Andhra Pradesh Public Service Commission
-
గ్రూపు–1 ఫలితాల్లో కడప యువకుడి సత్తా
కడప : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూపు–1 ఫలితాల్లో కడప ఎర్రముక్కపల్లెకు చెందిన యువకుడు భార్గవ్ సత్తాచాటి జిల్లా రిజిస్టార్ కొలువును సాధించారు. ఇతని తల్లిదండ్రులు సూర్యుడు, ఆదిలక్ష్మిలది పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లె గ్రామం. అయితే ఇతని తండ్రి ఉద్యోగరీత్యా కడపలో స్థిరపడ్డారు. భార్గవ్ 1 నుంచి 10వ తరగతి వరకు ఎక్కముక్కపల్లెలోని బాలవికాస్ స్కూల్లో చదివారు. ఇంటర్ హైదరాబాదులోని శ్రీచైతన్యలో చదివాడు. ఇంజినీరింగ్‌ను కడపలోని కేఎస్‌ఆర్‌ఎంలో పూర్తి చేశారు. హైదరాబాదులో శాప్ కన్సెల్టెంట్‌గా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేçస్తున్నాడు. 2018లో గ్రూపు–1 పరీక్షకు సిద్ధం అయ్యారు. ప్రిలిమనరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి ఇటీవల వెలువడిన ఫలితాల్లో జిల్లా రిజిస్ట్రార్ పోస్టుకు ఎంపికయ్యారు. భవిషత్తులో ఐఏఎస్ సాధించడమే లక్ష్యమని భార్గవ్ చెప్పారు. యువత పట్టుదలతో కృషి చేస్తే గ్రూపు–1, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించవచ్చని తెలిపారు. -
ఏపీపీఎస్సీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్
-
ఫిబ్రవరిలో గ్రూప్ 1 ఫలితాలు
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్స్–2018 ఫలితాలను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాలను మాన్యువల్‌గా పునర్ మూల్యాంకనం చేయించి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ పరీక్ష సమాధాన పత్రాలను ఇంతకుముందు డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేయించి ఫలితాలు విడుదల చేశారు. 2018 గ్రూప్–1 మెయిన్స్ డిజిటల్ మూల్యాంకనం గురించి ముందుగా నోటిఫికేషన్లో పేర్కొనకపోవడంతో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈసారి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. వాస్తవానికి 2018 గ్రూప్–1 మెయిన్స్‌కు డిజిటల్ మూల్యాంకనం చేపడుతున్న విషయాన్ని నోటిఫికేషన్లో పేర్కొనకున్నా పరీక్షలకు ముందునుంచే అభ్యర్థులకు కమిషన్ వెబ్సైట్ ద్వారా, మీడియా ద్వారా తెలియచేస్తూ వచ్చింది. అప్పట్లో అభ్యర్థులెవరి నుంచీ వ్యతిరేకత రాకపోగా అంతా స్వాగతించారు. అయితే ఫలితాలు విడుదల చేశాక ఎంపిక కాని కొందరు అభ్యర్ధులు పలు సందేహాలు, అనుమానాలతో డిజిటల్ మూల్యాంకనాన్ని తప్పుబడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే అభ్యర్థుల అనుమానాలను, సందేహాలను కోర్టు ఆమోదించలేదు. కేవలం మూల్యాంకన విధానం సరైన రీతిలో అమలు చేయనందున ఈసారికి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లే అవకాశమున్నా మరింత జాప్యం అయ్యే ఆస్కారం ఉండటం, ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో అప్పీల్‌కు వెళితే మరో రెండేళ్లు సమయం వృథా అవుతుందని భావించిన ఏపీపీఎస్సీ మాన్యువల్ మూల్యాంకనానికే మొగ్గు చూపింది. మూల్యాంకనాన్ని త్వరితంగా ముగించి ఫిబ్రవరి నెలలో ఫలితాలను విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ‘సాక్షి’కి చెప్పారు. యువత, నిరుద్యోగ సంఘాలతో భేటీ ఇలా ఉండగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ చేపడుతున్న విధానాలు, కొత్తగా చేపట్టబోయే సంస్కరణలు, ఇతర అంశాలపై యువత, నిరుద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. సంక్రాంతి తరువాత ఈ సమావేశం నిర్వహించనున్నారు. గతంలో ఏపీపీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు, నిరుద్యోగ యువత, సంఘాలతో సమావేశం నిర్వహించారు. అందరినుంచి అభిప్రాయాలు సేకరించారు. అయితే ఈ సమావేశంలో ఒకేసారి అందరినీ అనుమతించడంతో ఎవరేం చెబుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఈ అనుభవంతో ఈసారి ఏపీపీఎస్సీ కార్యాలయంలోనే సమావేశాన్ని ఏర్పాటుచేసి ఆయా సంఘాలను, అభ్యర్థులను ఆహ్వానించి బృందాల వారీగా అభిప్రాయాలు తీసుకోవాలని కమిషన్ భావిస్తోంది. -
ఏపీపీఎస్సీ సమాచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు కేటగిరీ నోటిఫికేషన్ల పరీక్షల్లో అర్హత సాధించిన, పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో విడుదల చేశారు. ► ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రయిబల్ వెల్ఫేర్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులకు ప్రొవిజనల్ సెలెక్టెడ్ జాబితాను కమిషన్ ప్రకటించింది. దీన్ని కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు పేర్కొంది. డిగ్రీ కాలేజీ లెక్చరర్లు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ సబ్జెక్టుల పోస్టులకు ఎంపికైన వారి ప్రొవిజనల్ సెలెక్టెడ్ జాబితాను కమిషన్ బుధవారం విడుదల చేసి.. కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. మైన్స్ అండ్ జియాలజీ మైన్స్ అండ్ జియాలజీ విభాగంలోని టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 27న పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఈ పరిశీలన జరగనుంది. అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ నుంచి మెమో, చెక్‌లిస్ట్, అటెస్టేషన్ ఫారాలు, నాన్ క్రిమీలేయర్ ప్రొఫార్మా(బీసీ అభ్యర్థులు) డౌన్లోడ్ చేసుకోవాలి. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో వాటిని కమిషన్‌కు అందించాలి. ఆగస్టు 6 నుంచి డిపార్టుమెంటల్ టెస్ట్ డిపార్టుమెంటల్ టెస్ట్‌ను ఆగస్టు 6వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. ఆగస్ట్ 28న రిమ్స్ ఎంట్రన్స్ టెస్ట్ రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీలో 8వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్షను ఆగస్ట్ 28న నిర్వహిస్తున్నట్టు కమిషన్ వివరించింది. మేథమెటిక్స్, జనరల్ నాలెడ్జి, ఇంగ్లీషు సబ్జెక్టులకు సంబంధించి సెషన్లలో పరీక్ష జరగనుంది. -
APPSC: ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వోద్యోగాల భర్తీలో నిరుద్యోగ విద్యావంతులకు మేలు చేకూర్చేలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం శనివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ ద్వారా భర్తీచేసే అన్ని కేటగిరీల పోస్టులకూ ఇంటర్వ్యూలు నిర్వహించే విధానానికి స్వస్తి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ జీఓ 58ను జారీచేశారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకతకు పెద్దపీట వేయడం.. పోటీ పరీక్షల ప్రక్రియపై అభ్యర్థులకు నమ్మకం కలిగేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి సదరు ఆదేశాలు అమల్లోకి వస్తాయని జీఓలో పేర్కొన్నారు. దీంతో ఇక నుంచి ఏపీపీఎస్సీ రాత పరీక్షల్లో మెరిట్ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీపీఎస్సీలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కమిషన్ కోల్పోయిన ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టేలా, సంస్థపట్ల నిరుద్యోగుల్లో నమ్మకం పెరిగేలా అనేక చర్యలు తీసుకున్నారు. ఇంటర్వ్యూల పేరిట జరిగిన అక్రమాలకు చెక్ పెట్టేలా.. నిజానికి.. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన పోస్టుల భర్తీలో అనేక అవకతవకలు చోటుచేసుకోవడంతో అర్హులైన నిరుద్యోగ విద్యావంతులు ఎంతో నష్టపోయారు. ఇంటర్వ్యూల మాటున గత పాలకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ఏ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగినా ఆ బోర్డు చైర్మన్‌గా ఏపీపీఎస్సీ చైర్మనే వ్యవహరించేలా చేశారు. తద్వారా తమకు నచ్చిన వారికి పోస్టులు కట్టబెట్టేలా అప్పటి పాలకులు వ్యవహరించారు. దీనివల్ల అర్హులైన వారికి తీరని అన్యాయం జరగడంతో పాటు కమిషన్ విశ్వసనీయత దెబ్బతింది. తాజాగా.. గ్రూప్1–2018 ఇంటర్వ్యూలకు ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చింది. ఇంటర్యూలకు ఒకటికి మించి బోర్డులు ఏర్పాటుచేయడంతో పాటు వాటిలోని సభ్యుల నుంచే ఒకరు చైర్మన్‌గా వ్యవహరించేలా చేసింది. తాము ఏ బోర్డులో ఉన్నామో చివరి నిమిషం వరకు కూడా సభ్యులకు కూడా ముందుగా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు తమ ఇంటర్వ్యూ రోజున కమిషన్ కార్యాలయానికి వచ్చి అక్కడ డబ్బాల్లో ఉన్న చిట్టీల నుంచి ఒకదాన్ని తీసుకుని అందులో ఏ బోర్డు నెంబర్ రాసి ఉంటే అక్కడికి ఇంటర్వ్యూకు వెళ్లేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు జీఓ–58 ద్వారా అన్ని కేటగిరీల పోస్టులకూ ఇంటర్వ్యూ విధానాన్నే రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోవడంతో నిరుద్యోగ విద్యావంతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. గతంలో ఇంటర్వ్యూల పేరుతో అనేక అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాత పరీక్షల్లో మెరిట్ సాధించే అభ్యర్థులకు పోస్టులు దక్కుతాయని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపిక గత ప్రభుత్వం గ్రూప్–1తో పాటు అన్ని కేటగిరీల పోస్టులకూ ప్రిలిమ్స్, మెయిన్స్‌ను తప్పనిసరి చేసింది. అంతకుముందు.. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా దాన్ని టీడీపీ సర్కారు రద్దుచేసి 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేసేలా ఏపీపీఎస్సీకి అధికారం ఇచ్చింది. దీనివల్ల వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయారు. పాత విధానాన్ని కొనసాగించాలని నిరుద్యోగులు ఎన్ని ఆందోళనలు చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధానాన్ని మార్చి నిరుద్యోగులకు మేలు చేసేలా 1:50 నిష్పత్తిని తిరిగి ప్రవేశపెట్టించారు. గ్రూప్–1 మెయిన్స్‌లో ట్యాబ్ ఆధారిత ప్రశ్నపత్రాల ద్వారా పరీక్షలు నిర్వహించారు. దీనివల్ల అభ్యర్థులందరికీ ఒకేసారి ప్రశ్నపత్రం అందడంతో పాటు లీకేజీ వంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా చేశారు. ఇదేకాక.. ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో గత ప్రభుత్వం నెగిటివ్ మార్కులు పెట్టింది. పదోన్నతులు, ఇతర ప్రయోజనాల కోసం ఈ పరీక్షలు రాసే ఉద్యోగులు దీనివల్ల నష్టపోయారు. వీటిని రద్దుచేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోకి రాగానే నెగిటివ్ మార్కులను రద్దుచేసింది. రాత పరీక్షల్లోనూ గతంలో అక్రమాలు ఇంటర్వ్యూల్లోనే కాదు.. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలలో కూడా అనేక లోపాలతో పరీక్షల ప్రక్రియను టీడీపీ పాలకులు అస్తవ్యస్థం చేశారు. గతంలో జరిగిన గ్రూప్2–2018 ప్రిలిమ్స్‌లో ఏకంగా పరీక్ష ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే స్క్రీన్ షాట్లు బయటకు రావడంతో గందరగోళం నెలకొంది. విశాఖపట్నం, తదితర పరీక్ష కేంద్రాల్లో అక్రమాలకు తెరలేపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో వీటిని నిలదీసిన వందలాది మంది నిరుద్యోగ అభ్యర్థులను పరీక్షల నుంచి తప్పించడంతో పాటు ఏకంగా కేసులు కూడా పెట్టించారు. గ్రూప్–1లో ఏకంగా 51 తప్పులు చోటుచేసుకోవడంతో ఆ పరీక్షలు న్యాయ వివాదాల మధ్య గందరగోళంలో పడ్డాయి. అలాగే, గ్రూప్–1 పోస్టులతో పాటు డిగ్రీ కాలేజీ లెక్చరర్ తదితర పోస్టులకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో భారీగా గోల్మాల్ జరిగింది. రాతపరీక్షల్లో మెరిట్లో ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులు వేసి తమకు కావలసిన వారికి, డబ్బులు ముట్టచెప్పిన వారికి అత్యధిక మార్కులు వేసి పోస్టులు కట్టబెట్టారన్న విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. ఇలా గతంలో జరిగిన అక్రమాలెన్నెన్నో. -
సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం
సాక్షి, అమరావతి: పారదర్శక విధానాలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే పరీక్షల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దుచేయాలని నిర్ణయించారు. రాత పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ ఆధారంగా అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ గురువారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూ విధానాలపై చర్చించారు. ఫలితాల వెల్లడికి సంబంధించి అవినీతి, అక్రమాలపై ప్రతి సందర్భంలో ఆరోపణలు వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఏపీపీఎస్సీ జారీ చేస్తున్న నోటిఫికేషన్లు కూడా న్యాయ వివాదాలకు దారి తీస్తున్నాయని చెప్పారు. వీటిపై కూలంకషంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి పారదర్శక విధానాలపై చర్చించారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు. పరీక్షల నిర్వహణ, పోస్టుల భర్తీలో అత్యుత్తమ పారదర్శక విధానాలకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్–1, గ్రూప్–2సహా అన్ని విభాగాల ఉద్యోగాలకూ ఇంటర్వ్యూ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఐఐఎం, ఐఐటీల సహకారంపై దృష్టి.. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించి ఏటా జనవరి 1వ తేదీన క్యాలెండ్ విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల్లో పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో విశ్వసనీయత పెంచేందుకు ప్రఖ్యాత ఐఐఎం, ఐఐటీల సహకారం, భాగస్వామ్యాలను తీసుకోవడంపై విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. నవంబర్ చివరిలో ఖాళీల జాబితా సిద్ధం! ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నవంబర్ మూడోవారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల జాబితాను తయారు చేస్తారు. భర్తీ చేయాల్సిన పోస్టులు, బడ్జెట్ కేటాయింపులు తదితర ప్రతిపాదనలతో నవంబర్ నెలాఖరులోగా ముఖ్యమంత్రితో అధికారులు మరోసారి సమావేశం అవుతారు. అన్ని సన్నాహాలు పూర్తైన తర్వాత 2020 జనవరి 1వతేదీన ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ క్యాలెండర్ విడుదల చేయనుంది. దీనికి అనుగుణంగా ఏటా ఉద్యోగాల భర్తీ చేపడతారు. -
ఏపీపీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇటీవల జారీ చేసిన కొన్ని నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను మార్పు చేసింది. టెక్నికల్ అసి స్టెంటు (మైనింగ్) పోస్టుల పరీక్షను మా ర్చి 2కు బదులు 3న నిర్వహిస్తారు. టెక్ని కల్ అసిస్టెంట్ (జియోఫిజిక్సు) పోస్టు పరీ క్షను య«థాతథంగా మార్చి 3న ఉంటుం ది. ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టు కు 3 పేపర్ల పరీక్షను మార్చి 3, 4 తేదీల్లో నిర్వహిస్తామని ఇదివరకు ప్రకటించగా మార్చి 4, 5 తేదీల్లోకి మార్పు చేశారు. సివి ల్ అసిస్టెంటు సర్జన్ పోస్టుల పరీక్షను మార్చి 3కు బదులు మార్చి 4న నిర్వహి స్తారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పోస్టు పరీక్షను మార్చి 3కు బదులు 4న నిర్వహిం చనున్నారు. అసిస్టెంటు ఆర్కిటెక్చర్, సర్వే యర్, డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు మార్చి 3కు బదులు మార్చి 5న నిర్వహిం చనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్య దర్శి గురువారం ఓప్రకటన జారీ చేశారు. -
కరెంట్ అఫైర్స్
రౌండప్ ఏప్రిల్ 2016 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్ట్ ఈనెల 26న జరగనుంది. అదే విధంగా గ్రూప్–1, పంచాయతీ సెక్రటరీ తదితర పోస్టుల ఔత్సాహికులు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. వీటితోపాటు బ్యాంక్స్, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ పరీక్షలు రాసే లక్షల మంది అభ్యర్థులకు ఉపయోగపడేలా 2016, ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ (అంతర్జాతీయం) అందిస్తున్నాం. మిగతా కరెంట్ అఫైర్స్ (సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డులు, వార్తల్లో వ్యక్తులు, క్రీడలు) తదుపరి సంచికల్లో అందిస్తాం. గ్రీన్హౌస్ ఉద్గారాల తగ్గింపునకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఏప్రిల్ 22న భారత్ సంతకం చేసింది. ఈ ఒప్పందంపై భారత్‌తో పాటు 171 దేశాలు సంతకాలు చేశాయి. ఒక అంతర్జాతీయ ఒప్పందంపై ఒకే రోజు అత్యధిక దేశాలు సంతకాలు చేయడం ఇదే తొలిసారి. టిబెట్ ప్రధానిగా న్యాయ కోవిదుడు, రాజకీయవేత్త లోబ్సంగ్ సాంగే ఏప్రిల్ 27న తిరిగి ఎన్నికయ్యారు. ధర్మశాల నుంచి పాలన సాగుతున్న టిబెట్‌కు సాంగే తొలిసారి 2011 ఆగస్టులో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. భారత ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఏడో ఐఆర్ఎన్ఎస్ఎస్ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్)–1జి ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏప్రిల్ 28న విజయవంతంగా ప్రయోగించింది. 1,425 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ–సీ33 ద్వారా భూమికి దగ్గరగా (పెరిజీ) 284 కిలోమీటర్లు, దూరంగా (అపోజీ) 20,657 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 28 నుంచి 2 రోజుల పాటు పపువా న్యూగినియాలో పర్యటించారు. ఆ దేశ ప్రధానమంత్రి పీటెర్ ఓ నీల్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాలు రక్షణ, వ్యవసాయ, ఆరోగ్య రంగాల్లో సహకారాన్ని పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆరోగ్య రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. మే 2016 బ్రిటన్ రాజధాని లండన్ మేయర్‌గా సాదిక్ ఖాన్ మే 7న ప్రమాణస్వీకారం చేశారు. దీంతో బ్రిటన్‌లో మేయర్ పదవి చేపట్టిన తొలి ముస్లింగా రికార్డులకెక్కారు. పాకిస్తాన్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్ లేబర్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసి కన్సర్వేటివ్ పార్టీ అభ్యర్థి జాక్ గోల్డ్‌స్మిత్‌పై 57 శాతం ఓట్లతో విజయం సాధించారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇరాన్ పర్యటనలో భాగంగా మే 23న ఆ దేశాధ్యక్షుడు హసన్ రౌహానీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల్లో చబహర్ ఓడరేవు అభివృద్ధితో పాటు అల్యూమినియం ప్లాంటు స్థాపన, ఆఫ్గానిస్తాన్, మధ్యాసియాలను అనుసంధానించే రైల్వేలైన్ ఏర్పాటు కోసం 150 మిలియన్ డాలర్ల రుణమిచ్చేందుకు ఇరాన్ సెంట్రల్ బ్యాంకుతో ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందాలున్నాయి. 2000–15 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజల సగటు ఆయుర్ధాయం 5 ఏళ్లు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మే 18న విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఆఫ్రికా ప్రాంతంలో సగటు ఆయుర్దాయం అత్యధికంగా 9.4 ఏళ్లు పెరిగి 60 ఏళ్లకు చేరింది. అత్యధికంగా జపాన్‌లో మహిళల సగటు ఆయుర్దాయం 86.8 ఏళ్లు ఉండగా, పురుషుల సగటు ఆయుర్దాయం స్విట్జర్లాండ్‌లో అధికంగా 81.3 ఏళ్లని నివేదిక పేర్కొంది. అత్యల్పంగా సియెర్ర లియోన్‌లో పురుషుల సగటు ఆయుర్దాయం 49.3 ఏళ్లు, మహిళల సగటు ఆయుర్దాయం 50.8 ఏళ్లుగా ఉంది. లండన్‌లో మే 12న ప్రపంచ అవినీతి వ్యతిరేక సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా అవినీతిని అంతమొందిస్తామని వివిధ దేశాధినేతలు ప్రతినబూనారు. ఈ సదస్సులో 40 దేశాల అధినేతలు, ఆర్థిక, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ను ఆ దేశ సెనెట్ మే 12న సస్పెండ్ చేసింది. బడ్జెట్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఆమెపై అభిశంసన ప్రక్రియ చేపట్టారు. ఈ తీర్మానానికి సెనెట్ ఆమోదం లభించింది. దీంతో ఉపాధ్యక్షుడు మిచెల్ టెమర్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా రోడ్రిగో డుటెర్టే ఎన్నికయ్యారు. మే 9న జరిగిన ఎన్నికల్లో పీడీపీ–లబాన్ పార్టీ నాయకుడు డుటెర్టే భారీ మెజారిటీతో విజయం సాధించారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో మే 23, 24 తేదీల్లో తొలి ప్రపంచ మానవతా సదస్సు (వరల్డ్ హ్యుమానిటేరియన్ సమ్మిట్) జరిగింది. ఈ సదస్సులో ఐక్యరాజ్యసమితిలోని 173 దేశాలు, ప్రైవేటు రంగాలకు చెందిన 350 మంది ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నుంచి 2,000 మంది పాల్గొన్నారు. జి–7 దేశాల 42వ సదస్సు జపాన్‌లోని షిమాలో మే 26, 27 తేదీల్లో జరిగింది. సదస్సు అనంతరం అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యూకే దేశాల నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇందులో ప్రపంచ ఆర్థికాభివృద్ధిని అత్యవసర ప్రాధాన్య అంశంగా పేర్కొన్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పుని ఎదుర్కొనేందుకు ఉమ్మడి చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చైనా పర్యటనలో భాగంగా బీజింగ్‌లో మే 26న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. విద్యారంగంలో సహకారం కోసం భారత్‌కు చెందిన 10 విశ్వవిద్యాలయాలు చైనా యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకున్నాయి. జూన్ 2016 అణు సరఫరాదారుల బృంద (ఎన్ఎస్జీ) వార్షిక సదస్సు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జూన్ 23, 24 తేదీల్లో జరిగింది. ఈ సమావేశంలో ఎన్పీటీ (అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం)ని సమర్థంగా అమలు చేయాలని ఎన్ఎస్జీ సభ్య దేశాలు నిర్ణయించాయి. ఎన్పీటీపై సంతకం చేయని దేశాలకు ఎన్ఎస్జీ సభ్యత్వం కల్పించే అంశంపై చర్చలు కొనసాగుతాయని సమావేశానంతరం విడుదల చేసిన ప్రకటనలో సభ్యదేశాలు పేర్కొన్నాయి. ప్రధానమంత్రి అమెరికా పర్యటనలో భాగంగా జూన్ 7న ఆ దేశ అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి ఒబామా మద్దతు ప్రకటించారు. ప్రధాని మోదీ మెక్సికో పర్యటనలో భాగంగా జూన్ 9న ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటోతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సమాచార, సాంకేతిక పరిజ్ఞానం, ఇంధనం, అంతరిక్ష రంగాల్లో సహకార విస్తరణపై ఇరు దేశాల నేతలు చర్చించారు. అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి మద్దతిస్తున్నట్లు మెక్సికో ప్రకటించింది. మలబార్ ఎక్సర్సైజ్ పేరుతో భారత్, అమెరికా, జపాన్‌లు జూన్ 10న నౌకాదళ విన్యాసాలను ప్రదర్శించాయి. సైనిక సంబంధాలను బలోపేతం చేయడం, పరస్పర సమన్వయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా తూర్పు చైనా సముద్రంలోని వివాదాస్పద జలాలకు చేరువలో ఈ యుద్ధ విన్యాసాలు జరిగాయి. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్‌లో భారత్ 105వ స్థానంలో నిలిచింది. మొత్తం 130 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం సందర్భంగా ఆయా దేశాలు.. ఆర్థికాభివృద్ధికి అవసరమైన ప్రతిభను గుర్తించడం, అభివృద్ధి చేయడం వంటి అంశాల ఆధారంగా జూన్ 27న ర్యాంకులను ప్రకటించారు. ఈ జాబితాలో ఫిన్లాండ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో స్విట్జర్లాండ్‌లు నిలిచాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఐవరీ కోస్ట్ పర్యటనలో భాగంగా జూన్ 15న ఆ దేశ అధ్యక్షుడు అలాసనే యుటారాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద కోకో ఉత్పత్తి కేంద్రమైన తమ దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రణబ్ ముఖర్జీని అలాసనే కోరారు. పర్యటన సందర్భంగా ఐవరీ కోస్టు అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ నేషనల్ ఆర్డర్‌ను రాష్ట్రపతి పణబ్‌కు అలాసనే ప్రదానం చేశారు. శ్రీలంకలోని జాఫ్నా పట్టణంలో పునరుద్ధరించిన స్టేడియాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనలు సంయుక్తంగా జూన్ 18న ప్రారంభించారు. స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సిరిసేన హాజరవగా, ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ స్టేడియం మరమ్మతులకు భారత్ రూ.7 కోట్ల ఆర్థిక సాయం అందించింది. ప్రపంచంలో శరణార్థులు, నివాసాలను వదిలి వెళ్లిన వారి సంఖ్య 2015 నాటికి 65.3 మిలియన్లకు చేరుకుంది. ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా జూన్ 20న ఐక్యరాజ్య సమితి ఈ వివరాలు వెల్లడించింది. శరణార్థుల్లో పాలస్తీనియన్లు అత్యధికంగా (5 మిలియన్లకు పైగా) ఉన్నారు. తర్వాతి స్థానాల్లో సిరియా (4.9 మిలియన్లు), అఫ్గానిస్తాన్ (2.7 మిలియన్లు) ఉన్నాయి. జూలై 2016 భారత ప్రధాని నరేంద్రమోదీ మొజాంబిక్ పర్యటనలో భాగంగా జూలై 7న ఆ దేశాధ్యక్షుడు ఫిలిప్ న్యూసీతో సమావేశమయ్యారు. దేశంలో పప్పు ధాన్యాల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో మొజాంబిక్‌తో దీర్ఘకాలిక పప్పు ధాన్యాల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. దక్షిణ చైనా సముద్రంలో తనకు 90 శాతానికి పైగా చారిత్రక హక్కులు ఉన్నాయనే చైనా వాదన ను హేగ్‌లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ జూలై 12న కొట్టివేసింది. 1940 నాటి చైనా మ్యాప్ ఆధారంగా నైన్–డాష్ లైన్ పరిధిలోని సముద్ర ప్రాంతం, అందులోని వనరులపై తనకు హక్కులున్నాయని చైనా వాదిస్తోంది. ఒకవేళ అలాంటి చారిత్రక హక్కులేమైనా ఉంటే సముద్ర చట్టాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఒడంబడికతో వాటికి కాలం చెల్లిందని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో పదకొండో ఆసియా–యూరప్ సదస్సు (ఏఎస్‌ఈఎం) జూలై 15, 16 తేదీల్లో జరిగింది. భారత్ తరఫున సదస్సులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ.. ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమాజం కఠినంగా అణిచివేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో భారత్ సహా 51 దేశాలు పాల్గొన్నాయి. ఆసియా, యూరప్ దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ జూలై 19న ఖరారయ్యారు. అభ్యర్థిత్వం కోసం 13 నెలలుగా పార్టీలోని అనేకమందితో పోటీపడి ట్రంప్ విజయం సాధించారు. పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు అవసరమైన 1,237 ఓట్లను ఆయన సాధించారు.lఅమెరికా అధ్యక్ష ఎన్నికకు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ జూలై 27న ఖరారయ్యారు. నేపాల్ ప్రధాని కేపీ ఓలి జూలై 24న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ మద్దతు ఉపసంహరించుకోగా, అధికార కూటమిలోని మధేసి పీపుల్స్ రైట్స్ ఫోరమ్, డెమోక్రాటిక్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు సైతం హామీలను నెరవేర్చడంలో ఓలి విఫలమయ్యారంటూ అవిశ్వాసానికి మద్దతిచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ఆగస్టు 2016 నేపాల్ కొత్త ప్రధానిగా మావోయిస్టు చీఫ్ పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఆగస్టు 4న ప్రమాణస్వీకారం చేశారు. ఆగస్టు 3న పార్లమెంటులో జరిగిన ఎన్నికలో సీపీఎన్–మావోయిస్టు సెంటర్ చీఫ్ ప్రచండకు అనుకూలంగా 363 ఓట్లు, వ్యతిరేకంగా 210 ఓట్లు వచ్చాయి. సార్క్ దేశాల హోంమంత్రుల 7వ సదస్సు ఆగస్టు 4న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై చర్యలు తీసుకొని, వాటిని ఒంటరి చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో సార్క్ సభ్యదేశమైన బంగ్లాదేశ్ మినహా అఫ్గానిస్థాన్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, భారత్, శ్రీలంక, మాల్దీవుల హోం మంత్రులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం‘ఎయిర్ ల్యాండర్–10’ ఆగస్టు 17న ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరింది. 302 అడుగుల పొడవైన ఈ విమానాన్ని అమెరికా ఆర్మీ కోసం బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ (హెచ్ఏవీ) రూపొందించింది. 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 980 కోట్లకు చేరుతుందని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో (పీఆర్బీ) పేర్కొంది. ఈ మేరకు ఆగస్టు చివరి వారంలో విడుదల చేసిన 2016 వరల్డ్ పాపులేషన్ డేటాషీట్లో తెలిపింది. మానవ అవసరాలు, సుస్థిర వనరులనే ఇతివృత్తంతో డేటా షీట్‌ను రూపొందించారు. యూరప్‌లో జననాల రేటు బాగా క్షీణించి జనాభా భారీగా తగ్గిపోనుండగా, ఆఫ్రికా దేశాల్లో రెట్టింపు అవుతుందని నివేదిక పేర్కొంది. వామపక్ష తీవ్రవాద సంస్థ.. కొలంబియా విప్లవ సాయుధ బలగాల (ఎఫ్ఏఆర్సీ–ఫార్క్)తో ఆ దేశ ప్రభుత్వం శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు పక్షాలు క్యూబా రాజధాని హవానాలో ఆగస్టు 24న ప్రకటన విడుదల చేశాయి. దీంతో దక్షిణ అమెరికాలోని కొలంబియాలో 1964లో ప్రారంభమైన అంతర్యుద్ధానికి తెరపడింది. సెప్టెంబర్ 2016 ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్–ఆసియాన్) సదస్సు సెప్టెంబర్ 6–8 తేదీల్లో లావోస్‌లోని వియంటైన్లో జరిగింది. ఈ సదస్సును ‘టర్నింగ్ విజన్ ఇన్‌టూ రియాలిటీ ఫర్ ఎ డైనమిక్ ఆసియాన్ కమ్యూనిటీ’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. సదస్సులో ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2025 అమలుపై ఆసియాన్ వెలుపలి భాగస్వాములతో సహకారాన్ని విస్తరించుకోవడంపై నేతలు చర్చించారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 8న లావోస్‌లోని వియంటైన్లో జరిగింది. జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అణు భద్రతకు చర్యలు తీసుకోవాలని సదస్సు తీర్మానించింది. ఈ సందర్భంగా 18 దేశాలు అణు నిరాయుధీకరణ, అణు సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తి నిరోధానికి మద్దతు పలికాయి. ఈ సమావేశంలో 10 ఆసియాన్ దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు పాల్గొన్నాయి. పారిస్ వాతావరణ మార్పు ఒప్పందానికి అమెరికా, చైనాలు అమోదం తెలిపాయి. దీనికి సంబంధించిన ఆమోద పత్రాలను సెప్టెంబర్ 3న చైనాలోని హాంగ్జౌలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌కు అందించాయి. పారిస్ ఒప్పందం ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి రావాల్సి ఉంది. దీనికోసం ఒప్పందానికి అంగీకరించిన 195 దేశాల్లో కనీసం 55 దేశాలు ఆమోదించాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 6.5 కోట్ల మంది శరణార్థులు, వలసదారుల జీవితాలను కాపాడేందుకు ఉద్దేశించిన తీర్మానానికి సెప్టెంబర్ 19న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో భాగంగా 193 దేశాలు ఆమోదం తెలిపాయి. అయితే ఈ తీర్మానానికి చట్టబద్ధత లేదు. ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిమోన్∙పెరెస్ (93) జెరూసలెంలో సెప్టెంబర్ 28న మరణించారు. ఆయన..1959లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు ప్రధాన మంత్రిగా, 2007 నుంచి 2014 వరకు దేశాధ్యక్షుడిగా కొనసాగారు. జీ–20 దేశాల 11వ సదస్సు చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబర్ 4, 5 తేదీల్లో జరిగింది. ఈ సందర్భంగా సదస్సు ప్రధానంగా దార్శనికత, సమగ్రత, స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ, సమ్మిళితం వంటి అంశాలపై దృష్టి సారించింది. కొత్త ఆవిష్కరణలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొంది. 2030 నాటికి సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కోసం కార్యక్రమాల రూపకల్పన– అమలుపై సదస్సులో చర్చించారు. అక్టోబర్ 2016 అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రపంచంలో అత్యధిక దూరం సముద్ర గర్భంలో నుంచి కేబుల్ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్, ఫేస్బుక్ సంస్థలు ప్రకటించాయి. పసిఫిక్ మహాసముద్రం ద్వారా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నుంచి హాంగ్‌కాంగ్‌కు 12,800 కి.మీ హైస్పీడ్ ఇంటర్నెట్ కేబుల్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా అమెరికా, ఆసియాలను అనుసంధానం చేస్తారు. ఇప్పటికే అమెరికా, జపాన్ల మధ్య ప్రపంచంలోనే తొలి హై కెపాసిటీ ఇంటర్నెట్ కేబుల్ సముద్ర గర్భం నుంచి ఏర్పాటై ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర సంరక్షణ కేంద్రం (మెరైన్ రిజర్వ్) ఏర్పాటుకు అక్టోబర్ 28న ఒప్పందం కుదిరింది. అంటార్కిటికాలోని ప్రకృతి సిద్ధ నిర్జన ప్రదేశాలను పరిరక్షించే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటార్కిటికా సముద్ర జీవ వనరుల పరిరక్షణ సంస్థ– హోబర్డ్ వార్షిక సమావేశంలో ఈ ఒప్పందం ఖరారైంది. కామన్వెల్త్ దేశాల గ్రూపు నుంచి వైదొలుగుతున్నట్లు మాల్దీవులు అక్టోబర్ 13న ప్రకటించింది. 2012 నాటి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ నషీద్‌ను పదవీచుత్యుణ్ని చేయడానికి దారితీసిన పరిస్థితులను, రాజకీయ అశాంతిని అరికట్ట లేకపోయినందువల్ల ఆ దేశంపై ఆంక్షలు వి«ధించాలని కామన్వెల్త్ నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా కామన్వెల్త్ నుంచి వైదొలుగుతున్నట్లు మాల్దీవులు పేర్కొంది. 53 దేశాలున్న కామన్వెల్త్ దేశాల కూటమి నుంచి 2013లో జాంబియా వైదొలగగా, తర్వాత తప్పుకున్న దేశం మాల్దీవులు. నవంబర్ 2016 క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో (90) అనారోగ్యంతో నవంబర్ 25న కన్నుమూశారు. ఫిడెల్ క్యాస్ట్రో 1926, ఆగస్టు 13న బిరాన్ (హŸల్లూయిన్ ప్రావిన్స్)లో జన్మించారు. హవానా యూనివర్సిటీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1959 నుంచి 1976 వరకు క్యూబా ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో.. అనంతరం దేశాధ్యక్షుడిగా ఎన్నికై 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు. హైబ్రిడ్ వరి పితామహుడిగా పేరుగాంచిన చైనా వ్యవసాయ శాస్త్రవేత్త యువాన్ లాంగ్పింగ్ భారీ స్థాయిలో వరి పండించి సరికొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పారని చైనా అధికారులు నవంబర్ 25న ప్రకటించారు. గ్యాంగ్‌డాంగ్‌లో ఆయన పండించిన వరి 0.07 హెక్టార్‌కు 1,533.78 కిలోల వార్షిక దిగుబడి ఇచ్చిందని తెలిపారు. కొలంబియాలో గతంలో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రజలు తిరస్కరించడంతో.. ప్రభుత్వం, తిరుగుబాటు సంస్థ (ఎఫ్ఏఆర్సీ) నవంబర్ 12న కొత్త ఒప్పందాన్ని ప్రకటించాయి. వివిధ సంస్థలు, ప్రజల సూచనల మేరకు పాత ఒప్పందంలో కొన్ని మార్పులు చేయడంతోపాటు అదనపు అంశాలను చేర్చారు. ఈ మేరకు శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించిన క్యూబా, నార్వే, దౌత్యవేత్తలు సంయుక్త ప్రకటన చేశారు. అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా 2016 రికార్డుకెక్కింది. ఈ మేరకు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నవంబర్ 14న మొరాకోలోని మారకేష్‌లో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. 2015తో పోల్చితే 2016లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2016లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. డిసెంబర్ 2016 వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో ఆ దేశంలో పెద్ద కరెన్సీ నోట్ అయిన 100 బొలివర్‌ను రద్దు చేస్తూ డిసెంబర్ 12న అత్యవసర డి్రMీ జారీ చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గియోన్ హై అభిశంసనకు గురయ్యారు. దీంతో ఆమె తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పార్క్‌పై విపక్షాలు డిసెంబర్ 9న ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ లభించింది. ఆ దేశ పార్లమెంటులో 300 స్థానాలుండగా.. 234 మంది అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్ష స్థానాన్ని చేపట్టిన తొలి మహిళ పార్క్. 2016 ప్రపంచ సుందరి కిరీటాన్ని ప్యూర్టొరికోకు చెందిన 19 ఏళ్ల స్టీఫెనీ డీ వాలే కైవసం చేసుకుంది. వాషింగ్టన్లో డిసెంబర్ 19న నిర్వహించిన పోటీల్లో 116 మందిలో స్టీఫెనీ అగ్రస్థానంలో నిలిచింది. యరిట్జా మిగులేనా రేయిస్ రమిరెజ్ (డొమినికన్ రిపబ్లిక్), నటాషా మాన్యుయెల్లా (ఇండోనేసియా) రన్నరప్‌లుగా నిలిచారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ రాసిన ప్రిన్సిపియా మ్యాథమెటికా తొలి ముద్రణ పుస్తకం వేలంలో రూ.21.1 కోట్లకు అమ్ముడైంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడైన శాస్త్ర సాంకేతిక ప్రచురణగా రికార్డు సృష్టించింది. క్రిస్టీ సంస్థ న్యూయార్క్‌లో డిసెంబర్ 18న నిర్వహించిన ఈ–వేలంలో అజ్ఞాత వ్యక్తి పుస్తకాన్ని సొంతం చేసుకున్నారు. చైనాలో ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన వంతెనపై రాకపోకలు డిసెంబర్ 29న ప్రారంభమయ్యాయి. ఈ వంతెనను భూమి నుంచి 1854 అడుగుల ఎత్తున, 1341 మీటర్ల పొడవున నిర్మించారు. దీనికోసం సుమారు రూ.1005 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని పర్వతమయమైన నైరుతి చైనాలోని యున్నన్, గిఝౌ ప్రావిన్స్‌లను అనుసంధానం చేస్తూ నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బుల్లెట్ రైలు మార్గంలో రాకపోకలను చైనా ప్రారంభించింది. షాంఘై నుంచి కున్మింగ్ వరకు ఉన్న ఈ మార్గం పొడవు 2,252 కిలోమీటర్లు. ఈ మార్గంలో గంటకు 330 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలు దూసుకెళ్లనున్నట్లు చైనా ప్రభుత్వ రంగ వార్తా సంస్థ జిన్హువా డిసెంబర్ 28న వెల్లడించింది. అమెరికా నుంచి 2008–15 మధ్యకాలంలో భారీగా ఆయుధాలు కొన్న అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెసెనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంప్రదాయక ఆయుధాల బదిలీ, 2008–15 పేరిట డిసెంబర్ 26న విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. శ్రీలంక మాజీ ప్రధాని రత్నసిరి విక్రమనాయకే (83) డిసెంబర్ 27న కన్నుమూశారు. ఆయన రెండు పర్యాయాలు శ్రీలంక ప్రధానిగా పనిచేశారు. ప్రపంచ జనాభా 2016లో 740 కోట్లకు చేరిందని ఐరాస జనాభా సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జోర్డాన్‌లోని అమ్మాన్లో డిసెంబర్ 1న ప్రపంచ జనాభా నివేదిక–2016ను విడుదల చేసింది. జనాభాలో పదేళ్లలోపు చిన్నారులు 12.5 కోట్ల మంది ఉన్నారని.. వీరిలో 89 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారని వెల్లడించింది. -
మరో 361 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో 361 పోస్టులకు శనివారం రాత్రి ఆరు నోటిఫికేషన్లు జారీచేసింది. వివిధ విభాగాల్లోని ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను అభ్యర్థుల నుంచి ఆహ్వానించింది. జనవరి 23వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి సాయి వివరించారు. ఆన్లైన్ దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ బయోడేటా సమాచారాన్ని వన్‌టైమ్ ప్రొఫైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 259 డిప్యూటీ సర్వేయర్లు, 13 టౌన్‌ప్లానింగ్ సర్వేయర్లు, 39 మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీచేయనున్నట్లు తెలిపారు. -
1999 గ్రూప్–2 మెరిట్ జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1999 గ్రూప్–2 మెరిట్ జాబితాను(ఏపీపీఎస్సీ) శుక్రవారం రాత్రి విడుదల చేసింది. న్యాయస్థానాల్లో వివాదాలు... సుదీర్ఘకాలం కోర్టు విచారణలు... ఉన్నత న్యాయస్థానం తీర్పు అనంతరం 17 ఏళ్ల తరువాత ఈ ఫలితాలను విడుదల చేసింది. 1,075 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 296 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఈ మెరిట్ జాబితాను వెల్లడిస్తున్నామని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారమే ఈ ఫలితాలను విడుదల చేయాల్సి ఉన్నా కమిషన్ పరిశీలన చేయాల్సి ఉండడంతో నిలిపేశారు. చివరకు శుక్రవారం రాత్రి జాబితాను విడుదల చేశారు. ఈ మెరిట్ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్తగా 150 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా, ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న దాదాపు 40 మంది పోస్టులు కోల్పోతున్నారు. ప్రస్తుత జాబితా ప్రకారం ఉద్యోగాలు పొందిన వారిలో ఇంతకు ముందు పోస్టులు అలాట్ కానివారు వారం రోజుల్లో తమ ఆప్షన్లకు సంబంధించి సుముఖతను వ్యక్తపరుస్తూ రాతపూర్వక పత్రాలను ఏపీపీఎస్సీకి సమర్పించాల్సి ఉంటుంది. మెరిట్ జాబితాను అభ్యర్థుల మార్కులతో సహా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లోగా ఏపీపీఎస్సీని రాతపూర్వకంగా సంప్రదించాల్సి ఉంటుంది. 17 ఏళ్ల క్రితం వెలువడిన నోటిఫికేషన్ కు సంబంధించి పరీక్షలు, మెరిట్ జాబితాలు, ఆ ప్రకారం నియామకాలు పూర్తయిన అనంతరం ఇదంతా నిబంధనల ప్రకారం జరగలేదని కొందరు అభ్యంతరాలు లేవనెత్తారు. దాంతో ఆ నోటిఫికేషన్ పై వివాదం ఏర్పడి.. కోర్టులకు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సూపర్ న్యూమరరీ పోస్టులే పరిష్కారం: తాజా జాబితాతో కొందరు ఉద్యోగాలు కోల్పోతుండడం, మరికొందరు ఉన్నతస్థానాల్లో నుంచి కిందిస్థాయికి రావాల్సి ఉండడం, జోన్లలో మార్పులు వంటి చిక్కుముడులు ఏర్పడనున్నాయి. 1999 గ్రూప్–2 ఉమ్మడి ఏపీకి సంబంధించినది కనుక అప్పట్లోని ఆరు జోన్లను దృష్టిలో పెట్టుకొని ఏపీపీఎస్సీ తాజా జాబితాను ప్రకటించింది. ఇప్పుడు రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయింది. తాజా జాబితా ప్రకారం ఏపీలో ఉద్యోగం చేస్తున్న వారు తెలంగాణకు, తెలంగాణలోని వారు ఏపీకి జోన్ల వారీగా మారే పరిస్థితి తలెత్తనుంది. ప్రస్తుత జాబితా ప్రకారం గతంలో పోస్టులు అలాట్‌కాని వారిని విల్లింగ్‌నెస్ అడిగామని, వారినుంచి వచ్చే రాతపూర్వక లేఖలను అనుసరించి రెండు రాష్ట్రాలకు తుది జాబితాలను వేర్వేరుగా రూపొందించి అప్పగిస్తామని ఏపీపీఎస్సీ వర్గాలు వివరించాయి. లేఖలు ఎంతమంది నుంచి వస్తాయో చూశాక మిగిలిపోయే పోస్టులకు మళ్లీ జాబితా రూపొందించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. రూల్ 7 ప్రకారం (లెఫ్ట్ ఓవర్ మెరిట్) జాబితాలోని తరువాతి స్థానాల వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆ ప్రకారం ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో కొందరికి మళ్లీ అవకాశం రావచ్చని పేర్కొన్నారు. ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నారన్న దానిపై అప్పటికి కానీ స్పష్టత రాదని వివరించారు. ఆ తరువాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు తుది జాబితాలను ఏపీపీఎస్సీ అప్పగిస్తుందని చెప్పారు. ఉద్యోగాలు కోల్పోయే వారికి, పదోన్నతుల ద్వారా పైస్థాయి పోస్టుల్లో ఉండి ప్రస్తుతం కిందిస్థాయి పోస్టుకు ఎంపికైన వారికి న్యాయం జరగాలంటే ప్రభుత్వాలు సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాల్సి ఉంటుందని ఏపీపీఎస్సీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. -
నేటితో ముగియనున్న ‘గూప్–2’ గడువు
-
నేటితో ముగియనున్న ‘గూప్–2’ గడువు
- ఇప్పటికే ఆరు లక్షలకు చేరిన దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతనెలలో విడుదల చేసిన గ్రూప్–2 నోటిఫికేషన్‌కు సంబంధించి బుధవారం సాయంత్రం వరకు దాదాపు ఆరు లక్షలవరకు దరఖాస్తులు అందాయి. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు గడువు గురువారం అర్ధరాత్రితో ముగియనుంది. ఈ సంఖ్య మరికొంతమేర పెరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గ్రూప్–2 కింద 442 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 540 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి గతనెల 8న నోటిఫికేషన్ వెలువరించి అదేనెల 11వ తేదీనుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణను కమిషన్ చేపట్టింది. డిసెంబర్ 10వ తేదీ వరకు ముందు గడువు విధించింది. అయితే కమిషన్ వెబ్సైట్లో అనేక సాంకేతిక లోపాలు తలెత్తడంతో సాంకేతికంగా మార్పులు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో గడువును మరో అయిదు రోజుల పాటు పెంచి ఈనెల 15వ తేదీని తుది గడువుగా చేసింది. కమిషన్ అంచనా కన్నా తక్కువగా ఇప్పటివరకు ఆరు లక్షల లోపే దరఖాస్తులు అందాయి. దీంతో గడువును పెంచే అంశాన్ని పరిశీలిస్తామని ఆ వర్గాలు వివరించాయి. ఫిబ్రవరి 26న స్క్రీనింగ్ టెస్టు: గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్టు 2017 ఫిబ్రవరి 26న నిర్వహించే అవకాశముంది. నోటిఫికేషన్లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆ రోజు ఉదయం ఈ స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తారు. ఆ టెస్టులో అర్హత సాధించిన వారిలో 1:50 చొప్పున 982 పోస్టులకు కటాఫ్ నిర్ణయించి 49,100 మందికి పైగా అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపికచేస్తారు. క్యారీఫార్వర్డ్ కింద కొత్తగా వచ్చి చేరే పోస్టుల సంఖ్యను అనుసరించి ఈ అభ్యర్థుల జాబితా మరింత పెరుగుతుంది. వీరికి మే 20, 21వ తేదీల్లో మెయిన్స్‌ను నిర్వహించనున్నారు. దరఖాస్తుల గడువు పెంచినందున ఈ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలుస్తోంది. -
గ్రూప్-3 సిలబస్ విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-3 కింద పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ కోసం స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ పరీక్షల సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ పోస్టులకు 25 వేలకు పైగా దరఖాస్తులు అందే అవకాశమున్నందున స్క్రీనింగ్ టెస్టును నిర్వహిస్తారు. అర్హులను మెరుున్ నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్టు 150 ప్రశ్నలతో 150 మార్కులకు ఉండనుంది. ఓఎమ్మార్ పత్రాలతో నిర్వహించే ఈ పరీక్షకు రెండున్నర గంటల సమయమివ్వనున్నారు. మెయిన్‌ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున 300 మార్కులతో ఉంటుంది. ఒక్కో పేపర్లో 150 ప్రశ్నలకు గాను 150 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. పేపర్-1లో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీస్‌పై ప్రశ్నలుంటాయి. పేపర్-2లో గ్రామీణాభివృద్ధి, గ్రామీణప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలు ముఖ్యంగా ఏపీలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉంటారుు. గ్రూప్-3 సిలబస్‌ను ఏపీపీఎస్సీ వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎస్సీ.జీఓవీ.ఐఎన్)లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి వైవీఎస్టీ సాయి వివరించారు. (గ్రూప్-3 స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ సిలబస్ వివరాలు సాక్షి భవితలో ) -
పెరిగిన గ్రూప్-2 పోస్టులు
► 55 పోస్టుల పెరుగుదల ► నాన్‌ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లోనూ 177 పెరుగుదల ► హైదరాబాద్‌లోనూ పరీక్ష కేంద్రాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య గతంలోకన్నా ఈసారి పెరిగింది. జూన్ 17న ఆర్థికశాఖ పదివేల పోస్టుల భర్తీకి అవకాశమిస్తూ జీఓ 110ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో 4,009 పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా, తక్కినవి పోలీసు రిక్రూట్మెంటు బోర్డు ద్వారా భర్తీచేయాలని నిర్దేశించింది. ఏపీపీఎస్సీకిచ్చిన పోస్టుల్లో గ్రూప్-1 పోస్టులు 94 పోస్టులు, గ్రూప్-2లో 750, గ్రూప్-3లో 1,000(పంచాయతీ కార్యదర్శులు), హోంశాఖలో 9 పోస్టుల భర్తీకి అవకాశం కల్పించింది. అయితే క్యారీ ఫార్వర్డ్‌తో గ్రూప్-2 పోస్టుల సంఖ్య 750 నుంచి 982కు పెరిగింది. అంటే అదనంగా 232 పోస్టులు పెరిగాయి. గతంలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల సంఖ్య 387 కాగా ఈసారి వాటికి అదనంగా 55 కలిశాయి. అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు గతంలో 90 ఉండగా ఈసారి 96కు పెరిగింది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 250 ఉండగా 253కు చేరింది. కొత్తగా ఏపీ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ శాఖలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు 23, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు 8, ప్రొహిబిషన్, ఎకై యిజ్ శాఖలో సబ్ఇన్స్పెక్టర్ పోస్టులు 15 అదనంగా వచ్చి చేరాయి. మరోవైపు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులూ పెరిగాయి. గతంలో వీటి సంఖ్య 363 కాగా ఈసారి 540కి పెరిగింది. అదనంగా 177 పోస్టులు కొత్తగా వచ్చి చేరాయి.రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికతను వర్తింపచేయనున్నారు. 25వేలు దాటి దరఖాస్తులందితే స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారిని 1:50 చొప్పున మెయిసకు ఎంపిక చేయనున్నారు. స్క్రీనింగ్ టెస్టును వచ్చేఏడాది ఫిబ్రవరి 26న, మెయిన్ టెస్టును మే 20, 21 తేదీల్లో నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. పరీక్షలకోసం ఏపీలోని 13 జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. -
ఆబ్జెక్టివ్‌లో నెగిటివ్ మార్క్స్
* ఏపీపీఎస్సీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం * తప్పుడు సమాధానం గుర్తిస్తే ఒక్కోప్రశ్నకు 1/3 మైనస్ మార్కు * నెలాఖరులోపు మరో 256 పోస్టులకు నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి ఆబ్జెక్టివ్ ప్రశ్నల విధానంలో నిర్వహించే అన్ని పోటీ పరీక్షల కు నెగిటివ్ (మైనస్) మార్కుల విధానాన్ని అమలు చేయాలని కమిషన్ నిర్ణయించింది. తప్పుడు సమాధానం గుర్తిస్తే ఒక్కో ప్రశ్నకు 1/3 మార్కు చొప్పున తగ్గించనుంది. యూపీఎస్సీ, ఎస్సెస్సీ తరహా విధానాన్ని అనుసరించనుంది. కొందరు తెలి యని వాటికీ ఏదో ఒక ఆప్షన్ సమాధానాన్ని గుర్తిస్తూ అదృష్టవశాత్తు అది కరెక్టు అయితే అధిక మార్కులు పొందుతున్నారు. దీన్ని నిరోధించడానికి నెగిటివ్ మార్కుల విధానాన్ని ఎంచుకోవాలని మంగళవారం జరిగిన ఏపీపీఎస్సీ బోర్డు సమావేశం నిర్ణయించింది. చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. * ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితిని 34 ఏళ్లనుంచి 40 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం గతంలో జీవో ఇచ్చింది. ఆ వయోపరిమితి గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. గ్రూప్2, గ్రూప్3 పోస్టుల నోటిఫికేషన్ల విడుదల జాప్యమైతే వయోపరిమితి పెంపు జీవో మరో ఏడాది పొడిగింపునకు రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు. దీనివల్ల ఈ నెలాఖరుతో 40 ఏళ్లు నిండిపోయే వారికి రానున్న ఏడాదిలో విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్లకు అర్హత కల్పించనున్నారు. ఈ నెలాఖరులోగా వివిధ విభాగాలకు సంబంధించిన 256 పోస్టులకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. * స్క్రీనింగ్ టెస్టునుంచి 1:50 చొప్పున అభ్యర్థులను రోస్టర్‌తో సంబంధం లేకుండా మెరిట్ ప్రాతిపదికన మెయిన్ పరీక్షకు ఎంపిక చే స్తారు. కటాఫ్ మార్కును నిర్ణయించి ఆమేరకు ఎంతమంది అర్హులో అందరినీ మెయిన్‌కు పిలుస్తారు. కొద్దికాలంలో దీన్ని కూడా మార్పు చేసి యూపీఎస్సీ తరహాలో స్క్రీనింగ్ టెస్టునుంచి మెయిన్స్‌కు 1:12, లేదా 1:13 చొప్పున రోస్టర్ తదితర రిజర్వేషన్లను అనుసరించి అభ్యర్థులను పిలవాలని సమావేశంలో చర్చించారు. ఈమేరకు ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. ళీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన 748 ఏఈఈ పోస్టులకు స్రీనింగ్ టెస్టుతో పాటు మెయిన్ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ టెస్టు అక్టోబర్‌లోనే నిర్వహించేలా షెడ్యూల్ ఇవ్వనున్నారు. * స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ టెస్టుకు ఒకే తరహా సిలబస్ ఉంటుంది. మెయిన్ టెస్టులో మూడు పేపర్లు ఉంటాయి. ఈ మూడింటి నుంచి 50 మార్కుల చొప్పున 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్టును నిర్వహిస్తారు. ప్రశ్నలు స్క్రీనింగ్ టెస్టు, మెయిన్ టెస్టులో ఒకే తరహాలో ఉంటాయి. ప్రశ్నలు, సమాధానాల ఆప్షన్లు జంబ్లింగ్ విధానంలో ఉంటాయి. * గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఈసారి ఇంటర్వ్యూలు ఉండవు. వచ్చే ఏడాదినుంచి గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1లో కలిపి గ్రూప్-1 బీగా భర్తీచేస్తారు. వీటికి ప్రిలిమ్స్, మెయిన్స్‌తో పాటు ఇంటర్య్వూలూ ఉంటాయి. * గ్రూప్-1 పోస్టుల కొత్త నోటిఫికేషన్లు, భర్తీ డిసెంబర్‌నాటికి చేపట్టనున్నారు. -
గ్రూప్-2లో స్క్రీనింగ్ టెస్ట్
మార్కులు, సిలబస్ ఖరారు ఆన్లైన్లో పరీక్షల నిర్వహణ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్-2 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి పరీక్షల విధానం, సిలబస్‌పై ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం గ్రూప్2లో అత్యధికంగా ఉండే అభ్యర్థులను వడపోసేందుకు ముందుగా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నారు. గ్రూప్2కు నిర్దేశించిన 3 పేపర్లకు ఇది అదనంగా ఉంటుంది. వ డపోత అనంతరం మిగిలిన వారిని పోస్టులకు నిష్పత్తి ప్రకారం మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. వీరికి ఆన్లైన్లో మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇదివరకు ఇచ్చిన జీవో 623కి సవరణ చేస్తూ ప్రభుత్వం తాజా జీవో విడుదల చేసింది. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్టు సిలబస్ ఎ:- కరెంటు అఫైర్స్-ఇష్యూస్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్ పాలిటిక్స్, ఎకనమిక్స్, సొసైటీ, సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్, స్పోర్ట్స్, కల్చర్ అండ్ గవర్నెన్స్ బి:- కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఫెడరలిజమ్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, యూనియ న్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, జ్యుడీషియరీ, జ్యుడికల్ రివ్యూ, లోకల్ గవర్నమెంట్, డైరక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, యూని యన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్ అండ్ లెజిస్టేటివ్ రిలేషన్స్ బిట్వీన్ యూని యన్ అండ్ స్టేట్ గవర్నెమెంట్స్, షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియా అడ్మినిస్ట్రేషన్. సి:- ఎకనమిక్ డెవలప్మెంటు ఆఫ్ ఇండియా-ఎకనామీ ఆఫ్ మీడీవల్ ఇండియా, ప్రి ఇండిపెండెన్స్ ఇండియన్ ఎకానమీ, డెవ లప్‌మెంటు ప్లాన్స్ అండ్ ఎకనమిక్ అండ్ ఇండస్ట్రియల్ పాలసీస్, లేబర్ పాలసీస్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్సు, రోల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా, ఎకనమిక్ డిస్పారిటీస్ బిట్వీన్ రీజియన్స్ అండ్ పాప్యులేషన్ కేటగిరీస్. మెయిన్స్ సిలబస్, మార్కులు సబ్జెక్టు మార్కులు పేపర్1: జనర్ స్టడీస్ 150 పేపర్2: 1.సోషల్ హిస్టరీ ఆఫ్ ఏపీ (ద హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్, కల్చరల్ మూవ్మెంట్సు) 2. జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కానిస్టిట్యూషన్ 150 పేపర్3:- ప్లానింగ్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ ఎకానమీ కాంటెంపరరీ ప్రాబ్లెమ్స్ అండ్ డెవలప్మెంటు ఇన్ రూరల్ సొసైటీ విత్ స్పెషల్ రిఫరెన్సు టు ఏపీ 150 మొత్తం 450 -
ఏపీపీఎస్సీలో సమాచార బ్యాంకు
* నిరుద్యోగుల సమాచారం నిక్షిప్తం * ఆనందం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు * ఒక్కసారి నమోదు చేస్తే చాలు విజయనగరం: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దరఖాస్తుల సమయంలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించడానికి సాంకేతికత సాయం తీసుకుంది. పరీక్ష ఏదైనా విద్యార్థి లేదా నిరుద్యోగి ఒక్కసారి డేటా నమోదు చేసుకుంటే వాటిని ప్రతి సారీ వాడే వెసులుబాటును తీసుకువచ్చింది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు అన్నీ ఏపీపీఎస్సీ ద్వారానే వస్తుంటాయి. వీటికి తరచూ దరఖాస్తులు చేయడం అభ్యర్థులకు కాసింత కష్టం గానే ఉంటోంది. తాజాగా అమలు చేస్తున్న కొత్త విధానంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. ఒక్కసారి దరఖాస్తు చేస్తే చాలు వాటిని ఏపీపీఎస్సీ తన వెబ్సైట్లో నిక్షిప్తం చేస్తుంది. మధ్యలో మన అర్హతలు పెరిగితే వాటిని మాత్రం నమోదు చేస్తే సరిపోతుంది. అర్హతల నమోదుకు అవకాశం.. పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న ప్రతీ విద్యార్థి విద్యార్హత వివరాలను ఏపీపీఎస్సీ తన వెబ్సైట్లో పొందుపరుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, ఒక పాస్ పోర్టు సైజ్ ఫొటో, సంతకం, సహా ఆన్లైన్లోని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన సెల్‌ఫోన్, ఈ మెయిల్ అడ్రస్‌లకు ఓ మెసేజ్ వస్తుంది. దీనిలో వచ్చిన కోడ్ నంబర్‌ను ఆన్లైన్లో పొందుపరి చి సబ్మిట్ చేయాలి. దీంతో నమోదు ప్రక్రి య పూర్తి అవుతుంది. అనంతరం ఆ వ్యక్తికి ఒక శాశ్వత నంబరు ఇస్తారు. ఏటా కొత్తగా వచ్చే విద్యార్హతలు ఎప్పటికప్పుడు నిరుద్యోగికి సంబంధించిన ప్రొఫైల్‌లో అప్లోడ్ చేయవచ్చు. ప్రయోజనాలు.. ఉద్యోగ ప్రకటన వెలువడిన వెంటనే ముం దుగా మనకు కేటాయించిన శాశ్వత నంబరు ఆధారంగా కేవలం నిర్ణీత రుసుం చెల్లిస్తే చాలు. మనం దరఖాస్తు చేసినట్లే. దీనివల్ల ఉద్యోగ ప్రకటన వచ్చే ప్రతి సారీ నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. డేటా బ్యాంకులో అప్పటికే విద్యార్థి లేదా నిరుద్యోగి విద్యార్హతలు నమోదై ఉండటంతో వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఏ పరీక్షకు అర్హత ఉందో తెలుసుకొని దానికి మనం రుసుం చెల్లిస్తే సరిపోతుంది. మున్ముందు పరీక్షలన్నీ ఆన్లైన్లోనే... విద్యార్థి లేదా నిరుద్యోగులకు సంబంధించిన ప్రొఫైల్ పొందు పరుచుకొనే విధానాన్ని మొదటిసారిగా అందుబాటులోనికి తెచ్చిన ఏపీపీఎస్సీ ఇకపై ప్రతి పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించిన శాఖా పరమైన పరీక్షలు (డిపార్టుమెంట్ టెస్టులు) ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన పరీక్షలు రాసే వారు ఇబ్బంది పడకుండా మాక్ టెస్టులను అందుబాటులో ఉంచారు. దీని వల్ల ఆన్లైన్ పరీక్ష అంటే భయపడాల్సిన పని లేదు. ఇలా నమోదు చేసుకోవాలి... ప్రతీ విద్యార్థి ‘పీఎస్ఈ.ఏపీ.జీఓటీ.ఐన్’ వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ సూచనలకు అనుగుణంగా విద్యార్హతలు, ఇతర వివరాలు నమోదు చేసుకోవాలి. దీనిలో ఏమైనా ఇబ్బం దులు వస్తే ఏపీ ఆన్లైన్ కేంద్రాలకు వెళ్లి నిర్ణీత రుసుం చెల్లించి నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ విధానాన్ని ఈ నెల నుంచే అందుబాటులోనికి తీసుకువచ్చారు. నిరుద్యోగులకు ఎంతో ప్రయోజనకరం ఈ కొత్త సమాచార నిక్షిప్త కార్యక్రమం నిరుద్యోగులకు ఎంతో ఉపయోకరం. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు తమ ధ్రువపత్రాలను ఒకేచోట ఉంచడం, కొత్త విద్యార్హతలు పొందిన సందర్భంలో వాటిని అదనంగా నమోదు చేయడం మంచి విధానం. దీన్ని అందరూ వినియోగించుకోవాలి. అన్ని రంగాల్లోనూ సాంకేతిక విప్లవం వచ్చాక ఉద్యోగార్ధులకు కూడా ప్రాధాన్యం ప్రకారం ఉద్యోగాల కల్పన, దరఖాస్తులకు కొత్త విధానం రావడం అభినందనీయం. - తూముల నాగ కార్తీక్, కరస్పాండెంట్ తాండ్ర పాపారాయ ఇంజినీరింగ్ కళాశాల, కోమటిపల్లి -
ఏపీపీఎస్సీ కొత్త వెబ్సైట్
వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సదుపాయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కొత్త వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీని ద్వారా ఉద్యోగార్థులు, ఉద్యోగులకు వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. వీరు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునివివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త వెబ్సైట్ (www.psc.ap.gov.in)ను శుక్రవారం ఏపీపీఎస్సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయ్ భాస్కర్, సెక్రటరీ ఎ.గిరిధర్ ప్రారంభించారు. ఓటీపీఆర్ ద్వారా అభ్యర్థుల దరఖాస్తు ల నుంచి పరీక్ష నిర్వహణ వరకు ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లువారు తెలిపారు. మొదట ప్రభుత్వ ఉద్యోగులకు: ఓటీపీఆర్ సదుపాయాన్ని తొలుత ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చారు. పలు శాఖల్లో విధులు నిర్వర్తిస్తూ డిపార్ట్మెంట్ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగులు ఓటీపీఆర్ ద్వారా తమ ఉద్యోగ వివరాలు నమోదు చేసుకోవచ్చు. వచ్చే నెల 9 నుంచి 14వరకు ఆన్లైన్లో నిర్వహించే డిపార్ట్మెంట్ టెస్ట్ ఈ విధానంలోనే ప్రారంభిస్తున్నట్లు కమిషన్ చైర్మన్, సెక్రటరీ తెలిపారు. మరో నెలలో నోటిఫికేషన్: రాష్ట్రంలో 20వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 12 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు కమిషన్ సెక్రటరీ తెలిపారు. తొలి నోటిఫికేషన్‌ను మరో నెలలోపు విడుదల చేసే అవకాశముందన్నారు. కాగా అభ్యర్థులు కొత్త వెబ్‌సైట్‌లోని వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేసుకోవాలి.వీటిని బట్టి యునిక్ ఐడీ(గుర్తింపు సంఖ్య) కేటాయిస్తారు. -
ఏపీపీఎస్సీ కొత్త వెబ్సైట్ ప్రారంభం
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన వైబ్ సైట్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెబ్ సైట్ లో నిరుద్యోగుల కోసం వన్ టైం రిజిస్ర్టేషన్ (otr) కు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా త్వరలోనే 12 వేల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు వెల్లడించారు. -
ఏపీలో నో వేకెన్సీ!
* ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీ లేదు.. ఇది ఏపీపీఎస్సీ లెక్క * ఖాళీ పోస్టుల సమాచారం పంపని చంద్రబాబు ప్రభుత్వం * ఒక్క నోటిఫికేషన్ కూడా వద్దని పరోక్షంగా ఆదేశాలు * 1.42లక్షల ఖాళీపోస్టులున్నాయన్న కమల్‌నాథన్ కమిటీ * ప్రభుత్వ తీరుతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశా నిస్పృహలు సాక్షి, హైదరాబాద్: ‘రాష్ర్టంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమూ ఖాళీగా లేదు..’ వాళ్లూ వీళ్లూ చెప్పడం కాదు.. ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) చెబుతున్నమాట. సర్వీస్ కమిషన్ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అదేంటి.. ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకపోవడమేమిటి.. అని ఆశ్చర్యపోతున్నారా? రాష్ర్ట ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు ఇస్తే ఆ వివరాల ప్రకారం ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఆయా పోస్టులను భర్తీ చేస్తుంది. ఆ పరీక్షల కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. నారా చంద్రబాబు నాయుడుగారి నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం భర్తీ చేయాలని కూడా ఏపీపీఎస్సీని కోరకపోతే ఆ సంస్థ మాత్రం ఏం చేస్తుంది? అందుకే ఎప్పుడు సమావేశం జరిగినా... అప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వివరాలూ రానందున ఉద్యోగ ఖాళీలేవీ లేవని ఏపీపీఎస్సీ తన నివేదికలలో రాసుకుంటోంది. తాము చెప్పేవరకూ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయవద్దని అధికారంలోకి వచ్చిన తొలిరోజే తెలుగుదేశం ప్రభుత్వం ఏపీపీఎస్సీకి స్పష్టం చేసిందని అధికారవర్గాల సమాచారం. నిజానికి చంద్రబాబు విధానమే అది. ప్రభుత్వ ఉద్యోగాలకు ఆయన బద్ధ వ్యతిరేకి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ శుద్ధ దండగమారి వ్యవహారమని ఆయన తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్నారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు... ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎపుడు విడుదలవుతాయా అని లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఏపీపీఎస్సీకి రాష్ర్ట ప్రభుత్వం కొత్త చైర్మన్‌గా పి.ఉదయభాస్కర్‌ను నియమించడంతో నోటిఫికేషన్లు వెలువడడమే తరువాయి అని నిరుద్యోగులు భావించారు. అయితే వారి ఆశలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే వేలాదిమంది కాంట్రాక్టు కార్మికులను టీడీపీ ప్రభుత్వం తొలగించిం ది. మరింత మందిని తొలగించే ఆలోచనలో ఉంది. అలాంటిది ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీకి జాబితాలను పంపిస్తుందని భావించడం అత్యాశేనని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పగ్గాలు చేపట్టి 18 నెలలవుతున్నా ఉద్యోగాల ఖాళీల వివరాలను చంద్రబాబు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి ఇంతవరకు పంపించలేదు. అందువల్ల ఏపీపీఎస్సీ లెక్కల్లో మాత్రం రాష్ర్టంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమూ ఖాళీ లేనట్లే. ఈ ఏడాది మే 28న ఇన్‌ఛార్జి ఛైర్మన్ నేతృత్వంలో జరిగిన సర్వీస్ కమిషన్ సమావేశపు నివేదికలో అదే విషయాన్ని స్పష్టంగా రాసుకున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ‘ప్రైవేటు’ సలహా! రాష్ట్ర విభజనకు ముందు వివిధ ఖాళీల భర్తీకోసం వివిధ శాఖలనుంచి ఏపీపీఎస్సీకి నివేదికలు వచ్చాయి. వాటి ప్రకారం 16వేల పోస్టులకు నోటిఫికేషన్లు సిద్ధమయ్యాయి. అయితే ఆ తరుణంలో ఎన్నికలు రావడంతో అవి నిలిచి పోయాయి. తరువాత ఖాళీల భర్తీకి సంస్థ ముందుకు వెళ్లకుండా ప్రభుత్వం కళ్లెం వేసింది. ఏపీపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉదయభాస్కర్.. ప్రభుత్వంతో మాట్లాడి నోటిఫికేషన్లు జారీచేస్తామంటూనే ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేటు రంగంలోనే మంచి అవకాశాలున్నాయని సలహా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాకున్నా నిరాశ చెందాల్సిన అవసరం లేదని ఏపీపీఎస్సీ పరీక్షలకోసం అయ్యే ప్రిపరేషన్ ప్రైవేటు ఉద్యోగాలకు పనికివస్తుందని పేర్కొన్నారు. ఈ మాత్రానికి ఏపీపీఎస్సీకి కొత్త చైర్మన్‌ను నియమించడమెందుకని, ఆయన్ను నియమించడం గుర్రానికి కాళ్లు కట్టేసి రౌతును ఎక్కించినట్లుగా ఉందని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. నోటిఫికేషన్లకు బదులు ఊస్టింగ్‌లు జాబు కావాలంటే బాబు రావాలన్నారు. కానీ బాబు వచ్చాక జాబులకు కోత పెడుతున్నారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలే లేవు. కొత్తగా నోటిఫికేషన్లు వస్తాయని ఎదురుచూస్తున్న నిరుద్యోగులు చంద్రబాబు సర్కారు తీరు చూసి ఉసూరుమంటున్నారు. ఇప్పటికే 15వేల మంది ఆదర్శ రైతులను తొలగించారు. 7వేల మంది గృహనిర్మాణ వర్క్ ఇన్స్పెక్టర్లను ఇంటికి పంపించారు. 2వేల మంది ఉపాధి హామీ కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. వైద్య ఆరోగ్యశాఖలో 1,500 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. బాబు అధికారంలోకి వచ్చాక మొత్తంగా 25వేల మందికి ఉద్యోగాలు కోల్పోయారు. ఏతావాతా ఉద్యోగాల భర్తీపై పెట్టుకున్న ఆశలు మొత్తం నీరుగారిపోతుండడంతో నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. త్రిశంకు స్వర్గంలో డీఎస్సీ! డీఎస్సీ ఫలితాలు వెల్లడై ఐదు నెలలు దాటుతున్నా ప్రభుత్వం మెరిట్ జాబితాను ప్రకటించకపోవడంతో టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులు నిరాశా నిస్పృ హల్లో ఉన్నారు. 2014 నవంబర్ 21న నోటిఫికేషన్ విడుదలైంది. 10,313 పోస్టుల భర్తీకి 2015 మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 3,97,294 మంది పరీక్షకు హాజరయ్యారు. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తెరిచేలోగానే ఫలితాలు ప్రకటించి నియామకాలు పూర్తిచేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. చివరకు ఫలితాలను జూన్ 3న ప్రకటించారు. ప్రశ్నల్లోని తప్పులపై చాలా మంది ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. కొం దరు న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు. అసలు టెట్‌ను టీచర్ రిక్రూట్‌మెంటును కలిపి నిర్వహించడం(జీవో38)పైనా కొందరు పిటిషన్లు వేశారు. ట్రిబ్యునల్‌లో ఉన్న కేసులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నియామకాల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లే అవకాశమున్నా ఆ కేసులనే సాకుగా చూపి వాయిదాలు వేసుకుంటూ వెళ్తోంది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో డీఎస్సీలోని కొన్ని కేటగిరీ పోస్టుల భర్తీపై ఇలాగే కోర్టు కేసులు పడ్డాయి. అయితే ఆ కేసులున్న కేటగిరీలను మినహాయించి తక్కిన పోస్టులన్నిటినీ అప్పటి ప్రభుత్వం భర్తీచేసింది. ప్రస్తుతం 10,313 పోస్టుల్లో 7వేలకు పైగా పోస్టులు ఎస్జీటీ కేటగిరీకి చెందినవే. వీటిపై ఎలాంటి వివాదమూ లేదు. స్కూల్ అసిస్టెంటు తదితర పోస్టులకు కొన్ని న్యాయపరమైన అభ్యంతరాలు ట్రిబ్యునల్‌లో ఉన్నాయి. ట్రిబ్యునల్‌లో అభ్యంతరాలున్నప్పటికీ స్టే ఉత్తర్వులు లేనంతవరకు ప్రభుత్వం నియామకాలకు నిరభ్యంతరంగా ముందుకెళ్లవచ్చు. కానీ ప్రభుత్వం చిన్న కారణాలను సాకుగా చూపి నియామకాలను జాప్యం చేస్తోంది. రాష్ర్టంలో ఖాళీ పోస్టులు 1.42 లక్షలు రాష్ట్రంలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగ ఖాళీలు 1.42 లక్షలు ఉన్నాయని కమలనాథన్ కమిటీ గుర్తించింది. విభజన సమయంలో నాటి ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వమే తెలంగాణ, ఏపీల్లో ఉన్న వివిధ పోస్టులు, వాటి వివరాలను కమలనాథన్ కమిటీకి అందించింది. ఆ వివరాలు కావాలని ఇప్పటివరకు ఎన్ని లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఉలు కూ పలుకూ లేకుండా పోయిందని ఏపీపీఎస్సీ వర్గాలంటున్నాయి. -
డిసెంబర్ తొలి వారంలో ఇంజనీర్ పోస్టుల ఇంటర్వ్యూలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటివరకు వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు సిద్ధమైంది. తొలుత ఇంజనీర్ పోస్టులకు ముగిసిన రాత పరీక్షలకు సంబంధించి ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన అభ్యర్థుల మెరిట్ జాబితాలను ఈనెలాఖరులోగా రూపొందించి ప్రకటించనుంది. ఆయా అభ్యర్థులకు సమాచారం పంపించేందుకు చర్యలు చేపడుతోంది. డిసెంబర్ తొలి వారంలోనే ఇంటర్వ్యూల ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇన్నాళ్లు పూర్తిస్థాయిలో కమిషన్ సభ్యులు లేకపోవడంతో ఏఈఈ, ఏఈ, మేనేజర్ వంటి పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను ప్రకటించినా ఇంటర్వ్యూలను నిర్వహించలేదు. ఇంటర్వ్యూలకు ముందుగానే మెరిట్ జాబితాలను ఇవ్వాలన్న నిర్ణయంతో ఆగింది. రెండు వారాల కిందట కమిషన్ సభ్యులను ప్రభుత్వం నియమించడంతో ఆయా ఇంటర్వ్యూల నిర్వహణపై టీఎస్పీఎస్సీ దృష్టి సారించింది. మరోవైపు నీటిపారుదలశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఇంటర్వ్యూల నిర్వహణకు చర్యలు వేగవంతం చేసింది. ఇంటర్వ్యూ బోర్డుల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయనుంది. డిసెంబర్ మొదటి వారంలో ఏఈఈ (సివిల్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను ప్రారంభించనుంది. ఆ తరువాత మెకానికల్ ఇంజనీర్ పోస్టులకు, వాటర్ వ ర్క్స్ మేనేజర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. ఏఈఈ ఇంటర్వ్యూలు పూర్తయ్యాక, ఏఈ పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహించాలని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, బీసీ క్రీమీలేయర్ అంశంపైనా ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వ వర్గాలు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. -
ఏపీపీఎస్సీ ఉద్యోగులపై హెచ్చార్సీలో ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోనికి అక్రమంగా చొరబడిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ సిబ్బందిపై తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ కో కన్వీనర్ కొంతం గోవర్దన్‌రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయంలోకి చొరబడి కీలకమైన రికార్డులను ఏపీపీఎస్సీ ఉద్యోగులు చిందర వందర చేసి, తారుమారు చేశారని, ఈ సంఘటనపై న్యాయ విచారణ జరపాలని హెచ్చార్సీని కోరారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్చార్సీ సెప్టెంబరు 21 లోగా సంఘటనకు సంబంధించి సమగ్రమైన నివేదికను అందజేయాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. -
ఏపీపీఎస్సీ కార్యదర్శిగా గిరిధర్!
* ఈ నెల 1 నుంచి సెలవులో ఉన్న గిరిధర్ * రాజధాని పనుల్లో ప్రభుత్వ విధానాలు నచ్చక కినుక సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎ. గిరిధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా గిరిధర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అనుసరిస్తున్న విధానాలు, తీరు నచ్చక గిరిధర్ ఈ నెల 1 నుంచి సెలవులో ఉన్నారు. తనను మున్సిపల్ శాఖ బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా ఆయనే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖలో కీలక పోస్టులో ఉన్న గిరిధర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యాలయ ముఖ్యకార్యదర్శిగా తొలుత నియమించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తొలి రోజుల్లో సీఎం కార్యాలయం ముఖ్యకార్యదర్శిగా గిరిధర్ అలుపెరగక రాత్రింబగళ్లు పనిచేశారు. కష్టపడి పనిచేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత మంది వందిమాగధుల చెప్పుడు మాటలను విని గిరిధర్‌ను సీఎం కార్యాలయం నుంచి మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. కొత్త రాజధాని నిర్మాణం, సింగపూర్ కంపెనీలతో మాస్టర్ ప్రణాళిక రూపకల్పన అంశాల్లో గిరిధర్ కీలక భూమిక పోషించారు. మాస్టర్ ప్రణాళికలోని అంశాలపైన, మాస్టర్ డెవలపర్ ఎంపిక, స్విస్ చాలెంజ్‌పై ప్రభుత్వ విధానాలు గిరిధర్‌కు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో ఆయన ఈ నెల 1 నుంచే సెలవులో ఉన్నారు. గిరిధర్‌ను బదిలీ చేసినప్పటికీ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం ఆ బాధ్యతలను మున్సిపల్ శాఖ కార్యదర్శి జయలక్ష్మి చూస్తున్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా కరికాల వలవన్ యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శిగా పని చేస్తున్న కరికాల వలవన్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్‌గా కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇదివరకు పౌరసరఫరాల కమిషనర్‌గా ఉన్న బి.రాజశేఖర్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే పి.ఎస్. గిరీష్‌ను అనంతపురం జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్‌గా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించి ఆయనకు నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్‌గా నియమిం చింది.డిప్యుటేషన్‌పై వచ్చిన ఐఆర్ఎస్ అధికారి గోపీనాధ్‌ను రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వుల జారీ చేశారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన నౌమాన్
పలువురు టీడీపీ నేతలు కూడా... సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మాజీ సభ్యుడు డాక్టర్ నౌమాన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సోమవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. జగన్మోహన్రెడ్డి ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలుకు చెందిన పలువురు టీడీపీ నేతలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. నంద్యాల లోక్‌సభ స్థానం టీడీపీ ఇన్చార్జి ఎన్‌హెచ్ భాస్కర్‌రెడ్డి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఎన్‌హెచ్ ప్రసాదరెడ్డి, ఇతర నేతలు గోపవరం నాగిరెడ్డి, సాయినాథ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, గణేష్‌రెడ్డి, సూరజ్‌రాంరెడ్డి, సుమంత్‌రెడ్డితో సహా పలువురు జగన్ నివాసానికి వచ్చి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీజీసీ సభ్యుడు భూమా నాగిరెడ్డి కూడా హాజరయ్యారు. -
పంచాయతీ కార్యదర్శిల పోస్టులకు తీవ్రపోటీ
సాక్షి, నల్లగొండ: పంచాయతీ కార్యదర్శి పోస్టులకు తీవ్రపోటీ నెలకొంది. జిల్లాలో ఖాళీగా ఉన్న 133 పోస్టుల కోసం 59,270 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 445 మంది పోటీపడుతున్నారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గత డిసెంబర్ 30న నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. గతనెల 4 నుంచి 26వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 23న ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్ష నిర్వహించనుంది. జిల్లాలో ఏడు పట్టణాల్లో అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వీలుగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్లగొండ, భువనగిరి, సూ ర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్లతోపాటు హుజూర్నగర్, కోదాడ పట్టణాల్లో 230 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ చేపట్టనున్నారు. జెడ్పీ సీఈఓ, డీఆర్ఓ, డీపీఓలను పరీక్ష కోఆర్డినేటర్లుగా కలెక్టర్ చిరంజీవులు నియమించారు. పరీక్ష నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోందని, అభ్యర్థులు ఎటువంటి పుకార్లు నమ్మకూడదని కలెక్టర్ సూచించారు. దళారులు ఉద్యోగాల ఎర వేసినా ఆకర్షితులై మోసపోకూడదని చెప్పారు. ప్రతిభ ఆధారంగానే పోస్టుల భర్తీ జరుగుతుందని తెలిపారు. వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్ష నిర్వహించిన మాదిరిగా మాస్‌కాపీయింగ్, ఇంపర్సినేషన్‌కు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.