
సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బంజారాహిల్స్ నందినగర్‌లోని ఆయన నివాసం వద్దకు సోమవారం(అక్టోబర్21 మధ్యాహ్నం) పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు.
గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ఆపాలని కొందరు విద్యార్థులు ఆందోళన చేస్తున్నందున పరీక్ష సజావుగా జరగడానికి పోలీసులు కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నేతల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. కాగా, సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో గ్రూప్‌వన్ మెయిన్స్ సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైంది.
ఇదీ చదవండి: గ్రూప్ వన్ మెయిన్స్ ప్రారంభం.. భారీగా పోలీసు బందోబస్తు
Comments
Please login to add a commentAdd a comment