
టీ20 వరల్డ్‌కప్ 2024 గెలిచిన భారత జట్టులోని సభ్యుడు మొహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ఆఫర్ చేసింది. సిరాజ్‌తో పాటు రెండు సార్లు వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ అయిన నిఖత్ జరీన్ కూడా గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఇవాళ (ఆగస్ట్ 1) జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై తీర్మానం చేశారు. సిరాజ్, జరీన్‌కు గ్రూప్-1 కేడర్‌లోని డీఎస్పీ ఉద్యోగంతో పాటు ఆర్ధిక సాయం అందజేయనున్నట్లు తెలుస్తుంది.
కాగా, సిరాజ్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. జరీన్ ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటుంది. జరీన్ ఇవాళ జరిగిన ప్రి క్వార్టర్స్ మ్యాచ్‌లో చైనాకు చెందిన టాప్ సీడ్ వు యు చేతిలో ఓటమిపాలై ఒలింపిక్స్ బరి నుంచి నిష్క్రమించింది. ఓటమి అనంతరం జరీన్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమైంది

Comments
Please login to add a commentAdd a comment