Group 3
-
గ్రూప్-3 పరీక్షలో ఆస్కార్, జాతీయ అవార్డ్స్‌పై సినిమా ప్రశ్నలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-3 పరీక్షల్లో చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జాతీయ అవార్డ్స్ గురించి ఒక ప్రశ్న రాగా.. ఆస్కార్ అవార్డ్స్ గురించి మరో ప్రశ్న రావడం జరిగింది. నవంబర్ 17,18 తేదీల్లో టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్ష నిర్వహిస్తుంది. అయితే, ఈ ఆదివారం ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు సినిమా పరిశ్రమ నుంచి ఈ క్రింది ప్రశ్నలు రావడం జరిగింది.1. కింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది ?A) ముర్ ముర్స్ ఆఫ్ ది జంగల్B) ఆట్టంC) బ్రహ్మాస్త్ర D) కాంతార2. ఆస్కార్ అవార్డు -2024కు నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ చలనచిత్రం 'టు కిల్ ఎ టైగర్' దర్శకుడు ఎవరు ?A) ఆర్. మహదేవన్B) నిఖిల్ మహాజన్C) కార్తికి గొన్సాల్వ్స్D) నిషా పహుజాఆస్కార్ 2024, 70వ జాతీయ ఆవార్డ్స్ ప్రకటన కొద్దిరోజుల క్రితమే జరిగింది. ఈ రెండు ప్రశ్నలకు చాలామందికి సమాధానం తెలిసే ఉండవచ్చు. ఇందులో మొదటి ప్రశ్నకు సమాధానం 'ముర్ ముర్స్ ఆఫ్ ది జంగల్'. ఇదీ మరాఠీ చిత్రం. రెండో ప్రశ్నకు జవాబు 'నిషా పహుజా'. రంజిత్ అనే రైతు 13 ఏళ్ల కూతురు సామూహిక అత్యాచారానికి గురైన కేసుపై తీసిన సినిమా ఇది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. -
తెలంగాణలో ప్రారంభమైన గ్రూప్-3 పరీక్షలు
-
TG: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వచ్చేనెల 17న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్ష జరగనుంది. 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్లో ఫస్ట్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. 18న తేదీన పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది. ఇక.. నవంబర్ 10వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
Telangana: గ్రూప్ 1, 2, 3 పరీక్షల షెడ్యూల్ విడుదల
-
Telangana: గ్రూప్ 1, 2, 3 పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ బుధవారం విడుదల అయ్యింది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. అక్టోబర్ 21న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-1లో 563, గ్రూప్-2లో 783, గ్రూప్-3లో 1388 పోస్టుల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి ముఖ్యమైన తేదీలు: అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నవంబర్ 17,18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షల -
అక్టోబర్ రెండో వారంలో గ్రూప్–3 పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–3 పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కసరత్తు ముమ్మరం చేసింది. గతేడాది డిసెంబర్లో గ్రూప్–3 కేటగిరీలో 1,363 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ, ఫిబ్రవరి 23వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,36,477 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ఉద్యోగానికి సగటున 390 మంది పోటీ పడుతున్నారు. తాజాగా ఈ పరీక్షల నిర్వహణపై దృష్టిపెట్టిన కమిషన్.. అక్టోబర్ రెండో వారంలో నిర్వహించాలని భావిస్తోంది. గ్రూప్–1 ప్రిలిమ్స్, గ్రూప్–4 పరీక్షలను పూర్తి చేసిన టీఎస్పీఎస్సీ, గ్రూప్–2 పరీక్షలకు సంబంధించి ఇదివరకే తేదీని ప్రకటించింది. గ్రూప్–3 ఉద్యోగాలకు మూడు దశల్లో అర్హత పరీక్షలుంటాయి. పేపర్–1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, పేపర్–2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్–3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇందులో భాగంగా ఉంటాయి. ఒక్కో పరీక్షను రెండున్నర గంటల పాటు నిర్వహిస్తారు. అలాగే ఒక్కో పరీక్షకు గరిష్టంగా 150 మార్కులుంటాయి. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇతర ఉద్యోగ పరీక్షలకు ఆటంకం లేకుండా గ్రూప్–3 తేదీలను నిర్ణయించే అంశాన్ని కమిషన్ పరిశీలిస్తోంది. ఈ కసరత్తు తర్వాత అతి త్వరలో పరీక్షల తేదీలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులకు సీపీటీలో అర్హత తప్పనిసరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–2, గ్రూప్–3 తదితర క్యాడర్ పోస్టుల నియామక ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ఈ పోస్టులకు నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో విజయం సాధించినవారు తప్పనిసరిగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ)లో కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ శనివారం ఉత్తర్వులు (జీవో నంబర్–26) జారీచేశారు. దీనికి సంబంధించిన అడహక్ నిబంధనలను జీవో నంబర్ 26లో పొందుపరిచారు. సీపీటీ టెస్ట్‌కు సంబంధించిన సిలబస్, రిజర్వేషన్ల వారీగా అర్హత మార్కులను కూడా ఉత్తర్వుల్లో వివరించారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో అర్హత సర్టిఫికెట్ లేకుండా నేరుగా ఏ ఒక్కరికీ ఆయా పోస్టుల్లో నియామకాలకు అవకాశం లేదని స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా, శిక్షణ బోర్డు, లేదా రాష్ట్ర యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, యూజీసీ గుర్తింపు ఉన్న ఇతర సంస్థలు నిర్వహించే ఈ కంప్యూటర్ ప్రొఫెషియన్సీ పరీక్షలో అర్హత సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష 100 మార్కులకు ఉంటుందని, పరీక్ష సమయం 60 నిమిషాలని వివరించారు. ఈ పరీక్షలో అర్హత కోసం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 30 మార్కులు, బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాలని తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్, పరీక్ష ప్యాట్రన్‌ను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. -
గ్రూప్–3లో 1,365 కొలువులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్–3 కేడర్‌కు సంబంధించిన ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడింది. 26 ప్రభుత్వ విభాగాల్లో 1,365 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియ జనవరి 24 నుంచి ప్రారంభం కానుంది. నెలపాటు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తూ ఫిబ్రవరి 23ను గడువుగా నిర్దేశించింది. ప్రస్తుతం వెబ్‌నోట్ ద్వారా గ్రూప్–3 ఖాళీల వివరాలను ప్రకటించిన టీఎస్పీఎస్సీ... జనవరి 24న పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. తాజాగా జారీ చేసిన ప్రకటన ప్రకారం మొత్తం 1,365 ఉద్యోగ ఖాళీలుండగా... ఇందులో సగానికిపైగా ఆర్థిక శాఖలకు సంబంధించిన ఉద్యోగాలే ఉన్నా యి. డిసెంబర్ ఒకటిన గ్రూప్–4 ప్రకటన జారీ చేసిన టీఎస్పీఎస్సీ వరుసగా నెలాఖరు నాటికి గ్రూప్–2, గ్రూప్–3 ప్రకటనలు జారీ చేసి రికార్డు సృష్టించింది. కొత్త కేడర్ల చేరికతో... రాష్ట్ర ప్రభుత్వం పలు ఉద్యోగాలకు గ్రూప్–2, గ్రూప్–3 హోదా ఇచ్చింది. ఈ క్రమంలో పలు కేడర్లు గ్రూప్–2, గ్రూప్–3లోకి చేరడంతో పోస్టుల సంఖ్య కూడా పెరిగింది. గ్రూప్–3 కేటగిరీలో భర్తీకానున్న పోస్టుల్లో సీనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ ఆడిటర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. అత్యధికంగా ఆర్థికశాఖ పరిధిలో 712 పోస్టు లుండగా అందులో పే అండ్ అకౌంట్స్ హెచ్ఓడీలో 126 సీనియర్ అకౌంటెంట్, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ హెచ్ఓడీలో 140, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ (జోనల్) హెచ్ఓడీలో 248, స్టేట్ ఆడిట్ హెచ్ఓడీలో 61 సీనియర్ అకౌంటెంట్ పోస్టులున్నాయి. గ్రూప్-3 జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? మీకోసం సాక్షి ఎడ్యుకేషన్.. క్లిక్ చేయండి -
కొలువుల శిక్షణ గందరగోళం! పేరుకే ఉచితం.. తీరు అనుచితం..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అర్హత పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఇస్తున్న ఉచిత శిక్షణ దారితప్పింది. గ్రూప్–3, గ్రూప్–4 కొలువులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మూడు నెలల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలు లోపభూయిష్టంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల స్టడీ సెంటర్లు తెరిచి గ్రూప్–3, గ్రూప్–4 అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించిన బీసీ స్టడీ సర్కిల్ ప్రైవేటు శిక్షణ సంస్థలను ఎంపిక చేసి తరగతుల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ఒక్కో అభ్యర్థికి సగటున రూ.5500 చొప్పున ఫీజు నిర్దేశిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 50 శిక్షణ తరగతులకు ప్రైవేటు సెంటర్లను ఎంపిక చేసి సెప్టెంబర్ 15 నుంచి తరగతులను ప్రారంభించింది. మూడు నెలల పాటు కొనసాగించాల్సిన ఈ శిక్షణ తరగతులు పలుచోట్ల నామమాత్రంగా సాగగా... కొన్నిచోట్ల అర్ధంతరంగా నిలిచిపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో పడ్డారు. ఎంపిక ప్రక్రియలో నిబంధనలు గాలికి... రాష్ట్రవ్యాప్తంగా 50 చోట్ల తెరిచిన సెంటర్లకు ఏడు సంస్థలను బీసీ స్టడీ సర్కిల్ ఎంపిక చేసింది. ఇందులో ఒక సంస్థకు ఏకంగా 20 సెంటర్ల బాధ్యతలు అప్పగించగా... మిగతా 30 సెంటర్ల నిర్వహణను మిగిలిన ఆరు సంస్థలకు అప్పగించినట్లు సమాచారం. సాధారణంగా ఒక సంస్థను ఎంపిక చేసేటప్పుడు ఆ సంస్థ నేపథ్యం, అనుభవం, సామర్ధ్యం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణ అంశంలో నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా కేటాయింపు జరిగినట్లు ఆరోపణలున్నాయి. అడ్డగోలుగా అభ్యర్థుల పెంపు... ఒక్కో బీసీ స్టడీ సెంటర్లో గ్రూప్–3, గ్రూప్–4 శిక్షణ తరగతుల కోసం వంద మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలని బీసీ స్టడీ సర్కిల్ నిర్ణయించింది. మొత్తంగా 5వేల మందికి శిక్షణ ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని సెప్టెంబర్ 15 నాటికి తరగతులు ప్రారంభించి డిసెంబర్ 15కల్లా ముగించేలా కార్యాచరణ రూపొందించింది. కానీ చాలా కేంద్రాల్లో నిర్దేశించిన అభ్యర్థుల సంఖ్య కంటే సగం, అంతకంటే తక్కువ సంఖ్యలో అభ్యర్థులు నమోదయ్యారు. దీంతో గిట్టుబాటు కాదనుకున్న ప్రైవేటు సంస్థలు అధికారులపై ఒత్తిడి తెచ్చి అభ్యర్థుల సంఖ్య పెంపునకు అవకాశం కోరగా... తరగతులు ప్రారంభమైన నెలరోజుల తర్వాత అవకాశం కల్పిస్తూ బీసీ స్టడీ సర్కిల్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ స్టడీ సెంటర్లుగా ఎంపిక చేసిన భవనాలన్నీ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీలు, గురుకుల విద్యా సంస్థలే కావడంతో... ఏకంగా డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న అభ్యర్థులను సైతం చేర్చుకునే వెసులుబాటు కల్పించారు. వాస్తవానికి గ్రూప్–3, గ్రూప్–4 ఉద్యోగ ప్రకటన విడుదలయ్యే నాటికి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గ్రూప్–4 నోటిఫికేషన్ విడుదల కాగా, గ్రూప్–3 ప్రకటన అతి త్వరలో వెలువడనుంది. ఈ క్రమంలో డిగ్రీ ఫైనలియర్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం ప్రయోజనకరం కాకున్నా అవకాశం కల్పించడం వివాదాలకు తావిస్తోంది. సెంటర్ల నిర్వహణపై ఫిర్యాదుల వెల్లువ... బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై పలుచోట్ల అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అడ్డగోలు నిర్వహణతో విలువైన సమయాన్ని వృథా చేశారంటూ అభ్యర్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. కామారెడ్డి, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల్లోని బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై అభ్యర్థులు ఏకంగా జిల్లా కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేశారు. వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లోని కూడా స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేశారు. సంబంధిత జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారులకు తనిఖీ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. ఇరవై రోజుల్లో మూసేశారు... బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ అంటే మరో ఆలోచన లేకుండా అడ్మిషన్ తీసుకున్నాను. కానీ కేవలం ఇరవై రోజుల్లో స్టడీ సెంటర్‌ను మూసేశారు. 25 శాతం సిలబస్ కూడా పూర్తి చేయలేదు. మరోవైపు గ్రూప్–4 నోటిఫికేషన్ రాగా, గ్రూప్–3 ప్రకటన అతి త్వరలో వస్తుందని సమాచారం. ఇంతటి కీలక సమయంలో సెంటర్ మూసివేయడంతో మరో చోట కోచింగ్‌కు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వకపోవడంతో ఎలా సన్నద్ధం కావాలో అర్థం కావడం లేదు. వెంటనే స్టడీ సెంటర్‌ను తెరిచి శిక్షణ తరగతులు నిర్వహించాలి. – ప్రసాద్, వికారాబాద్ బీసీ స్టడీ సర్కిల్ అభ్యర్థి నిరుద్యోగుల జీవితాలతో ఆటలా... ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అనడంతో ఎంతో నమ్మకంతో వేలాది మంది నిరుద్యోగులు బీసీ స్టడీ సెంటర్లలో శిక్షణ తరగతులకు హాజరయ్యారు. కానీ ఎలాంటి ప్రమాణాలను పాటించకుండా ప్రైవేటు సంస్థలకు శిక్షణ బాధ్యతలు అప్పగించడం... పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించకుండా మధ్యలోనే చేతులెత్తేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇందుకు బాధ్యులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలి. – ముత్తినేని వీరయ్య, చైర్మన్, టీపీసీసీ వికలాంగుల విభాగం నిబంధనల ప్రకారమే కాంట్రాక్టు బాధ్యతలు నిబంధనల ప్రకారమే శిక్షణ సంస్థలకు బాధ్యతలు అప్పగించాం. స్టడీ సెంటర్ నిర్వహణ, వసతులన్నీ బీసీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టగా... ఫ్యాకల్టీ, మాక్ టెస్టులు మాత్రం ప్రైవేటు కేంద్రానికి అప్పగించాం. తక్కువ కాల వ్యవధి శిక్షణ కోసం ప్రత్యేకంగా ఫ్యాకల్టీని ఎంపిక చేసి వారికి వేతనాలు ఇవ్వడం పెద్ద ప్రక్రియ. అలా కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. – అలోక్ కుమార్, డైరెక్టర్, బీసీ స్టడీ సర్కిల్ -
ప్రిలిమ్స్‌కు స్వస్తి: ఏపీపీఎస్సీ కీలక ప్రతిపాదన
సాక్షి, అమరావతి: గ్రూప్ -1 పోస్టుల్లో మినహా మిగతా క్యాడర్ పోస్టుల భర్తీ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. ఇతర క్యాడర్ పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షల విధానాన్ని రద్దు చేయాలని యోచిస్తోంది. గ్రూప్ – 1 సహా అన్ని కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రస్తుతం తొలుత ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టు చేపట్టి అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై గ్రూప్ – 2, గ్రూప్ – 3 సహా ఇతర క్యాడర్ పోస్టులకు ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని కమిషన్ తలపోస్తోంది. కేవలం ఒక పరీక్షనే నిర్వహించి మెరిట్ అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు కమిషన్ వర్గాలు వివరించాయి. ఒత్తిడి నుంచి అభ్యర్థులకు ఊరట... ప్రిలిమ్స్ నిర్వహణతో అభ్యర్థులు ఆర్థిక భారం, వ్యయప్రయాసలకు గురవుతుండగా కోచింగ్ పేరిట కొన్ని సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. గతంలో గ్రూప్–1 పోస్టులకే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల విధానం ఉండేది. గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులకు ఒక పరీక్ష ద్వారానే ఎంపికలు జరిగేవి. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక తమ వారి కోచింగ్ సెంటర్లకు మేలు జరిగేలా పోస్టుల భర్తీ విధానాన్ని మార్చింది. గ్రూప్ –1 సహా అన్ని పోస్టులకూ ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టు నిర్వహించేలా ఉత్తర్వులిచ్చింది. దీనివల్ల అభ్యర్థులు పరీక్షల సన్నద్దత కోసం ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చేది. కోచింగ్ కేంద్రాల దోపిడీకి చెక్‌పెట్టేలా ఏపీపీఎస్సీ సమూల మార్పులపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రిలిమ్స్/ స్క్రీనింగ్ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. తద్వారా అభ్యర్థులకు మేలు జరగడంతోపాటు కోచింగ్ సెంటర్ల దందాకు అడ్డుకట్ట పడుతుందని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
గ్రూప్ 3 మెయిన్స్ ఆగస్టు 6న
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 1,055 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి గ్రూప్ 3 మెయిన్స్ పరీక్షను ఆగస్టు 6వ తేదీన నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. గ్రూప్ 3 ప్రిలిమ్స్‌ను గతనెల 23న నిర్వహించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షను జూలై 16న నిర్వహించాల్సి ఉంది. అయితే గ్రూప్ 2 మెయిన్స్‌పై వివాదం తలెత్తి దాన్ని జూలై 15, 16 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూలై 16న నిర్వహించాల్సిన గ్రూప్ 3లోని పంచాయతీ కార్యదర్శుల పోస్టుల పరీక్షను జూలై 30కి వాయిదా వేసింది. అయితే జూలై 30న ఏపీ సెట్ ఉండడంతో గ్రూప్3ని మరోరోజు నిర్వహించాలని పలువురు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. దీంతో గ్రూప్ 3 మెయిన్స్‌ను ఆగస్టు 6న నిర్వహించాలని నిర్ణయించింది. -
గ్రూపు–3కి పక్కా ఏర్పాట్లు
⇒ జిల్లాలో 172 కేంద్రాలు, 66,914 మంది అభ్యర్థులు ⇒ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ⇒ అధికారులతో సమీక్షలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు): గ్రూపు–3 పంచాయతీ కార్యదర్శి పరీక్షకు పక్కా ఏర్పా ట్లు చేశామని కలెక్టర్ ప్రవీణ్ కుమర్ చెప్పారు. పరీక్ష సంబంధించి ఏర్పాట్లపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆది వారం ఉదయం 10 గంటల నుం చి 12.30 గంటల వరకు జరగనున్న పరీక్షకు జిల్లాలో మొత్తం 172 కేంద్రాలను ఏ ర్పాటు చేశామన్నారు. మొత్తం 66,914 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. దీనికోసం జిల్లాను 65 రూట్లుగా విభజించామని వీటికి సమన్వయాధి కారిగా జిల్లా రెవెన్యూ అధికారి, సహాయ సమన్వయాధికారులు గా రెవెన్యూ డివిజనల్ అధికారులు వ్యవహరి స్తారన్నారు. రెండు మూడు పరీక్ష కేంద్రాలకు ఒక లైజన్ అధికారిని నియమించామని, వీరు ఫ్లయింగ్ స్క్వాడ్‌గానూ, సహాయ లైజన్ అధి కారులు సిటింగ్ స్క్వాడ్‌గానూ వ్యవహిరిస్తారన్నారు. పరీక్షల పర్యవేక్షక అధికారులుగా సీనియర్ ఉపకలెక్టర్లను నియమించా మని వెల్లడించారు. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్.. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు. తాగునీరు, లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని జీవీఎంసీ అధికారులకు చెప్పారు. ఆర్టీసీ బస్సులను సరిపడే నడపలని అధికారులు ఆదేశించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పకడ్భందీగా పరీక్ష నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
గ్రూప్-3 సిలబస్ విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-3 కింద పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ కోసం స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ పరీక్షల సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ పోస్టులకు 25 వేలకు పైగా దరఖాస్తులు అందే అవకాశమున్నందున స్క్రీనింగ్ టెస్టును నిర్వహిస్తారు. అర్హులను మెరుున్ నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్టు 150 ప్రశ్నలతో 150 మార్కులకు ఉండనుంది. ఓఎమ్మార్ పత్రాలతో నిర్వహించే ఈ పరీక్షకు రెండున్నర గంటల సమయమివ్వనున్నారు. మెయిన్‌ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున 300 మార్కులతో ఉంటుంది. ఒక్కో పేపర్లో 150 ప్రశ్నలకు గాను 150 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. పేపర్-1లో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీస్‌పై ప్రశ్నలుంటాయి. పేపర్-2లో గ్రామీణాభివృద్ధి, గ్రామీణప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలు ముఖ్యంగా ఏపీలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉంటారుు. గ్రూప్-3 సిలబస్‌ను ఏపీపీఎస్సీ వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎస్సీ.జీఓవీ.ఐఎన్)లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి వైవీఎస్టీ సాయి వివరించారు. (గ్రూప్-3 స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ సిలబస్ వివరాలు సాక్షి భవితలో ) -
2011 గ్రూప్1 ముగిశాకే కొత్త నోటిఫికేషన్
• ముందుగా గ్రూప్ 3, 2 పోస్టులకు పరీక్షలు • గత నోటిఫికేషన్లలో మిగిలిపోయిన పోస్టుల సంఖ్యపై • ఏపీపీఎస్సీ దృష్టి సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ 3, గ్రూప్ 2 పోస్టులకు ముందుగా నోటిఫికేషన్లు జారీచేయాలని, ఆ తర్వాత గ్రూప్ 1 పోస్టులను భర్తీచేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) భావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2011 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సి ఉన్నందున ఆ ప్రక్రియ ముగిసిన పిదపే కొత్తగా గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయాలని కమిషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏపీపీఎస్సీకి ప్రభుత్వం అనుమతిచ్చిన 4,009 పోస్టుల్లో గ్రూప్ 1 పోస్టులు 94 మాత్రమే ఉన్నాయి. తక్కిన పోస్టులన్నీ గ్రూప్ 2, 3 కేటగిరీలోనివే. 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్లో పోస్టులు 312 కాగా అందులో ఏపీ కోటా కిందకు 173 వచ్చాయి. గ్రూప్ 1 పోస్టులపై కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం కన్నా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పాత నోటిఫికేషన్లలో మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేస్తారు. అందులో ఏవైనా మిగిలిన వాటిని కలుపుకొని కొత్త నోటిఫికేషన్ జారీచేయనున్నారు. ఇదే విధంగా ఏపీపీఎస్సీ ద్వారా 4,009 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. వీటితో పా టు గత నోటిఫికేషన్లలో భర్తీకాకుండా మిగిలి పోయిన పోస్టులను కూడా ప్రస్తుత నోటిఫికేషన్లలో చేర్చాలని కమిషన్ భావిస్తోంది.