సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు కేటగిరీ నోటిఫికేషన్ల పరీక్షల్లో అర్హత సాధించిన, పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో విడుదల చేశారు.
► ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రయిబల్ వెల్ఫేర్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులకు ప్రొవిజనల్ సెలెక్టెడ్ జాబితాను కమిషన్ ప్రకటించింది. దీన్ని కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరిచినట్టు పేర్కొంది.
డిగ్రీ కాలేజీ లెక్చరర్లు
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని మైక్రో బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ సబ్జెక్టుల పోస్టులకు ఎంపికైన వారి ప్రొవిజనల్ సెలెక్టెడ్ జాబితాను కమిషన్ బుధవారం విడుదల చేసి.. కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరిచింది.
మైన్స్ అండ్ జియాలజీ
మైన్స్ అండ్ జియాలజీ విభాగంలోని టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను ఈ నెల 27న పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది. ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఈ పరిశీలన జరగనుంది. అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ నుంచి మెమో, చెక్‌లిస్ట్, అటెస్టేషన్ ఫారాలు, నాన్ క్రిమీలేయర్ ప్రొఫార్మా(బీసీ అభ్యర్థులు) డౌన్‌లోడ్ చేసుకోవాలి. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో వాటిని కమిషన్‌కు అందించాలి.
ఆగస్టు 6 నుంచి డిపార్టుమెంటల్ టెస్ట్
డిపార్టుమెంటల్ టెస్ట్‌ను ఆగస్టు 6వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొంది.
ఆగస్ట్ 28న రిమ్స్ ఎంట్రన్స్ టెస్ట్
రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీలో 8వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్షను ఆగస్ట్ 28న నిర్వహిస్తున్నట్టు కమిషన్ వివరించింది. మేథమెటిక్స్, జనరల్ నాలెడ్జి, ఇంగ్లీషు సబ్జెక్టులకు సంబంధించి సెషన్లలో పరీక్ష జరగనుంది.
ఏపీపీఎస్సీ సమాచారం
Published Thu, Jul 8 2021 3:42 AM | Last Updated on Thu, Jul 8 2021 3:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment