
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌తో డేటింగ్ రూమర్స్‌పై బిగ్‌బాస్ సెలబ్రిటీ మహిర శర్మ స్పందించింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని వివరణ ఇచ్చింది. తనపై వస్తున్న ఊహాగానాలను ఆపాలని సోషల్‌మీడియా వేదికగా కోరింది. ఇదే విషయంపై సిరాజ్ కూడా స్పందించాడు. మహిరతో డేటింగ్ చేయడం లేదని సోషల్‌మీడియా వేదికగా స్పష్టం చేశాడు.
జర్నలిస్ట్‌లు ఈ విషయంపై తనను ప్రశ్నించడం మానుకోవాలని కోరాడు. తాను మహిరతో డేటింగ్ చేయడమనేది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాడు. అయితే ఈ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే సిరాజ్ తన సోషల్‌మీడియా ఖాతా నుంచి తొలగించడం ఆసక్తికరంగా మారింది. సిరాజ్ ఏదో దాయాలనే ప్రయత్నం చేస్తున్నాడంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.
కాగా, సోషల్‌మీడియాలో మహీరకు చెందిన ఓ పోస్ట్‌ను సిరాజ్ లైక్ చేయడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. అనంతరం సిరాజ్, మహిర ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో పుకార్లు బలపడ్డాయి. ఓ దశలో సిరాజ్, మహిర పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వదంతులు వ్యాపించాయి. సిరాజ్‌తో డేటింగ్ రూమర్లను మహిర తల్లి చాలాసార్లు ఖండించారు. అయినా ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పడలేదు.
ఇటీవల ముంబైలో జరిగిన ఓ క్రికెట్ అవార్డుల ఫంక్షన్‌లో మహిర కనిపించినప్పుడు జర్నలిస్ట్‌లు ఈ విషయమై ఆమెను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. త్వరలో జరుగబోయే ఐపీఎల్‌లో ఆమెకు ఇష్టమైన జట్టు ఏదని పదేపదే ప్రశ్నించి రాక్షసానందం పొందారు.
ఇంతకీ ఈ మహిర ఎవరు..?
రియాలిటీ షో బిగ్ బాస్-13 సీజన్‌తో మహిర శర్మ ఫేమస్ అయ్యింది. మహిర.. నాగిన్ 3, కుండలి భాగ్య, బెపనా ప్యార్ వంటి షోలలో పనిచేస్తూ టీవీ పరిశ్రమలో పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. గతంలో మహిర బిగ్ బాస్ ద్వారా పరిచయమైన టీవీ నటుడు పరాస్ ఛబ్రాతో డేటింగ్ చేసింది. మహిర ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా నటిస్తుంది.
ఇదిలా ఉంటే, ఈ ఐపీఎల్ సీజన్‌లో సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. గతేడాది మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్‌ను వదిలేయగా.. మెగా వేలంలో గుజరాత్ సిరాజ్‌ను రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. 2018 నుంచి సిరాజ్ ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో గుజరాత్ తమ తొలి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 25న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment