తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-3 పరీక్షల్లో చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ అవార్డ్స్ గురించి ఒక ప్రశ్న రాగా.. ఆస్కార్ అవార్డ్స్ గురించి మరో ప్రశ్న రావడం జరిగింది. నవంబర్ 17,18 తేదీల్లో టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్ష నిర్వహిస్తుంది. అయితే, ఈ ఆదివారం ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు సినిమా పరిశ్రమ నుంచి ఈ క్రింది ప్రశ్నలు రావడం జరిగింది.
1. కింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది ?
A) ముర్ ముర్స్ ఆఫ్ ది జంగల్
B) ఆట్టం
C) బ్రహ్మాస్త్ర
D) కాంతార
2. ఆస్కార్ అవార్డు -2024కు నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ చలనచిత్రం 'టు కిల్ ఎ టైగర్' దర్శకుడు ఎవరు ?
A) ఆర్. మహదేవన్
B) నిఖిల్ మహాజన్
C) కార్తికి గొన్సాల్వ్స్
D) నిషా పహుజా
ఆస్కార్ 2024, 70వ జాతీయ ఆవార్డ్స్ ప్రకటన కొద్దిరోజుల క్రితమే జరిగింది. ఈ రెండు ప్రశ్నలకు చాలామందికి సమాధానం తెలిసే ఉండవచ్చు. ఇందులో మొదటి ప్రశ్నకు సమాధానం 'ముర్ ముర్స్ ఆఫ్ ది జంగల్'. ఇదీ మరాఠీ చిత్రం. రెండో ప్రశ్నకు జవాబు 'నిషా పహుజా'. రంజిత్ అనే రైతు 13 ఏళ్ల కూతురు సామూహిక అత్యాచారానికి గురైన కేసుపై తీసిన సినిమా ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment