Ayush
-
Asia Cup 2024: టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. సెమీ ఫైనల్లో భారత్
అండర్-19 ఆసియా కప్-2024 టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. వరుసగా రెండో విజయం సాధించి సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. షార్జాలో బుధవారం నాటి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ను చిత్తుగా ఓడించి టాప్-4కు అర్హత సాధించింది.కాగా దుబాయ్ వేదికగా వన్డే ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూప్-‘ఎ’లో ఉంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడి ఓటమిపాలైన మహ్మద్ అమాన్ సేన.. రెండో మ్యాచ్‌లో జపాన్ను 211 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది.137 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈతో షార్జా క్రికెట్ స్టేడియంలో యువ భారత్ తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. కేవలం 137 పరుగులకే ఆలౌట్ అయింది. రయాన్ ఖాన్ ఒక్కడు 35 పరుగులతో రాణించగా.. మిగతావాళ్లంతా చేతులెత్తేయడంతో 44 ఓవర్లలోనే యూఏఈ కథ ముగిసింది. భారత బౌలర్లలో యుధాజిత్ గుహ మూడు వికెట్లతో చెలరేగగా.. చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ పసికూనపై ప్రతాపం చూపింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ విజయం అందించారు. ఆయుశ్ 51 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 67 పరుగులు చేయగా.. వైభవ్ 46 బంతుల్లోనే 76 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉండటం విశేషం.టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. ఇలా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా విజృంభించడంతో భారత్ కేవలం 16.1 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది. వైభవ్ కొట్టిన సిక్సర్‌తో విజయతీరాలకు చేరిన టీమిండియా(143).. పది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టిన ఆయుశ్ మాత్రే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. కాగా అండర్-19 ఆసియా కప్‌లో డిసెంబరు 6న సెమీస్ మ్యాచ్‌లు జరుగనుండగా.. డిసెంబరు 8న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.చదవండి: రోహిత్ వచ్చాడు!.. ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారు?.. కేఎల్ రాహుల్ స్టన్నింగ్ ఆన్సర్ -
Ind vs Pak: ఆఖరి వరకు పోరాడిన యువ భారత్.. పాక్ చేతిలో తప్పని ఓటమి
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. లీగ్ దశలో తమ తొలి మ్యాచ్‌లో భారత్‌తో తలపడ్డ పాక్.. 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. షాజైబ్ ఖాన్ భారీ శతకంఓపెనర్లలో ఉస్మాన్ ఖాన్హాఫ్ సెంచరీ(60)తో మెరవగా.. షాజైబ్ ఖాన్ భారీ శతకం బాదాడు. మొత్తంగా 147 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 159 పరుగులు సాధించాడు.ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన మహ్మద్ రియాజుల్లా 27 రన్స్ చేయగా.. మిగిలిన వాళ్లలో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు. అయితే, ఓపెనర్లు వేసిన బలమైన పునాది కారణంగా పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 281 పరుగులు స్కోరు చేసింది.భారత బౌలర్లలో పేసర్లు సమర్థ్ నాగరాజ్ మూడు, యుధాజిత్ గుహ ఒక వికెట్ పడగొట్టగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆయుశ్ మాత్రే రెండు, కిరణ్ చోర్మలే ఒక వికెట్ తమ ఖాతాలో జమచేసుకున్నారు. అయితే, లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆదిలోనే భారీ షాకులు తగిలాయి.ఆదిలోనే ఎదురుదెబ్బఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఒక్క పరుగుకే వెనుదిరగగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీ సిద్దార్థ్ 15 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే 20 పరుగులుతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ మొహ్మద్ 16 పరుగులకు నిష్క్రమించాడు. ఇక 82 పరుగులకే జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నిఖిల్ కుమార్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.Nikhil Kumar brings up a crucial half-century, adding vital runs for India! 💪🏏Watch #INDvPAK at the #ACCMensU19AsiaCup, LIVE NOW on #SonyLIV! pic.twitter.com/X7DCbJLNxq— Sony LIV (@SonyLIV) November 30, 2024 నిఖిల్ వీరోచిత అర్ధ శతకంఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన నిఖిల్ 77 బంతులు ఎదుర్కొని.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 67 రన్స్ చేశాడు. అయితే, నవీద్ అహ్మద్ ఖాన్ బౌలింగ్‌లో నిఖిల్ స్టంపౌట్ కావడంతో యువ భారత్ విజయానికి దూరమైంది. మిగతా వాళ్లలో కిరణ్(20), వికెట్ కీపర్ హర్వన్ష్ సింగ్(26) కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. ఆఖర్లో మొహ్మద్ ఇనాన్ పోరాటపటిమ కనబరిచాడు. చావోరేవో తేల్చుకోవాలన్నట్లుగాచేతిలో ఒకే ఒక వికెట్ ఉన్న సమయంలోనూ చావోరేవో తేల్చుకోవాలన్నట్లుగా బ్యాట్ ఝులిపించాడు. ఈ టెయిలెండర్ 22 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, దురదృష్టవశాత్తూ యుధాజిత్ గుహ(12*)తో సమన్వయలోపం కారణంగా ఇనాన్ రనౌట్ అయ్యాడు. దీంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. 47.1 ఓవర్లలో 237 పరుగులకు అమాన్ సేన ఆలౌట్ అయింది.ఫలితంగా పాకిస్తాన్ 44 పరుగుల తేడాతో గెలుపొంది ఈ వన్డే టోర్నీని విజయంతో ఆరంభించింది. ఇక పాక్ బౌలర్లలో అలీ రజా మూడు వికెట్లు తీయగా.. అబ్దుల్ సుభాన్, ఫాహమ్ ఉల్ హఖ్ రెండేసి వికెట్లు కూల్చారు. నవీద్ అహ్మద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.తదుపరి జపాన్తోఇదిలా ఉంటే.. భారత్ తమ రెండో మ్యాచ్‌లో జపాన్‌తో డిసెంబరు 2న తలపడనుంది. మరోవైపు.. అదే రోజు పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో మ్యాచ్ ఆడుతుంది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్ -
ఏపీపీఎస్సీలో మార్పులకు కమిటీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో మార్పులు చేపట్టేందుకు అవసరమైన అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ అధ్యక్షుడిగా ఏడుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఇతర రాష్ట్రాల్లోని సర్వీస్ కమిషన్స్లో అనుసరిస్తున్న విధానాలు, వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల జారీ తదితర అంశాలపై అధ్యయనం చేసి ఈనెల 30వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 19 నుంచి ఆయుష్ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలనఆయుష్ విభాగంలో ఆయుర్వేద, హోమియో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 19 నుంచి పరిశీలించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో నిర్వహించిన వెరిఫికేషన్ సమయంలో ఆలస్యాన్ని నివారించేందుకు 1: 3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థుల మెరిట్ లిస్టును కమిషన్ వెబ్సైట్లో ఉంచామని, ఈనెల 19, 20 తేదీల్లో అభ్యర్థులు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. -
ఆరోగ్య యోగం ఎప్పుడో ?
సాక్షి, సిద్దిపేట: ఆయుష్ ఆస్పత్రులకు అనుబంధంగా యోగా కేంద్రాల నిర్మాణం జరిగినా, అవి ప్రారంభానికి నోచుకోలేదు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 421 ఆయుర్వేద, యునాని, హోమి యోపతి వైద్య,ఆరోగ్య కేంద్రాలకు యోగా కేంద్రాలను మంజూరు చేశారు.పలు చోట్ల నిర్మా ణాలు పూర్తయినా, శిక్షకులను నియమించకపోవడంతో అవి స్టోర్ రూంలను తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి యోగా శిక్షకులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ఒక్కో కేంద్రానికి రూ.6 లక్షలు ప్రస్తుత సమాజంలో మనుషులు ఉరుకులు.. పరుగుల జీవితం గడుపుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు తీరిక లేకుండా బిజీగా ఉంటున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. దీంతో అనారోగ్యం పాలై ఆస్పత్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. శారీరక శ్రమ లేకపోవడంతో చాలామంది షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పట్టణాలు, పల్లెల ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు వీలుగా యోగాను ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో యోగా కేంద్రం షెడ్ నిర్మాణానికి రూ.6 లక్షల చొప్పున రూ 25.26 కోట్ల నిధులు విడుదల చేశారు.ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్మాణ బాధ్యతలను ఆర్అండ్బీ, పీఆర్, టీఎస్ఎంఐడీసీలకు అప్పగించారు. తెలంగాణవ్యాప్తంగా 421 కేంద్రాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 289 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 42 కేంద్రాల నిర్మాణం జరుగుతుండగా, మరో 90 కేంద్రాలకు స్థల కొరత ఏర్పడింది. నిర్మాణాలు పూర్తయినా.. యోగా శిక్షణకు షెడ్ల నిర్మాణాలు పలు చోట్ల పూర్తయినా, అవి ప్రారంభానికి నోచుకోలేదు. కొన్ని జిల్లాల్లో ఏడాదిన్నర క్రితం నిర్మాణాలు పూర్తయినప్పటికీ యోగా శిక్షకులను నియమించకపోవడంతో అవి తెరుచుకోలేదు. ఈ షెడ్లు వినియోగంలో లేకపోవడంతో పలు చోట్ల స్టోర్ రూంలుగా, మరికొన్ని చోట్ల అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. శిక్షకుల నియామకం ఎప్పుడు? రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో యోగా శిక్షణ కేంద్రానికి ఇద్దరు శిక్షకుల చొప్పున నియమించాలని నిర్ణయించారు. అందులో ఒక పురుషుడు, ఒక స్త్రీ ఉండే వి«ధంగా ప్రణాళిక రూపొందించారు. గత నెలలో యోగా శిక్షకుల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా దరఖాస్తులు ఆహా్వనించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు నియామకాలు చేపట్టలేదు. పురుషులకు నెలకు రూ.8 వేలు, మహిళకు రూ.5 వేలు వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యోగా శిక్షణ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. త్వరలో ప్రారంభిస్తాం త్వరలో యోగా కేంద్రాలను ప్రారంభిస్తాం. కమిషనర్ ఆదేశాల మేరకు శిక్షకుల ఎంపికకు గత నెలలో ఆయా జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించాం. త్వరలో శిక్షకులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తాం. – రవినాయక్, ఆర్డీడీ, హైదరాబాద్, ఆయుష్ -
అద్భుత ఫలితాలంటూ ప్రకటించడం నేరం
న్యూఢిల్లీ: వివిధ వ్యాధుల నివారణలో ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయంటూ ప్రకటించడం చట్ట వ్యతిరేకమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎటువంటి ధ్రువీకరణలు లేని ఇలాంటి ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించడంతోపాటు వారి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని హెచ్చరించింది. ఇటువంటి ప్రకటనలపై నిషేధం విధించామని, ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలిపింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది.తాము ఏవిధమైన ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోప తి(ఏఎస్యూహెచ్) మందులకు ధ్రువీకరణలను ఇవ్వలేదని కూడా తెలిపింది. అదేవిధంగా, ఆయా వైద్య విధానాలకు సంబంధించిన ఔషధాల తయారీ, విక్రయాలకు కూడా ఏ ఉత్పత్తిదారు లేదా కంపెనీకి అనుమతులు మంజూరు చేయలేదని ఆయుష్ శాఖ స్పష్టం చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం–1940ని అనుసరించి ఏఎస్యూహెచ్ ఔషధాల తయారీ, విక్రయాలకు అనుమతులను సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలే జారీ చేస్తాయని కూడా వివరించింది. ఏఎస్యూహెచ్ ఔషధాలను సంబంధిత వైద్యులు/ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలని కూడా తెలిపింది. అభ్యంతరకర, తప్పుడు ప్రకటనలు, నకిలీ మందులపై రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీకి లేదా ఆయుష్ శాఖకు ఫిర్యాదు చేయాలని కేంద్ర ఆయుష్ శాఖ సూచించింది. -
ఆయుష్.. నొప్పులు మాయం
లక్డీకాపూల్: జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులతో నగర ప్రజలు వివిధ రకాల నొప్పులతో సతమతమవుతున్నారు. అవే పెద్ద సమస్యలుగా భావించి చాలా మంది కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. తొలనొప్పి, కండరాల, మోకాళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, మిటమిన్స్ లోపం, అధిక బరువు వంటి సాధారణ సమస్యలను కూడా చాలా మంది పెద్ద జబ్బులుగా భావిస్తున్నారు. దీంతో రిఫరల్ అస్పత్రి అయిన నిమ్స్ సైతం రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతోనే సహజ సిద్ధమైన వైద్య చికిత్సలతో నొప్పులకు ఉపశమనం కలి్పంచాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయూష్ శాఖ నిమ్స్‌లో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలోపతి వైద్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తూనే.. దేశీయ వైద్యానికి సైతం పెద్దపీట వేస్తున్నారు. సంప్రదాయ వైద్యమైన ఆయుష్ సేవలకు ప్రాచుర్యం కలి్పంచేందుకు దృష్టిని కేంద్రీరించింది. లోపించిన శారీరకశ్రమ..మనిషి కూర్చునే భంగిమని బట్టి కూడా ఈ నొప్పులు చోటుచేకుంటాయి. వాస్తవానికి ఇటీవల కాలంలో శారీరశ్రమ లోపించింది. చెప్పాలంటే.. శరీరాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. విటమిన్ల లోపం వల్ల కొంత మంది ఇబ్బంది పడుతుంటే పోషకాహార లోపం వల్ల మరికొంత మంది అనార్యోగం పాలవుతున్నారు. ఆస్పత్రికి వచి్చన రోగులకు ప్రకృతి వైద్యం పట్ల అవాగాన కల్పిస్తూ.. భవిష్యత్తులో వారు ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురికాకుండా చూసేందుకే ఈ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ కృషి చేస్తుంది. – డా.నాగలక్షి్మ, ప్రకృతి వైద్యనిపుణురాలు అలోపతికి సమాంతరంగా...అలోపతి వైద్యానికి సమాంతరంగా ఆయుష్ సేవలు కూడా ప్రజలకు చేరువ కానున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, సీజనల్, ప్రసూతి సమస్యలు, కీళ్ల నొప్పులు తదితర అన్ని రకాల సమస్యలకూ ప్రకృతి వైద్య చికిత్స అందుబాటులో ఉండడమే కాకుండా వ్యాధి మూలాలపై పనిచేసి, పునరావృతం కాకుండా చేయడమే సహజ వైద్య చికిత్సల లక్ష్యమని నిపుణులు పేర్కొంటున్నారు. నరగంలో పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి స్థాయిలు, ఆందోళన మొదలైన పర్యావరణ మార్పులకు దారితీసింది. అటువంటి సమస్యలను ఎదుర్కోవటానికి ఏకైక మార్గం ప్రకృతి వైద్య చికిత్సలు. సాధారణ నొప్పులతో పాటు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి తక్కువ ఖర్చుకే సహజమైన పద్ధతిలో మెరుగైన సేవలు అందిస్తున్నారు. అలోపతి వైద్య పద్దతిలో లొంగని వ్యాధులకు సైతం ఆయుష్ ఉపశమనం కలి్పస్తుంది. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఈ సహజ వైద్య చికిత్సల పట్ల ఆసక్తి చూపుతున్నారు.నామమాత్రపు రుసుము..పంచకర్మ చికిత్సల్లో భాగంగా స్నేహకర్మ, నదిస్వేదం, పిండిస్వేదం, కతివస్తి, జనువస్తి, నాశ్యకర్మ, శిరోధార, డెటాక్స్ థెరపీ, బరువు నియంత్రణ, మానసిక ఒత్తిడి నిర్మూలన, బాడీ మసాజ్, మైగ్రేన్ వంటి సేవలతో పాటు ప్రకృతి వైద్య సేవల్లో భాగంగా జనరల్ మసాజ్, స్టీమ్‌బాత్, డైట్ కౌన్సిలింగ్, కోల్డ్ బ్లాంకెట్ ప్యాక్, తల, కండరాలు, నడుం, భుజాలు, మోకాళ్ల నొప్పులకు చికిత్సలు అందిస్తుంది. ఆక్యుపంక్చర్, యోగ వంటి సేవలను కూడా అందుబాటులో ఉంచింది. రోగులు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి చికిత్సను అందిస్తుంది. ఎంపిక చేసుకున్న చికిత్స, సేవలు, సిట్టింగ్ ఆధారంగా నామమాత్రపు రుసుమును వసూలు చేస్తున్నారు. చికిత్స పొందాలంటే ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. వాస్తవానికి సహజ వైద్య చికిత్సలను ప్రణాళికబద్ధంగా అనుసరించాల్సిందే. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఒక స్లాట్‌గా, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదున్నర గంటల వరకూ మరో స్లాట్‌గా నిర్ణయించారు. -
‘ఆయుష్’కు కొత్త కళ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆయుష్ డిస్పెన్సరీలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. రంగులు వెలిసిపోయి, పాచిపట్టి అధ్వానంగా కనిపించే డిస్పెన్సరీలు కళకళలాడుతున్నాయి. రోగులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్ అవసరాల కోసం ముందుగానే మందులు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అల్లోపతి ఆస్పత్రుల రూపురేఖలు మార్చినట్లుగానే ఆయుష్ ఆస్పత్రులను సైతం అన్ని విధాలా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో ఎంపిక చేసిన 110 డిస్పెన్సరీలను ఆధునికీకరిస్తున్నారు. ఒక్కో డిస్పెన్సరీకి రూ.3.5 లక్షలు కేటాయించి భవనాలకు మరమ్మతులు చేసి రంగులు వేస్తున్నారు. ఎలక్రి్టకల్, ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. సోలార్ ప్యానల్స్‌ను అమర్చి విద్యుత్ ఆదాకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 95 డిస్పెన్సరీల్లో మరమ్మతులు, రంగులు వేయడం వంటి పనులన్నీ పూర్తయ్యాయి. రూ.12 కోట్లతో మందుల సరఫరా ఈ ఏడాది మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 735 ఆయుష్ డిస్పెన్సరీలకు రూ.3 కోట్లతో ప్రభుత్వం మందులు సరఫరా చేసింది. ఈ మందులు వినియోగంలో ఉండగానే భవిష్యత్‌లో కొరత లేకుండా మరో రూ.12 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తోంది. రెండు నెలల్లో కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసి డిస్పెన్సరీలకు మందులను సరఫరా చేయనుంది. ఇంగ్లిష్ మందుల తరహాలోనే ఆయుష్ మందులను కూడా ట్యాబ్లెట్లు, క్యాప్సుల్స్, సిరప్స్, టానిక్స్ రూపంలో అందజేసేలా కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం 110 డిస్పెన్సరీలను ఆధునికీకరిస్తున్నామని, విడతల వారీగా అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని ఆయుష్ కమిషనర్ డాక్టర్ ఎస్బీ రాజేంద్రకుమార్ లగింశెట్టి తెలిపారు. -
గాజువాక ఆటోనగర్ లో 112 అడుగుల ఆయుష్ గణపతి
-
మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
లక్డీకాపూల్: మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు కేవలం నినాదాల పార్లు .. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని పేర్కొన్నారు. గురువారం –నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్‌ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో ఆ రెండు పార్లు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా, ఖర్గేలు పర్యాటకుల్లా వచ్చి.. అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారన్నారు. గుజరాత్లో బీజేపీ గుడ్డి పాలనను దారిలో పెట్టడం చేతగాని అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మూడు నెలలకే కాంగ్రెస్ తీరేమిటో తేలిపోయిందని, ముందుగా ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలని సూచించారు. వివిధ పార్టీల డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని..బీఆర్ఎస్కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎపుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. నిమ్స్‌లో ఆయుష్ ఏర్పాటు రాష్ట్రంలోనే తొలిసారి నిమ్స్‌లో ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎస్ శాంతి కుమారికి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఈ తరహా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారన్నారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, ప్రకృతి వైద్యం.. అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటల్లో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో కొత్తగా 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. త్వరలో మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించబోతుందని హరీశ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నిమ్స్ సంచాలకులు నగరి బీరప్ప, ఆయుష్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థులకు వరం.. డిజిటల్ లైబ్రరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యవిద్యకు సంబంధించిన అత్యాధునిక పుస్తకాలు, వివిధ రకాల అరుదైన చికిత్సలకు సంబంధించిన వీడియోలు, వేలాది జర్నల్స్‌తో కూడిన డిజిటల్ లైబ్రరీ (ఈ–లైబ్రరీ)ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వైఎస్సార్ మెడ్‌నెట్ కన్సార్షియం పేరుతో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ, ఆయుష్, పారా మెడికల్, నర్సింగ్ కోర్సులకు సంబంధించి వేలాది రకాల అత్యాధునిక పాఠ్యపుస్తకాలు, జర్నల్స్, అరుదైన చికిత్సలు, ట్రీట్మెంట్ ప్రొటోకాల్‌కు సంబంధించిన వీడియోలు ఉంచారు. ప్రతి విద్యార్థి డిజిటల్ లైబ్రరీని సులభంగా వినియోగించుకునేందుకు మైలాఫ్ట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం యూనివర్సిటీ రూ. 4 కోట్లు వెచ్చించింది. మైలాఫ్ట్.. యూజర్ ఫ్రెండ్లీ యాప్.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 2008లోనే డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. కానీ పరిమిత సంఖ్యలో మాత్రమే అక్కడ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. లైబ్రరీలో మాత్రమే దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో లైబ్రరీ పనివేళల్లో వెళ్లేందుకు కుదరకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. పరిస్థితి గమనించిన ప్రస్తుత వర్సిటీ అధికారులు అత్యాధునిక పరిజ్ఞానంతో మైలాఫ్ట్ (మై లైబ్రరీ ఆన్ ఫింగర్ టిప్స్) అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు, టీచింగ్ వైద్యులు, ఎక్కడినుంచైనా తమ మొబైల్లో సైతం లాగిన్ అయ్యి డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీన్లో 21 వేలకు పైగా ఈ–బుక్స్, 22,433కు పైగా ఈ– జర్నల్స్, 11,000 పైగా వీడియోలు ఉన్నాయి. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రతి విద్యార్థి ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా డిజిటల్ లైబ్రరీని ఆధునీకరించాం. మైలాఫ్ట్ యూజర్ ఫ్రెండ్లీ యాప్ ద్వారా విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎక్కడి నుంచైనా, తమ మొబైల్స్‌లో సైతం లాగిన్ అయ్యే అవకాశం కల్పించాం. డిజిటల్ లైబ్రరీ వినియోగంపై అన్ని కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ వి.రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ సద్వినియోగం చేసుకోవాలి మైలాఫ్ట్ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు టెక్నికల్ సిబ్బందితో కలిసి జోనల్ వారీగా సదస్సులు నిర్వహించి యాప్ వినియోగంపై ఫ్యాకలీ్ట, విద్యార్థుల్లో అవగాహన కలి్పస్తున్నాం. వేలాది ఈ–బుక్స్, ఈ–జర్నల్స్, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. – డాక్టర్ కె.సుధ, కో ఆర్డినేటర్, కన్సార్షియం, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
మెగాహీరోకి పోటీగా శరత్ బాబు వారసుడు
కొన్నాళ్ల క్రితం (మే 22) కన్నుమూసిన సీనియర్ నటుడు శరత్‌బాబు ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడు. శరత్‌బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దక్ష’. కాగా గతంలో ఆయుష్‌ని తన నటవారసుడిగా శరత్‌బాబు పేర్కొన్నారు. వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ‘దక్ష’ ఈ నెల 25న విడుదల కానుంది. ఇదే రోజున మెగా హీరో వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' థియేటర్లలోకి రానుంది. ‘‘మా రెండేళ్ల కష్టం ఈ సినిమా. మా ప్రోడ్యూసర్, డైరెక్టర్ రాజీ పడకుండా పూర్తి చేశారు. మా నాన్న (శరత్‌బాబు)గారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం’’ అన్నారు ఆయుష్. అఖిల్, రవి రెడ్డి, అను, రియా, పవన్, నక్షత్ర తదితరులు నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ చిత్రానికి సంగీతం: లలిత్. -
ఆయుష్‌లో 156 వైద్యుల పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: ఆయుష్ విభాగంలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మెడికల్, హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయుర్వేదంలో 54, హోమియోలో 33, యునానిలో 69 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆగస్టు ఏడో తేదీ ఉదయం 10.30 గంటల నుంచి అదే నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకోసం mhsrb.telangana.gov.in వెబ్సైట్ సందర్శించాలని బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీ జోన్–1లో 37, మల్టీ జోన్–2లో 17 పోస్టులను భర్తీ చేస్తారు. హోమియో మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీ జోన్–1లో 23, మల్టీ జోన్–2లో 10 పోస్టులను భర్తీ చేస్తారు. యునానీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో మల్టీ జోన్–1లో 36, మల్టీ జోన్–2లో 33 భర్తీ చేస్తారు. అభ్యర్థులు జూలై 1వ తేదీ నాటికి 18–44 ఏళ్ల వయసుగల వారై ఉండాలి. ఈ పోస్టుల పేస్కేల్ రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు ఉంటుంది. ఖాళీలను చేర్చడం లేదా తొలగించడం.. ఏదైనా ఉంటే ఫలితాల ప్రకటన వరకు చేస్తారు. 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక.. అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపికచేస్తారు. అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ అభ్యర్థులకు గరిష్టంగా 20 పాయింట్లు కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2.5 పాయింట్లు ఇస్తారు. ఇతర ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున ఇస్తారు. సంబంధిత అధికారులు ఈ ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. మెరిట్ జాబితాను బోర్డు వెబ్సైట్లో ఉంచుతారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సందర్భంగా అప్లోడ్ చేయాల్సిన పత్రాలను కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆధార్ కార్డు, పదో తరగతి సర్టిఫికెట్, సంబంధిత డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్కుల మెమో, సంబంధిత డిగ్రీ సర్టిఫికెట్, బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్, తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అనుభవ ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), లోకల్ ఏరియా కోసం స్టడీ సర్టిఫికెట్ (1 నుంచి 7వ తరగతి), కమ్యూనిటీ సర్టిఫికెట్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ), బీసీల విషయంలో తాజా నాన్–క్రీమీ లేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్ కోరే దరఖాస్తుదారులకు తాజా ఆదాయ సర్టిఫికెట్ ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు రుసుము కింద ప్రతి దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 500 చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు తప్పని సరిగా రూ. 200 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల దరఖాస్తుదారులకు ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత రిఫరెన్స్ ఐడీ నంబర్ జనరేట్ అవుతుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులకు ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. -
TS: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆయుష్‌లో మొత్తం 156 ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, అభ్యర్థులు ఆగస్టు 7న ఉదయం 10.30గంటల నుంచి నుంచి 22న సాయంత్రం 5 గంటలవరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, మొత్తం 156 ఉద్యోగాల్లో.. మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం) 54; హోమియో 33, యునాని 69 చొప్పున ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో డిగ్రీ పాసైన వారు ఈ పోస్టులకు అర్హులు. - అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మించరాదు. - దరఖాస్తు రుసుం రూ.500. - ప్రాసెసింగ్ ఫీజు రూ.200లుగా నిర్ణయించారు. - ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్సర్వీస్మెన్లకు ప్రాసెసింగ్ పీజు నుంచి మినహాయించారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
ఆయుష్ ను బలోపేతం చేస్తాం
సిద్దిపేటజోన్: ప్రభుత్వం ఆయుష్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని, ఆయుర్వేద వైద్య సేవలను మరింతగా విస్తృతం చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉండేలా చూస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీసు కన్వెన్షన్ హాల్లో ఆయుష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సమావేశంతోపాటు పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఆయుర్వేద వైద్యాన్ని నిర్లక్ష్యం చేశాయని అన్నారు. గతంలో కేవలం 400 మంది వైద్యులను నియమిస్తే, తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 1,200 మందిని నియమించిందని పేర్కొన్నారు. జీవనధార మాకు జీవం అయింది.. ఆయుష్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో తయా రుచేసిన జీవనధార ఔషధం తమకు జీవం అయిందని, సీఎం కేసీఆర్‌తోపాటు తానుకూడా జీవనధా ర మందును కరోనా సమయంలో నిత్యం వాడానని హరీశ్‌రావు తెలిపారు. ఆయుర్వేద వైద్య సేవలను మరింతగా విస్తరించడానికి త్వరలో సిద్దిపేట, భూ పాలపల్లి, వికారాబాద్ జిల్లాల్లో 50 పడకల ఆసుపత్రులను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపా రు. అలాగే సిద్దిపేట మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఆయుర్వేద ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిందాల్ ప్రకృతి చికిత్సాలయం తరహా లో వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్‌లో ఔ షధమొక్కలతో ఆయుర్వేద ఔషధాలను తయారు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం రాష్ట్రవ్యాప్తంగా పల్లె దవాఖానాల నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్ చెప్పారు. ఇందులో భాగంగా రెండు వేల పల్లె దవాఖానాల నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చి నట్టు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో జరిగిన ఒప్పందం వల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఇక్కడి మెడికల్ కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉమ్మడి ఒప్పందం ద్వారా అడ్మిషన్లు తీసుకుంటున్నారని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చి న 21 మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు కేవలం తెలంగాణ విద్యార్థులకు ఉండేలా జీఓ తెస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఒకప్పటి జర్నలిజానికి, ఇప్పటి జర్నలిజానికి చాలా తేడా ఉందని మంత్రి అన్నారు. తెలంగాణ దళిత జర్నలిస్టులకు దళితబంధు ఇస్తామని చెప్పారు. కోమటి చెరువు సూపర్ హరీశ్‌కు సహచర మంత్రుల అభినందన సిద్దిపేటజోన్: సిద్దిపేట కోమటి చెరువు చాలా బాగుందని.. సహచర మంత్రి హరీశ్ రావు చిత్తశుద్ధి, పట్టుదలకు ఇది నిదర్శనమని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కితాబిచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్ పర్యటించారు. ఈ సందర్భంగా వారంతా కోమటి చెరువును సందర్శించారు. తీగల వంతెన, నెక్లెస్ రోడ్, గ్లో గార్డెన్, సింథటిక్ ట్రాక్‌ను తిలకించారు. వారికి మంత్రి హరీశ్ రావు అభివృద్ధి పనుల గురించి వివరించారు. వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు సాయిరాం తదితరులు ఉన్నారు. -
హైటెక్స్‌లో జరిగిన స్వస్త్య ఎక్స్పో గ్లోబల్ ఆయుష్ – వెల్నెస్ ఎక్స్పో ఫోటోలు...
-
హమ్మయ్యా.. అమ్మ కల నెరవేరింది
ఇంటిపట్టున ఉండి పిల్లాడి ఆలనాపాలన చూడాలనేది ఆమె కల. అయితే ఆమెది రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం. పొద్దున పని కోసం బయటికి వెళితే ఏ రాత్రో ఇంటికి వచ్చేది. సెలవంటూ లేని పని. పరీక్ష ఫీజు కట్టలేని సందర్భంలో పిల్లాడిని పట్టుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో కష్టాలు పడి పిల్లాడిని చదివించింది. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన ఆ అబ్బాయి అయూష్ గోయల్ ఎకౌంటెంట్ అయ్యాడు. ఆ తరువాత ట్విట్టర్ కాపీరైటర్‌గా మంచి ఆదాయన్ని అర్జిస్తున్నాడు. అమ్మను పని మానిపించాడు. తాము ఉండే ఇరుకు గది నుంచి 2–బెడ్రూమ్ అపార్ట్‌మెంట్‌కు మారాడు. ‘ఇప్పుడు మా అమ్మ ఫుల్–టైమ్ మదర్’ అని తల్లి ఫొటోలను జత చేస్తూ ఆయూష్ గోయల్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎంతోమందిని కదిలించింది. -
కేఆర్ఐపై సెబీ కొరడా
న్యూఢిల్లీ: అనధికార పెట్టుబడి సలహాలు ఇస్తున్న కారణంగా నాలెడ్జ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(కేఆర్ఐ)తోపాటు సంస్థ యజమాని ఆయుష్ ఝవార్పై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కన్నెర్ర చేసింది. ఆరు నెలలపాటు సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. కేఆర్ఐ, ఆయుష్లకు సెబీ 2021 జులైలో షోకాజ్ నోటీసులను జారీ చేసింది. తదుపరి తాజా ఆదేశాలు జారీ చేసింది. సెబీ నుంచి సర్టిఫికెట్ పొందకుండానే కేఆర్ఐ, ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజరీ సర్వీసులను అందించడం ద్వారా అడ్వయిజరీ నిబంధనలను అతిక్రమించాయి. దీంతో సెబీ తాజా చర్యలను చేపట్టింది. సలహాల ద్వారా ఫీజు రూపేణా ఆర్జించిన రూ. 27.57 లక్షలను 3 నెలల్లోగా వాపస్ చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. -
కోవిడ్ కట్టడిలో ఏపీ ఆయుష్ కార్యక్రమాలు భేష్
సాక్షి, న్యూఢిల్లీ: ఆయుష్ వైద్య సేవల ద్వారా కోవిడ్–19ను కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చురుగ్గా కార్యక్రమాలు నిర్వహించాయని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించిన వివిధ ఆయుష్ ఆధారిత కార్యక్రమాలు, పద్ధతుల సమాచారాన్ని వివరిస్తూ నీతి ఆయోగ్ ఓ సంకలనాన్ని రూపొందించింది. దీనిని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ, ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ కాళూభాయ్ శనివారం విడుదల చేశారు. ఏపీలో గరిష్ట సామర్థ్యానికి తగ్గట్టుగా.. కోవిడ్–19 కట్టడి విషయంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అందుబాటులో ఉన్న వనరుల గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కోవిడ్–19 రోగ నిరోధకత, కోవిడ్ అనంతర పునరుత్తేజం లక్ష్యాలతో పలు కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ ఆయుష్ డిస్పెన్సరీలలో పనిచేస్తున్న సుమారు 339 మంది ఆయుష్ అధికారులకు కాంటాక్ట్ ట్రేసింగ్, మందుల పంపిణీ, నియంత్రణ, కౌన్సెలింగ్, క్లినికల్ మేనేజ్మెంట్ కోసం విధులు కేటాయించారు. దాదాపు 400 మంది పీజీ స్కాలర్లు, ఇంటర్న్లు ఆయుర్వేదం, హోమియోపతికి సంబంధించిన ప్రొఫిలాక్టిక్ ఔషధాల పర్యవేక్షణ, పంపిణీ చేశారు. కళాశాలల అధ్యాపకులు ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ నివారణ చర్యలను చేపట్టింది. ఆయుష్ కళాశాలల అధ్యాపకులు పీజీ స్కాలర్లు, ఇంటర్న్‌ల సహకారంతో అవగాహన శిబిరాలు నిర్వహించారు. తెలంగాణలోనూ చురుగ్గా.. తెలంగాణ ప్రభుత్వంలోని ఆయుష్ శాఖ.. కోవిడ్–19 కట్టడి కోసం కేసులను గుర్తించడం, వైరస్ వ్యాప్తిని తగ్గించే చర్యలు చేపట్టడం, వైరస్ నివారణ, నిర్వహణ ప్రోటోకాల్‌లను అభివృద్ధి చేయడం వంటి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంది. త్వరితగతిన నివారణ ఔషధాల తయారీ, పంపిణీని చేపట్టింది. ఆయుష్ బోధనా ఆసుపత్రులను ఐసోలేషన్ సెంటర్లుగా మార్చింది. మ్యూకోర్మైకోసిస్ ఇన్ఫెక్షన్కు నివారణ, చికిత్సకు సంబంధించిన ఆయుష్ ప్రోటోకాల్‌లను వేగంగా అమలు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 461 ఆయుష్ అధికారులను కోవిడ్–19 నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఉపయోగించారు. 1,126 మంది ఆయుష్ వైద్యులు హాస్పిటల్ ప్రోటోకాల్‌లకు సంబంధించిన వర్చువల్ ప్లాట్‌ఫామ్‌పై శిక్షణ పొందారు. 1,094 మంది ఆయుష్ సిబ్బందిని ఆయుష్ క్వారంటైన్/ఐసోలేషన్ సెంటర్లలో నియమించడంతో పాటు శిక్షణ కూడా అందించారు. 464 మంది వైద్యులు 602 సహాయక సిబ్బందితో కలిసి 4 ఆయుష్ బోధనా ఆసుపత్రులలో సేవలు అందించారు. -
21న విజయవాడలో యోగాసనాల పోటీలు
సాక్షి, అమరావతి: జూన్ 21న 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా యోగాసనాల పోటీలను నిర్వహిస్తున్నట్టు కమిషనర్ రాములు తెలిపారు. 8 ఏళ్లు పైబడిన వారందరూ పోటీల్లో పాల్గొనడానికి అర్హులని వెల్లడించారు. ఎంపిక చేసిన 16 ఆసనాలలో 8 ఆసనాలను వేయగలిగిన వారు సంబంధిత ఫోటోలను advyoga2022@gmail.comకు మెయిల్ చేయాలన్నారు. ఫొటోతో పాటు పేరు, వయస్సు, ఆధార్ నెంబర్, చిరునామా, కాంటాక్ట్ ఫోన్ నెంబర్ వివరాలను జత చేయాలన్నారు. జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఫొటోలు పంపాల్సి ఉంటుందన్నారు. పంపిన ఫోటోలను ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం ఎంపికైన వారు జూన్ 10న న్యాయ నిర్ణేతల సమక్షంలో అవే ఆసనాలను ఆన్లైన్లో వేయాలన్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి జూన్ 21న విజయవాడలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. వివరాల కోసం 9441014521 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
తులసిభాయ్.. ఆ ప్రముఖుడికి కొత్త పేరు పెట్టిన ప్రధాని మోదీ
గ్లోబల్ ఆయుష్ సమ్మిట్ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా టెడ్రోస్ ని కొత్త పేరుతో పిలుస్తానంటూ మోదీ చెప్పారు. అనంతరం టెడ్రోస్‌ను తులసీభాయ్‌గా ప్రధాని పేర్కొన్నారు. అనంతరం డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆవిష్కరిస్తుందంటూ ప్రశంసించారు. సంప్రదాయ వైద్య విధానాలను కాపాడుకోవడంలో ఇండియా ఛాంపియన్‌గా నిలుస్తోందన్నారు. 150కి పైగా ఎంవోయూలు గుజరాతి రాజధాని గాంధీనగర్‌లో ఆయుష్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్‌ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆయుర్వేద రంగంలో పెట్టుబడులకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఔషధ మొక్కలకు ఇండియా పుట్టిళ్లన్నారు. మెడిసినల్ ప్లాంట్స్‌ని గ్రీన్గోల్డ్గా అభివర్ణించారు. ఆయుష్ ఉత్పత్తి చేస్తున్న మందులు 150కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నట్టు ప్రధాని తెలిపారు. ఆయుష్ ఆహార్ ద్వారా ఫుడ్ సప్లిమెంట్స్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఆయుష్ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేద నిపుణులు, తయారీదారులతో బలమైన నెట్వర్క్ తయారు చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 50 కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయి. గ్రీన్ గోల్డ్ ఆయుర్వేదాన్ని గ్రీన్ గోల్డ్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయుర్వేదానికి రోజురోజుకు డిమాండ్ పెరుగతుందన్నారు. 2014లో మూడు బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయుష్ ఉత్పత్తుల విలువ నేడు 18 బిలియన్ డాలర్లకు పెరగడమే ఇందుకు ఉదాహారణ అన్నారు. ఆయుర్వేద చికిత్స కోసం ఇండియా వచ్చే విదేశీయుల కోసం ప్రత్యేకంగా ఆయుష్ వీసాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. భారత్‌ను మరువలేం సంప్రదాయ మెడిసిన్స్‌ని ప్రోత్సహిస్తున్న భారత ప్రభుత్వాన్ని మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాత్ మెచ్చుకున్నారు. వైద్య రంగంలో మారిషన్‌కు భారత్ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. మారిషన్‌లో ఆయుర్వేద కాలేజీ నిర్మించడంతో పాటు కోవిడ్ సమయంలో భారత్ ఎంతో అండగా ఉందని ఆయన తెలిపారు. చదవండి: సంప్రదాయ వైద్యానికి సమయమిదే! -
నెల్లూరు ఆనందయ్యకు నోటీసులు జారీ
-
ఆనందయ్య మందుకు ‘ఆయుష్’ అంగీకారం
సాక్షి, అమరావతి: ఆనందయ్య తయారు చేసిన మందును కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించేందుకు రాష్ట్ర ఆయుష్ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఈ మందుకు పేరు ఖరారు చేయాల్సి ఉందన్నారు. ఆక్సిజన్ స్థాయిలు పెరిగేందుకు కరోనా రోగుల కంట్లో వేసే ఐ డ్రాప్స్‌కు ఆమోదం తెలిపే విషయంలో చర్చలు జరుగుతున్నాయని, ఇందులో కొంత పురోగతి ఉందని వివరించారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. తాను తయారు చేసిన మందుల పంపిణీకి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బొనిగె ఆనందయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అభ్యర్థనతో మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. -
కారుకు రూ.2 లక్షలు, నెల ఖర్చేమో రూ.3 లక్షలు
సాక్షి, అమరావతి: అసలే అంతంత మాత్రం నిధులతో నెట్టుకొచ్చే ఆయుష్ విభాగంలో కార్ల నిర్వహణలో జరుగుతున్న దుబారాను అస్సలు పట్టించుకోవడం లేదు. ఆయుష్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న ఈ పరిస్థితి గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. 2006లో కొన్న క్వాలిస్ కారును ఇప్పటికీ వాడుతున్నారు. ఆ కారును అమ్మితే ఇప్పుడు రూ.2 లక్షలు కూడా రావు. కానీ దీనికి నలుగురు డ్రైవర్లు, నెలకు 200 లీటర్ల డీజిల్, మరమ్మతులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు తదితరాలన్నీ కలిపి దాదాపు రూ.3 లక్షలవుతోంది. ముగ్గురు ప్రభుత్వ డ్రైవర్లకు ఒక్కొక్కరికీ రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకూ వేతనం ఉంది. ఒక ఔట్సోర్సింగ్ డ్రైవర్‌కు రూ.15 వేలు. గతంలో రెండు కార్లుండగా ఒక కారు నెలల తరబడి షెడ్లో ఉంది. ప్రస్తుతం నడుస్తున్న క్వాలిస్ కారుకు నలుగురు డ్రైవర్లు అవసరం లేదన్నది అక్కడున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. నెలకు ఒక కారు వ్యయం వేతనాలతో కలిపి రూ.3 లక్షలంటే ఏడాదికి రూ.36 లక్షలు. డ్రైవర్లు అధికంగా ఉంటే కలెక్టర్‌కు సరెండర్ చేస్తే అవసరమున్న చోట వినియోగించుకుంటారు. కానీ గత 15 ఏళ్లుగా ఈ పనిచేయడం లేదు. ఈ నిర్వహణ భారాన్ని చూసి అక్కడి ఉద్యోగులే ముక్కున వేలేసుకుంటున్నారు. చదవండి: కోళ్లయందు ‘కడక్‌నాథ్’ వేరయా..! -
పీజీ ఆయుర్వేద వైద్యులూ సర్జరీలు చేయొచ్చు
న్యూఢిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేద వైద్యులు కూడా ఇకపై శస్త్రచికిత్సలు(సర్జరీలు) చేయొచ్చు. ఇందుకోసం వారు శిక్షణ పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) నవంబర్ 20న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం ఆధునిక వైద్యశాస్త్ర రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీజీ ఆయుర్వేద వైద్యులు చేయాల్సిన 39 సాధారణ శస్త్రచికిత్స పద్ధతులను ఐఐసీఎం తన జాబితాలో పేర్కొంది. ఇందులో 19 పద్ధతులు విధానాలు కన్ను, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినవే ఉన్నాయి. ఇందుకోసం ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్(పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేద మెడిసిన్)–2016 నిబంధనలను సైతం కేంద్రం సవరించింది. తమ గెజిట్ నోటిఫికేషన్‌పై విమర్శలు వస్తుండడంతో ఆయుష్ శాఖ సెక్రెటరీ వైద్య రాజేశ్ కొటెచా స్పందించారు. ఇందులో కొత్త నిర్ణయం ఏదీ లేదని, నిబంధనలను ఉల్లంఘించడం లేదని చెప్పారు. పీజీ ఆయుర్వేద వైద్యులందరినీ సర్జరీలు చేయడానికి అనుమతించడం లేదన్నారు. కేవలం శల్య, శలక్య విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించిన వారికే అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఆయుర్వేద సంస్థల్లో 20 ఏళ్లుగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని సీసీఐఎం బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ వైద్యజయంత్ దేవ్‌పూజారి తెలిపారు. తమ నోటిఫికేషన్‌తో వాటికి చట్టబద్ధ గుర్తింపు లభిస్తుందన్నారు. అది తిరోగమన చర్య: ఐఎంఏ సీసీఐఎం అనుమతిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది తిరోగమన చర్య అని స్పష్టం చేసింది. సదరు ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఆధునిక వైద్యానికి చెందిన శస్త్రచికిత్స పద్ధతులు కాకుండా పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా సొంత శస్త్రచికిత్స విధానాలను రూపొందించుకోవాలని ఐఐసీఎంకు ఐఎంఏ సూచించింది. భారతీయ వైద్య శాస్త్రానికి సంబంధించిన కాలేజీల్లో ఆధునిక వైద్య శాస్త్ర వైద్యులను నియమించరాదని ఐఎంఏ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వేర్వేరు వైద్య శాస్త్రాలను కలిపేయడం మంచి పద్ధతి కాదని తేల్చిచెప్పింది. అది ముమ్మాటికీ తిరోగమని చర్య అంటూ ఐఎంఏ ఒక ప్రకటన విడుదల చేసింది. -
ఆయుష్ కిట్ల రూపకల్పన అద్భుతం : ఈటెల
సాక్షి, హైదరాబాద్ : ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్ రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం బీఆర్కేఆర్ భవన్లో ప్రారంభించారు. రెడ్ జోన్ లో పని చేస్తున్న పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బందికి ఈ కిట్స్ ను అందజేయనున్నారు. 20 వేల కిట్స్ ను మొదటి దఫా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ .. ఆయుర్వేదం అతి ప్రాచీనమైన వైద్య శాస్త్రమని పేర్కొన్నారు. కరోనా ను ఎదుర్కొనేందుకు ఆయుష్ కమీషనర్ అలుగు వర్షిణి ఆధ్వర్యంలో ఆయుష్ డిపార్ట్మెంట ఐదు రకాల మందులతో ఆయుష్ రక్ష కిట్స్‌ను రూపొందించారన్నారు. ఆయుష్ కిట్స్ తయారు చేసినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచానికి ఇలాంటి వైద్యాన్ని అందించిన దేశం భారత దేశం మాత్రమేనన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశం కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. తెలంగాణలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాప్తి, మరణాల రేటు చాలా తక్కువగా ఉందని తెలిపారు. (లాక్డౌన్: భారీగా రోడ్డెక్కిన వాహనాలు) అనంతరం హైదరాబాద్ సెంట్రల్ జోన్ జాయింట్ కమిషనర్ విశ్వప్రసాద్, ఐజిపి హోమ్ గార్డ్స్ బాలనాగాదేవి, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డిలకు మంత్రి ఈటల రాజేందర్ ఆయుష్ రక్ష కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డిపార్ట్మెంట్ అడిషనల్ డెరైక్టర్ అనసూయ, ప్రిన్సిపల్ సూర్యప్రకాష్, సూపరింటెండెంట్ పరమేశ్వర్, డ్రగ్ టెస్టింగ్ లాబొరటరీ డైరెక్టర్ శ్రీనివాస చారీ, ఫార్మసీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ప్రొఫెసర్ కె సి. డాక్టర్ శ్రీకాంత్ బాబు, కేంద్ర ఆయుర్వేద రీసెర్చ్ కౌన్సిల్ అధికారి డాక్టర్ సాకేత రాం, నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, విశ్వ ఆయుర్వేద పరిషద్ నేషనల్ సెక్రెటరీ డాక్టర్ ప్రేమనందరావు, డాక్టర్ సురేష్ జకోటియ పాల్గొన్నారు. ఈ కిట్స్ తో పాటు విశ్వ ఆయుర్వేద పరిషద్ తరపున 250 గ్రాముల చవన్ ప్రాష్‌ను రెండు వేల యూనిట్లుగా పంపిణీ చేస్తున్నట్లు సెక్రెటరీ తెలిపారు. (మాస్క్ లేకుంటే బుక్కయినట్టే..!)