
హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మాధవ్‌గౌడ్ గ్రూప్–1కు ఎంపికయ్యారు. ఇటు ఎస్సైగా విధులు నిర్వహిస్తూనే.. అటు గ్రూప్స్‌కు సిద్ధమయ్యారు. సోమవారం విడుదలైన గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో మాధవ్‌గౌడ్ 505 మార్కులు సాధించారు.
మెరిట్ మేరకు ఆయనకు డీఎస్పీ, డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మాధవ్‌గౌడ్ స్వస్థలం కొత్తపల్లిగోరి మండలం సుల్తాన్‌పూర్. తండ్రి మొగిలి పోస్టల్ ఉద్యోగి కాగా.. తల్లి గృహిణి. 2019 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఆయన వరంగల్ కమిషనరేట్ పరిధి జఫర్‌గడ్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించారు. ఇటీవల బదిలీపై కేయూ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ప్రస్తుతం భీమారంలోని సత్యసాయికాలనీ–5లో భార్యాపిల్లలతో ఉంటున్నారు.
గ్రూప్–1 ర్యాంకర్ తేజస్వినికి సన్మానం
శాయంపేట : మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన జిన్నా విజయపాల్ రెడ్డి హేమలత దంపతుల కూతురు తేజస్విని రెడ్డి సోమవారం విడుదలైన గ్రూప్–1లో ఫలితాల్లో 532.5 మార్కులు సాధించింది. దీంతో తేజస్వినిని గ్రామ మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ మంగళవారం సన్మానించారు. కాగా, తేజస్విని రెడ్డి 2019లో మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2లో మండల పంచాయతీ అధికారి పోస్టు సాధించింది. మొదటి పోస్టింగ్ నేలకొండపల్లి, రెండో పోస్టింగ్ టేకుమట్ల, ప్రస్తుతం రేగొండలో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం చేస్తూనే గ్రూప్‌ృ1కు సొంతంగా సన్నద్ధమైంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గ్రూప్‌ృ1లో 532.5 మార్కులు సాధించానని, డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఎంపిక చేసుకుంటానని తేజస్విని రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment