TGPSC
-
ఎల్లుండి గ్రూప్-2 కీ విడుదల: టీజీపీఎస్సీ చైర్మన్
సాక్షి,హైదరాబాద్:ఇటీవల జరిగిన గ్రూప్-2(Group-2) పరీక్ష ‘కీ’ని శనివారం(జనవరి 10) విడుదల చేస్తామని, ఇక నుంచి పరీక్షలు జరిగిన వారం పది రోజుల్లోనే ఫలితాలు వెల్లడిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham) తెలిపారు. బుధవారం వెంకటేశం మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు. ‘గతంలో జరిగిన తప్పిదాలు కమిషన్‌లో ఇకపై జరగవు. ఫలితాలు ఎప్పుడు వస్తాయో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు.ఇకపై వేచి చూసే ధోరణి ఉండదు.ప్రతీ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఏళ్ల తరబడి వేచి చూడకుండా ప్రతి ఏడాది పరీక్షలు జరగాలన్నది మా నిర్ణయం. టీజీపీఎస్సీని పూర్తి స్థాయి ప్రక్షాళన చేస్తున్నాం.సైంటిఫిక్ డిజైన్ ఇక్కడ లోపించింది అందుకే ప్రక్షాళన చేస్తున్నాం.సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆయా శాఖకు సంబంధించిన అధికారులు చూస్తారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని పరీక్షల ఫలితాలు మార్చి 31కల్లా విడుదల చేస్తున్నాం.పెండింగ్ అనేది ఉండదు’అని వెంకటేశం తెలిపారు. -
పేపర్–1 కఠినం.. పేపర్–2 మధ్యస్థం..
సాక్షి, హైదరాబాద్/అనంతగిరి: టీజీపీఎస్సీ గ్రూప్–2 పరీక్షలు ఆదివారం మొదటిరోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో మొదటి, రెండో పేపర్ పరీక్షలు నిర్వహించగా, సోమవారం మూడు, నాలుగు పేపర్ల పరీక్షలు నిర్వహిస్తున్నారు. టీజీపీఎస్సీ ఇప్పటికే జారీచేసిన గ్రూప్స్ నోటిఫికేషన్లలో ఇదే చివరిది. ఇప్పటికే గ్రూప్–1, గ్రూప్–3 పరీక్షలు పూర్తికాగా.. గ్రూప్–4 ఉద్యోగాలను భర్తీ కూడా చేశారు. కాగా, ఆదివారం నిర్వహించిన గ్రూప్–2 మొదటి పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ కఠినంగా వచ్చిందని అభ్యర్థులు తెలిపారు.అభ్యర్థి విషయ పరిజ్ఞానాన్ని లోతుగా పరిశీలించేలా ్రçపశ్నపత్రం ఉందని మెజార్టీ అభ్యర్థులు చెప్పారు. ఇస్త్రో, జాతీయ అవార్డులు, ఖేలో ఇండియా, కాగ్, విద్యుత్ వాహనాలు, నీతి అయోగ్, వికలాంగులు, సీనియర్ సిటీజన్స్, జాగ్రఫీ, ఐఐటీలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఎంచుకునేందుకు ఎక్కువ సమయం పట్టిందని వెల్లడించారు. దీంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సమయం సరిపోలేదని ఎక్కువ మంది అభ్యర్థులు తెలిపారు.పేపర్–2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీకి సంబంధించిన ప్రశ్నల్లో హిస్టరీ కఠినంగా ఉండగా, పాలిటీ కాస్త సులభంగా ఉందని పేర్కొన్నారు. సొసైటీపై ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు చెప్పారు. ప్రధానంగా తెలంగాణ హిస్టరీపై అడిగిన ప్రశ్నలు తికమకపెట్టేలా ఉన్నాయని తెలిపారు. కొందరు అభ్యర్థులు మాత్రమే ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వగలరని పేర్కొన్నారు. 46.3 శాతమే హాజరు గ్రూప్–2 పరీక్ష మొదటిరోజు సగానికిపైగా అభ్యర్థులు హాజరుకాలేదు. మొత్తం 783 ఉద్యోగాల కోసం 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 74.96 శాతం మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. పేపర్–1 పరీక్షకు 2,57,981 మంది (46.75%), పేపర్–2 పరీక్షకు 2,55,490 మంది (46.30%) మాత్రమే హాజరయ్యారు. అయితే పరీక్షల నిర్వహణ పూర్తయ్యి జవాబు పత్రాలు మొత్తం అందిన తర్వాత హాజరు శాతంపై స్పష్టత వస్తుందని టీజీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. పరీక్షా కేంద్రంలో మొబైల్ ఫోన్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి డెంటల్ కాలేజ్ సెంటర్ (కేంద్రం కోడ్ 4419) లో ఓ అభ్యర్థి వద్ద మొబైల్ ఫోన్ లభించటం కలకలం రేపింది. హాల్‌టికెట్ నంబర్ 2284419441 కలిగిన అభ్యర్థి వద్ద మొబైల్ ఫోన్‌ను గుర్తించి స్వా«దీనం చేసుకు న్నారు. ఆ అభ్యర్థి పరీక్ష రాయకుండా అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. అతడిపై మాల్‌ప్రాక్టీస్ చట్టం 25/97 కింద చర్యలు తీసుకొంటామని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–2 పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలు ఏర్పాటుచేశారు. -
యథావిధిగా గ్రూప్–2
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయలేమ ని హైకోర్టు తేల్చిం చెప్పింది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినందున స్టే ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. యథావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్‌కు స్ప ష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఈ నెల 16, 18 తేదీల్లో జరగనున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ ఆర్బీ) పరీక్షల దృష్ట్యా 16న జరగనున్న గ్రూప్–2 పేపర్–3, పేపర్–4 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా దంపిల్లపల్లికి చెందిన రావుల జ్యోతితోపాటు మరో 21 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ అంశంపై కమిషన్‌కు నవంబర్ 25నే వినతిపత్రం సమ ర్పించినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టుకెక్కారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీ క్ సోమవారం విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాది స్తూ 15, 16న జరగనున్న గ్రూప్–2 పరీక్షలకు దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని.. ఇప్పటికే పరీక్షల నిర్వ హణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పారు. స్టే కోరుతున్న వారి కోసం పరీక్షలను వాయిదా వేస్తే లక్షల మంది ఇబ్బందిపడతారని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ దశలో గ్రూప్–2 పరీక్షను నిలిపేయలేమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ ముఖ్య కార్యదర్శి, టీజీపీఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు.గ్రూప్–2 హాల్‌టికెట్లు విడుదల గ్రూప్–2 పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ సోమవారం హాల్‌టికెట్లను విడుదల చేసింది. కమిషన్ వెబ్సైట్లో వాటిని అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ సూచించారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించేందుకు జిల్లాలవారీగా హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ హెల్ప్‌లైన్ నంబర్లు 040–22445566/ 23542185/23542187కు కాల్ చేసి లేదా helpdesk@tspsc.gov.in కు ఈ–మెయిల్ చేయాలని సూచించారు. తొలిరోజే లక్ష మందికిపైగా అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. -
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. అభ్యర్ధుల అభ్యంతరాలను పక్కన పెట్టడంతో పాటు మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.2022 లో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను పక్కన పెట్టి 2024లో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్దమంటూ కొందరు అభ్యర్థులు కోర్టుకెక్కారు. అలాగే.. 2024 గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షల్లో కూడా 14 తప్పులున్నాయని, మెయిన్స్‌ను సైతం వాయిదా వేయాలని కూడా కోరారు.అయితే తెలంగాణ హైకోర్టులో వీళ్లకు చుక్కెదురైంది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది. ‘‘కోర్టును ఆశ్రయించిన అభ్యర్ధులు ఎవరూ ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ కానందున మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదు. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరం. దీనివల్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియ తీవ్ర జాప్య మవుతుంది’’ అని జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం అభిప్రాయపడింది. -
టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం.. సర్కార్ ఉత్తర్వులు జారీ
-
ప్రశ్న.. పాఠమయ్యేదెప్పుడు?
నిర్మల్: దేశచరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా జలియన్‌వాలాబాగ్ ఊచకోతకు పేరుంది. జనరల్ డయ్యర్ చేసిన ఈ నరమేథాన్ని దేశం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది. కారణం మన చరిత్రపుటల్లో ఈ ఘటనకు..కారకులకు..అమరులకు చోటిచ్చారు కనుక. కానీ.. జలియన్‌వాలాబాగ్ ఘటన కంటే దాదాపు 60 ఏళ్లకిందట అంతకంటే దారుణమైన మారణహోమం మనరాష్ట్రంలోనే చోటుచేసుకుంది. ఒకేసారి వెయ్యిమందిని అత్యంత కిరాతకంగా కాళ్లూచేతులు విరగ్గొట్టి, ఒకే మర్రిచెట్టుకు ఉరితీసి చంపేశారు. ఈ దారుణ మారణకాండ గురించి దేశానికి కాదు.. కనీసం ఆ జిల్లాలోనే ఇప్పటికీ చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. మరో దారుణమేమంటే.. అసలు ఎక్కడా.. ఏ చరిత్రపుటల్లో.. ఏ పుస్తకంలో.. ఏ పాఠంలో.. చెప్పని ఆ చారిత్రక ఘటన గురించి ఇటీవల నిర్వహించిన గ్రూప్–3 పరీక్షలో ఓ ప్రశ్నగా అడిగారు.తెలంగాణ చరిత్రను ఆసాంతం చదివిన వారికి ఎక్కడో ఓ చోట రాసిన విషయం గుర్తుంటే తప్ప.. సమాధానం ఇవ్వలేరు. వెయ్యిమంది వీరుల త్యాగం పాఠ్యాంశంగా అందించాలన్న డిమాండ్ ఉంది. ఏంటా ప్రశ్న... తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్–3 పరీక్షలో రాంజీగోండుకు సంబంధించి అడిగారు. రెండవ పేపర్లో 18వ శతాబ్దంనాటి రాంజీగోండు తన బృందంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి నిర్మల్ వరకు తన ప్రాబల్యాన్ని పెంచుకొని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, చివరకు వెయ్యిమంది సైన్యంతో కలిసి ఉరికొయ్యలకు బలికావడం తదితర అంశాలపై ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చాలామంది సరైన సమాధానాలు రాయలేకపోయామని చెప్పారు. ఇందుకు కారణం రాంజీగోండు, వెయ్యి ఉరుల మర్రి ఘటన గురించి చిన్నప్పటి నుంచి ఏ పాఠ్యపుస్తకంలో చదవకపోవడమే. ఎక్కడ ఆ ఘటన.. ఎవరా రాంజీ ! 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సమయంలోనే వెలుగులోకి వచ్చిన ఆదివాసీ వీరుడు రాంజీగోండు. గోండురాజుల వంశానికి చెందిన రాంజీ అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్, గోండ్వానా రాజ్యంలో చెల్లాచెదురుగా ఉన్న వారందరినీ ఏకం చేశాడు. పరాయిదేశం నుంచి వచ్చి భరతమాతను బంధించిన ఆంగ్లేయులపై, స్వదేశంలో ఉంటూ వారికి తొత్తులుగా ఉన్న నిజాం రాజులపైనా పోరాడాలని పిలుపునిచ్చాడు. ఇందుకు గోదావరి తీరంలో చుట్టూ దట్టమైన అడవులు, గుట్టలతో ఉన్న నిర్మల్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ప్రథమ సంగ్రామంలో పాల్గొన్న రొహిల్లాలు.. ఈ ఆదివాసీ వీరులకు తోడుకావడంతో నెలల తరబడి ఆంగ్లేయులను ముప్పతిప్పలు పెట్టారు. తమ వద్ద సరైన బలగాలు, మందుగుండు సామగ్రి, ఆయుధాలు లేకున్నా.. రాంజీ సారథ్యంలో గెరిల్లా తరహా పోరుసల్పారు. కొరకరాని కొయ్యగా మారిన గోండువీరులను శత్రువులు దొంగదెబ్బ తీశారు. రాంజీ సహా వెయ్యిమంది వీరులను బంధించారు. మరోసారి ఇలాంటి తిరుగుబాటు చేయడానికి కూడా ఎవరూ సాహసించొద్దని ఆ వీరులను అత్యంత దారుణంగా హింసించారు. ఒకే మర్రిచెట్టుకు.. వెయ్యిమంది 1860, ఏప్రిల్ 9న నిర్మల్ నుంచి ఎల్లపెల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న పెద్ద మర్రిచెట్టుకు ఈ వెయ్యిమంది వీరులను ఒకేసారి ఉరితీశారు. అలా వారంతా మాతృభూమి కోసం ఉరికొయ్యలను ముద్దాడారు. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీగోండు, వెయ్యిమంది వీరుల చరిత్ర దశాబ్దాలపాటు కనీసం బయటకు రాలేదు. ఇప్పటికీ ఈ దారుణ మారణకాండ గురించి ఎక్కడా చరిత్రలో, పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కలేదు. 2021 సెపె్టంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్మల్ వచ్చి వెయ్యిమంది అమరులకు నివాళులరి్పంచారు. అయితే ఇప్పటికీ నిర్మల్‌లో వారి స్మారకార్థం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.ముందుతరాలకు తెలిసేలా.. నిర్మల్ జిల్లాకేంద్రంలో ఎప్పుడో 1857–60లోనే జరిగిన వెయ్యి ఉరులమర్రి ఘటనను ఇప్పటికీ బయటకు తీయకపోవడం దారుణం. ఇలాంటి ఘటనను ముందుతరాలకు తెలిపేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. – ధోండి శ్రీనివాస్, చరిత్రకారుడుపాఠ్యాంశంగా పెడితే... వెయ్యి ఉరుల మర్రి ఘటన గురించి పాఠ్యాంశంగా పెట్టడంతోపాటు విస్తృ తంగా ప్రచారం కల్పించాల్సిన అవసరముంది. అప్పుడే ఇలాంటి ఘటనలపై అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వగలుగుతారు. – డాక్టర్ కట్కం మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
ముతక జననాలు.. ముతక మరణాలు!
సాక్షి, హైదరాబాద్: ముతక జననాలు.. ముతక మరణాలు.. ఇదేంటి ఏవో కొత్త పదాల్లా ఉన్నాయా? వీటి అర్థమేమిటనే సందేహం వస్తోందా? ఇవేకాదు గ్రూప్–3 పరీక్షల తెలుగు అనువాదంలో ఇలాంటి సరికొత్త పదాలు మరెన్నో ఉన్నాయి. భారత జనాభా వృద్ధిరేటుకు సంబంధించిన ప్రశ్నలో.. ‘ది క్రూడ్ బర్త్ రేట్’ అనే ఆంగ్ల పదానికి ‘ముతక జననాల రేటు’ అనే అనువాదం చేశారు. మరో ప్రశ్నలో ‘క్రూడ్ డెత్ రేటు’ అంటే.. ‘ముతక మరణాల రేటు’ అని తెలుగులో ఇచ్చారు. కొన్ని ప్రశ్నలలో తెలుగులో పదాలే లేనట్టుగా నేరుగా ఇంగ్లిష్ పదాలనే తెలుగు లిపి ఇచ్చారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తెలుగు మీడియం వారి పరిస్థితి ఏమిటి?..: సాధారణంగా టీజీపీఎస్సీ ఉద్యోగ పరీక్షల ప్రశ్నపత్రాలను ఆంగ్లంలో రూపొందించి, తెలుగులోకి అనువాదం చేస్తుంటారు. రెండు భాషల్లోనూ ప్రశ్నలు ఇస్తుంటారు. ప్రశ్నలు ఆంగ్లంలో సరిగానే ఉన్నా.. తెలుగు అనువాదం మాత్రం దారుణంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలా మంది తెలుగు మీడియంలో చదివినవారే ఉంటారు. వారు తెలుగులో పరీక్ష రాసేందుకు మొగ్గు చూపుతుంటారు. అలాంటి వారికి ఇంగ్లిష్‌లోని ప్రశ్న ఏమాత్రం అర్థంకాకపోయినా, తెలుగులోని అనువాదం సరిగా లేకుంటే సమాధానాలు సరిగా రాయలేని పరిస్థితి ఉంటుంది. కానీ అధికారులు ప్రశ్నపత్రాలను తెలుగులోకి అనువాదం చేసే అంశాన్ని కనీసం పట్టించుకున్నట్టు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులోని కొన్ని ప్రశ్నలను చూస్తుంటే ఏదో కొత్త భాష చదువుతున్నట్టుగా ఉందని అభ్యర్థులు వాపోతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఇంత తేలికగా తీసుకోవడం ఏమిటని మండిపడుతున్నారు. లిప్యంతరీకరణ చేయడమేంటని అడుగుతున్నారు.యూపీఎస్సీ వంటి జాతీయ పరీక్షల్లో ఎలాగూ ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఇస్తుంటారని.. కనీసం రాష్ట్ర స్థాయిలో రాసే పరీక్షల్లోనైనా తెలుగులో చూసుకుని పరీక్ష రాసే పరిస్థితి లేదని వాపోతున్నారు. ‘‘గ్రూప్–3 పరీక్ష మాత్రమే కాకుండా రాష్ట్రంలో జరిగే అన్ని రకాల పోటీ పరీక్షల్లో అనువాదం సమస్య ఇలాగే ఉంటోంది. ఈ విషయంలో టీజీపీఎస్సీ ఎందుకు చొరవ తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. దీనితో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది’’ అని కృష్ణ ప్రదీప్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ పేర్కొన్నారు.మూడు సెషన్ల హాజరు 50.24 శాతంరాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–3 ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించిన అర్హత పరీక్షలు సోమవారంతో ముగిశాయి. రెండు రోజుల పాటు మూడు సెషన్లలో జరిగిన ఈ పరీక్షలకు 50.24 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల కు మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా.. 76.4 శాతం మందే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ ప్రక్రియలోనే పావు వంతు అభ్యర్థులు పరీక్షలకు దూరమవగా.. మరో పావు వంతు మంది హాల్‌టికెట్లు తీసుకుని కూడా పరీక్షలు రాయలేదు. -
గ్రూప్-3 పరీక్షలో ఆస్కార్, జాతీయ అవార్డ్స్‌పై సినిమా ప్రశ్నలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-3 పరీక్షల్లో చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ అవార్డ్స్ గురించి ఒక ప్రశ్న రాగా.. ఆస్కార్ అవార్డ్స్ గురించి మరో ప్రశ్న రావడం జరిగింది. నవంబర్ 17,18 తేదీల్లో టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్ష నిర్వహిస్తుంది. అయితే, ఈ ఆదివారం ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు సినిమా పరిశ్రమ నుంచి ఈ క్రింది ప్రశ్నలు రావడం జరిగింది.1. కింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది ?A) ముర్ ముర్స్ ఆఫ్ ది జంగల్B) ఆట్టంC) బ్రహ్మాస్త్ర D) కాంతార2. ఆస్కార్ అవార్డు -2024కు నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ చలనచిత్రం 'టు కిల్ ఎ టైగర్' దర్శకుడు ఎవరు ?A) ఆర్. మహదేవన్B) నిఖిల్ మహాజన్C) కార్తికి గొన్సాల్వ్స్D) నిషా పహుజాఆస్కార్ 2024, 70వ జాతీయ ఆవార్డ్స్ ప్రకటన కొద్దిరోజుల క్రితమే జరిగింది. ఈ రెండు ప్రశ్నలకు చాలామందికి సమాధానం తెలిసే ఉండవచ్చు. ఇందులో మొదటి ప్రశ్నకు సమాధానం 'ముర్ ముర్స్ ఆఫ్ ది జంగల్'. ఇదీ మరాఠీ చిత్రం. రెండో ప్రశ్నకు జవాబు 'నిషా పహుజా'. రంజిత్ అనే రైతు 13 ఏళ్ల కూతురు సామూహిక అత్యాచారానికి గురైన కేసుపై తీసిన సినిమా ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. -
TGPSC: గ్రూప్-3 పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నేడు, రేపు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక, పరీక్ష 10 గంటలకు ప్రారంభం కావడంతో.. పలుచోట్ల పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యం కావడంతో వారిని పరీక్షా కేంద్రాలకు అధికారులు అనుమతించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు అభ్యర్థులను పరీక్ష కేంద్రాన్ని అనుమతించని అధికారులు. తంగళ్ళపల్లి మండలం వేణుగోపాల్పూర్ గ్రామానికి చెందిన ఆనంద్, వేములవాడ పట్టణానికి చెందిన మంజుల అనే ఇద్దరు అభ్యర్థులకు ఎంట్రీ నిరాకరణ. పరిగెత్తుకుంటూ పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారు అభ్యర్థులు.ఇక, సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 15 మంది అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. వికారాబాద్ జిల్లాలో 15 మంది.. అలాగే, ఆదిలాబాద్ జిల్లాలో 20 మందికి ఆలస్యం కావడంతో వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. అధికారులను ఎంత బ్రతిమిలాడినా వారిని పరీక్షా కేంద్రాల్లోకి పంపించలేదు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–1.. అలాగే, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహిస్తారు. 18న(రేపు) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–3 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. -
రేపటి నుంచే గ్రూప్–3 పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నెల 17, 18వ తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి రోజు రెండు, రెండో రోజు ఒక పరీక్ష నిర్వహించనున్నారు. 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–1.. అదే రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహిస్తారు. 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–3 పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో జరిగే గ్రూప్–3 పరీక్షలకు మొత్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే 80 శాతం మంది విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,388 గ్రూప్–3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ అయింది. కలెక్టర్లు, ఎస్పీలకు పర్యవేక్షణ బాధ్యతలు.. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–3 పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించింది. స్వయంగా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్లు, ఎస్పీలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. టీజీపీఎస్సీ కార్యాలయానికి వాటిని అనుసంధానించి.. ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలి గ్రూప్–3 అభ్యర్థులను పరీక్ష సమయం కంటే గంటన్నర ముందు నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. కనీసం గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అరగంట ముందే సెంటర్ల గేట్లు మూసివేస్తామని.. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేసింది. ఉద్యోగాల తుది ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను, ప్రశ్నపత్రాలను జాగ్రత్త చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది. డూప్లికేట్ హాల్‌టికెట్లను జారీ చేయబోమని పేర్కొంది. -
తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-4 ఫలితాలు విడుదలయ్యాయి. 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజినల్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపర్చినట్లు కమిషన్ పేర్కొంది.8,180 పోస్ట్‌లకు డిసెంబర్ 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 9 లక్షల 51 వేల 321 మంది దరఖాస్తు చేసుకోగా జూలై 1, 2023న జరిగిన నియామక పరీక్ష నిర్వహించారు. సర్టిఫికేషన్ వెరిఫికేషన తర్వాత పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. -
నేటి నుంచే గ్రూప్–1 మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సివిల్ సర్విస్ ఉద్యోగాలుగా పేర్కొనే గ్రూప్–1 కొలువుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. ఈనెల 27వ తేదీ వరకు వరుసగా జరిగే ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు కలిపి.. మొత్తం 46 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.మొత్తం 563 గ్రూప్–1 పోస్టుల కోసం 31,383 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు పరీక్షల నిర్వహణ, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. సహాయకుల (స్క్రైబ్) ద్వారా పరీక్ష రాసే దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట అదనంగా కేటాయిస్తారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు.ఏడు రోజులు... ఏడు పరీక్షలు.. సోమవారం నుంచి 27వ తేదీ వరకు ఏడు రోజులు.. ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రతి పరీక్షకు 3గంటల సమయం ఉంటుంది. ప్రతి పరీక్షకు గరిష్ట మార్కులు 150. జనరల్ ఇంగ్లిష్ మినహా మిగతా పరీక్షలను ఇంగ్లి‹Ù, తెలుగు, ఉర్దూ భాషల్లో ఏదో ఒక దానిలో రాయవచ్చు. అయితే అన్ని పరీక్షలను ఒకే భాషలో రాయాలి. అభ్యర్థులు అన్ని పరీక్షలకు తప్పకుండా హాజరుకావాలి. అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 1.30 గంటలకు పరీక్షా కేంద్రాన్ని మూసివేస్తారు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థులను లోనికి అనుమతించరు. అభ్యర్థి తొలి పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలి. డూప్లికేట్ హాల్‌టికెట్ జారీ చేసే అవకాశం ఉండదు. -
TG: గ్రూప్-1 రగడ.. నేడు సర్కార్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 అభ్యర్థుల నిరసనలతో హైదరాబాద్ అట్టుడుకుతోంది. నిన్నటి(శనివారం)నిరసనల ఎఫెక్ట్‌తో అశోక్‌నగర్‌లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల ఆందోళనకు బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలికాయి.మరోవైపు, గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికకు పాటించిన విధానంతో రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, అందువల్ల పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసి తమ సమస్యలను ప్రస్తావించారు. ఈ క్రమంలో చొరవ తీసుకున్న మహేశ్‌కుమార్ గౌడ్ శనివారం సాయంత్రం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని పొన్నం ప్రభాకర్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతోపాటు టీజీపీఎస్సీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: ఎందుకీ గ్రూప్-1 వివాదం.. ఏమిటీ జీవో 55.. జీవో 29?గ్రూప్–1 అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు, సమస్యలను మహేశ్ గౌడ్ ప్రస్తావించారు. ప్రధానంగా జీఓ 29పై అభ్యర్థుల్లో భిన్నాభిప్రాయాలు, అనుమానాలున్నాయన్నారు. ఈ క్రమంలో దీనిపై కోర్టు ఉత్తర్వులు, న్యాయపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ పరీక్షలో ఏ విద్యార్థికీ అన్యాయం జరగొద్దని, రిజర్వేషన్ల పరంగా ఎలాంటి నష్టం కలగకుండా అన్ని వర్గాలకు న్యాయం జరగాలని మంత్రులు స్పష్టం చేశారు. మంత్రులు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సాంకేతికపరమైన వివరణలు ఇచ్చారు. అనంతరం పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదనే అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పరీక్షలు యధాతథంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆదివారం ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు సమాచారం. -
గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళన.. ముట్టడి.. ఉద్రిక్తం!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, జీవో 29ను వెంటనే రద్దు చేయాలనే డిమాండ్లతో అభ్యర్థులు శనివారం చేపట్టిన సచివాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేల మంది అభ్యర్థులు, వారికి మద్దతుగా వచ్చిన వారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సచివాలయం వైపు దూసుకువచ్చారు. పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించడంతో.. ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పెద్ద సంఖ్యలో ఉన్న అభ్యర్థులు, నిరుద్యోగులు ముందుకు దూసుకెళ్లి, సచివాలయం గేటు వద్ద భైఠాయించారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మరిన్ని బలగాలను రంగంలోకి దింపి.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా.. గ్రూప్–1 మెయిన్స్ రీషెడ్యూల్, జీవో 29 రద్దు డిమాండ్లతో అభ్యర్థులు నాలుగైదు రోజులుగా ఆందోళనలు చేస్తుండటం తెలిసిందే. ప్రతీరోజు అశోక్‌నగర్ చౌరస్తాలో ధర్నాలు, రాస్తారోకోలతో నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం, పరీక్షలు సమీపించడంతో.. సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం వరకు అశోక్‌నగర్‌లోనే ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన అభ్యర్థులు.. ఆ తర్వాత ఒక్కసారిగా సచివాలయం ముట్టడికి బయలుదేరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్ తదితరులతోపాటు ఆయా పార్టీలు, విద్యార్థి సంఘాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు మద్దతుగా ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు ముందే మోహరించినా.. సచివాలయం ముట్టడికి బయలుదేరిన గ్రూప్–1 అభ్యర్థులను అడ్డుకునేందుకు పోలీసులు ముందుగానే మోహరించారు. అశోక్‌నగర్ నుంచి అభ్యర్థులు ర్యాలీగా బయలుదేరగా.. అడుగడుగునా చుట్టుముట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ అభ్యర్థులు, వారికి మద్దతుగా వచ్చినవారు భారీ సంఖ్యలో ఉండటంతో.. పోలీసుల ప్రయత్నం విఫలమైంది. చాలా మంది అభ్యర్థులు సచివాలయం గేటు వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. సీఎం రేవంత్ డౌన్‌డౌన్, వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం జీవో 29 తెచ్చి రిజర్వేషన్లు అమలు కాకుండా అన్యాయం చేస్తోందని ఆరోపించారు. పరిస్థితి అదుపు తప్పుతోందని గ్రహించిన పోలీసులు.. అభ్యర్థులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. బైఠాయించినవారిని బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. తక్కువ సంఖ్యలో వ్యాన్లు ఉండటంతో అభ్యర్థులను తరలించడం పోలీసులకు కష్టతరమైంది. మరోవైపు అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతోపాటు విద్యార్థి సంఘాల కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో.. దాదాపు రెండున్నర గంటల పాటు ఆందోళన కొనసాగింది. బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్‌లను పోలీసులు బలవంతంగా వ్యాన్ ఎక్కించి బండ్లగూడకు తరలించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య పలుమార్లు తోపులాట జరిగింది. దీనితో సచివాలయం పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ.. గ్రూప్–1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు పలికారు. అశోక్‌నగర్ చౌరస్తాలో నిరసనలో, సచివాలయం ముట్టడికి చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్‌గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, దాసోజు శ్రవణ్, ముఠాగోపాల్ తదితరులు కూడా ముట్టడిలో పాల్గొని మద్దతు ప్రకటించారు. అశోక్‌నగర్ చౌరస్తా నుంచి ర్యాలీ లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయం వద్దకు చేరుకున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు అందులో కలిశారు. ఈ సమయంలో అప్పటికే ర్యాలీలో ఉన్న బీజేపీ నేతలు వారిని అడ్డుకుని.. ‘బీఆర్ఎస్ నేతలు గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ నేతలు లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరుపార్టీల నేతలను అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. బీజేవైఎం అధ్యక్షుడు మహేందర్, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి తదితరులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులను బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గ్రూప్–1పై అభ్యర్థుల డిమాండ్లు ఇవీ.. ⇒ రెండేళ్ల క్రితం ఇచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్లో మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికను జీఓ 55 ద్వారా చేపడతామని కమిషన్ ప్రకటించింది. కానీ ఈ ఏడాది జారీ చేసిన నోటిఫికేషన్లో జీఓ 29 ద్వారా ఎంపిక చేస్తామని కమిషన్ పేర్కొంది. ఈ జీఓ 29 ద్వారా రిజర్వేషన్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ⇒ గ్రూప్–1 ఉద్యోగాల అర్హత పరీక్షలకు అభ్యర్థులంతా తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా సన్నద్ధమయ్యారు. అయితే ప్రశ్నపత్రాల రూపకల్పనలో తెలుగు అకాడమీ పుస్తకాలకు బదులు ఇతర సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవడం సరికాదని స్పష్టం చేస్తున్నారు. ⇒ గ్రూప్–1 ఉద్యోగ నోటిఫికేషన్లో ఎస్టీ రిజర్వేషన్లను తొలుత 6శాతంగా, ఆ తర్వాత 10శాతంగా పేర్కొనడాన్ని ఆక్షేపిస్తున్నారు. ⇒ పరీక్షల సన్నద్ధతకు సమయం కావాలని, పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కొందరు అభ్యర్థులు కోరుతున్నారు. ⇒ గ్రూప్–1 ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్, పరీక్షలపై కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. తీర్పులు వచ్చే వరకు పరీక్షలు నిర్వహించొద్దని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. రేపటి నుంచే మెయిన్స్.. పకడ్బందీగా ఏర్పాట్లు ఈ నెల 21 నుంచి 27 వరకు జరిగే గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు కలిపి మొత్తం 46 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును.. విస్తృతస్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు పరీక్షల నిర్వహణను, బందోబస్తును పర్యవేక్షించాలని ఆదేశించింది. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో పరీక్ష తీరును పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం నుంచి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఇక సహాయకుల (స్క్రైబ్) సాయంతో పరీక్ష రాయనున్న దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట అదనంగా సమయం కేటాయిస్తున్నట్టు కమిషన్ ప్రకటించింది. స్క్రైబ్‌ల సాయంతో పరీక్షలు రాసేవారికి ప్రత్యేకంగా 4 కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. -
పల్లెల్లో సర్కారీ కొలువులపై అనాసక్తి.. ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: సర్కారీ ఉద్యోగం వచ్చినా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి కొందరు అభ్యర్థులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. టీజీపీఎస్సీ ద్వారా రాష్ట్ర నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)గా 687 మంది ఎంపిక కాగా, 674 మంది మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరై నియామక పత్రాలు అందుకున్నారు. మిగిలిన 13 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు దూరంగా ఉండటం ద్వారా ఉద్యోగావకాశాన్ని వదులుకున్నారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు ఈ నెల 25 నాటికి పోస్టింగ్ పొందిన చోట రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా, మంగళవారం నాటికి కేవలం 310 మంది మాత్రమే రిపోర్టు చేశారు. గత నెల 26న నియామక పత్రాలు అందజేయగా, రిపోర్టు చేయడానికి మరో 8 రోజులు మాత్రమే మిగిలున్నాయి. యువ ఇంజనీర్లకు తొలి పోస్టింగ్‌ను గ్రామీణ ప్రాంతాల్లోనే ఇస్తామని, ఎలాంటి ఒత్తిళ్లను తీసుకురావద్దని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వారికి పోస్టింగ్ ఇచ్చే సమయంలో స్పష్టం చేశారు. హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ పరిధిలో 10 మంది ఏఈఈలకు పోస్టింగ్ ఇస్తే ఇప్పటికి 9 మంది రిపోర్టు చేశారు. మహబూబ్‌నగర్ సీఈకి 48 మందిని కేటాయిస్తే కేవలం 8 మంది, నల్లగొండ సీఈకి 76 మందిని కేటాయిస్తే 49 మంది, సూర్యాపేట సీఈకి 32 మందిని కేటాయిస్తే కేవలం ఇద్దరు, ఆదిలాబాద్ సీఈకి 24 మందిని కేటాయిస్తే 15 మంది, వనపర్తి సీఈకి 53 మందిని కేటాయిస్తే 16 మంది, వరంగల్ సీఈకి 30 మందిని కేటాయిస్తే ఏడుగురు, గజ్వేల్ సీఈకి 72 మందిని కేటాయిస్తే 12 మంది, కరీంనగర్ సీఈకి 45 మందిని కేటాయిస్తే 14 మంది మాత్రమే ఇప్పటి వరకు విధుల్లో చేరారు.చదవండి: మొక్కుబడిగా వాహనాల స్క్రాప్ పాలసీ.. ఈ ప్రశ్నలకు బదులేదీ సారూ!నియామక పత్రాలు పొందిన 674 మందిలో 10 మంది ఐఐటీ డిగ్రీ, 21 మంది ఐఐటీ పీజీ, 50 మంది ఎన్ఐటీ డిగ్రీ, 33 మంది ఎన్ఐటీ పీజీ చేసిన వారున్నారు. మొత్తం 114 మంది ఐఐటీ, ఎన్ఐటీ ఇంజనీర్లు ఉండగా, వీరిలో అధిక శాతం సర్కారీ కొలువుల్లో చేరేందుకు ఆసక్తి చూపకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
గ్రూప్–1 మెయిన్స్‌కు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు లైన్‌క్లియర్ చేసింది. అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు ఉన్న చట్టపరమైన అడ్డంకులను తొలగించింది. రీనోటిఫికేషన్, ‘కీ’ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం కొట్టివేసింది. రీనోటిఫికేషన్‌పై పిటిషన్ దాఖలు చేసిన అభ్యర్థుల్లో ఒక్కరే కమిషన్‌కు అభ్యంతరం తెలుపుతూ వినతిపత్రం సమర్పించారని పేర్కొంది. పిటిషన్లపై టీజీపీఎస్సీ వినిపించిన వాదనలతో సంతృప్తి చెందినట్టు స్పష్టం చేసింది. కొన్ని అంశాల్లో నిపుణుల అభిప్రాయం తప్పనిసరిగా ఉండాలని..వారి విజ్ఞతను న్యాయస్థానాలు భర్తీ చేయలేవని వ్యాఖ్యానించింది. సాంకేతిక స్వభావమున్న విషయాల్లో నిర్ణయాన్ని నిపుణుల సంస్థలకే వదిలివేయాలని చెప్పింది. గ్రూప్–1 ‘కీ’పై టీజీపీఎస్సీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత న్యాయస్థానం కలుగజేసుకోవడం అవసరం లేదని అభిప్రాయపడింది. ‘1,721 మంది అభ్యర్థులు లేవనెత్తిన 6,417 అభ్యంతరాలను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలించింది. ఇందులో కొందరు పిటిషనర్లు కూడా ఉన్నారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఆధారంగానే తుది కీ ప్రచురించాం. జూలై 7న తుది కీ విడుదల చేసి.. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెలువరించాం. మొత్తం ఖాళీల సంఖ్యకు 1:50 నిష్పత్తిలో 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు’అన్న టీజీపీఎస్సీ వాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తీర్పునిచ్చింది. ‘ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను ప్రచురించే ముందు ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను నిష్పాక్షికంగా పరిగణించాలి. ఆ అభ్యంతరాలపై పూర్తి పరిశీలన జరిగిన తర్వాతే మెరిట్ జాబితా ప్రకటించాలి. కానీ టీజీపీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమ్స్‌పై ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. తప్పుగా వచ్చిన ప్రశ్నలను తొలగించి మళ్లీ మెరిట్ జాబితా ప్రకటించేలా ఆదేశించాలి’అని వికారాబాద్‌కు చెందిన దామోదర్‌రెడ్డితోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీ నోటిఫికేషన్, ఎస్టీ రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ మరికొందరు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టి ఈ నెల 4న తీర్పు రిజర్వు చేశారు. మంగళవారం.. పిటిషన్లు కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. -
గ్రూప్–1 హాల్‌టికెట్లు రెడీ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీ క్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ వెబ్సైట్లో సోమవారం నుంచే హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచామని, మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ ప్రకటించారు. మొదటి పరీక్ష ప్రారంభమయ్యే సమయం వరకు వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 21 నుంచి 27 వరకు ఈ రాత పరీక్షలు (కన్వెన్షియల్/డి్రస్కిప్టివ్ టైప్) జరగనున్నాయి. 563 పోస్టుల కోసం.. 18 రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్–1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జూలైలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్.. గత నెలలో ఫలితాలు విడుదల చేసి, 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 29కు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ చేపట్టడంతో మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ముందే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలి.. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతాయి. హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు.. ముందుగానే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని కమిషన్ సూచించింది. ప్రతి పరీక్షకు 3గంటల సమయం ఉంటుంది. ప్రతి పరీక్షకు గరిష్ట మార్కులు 150. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష మినహా మిగతా ఆరు పరీక్షలకు.. ఇంగ్లి‹Ù, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రాలు ఉంటాయి. అభ్యర్థి ఇష్టానుసారం భాషను ఎంచుకుని జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఆరు పరీక్షలను కూడా ఎంపిక చేసుకున్న ఒకే భాషలో రాయాల్సి ఉంటుంది. ఒక్కో పరీక్షను ఒక్కో భాషలో రాసే అవకాశం లేదు. అలా రాస్తే పరిగణనలోకి తీసుకోరు. జనరల్ ఇంగ్లిష్ పేపర్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దాని మార్కులను ర్యాంకింగ్‌లోకి తీసుకోరు. అభ్యర్థులు అన్ని పరీక్షలు తప్పనిసరిగా రాయాలి. ఏ ఒక్క పరీక్ష రాయకున్నా అనర్హతకు గురవుతారు. అరగంట ముందే పరీక్ష కేంద్రాల మూసివేత మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రాలను మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను అభ్యర్థులను కేంద్రంలోనికి అనుమతించరు. అభ్యర్థి తొలి పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలి. డూప్లికేట్ హాల్‌టికెట్ జారీ చేసే అవకాశం లేదు. ఇక సమయం తెలుసుకునేందుకు వీలుగా పరీక్ష హాళ్లలో గడియారాలను ఏర్పాటు చేస్తారు. హాల్‌టికెట్‌లో పొరపాట్లు, ఇతర సాంకేతిక సమస్యలుంటే కమిషన్ కార్యాలయం పనిదినాల్లో 040–23542185 లేదా 040–23542187 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని.. లేదా హెల్ప్‌డెస్‌్కను ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని టీజీపీఎస్సీ సూచించింది. కాగా గ్రూప్–1 పరీక్షలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం తీర్పు వెలువడనుంది. -
14 నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–1 మెయిన్స్ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్లు ఈ నెల 14 నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయ ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు కమిషన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రాన్ని ముందుగానే సందర్శించాలని కమిషన్ సూచించింది. మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు ప్రతీరోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను కేంద్రంలోనికి అనుమతించరని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తొలి పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలని డూప్లికేట్ హాల్‌టికెట్ జారీ చేసే అవకాశం లేదని పేర్కొంది. సమయం తెలుసుకు నేందుకు వీలుగా పరీక్ష హాల్లో గడియారాలను ఏర్పాటు చేస్తామని కమిషన్ వివరించింది. హాల్‌టికెట్‌లో పొరపాట్లు, ఇతర సమస్యలుంటే కమిషన్ కార్యాలయం పనిదినాల్లో 040– 23542185 లేదా 040–23542187 ఫోన్ నంబర్ల లో, లేదా హెల్ప్‌డెస్క్‌కు ఈ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
TG: ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. ఈనెల 21 నుంచి 27వరకు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహించనుంది.మధ్యాహ్నం 12:30 నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. ఒకటిన్నర తర్వాత పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులకు అనుమతించరు. ఇక ఈ నెల 14 నుంచి వెబ్ సైట్లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. అదే విధంగా పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదు.ఇక గ్రూప్-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. 3.02లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లన్నీ అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాల్సి ఉంటుంది. గ్రూప్-1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉండనున్నాయి. -
తెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ ఇవ్వాళ (గురువారం) విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.డిసెంబర్ 15, 16న గ్రూప్-2 పరీక్షలుఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహణడిసెంబర్ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1డిసెంబర్ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-2డిసెంబర్ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3డిసెంబర్ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-4మొత్తం 783 గ్రూప్- 2 పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకారమైతే.. ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే..డీఎస్సీ, గ్రూప్ -2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో వాయిదా పడ్డాయి. దీంతో గ్రూప్-2 పరీక్షల కొత్త షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించారు. రాష్ట్రంలో గ్రూప్ -2 ఉద్యోగాలకు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. -
TGPSC ప్రక్షాళన చేశాం..
-
నిరుద్యోగులకు సర్కారీ ‘పరీక్ష’!
వారం రోజుల్లో మొదలుకానున్న డీఎస్సీ పరీక్షలు.. అవి ముగిశాక రెండు రోజుల్లోనే గ్రూప్–2 పరీక్షలు.. ప్రిపరేషన్‌కు సమయం సరిపోని పరిస్థితి.. దీంతో డీఎస్సీ పరీక్షల తేదీలను మార్చాలంటూ అభ్యర్థుల ఆందోళనలు.. ఏమాత్రం వెనక్కితగ్గకుండా పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపుతున్న సర్కారు.. ఆందోళనలు చేస్తున్న అభ్యర్థులు, విద్యార్థి సంఘాలపై పోలీసుల లాఠీచార్జీలు.. కాస్త సమయం ఇస్తే బాగుంటుందంటున్న విద్యావేత్తలు.. సమస్యకు పరిష్కారం చూపడం మానేసి లాఠీచార్జీలు ఏమిటంటూ హక్కుల కార్యకర్తల నిలదీతలు.. .. రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో ఆందోళన, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో నెలకొన్న పరిస్థితి ఇది. సర్కారు ఉద్యోగాల భర్తీ హర్షణీయమే అయినా.. నిరుద్యోగుల డిమాండ్లు, విజ్ఞప్తుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్న సూచనలు వస్తున్నాయి.సిలబస్ ఎక్కువ.. సమయం తక్కువ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ బాగా పెరిగింది. మొత్తం 14 సబ్జెక్టులు చదవాలి. కానీ సమయం మాత్రం తక్కువగా ఉంది. రోజుకో సబ్జెక్ట్ పూర్తి చేయడం ఎలా? ఇది ఆందోళన రేపుతోంది. పరీక్ష గడువును కనీసం మూడు నెలలు పొడిగించాలి. – ఐ.సుజిత, డీఎస్సీ అభ్యర్థి, సూర్యాపేట జిల్లాసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్షల (డీఎస్సీ)కు సమయం ముంచుకొస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి సబ్జెక్టుల వారీగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కంప్యూటర్ ఆధారి తంగా పరీక్షలు నిర్వహించనున్న ప్రభుత్వం.. ఆ దిశగా ఆన్లైన్ కేంద్రాలను సైతం ఎంగేజ్ చేసుకుంది. డీఎస్సీ పరీక్షలు ఆగస్టు 5వ తేదీతో పూర్తికానుండగా.. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు జరగనున్నాయి. వరుసగా పరీక్షలు ఉండటంతో అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి ఉంటుందనే వాదన వస్తోంది. సమయం తక్కువగా ఉండటంతో.. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది మార్చిలో నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుల స్వీకరణ మార్చి 4 నుంచి జూన్ 20వ తేదీ వరకు కొనసాగింది. సాధారణంగా పోటీ పరీక్షలకు సిద్ధంకావడానికి కనీసం 45 రోజులు ఉండాలి. కానీ ఉపాధ్యాయ నియామక పరీక్షకు కనీసం నెల రోజుల వ్యవధి కూడా ఇవ్వకుండా పరీక్షల తేదీలు నిర్ణయించడంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గ్రూప్–2 ఉద్యోగాల భర్తీ కోసం 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలైంది. ఆ పరీక్షలు పలుమార్లు వాయిదా పడ్డాయి. తాజా తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ.. ఈసారి పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదంటూ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలు దాదాపు ఒకే సమయంలో జరుగుతుండటంతో.. రెండింటికీ సిద్ధమవుతున్న వారికి ఇబ్బందిగా మారింది. ఆందోళనలకు దిగుతున్న అభ్యర్థులు ప్రిపరేషన్‌కు సమయం తక్కువగా ఉందని.. ఉపాధ్యాయ నియామక పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టెట్ పరీక్ష ఫలితాలను కూడా వారం క్రితమే విడుదల చేశారని.. డీఎస్సీకి ఎలా సిద్ధం కావాలని ప్రశ్నిస్తున్నారు. అయితే మరో వారం రోజుల్లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... వాయిదా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విముఖంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లను వెబ్సైట్లో పెట్టిందని పేర్కొంటున్నాయి. రెండు నెలలు వాయిదా వేయాలి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన నెలలోపే రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామనడం సరికాదు. కనీసం 45 రోజులు సమయం ఇవ్వాలి. తక్కువ సమయంలో పరీక్షలకు ఎలా సిద్ధమవాలో అర్థంకాని పరిస్థితి. ఇది అభ్యర్థులను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టడమే. టీచర్ నియామక పరీక్షలను కనీసం రెండు నెలలు వాయిదా వేస్తే మేలు జరుగుతుంది. – కేశమోని మనోజ్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా (డీఎస్సీ, గ్రూప్–2 పరీక్షల అభ్యర్ధి) పరీక్షలు వాయిదా వేయాలంటే.. పోలీసులతో కొట్టిస్తున్నారు డీఎస్సీ పరీక్షలకు కాస్త సమయం ఇవ్వాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతుంటే స్పందించని సీఎం.. నిరుద్యోగులపై మాత్రం లాఠీచార్జి చేయిస్తున్నారు. ప్రజాపాలన అంటే.. నిరుద్యోగులపై లాఠీచార్జి చేయడం, ఇచి్చన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడమేనా? 25వేల టీచర్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తానన్న సీఎం రేవంత్.. కేవలం 11 వేలకే టీచర్ పోస్టులను పరిమితం చేశారు. పైగా విద్యార్థులకు ప్రిపరేషన్‌కు తగిన సమయం కూడా ఇవ్వకపోవడం సరికాదు – గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు కొంత సమయం ఇస్తే బాగుండేది టెట్ ఫలితాలు వెల్లడించిన తర్వాత కొంత సమయం ఇచ్చి ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహిస్తే బాగుండేది. అలాగాకుండా ముందే షెడ్యూల్ ప్రకటించి, తర్వాత టెట్ ఫలితాలు ఇవ్వడంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకుని సమస్యను పరిష్కరిస్తే అభ్యర్థులకు ఊరట కలుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే జాబ్ కేలండర్ ప్రకటించడానికి సన్నాహాలు చేస్తోంది. గ్రూప్–1 పరీక్షలు సవ్యంగా నిర్వహించిందన్న పేరు వచి్చంది. ఇలాంటి సమయంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. – ప్రొఫెసర్ కోదండరామ్, టీజేఎస్ అధ్యక్షుడు లాఠీచార్జీలు కాదు.. సమస్యను పరిష్కరించాలి రాష్ట్రంలో వివిధ పోటీ పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించి రాజకీయ పారీ్టల అభిప్రాయాలు తీసుకుంటే మంచిది. పదేళ్లపాటు ఉద్యోగాల కోసం వేచి ఉండటంతో నిరుద్యోగ యువతలో ఆతృత, ఆందోళన పెరిగాయి. వరుస పరీక్షల నిర్వహణ షెడ్యూల్, ఇప్పటికే ప్రకటించిన పోటీపరీక్షల రీషెడ్యూల్‌పై టీజీపీఎస్సీ నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంది. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఎవరైనా కోర్టుకు వెళితే.. కోర్టు స్టే ఇస్తే మొత్తం సమస్య మొదటికి వచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వపరంగా స్పందించడమో లేక ఉద్యమిస్తున్న సంఘాల ప్రతినిధులతో చర్చించి సమస్య పరిష్కారానికి నచ్చజెప్పడమో చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా లాఠీచార్జీలు, దాడులకు దిగడం మంచిది కాదు. దీనితో అసలు సమస్య పోయి పోలీసులు దాడులకు దిగారంటూ మరో సమస్య తెరపైకి వస్తోంది. – ప్రొఫెసర్ హరగోపాల్, హక్కుల కార్యకర్త, విద్యావేత్త వెబ్సైట్లో డీఎస్సీ హాల్‌టికెట్లు డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లను గురువారం రాత్రి వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు www. schooledu. telangana. gov. in వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం సుమారు 2.8 లక్షల దరఖాస్తులు వచ్చాయి.