![Telangana Government Allocated 600 Yards Site To Cricketer Mohammed Siraj](/styles/webp/s3/article_images/2024/08/9/ac.jpg.webp?itok=QUvt7CWy)
టీ20 వరల్డ్‌కప్ 2024 గెలిచిన భారత జట్టులోని సభ్యుడు మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. సిరాజ్‌కు జూబ్లీ హిల్స్ లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిరాజ్‌తో పాటు బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఈషా సింగ్‌లకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. ఈ ముగ్గురికి ఇంటి స్థలంతో పాటు గ్రూప్-1 స్థాయి (డీఎస్పీ) ఉద్యోగం కూడా ఆఫర్ చేసింది. సిరాజ్, నిఖత్ జరీన్, ఈషా సింగ్ వేర్వేరు క్రీడల్లో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment