
హైదరాబాద్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు(మంగళవారం) జరిగిన తొలి సెమీ ఫైనల్ లో గెలిచి ఫైనల్ చేరిన టీమిండియా విజయం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. . ఈ సెమీస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి రోహిత్ సేనకు అభినందనలు తెలియజేశారు. ఇదే జోష్ ను ఫైనల్ కూడా కనబరిచి చాంపియన్స్ ట్రోఫీ గెలవాలని ఆయన ఆకాంక్షించారు.
ఆసీస్ తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.1 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి(84), శ్రేయస్ అయ్యర్(45), రాహుల్(42 నాటౌట్)లు బాధ్యతాయుతంగా ఆడగా, హార్దిక్ పాండ్యా( 24 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ 28)లు బ్యాట్ ఝుళిపించారు. దాంతో భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించి తుదిపోరుకు సిద్ధమైంది. బుధవారం జరిగే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల రెండో సెమీ ఫైనల్లో విజేతతో భారత్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment