సాక్షి,న్యూఢిల్లీ: వైద్య,ఆరోగ్య రంగం రెండంకెల వృద్ధి సాధించే క్రమంలో ఆయుష్ పరిశ్రమలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారు.2020 నాటికి ఆయుష్ పరిశ్రమలో పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 2.5 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు సమకూరుతాయని మంత్రి పేర్కొన్నారు. ఆయుర్వేద, యోగ,నేచురోపతి,యునాని,సిద్ధ,హోమియోపతి వైద్య విధానాలను కలిపి ఆయుష్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం దేశ ఆయుష్ మార్కెట్ రూ 500 కోట్లుకాగా, రూ 200 కోట్ల మేర ఎగుమతులు సాగుతున్నాయి. హాలిస్టిక్ హెల్త్‌కేర్‌లో స్టార్టప్‌ల కోసం యువత ఆసక్తి కనబరుస్తోందని మంత్రి తెలిపారు. వెల్‌నెస్,ఆరోగ్య 2017 సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు.
సంప్రదాయ వైద్య విధానాల విషయంలో సాంకేతికత, విజ్ఞానాన్ని మేళవించేందుకు పలు దేశాలతో్ కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పారు. ఆయుష్ రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతించిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment