![గ్రూపు–3కి పక్కా ఏర్పాట్లు](/styles/webp/s3/article_images/2017/09/5/71492811931_625x300.jpg.webp?itok=8azL3WKM)
గ్రూపు–3కి పక్కా ఏర్పాట్లు
⇒ జిల్లాలో 172 కేంద్రాలు, 66,914 మంది అభ్యర్థులు
⇒ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
⇒ అధికారులతో సమీక్షలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్
బీచ్‌రోడ్ (విశాఖ తూర్పు): గ్రూపు–3 పంచాయతీ కార్యదర్శి పరీక్షకు పక్కా ఏర్పా ట్లు చేశామని కలెక్టర్ ప్రవీణ్ కుమర్ చెప్పారు. పరీక్ష సంబంధించి ఏర్పాట్లపై జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆది వారం ఉదయం 10 గంటల నుం చి 12.30 గంటల వరకు జరగనున్న పరీక్షకు జిల్లాలో మొత్తం 172 కేంద్రాలను ఏ ర్పాటు చేశామన్నారు.
మొత్తం 66,914 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. దీనికోసం జిల్లాను 65 రూట్లుగా విభజించామని వీటికి సమన్వయాధి కారిగా జిల్లా రెవెన్యూ అధికారి, సహాయ సమన్వయాధికారులు గా రెవెన్యూ డివిజనల్ అధికారులు వ్యవహరి స్తారన్నారు. రెండు మూడు పరీక్ష కేంద్రాలకు ఒక లైజన్ అధికారిని నియమించామని, వీరు ఫ్లయింగ్ స్క్వాడ్‌గానూ, సహాయ లైజన్ అధి కారులు సిటింగ్ స్క్వాడ్‌గానూ వ్యవహిరిస్తారన్నారు. పరీక్షల పర్యవేక్షక అధికారులుగా సీనియర్ ఉపకలెక్టర్లను నియమించా మని వెల్లడించారు. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు.
కేంద్రాల వద్ద 144 సెక్షన్..
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు. తాగునీరు, లేదా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని జీవీఎంసీ అధికారులకు చెప్పారు. ఆర్టీసీ బస్సులను సరిపడే నడపలని అధికారులు ఆదేశించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా పకడ్భందీగా పరీక్ష నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.