గ్రూప్‌ 3 మెయిన్స్‌ ఆగస్టు 6న | APPSC Group 3 mains on august 6th | Sakshi
Sakshi News home page

గ్రూప్‌ 3 మెయిన్స్‌ ఆగస్టు 6న

Published Fri, May 12 2017 9:31 AM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

గ్రూప్‌ 3 మెయిన్స్‌ ఆగస్టు 6న

గ్రూప్‌ 3 మెయిన్స్‌ ఆగస్టు 6న

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 1,055 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి గ్రూప్‌ 3 మెయిన్స్‌ పరీక్షను ఆగస్టు 6వ తేదీన నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్ణయించింది. గ్రూప్‌ 3 ప్రిలిమ్స్‌ను గతనెల 23న నిర్వహించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం మెయిన్స్‌ పరీక్షను జూలై 16న నిర్వహించాల్సి ఉంది.

అయితే గ్రూప్‌ 2 మెయిన్స్‌పై వివాదం తలెత్తి దాన్ని జూలై 15, 16 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూలై 16న నిర్వహించాల్సిన గ్రూప్‌ 3లోని పంచాయతీ కార్యదర్శుల పోస్టుల పరీక్షను జూలై 30కి వాయిదా వేసింది. అయితే జూలై 30న ఏపీ సెట్‌ ఉండడంతో గ్రూప్‌3ని మరోరోజు నిర్వహించాలని పలువురు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. దీంతో గ్రూప్‌ 3 మెయిన్స్‌ను ఆగస్టు 6న నిర్వహించాలని నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement