ల ఆధారంగా చేపడతారు. ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, డిజేబుల్, స్పోర్ట్స్ రిజర్వేషన్లను అమలు చేస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీంతో కటాఫ్ మార్కులు ఒక్కో జోన్లో ఒక్కో రకంగా ఉంటాయి. ఉదాహరణకు మల్టీజోన్–1లోని బీసీ–ఏ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థి మార్కులు.. మల్టీజోన్–2లో బీసీ–ఏ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థి మార్కులు ఒకేరకంగా ఉండవు. ఇదే తరహాలో మిగిలిన కేటగిరీల్లో ఒక్కో జోన్లో కటాఫ్ మార్కులు ఒక్కోవిధంగా ఉండనున్నాయి. గ్రూప్–1 ఒక్క పోస్టుకు 756 మంది పోటీ.. మొత్తం దరఖాస్తులు 3,80,202 రాష్ట్ర సివిల్ సరీ్వసుగా చెప్పుకునే గ్రూప్–1 కొలువుకు పోటీ విపరీతంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా చేపడుతున్న గ్రూప్–1 ఉద్యోగాలను దక్కించుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగానే కుస్తీ పడుతున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–1 కేటగిరీలో ఉన్న 503 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ఏప్రిల్ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జూన్ 4 నాటికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియగా 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమరి్పంచినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఇందులో పురుషులు 2,28,951, మహిళలు 1,51,192, ట్రాన్స్జెండర్లు 59 ఉన్నారు. ఇక డిజేబుల్ కేటగిరీలో 6,105, ప్రభుత్వ ఉద్యోగులు 51,553 మంది ఉన్నారు. ఈక్రమంలో ఒక్కో ఉద్యోగానికి సగటున 756 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. జూలై లేదా ఆగస్టు నెలలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు, డిసెంబర్లో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్లో తెలిపింది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన 312 గ్రూప్–1 ఉద్యోగాలకు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. -
ప్రణాళికా బద్ధంగా.. ప్రిపేర్ కావాలి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి ఉద్యోగమైన గ్రూప్–1కు సిద్ధమయ్యే అభ్యర్థులకు అన్ని రంగాల్లో రోజువారీ పరిణామాలపై సంపూర్ణ అవగాహన అవసరమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం పేర్కొన్నారు. ప్రణాళికా బద్ధంగా సిద్ధం కావాలని పత్రికలు, పుస్తకాల ద్వారా తాము తెలుసుకున్న సమాచారానికి సైద్ధాంతిక అవగాహనను జోడించి ప్రిపేర్ కావాలని సూచించారు. ఏ సబ్జెక్టులోనైనా ఇవే ప్రధానమని వివరించారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇటీవల గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలకు సిద్ధమయ్యే విషయంలో అభ్యర్థులు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి?, పరీక్షలకు ఎలా సిద్ధం కావాలన్న అంశాలపై..గతంలో గ్రూప్–1 సిలబస్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. కృష్ణా జలాల పరిరక్షణ యాత్రలో బిజీగా ఉన్నప్పటికీ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. భావాన్ని అర్ధం చేసుకుంటూ చదవాలి పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులు ప్రిపేర్ అయ్యే విధానాన్ని పక్కాగా రూపొందించుకోవాలి. ప్రిలిమినరీ పూర్తిగా ఆబ్జెక్టివ్ అయినందున సబ్జెక్టుపై లోతైన అవగాహన పెంచుకోవాలి. భావాన్ని (కాన్సెప్ట్‌ను) అర్థం చేసుకుంటూ చదవాలి. ప్రస్తుతం ఉద్యోగాలు తక్కువ, అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున పోటీ తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి. ఏ పేపరును, ఏ అంశాన్నీ విస్మరించవద్దు. మెయిన్స్ జనరల్ ఎస్సేలో గతంలో ఏ టాపిక్ అనేది చెప్పే వారుకాదు. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఏ సబ్జెక్టు చదివినా జనరల్ ఎస్సేను దృష్టిలో పెట్టుకొని మౌలిక అంశాలను అర్థం చేసుకొని సబ్జెక్టుపై సంపూర్ణ అవగాహనæ వచ్చేలా చదివితే సరిపోతుంది. జనరల్ ఇంగ్లిష్ విషయంలో భాష తెలిస్తే చాలు. అర్థం చేసుకుంటారా? పట్టు ఉందా? లేదా? అనేది మాత్రమే చూస్తారు. ఇంగ్లిష్ సాహిత్యం తెలియాల్సిన అవసరం లేదు. రాజ్యాంగ మౌలిక స్వభావం అర్ధం చేసుకోవాలి భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలతో పాటు మౌలిక స్వభావం అర్ధం చేసుకోవాలి. అది తెలియకుండా ముఖ్య అంశాలు అర్థం చేసుకోలేం. 1935లో బ్రిటిష్ పాలకులు చేసిన చట్టం నుంచే చాలా భాగాలను మన రాజ్యాంగంలోకి తీసుకున్నామనుకుంటారు. కానీ భారత రాజ్యాంగం స్వాతంత్య్ర సంగ్రామం నుంచి పుట్టింది. స్వాతంత్య్ర సంగ్రామం ప్రజాస్వామిక విలువలు, ఆకాంక్షలతో కూడింది. దాని ప్రాతిపదికనే రాజ్యాంగాన్ని రాసుకున్నాం. బ్రిటిష్ వారిది నిరంకుశ రాజ్యాంగం.. మనది మౌలికంగా ఒక ప్రజాస్వామిక వ్యవస్థను, సామాజిక న్యాయం విస్తృత పరిచే లక్ష్యాలతో రాసుకున్నది. మౌలికమైన ఈ అంశాలు అర్ధమైతే మిగతావి సులభంగా అర్ధమవుతాయి. రాజ్యాంగ ప్రవేశిక దానికి అద్దం పడుతుంది. ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమం తెలుసుకోవాలి ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో వచ్చిన మార్పులపై అవగాహన ముఖ్యం. ఫ్యూడల్ (భూస్వామ్య) వ్యవస్థ నుంచి ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ వరకు ఎలా పరిణామం చెందామన్నది తెలుసుకోవాలి. నిజాం ఏలుబడిలో దన్నుగా ఉన్నది గ్రామాల్లోని భూస్వాములే. ఆ తర్వాత ప్రజా పోరాటాలతో విముక్తి చెందడం, వేల ఎకరాలు ఉన్న పెద్ద భూస్వాములు అంతరించిపోయి చిన్న భూస్వాములు ఉనికిలోకి రావడం, 1970 తర్వాత దేశ స్థాయిలో సరళీకరణ, ఆర్థిక సంస్కరణలు, 20 సూత్రాల పథకం, భూసంస్కరణలు.. వీటన్నిటిపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత ఏ మేరకు ఆధునిక దేశంగా ఏర్పడ్డాం... అయినా ఇంకా వెనుకబడి ఉన్న రంగాలేంటి.? మార్పు జరగాలంటే చేయాల్సిందేమిటి? అనేవి ప్రధానంగా ఆలోచిస్తూ ఇండియన్ ఎకానమీని చదవాలి. పొలిటికల్ ఎకానమీని ప్రభావితం చేసే రాజకీయ అంశాలేంటి.. ఉపాధి కల్పన ఏ రంగంలో ఎక్కువుంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పురోభివృద్ధికి ఏం చేయాలన్న ప్రశ్నలను అనుబంధంగా చూసుకోవాలి. ప్రతి పేపరులో స్వాతంత్య్రానికి పూర్వం పరిస్థితులు, స్వాతంత్య్రానంతరం తలెత్తిన మార్పులు, ఈ మార్పులు దేశాన్ని ఎటు తీసుకెళుతున్నాయి.. దాని వల్ల లాభపడిన వ్యవస్థలు ఏంటి? అనేవి కీలక అంశాలుగా ఉంటాయి. ఇంటర్వ్యూలు ఉంటేనే మంచిది గ్రూప్–1కు ఇంటర్వ్యూలు ఉంటేనే బాగుంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. జిల్లాకు ఉన్నతాధికారిని ఎంపిక చేసే క్రమంలో అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం ఇంటర్వ్యూ ద్వారానే సాధ్యం అవుతుంది. పాలన నైపుణ్యాలు అక్కడే తెలుస్తాయి. సివిల్స్‌కు సైతం పోటీ పడేలా సిలబస్ టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత ఆ కమిషన్ నియమించిన సిలబస్ కమిటీ గ్రూప్–1 సిలబస్‌ను నాలుగు ప్రధాన భాగాలుగా రూపొందించింది. జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్స్ సిలబస్‌కు సారూప్యత ఉండేలా ఈ సిలబస్‌ను తయారు చేశాం. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే వారు గ్రూప్–1 రాసేలా, గ్రూప్–1కు సిద్ధమయ్యే వారు సివిల్స్‌కు సైతం పోటీపడేలా, జాతీయ స్థాయి పోకడలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సిలబస్‌ను రూపొందించాం. తెలంగాణలో విభాగాధిపతిగా, జిల్లా ఉన్నతాధికారిగా వ్యవహరించే పరిపాలన అధికారికి తెలంగాణ కోణం కచ్చితంగా తెలిసి ఉండేలా చూశాం. తెలంగాణ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, గత పరిణామాలు, తొలి, మలి ఉద్యమాలు వంటి వాటిపై అవగాహనను పరిశీలించేలా సిలబస్‌ను ఖరారు చేశాం. ప్రస్తుత పరిస్థితులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు వంటి అంశాలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మరోవైపు శాస్త్ర సాంకేతిక రంగాలు, భారతదేశ చరిత్ర, సంస్కృతి, రాజనీతి శాస్త్రం, భారత రాజ్యాంగం వంటి అంశాలను మరో విభాగంగా తీసుకొని సిలబస్‌ను రూపొందించాం. ఇంటర్ స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తిగా ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే పూర్తిగా ఆయా రంగాలపై లోతైన అవగాహన పెంచుకోవాలని ఏమీ లేదు. ఫోకస్ అంతా సైంటిఫిక్ మెథడ్ ఎలా డెవలప్ అయిందన్నదే. సైన్స్ నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? పురోభివృద్ధికి ఎలా దోహదపడుతోందన్నది చూసుకుంటే చాలు. తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా పేపరు తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా ఓ పేపరు ఉంది. నిజాం పాలన, హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం, ముల్కీ ఉద్యమం, దేశంలో విలీనం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పందాలు, వాటి అమలులో వైఫల్యాలు, 1948 తర్వాత సాయుధ పోరాటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకత, పోరాటాలు, తొలి, మలి దశ ఉద్యమాలు కీలకమైనవి. ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద మనుషుల ఒప్పందం, దాని వల్ల న్యాయం జరగకపోవడం, 1969 ఉద్యమం, మలి దశ ఉద్యమాలతో పాటు వర్తమాన సమాజాన్ని అర్థం చేసుకోవడం, దాని పూర్వ చరిత్ర తెలుసుకోవడం ముఖ్యం. 1948కి ముందు ఏముంది? ఆ తర్వాత ఎలా అభివృద్ధి చెందాం, ఇప్పుడున్న రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఏంటన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. -
గ్రూప్–1 నోటిఫికేషన్.. రేపే గుడ్‌న్యూస్..!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగ భర్తీ ప్రక్రియలో ముందడుగు పడింది. ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలను ఇప్పటికే ఒకట్రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆయా శాఖల నుంచి సవరణ ప్రతిపాదనలు కోరింది. శనివారం బోర్డు సమావేశంలో దాదాపు అన్ని శాఖల ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించగా సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే గ్రూప్–1లో ఇంటర్వ్యూలు రద్దు చేసినందున దీనికి సంబంధించిన జీవో సోమవారం ఉదయానికి వస్తే సాయంత్రానికి 503 గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావొచ్చని సమాచారం. చదవండి👉 ఇక పరీక్షలన్నీ సకాలంలోనే.. -
గుడ్‌న్యూస్: గ్రూప్ 1, గ్రూప్ 2 కు ఇంటర్వ్యూ మార్కులూ తొలగింపు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి పలికిన రాష్ట్ర ప్రభుత్వం.. పరీక్షల్లో ఆ మేర మార్కులనూ తగ్గించాలని భావిస్తోంది. ఇప్పటివరకు అన్ని పేపర్లతోపాటు ఇంటర్వ్యూ మార్కులు కలిపి ఉండే గరిష్ట మార్కులు ఉండగా.. ఇక ముందు కేవలం రాతపరీక్షల మొత్తమే గరిష్ట మార్కులు కానున్నాయి. ఈ క్రమంలో గ్రూప్–1 పరీక్ష మొత్తంగా 900 మార్కులకు, గ్రూప్–2 పరీక్ష మొత్తంగా 600 మార్కులకే ఉండనున్నాయి. ఈ మేరకు నియామక సంస్థలు పరీక్షా విధానానికి సంబంధించిన ప్రక్రియను దాదాపు కొలిక్కి తీసుకువచ్చాయి. చదవండి👉వీఆర్ఏల ఆగం బతుకులు.. కార్లు కడుగుడు.. బట్టలు ఉతుకుడు రాతపరీక్షే ఆధారం.. గ్రూప్–1, గ్రూప్–2 కొలువులకు, వైద్యారోగ్య సంస్థల్లో మెడికల్ ఆఫీసర్, ఆపైస్థాయిలో నేరుగా చేపట్టే నియామకాలకు ఇంటర్వ్యూలు, గురుకుల విద్యాసంస్థల్లో బోధన పోస్టులకు సంబంధించి డెమో రౌండ్ ఇప్పటివరకు కీలకంగా ఉండేవి. నియామకాల్లో జాప్యాన్ని నివారించడం, అవకతవకలకు అవకాశం లేకుండా చేయడం కోసం వీటిని రద్దుచేసి, రాతపరీక్షల ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష విధానంలో మార్పులపై నియామక సంస్థలు దృష్టి సారించాయి. ఇంటర్వ్యూలను రద్దు చేయడంతోపాటు వాటికి సంబంధించిన మార్కులను కూడా తొలగిస్తేనే మంచిదన్న ప్రతిపాదన చేశాయి. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. తగ్గనున్న మార్కులు ► ఇదివరకు గ్రూప్–1 పరీక్షను మొత్తంగా 1000 మార్కులకు నిర్వహించేవారు. అందులో 900 మార్కులకు వివిధ రాతపరీక్షలు, ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉండేవి. ఇక గ్రూప్–2 పరీక్షను 675 మార్కులకు నిర్వహించగా.. అందులో 75 మార్కులు ఇంటర్వ్యూలకు ఉండేవి. ఇప్పుడు ఇంటర్వ్యూల మార్కులను తొలగిస్తే.. గ్రూప్–1 పరీక్ష 900 మార్కులకు, గ్రూప్–2 పరీక్షను 600 మార్కులకే నిర్వహించే అవకాశం ఉంది. ► ప్రస్తుతం గురుకుల విద్యాసంస్థల్లో పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ నియామకాల్లో రాతపరీక్షలతోపాటు డెమో (ప్రత్యక్ష బోధన పరీక్ష) ఉంది. ప్రభుత్వం గ్రూప్స్ పరీక్షలకు ఇంటర్వ్యూలను తొలగించడంతో డెమో విధానానికి స్వస్తి పలకాలని అధికారులు భావిస్తున్నారు. ► ఇప్పటివరకు వైద్యారోగ్య విభాగంలోని కొన్నిపోస్టులకు కేవలం ఇంటర్వ్యూల ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తూ వచ్చారు. ఈసారి ఆయా పోస్టుల నియామకాలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంపై బోర్డు కసరత్తు చేస్తోంది. సిలబస్‌లో మార్పులు లేనట్టే! ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల రద్దుతో పరీక్ష విధానంలో మార్పులు అనివార్యమయ్యాయి. అయితే పరీక్షల సిలబస్‌లో మార్పులు అవసరం లేదని నియామక సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఇంటర్వ్యూలు తొలగించినందున.. ఆయా సామర్థ్యాలకు సంబంధించిన అంశాలను రాతపరీక్షలో చేర్చే ప్రతిపాదన కూడా ఉంది. చదవండి👉 ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా! -
గ్రూప్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
-
ఏపీ: గ్రూప్-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే
సాక్షి, అమరావతి: గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. ఇంటర్వ్యూను నాలుగు వారాలపాటు నిర్వహించకూడదని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్ విధానంలో వాల్యుయేషన్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా హైకోర్టు తీర్పుతో వాయిదా పడింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ పబ్లిక్ కమిషన్‌ను ఆదేశించింది. కాగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం పరీక్షలు జరగలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డిజిటల్ వాల్యూయేషన్ గురించి చివరి దశలో చెప్పారన్నారు. అయితే నిబంధనల ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు జరిగాయని, వాల్యూయేషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున వ్యాయవాది వాదనలు హైకోర్టుకు తెలిపారు. ఇక ఇరు వాదనలు విన్న హైకోర్టు మంగళవారం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా: సీఎం జగన్ -
గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
-
20 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి : ఇన్నాళ్ల నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు రాష్ట్రంలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20, 010 వేల పోస్టుల నియమకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేబినేట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపింది. త్వరలో ఎన్నికలు సమీపించనుండటంతో టీడీపీ ప్రభుత్వం యువతను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా గ్రూప్ 1, 2, 3, డీఎస్సీతో పాటు పోలీస్ శాఖల్లో పోస్టుల భర్తీకి చంద్రబాబు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం జరపనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం పోస్టుల వివరాలు... గ్రూప్-1 ఖాళీలు 150 గ్రూప్-2 ఖాళీలు 250 గ్రూప్-3 ఖాళీలు 1,670 డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఖాళీలు 9,275 పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఎల్పీఆర్బీ ఖాళీలు 3,000 వైద్య శాఖలో ఖాళీలు 1,604 ఇతర ఖాళీలు 1,636 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు 310 జూనియర్ లెక్చరర్ (ఇంటర్మీడియేట్) పోస్టులు 200 ఏపీఆర్ఈఐ సొసైటీ పోస్టులు 10 ఏపీఆర్ఈఐ సొసైటీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు 5 డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు 200 సమాచార పౌర సంబంధాల శాఖలో 21 ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపింది. ఇవికాక ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి ద్వారా డీపీఆర్వో పోస్టులు 4, ఏపీఆర్వో పోస్టులు 12, డీఈటీఈ పోస్టులు 5 పోస్టుల భర్తీకి కేబినేట్ ఆమోదం తెలిపింది. -
గ్రూప్–1కు గ్రీన్ సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో గ్రూప్–1, గ్రూప్–2 వంటి రాష్ట్ర స్థాయి, మల్టీ జోన్, జోనల్ స్థాయి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించినట్లేనని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో 135 వరకు గ్రూప్–1 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు మార్గం సుగమమైం దని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం శాఖల వారీగా భర్తీకి ఆమోదం తెలుపుతూ ఇచ్చిన పోస్టులను కొత్త జోన్లు, మల్టీ జోన్లు, స్టేట్ కేడర్ వారీగా పునర్విభజన చేసి భర్తీ చేయాల్సి ఉంటుందని టీఎస్పీఎస్సీ వర్గా లు పేర్కొంటున్నాయి. కాకపోతే ఇందుకు కాస్త సమయం పడుతుందని చెబుతున్నాయి. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పోస్టుల భర్తీ విధానంపై త్వరలోనే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వరద్దు కంటే ముందుగానే నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఆ తర్వాతే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గ్రూప్–2 నోటిఫికేషన్ కూడా! జోనల్ స్థాయి పోస్టులు కలిగిన గ్రూప్–2 నోటిఫికేషన్ కూడా జారీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి 200కు పైగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు సహా ఏసీటీవో తదితర కేటగిరీల్లో దాదాపు 500 వరకు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. గ్రూప్–2 నోటిఫికేషన్ పోస్టుల భర్తీకి ఇదివరకే జారీ చేసిన నోటిఫికేషన్.. న్యాయ వివాదాలతో పెండింగ్‌లో పడిన విషయం తెలిసిందే. అలాగే శాఖల నుంచి రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలతో కూడిన ఇండెంట్లు కూడా రావాల్సి ఉంది. దీంతో వాటి భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాలేదు. ప్రస్తుతం ఎన్నికల వేడిమీదే వీలైనన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 13 శాఖల్లో 20 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ల జారీకి కసరత్తు చేస్తోంది. గ్రూప్–1లో ఇదివరకే 127 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని భావించినా, అందులో రాష్ట్ర స్థాయి, మల్టీ జోన్, జోనల్ పోస్టులు ఉన్నందున నోటిఫికేషన్లు జారీ చేయలేదు. అవి న్యాయ వివాదాలుగా మారొద్దన్న జోనల్ వ్యవస్థపై స్పష్టత వచ్చాకే వాటిని భర్తీ చేయాలని నోటిఫికేషన్ల జారీని నిలుపుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం లభించడంతో, ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన మరో 8 పోస్టులు కలుపుకుని మొత్తం 135 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్లు జారీ అయ్యే అవకాశం ఉంది. అందులో ఇప్పటికే అన్ని రకాల క్లియరెన్స్‌లు ఉన్న పోస్టులు 76 ఉండగా, 42 డీఎస్పీ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గతంలోనే ఆమోదం తెలిపింది. గతంలో మిగిలిపోయిన గ్రూప్–1 పోస్టులు 7 ఉన్నాయి. వీటితోపాటు మరిన్ని కేటగిరీల్లో పోస్టులను కలుపుకొని మొత్తంగా 135 పోస్టులను భర్తీ చేసే అవకాశముంది. -
సర్కార్ చదువుతోనే గ్రూప్–1
పుట్టింది ఓ కుగ్రామం.. వారిది సన్నకారు వ్యవసాయ కుటుంబం.. చదివింది ప్రభుత్వ పాఠశాలల్లో.. అయినా ఎంచుకున్న లక్ష్యం మాత్రం ఉన్నతం.. చిన్నతనంలోనే అంబేడ్కర్ ప్రభావం.. అకుంఠిత దీక్ష.. గుండెల నిండా ఆత్మవిశ్వాసం.. ప్రణాళికాబద్ధంగా చదువు.. ఫలితంగా మొదట కేంద్ర ప్రభుత్వంలో ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగం.. అనంతరం గ్రూప్–1లో 15వ ర్యాంక్.. ప్రస్తుతం గూడూరు పురపాలక సంఘం కమిషనర్.. ఆయనే ఎద్దుల ఓబులేసు.. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ఆయన గురించి ‘సాక్షి’ కథనం. గూడూరు : ప్రకాశం జిల్లా పామూరు మండలం ఇనిమర్ల గ్రామానికి చెందిన ఎద్దుల నమ్మయ్య, నాంచారమ్మల కుమారుడు ఓబులేశు. చిన్ననాటి నుంచి ఓబులేశు ఎంతో క్రమశిక్షణ గల విద్యార్థిగా గ్రామంలో పేరు తెచ్చుకున్నారు. పుట్టిన గ్రామంలోనే 5వ తరగతి వరకూ చదివి, అనంతరం పామూరులో 8వ తరగతి వరకూ, కనిగిరిలో 10వ తరగతి వరకూ విద్యనభ్యశించారు. ఇంటర్మీడియట్ మార్టూరులోనూ, బీటెక్ ఈసీఈ విజయవాడలోనూ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ పూర్తి చేశారు. 2011వ సంవత్సరంలో వచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్‌కు ప్రిపేర్ అయ్యారు. 2013లో గ్రూప్–1 ఫలితాల్లో ఎంపికయ్యారు. కొన్ని కారణాలతో కొందరు కోర్టును ఆశ్రయించగా అవి రద్దయిపోయాయి. దీంతో మళ్లీ 2016లో గ్రూప్–1 పరీక్ష రాసి 15వ ర్యాంకు సాధించారు. 2017లో జరిగిన ఇంటర్వ్యూలో ఓబులేసు గ్రూప్–1 అధికారిగా ఎంపికయ్యారు. ఈ మేరకు గూడూరు పురపాలక సంఘం కమిషనర్‌గా జూన్ 4న నియమితులై బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కారు బడుల్లో చదివినవారే ఎక్కువ శాతం మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు గ్రూప్–1, గ్రూప్–2 అధికారులుగా ఉన్నారని, తమ గ్రామంలో తనే మొదటి గ్రాడ్యుయేట్‌నని తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో విద్యనందించేందుకు కృషి చేస్తాం గూడూరు పట్టణంలోని మున్సిపల్ పాఠశాలల్లో విద్యను బోధించే ఉపాధ్యాయులంతా కచ్చితంగా ప్రతిభ ఉన్నవారే ఉంటారు. ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే దిశగా కృషి చేస్తా. లక్ష్యాలను ఎంచుకుని క్రమశిక్షణతో చదివితే కచ్చితంగా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. – ఓబులేశు, గూడూరు మున్సిపల్ కమిషనర్ -
గిరిపుత్రికకు గ్రూప్–1 కిరీటం
అనంతపురం టౌన్:నాన్న కష్టం.. అమ్మ ఆరాటం.. చదువుతోనే పిల్లల భవిష్యత్ బాగుంటుందన్న తల్లిదండ్రుల ఆకాంక్ష.. ఎంత కష్టమైన కూతుర్ని ప్రభుత్వ అధికారిగా చూడాలనే వారిక కోరిక.. భర్త అందించిన ప్రోత్సహాంతో ఆమె ఉన్నత చదువులు చదివింది. పోటీ పరీక్షల్లో రాణించింది. గ్రూప్–1 పోటీ పరీక్షలో ఎస్టీ కేటగిరిలో ఏకంగా రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. అనంతపురం మండలం నరసనేయునికుంట గ్రామానికి చెందిన బొజ్జేనాయక్, బాలమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. తాము పడ్డ కష్టం తమ పిల్లలకు రాకుడదనే సంకల్పంతో పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. బొజ్జేనాయక్ తనకున్న 5 ఎకరాల పొలంతోపాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. వచ్చిన ప్రతి పైసాను పిల్లల చదువుల కోసమే ఖర్చు చేశాడు. పెద్ద కుమార్తెకు చదువు అబ్బలేదు. రెండో కుమార్తె రమాదేవిని బీఈడీ చదివించారు. కానీ ఆమెకు ప్రభుత్వ కొలువు మాత్రం రాలేదు. పెద్ద కొడుకు చంద్రానాయక్‌ను ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదివించాడు. అతనికీ ప్రభుత్వ ఉద్యోగం వరించలేదు. చిన్న కుమార్తె శాంతకుమారిని ఏలాగైన ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనే ఆశ బొజ్జేనాయక్‌లో బలంగా నాటుకుపోయింది. శాంతకుమారి చదువులు మొత్తం ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగించింది. నరసనేయునికుంట మండల పరిషత్ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివింది. కురుగుంట గురుకుల పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. 10వ తరగతిలో 74శాతం, ఇంటర్మీడియట్లో 78శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఎంసెట్‌లోనూ మంచి ర్యాంక్ సాధించి ఇంటెల్ కళాశాలలో 65శాతం మార్కులతో బీటెక్ పూర్తి చేసింది. అనంతరం పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. రెండేళ్లపాటు హైదరాబాద్‌లో శిక్షణ పొందింది. 2011లో గ్రూప్–1 పరీక్ష రాసింది. అయితే ప్రభుత్వం ఫలితాలను వెల్లడించలేదు. దీంతో తల్లిదండ్రులు కళ్యాణదుర్గం మండలం కాపర్లపల్లి గ్రామానికి చెందిన రామూర్తి నాయక్‌తో శాంతకమారికి వివాహం జరిపించారు. గ్రూప్–1 ఫలితాలు వెల్లడికాలేదని నిరాశ చెందొద్దంటూ భర్త రామూర్తినాయక్ ప్రోత్సహం అందించాడు. బీటెక్ అర్హతతో విజయనగరంలోని పరిశ్రమల శాఖలో ఇండ్రస్టియల్ ప్రమోషనల్ ఆఫీసర్, మరో బ్యాంక్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. ఆ రెండు కొలువులూ ఆమెను వరించాయి. దీంతో పరిశ్రమల శాఖలో ప్రమోషనల్ అధికారి ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం అక్కడే విధులు నిర్వహిస్తోంది. తాజాగా ప్రభుత్వం 2016 గ్రూప్–1 ఫలితాలతోపాటు పెండింగ్‌లో ఉన్న 2011 గ్రూప్–1 ఫలితాలనూ విడుదల చేసింది. 2011 గ్రూప్–1 ఫలితాల్లో ఎస్టీ కోటాలో సుగాలి శాంతకుమారి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్, జనరల్ కోటాలో 83వ ర్యాంకు సాధించి ఆర్టీఓ ఉద్యోగం కైవసం చేసుకుంది. ప్రణాళికాబద్ధంగా చదవడంతోనే.. ప్రణాళికాబద్ధంగా చదవడంతోనే విజయం సాధ్యమైంది. గ్రూప్–1 పరీక్షకు మొదటి సారే ప్రయత్నించినా విజయం సాధించగలిగాను. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో ఏలాగైనా కొలువు సాధించాలనే తపనతో అభ్యర్థులు చదవాలి. అప్పుడే విజయం సాధించగలం. మంచి అధికారిగా ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తా. – శాంతకుమారి -
తప్పు మీది.. కాదు మీదే...
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పోస్టుల భర్తీలో భాగంగా పోస్టింగుల్లో దొర్లిన పొరపాటు సర్కారుకు తలనొప్పిగా మారింది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని పోస్టింగులను ఖరారు చేయాల్సి ఉండగా, అలా చేయకుండానే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఇచ్చిన తప్పుడు డేటా వల్ల పోస్టింగులే మారిపోయాయి. దీంతో టాప్ ర్యాంకులు సాధించిన వారికి ప్రాధాన్యం లేని పోస్టులు లభించడం గందరగోళంగా మారిం ది. తమ ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోలేదం టూ అభ్యర్థులు చేసిన ఫిర్యాదుతో మళ్లీ పరిశీలన జరపగా పోస్టింగుల్లో పొరపాటు దొర్లినట్లు టీఎస్పీఎస్సీ గుర్తించింది. అయితే తప్పు సీజీజీలోనే జరిగిందని టీఎస్పీఎస్సీ చెబుతుండగా.. సమాచారాన్ని సరి చూసుకో వాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ అధికారులదే నని సీజీజీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాము డేటా ప్రాసెసింగ్ ఏజెన్సీ మాత్రమేనని, దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యత టీఎస్పీఎస్సీ అధికారులదేనని చెబుతున్నాయి. ఈ నేప థ్యంలో మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ మంగళ వారం టీఎస్పీఎస్సీ, సీజీజీ అధికారులతో భేటీ అయి విచారణ జరిపినట్లు తెలిసింది. అందరి ఆప్షన్లు పరిగణనలోకి తీసుకోలేదా? మెరిట్, రోస్టర్, రిజర్వేషన్, అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా పోస్టుల కేటాయింపునకు సంబంధించిన డేటా ప్రాసెస్ చేసే సమయంలో అందరి ఆప్షన్లను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అనేది తేలాల్సి ఉందని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పేర్కొం టున్నారు. మొత్తానికి అప్షన్లను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టింగులు ఇచ్చినట్లు గుర్తిం చిన టీఎస్పీఎస్సీ వాటిని రద్దు చేసి, అభ్య ర్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం తాజా కేటా యింపులపై దృష్టి సారించింది. బుధవారం తాజా పోస్టింగులు ఇచ్చే అవకాశం ఉంది. వరుస తప్పిదాల సీజీజీ మొన్నటికి మొన్న డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో భాగంగా తప్పుడు కేటాయిం పులు జరిపి విద్యార్థులను సీజీజీ ఇబ్బం దుల్లో పడేసింది. తాజాగా గ్రూప్–1 పోస్టింగులకు సంబంధించిన డేటా ప్రాసెస్ విషయంలోనూ పొరపాట్లు దొర్లడంతో పోస్టింగులు మారి పోవడం చర్చనీయాం శమైంది. గతంలో సీజీజీ పనితీరు మార్చుకోవాలని ప్రభుత్వం ఎన్నిసార్లు స్పష్టం చేసినా తీరు మారకపోవడం సమస్యలకు కారణమవుతోంది. మరోవైపు డేటా ప్రాసెస్ కోసం తమకు ప్రత్యేక అవకాశం కల్పించాలని, డేటా ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుంటామని టీఎస్పీఎస్సీ ప్రభుత్వాన్ని గతంలో కోరింది. తాజా సమస్యల నేపథ్యంలో డేటా ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు తెలిసింది. -
గ్రూప్–1 ఎంపిక జాబితా ఉపసంహరణ
-
గ్రూప్–1 ఎంపిక జాబితా ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్ : గ్రూప్–1 (2011) ఎంపిక జాబితాను టీఎస్పీఎస్సీ ఉపసంహరించింది. శనివారం ప్రకటించిన పోస్టింగుల్లో తప్పిదాలున్నట్లు తెలియడంతో సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పోస్టులకు అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవడంలో సెంటర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) పొరపాటు చేయడంతో పోస్టింగులు మారిపోయాయి. టాప్ ర్యాంకర్లకు ప్రాధాన్యంలేనివి.. దిగువన ఉన్న వారికి ప్రాధాన్యమున్న పోస్టులు లభించాయి. దీంతో తామిచ్చిన ఆప్షన్లకు, వచ్చిన పోస్టుకు సంబంధం లేకుండా ఉందని..టాప్ ర్యాంకు సాధించినా ప్రాధాన్యంలేని పోస్టు కేటాయించారని ఆప్షన్ల ఫారాలు టీఎస్పీఎస్సీ అధికారులకు చూపించి అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన టీఎస్పీఎస్సీ.. సీజీజీ అధికారులతో అత్యవసరంగా సమావేశమైంది. సీజీజీ జరిపిన కేటాయింపులు, అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు పరిశీలించి పొరపాట్లు దొర్లినట్లు గుర్తించింది. విషయాన్ని సీఎం కేసీఆర్, సీఎస్ ఎస్పీ సింగ్‌కు టీఎస్పీఎస్సీ తెలుపగా.. అభ్యర్థుల ర్యాంకులు, వారి ఆప్షన్లను లోతుగా పరిశీలించాలని, మాన్యువల్‌గా చూసి మళ్లీ పోస్టింగులు ఖరారు చేయాలని సూచించారు. దీంతో శనివారం వెల్లడించిన ఫలితాలను టీఎస్పీఎస్సీ నిలిపేసింది. ర్యాంకుల ప్రకారం 121 మందికి కేటాయించిన పోస్టింగులు, ఆప్షన్లు, రోస్టర్, రిజర్వేషన్లను మరోసారి సమీక్షించి ఒకట్రెండు రోజుల్లో మళ్లీ ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించింది. కాగా, ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ పొరపాటు ఏమీ లేదని, సీజీజీలోనే పొరపాటు దొర్లినట్లు ప్రభుత్వం పేర్కొంది. తప్పిదాలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. టీఎస్పీఎస్సీ ప్రకటనలోని అంశాలివీ.. అభ్యర్థులు ఆన్లైన్లో ఇచ్చిన వెబ్ ఆప్షన్లు, వారికి సంబంధించి సీజీజీ ఇచ్చిన సమాచారం ప్రకారం పోస్టులు కేటాయించాం. అయితే తామిచ్చిన ఆప్షన్ల ప్రకారం పోస్టింగ్‌లు రాలేదని సోమవారం ఇద్దరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్రనిమ్జే, డైరెక్టర్ విజయ్‌కరణ్‌రెడ్డితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వివరణ కోరాం. తామిచ్చిన సమాచారాన్ని (డాటా) మరోసారి పరీశిలించిన సీజీజీ .. పోస్టుల కోసం అభ్యర్థులు ఇచ్చిన వెబ్ ఆప్షన్ల ప్రాధాన్యాల్లో పొరపాట్లు దొర్లినట్లు పేర్కొంది. మొత్తం సమాచారాన్ని మరోసారి పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో 28న ఇచ్చిన ఎంపిక జాబితాను ఉపసంహరిస్తున్నాం. కొత్త జాబితాను తరువాత ప్రకటిస్తాం. వారంలో మార్కుల వివరాలు అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఇంటర్వ్యూకు హాజరైన వారి మార్కుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. తుది ఎంపిక జాబితా ప్రకటించాక వారం రోజుల్లో మార్కుల జాబితా ప్రకటిస్తామని పేర్కొంది. -
121 మందికి గ్రూపు–1 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: అనేక వివాదాలతో ఆలస్యమైన 2011 గ్రూపు–1 కథ ఎట్టకేలకు ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూలను నిర్వహించిన టీఎస్పీఎస్సీ శనివారం ఫలితాలను విడుదల చేసింది. 121 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. మొత్తంగా 127 పోస్టులు ఉండగా, ఆరు పోస్టులకు దివ్యాంగ అభ్యర్థులు అందుబాటులో లేరు. దీంతో 121 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్ వెల్లడించారు. 2011లో నోటిఫికేషన్ జారీ చేసిన గ్రూపు–1 ప్రిలిమ్స్ రాత పరీక్ష కీలలో తప్పుల కారణంగా అభ్యర్థులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి ఏపీపీఎస్సీ కేసు కోర్టులో ఉండగానే మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. దీనిపైనా అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ మెయిన్ పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్షలను నిర్వహించి ఇంటర్వ్యూలు చేయాలని స్పష్టం చేసింది. ఈలోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రానికి వచ్చిన 127 పోస్టులకు టీఎస్పీఎస్సీ 2016 సెప్టెంబర్ 14 నుంచి 24 వరకు అర్హులైన 8,760 మందికి మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. అందులో అర్హత సాధించిన వారికి ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 10 వరకు ఇంటర్వ్యూలను నిర్వహించింది. తాజాగా ఫలితాలను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్ల వివరాలను తమ వెబ్సైట్లో పొందుపరిచామని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ అభినందనలు తెలిపారు. -
సజావుగా గ్రూప్ - 1 మెయిన్స్
- అభ్యర్థుల హాజరు 64 శాతం - 668 అభ్యర్థులకుగానూ 441 మంది హాజరు - 247 మంది గైర్హాజరు అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్ష రెండో రోజు శనివారం సజావుగా సాగింది. అభ్యర్థులు 64 శాతం హాజరయ్యారు. స్థానిక ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల, ఎస్బీఎన్ జూనియర్ కళాశాలలో పేపర్ - 1 పరీక్షకు 668 అభ్యర్థులకు గానూ 441 మంది హాజరయ్యారు. 247 మంది గైర్హాజరయ్యారు. ఏపీపీఎస్సీ అధికారులు బీ.సీహెచ్.ఎన్.కుమార్రాజ్, వసంతకుమార్, సురేశ్‌బాబు పర్యవేక్షించారు. లైజన్ అధికారిగా సురేశ్‌బాబు, అసిస్టెంట్ లైజన్ అధికారులుగా జయరాముడు, నాగభూషణం వ్యవహరించారు. కేంద్రాల వద్ద పోలీసు భద్రత కల్పించారు. ప్రవేశద్వారం వద్ద అభ్యర్థులను తనిఖీ చేసి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు లేవని నిర్ధారించుకున్న తర్వాత కేంద్రంలోకి అనుమతించారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించారు. సోమవారం పేపర్ - 2 ఉంటుందని అధికారులు తెలిపారు. -
పరీక్ష ప్రశాతం
ప్రిలిమ్స్‌కు 60 శాతం హాజరు - 9,346 మందికి 5,612 మంది హాజరు - ఉస్మానియా కాలేజీ కేంద్రంలో తనిఖీ చేసిన కలెక్టర్ - ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన గ్రూపు-1 ప్రిలిమినరి పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్న నిబంధన కారణంగా అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. 9,346 మంది దరఖాస్తు చేసుకోగా 5,612 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 3,734 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. 60.04 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన 20 కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. ఉస్మానియా కళాశాల కేంద్రంగా జరిగిన పరీక్షను కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తనిఖీ చేశారు. కర్నూలు, కల్లూరు, నందికొట్కూరు, డోన్, పగిడ్యాల తహసీల్దార్లు లైజన్ ఆఫీసర్లుగా వ్యవహరించారు. 20 సెంటర్లకు 20 మంది డిప్యూటీ తహసీల్దార్లు సిట్టింగ్ స్క్వాడ్‌గా పరీక్షను పర్యవేక్షించారు. ఓఎంఆర్ షీట్లలో అభ్యర్థుల వివరాలు... గ్రూపు-1 పరీక్షకు కూడా అభ్యర్థుల పూర్తి వివరాలతో ఓఎంఆర్ షీట్లను ముద్రించారు. అయితే ఓఎంఆర్ షీట్‌లోని వివరాలు, హాల్ టికెట్‌లోని వివరాలు సరిపోకపోవడంతో ఇన్విజిలేటర్లు అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి రెండు మూడు సెంటర్లలో కనిపించింది. కొన్ని సెంటర్లలో ఇంటి పేర్లలోను తేడాలు వచ్చాయి. అయితే ఏపీపీఎస్సీ అధికారుల సూచనల మేరకు అభ్యర్థుల నుంచి అండర్ టేకింగ్ తీసుకొని పరీక్షకు అనుమతించారు. వికలాంగులకు కింది గదుల్లోని సీట్లు కేటాయించాల్సి ఉండగా రెండు, మూడు అంతస్తుల్లో అలాట్ చేయడంతో వారు ఇబ్బంది పడ్డారు. ఇద్దరు ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు కర్నూలులో జరిగిన పరీక్షను పర్యవేక్షించారు. -
20న తిరుపతిలో స్క్రీనింగ్ టెస్ట్
అనంతపురం ఎడ్యుకేషన్ : గ్రూప్–1 (ప్రిలిమ్స్), గ్రూప్–2 నియామకపు పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు తిరుపతి బాలాజీనగర్‌లోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రోశన్న ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరుకావాలని ఆయన కోరారు. -
30న గ్రూప్స్ పూర్తి స్థాయి సిలబస్ ప్రకటన
హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-3, గ్రూపు-4 కేటగిరీలకు చెందిన పోటీ పరీక్షలతోపాటు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పూర్తి స్థాయి సిలబస్‌ను టీఎస్పీఎస్సీ ఈనెల 30 న ప్రకటించనుంది. ఆ సిలబస్‌ను వీలైతే వెంటనే కమిషన్ వెబ్సైట్లో అందుబాటులోకి తేనుంది. లేదంటే 31వ తేదీన వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడుతోంది. ఆదివారంనాడు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పూర్తి స్థాయి సిలబస్‌ను స్వయంగా ప్రకటించనున్నారు. ప్రధాన పోటీ పరీక్షలకు సంబంధించిన పూర్తి స్థాయి సిలబస్‌ను నోటిఫికేషన్లతో కాకుండా ముందుగానే ప్రకటించాలని, ఆయా పరీక్షలకు కొత్త సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో సర్వీసు కమిషన్ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా గ్రూపు-1 మెయిన్స్‌లో తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలు జోడించారు. ప్రత్యేక రాష్ట్రం అయినందున అన్ని పోటీ పరీక్షల్లోనూ పరీక్షల విధానం, సిలబస్‌లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంపైనా గ్రూపు-1, గ్రూపు-2లో ప్రత్యేకంగా పేపర్లను పెట్టారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు సిద్ధం కావాల్సిన కొత్త సిలబస్‌కు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను సర్వీసు కమిషన్ ప్రకటించేందుకు చర్యలు చేపట్టింది. అక్టోబరులో గ్రూపు-2 నోటిఫికేషన్, డిసెంబరులో గ్రూపు-1 నోటిఫికేషన్లను జారీ చేయాలని ఇదివరకే నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇపుడు పూర్తి స్థాయి సిలబస్‌ను ప్రకటిస్తే అభ్యర్థులు ఆయా పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే సమయం ఉంటుందన్న భావనతో ఈ చర్యలు చేపట్టింది. -
‘సత్య’వ్రతుడు
నిరాడంబరుడు, సేవాతత్పరుడు పోటీ పరీక్షల్లో హ్యాట్రిక్ టాపర్ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుమార్ ప్రస్థానం ఏ రంగంలోనైనా రాణించేవారు ఎందరో ఉంటారు. బహు రంగాల్లో రాణించే వారు కొందరే ఉంటారు. వృత్తి, ప్రవృత్తిలోనే కాదు.. నీతి, నిజాయతీ, దయాగుణంతో నడిచే వారు అరుదుగా ఉంటారు. అవన్నీ కలగలిసిన ఒకాయన నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. కోచింగ్ తీసుకోకుండా ఏకంగా మూడు పోటీ పరీక్షల్లో స్టేట్ టాపర్‌గా నిలిచారు. గ్రూప్-1 ఆఫీసర్ హోదాలో ఓ శిథిల క్వార్టరులో ఉంటున్నారు. ఆయన మిమిక్రీ, వెంట్రిలాక్విజం ఆర్టిస్ట్ కూడా. విధి నిర్వహణలోనూ పలు అవార్డులందుకుంటున్నారు. నిస్వార్థం, నిరాడంబరత, ఆదర్శం మేళవించిన ఆ అధికారి పేరు చెన్నారెడ్డి వెంకట సత్యనారాయణ కుమార్. విశాఖ జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డెరైక్టర్! ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ కథనం చదవండి... విశాఖపట్నం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కుమార్‌కు చిన్నప్పట్నుంచి చదువుతో పాటు మిమిక్రీ అంటే పిచ్చి. రేడియో, టీవీల్లో వచ్చే నేరెళ్ల వేణుమాధవ్ వంటి ప్రముఖుల మిమిక్రీ షోలు చూసి స్వతహాగా అనుకరించడం నేర్చుకున్నారు. మిమిక్రీపై ఆసక్తి చూపితే కెరీర్ పాడవుతుందని, చదువు ముఖ్యమని తల్లి భుజంగవేణి కుమారుడికి హితబోధ చేసేది. అమ్మ చెప్పిన మాటలను ఒంట బట్టించుకుని చదువులో రాణిస్తూనే, తనకిష్టమైన మిమిక్రీ, వెంట్రిలాక్విజంపై ఆసక్తి పెంచుకున్నారు. 18 ఏళ్ల వయసులో ఇచ్చిన తొలి షోను అంతా మెచ్చుకోవడంతో దూసుకెళ్లారు. జెమినీ, దూరదర్శన్, ఆకాశవాణితో పాటు పలు సంస్థల తరఫున ప్రదర్శనలిచ్చి జాతీయ అవార్డులు, సన్మానాలు పొందారు. ఉద్యోగ ప్రస్థానం.. కుమార్ ఉద్యోగ ప్రస్థానంలోనూ ఎంతో ప్రత్యేకత ఉంది. విశాఖలో పాలిటెక్నిక్, విజయవాడలో బీటెక్ (సివిల్) చదివారు. అనంతరం తొలిసారి జేఈ ఉద్యోగానికి ఆర్ఆర్బీ (సికింద్రాబాద్) పరీక్ష రాసి 2002లో జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఆ ఉద్యోగంలో ఉంటూ 2005లో సెక్షన్ ఇంజినీర్ పోస్టుకి ఆర్ఆర్బీ (కోల్‌కతా) ఎగ్జామ్ రాసి దేశంలోనే మరోసారి టాపర్‌గా నిలిచారు. ఆ పోస్టులో ఉంటూనే ఏపీపీఎస్సీ 2007లో వెలువరించిన గజిటెడ్ ఎగ్జామ్‌లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంకు పొందారు. సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డెరైక్టర్ (గ్రూప్-1 కేడర్)గా శ్రీకాకుళం జిల్లాలో నియమితులయ్యారు. అనంతరం తూర్పుగోదావరి బదిలీ అయి, రెండున్నరేళ్లుగా విశాఖ జిల్లాలో ఏడీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తనకిష్టమైన మిమిక్రీ, వెంట్రిలాక్విజం షోలివ్వక పోయినా ఉన్నతాధికారుల కోరికపై అప్పుడప్పుడూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. పురస్కారాలివీ.. కుమార్ వృత్తి, ప్రవత్తిలో పలు అవార్డులందుకున్నారు. నేషనల్ సర్వే డే రాష్ట్ర అవార్డు, బెస్ట్ సిటిజన్ జాతీయ, రాష్ట్ర అవార్డులు, ఆంధ్రరత్న రాష్ట్ర అవార్డు, లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు, విశాఖ మదర్ థెరీసా సంస్థ ఆణిముత్యం, మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ జాతీయ అవార్డ, ఒంగోలు నేషనల్ ఆర్ట్స్ అకాడమీ రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారాలు, అర్పిత సంస్థ ఆంధ్రరత్న వంటి 15 అవార్డులు, ఎన్నో సత్కారాలు అందుకున్నారు. నిరాడంబరత.. విధి నిర్వహణలో కుమార్ సమర్థవంతుడన్న పేరుంది. సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగం ఎంతో కీలకమైనది. శ్రీకాకుళం జిల్లాలో ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం తూర్పు గోదావరికి బదిలీ చేసింది. అక్కడ ల్యాండ్ రికార్డ్స్ నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపినందుకు స్టేట్ అవార్డు ఇచ్చింది. అనంతరం విశాఖ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇక్కడ ప్రభుత్వ భూముల గుర్తింపు, కంచె వేయించి పరిరక్షణ పనులు చేపట్టారు. చిన్నపాటి ప్రభుత్యోద్యోగులే బహుళ అంతస్తుల భవనాల్లో ఉండే ఈ రోజుల్లో నిరాడంబరత కోరుకునే కుమార్ ఓ శిథిలమైన సాదాసీదా ఆర్ అండ్ బీ క్వార్టరులో ఉంటున్నారు. ఆధ్యాత్మిక చింతన ఉన్న కుమార్ పురాణాలు, ఇతిహాసాలను బాగా ఔపోసన పట్టారు. తనను అవే మార్చాయంటారాయన. తన పుట్టినరోజును అనాథలు, వృద్ధుల ఆశ్రమాల్లో జరుపుకుంటారు. 30 మంది పేద పిల్లలకు కంప్యూటర్ శిక్షణ ఇప్పిస్తున్నారు. ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తుంటారు. నా ఆస్తులు ట్రస్టుకే.. నేను సర్కారు బడిలోనే చదివాను. ఒక్కరోజూ కోచింగ్ గడప ఎక్కలేదు. కేవలం మార్కెట్లో దొరికే పోటీ పరీక్షల పుస్తకాలతో కుస్తీపట్టే స్టేట్ టాపర్ ర్యాంకులు సాధించాను. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి సూచనలు, సలహాలు ఇస్తున్నాను. నాకొచ్చే జీతంలో ఎలాంటి సేవింగ్స్ చేయడం లేదు. చట్టబద్ధంగా ట్యాక్స్ చెల్లిస్తాను. కర్మయోగాన్ని నమ్ముతాను. నా తదనంతరం ఆస్తిపాస్తులు మదర్ థెరిసా ట్రస్టుకివ్వాలని నిర్ణయించుకున్నాను. నా భార్య కడప జిల్లా రాజంపేటలో స్టేట్ బ్యాంకు మేనేజరుగా పనిచేస్తున్నారు. ఆమె కూడా నా నిర్ణయాలకు సహకరిస్తున్నారు. -సీహెచ్వీఎస్ఎన్ కుమార్, ఎ.డి. -
‘సమస్య’ తీరుతోంది!
గ్రూప్1లో ‘డేటా ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’కు మంగళం సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2 సిలబస్‌లో మార్పులు రాబోతున్నాయి. పరీక్ష విధానంలో పెద్దగా మార్పులు చేయకపోయినా.. సిలబస్‌లో మాత్రం మార్పులు తీసుకురావాలని సమీక్ష కమిటీ నిర్ణయించింది. ముఖ్యంగా చాలా మంది అభ్యర్థులకు ‘సమస్య’గా మారిన ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ అంశానికి ప్రాధాన్యత తగ్గించాలని భావిస్తోంది. గ్రూప్-1 ఐదో పేపర్‌గా ఉన్న ఈ అంశం స్థానంలో ‘సైన్స్ అండ్ టెక్నాలజీ’ని ప్రవేశపెట్టాలని... ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ను 50 మార్కులకు కుదించాలని యోచిస్తోంది. దీనిపై 5న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ప్రధానంగా గ్రూప్-1 మెయిన్స్ నాలుగో, ఐదో పేపర్లతో పాటు గ్రూప్-2లో పేపర్-2 సెక్షన్ 1లో, పేపర్-3 సెక్షన్-2లో మార్పులను తీసుకురావాలని భావిస్తోంది. గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బీగా మార్పుచేస్తూ గతంలో ఉన్న ఉత్తర్వులను యథాతథంగా అమలు చేస్తేనే బాగుంటుందని కమిటీ అభిప్రాయపడుతోంది. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేయనుంది. ఈ పరీక్షల్లో మార్పులకు సంబంధించిన సిఫారసుల నివేదికను పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిశీలించిన అనంతరం ప్రభుత్వ ఆమోదం లభించాక అమల్లోకి వస్తాయి. చరిత్ర, రాష్ట్ర వివరాలు:గ్రూప్-2 రెండో పేపర్లోని సెక్షన్-1లో ఉన్న ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర స్థానంలో తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర సిలబస్‌ను ప్రవేశపెట్టాలని కమిటీ నిర్ణయించింది. ఇందులో శాతవాహనులు, కాకతీయులు, నిజాంల పాలన, ఆది హిందూ ఉద్యమం, నిజాం రాష్ట్ర జన సంఘం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల త్యాగాలు, తెలంగాణ భాష, సాంస్కృతిక వికాసం తదితర అంశాలను చేర్చబోతోంది. అలాగే పేపర్-3లో ఏపీ గ్రామీణాభివృద్ధి-సవాళ్లు స్థానంలో తెలంగాణ గ్రామీణాభివృద్ధి-సవాళ్లు అంశాన్ని చేర్చేందుకు కమిటీ సిద్ధమవుతోంది. ఇందులో వ్యవసాయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ప్రణాళిక, వ్యవసాయం, నీటి పారుదల రంగం, ఆదాయ స్థితిగతులు, రవాణా, పర్యాటక రంగాల స్థితిగతులు తదితర అంశాలు ఉంటాయి. ప్రధాన మార్పులు వీటిలోనే.. గ్రూప్-1లో ఒకటో పేపర్‌గా ఉన్న ‘జనరల్ ఎస్సే’లో తెలంగాణకు సంబంధించిన అంశాలతో సిలబస్‌ను మార్చుతారు. రెండో పేపర్లోని ‘ఆంధ్రప్రదేశ్‌లో వివిధ సాంస్కృతిక సామాజిక ఉద్యమాలు, సామాజిక చరిత్ర’ స్థానంలో ‘తెలంగాణలో వివిధ సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలు, సామాజిక చరిత్ర, తెలంగాణ చరిత్ర, వారసత్వం, భౌగోళిక స్థితిగతు’లను చేర్చనుంది. మూడో పేపర్లోని ‘ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్రం తరువాత సామాజిక మార్పులు, భూ సంస్కరణలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు బలాలు-బలహీనతలు’ స్థానంలో ‘తెలంగాణ రాష్ట్రంలో సామాజిక పరిస్థితులు, భూ సంస్కరణలపై సిలబస్’ను పొందుపరుస్తారు. ఇండియన్ పాలిటీ, సమాజం, పాలన తదితర అంశాలను కూడా దీనిలోనే చేర్చనుంది. నాలుగో పేపర్లో ఇప్పటి వరకు ఉన్న ‘భారతదేశ అభివృద్ధి సైన్స్, టెక్నాలజీ పాత్ర దాని ప్రభావం, లైఫ్ సెన్సైస్‌లో ఆధునిక పోకడలపై సాధారణ అవగాహన, పర్యావరణ సమస్యలు, అభివృద్ధి’ తదితర అంశాల్లోని ప్రధాన అంశాలను ఐదో పేపర్లోకి మార్చనుంది. నాలుగో పేపర్ స్వరూపాన్ని పూర్తిగా మార్చనుంది. ఇందులో భారతదేశ, తెలంగాణ ఆర్థిక అభివృద్ధి అంశాలను చేర్చనుంది. గత 15 ఏళ్లలో ఐదారు దఫాలుగా నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్‌లో చాలా మంది అభ్యర్థులు మొదటి నాలుగు పేపర్లలో మంచి మార్కులు సాధించినా... ఐదో పేపర్ అయిన ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’లో వెనుకబడి... ఇంటర్వ్యూకు వెళ్లలేకపోతున్నారని సమీక్ష కమిటీ పరిశీలనలో తేలింది. దీంతో ఐదో పేపర్లో ప్రస్తుతం ఉన్న ‘డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ స్థానంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్‌ను ప్రవేశపెట్టబోతోంది. లైఫ్ సెన్సైస్‌లో ఆధునిక పోకడలు తదితర అంశాలు ఉండనున్నాయి. అయితే ఈ పేపర్లోని 150 మార్కుల్లో 100 మార్కులను వీటికి కేటాయించి... మిగతా 50 మార్కులను ‘డాటాఇంటర్ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్’ అంశాలకు కేటాయించే లా సిఫారసులను కమిటీ సిద్ధం చేసినట్లు తెలిసింది. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: గ్రూప్ 1,2, సివిల్స్
గ్రూప్ 1,2, సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో ఎన్నికల సంస్కరణల గురించిన ప్రశ్నలు వస్తున్నాయా? ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది? - ఎస్.శ్రీకాంత్, ఖైరతాబాద్ ‘భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు’ అనే అంశం ప్రతి పోటీ పరీక్షలోనూ కీలకమే. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ముఖ్యంగా సివిల్స్ అభ్యర్థులు భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ రూపకల్పన, దాని విధులు, ఎన్నికల ప్రక్రియ, ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు చేపట్టిన సంస్కరణలు, చేసిన రాజ్యాంగ సవరణలు లాంటి అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు ఎన్నికల ప్రధాన అధికారికి సంబంధించిన కింది ప్రశ్నను పరిశీలించండి. ప్రశ్న: ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించేది?(సివిల్స్-1994) 1. రాష్ట్రపతి మాత్రమే 2. భారత ప్రధాన న్యాయమూర్తి 3. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధంగా 4. పదవీకాలం ముగియక ముందే తొలగించే అవకాశం లేదు సమాధానం: 3 వివరణ: 324వ అధికరణ ప్రకారం భారత రాష్ర్టపతి నియమించే ఎన్నికల ప్రధాన అధికారిని తొలగించాలంటే పార్లమెంట్లో 2/3వ వంతు మెజార్టీతో తీర్మానం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇతర కమిషనర్లను తొలగించే సందర్భంలో ప్రధాన కమిషనర్‌ను కొలీజియంగా సంప్రదించిన కేంద్ర క్యాబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు. అదే విధంగా పార్లమెంట్ సభ్యుల అనర్హతకు సంబంధించిన కింది ప్రశ్నను పరిశీలించండి. ప్రశ్న: పార్లమెంట్ సభ్యుల అనర్హతను నిర్ణయించేది?(సివిల్స్ - 1979) 1. ఎన్నికల కమిషనర్ 2.భారత పార్లమెంట్ 3. రాష్ర్టపతి 4. సుప్రీంకోర్టు సమాధానం: 3 రాజ్యాంగంలోని 103వ అధికరణ ప్రకారం పార్లమెంట్ సభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం కేవలం రాష్ట్రపతికే ఉంటుంది. ఉదాహరణకు రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న జయాబచ్చన్‌ను అప్పటి రాష్ట్రపతి ఎన్నికల కమిషన్‌ను సంప్రదించి అనర్హురాలిగా ప్రకటించారు. అందుకు కారణం... ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉండడంతో పాటు ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగారు. అందుకుగాను ఆమె పదివేల రూపాయల గౌరవ వేతనంతో పాటు ఆ సంస్థ లక్నోలో కల్పించిన ఉచిత నివాస భవనాన్ని కూడా ఉపయోగించుకున్నారు. ఇలాంటి సందర్భాల్లో భారత ఎన్నికల చరిత్రలో ఇంకేమైనా ఉన్నాయో పరిశీలించి ఆయా సంఘటనలన్నింటినీ క్రోడీకరించుకోవాలి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్నీ భిన్న కోణాల్లో అధ్యయనం చేయాలి. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా, ఎన్నికల సంఘం వెబ్‌సైట్స్ ద్వారా సమకూర్చుకోవాలి. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు అవసరమా? అవసరమైతే ఎలాంటి సంస్కరణలు చేపట్టాలి? వాటి వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి? లాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. అదేవిధంగా ఎన్నికల సంస్కరణల గురించి మరింత లోతైన అధ్యయనానికి కింది పుస్తకాలు ఉపయోగపడతాయి. 1.ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా - శాంతి భూషణ్ 2. జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా ఎలక్టోరల్ పాలిటిక్స్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ - ఎ.ఎల్. అహుజా 3. ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా - బి.వెంకటేష్ కుమార్ ఇన్పుట్స్: డాక్టర్ జి.ప్రభాకర్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. ఎస్బీఐ పీఓ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలపండి? - బి.రాగసుధ, అల్వాల్ ఎస్బీఐ పీవో పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో సాధారణంగా కాంప్రహెన్షన్ టెస్ట్; కామన్ ఎర్రర్స్; ఫిల్లింగ్ ద బ్లాంక్స్; జంబుల్డ్ సెంటెన్స్; జంబుల్డ్ వర్డ్స్; స్పెల్లింగ్ ఎర్రర్స్; ఫ్రేజ్ మీనింగ్; ఫ్రేజ్ రీప్లేస్మెంట్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడగొచ్చు. వీటిలో అధిక వెయిటేజీ అంటే దాదాపు 25 నుంచి 30 శాతం ప్రశ్నలు కాంప్రెహెన్షన్ నుంచే వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లిష్ విభాగంలో రాణించాలంటే గ్రామర్, వొకాబ్యులరీ మీద పట్టు తప్పనిసరి. స్పాటింగ్ ద ఎర్రర్స్ విభాగంలో విజయానికి గ్రామర్ నైపుణ్యమే మార్గం. సబ్జెక్ట్, వెర్బ్ ఒకదానికొకటి సమన్వయం ఉందా? లేదా? అనే విషయాన్ని పరిశీలించేలా చదవాలి. గ్రామర్‌పై పట్టుకోసం నిరంతర అధ్యయనమే ప్రధాన ఆయుధం. స్పీడ్ రీడింగ్ కూడా ఇంగ్లిష్‌లో రాణించడానికి దోహదపడుతుంది. వేగం నిమిషానికి 200 నుంచి 250 పదాలు చదివే విధంగా ఉండాలి. అంతేకాకుండా డిస్క్రిప్టివ్ పరీక్షలో కూడా ఇంగ్లిష్‌కే పెద్దపీట వేశారు. ఇందులో లెటర్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్, ఎస్సే రైటింగ్ వంటి అంశాలను చేర్చడం వల్ల ఇంగ్లిష్‌లో పూర్తి పట్టు సాధించడం తప్పనిసరి. ఇందుకోసం అభ్యర్థులు సెంటెన్స్ ఫార్మేషన్; వొకాబ్యులరీ; టెన్సెస్‌పై అవగాహన పొందాలి. రిఫరెన్స్ బుక్స్: ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ -హరిమోహన్ ప్రసాద్ ఇంగ్లిష్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ - ఎ.కె. కపూర్ ఇన్పుట్స్: కె.వి.జ్ఞానకుమార్, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్