సాక్షి, హైదరాబాద్: గ్రూప్-3 కింద పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ కోసం స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ పరీక్షల సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ పోస్టులకు 25 వేలకు పైగా దరఖాస్తులు అందే అవకాశమున్నందున స్క్రీనింగ్ టెస్టును నిర్వహిస్తారు. అర్హులను మెరుున్ నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్టు 150 ప్రశ్నలతో 150 మార్కులకు ఉండనుంది. ఓఎమ్మార్ పత్రాలతో నిర్వహించే ఈ పరీక్షకు రెండున్నర గంటల సమయమివ్వనున్నారు.
మెయిన్‌ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున 300 మార్కులతో ఉంటుంది. ఒక్కో పేపర్‌లో 150 ప్రశ్నలకు గాను 150 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. పేపర్-1లో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీస్‌పై ప్రశ్నలుంటాయి. పేపర్-2లో గ్రామీణాభివృద్ధి, గ్రామీణప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలు ముఖ్యంగా ఏపీలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉంటారుు. గ్రూప్-3 సిలబస్‌ను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎస్‌సీ.జీఓవీ.ఐఎన్)లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి వైవీఎస్‌టీ సాయి వివరించారు. (గ్రూప్-3 స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ సిలబస్ వివరాలు సాక్షి భవితలో )
గ్రూప్-3 సిలబస్ విడుదల
Published Sat, Nov 19 2016 1:48 AM | Last Updated on Mon, Sep 4 2017 8:27 PM
Advertisement
Advertisement