ఈనెల 30లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో మార్పులు చేపట్టేందుకు అవసరమైన అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అధ్యక్షుడిగా ఏడుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఇతర రాష్ట్రాల్లోని సర్వీస్ కమిషన్స్‌లో అనుసరిస్తున్న విధానాలు, వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీ తదితర అంశాలపై అధ్యయనం చేసి ఈనెల 30వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
19 నుంచి ఆయుష్ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన
ఆయుష్ విభాగంలో ఆయుర్వేద, హోమియో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 19 నుంచి పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో నిర్వహించిన వెరిఫికేషన్ సమయంలో ఆలస్యాన్ని నివారించేందుకు 1: 3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థుల మెరిట్ లిస్టును కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచామని, ఈనెల 19, 20 తేదీల్లో అభ్యర్థులు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment