Suresh Prabhu
-
అసలు విల్లాలో ఏం జరిగింది?..ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
విజయ్, శీతల్ బట్ జంటగా తెరకెక్కిన చిత్రం 'విల్లా 369'. ఈ చిత్రానికి సురేష్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. విగన్ క్రియేషన్స్ సమర్పణలో విద్య గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు డాక్టర్ రాకేశ్ సహానిర్మాతగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు తేజ విడుదల చేశారు. అనంతరం దర్శకుడు తేజ మాట్లాడుతూ.. 'దర్శకుడు సురేష్ ప్రభు మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని తీసిన చిత్రం "విల్లా 369". సినిమా దర్శక, నిర్మాతలకు మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'. అని అన్నారు. నిర్మాత విద్య గణేష్ మాట్లాడుతూ.. ' దర్శకుడు మంచి నటీ నటులను ఎంపిక చేశారు. ఈ సినిమాకు ర్యాడీ రఫీ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. సంగీత దర్శకుడు మహావీర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.' అని అన్నారు... దర్శకుడు సురేష్ ప్రభు మాట్లాడుతూ..'ఇలాంటి మంచి కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు. అందరూ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినందునే ఈ సినిమా అనుకున్న విధంగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'. అని అన్నారు. -
నేను తెలుగు ప్రజల కజిన్‌ను: కేంద్ర మాజీ మంత్రి
హైదరాబాద్: తాను తెలుగు ప్రజలకు కజిన్ అని.. ఇక్కడ నుంచి తనకు రాజ్యసభ సీటు లభించింది అని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సురేశ్ ప్రభు గుర్తుచేసుకున్నారు. విశాఖ జోన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం ప్రకటించామని, దీనిపై ఎంపీలు పరిశీలిస్తున్నారని తెలిపారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ప్రజల పన్నులతోనే నడుస్తాయని అన్నారు. ప్రైవేటైజేషన్ అంటే షేర్ హోల్డర్స్‌కు మంచి లాభాలు ఇవ్వడానికేనని వివరించారు. స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుందని ప్రకటించారు. ప్రాణాలు అర్పించి కార్మాగారం తెచ్చారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన బీజేపీ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమని.. రెండంకెల వృద్ధి సాధ్యమని సురేశ్ ప్రభు తెలిపారు. బడ్జెట్ కరోనా కారణంగా వచ్చిన ఇబ్బంది ఎప్పుడూ రాలేదని గుర్తుచేశారు. ఈయూ, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై కరోనా ప్రభావం చూపిందని చెప్పారు. వృద్ధి రేటు కూడా తగ్గిందని.. ఈ బడ్జెట్ కొత్త వేవ్ తీసుకుని వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి వస్తుంది అని భావిస్తున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం రెండింతలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ.16.57లక్షల కోట్లు వ్యవసాయానికి కేటాయించారని వెల్లడించారు. సూక్ష్మ సేద్యం కోసం, ఈనామ్ ద్వారా మార్కెట్ సదుపాయాలు పెంచారని సురేష్ ప్రభు చెప్పుకొచ్చారు. రక్షణకు తాము మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. చర్చల ద్వారానే రైతు సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఒకే మార్కెట్ దేశంలో రైతులకు ఉపయోగమని, ప్రభుత్వం వారితో చర్చించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. రైతులకు తాము వ్యతిరేకం కాదని.. వారిని గౌరవిస్తామని సురేశ్ ప్రభు పేర్కొన్నారు. -
సౌదీ పర్యటన; బీజేపీ ఎంపీ స్వీయ నిర్బంధం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు కరోనా భయాల నేపథ్యంలో స్వీయ నిర్బంధం విధించుకున్నారు. భారత్ తరపున జీ20 సదస్సు ప్రతినిధిగా ఉన్న ఆయన ఇటీవల సౌదీ అరేబియా వెళ్లొచ్చారు. వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు కరోనా నెగెటివ్ అని వచ్చినప్పటికీ 14 రోజులపాటు హోమ్ క్వారైంటన్లో ఉండనున్నారు. దీంతో ఆయన పార్లమెంట్ సమావేశాలకు దూరం కానున్నారు. ఈమేరకు ఆయన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. ‘రాబోయే జీ20 సదస్సుకు సంబంధించి సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్‌లో మార్చి 10న నిర్వహించిన సమావేశానికి హాజరయ్యాను. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించుకున్నా. రిజల్ట్ నెగటివ్‌గానే వచ్చింది. అయినప్పటికీ నియంత్రణ చర్యల్లో భాగంగా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నా. ఐసోలేషన్ సమయం ముగిసేవరకూ పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేను. పార్లమెంటు సభ్యులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నా’అని సురేష్ ప్రభు లేఖలో పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. కేరళలోని ఓ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి మరళీధరన్ సైతం ఇంట్లోనే స్వీయ నిర్బంధం విధించుకున్న సంగతి తెలిసిందే. ఆయన సందర్శించిన ఆస్పత్రి వైద్యుడొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. -
వాస్తవాలు చెప్పకుండా దుష్ప్రచారం చేస్తున్నారు
సాక్షి, విజయవాడ : జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) చట్టంపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సు లో మాజీ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పాల్గొన్నారు. సురేష్ ప్రభు మాట్లాడుతూ.. జనాభా గణనకు, పౌరసత్వ చట్ట సవరణకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అస్సొం మినహా ఎన్నార్సీ మరెక్కడా అమలు కాదని పేర్కొన్నారు. కొన్ని రాజకీయపక్షాలు వాస్తవాలను బయటికి చెప్పకుండా దుష్ప్రచారంతోనే భయాందోళనలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఏళ్ల తరబడి వివాదాస్పదంగా ఉన్న పలు కీలకమైన అంశాల్లో బీజేపీ నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ప్రజలను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడతుందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాలు ఇప్పటికే ఎన్నార్సీ , సిఎఎ చట్టాలపై ప్రజల్లో అపోహలు తొలగిస్తూ స్పష్టమైన ప్రకటన చేశారన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఏ మతాన్ని, ఏ వ్యక్తిని ఉద్దేశించింది కాదని అందుకే ఈ చట్టం వల్ల దేశంలోని హిందువులకు, ముస్లింలకు ఎలాంటి ముప్పు ఉండదని వెల్లడించారు. -
జెట్ సంక్షోభంపై స్పందించిన సురేష్ ప్రభు
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించాలని పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం ఆదేశించారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా, వారి భద్రతను పరిగణనలోకి తీసుకుంటూ జెట్ ఎయిర్వేస్లో సమస్యలను చక్కదిద్దేందుకు చొవర చూపాలని పౌర విమానయాన కార్యదర్శి ఖరోలాను ఆదేశిస్తూ మంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. మరోవైపు సమస్యలు చుట్టుముట్టడంతో విమానాల సంఖ్యను, సేవలను తగ్గిస్తున్న జెట్ ఎయిర్వేస్ కేవలం 9 విమానాలనే నడుపుతోంది. జెట్ ఎయిర్వేస్ గురువారం తూర్పు, ఈశాన్య ప్రాంతాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. రోజంతా అంతర్జాతీయ సేవలను రద్దు చేసింది. జెట్ చర్యతో పెద్దసంఖ్యలో ప్రయాణీకులు పలు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. జెట్ ఇబ్బందులు ప్రస్తుతం ఏ స్ధాయిలో ఉన్నాయంటే విమాన సర్వీసులు రద్దవడంతో కేవలం ప్రయాణీకులకే సంస్థ రూ 3500 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. -
‘జెట్’లో జోక్యం చేసుకోం
న్యూఢిల్లీ: రుణ భారం, నిధుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్వేస్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. సంస్థను గట్టెక్కించేందుకు డీల్స్ కుదర్చడంలో కేంద్రం పాత్రేమీ ఉండదని పేర్కొన్నారు. జెట్ ఎయిర్వేస్లో నేరుగా వాటాదారులైన బ్యాంకులే.. కంపెనీ వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయని, ఈ నేపథ్యంలో తమ శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని మంత్రి విలేకరులతో చెప్పారు. ‘ప్రభుత్వ శాఖ ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించకూడదు. రైల్వే విషయంలోనూ నేను ఇదే పాటించాను. జెట్‌కి సంబంధించినంతవరకూ అది బ్యాంకులు, మేనేజ్మెంట్కి మధ్య వ్యవహారం‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, భద్రతాపరమైన అంశాలపై మాత్రం కచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. తన సంస్థ దివాలా తీస్తుంటే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. జెట్‌ను మాత్రం గట్టెక్కించడానికి ప్రయత్నిస్తూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయంటూ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటరు మాల్యా ఆరోపించిన నేపథ్యంలో సురేష్ ప్రభు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జెట్ ఎయిర్వేస్పై దాదాపు రూ. 8,000 కోట్ల పైచిలుకు రుణభారం పేరుకుపోయింది. బ్యాంకుల షరతులకు ఒప్పుకున్నా: గోయల్ జెట్ ఎయిర్వేస్కి తక్షణం నిధుల సహాయం అందించేందుకు బ్యాంకులు విధించిన షరతులన్నింటికీ తాను అంగీకరించినట్లు సంస్థ ప్రమోటరు, మాజీ చైర్మన్ నరేష్ గోయల్ వెల్లడించారు. జెట్ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రుణపరిష్కార ప్రణాళిక అమలు కోసం పూర్తి సహకారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రణాళిక కింద సంస్థ యాజమాన్య అధికారాలను బ్యాంకులు తమ చేతుల్లోకి తీసుకోవడంతో పాటు రూ. 1,500 కోట్ల నిధులివ్వనున్నాయి. ఎగురుతున్నది 28 విమానాలే.. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ కేవలం 28 విమానాలే నడుపుతోందని, ఇందులో 15 విమానాలు దేశీ రూట్లలో తిరుగుతున్నాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు. ముందుగా జెట్ 15 కన్నా తక్కువ సంఖ్యలో విమానాలే నడుపుతోందంటూ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పిన ఖరోలా.. ఆ తర్వాత తాజా వివరణనిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విదేశీ రూట్లకు సర్వీసులు నడిపే విషయంలో జెట్ సామర్ధ్యాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఒకప్పుడు దాదాపు 119 విమానాలతో సర్వీసులు నడిపిన జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం లీజులు కట్టలేక, ఇతర కారణాలతో పలు విమానాలను నిలిపివేసింది. మార్చి జీతాలు వాయిదా .. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులకు మార్చి నెలకు జరపాల్సిన జీతాల చెల్లింపులను జెట్ వాయిదా వేసింది. సంక్లిష్టమైన అంశాల వల్ల రుణ పరిష్కార ప్రణాళిక ఖరారుకు మరింత సమయం పట్టనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులకు పంపిన లేఖలో చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా తెలిపారు. చెల్లింపులు ఎప్పటికిల్లా జరుగుతాయన్నది చెప్పకపోయినప్పటికీ, ఇందుకు సంబంధించిన వివరాలను ఏప్రిల్ 9న మరోసారి అప్డేట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. జెట్‌లో 16,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. షేరు 5 శాతం డౌన్.. విమానాల అద్దెలు చెల్లించలేకపోవడంతో మరో 15 విమానాలను పక్కన పెట్టినట్లు జెట్ ఎయిర్వేస్ వెల్లడించడంతో బుధవారం సంస్థ షేరు 5 శాతం పైగా క్షీణించింది. బీఎస్ఈలో సంస్థ షేరు 5.21 శాతం నష్టంతో రూ. 251.10 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 6.37 శాతం క్షీణించి రూ. 248కి కూడా తగ్గింది. -
ఎయిర్‌లైన్స్ పనితీరు బాధ్యత వాటిదే..
న్యూఢిల్లీ: ఆర్థిక పనితీరు మెరుగ్గా ఉండేలా చూసుకోవడం, సమర్ధంగా కార్యకలాపాలు నిర్వహించుకోవడమన్నది పూర్తిగా విమానయాన సంస్థల బాధ్యతేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ఆయా సంస్థల రోజువారీ కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదని చెప్పారు. దేశీ విమానయాన రంగం తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటుండటం, జెట్ ఎయిర్వేస్ పెను సంక్షోభంలో కూరుకుపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రతి విమానయాన సంస్థ.. మార్కెట్‌ను పరిశీలించి, ఆర్థిక వనరులను చూసుకుని సొంతంగా ఒక వ్యాపార ప్రణాళిక వేసుకుంటుంది. ఈ ప్రణాళికల ఆధారంగా తమ తమ కార్యకలాపాలను సమర్ధంగా నిర్వహించుకోవడం, మెరుగైన ఆర్థిక పనితీరు ఆయా సంస్థల బాధ్యత’ అని మంత్రి చెప్పారు. మరోవైపు, సంక్షోభంలో ఉన్న ఎయిరిండియాకి సంబంధించి పునరుద్ధరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సమగ్ర ఆర్థిక ప్యాకేజీ, స్పెషల్ పర్పస్ వెహికల్‌కు రుణాల బదలాయింపు తదితర అంశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రభు తెలిపారు. -
కేంద్ర మంత్రికి ట్వీట్.. అర్ధగంటలో స్టాల్ సీజ్
తిరుపతిలోని రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న క్యాంటీన్లో బిస్కెట్ ప్యాకెట్‌ను ఎమ్మార్పీ కంటే అధికధరలకు విక్రయిస్తున్నారంటూ వినియోగదారుడు రైల్వే మంత్రికి ట్వీట్ చేయడంతో.. అర్ధగంటలో స్టాల్‌ను సీజ్ చేశారు.’ ‘హైదరాబాద్ నుంచి రేణిగుంటకు రైల్లో ప్రయాణిస్తున్న ఓ 20 ఏళ్ల యువతి ఎదురుగా మరో వ్యక్తి కూర్చున్నాడు. ఆ బోగీలో పెద్దగా ప్రయాణికులు లేకపోవడం, వ్యక్తి చూపులు అనుమానంగా ఉండడంతో భయపడ్డ యువతి వెంటనే సమస్యను మంత్రికి ట్వీట్ చేసింది. 12 నిమిషాల తరువాత ఓ స్టేషన్ రాగా ఆ వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతికి స్వయాన రైల్వే మంత్రి ఫోన్ చేసి అభినందించడం ఇటీవల పత్రికల్లో చదివే ఉంటాం’ ‘ఇటీవల చెన్నై నుంచి విజయవాడ మీదుగా వెళుతున్న రైల్లో ఫ్యాను పనిచేయడం లేదని ఓ ప్రయాణికుడు స్మార్ట్‌ఫోన్ నుంచి ట్విట్టర్ ద్వారా రైల్వే మంత్రికి ట్వీట్ పంపాడు. నిముషాల వ్యవధిలో విజయవాడ సీనియర్ డీఈఈకు సమాచారం అందడంతో విద్యుత్ సిబ్బంది రైలు వద్దకు చేరుకుని ఫ్యాన్ మరమ్మతు చేశారు.’ ‘రెండు రోజుల కిందట బెంగళూరు నుంచి బళ్లారికి రాత్రి వేళ రైల్లో వెళుతున్న ఓ యువతి నెలసరి సమస్యతో బాధపడుతుంటే.. ఆమె స్నేహితురాలు రైల్వే మంత్రికి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. రైల్వే మంత్రి సూచనతో రంగంలోకి దిగిన అధికారులు ఆరు నిముషాల్లో ఈమె ప్రయాణిస్తున్న బోగి వద్దకు వచ్చి కావాల్సిన శానిటరీ నాప్కిన్లు, మాత్రలు ఇచ్చి వెళ్లారు.’ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే కలిగే మేలు ఎలా ఉంటుందో చెప్పడానికి ఇవి మచ్చుకలు మాత్రమే. ఇటీవల రైళ్లలో ఎదురవుతున్న సమస్యలపై ట్విట్టర్ ద్వారా రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళుతుంటే అప్పటికప్పుడే పరిష్కరిస్తుండడం వల్ల రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతోపాటు సంస్థపై జనానికి నమ్మకం కలుగుతోంది. అందుబాటులో ఉన్న సేవలను ఉపయోగించుకోవడంలో విద్యావంతులు తమదైనశైలి మార్కు వేస్తున్నారు. సోషల్ మీడియా సత్తా.. రైళ్లలో ప్రయాణించేటప్పుడు చాలా మందికి వివిధ రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. క్యాటరింగ్లో పాచిన ఆహారం ఇవ్వడం, మరుగుదొడ్ల నుంచి దుర్గంధం వస్తున్నా పట్టించుకోకపోవడం, ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడం లాంటి ఘటనలు చాలానే ఎదురవుతుంటాయి. వీటిని ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక కొందరు.. స్టేషన్లలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మరికొందరు సమస్యను ప్రశ్నించడమే మానేస్తుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సమస్యల ప్రస్తావనకు సోషల్ మీడియా మంచి మాధ్యమంగా మారుతోంది. సామాన్య మధ్యతరగతి ప్రజల చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉండడం సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైలు ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళుతున్న ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి. ప్రధానంగా సమస్యలను రైల్వేశాఖ మంత్రికి క్షణాల్లో చెప్పడం.. నిమిషాల్లో ఇవి పరిష్కారానికి నోచుకుంటుండడంతో ప్రజలు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల పర్యవేక్షణ.. ట్విట్టర్లో రైల్వే మంత్రికి అందే ఫిర్యాదులను ఢిల్లీలోని రైల్ భవన్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ఇది 24 గంటల పాటు పనిచేసే సెంట్రల్ వ్యవస్థ. రైలు ప్రయాణికులు పంపే ఫిర్యాదులను రైల్వే మంత్రి చూడడంతో పాటు.. రైల్ భవన్‌లోని అధికారులు సైతం ఫిర్యాదులు చూస్తూ ఉంటారు. ట్విట్టర్ వేదికగా వచ్చే ఫిర్యాదులు, సూచనలపై అప్పటికప్పుడు సానుకూల స్పందన వస్తుండడం ప్రయాణికులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఎలాంటి సమస్యలంటే... రైల్లో దొంగతనాలు జరుగుతున్నా సిబ్బంది స్పందిచకపోవడ అనుమానిత వ్యక్తులు మన పక్కన ఉన్నప్పుడు.. అసాంఘిక కార్యకలాపాలు రైల్లో జరుగుతున్నప్పుడు రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోవడం, క్యాంటీన్లలో ఎమ్మార్పీ కన్నా అధిక ధరలు వసూలు చేసినా ప్లాట్‌ఫామ్‌పై నీళ్లు రాకపోయినా, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల వసతులు సరిలేకపోయినా, అసౌకర్యాలపై రైల్లో ప్రయాణికులు అనారోగ్యానికి గురైనా, మహిళలు, దివ్యాంగుల బోగీల్లో ఇతరులు ఎక్కినా ఫిర్యాదులు చేయొచ్చు. ఇలాంటివే ఫిర్యాదు చేయాలి.. ఇలాంటి చేయకూడదని లేదు. కానీ ఫిర్యాదు చేసేటప్పుడు కాస్త విజ్ఞతతో ఆలోచిస్తే సరి. ట్వీట్ చేసేటప్పుడు తప్పనిసరిగా పేరు, ఫోన్ నంబరు నమోదు చేయాలి. అలాగే ప్రయాణి కుల బెర్తు, బోగీ కూడా రాయాలి. మీరూ ట్విట్టండి.. స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా ట్విట్టర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ట్విట్టర్లో వ్యక్తి పేరు, పాస్వర్డ్, మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ నమోదు చేసి సేవ్ చేసుకున్న తరువాత ట్విట్టర్ వినియోగంలోకి వస్తుంది. అనంతరం రైల్వే మినిస్టర్ అని టైప్‌చేస్తే రైల్వేమంత్రి పీయుష్ గోయల్ చిత్రంతో పాటు సైట్ ఓపెన్ అవుతుంది. ప్రయాణికులు తమకు తెలిసిన భాషల్లో సమస్యలను నేరుగా మంత్రికి ట్వీట్ రూపంలో తెలియచేయొచ్చు. ట్వీట్ మెసేజ్ సెకన్ల వ్యవధిలోనే ఆయా డివిజన్ల రైల్వే ఉన్నతాధికారులకు చేరుతుంది. అర్ధరాత్రులు సైతం అధికారులు స్పందిస్తారు. మెసేజ్ చేరగానే అప్రమత్తమై ప్రయాణికుల సమస్యలను పరిష్కరించి తిరిగి రైల్వే మంత్రికి నివేదిస్తారు. -
స్టార్టప్‌లకు ఉపశమనం!
న్యూఢిల్లీ: పన్నుకు సంబంధించి స్టార్టప్ సంస్థల్లో నెలకొన్న భయాందోళనలు కాస్త ఉపశమించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏంజెల్ ఫండ్స్ వెచ్చించే పెట్టుబడులపై స్టార్టప్స్ పన్ను మినహాయింపులను కోరేందుకు సంబంధించిన ప్రక్రియను సరళతరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఏంజెల్ ఫండ్స్ ద్వారా తాము సమీకరించిన నిధులపై పన్నులు చెల్లించాలంటూ ఇటీవలి కాలంలో ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ నుంచి తమకు నోటీసులందటంపై స్టార్టప్స్ వ్యవస్థాపకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఐటీ చట్టంలోని సెక్షన్ 56 (2) కింద స్టార్టప్ సంస్థలకు ఈ నోటీసులు జారీ అయ్యాయి. స్టార్టప్‌కు పన్ను మినహాయింపు నిబంధనల విషయంలో తాజా మార్పుల నోటిఫికేషన్‌కు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆమోదం తెలిపినట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ‘త్వరలో అమల్లోకి రానున్న కొత్త విధానం ప్రకారం స్టార్టప్స్ గనుక ఏంజెల్ ఫండ్స్‌పై పన్ను మినహాయింపులను కోరాలంటే ముందుగా పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి (డీఐపీపీ) దరఖాస్తు చేసుకోవాలి. నిర్ధేశిత స్టార్టప్ దరఖాస్తును తగిన ధ్రువపత్రాలతో కలిపి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల విభాగానికి (సీబీడీటీ) డీఐపీపీయే పంపుతుంది. దరఖాస్తును అందుకున్న 45 రోజుల్లోగా స్టార్టప్‌లకు పన్ను మినహాయింపునకు ఆమోదం తెలపడం లేదా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తిరస్కరించడంపై సీబీడీటీ కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో నోటిఫికేషన్... గతంలో స్టార్టప్‌లు సమర్పించే పన్ను మినహాయింపు దరఖాస్తును అంతర్ మంత్రిత్వ శాఖల విభాగం ధ్రువీకరణ కోసం పంపేవారు. దీనివల్ల జాప్యం అయ్యేంది. ఇప్పుడు డీఐపీపీ ద్వారా నేరుగా సీబీడీటీకి పంపేలా ప్రక్రియను సరళతరం చేసినట్లు ప్రభుత్వం వర్గాలు వివరించాయి. అదేవిధంగా స్టార్టప్‌లు విక్రయించిన షేర్లకు మార్కెట్ విలువ ఎంతనేది నిర్ధారిస్తూ మర్చెంట్ బ్యాంకర్ నుంచి నివేదికను తీసుకొని సమర్పించాలన్న గత నిబంధనను కూడా తాజాగా తొలగించారు. డీఐపీపీ గుర్తింపు ఉన్న స్టార్టప్‌లన్నీ కొన్ని షరతులకు లోబడి ఈ పన్ను మినహాయింపు పొందే వీలుంది. ప్రధానంగా ఖాతాల వివరాలతోపాటు గడిచిన మూడేళ్ల ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించాలి. అలాగే ఏంజెల్ ఇన్వెస్టర్లు కూడా తమ నెట్‌వర్త్, పెట్టుబడిపై ఎంత ఆదాయం వచ్చింది అనే వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. కాగా, ఏంజెల్ ఫండ్స్ ఇతరత్రా ఇన్వెస్టర్ల నుంచి రూ.10 కోట్లకు మించి జరిపిన నిధుల సమీకరణపై పూర్తిగా పన్ను మినహాయింపు వర్తిస్తుందని 2018 ఏప్రిల్‌లో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఐటీ చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం స్టార్టప్స్ తమకున్న మార్కెట్ విలువకు మించి జరిపే నిధుల సమీకరణపై 30 శాతం పన్ను విధించేందుకు వీలుంది. దీని ఆధారంగానే ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది. కాగా, పన్ను మినహాయింపు నిబంధనల్లో తాజా మార్పులన్నీ నోటిఫికేషన్ జారీ అయినతర్వాత అమల్లోకి వస్తాయని.. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారికి కొత్త నిబంధనలు వర్తించవని ఆయా వర్గాలు తెలిపాయి. ఏటా 300– 400 స్టార్టప్‌లకు ఏంజెల్ ఫండ్స్ నుంచి నిధులు అందుతుండగా... 2018 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ కేవలం రెండు స్టార్టప్స్‌కు మాత్రమే పన్ను మినహాయింపు లభించడం గమనార్హం. ఈ అంశాన్ని కూడా మంత్రి సురేష్ ప్రభు కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేయండి ప్రధానిని కోరిన ఐస్పిర్ట్ న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు శాపంగా మారిన ఏంజెల్ ట్యాక్స్‌ను తక్షణం రద్దు చేయాలని స్టార్టప్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐస్పిర్ట్... ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. ఈ మేరకు ఈ సంస్థ ఒక లేఖ రాసింది. స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్ అని పేర్కొంది. ఏంజెల్ ఇన్వెస్టర్లు ఎంతో రిస్క్ తీసుకొని ఈ పెట్టుబడుల పెడతారని, విదేశాల్లో ఇలాంటి పెట్టుబడులకు నజరానాలిస్తుండగా, ఇక్కడ మాత్రం పన్నులు వేసి పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు వస్తుండటంతో పలు స్టార్టప్‌లు బెంబేలెత్తుతున్నాయని, కొన్ని మూతపడుతున్నాయని పేర్కొంది. ఈ ఏంజెల్ ట్యాక్స్‌ను తక్షణం రద్దు చేయాలని, అలా కుదరని పక్షంలో కనీసం నిబంధనలను సరళీకరించాలని కోరింది. స్టార్టప్‌లలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు 20 లక్షల డాలర్ల నుంచి కోటి డాలర్ల వరకు ఇన్నోవాక్సర్లో తొలి పెట్టుబడి బెంగళూరు: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్ స్టార్టప్‌లలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన కార్పొరేట్ వెంచర్ ఫండ్, ఎమ్12 (గతంలో మైక్రోసాఫ్ట్ వెంచర్స్ ఫండ్‌గా వ్యవహరించేవారు) భారత స్టార్టప్‌లలో ఒక్కో కంపెనీలో 20 లక్షల డాలర్ల నుంచి కోటి డాలర్ల రేంజ్లో పెట్టుబడులు పెట్టబోతోంది. దీన్లో భాగంగా తొలి పెట్టుబడి పెట్టడానికి హెల్త్ టెక్ స్టార్టప్, ఇన్నోవాక్సర్‌ను ఎంచుకున్నామని ఎమ్12 పార్ట్నర్ రష్మి గోపీనాధ్ చెప్పారు. బీ2బీ స్టార్టప్‌లలో ఏ నుంచి సి రౌండ్ సిరీస్‌లలో నిధులు సమకూరుస్తామని పేర్కొన్నారు. బిగ్ డేటా, అనలిటిక్స్, బిజినెస్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌లకు నిధులందిస్తామని ఆమె పేర్కొన్నారు. -
వ్యవసాయ ఎగుమతుల పెంపుపై దృష్టి
న్యూఢిల్లీ: వ్యవసాయ ఎగుమతుల పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ దిశలో రాష్ట్రాలకు రవాణా సబ్బిడీని అందించాలని యోచిస్తోంది. వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం ఈ విషయం తెలిపారు. అంతకుముందు వాణిజ్యం, అభివృద్ధి వ్యవహారాల మండలి సమావేశం జరిగింది. కర్ణాటక, పంజాబ్, తమిళనాడుసహా పలు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ ఎగుమతుల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం చర్చించినట్లు ప్రభు తెలిపారు. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న రుణ సంబంధ సమస్యలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ఫైనాన్స్ వ్యవహారాల కార్యదర్శి ఈ అంశంపై బ్యాంకర్లతో చర్చిస్తారని పేర్కొన్నారు. ఎగుమతుల రంగానికి రుణాన్ని ప్రాధాన్యతాపరమైనదిగా పరిగణించాలని డిమాండ్ ఉంది. అంతర్జాతీయ చట్టాలను ఏ విధంగానూ ఉల్లంఘించకుండా, ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు నెరపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. భారత్–చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 2018–19 ఏప్రిల్–అక్టోబర్ మధ్య భారత్ వ్యవసాయ ఎగుమతుల విలువ 48 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 43.11 బిలియన్ డాలర్లు. -
దేశీ ఈ కామర్స్ సంస్థలకూ అవే నిబంధనలు...
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో (ఎఫ్‌డీఐ) కూడిన ఈ కామర్స్ సంస్థలకు సంబంధించిన నిబంధనలను దేశీయ ఈ కామర్స్ సంస్థలకూ అమలు చేయడం ద్వారా, అనైతిక వ్యాపార విధానాలకు పాల్పడకుండా నిరోధించాలని అఖిల భారత వర్తకుల సంఘం (సీఏఐటీ) డిమాండ్ చేసింది. ఇందుకు సంబంధించిన విధానాన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాసింది. ఈ కామర్స్ రంగానికి సంబంధించిన విధానంపై వాణిజ్య శాఖ పనిచేస్తుండగా... త్వరలోనే దాన్ని విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో సీఏఐటీ లేఖ రాయడం గమనార్హం. ‘‘నూతన విధానంలో పేర్కొన్న ఎఫ్‌డీఐ నిబంధనలు దేశీయ ఈ కామర్స్ సంస్థలకూ వర్తింపజేయాలి. అనైతిక వ్యాపార ధోరణలను అనుసరించకుండా నిరోధించాలి. వాటిని ఇతర ఈ కామర్స్ సంస్థలతో సమానంగా చూడాలి’’ అని సీఏఐటీ కోరింది. ఈ రంగానికి స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేసింది. కొన్ని సంఘాలు ఎఫ్‌డీఐ నిబంధనలను తప్పుబడుతున్నాయని, ఎటువంటి ఒత్తిళ్లకు లొంగవద్దని కోరింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి విదేశీ ఈ కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లపై, తమ వాటాలు కలిగిన కంపెనీల ఉత్పత్తులను విక్రయించకుండా, ప్రత్యేకమైన మార్కెటింగ్ ఒప్పందాలతో ఉత్పత్తులను మార్కెట్ చేయకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. అయితే త్వరలోనే ఈ–కామర్స్‌లోకి రావటానికి ప్రయత్నాలు చేస్తున్న రిలయన్స్ వంటి సంస్థలకు ఈ పరిణామం లాభించవచ్చనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ సంస్థలకూ ఇవే నిబంధనలు వర్తింపజేయాలని వర్తకుల సంఘం డిమాండ్ చేస్తోంది. -
త్వరలో కొత్త పసిడి విధానం
న్యూఢిల్లీ: పసిడిపై కేంద్రం ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తోంది. త్వరలో బంగారంపై కొత్త విధానం ప్రకటించే అవకాశం ఉందని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారమిక్కడ తెలియజేశారు. పసిడి పరిశ్రమ వృద్ధి, ఆభరణాల ఎగుమతుల వృద్ధి ప్రధాన లక్ష్యాలతో తాజా విధాన రూపకల్పన ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం భారత ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాల వాటా 15 శాతంగా ఉంది. విధాన రూపకల్పనలో భాగంగా సంబంధిత వర్గాలతో రానున్న కొద్ది రోజుల్లో సమావేశం కానున్నట్లు ప్రభు తెలిపారు. పసిడిపై ప్రస్తుతం 10 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 100 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు లక్ష్యం.. భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు మంత్రి ప్రభు తెలిపారు. వచ్చే రెండేళ్లలో 100 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రప్పించటమనేది కేంద్రం లక్ష్యమని తెలిపారు. భారత్‌లో ఏ రంగాలు భారీ పెట్టుబడులను కోరుతున్నాయి? ఇందుకు ఏ దేశాల నుంచి పెట్టుబడులను పొందే అవకాశం ఉంటుంది? వంటి అంశాలపై వాణిజ్య, పరిశ్రమల పరిశ్రమల మంత్రిత్వశాఖ దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ దిశగా విదేశాలతో చర్చలకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. స్టార్టప్స్ పన్ను సమస్యల పరిష్కారం స్టార్టప్స్ పురోగతికి కేంద్రం తగిన చర్యలన్నీ తీసుకుంటుందని సురేశ్ ప్రభు తెలిపారు. ప్రత్యేకించి ఏంజిల్ ఫండ్స్ నుంచి నిధుల సమీకరణలో స్టార్టప్స్ ఎదుర్కొంటున్న పన్ను సంబంధ సమస్యలు పరిష్కరించాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. స్టార్టప్స్, ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఎదుర్కొంటున్న పన్ను సమస్యల పరిష్కార మార్గాలను సూచించడానికి గత వారం కేంద్రం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
భారత్ ఎగుమతులు బాగున్నాయి
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు గడచిన 14 నెలల్లో చాలా బాగున్నాయని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు బుధవారం చెప్పారు. అయితే పూర్తి సంతృప్తి మాత్రం లేదన్నారు. ఎగుమతుల పెంపునకు భారత్ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు. 2019లో పటిష్ఠ వృద్ధి సాధించడానికి ఎగుమతులే ప్రధాన వనరుగా ఉండాలన్నది ఈ వ్యూహం లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రక్షణాత్మకవాదం, మందగమనం, వాణిజ్య యుద్ధం, దిగుమతి సుంకాలుసహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ, దేశ ఎగుమతులు పెరుగుతుండడం గమనార్హమని మంత్రి పేర్కొన్నారు. 2011–12 నుంచి దేశ ఎగుమతుల విలువ 300 బిలియన్ డాలర్లుగా ఉంది. 2017–18లో 10% వృద్ధితో 303 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అల్యూమినియంపై దిగుమతి సుంకం పెంపు! అల్యూమినియంపై దిగుమతి సుంకాల పెంపునకు కేంద్రం సానుకూలంగా ఉంది. దేశీయ పరిశ్రమ, తయారీ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు ప్రభు పేర్కొన్నారు. ఈ కమోడిటీ భారీ దిగుమతులపై అల్యూమినియం పరిశ్రమ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అల్యూమినియం స్క్రాప్‌పై బేసిక్ కస్టమ్స్ సుంకం 2.5%. ప్రైమరీ అల్యూమినియంపై 7.5%. రెండింటిపై ఈ సుంకాన్ని 10 శాతానికి పెంచాలన్న డిమాండ్ వస్తోంది. దీనితోపాటు ఈ కమెడిటీ దిగుమతిపై కనీస దిగుమతి ధర, దిగుమతులపై కోటా నిర్దేశం వంటి మరికొన్ని పరిమితులూ విధించాలని దేశీయ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. -
ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ప్రముఖ నేతలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వార్షిక సమావేశాలు వచ్చే నెల 21 నుంచి 25వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పట్టణంలో జరగనున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ కిమ్ సహా ఆరుగురు సంయుక్తంగా అధ్యక్షత వహిచనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాధిపతులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, పౌర సమాజం ప్రముఖులు కలసి 3,000 మంది వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ‘ప్రపంచీకరణ 4.0: నాలుగో పారిశ్రామిక విప్లవం దశలో ప్రపంచ స్వరూపం’ ఈ కార్యక్రమం ప్రధాన అంశంగా ఉంటుంది. వాతావరణం మార్పులు, జీవ వైవిధ్యం, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాల నష్టం అంశాలను పరిష్కరించాల్సి ఉందని ప్రపంచ ఆర్థిక ఫోరం వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లౌస్ ష్వాబ్ పేర్కొన్నారు. కేటీఆర్, లోకేశ్ సైతం...: భారత్ నుంచి పాల్గొనే వారిలో అరుణ్ జైట్లీతోపాటు కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమల్‌నాథ్, చంద్రబాబునాయుడు, దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారు. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, కేటీఆర్ సైతం హాజరు కానున్నారు. వ్యాపార ప్రముఖులు అజీమ్ ప్రేమ్‌జీ, ముకేశ్ అంబానీ దంపతులు, ఉదయ్ కోటక్, గౌతం అదానీ, లక్ష్మీ మిట్టల్, నందన్ నీలేకని, ఆనంద్ మహీంద్రా, అజయ్ పిరమల్ కూడా పాలు పంచుకోనున్నారు. -
ఈ–కామర్స్‌లో పారదర్శకతకు పెద్దపీట
న్యూఢిల్లీ: ఆన్లైన్ వ్యాపారంలో పారదర్శకతను పెంపొందించే దిశగా కొత్త ఈ–కామర్స్ విధానం ఉంటుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. ధరలు, డిస్కౌంట్లలో పారదర్శకతతో పాటు ఇటు రిటైలర్లు అటు కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కొత్త విధానం ముసాయిదాపై కసరత్తు చేస్తోందని, వచ్చే 2–3 వారాల్లో సంబంధిత వర్గాల అభిప్రాయాల కోసం దీన్ని వెల్లడిస్తామని ప్రభు తెలిపారు. ‘ఈ–కామర్స్ వ్యాపార నిర్వహణను సులభతరం చేయడమనేది పాలసీ ప్రధాన లక్ష్యం. ఇటు రిటైలర్లకు... అటు వినియోగదారులకు ఇది ప్రయోజనకరంగా ఉండాలి. ఈ–కామర్స్ వ్యాపారంలో ధరలు, డిస్కౌంట్ల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలి‘ అని ఆయన చెప్పారు. ‘డిస్కౌంట్లు ఇవ్వొచ్చని గానీ ఇవ్వొద్దని గానీ మేం నిర్దేశించబోము. ఏది చేసినా పారదర్శకంగా ఉండాలన్నదే మా ఉద్దేశం‘ అని మంత్రి వివరించారు. వాణిజ్య శాఖ గతంలో తయారు చేసిన ముసాయిదాలోని సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకుని కొత్త ముసాయిదాను ఖరారు చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు, భారత్‌లో తయారీ కేంద్ర ఏర్పాటు విషయంలో కొన్ని మినహాయింపులు కోరుతున్న అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ప్రతినిధులతో వచ్చే నెల దావోస్‌లో భేటీ కానున్నట్లు సురేశ్ ప్రభు తెలిపారు. ఇప్పటికే యాపిల్‌తో చర్చలు జరుగుతున్నాయని, ఆ సంస్థ కోరుతున్న మినహాయింపులను ప్రభుత్వం పరిశీలించే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. -
ఏంజెల్ ట్యాక్స్‌పై స్టార్టప్‌లలో ఆందోళన
న్యూఢిల్లీ: ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపుతుండటం.. స్టార్టప్ సంస్థలను కలవరపెడుతోంది. పలు స్టార్టప్‌లు వీటిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. దీనిపై ఆర్థిక శాఖతో చర్చిస్తున్నట్లు సైటు ట్విటర్లో పేర్కొన్నారు.మరోవైపు, పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) గుర్తింపు లేని స్టార్టప్స్‌కు మాత్రమే ఏంజెల్ ట్యాక్స్ నోటీసులు జారీ అవుతుండవచ్చని ఆదాయ పన్ను శాఖ అధికారి తెలిపారు. అటు ఈ నోటీసుల కారణంగా ఏంజెల్ ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లు పన్నులపరమైన వేధింపులకు గురికాకుండా చూడాలని రెవెన్యూ విభాగం దృష్టికి తీసుకెళ్లినట్లు డీఐపీపీ వెల్లడించింది. స్టార్టప్‌లలో సిసలైన పెట్టుబడులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. ప్రారంభ దశలోని స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లను ఏంజెల్ ఇన్వెస్టర్లుగా వ్యవహరిస్తారు. ఇలాంటి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులతో పాటు మొత్తం పెట్టుబడులు రూ. 10 కోట్ల లోపే ఉంటే పన్నుల నుంచి మినహాయింపులు ఉంటున్నాయి. సముచిత మార్కెట్ రేటుకు మించి ప్రీమియంతో ఏంజెల్ ఇన్వెస్టర్ పెట్టుబడులు పెట్టారని భావించిన పక్షంలో అలా సేకరించిన అధిక మొత్తానికి 30 శాతం పన్ను రేటు వర్తిస్తుందని ఆదాయ పన్ను శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీన్నే ఏంజెల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. -
రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి
సాక్షి, విజయవాడ: కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పనిచేయాలని, రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. గన్నవరం విమానశ్రయంలో 611 కోట్ల రూపాయలతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌కు భూమి పూజ కార్యక్రంమంలో కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి సురేష్ ప్రభు, సహాయ మంత్రి జయంత్ సిన్హాతో కలిసి పాల్గొన్న ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రవాణా రాకపోకాలు పెరగటం అభివృద్ధికి సూచిక అని పేర్కొన్నారు. గన్నవరం విమానశ్రయంలో సింగపూర్‌కే కాదు ప్రపంచ దేశాలకు సైతం విమాన సర్వీసులు రావాలని ఆకాంక్షించారు. అందమైన కృష్ణా నది, కూచిపూడి నాట్యం, జాస్మిన్ ప్లవర్ ఆకారాలలో న్యూ టెర్మినల్ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. రోడ్డు, రైలు, ఎయిర్, వాటర్ కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తిరుపతి, రాజమండ్రి, కడప ఎయిర్ పోర్టుల అభివృద్ది కూడా జరగాల్సి ఉందన్నారు. 100 కొత్త విమానాశ్రయాలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్దికి అవసరమైన మౌళిక సౌకర్యాలు సమకూర్చుతున్నామని కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు. 65 బిలియన్ డాలర్స్ వెచ్చించి100 కొత్త విమానాశ్రాయాలు నెలకొల్పామని తెలిపారు. టెర్మినల్ పూర్తయిన తరువాత ఏపీకి ఐకాన్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌తో పోటీగా ప్రయాణికులకు సౌకర్యాలు సమకూర్చుతున్నామన్నారు. వచ్చే రెండు రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలిపారు. -
కుట్రలను వెలికితీయండి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం వెనుక దాగిన కుట్రలను వెలికి తీయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పౌర విమానయానశాఖ మంత్రి సురేష్‌ప్రభుకు లేఖ రాశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బి.ఎస్.భుల్లర్ నుంచి సంబంధిత సమాచారాన్ని ఆశిస్తున్నట్టు పేర్కొంటూ డీజీసీఏకు 13 ప్రశ్నలు సంధించారు. జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం వెనుక కుట్రలను వెలుగులోకి తెచ్చేందుకు రాజ్యసభ సభ్యుడిగా ఈ సమాచారాన్ని కోరుతున్నట్లు లేఖలో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. హత్యాయత్నం ఘటనపై దర్యాప్తునకు ఆదేశిస్తారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. డైరెక్టర్ జనరల్‌కు ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నలు ఇవీ.. - జె.శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఏరోడ్రమ్ ఎంట్రీ పర్మిట్(ఏఈపీ) కోసం దుండగుడు శ్రీనివాస్ లేదా అతడి యజమాని హర్షవర్దన్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి దరఖాస్తు సమర్పించారా? ఒకవేళ సమర్పిస్తే జె.శ్రీనివాసరావుకు నేర చరిత ఉన్న సంగతిని దరఖాస్తులో ప్రస్తావించారా? క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న సంగతి ప్రస్తావించారా? - ఫ్యూజన్ రెస్టారెంట్లో పనిచేయడానికి అనుమతి ఇచ్చేముందు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ నిందితుడు శ్రీనివాసరావు గత చరిత్ర గురించి ఏపీ పోలీసులను నివేదిక కోరారా? కోరితే ఏపీ పోలీసుల నుంచి వచ్చిన జవాబు ఏమిటి? - జె.శ్రీనివాసరావుకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పనిచేసేందుకు అవసరమైన అనుమతి ఉందా? అతడు అక్కడ ఏ ప్రాంతం/జోన్లో తిరిగేందుకు అనుమతి ఉంది? - జె.శ్రీనివాసరావు లేదా హర్షవర్దన్‌లు ఏఏఐకి చెందిన లాంజ్ ఆఫీసర్ నుంచి గానీ మేనేజర్ నుంచి గానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ అధికారి నుంచి గానీ ఎయిర్‌పోర్టులోని ముఖ్య ప్రాంతాల్లో తిరిగేందుకు అనుమతి తీసుకున్నారా? - విశాఖ ఎయిర్‌పోర్టులోని విమానాల్లో కూడా ఆహారం పంపిణీ చేసేందుకు జె.శ్రీనివాసరావు అనుమతి కలిగి ఉన్నాడా? ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌కు విభిన్న ఎయిర్‌లైన్ సంస్థలకు చెందిన విమానాల్లో ప్రయాణికులకు ఆహారం సరఫరా చేసేందుకు అనుమతి ఉందా? - ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని అన్ని సున్నితమైన ప్రాంతాల్లో తిరగడం వాస్తవం కాదా? అది నిజమే అయితే అందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? - ఏ నిబంధన కింద హర్షవర్దన్‌కు విశాఖ ఎయిర్‌పోర్టులో రెస్టారెంట్ నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేశారు? రెస్టారెంట్ నిర్వహణలో హర్షవర్దన్ ఏవైనా నిబంధనలు ఉల్లంఘించారా? - సీఎం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రతిసారి హర్షవర్దన్ ఆయనకు స్వాగతం పలిపేందుకు విమానం వరకూ వెళ్లడం వాస్తవం కాదా? విమానం వరకూ వెళ్లి ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు హర్షవర్దన్‌కు ఎవరు అనుమతి ఇచ్చారు? - హర్షవర్దన్‌పై గానీ రెస్టారెంట్‌పై గానీ అందులో పనిచేసే సిబ్బందిపై గానీ ఏవైనా ఫిర్యాదులు నమోదయ్యాయా? - విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేసేందుకు ఎవరెవరిని అనుమతించారు? - ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ పనివేళలు ఏమిటి? - సిబ్బందికి పని వేళలు రోస్టర్ ప్రకారం ఉంటాయా? జె.శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పని వేళలు ఏమిటి? - విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఎప్పుడు ఆడిట్ నిర్వహించింది? తనిఖీలు లేదా విచారణ చేసినప్పుడు హర్షవర్దన్ విషయంలో గానీ లేదా సిబ్బంది విషయంలో గానీ ఏవైనా అవకతవకలు గానీ నేరపూరిత చర్యలు గానీ నిబంధనల ఉల్లంఘన గానీ గుర్తించిందా? గుర్తిస్తే తీసుకున్న చర్యలేమిటి? -
వాణిజ్య వివాదాలపై అమెరికాతో చర్చలు: మంత్రి సురేష్ ప్రభు
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలను పరిష్కరించుకునే దిశగా భారత్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఇందుకు సంబంధించి అమెరికా చేసిన ఆఫర్‌కు ప్రతిగా భారత్ మరో ప్రతిపాదన చేసినట్లు ఆయన వివరించారు. భారత్ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా భారీగా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతిగా అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, ఉక్కు, ఇనుము వంటి సుమారు 29 ఉత్పత్తులపై సుంకాలను నవంబర్ 2 నుంచి పెంచనున్నట్లు భారత్ ప్రకటించింది. అయితే, తాజాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వాయిదా వేసిన నేపథ్యంలో మంత్రి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం; స్పందించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంతో సహా అన్ని శాఖలను ఆదేశించారు. ఎవరు బాధ్యులో గుర్తించాలని విమానయాన శాఖ కార్యదర్శికి సూచించినట్టు వెల్లడించారు. వైఎస్ జగన్‌పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. విచారణ జరిపి దోషిని శిక్షిస్తామన్నారు. తక్షణమే దర్యాప్తు మొదలు పెట్టాలని ఆదేశించామని, విచారణ జరుగుతోందని సురేశ్ ప్రభు ట్విటర్లో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సురేశ్ ప్రభు అదనంగా పౌర విమానయాన శాఖను చూస్తున్నారు. అశోక్‌గజపతి రాజు ఈ పదవికి రాజీనామా చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిఫారసు మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు మార్చిలో విమానయాన శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. Shocked by attack on Mr Jagan Reddy,Asked all agencies to investigate matter thoroughly,including @CISFHQrs .Asked secretary civil aviation to fix responsibility.I strongly condemn this cowardly attack,we will punish the guilty.Investigations are underway, started immediately — Suresh Prabhu (@sureshpprabhu) October 25, 2018 సంబంధిత కథనాలు: వైఎస్ జగన్‌పై హత్యాయత్నం! సెల్ఫీ తీసుకుంటానని నవ్వూతూ వచ్చాడు.. ‘ఎయిర్‌పోర్టులోకి కత్తులు అనుమతిస్తారా?’ ఇది పిరికిపందల చర్య: ఓవైసీ నిందితుడి జేబులో లెటర్ : పథకం ప్రకారమే దాడి -
25 నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు నడపాల్సిందే
సాక్షి, అమరావతి: విజయవాడ– సింగపూర్ విమాన సర్వీసులు ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 25 నుంచి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీట్లు భర్తీ కాకపోతే ఆ నష్టాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇస్తామని ఫ్రభుత్వం ఇచ్చిన హామీతో ఇండిగో సర్వీసులు నడపడానికి ముందుకొచ్చింది. గన్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించడానికి తగిన మౌలిక వసతులు లేవంటూ కస్టమ్స్, ఎయిర్పోర్టు్ట అధికారులు మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో ఆయాశాఖల అధికారులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.18 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చినా జాప్యం చేయడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై త్వరలోనే ఆర్థిక మంతి అరుణ్‌జైట్లీ, విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాయనున్నట్లు సీఎం తెలిపారు. -
60 బిలియన్ డాలర్లతో 100 కొత్త విమానాశ్రయాలు!
న్యూఢిల్లీ: రానున్న 10–15 ఏళ్లలో 100 కొత్త విమానాశ్రయాలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలియజేశారు. ఇందుకు దాదాపు 60 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.2 లక్షల కోట్లు) వ్యయం అవుతుందని మంగళవారమిక్కడ ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. గత మూడేళ్లుగా విమాన ప్రయాణికుల డిమాండ్ పుంజుకోవడంతో దేశీ విమానయాన రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) 120కి పైగానే ఏరోడ్రోమ్స్‌ను నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఎయిర్‌పోర్టులను నిర్మించాలనేది మా వ్యూహం’ అని ప్రభు వివరించారు. కొత్తగా ఎయిర్‌కార్గో విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించారు. 2037 నాటికి భారత్‌కు సంబంధించి మొత్తం వార్షిక విమాన ప్రయాణికుల సంఖ్య (విదేశీ, దేశీ ప్రయాణికులు) 52 కోట్లకు చేరుతుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేస్తోంది. 2010లో ఈ సంఖ్య 7.9 కోట్లుగా ఉండగా... 2017 నాటికి రెట్టింపు స్థాయిలో 15.8 కోట్లకు పెరిగింది. మరో పదేళ్లలోపే జర్మనీ, జపాన్, స్పెయిన్, బ్రిటన్లను అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా (ప్రయాణికుల పరంగా) భారత్ అవతరించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. -
లాజిస్టిక్స్‌లో పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: లాజిస్టిక్స్ రంగంలో 2025 నాటికి 500 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 34.5 లక్షల కోట్లు) పెట్టుబడులు రాగలవని వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. దీంతో లక్షల కొద్దీ ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. అలాగే దేశీయంగా వ్యాపారాలకు, అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోగలవని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ దిశగా సమగ్రమైన వ్యూహాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన, పాలనాపరమైన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన ఇండియా లాజిస్టిక్స్ లోగోను సోమవారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. మిగతా దేశాలతో పోలిస్తే లాజిస్టిక్స్ వ్యయాలు భారత్‌లో అత్యధికంగా.. స్థూల దేశీయోత్పత్తిలో 14 శాతంగా ఉన్నాయి. ‘2025 నాటికి ఇన్ఫ్రా సహా లాజిస్టిక్స్‌లో పెట్టుబడులు 500 బిలియన్ డాలర్లకు చేరతాయి. ప్రపంచ వాణిజ్యంలో మన వాటాను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో లాజిస్టిక్స్‌దే కీలక పాత్ర’ అని ప్రభు చెప్పారు. భారీ లాజిస్టిక్స్ వ్యయాలు.. పోటీ తత్వంపైనా, సరకు రవాణాపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. లాజిస్టిక్స్‌కి సంబంధించిన వర్గాలన్నింటినీ ఒకే చోట చేర్చేలా వాణిజ్య శాఖ ప్రత్యేకంగా జాతీయ లాజిస్టిక్స్ పోర్టల్‌ను తయారు చేస్తోందని వివరించారు. ఎగుమతి.. దిగుమతి వ్యయాలు, దేశీయంగా వాణిజ్య వ్యయాలను తగ్గించేందుకు సమగ్రమైన వ్యూహాన్ని కూడా రూపొందిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. సెంటర్ ఫర్ లాజిస్టిక్స్ ఏర్పాటుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)తో లాజిస్టిక్స్ విభాగం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
త్వరలో కొత్త కేంద్ర పారిశ్రామిక విధానం
సాక్షి, హైదరాబాద్: త్వరలో కేంద్రం కొత్త పారిశ్రా మిక విధానాన్ని ప్రకటించనున్నట్లు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. తోలు పరిశ్రమ వంటి సంప్రదాయ రంగాల పరిశ్రమలను పునరుద్ధరించడంతో పాటు భవిష్యత్తు కలిగిన కొత్త రంగాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడంపై కొత్త విధానం దృష్టి పెడుతుం దన్నారు. గురువారం రాయదుర్గంలో ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. వస్తు ఉత్పత్తిలో ప్రత్యేకత సాధించిన జిల్లాలను గుర్తించి ఈ కొత్త విధానం ద్వారా ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. 100 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను అదనంగా విదేశీ మార్కెట్లకు పంపాలన్న లక్ష్యంతో ఈ విధానం తీసుకొస్తున్నట్లు చెప్పారు. దేశ తోలు పరిశ్రమల రంగాన్ని నవీకరించడం, పునరుద్ధరించడంలో భాగంగా ఎఫ్‌డీడీఐ భవనాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణానికి స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సవాళ్ల ను ఎదుర్కొంటూ దశాబ్దాలుగా తోలు పరిశ్రమ దేశంలో మనుగడ సాధించగలిగిందని, విదేశీ పరిశ్రమల నుంచి ప్రస్తుతం ఎదురవుతున్న పోటీని సమర్థంగా అధిగమించాల్సి ఉందన్నారు. ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించేలా.. తోలు పరిశ్రమల పునరుద్ధరణకు కేంద్రం ఇప్పటికే రూ.2,600 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని సురేశ్ ప్రభు అన్నారు. ఆధునిక యంత్రాల కొనుగోళ్లు, శిక్షణ, మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఈ నిధులను వినియోగిస్తున్నామన్నారు. కొత్త భవనంలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించామని, దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇదొకటి అని చెప్పారు. తోలు ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఆకర్షణీయ డిజైన్లు కీలకమని, ఇక్కడి విద్యార్థులు ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించే డిజైన్లకు రూపకల్పన చేసి తోలు వస్తువుల ఎగుమతుల పెంపునకు దోహదపడాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, వాణిజ్య శాఖ జాయింట్ సెక్రెటరీ అనిత, ఎఫ్‌డీడీఐ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్సిన్హా, కార్యదర్శి వివేక్ తదితరులు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలన మోదీతోనే సాధ్యం
వరంగల్ రూరల్ జిల్లా: తెలంగాణ రాష్ట్రం రాక ముందు..వచ్చాక ఎలాంటి మార్పు రాలేదని, తెలంగాణాలో కానీ దేశంలో కానీ పేదరిక నిర్మూలన జరగాలంటే ఒక్క మోదీతోనే సాధ్యం తప్ప టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలతో కాదని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు వ్యాఖ్యానించారు. జనచైతన్య యాత్రలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక బీజేపీ పాలిత ప్రాంతాల్లో ప్రజలు ఆనందంగా ఉన్నట్లుగా తెలంగాణ ప్రజలు కూడా ఆనందంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చాక దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించిందని, అయినా కూడా ఇక్కడి ప్రజలు పనుల నిమిత్తం ముంబై వెళ్లాల్సి వచ్చిందంటే.. ఈ ప్రాంతాన్ని ఎలా అణగదొక్కారో అర్ధం అవుతుందన్నారు. రైతులకు లబ్ధి చేకూరేలా..పంటకు మద్ధతు ధర ప్రకటించి.. నా ద్వారా మోదీ ఇక్కడి ప్రజలకు సందేశం పంపించారని తెలిపారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో పట్టణాల్లో ఉన్న ప్రజలు జీవిస్తున్నట్లుగా.. రైతులు కూడా ఉండాలని అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతు కుటుంబంలో ఏ ఎక్కరైనా అనారోగ్యం బారిన పడితే ఆ కుటుంబం అప్పుల పాలయ్యే పరస్థితి ఏర్పడుతుందని.. ఆ పరిస్థితి మారేందుకు ఆయుష్మాన్ భవ పథకం తీసుకురాబోతున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో ఇక్కడి ప్రభుత్వం కారణంగా లబ్ధి పొందలేకపోతున్నారని అన్నారు. అలాంటి పరిస్థితి మారాలంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించారు. వరంగల్‌తో జనసంఘ్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే..ఈ జిల్లాకు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు ఇప్పించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దేశ రక్షణ కోసం వరంగల్ ప్రజలు ముందుంటారు కాబట్టి మీరంతా బీజేపీ జెండా పట్టుకుని మద్ధతుగా నిలవాలని కోరారు. తాను ఇక్కడ పుట్టనప్పటికీ..తనను ఈ తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా పంపి మంత్రిని చేసినందుకు మీకు రుణపడి ఉంటానని తెలిపారు. -
పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: పసుపుకు మద్దతు ధర ఇవ్వాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని కోరారు. ‘పసుపు సాగు.. ఎగుమతులు’అనే అంశంపై సోమవారం వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల మంత్రులను కలిశానని, ఐదుగురు ముఖ్యమంత్రులు పసుపు బోర్డు ఏర్పాటుకు మద్దతుగా లేఖలు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. రబ్బర్, సిల్క్‌కు బోర్డు ఏర్పాటు చేసిన విధంగానే పసుపుకూ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఉడకబెట్టిన పసుపు ఎండబెట్టేందుకు యంత్రాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయో లేదో కేంద్రం అధ్యయనం చేయాలని కోరారు. మేలైన రకాల పసుపు విత్తనాలను అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని పలుమార్లు కోరామన్నారు. అయితే బోర్డు ఏర్పాటు కుదరదని, ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారన్నారు. ఆ విధంగానే పసుపు సెల్ ఏర్పాటు చేశారని ఆమె వివరించారు. 1990లో 7 లక్షల మెట్రి క్ టన్నుల పసుపు ఉత్పత్తి కాగా నేడు 3 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు శాతమే పసుపు ఎగుమతి జరుగుతోందన్నారు. గతంలో ఎంపీలు పట్టించుకోలేదు: జీవన్‌రెడ్డి గతంలో ఎంపీలు పసుపు రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. కవిత ఎంపీ అయ్యాక పసుపు రైతుల గురించి అనేకసార్లు కేంద్రంతో చర్చలు జరిపారన్నారు. అనేక రాష్ట్రాలు తిరిగి పసుపుపై అధ్యయనం చేశారన్నారు. ప్రత్యేక పసుపు సెల్ ఏర్పాటుకు ఎంపీ కవితనే కారణమన్నారు. నిజామాబాద్ జిల్లా రైతాంగం ఎంపీ కవితకు రుణపడి ఉంటారన్నారు. ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ, ఎంపీ కవిత కృషి వల్ల పసుపుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారన్నారు. పసుపు బోర్డు కోసం అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశామని గుర్తు చేశారు. కాగా, ఈ వర్క్ షాప్‌లో రైతులు, ట్రేడర్లు, సైంటిస్టులు, అధికారులు ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. పలు అంశాలపై నిపుణులు సందేహ నివృత్తి చేస్తూ పసుపు ఉత్పాదకత పెంపు, సాగులో మెళకువలు, మార్కెట్ వ్యూహాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్పైసెస్ బోర్డు వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ లింగప్ప, కొచ్చి మార్కెటింగ్ డైరెక్టర్ పీఎం.సురేశ్‌కుమార్, పరిశోధన, అభివృద్ధి విభాగం డైరెక్టర్ డాక్టర్ ఏబీ రేమాశ్రీ తదితరులు పాల్గొన్నారు. కేంద్రానికి రైతుల డిమాండ్లు.. - పసుపు కుర్కుమిన్ నాణ్యతను పరీక్షించే విధానం వ్యవసాయ మార్కెట్లలో ఉండాలి. - ధర పడిపోయినప్పుడు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయాలి. - పసుపును ఆరబెట్టేందుకు సామూహిక కల్లాలను నిర్మించాలి. -
ఈ-కామర్స్ కంపెనీలపై స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలు ఫిర్యాదు
-
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై కఠిన చర్యలు?
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ కంపెనీలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై స్మార్ట్‌ఫోన్ దిగ్గజాలు ఆపిల్, నోకియా, వివో వంటి కంపెనీలు ఫిర్యాదు చేశాయి. మొబైల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఈ-కామర్స్ కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయని ఈ హ్యాండ్సెట్ తయారీదారుల లాబీ ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్(ఐసీఏ), వాణిజ్య మంత్రి సురేష్ ప్రభుకు ఫిర్యాదు చేసింది. విదేశీ మూలధనాన్ని భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేయడానికి వాడుతున్నాయని ఐసీఏ ఆరోపిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీఏ కోరుతోంది. ఇన్వెస్టరీని పెట్టుకుని, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలను ప్రభావితం చేస్తూ.. ఎఫ్డీఐలోని ప్రెస్ నోట్ 3 కిందనున్న నిబంధనను కంపెనీలు ఉల్లంఘిస్తున్నాయని ఐసీఏ పేర్కొంటోంది. దీంతో ఆఫ్‌లైన్ రిటైలర్ల రెవెన్యూలు హరించుకుపోతున్నాయని, దాదాపు 6 కోట్ల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్నాయని ఐసీఏ తెలిపింది. ఈ పరిస్థితిపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా మొబైల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తుల ధరలను ఇవి ప్రభావితం చేస్తున్నాయని సురేష్ ప్రభుకు తెలియజేసింది. ప్రెస్ నోట్ 3 నిబంధనలను, ఇతర చట్టాలను ఉల్లంఘించే వారిపై మనీ లాండరింగ్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కోరుతోంది. ఈ కంపెనీలను దేశానికి వ్యతిరేకంగా ఎకనామిక్ టెర్రరిజం చేపడుతున్నాయని భావించాలని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను అమెజాన్ కొట్టిపారేసింది. తాము దేశీయ చట్టాలకు, నిబంధనలకు కట్టుబడి ఉన్నామని అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు. విక్రయదారులు నిర్ణయించిన ధరలను అమెజాన్.ఇన్ మార్కెట్‌ప్లేస్‌లో ఆఫర్ చేస్తున్నాని పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్ మాత్రం దీనిపై స్పందించలేదు. ఐసీఏ, హ్యాండ్సెట్ తయారీదారులు ఆపిల్, మైక్రోమ్యాక్స్, నోకియా, వివో, లావా, మోటోరోలా, లెనోవా వంటి కంపెనీల లాబీ సంస్థ. -
ఆయన కోలుకుంటున్నారు: కేంద్రమంత్రి ట్వీట్
పనాజి : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహార్ పారికర్ ప్రస్తుతం కోలుకుంటున్నారని కేంద్రమంత్రి సురేష్ ప్రభు ట్విట్ చేశారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో గతకొంత కాలంగా ఇబ్బంది పడుతున్న పారికర్ అమెరికాలో వైద్యం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పారికర్ ఆరోగ్యంపై వాకాబు చేసిన సురేష్ ప్రభు.. ‘ప్రస్తుతం పారికర్ వైద్యానికి స్పందిస్తున్నారు, వేగంగా కోలుకుని, త్వరలోనే రాష్ట్రానికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను’ అని తన ట్వీటర్లో పేర్కొన్నారు. ప్యాంక్రియాటిక్ సమస్యతో పారికర్ ఫిబ్రవరి 14న ముంబాయిలోని లీలావతి హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోజునే ఆయన రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాలు ముగిసిన అనంతరం సమస్య తీవ్రం కావడంతో పారికర్ పనాజీలోని గోవా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ చేరారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మార్చి మొదటి వారంలో ఆయనను అమెరికా తీసుకెళ్లారు. కాగా సీఎం రాష్ట్రంలో లేని కారణంగా ముగ్గురు మంత్రుల బృందం రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. -
ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ఎయిర్ కార్గో కార్యకలాపాలు ప్రోత్సహించడం, ఉడాన్ స్కీమ్ కింద 56 కొత్త ఎయిర్‌పోర్ట్‌లలో త్వరితగతిన కార్యకలాపాలు ప్రారంభించడం అనేవి పౌరవిమానయాన శాఖ ముందున్న ప్రధాన అంశాలని వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ఆయన సోమవారం పౌరవిమానయాన శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ కలిగిన చైనాతో పోలిస్తే భారత్‌లో ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతోందని తెలిపారు. ప్రయాణికుల సంఖ్యలో 16–20 శాతం వృద్ధి నమోదవుతోందన్నారు. ‘ప్రయాణికుల సేవలు, కనెక్టివిటీ మెరుగుదలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నాం. ఉడాన్ స్కీమ్ కింద కొత్తగా 56 ఎయిర్‌పోర్ట్‌లు అనుమతులు పొందాయి. వీలైనంత త్వరగా వీటిల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని చూస్తున్నాం. దీని వల్ల కనెక్టివిటీ మరింత పెరుగుతుంది’ అని వివరించారు. -
రాజు స్థానంలో ప్రభు
న్యూఢిల్లీ: పౌర విమానయాన శాఖ మంత్రిగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. పి. అశోక్‌గజపతి రాజు ఈ పదవికి రాజీనామా చేయడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిఫారసు మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో రైల్వే మంత్రిగా పనిచేసిన సురేశ్ ప్రభు.. 2017లో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అంతకుముందు ఆ శాఖను నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ రక్షణ శాఖ మంత్రిగా నియమితులవడంతో వాణిజ్య, పరిశ్రమల శాఖను ప్రభుకు కేటాయించారు. 2000 నుంచి 2002 వరకు వాజపేయి ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. -
సురేశ్ ప్రభుకు విమానయాన శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు అదనంగా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ బాధ్యతలను శనివారం ప్రభుత్వం అప్పగించింది. విమానయాన శాఖా మంత్రిగా పనిచేస్తున్న టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించిన మరుసటి రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ సలహా మేరకు రాష్ట్రపతి కోవింద్ పౌరవిమానయాన శాఖ అదనపు బాధ్యతలను సురేశ్ ప్రభుకు అప్పగించారని రాష్ట్రపతిభవన్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. -
పౌర విమానయాన శాఖా మంత్రిగా సురేశ్ ప్రభు
సాక్షి, న్యూఢిల్లీ : అశోక గజపతిరాజు మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పౌరవిమానయాన శాఖా మంత్రిగా సురేశ్ ప్రభు నియమితులయ్యారు. 2014 నుంచి 17 వరకు రైల్వే మంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శివసేనను వదిలి 2014లో సురేశ్ ప్రభు బీజేపీలో చేరారు. ప్రస్తుతం వాణిజ్య శాఖామంత్రిగా పని చేస్తున్న ఆయనకు పౌరవిమానయాన శాఖను కేటాయించారు. -
పసుపు బోర్డుపై స్పందించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కె తారకరామారావు రాసిన లేఖకు కేంద్ర మంత్రి స్పందించారు. స్పైసెస్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ కోరకు ప్రత్యేకంగా ఒక సెల్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. పసుపు పంట మార్కెటింగ్ రీసెర్చీ ద్వారా పంట అభివృద్ది చేయాల్సిన బాద్యత కేంద్ర, రాష్ట్రాల వ్యవసాయ శాఖలపై ఉందని సురేష్ ప్రభు అన్నారు. స్పైసెస్ బోర్డు పసుపుతో పాటు ఇతర ఎగుమతులు, నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కోసం ప్రత్యేక సెలల్‌ను స్పైసెస్ బోర్డులో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీం పథకం కింద ప్రత్యేకంగా ఓస్పైసెస్ పార్క్‌ను కూడా నెలకొల్పుతామని ఆయన లేఖలో పేర్కొన్నారు. -
భారత్ కంటే మేమే ముందు
-
భారత్ కంటే మేమే ముందు
విశాఖపట్నం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈడీబీ) ర్యాంకుల్లో తాము భారతదేశం కంటే ముందంజలో ఉన్నామని, ప్రపంచ దేశాలతోనే తమకు పోటీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఆదివారం ‘రిఫామ్ కాలిక్యులస్–ప్రమోటింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’అనే అంశంపై జరిగిన సెమినార్లో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈడీబీ ర్యాంకుల్లో భారత్ ప్రస్తుతం 100వ స్థానంలో ఉందని, రాష్ట్రానికి వచ్చిన పాయింట్ల ఆధారంగా చూస్తే ఏపీ 88వ ర్యాంకులో ఉంటుందన్నారు. 86.6 పాయింట్లతో న్యూజి లాండ్ మొదటి స్థానంలో ఉండగా, 60.8 పాయింట్లతో ఇండియా 100వ స్థానంలో ఉందని తెలిపారు. దేశంలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు 63.6 పాయింట్లు వచ్చాయని, వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 88వ ర్యాంకు వస్తుందన్నారు. దేశంలో తాము మొదటి స్థానంలో కొనసాగుతామని, తమకు ఇక్కడ ఎవరూ పోటీ కాదని వెల్లడించారు. ప్రపంచంలో టాప్–5 దేశాల్లో ఒకటిగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కేంద్రం వేగంగా స్పందించాలి దేశీయంగా తమ ర్యాంకు మూడు నెలల్లో 64, 9 నెలల్లో 40కి చేర్చేందుకు రెండు లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు చంద్రబాబు వివరించారు. ఈడీబీ ర్యాంకుల లెక్కింపులో ప్రధానంగా 10 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని, ఇందులో 7 అంశాలు కేంద్రం పరిధిలో, 3 అంశాలు రాష్ట్రం పరిధిలో ఉంటాయన్నారు. కాబట్టి కేంద్రం వేగంగా స్పందిస్తే ర్యాంకు మరింత మెరుగవుతుందన్నారు. కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. కొత్త ఆవిష్కరణలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సీఐఐ సదస్సులో ‘టెక్నాలజీస్ ఫర్ టుమారోస్’అనే అంశంపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్లీజ్ ఆఫ్ డూయింగ్ ఉండాలి: సురేష్ ప్రభు దేశంలో చేపట్టిన సంస్కరణల వల్ల ఈడీబీలో ఇండియా ర్యాంకు మరింత మెరుగవుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం సీసీఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ.. వ్యాపారం అనేది సంతోషంగా చేయాలని, అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్ కాకుండా ప్లీజ్ ఆఫ్ డూయింగ్ ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ నియమ నిబంధనలకు సంబంధించిన బుక్‌లెట్‌ను సురేష్ ప్రభు ఆవిష్కరించారు. అనంతరం కాకినాడలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఎఫ్‌టీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ) క్యాంపస్‌లకు శంకుస్థాపన చేశారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రూపొందించిన ఈ–స్పైస్ బజార్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ‘ఎంపెడా’రూపొందించిన ఎన్రోల్మెంట్ కార్డులను ఆక్వా రైతులకు అందచేశారు. -
‘ఫార్మా’ వృద్ధికి ఊతమిస్తాం..
సాక్షి, హైదరాబాద్ : ఫార్మా రంగంలో పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూనే సామన్యుడి వైద్య ఖర్చులు పెరగకుండా చూడాల్సిన అవసరముందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ఫార్మా రంగం 20 ఏళ్లలో అన్నివిధాలుగా అభివృద్ధి చెందిందని, మారుతున్న ప్రపంచంలో ఈ రంగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న బయో ఆసియా సదస్సులో శనివారం సురేశ్ ప్రభు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనిషి ఆయుఃప్రమాణాలు పెరుగుతున్న తీరు ఫార్మా రంగానికి డిమాండ్ కల్పిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆరోగ్య పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు లక్ష వెల్నెస్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆరేడు గ్రామాలకు ఒకటి చొప్పున ఏర్పాటయ్యే ఈ కేంద్రాలు వైద్యాన్ని సామాన్యుడి చెంతకు తీసుకుపోవడంతోపాటు ఫార్మా కంపెనీలకు కొత్త మార్కెట్లను సృష్టిస్తాయని చెప్పారు. ఫార్మా రంగంపై ప్రభుత్వ నియంత్రణ గురించి మాట్లాడుతూ.. మనిషి జీవితానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ రంగంపై నియంత్రణలు తప్పనిసరి అని, భవిష్యత్తులో మరిన్ని నియంత్రణలూ రావచ్చని చెప్పారు. ఫార్మా కంపెనీలు అల్లోపతి మందులతోపాటు ఆయుర్వేదం, సిద్ధ వంటి ఇతర వైద్య విధానాలపైనా దృష్టి పెట్టి కొత్త మందులు తయారు చేయాలని.. తద్వారా తక్కువ ఖర్చుతో పరిపూర్ణ వైద్యం అందించడం వీలవుతుందన్నారు. ప్రోత్సాహకాలు ఇవ్వండి: కేటీఆర్ ఫార్మా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు తీసుకెళ్లారు. మందుల ధరలను నిర్ణయించే విషయంలో తమతో సంప్రదింపులు జరపాలన్న పారిశ్రామిక వర్గాల విన్నపంపై ప్రభు స్పందిస్తూ.. ఈ విషయాన్ని నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ చూసుకుంటుందని సమాధానమిచ్చారు. రసాయనాలు, ఫార్మా మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఈ అంశాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఫార్మా పరిశ్రమలు కొత్త మందులను కనుగొనే లక్ష్యంతో పరిశోధనల కోసం భారీ ఖర్చు పెడుతుంటాయని, వీటిపై రాబడులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని పరిశ్రమల తరఫున కేటీఆర్ కోరారు. దీనికి ప్రభు స్పందిస్తూ.. ఈ అంశాన్ని పరిశ్రమలకు ఇచ్చే ప్యాకేజీగా చూడకూడదని.. మందుల తయారీ వల్ల ఎన్నో సామాజిక ప్రయోజనాలు ఉన్న కారణంగా మొత్తం సమాజానికి ఇచ్చే ప్రోత్సాహకాలుగా చూడాలని చెప్పారు. 1999లో ప్రైవేట్ సంస్థలు పరిశోధనలపై పెట్టే ఖర్చులో రాయితీలు ఇచ్చేందుకు రూ.50 కోట్లు కేటాయించారని అలాంటి పథకాన్ని మళ్లీ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు వార్‌రూమ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. -
సంస్కరణలతో పన్నులు తగ్గుతాయి
విశాఖపట్టణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాహసోపేతమైన సంస్కరణల వల్ల ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు కనిపించినా దీర్ఘకాలంలో పలు ప్రయోజనాలు చేకూరతాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చెప్పారు. సంస్కరణల వల్ల దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగితే పన్ను రేట్లు దిగొస్తాయన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ భాగస్వామ్య సదస్సును శనివారం విశాఖలో ఉప రాష్ట్రపతి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో పన్ను చెల్లించే వారి సంఖ్య 6.74 కోట్ల నుంచి 8.28 కోట్లకు పెరిగిందని, ఇది మరింత పెరిగితే పన్ను రేట్లు కూడా దిగొస్తాయని ఉప రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.సంస్కరణలు, సమర్థవంతమైన నాయకత్వం, స్థిరమైన వృద్ధి రేటుతో దూసుకుపోతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారని ఉప రాష్ట్రపతి తెలిపారు. వచ్చే పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 2.3 ట్రిలియన్ డాలర్ల నుంచి 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం ద్వారా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించనుందన్నారు. ఏపీ అన్నిట్లో ఎదగాలి: కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ఆంధ్రప్రదేశ్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. ఏపీ పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా ఉద్యోగ కల్పనలోనూ ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. తూర్పు తీరంలో అతి పెద్ద ఆటో కాంపొనెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోందని, దీన్ని ఏపీలో నెలకొల్పాలన్న వినతిని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
ఉదయ్ లేదా!
సాక్షి, విశాఖపట్నం: ‘ఉదయ్’.. (ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఏసీ యాత్రి) మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండేందుకు ఉద్దేశించిన డబుల్ డెక్కర్ రైలు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే విశాఖ–విజయవాడల మధ్య దీనిని ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించి రెండేళ్లయింది. ఈ ట్రైన్‌కు 22701 నంబరును కూడా ప్రకటించారు. ఏడాదిలోగా ‘ఉదయ్’ను పట్టాలెక్కిస్తామని అప్పటి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ దీనిపై ప్రకటన వెలువడుతుందని అంతా ఆశించారు. ప్చ్.. కనీసం దాని ప్రస్తావనే తేవడం మానేశారు. దీంతో దీని రాక ఎప్పుడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఈ ‘ఉదయ్’ డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కితే విశాఖ–విజయవాడల మధ్య రాకపోకలు సాగించే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చార్జీలు తక్కువ.. ఈ ఏసీ రైలులో టిక్కెట్ చార్జీలు కూడా అందుబాటులోనే ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ రైలు థర్డ్ ఏసీకంటే తక్కువ, స్లీపర్ చార్జీలుకంటే కాస్త ఎక్కువగా ఉండనున్నాయి. విశాఖపట్నం నుంచి విజయవాడకు స్లీపర్ క్లాస్ టిక్కెట్టు రూ.240, థర్డ్ ఏసీ టిక్కెట్టు రూ.560 ఉంది. అంటే ఈ లెక్కన ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు టిక్కెట్ చార్జీ రూ.400 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఎందుకు ఆలస్యం? ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు అవసరమైన బోగీల తయారీలో జాప్యం జరుగుతోందని, అందువల్లే దీనిని ప్రారంభించడానికి ఆలస్యమవుతోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ డబుల్ డెక్కర్ బోగీల నిర్మాణం పంజాబ్‌లోని కపుర్తలా కోచ్ తయారీ కేంద్రంలో జరుగుతోంది. కోచ్‌లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాక తొలుత ఉత్తర రైల్వేలో ప్రయోగాత్మకంగా నడుపుతారు. ఈ ఉదయ్ డబుల్ డెక్కర్ బోగీలను కూడా ఆ రైల్వేలోనే ప్రయోగాత్మకంగా నడిపి చూసి సంతృప్తి చెందాక తూర్పు కోస్తా రైల్వేకు అప్పగిస్తారు. ఆ తర్వాత అధికారికంగా ఈ రైలును ప్రారంభిస్తారు. ఇప్పటికే విశాఖ–తిరుపతిల మధ్య ఒక డబుల్ డెక్కర్ రైలు నడుస్తోంది. -
విదేశాల్లో రెండుసార్లు చిక్కితే పాస్‌పోర్ట్ రద్దు!
సాక్షి, న్యూఢిల్లీ : పర్యాటక, సందర్శక వీసాలతో విదేశాలకు వెళ్లి పనిచేస్తూ పట్టుబడిన కార్మికుల పాస్‌పోర్టులను ఐదేళ్ల పాటు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్మికులు అలా పట్టుబడినప్పుడు ఆయా దేశాలతో మాట్లాడి విడిపించినా.. వారు మళ్లీ అదే తరహాలో విదేశాలకు వెళ్లి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకే పాస్‌పోర్టుల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నారై సంక్షేమ శాఖ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వివరాలు వెల్లడించారు. ఈ భేటీలో పాల్గొన్న మంత్రి కె.తారకరామారావు అనంతరం మీడియాతో మాట్లాడారు. విదేశాల్లో ఒకసారి చిక్కుకుని కేంద్ర ప్రభుత్వ సాయంతో స్వదేశానికి చేరుకుంటున్న కొందరు కార్మికులు... తిరిగి అదేబాట పడుతున్నారని కేంద్రం గుర్తించిందని తెలిపారు. ఈ పరిస్థితికి అడ్డుకట్టవేసేందుకు చర్యలు చేపట్టిందని, రెండు సార్లు విదేశాల్లో చిక్కుకున్న వారి పాస్‌పోర్టులను ఐదేళ్ల పాటు రద్దు చేయాలని నిర్ణయించిందని చెప్పారు. దానికి అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని వెల్లడించారు. సుష్మాకు ఆహ్వానం త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న విదేశీ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సుష్మా స్వరాజ్‌ను ఆహ్వానించామని కేటీఆర్ తెలిపారు. విదేశాల్లో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో తెలుగువారికి సహాయపడేందుకు అక్కడి ఎంబసీల్లో తెలుగు మాట్లాడే సిబ్బందిని నియమించాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. అవసరమైతే రాష్ట్రం నుంచి డిప్యుటేషన్ మీద తెలుగు సిబ్బందిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించామని, కేంద్ర మంత్రి దీనిపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. విదేశాలకు పంపుతామంటూ ప్రచారం చేసుకునే నకిలీ ఏజెంట్ల పట్ల కఠిన వైఖరి అవలంబించాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర మంత్రి కోరారని తెలిపారు. పాస్‌పోర్టు సేవల్లో హైదరాబాద్ కేంద్రం మెరుగైన పనితీరును కనబరుస్తోందని కితాబిచ్చారని వెల్లడించారు. ఫార్మాసిటీకి ‘నిమ్జ్’ హోదా ఇవ్వండి సుష్మాస్వరాజ్‌తో సమావేశం అనంతరం కేటీఆర్ కేంద్ర వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభును కలిశారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి ‘జాతీయ పెట్టుబడులు, ఉత్పాదకత జోన్ (ఎన్ఐఎంజెడ్)’హోదా ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అలాగే అక్కడ కామన్ ఎఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.1,500 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ స్పైస్ పార్కుకు కేంద్రం తరఫున ఇస్తామన్న రూ.20 కోట్లు విడుదల చేయాలని... హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–రామగుండం, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో మెగా లెదర్‌పార్క్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 22, 23 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బయో ఆసియా సదస్సుకు గౌరవ అతిథిగా రావాలని సురేశ్ ప్రభును కేటీఆర్ ఆహ్వానించారు. -
హార్వర్డ్ సదస్సుకు కేటీఆర్, అమరీందర్
వాషింగ్టన్: ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీలో జరగనున్న 15వ భారత వార్షిక సదస్సుకు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు, పంజాబ్ సీఎం అమరీందర్, సినీ నటుడు కమల్ హాసన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో ‘భారత్ – అద్భుత ఆవిష్కరణలు’ అనే అంశంపై చర్చ జరగనుంది. సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తారక రామారావు, బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి, నటి దివ్య స్పందన, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆదిల్ జైనుల్‌బాయ్ తదితరులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
మూడు రెట్ల వృద్ధి:2.6 కోట్ల ఉద్యోగాలు
సాక్షి,న్యూఢిల్లీ: 2022 నాటికి ఆయుష్ రంగంలో మూడు రెట్ల పెరుగుదలను కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆయుష్ పరిశ్రమ భవిష్యత్తులో రెండంకెల వృద్ధిని సాధించనుందని, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభింస్తాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. 2020 నాటికి 26 మిలియన్ల మందికి పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఢిల్లీ నేటి (డిసెంబర్4) నుంచి మూడు రోజులపాటు జరగనున్న మొట్టమొదటి అంతర్జాతీయ వెల్నెస్, ఆరోగ్య 2017 సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో ఆయుష్ రంగం ప్రగతి దిశగా పయనిస్తోందని.. ఈ రంగంలో మున్ముందు కోట్ల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని సురేశ్ ప్రభు అన్నారు. 2020 నాటికి ఈ రంగం ప్రత్యక్షంగా 10లక్షల మందికి, పరోక్షంగా 2.5 కోట్ల మందిని ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధా, హోమియోపతి కలిసి ఉన్న ఆయుష్రంగం ద్వారా దేశీయంగా రూ. 500కోట్లను ఎగుమతుల ద్వారా రూ.200 వందలకోట్లను సాధిస్తుందని అంచనా వేసినట్టు చెప్పారు. సంప్రదాయ ఔషధాలపై అవగాహన కల్పించేందుకు భారత్‌తో కలిసి అనేక దేశాలు పనిచేస్తున్నాయని, అందుకు చాలా ఆనందంగా ఉందని కేంద్రమంత్రి ప్రభు వెల్లడించారు. దాదాపు 6,600 ఔషధ మొక్కల సంపదతో ప్రపంచంలోని ఆయుష్ మరియు ఔషధ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉందన్నారు. అలాగే ఆయుష్‌లో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. వైద్యరంగంలో స్టార్టప్‌లు పెట్టాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు ఈ రంగంలో అనేక అవకాశాలున్నాయని ప్రభు తెలిపారు.వచ్చే ఐదేళ్లలో ఆయుష్ రంగం మూడు రెట్ల పరిమాణాన్ని పెంచేందుకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని ఆయుష్ మంత్రిత్వ శాఖ సెక్రటరీ వైద్య రాజేష్ వెల్లడించారు. -
ఆ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు
సాక్షి,న్యూఢిల్లీ: వైద్య,ఆరోగ్య రంగం రెండంకెల వృద్ధి సాధించే క్రమంలో ఆయుష్ పరిశ్రమలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారు.2020 నాటికి ఆయుష్ పరిశ్రమలో పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 2.5 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు సమకూరుతాయని మంత్రి పేర్కొన్నారు. ఆయుర్వేద, యోగ,నేచురోపతి,యునాని,సిద్ధ,హోమియోపతి వైద్య విధానాలను కలిపి ఆయుష్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశ ఆయుష్ మార్కెట్ రూ 500 కోట్లుకాగా, రూ 200 కోట్ల మేర ఎగుమతులు సాగుతున్నాయి. హాలిస్టిక్ హెల్త్‌కేర్‌లో స్టార్టప్‌ల కోసం యువత ఆసక్తి కనబరుస్తోందని మంత్రి తెలిపారు. వెల్నెస్,ఆరోగ్య 2017 సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. సంప్రదాయ వైద్య విధానాల విషయంలో సాంకేతికత, విజ్ఞానాన్ని మేళవించేందుకు పలు దేశాలతో్ కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్పారు. ఆయుష్ రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతించిందని తెలిపారు. -
ఆపిల్ రాక ఎంతో ఆనందదాయకం
ప్రపంచపు టెక్ దిగ్గజం ఆపిల్, తన కంపెనీ తయారీ యూనిట్‌ను భారత్‌లో ఏర్పాటుచేయడానికి కేంద్రం సపోర్టు ఇస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ అన్నారు. వారి నుంచి అధికారిక ప్రతిపాదన కోసం వేచిచూస్తున్నామని తెలిపారు. ''వారి నుంచి మంచి ప్రతిపాదన రావాల్సి ఉంది. ఆపిల్ రాక నిజంగా చాలా ఆనందదాయకం. ఆపిల్ ప్రపంచంలో టాప్ బ్రాండుల్లో ఒకటి. ఒకవేళ వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటే, వాటిని పరిష్కరించడానికి కృషిచేస్తాం. మేము అధికారిక ప్రతిపాదన కోసం వేచిచూస్తున్నాం'' అని సురేష్ ప్రభు అన్నారు. అయితే కూపర్టినోకి చెందిన ఈ కంపెనీ, భారత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేయడానికి పలు రాయితీలను అభ్యర్థిస్తోంది. ప్రతిపాదించిన తయారీ యూనిట్లో ఎంత మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు, ఉద్యోగ వివరాలను వంటి వాటిని కేంద్రం ఆపిల్ నుంచి కోరుతోంది. కాగ, ఆపిల్ కోరుతున్న చాలా డిమాండ్లను కేంద్రం అంగీకరించడానికి సిద్ధంగా లేదని మార్చి నెలలో అప్పటి వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
కొత్త రైల్వేమంత్రిగా మరో కేంద్ర మంత్రి?
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన రైల్వే ప్రమాదాల నేపథ్యంలో రైల్వేశాఖలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రైల్వే మంత్రిగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని నియమించే అవకాశం ఉందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతోపాటు రోడ్డు, రైల్వే ,రవాణా శాఖలను కలిపి ఒకటి చేయాలనికూడా ప్రభుత్వం యోచిస్తోందట. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రోడ్డు, రవాణా మంత్రి గా ఉన్న ఆయనకు అదనంగా ఈ బాధ్యతలను కూడా అప్పగించనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజా నివేదికల ప్రకారం సురేష్ ప్రభు రాజీనామాకు ఆమోదం లభిస్తుందనీ, ఆయన స్థానంలో కేంద్ర మంత్రి గడ్కరీ రైల్వేమంత్రి పదవిని చేపట్టనున్నారని తెలుస్తోంది. గత అయిదు రోజుల్లో రెండు బ్యాక్-టు-బ్యాక్ ప్రమాదాల కారణంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాజీనామాకు సిద్ధపడ్డారు. ప్రమాదాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దురదృష్టకరమైన ప్రమాదాలు, ప్రయాణీకులు విలువైన జీవితాలను కోల్పోవటం గాయపడటం తనకు చాలా బాధ కలిగించిందంటూ బుధవారం మధ్యాహ్నం రైల్వే మంత్రి వరుస ట్వీట్లలో ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేల మెరుగుకోసం తన రక్తాన్ని, చెమటను, అంకితం చేశానని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన అభిప్రాయాన్ని తెలిపానన్నారు. అయితే ప్రధాని వేచి వుండమని సూచించినట్టు ట్వీట్ చేశారు. అటు రైల్వే బోర్డు ఛైర్మన్ పదవికి ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఛైర్మన్ అశోక్ లోహానీ నియమితులయ్యారు. ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వే బోర్డు ఛైర్మన్ అశోక్ మిట్టల్ స్థానంలో రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో అశ్వని లోహానిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అశ్వని ప్రస్తుతం ఎయిరిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు కేంద్ర క్యాబినెట్ లో అతి త్వరలోనే భారీ మార్పులు చేర్పులు జరగనున్నాయినే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో పళని స్వామి, పన్నీరు సెల్వం విలీనం తరువాత అన్నాడీఎంకేకు క్యాబినెట్లో బెర్త్ ఖాయం అనే వార్త హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఘోర రైలు ప్రమాదం : 23 మంది మృతి
-
పట్టాలు తప్పిన ఉత్కళ్
- యూపీలో ఘోర రైలు ప్రమాదం - 23 మంది మృతి.. 60 మందికి పైగా గాయాలు ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలి వద్ద పూరీ–హరిద్వార్ ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 23 మంది మృతిచెందగా.. 60 మందికి పైగా గాయపడ్డారు. రైల్లోని 14 బోగీలు పట్టాలు తప్పడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఏటీఎస్ బలగాలు, వైద్య బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. భారీ క్రేన్లు, గ్యాస్ కట్టర్లతో బోగీల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. ప్రమాదతీవ్రతతో ఒక బోగీ ట్రాక్ పక్కనున్న ఇంట్లోకి దూసుకుపోగా.. రెండు బోగీలు ఒకదానిపైకి మరకొటి ఎక్కాయి. సహాయక చర్యల్లో స్థానికులు కూడా బలగాలకు సాయం చేస్తున్నారు. ఘటనాస్థలంలో పరిస్థితి భీతావహంగా మారింది. అంబులెన్సుల ద్వారా బాధితులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. శనివారం సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు మీరట్ జోన్ రైల్వే మెడికల్ అధికారి పీఎస్ మిశ్రా స్పష్టం చేశారు. ఎస్1 నుంచి ఎస్ 10 వరకు స్లీపర్ కోచ్‌లు, థర్ట్ ఏసీ బీ1, సెకండ్ ఏసీ ఏ1, ప్యాంట్రీ బోగీలు పట్టాలు తప్పాయన్నారు. ప్రమాదానికి కారణమేంటి? దుర్ఘటన విషయం తెలియగానే మొదట దీన్ని ఉగ్రవాద ఘటనగానే రైల్వే శాఖ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భావించాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, వైద్య బృందాలతోపాటుగా ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్)ను కూడా యూపీ సర్కారు రంగంలోకి దించింది. అయితే.. దుర్ఘటన జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన ఆధారాలతో.. మానవ తప్పిదమే ఈ ఘటనకు కారణమని యూపీ సర్కారు స్పష్టం చేసింది. ఏటీఎస్ కూడా దీన్ని ధ్రువీకరించింది. మీరట్–సహరాన్పూర్ డివిజన్లో పలుచోట్ల రైల్వే ట్రాక్‌కు మరమ్మతులు చేపడుతున్నారు. ఈ విషయంపై ఆ మార్గంలో ప్రయాణించే రైలు డ్రైవర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా రైలు వేగాన్ని డ్రైవర్ నియంత్రణలో ఉంచుకుంటారు. అయితే రిపేర్లు జరుగుతున్న విషయాన్ని డ్రైవర్‌కు సూచించకపోవటం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నార్తర్న్ రైల్వేలో చాలా రద్దీగా ఉండే ఈ లైన్ ద్వారా వెళ్లే రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ముజఫర్‌నగర్ అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేశారు. 0131–2436918, 0131–2436103, 0131–2436564 నంబర్ల ద్వారా వివరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని, యూపీ సీఎం దిగ్భ్రాంతి ఈ ఘటనపై ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన బాధాకరమన్న మోదీ.. బాధితులను ఆదుకునేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ, యూపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ‘ముజఫర్‌నగర్ వద్ద రైలు పట్టాలు తప్పిన దుర్ఘటన బాధాకరం. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ట్వీటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటన తమను కలచివేసిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై రైల్వే మంత్రి సురేశ్ ప్రభు విచారణకు ఆదేశించారు. తనే స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ దుర్ఘటన కారకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సహాయకచర్యలను వేగవంతం చేసేందుకు యూపీ సర్కారుతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.3.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25వేల పరిహారం ఇవ్వనున్నట్లు సురేశ్ ప్రభు వెల్లడించారు. యూపీ సీఎం యోగి కూడా మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా, ఇద్దరు యూపీ మంత్రులు ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైల్వే బోర్డు చైర్మన్, ట్రాఫిక్ బోర్డు సభ్యులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చీకటి కారణంగా సహాయకచర్యలకు ఆటంకం కలగకుండా.. విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒడిశా బాధితులకు రూ.5లక్షలు ప్రమాద ఘటనపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఒడిశా ప్రయాణికుల కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50వేలు పరిహారంగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని పట్నాయక్ ఆదేశించారు. కాగా, ప్రమాదానికి గురైన 14 బోగీల్లో కలిపి 80 మంది స్లీపర్ క్లాసులో, ఆరుగురు ఏసీ కోచ్‌లో పూరీలో ఎక్కినట్లు అధికారులు తెలిపారు. బాధితుల వివరాల కోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే 1072 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించింది. పట్టాలెక్కని కకోద్కర్ సిఫార్సులు ముజఫర్‌నగర్ దుర్ఘటన భారత రైల్వే భద్రతలోని డొల్లతనాన్ని మరోసారి స్పష్టం చేసింది. రైల్వే భద్రతా అంశాలను అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాలని కోరుతూ 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అనిల్ కకోద్కర్ అధ్యక్షతన ఓ కమిటీని నియమించింది. ఐదేళ్లు గడిచినా కమిటీ చేసిన సూచనల్లో చాలా మటుకు ఇంకా అమలుకు నోచుకోలేదు. అందులో... ఐదేళ్ల కాలానికి ప్రయాణికుల భద్రత కోసం లక్ష కోట్లు వెచ్చించడంతో పాటు, రైల్వే భద్రతా ప్రాధికార సంస్థ ఏర్పాటు లాంటివి ఉన్నాయి. రైల్వే బోర్డుపై పని ఒత్తిడి పెరిగినా, భద్రతా ప్రాధికార సంస్థపై ఎలాంటి పురోగతి జరగలేదు. కమిటీ చేసిన మరికొన్ని సిఫార్సులు ► రైల్వే కార్యకలాపాల పర్యవేక్షణకు సంస్థ ఏర్పాటు ► ఐదేళ్లలో అన్ని లెవల్ క్రాసింగ్‌ల ఎత్తివేత ► లెవల్ క్రాసింగ్లను తొలగించడానికి అయ్యే ఖర్చు రూ.50 వేల కోట్లు. నిర్వహణ ఖర్చు తగ్గించుకోవడం ద్వారా ఈ మొత్తాన్ని 8 ఏళ్లలో తిరిగి రాబట్టుకోవచ్చు. ► అన్ని బ్రిడ్జిల వద్ద నీటి మట్టాలు, నీటి ప్రవాహ వేగాలను తరచూ పర్యవేక్షించాలి. ► రైలు లోకోపైలట్‌కు సూచించేలా ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జిల వద్ద నీటి మట్టాలను కొలిచే పరికరాలు, టర్బైన్ ఫ్లో మీటర్లను బిగించాలి. ► రూ. 20 వేల కోట్ల వ్యయంతో యూరప్ దేశాల మాదిరిగా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి. భారీ రైలు ప్రమాదాలు ► డిసెంబర్ 28, 2016: యూపీలోని కాన్పూర్ దేహత్ జిల్లాలో షెల్దా–అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 62 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ► నవంబర్ 20, 2016: యూపీలోని ఫతేపూర్ సమీపంలో కల్కా మెయిల్‌కు చెందిన 15 బోగీలు పట్టాలు తప్పడంతో దాదాపు 70 మంది మరణించగా.. వందల మంది గాయపడ్డారు. ► మే 28, 2010: పశ్చిమబెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో మావోయిస్టులు పట్టాలు తొలగించడంతో జ్ఞానేశ్వర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పి 148 మంది మృతిచెందారు. ► సెప్టెంబర్ 9, 2002: హౌరా–ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ బిహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లాలోని దవే నదిలో పడడంతో 100 మంది మరణించగా.. 150 మంది గాయపడ్డారు. ► ఆగస్టు 2, 1999: 2,500 మందితో వెళ్తున్న రెండు రైళ్లు అస్సాంలోని గైసల్ సమీపంలో ఢీకొనడంతో 290 మంది మరణించారు. ► నవంబర్ 26, 1998: పంజాబ్‌లోని ఖాన్నా సమీపంలో పట్టాలు తప్పిన ఫ్రాంటియర్ మెయిల్‌ను జమ్ముతావి–షెల్దా ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో 212 మంది ప్రాణాలు కోల్పోయారు. ► సెప్టెంబర్ 14, 1997: అహ్మదాబాద్–హౌరా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 5 బోగీలు మధ్యప్రదేశ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని నదిలో పడడంతో 81 మంది దుర్మరణం చెందారు. ► ఆగస్టు 20, 1995: యూపీలోని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగిఉన్న కలింది ఎక్స్‌ప్రెస్‌ను పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో 400 మంది మరణించారు. ► ఏప్రిల్ 18, 1988: యూపీలోని లలిత్పూర్ సమీపంలో కర్ణాటక ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 75 మంది ప్రాణాలు కోల్పోయారు. ► జూలై 8, 1988: కేరళలోని అష్టముది సరస్సులో ఐలాండ్ ఎక్స్‌ప్రెస్ పడడంతో 107 మంది మరణించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యూపీలో ఘోర రైలు ప్రమాదం
-
యూపీలో ఘోర రైలు ప్రమాదం
సాక్షి, లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఖతౌలి వద్ద కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో ఇప్పటివరకూ 23 మంది మరణించారు. పెద్దసంఖ్యలో ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ప్రమాదంపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి మెడికల్ వ్యాన్స్, వైద్య సిబ్బంది చేరుకున్నాయని చెప్పారు. I am personally monitoring situation.Hv instructed senior officers to reach site immediately and ensure speedy rescue and relief operations https://t.co/OCpgUGhg5y — Suresh Prabhu (@sureshpprabhu) 19 August 2017 సహాయ కార్యక్రమాలపై తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, సహాయ చర్యలను వేగవంతం చేయాలని రైల్వే బోర్డు ఛైర్మన్‌ను ఆదేశించామన్నారు. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకూ 50 మంది ప్రయాణీకులను కాపాడినట్టు అధికారులు తెలిపారు. ఒడిశాలోని పూరి నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు ట్రైన్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ.3.5 లక్షలు, తీవ్రగాయాలైన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియాగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. -
యూపీలో ఘోర రైలు ప్రమాదం..
-
రైల్వే భూమి బదలాయింపు వేగిరం చేయండి
కేంద్ర మంత్రి సురేశ్ ప్రభును కోరిన దత్తాత్రేయ, టీఆర్ఎస్ నేతలు - వెంటనే దక్షిణ మధ్య రైల్వే జీఎంతో మాట్లాడిన ప్రభు - త్వరితగతిన రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: సికింద్రాబాద్ పరిధిలోని లాలా పేట్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన 12.6 ఎకరాల రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిన ప్రక్రియను వేగ వంతం చేయాలని రైల్వే మంత్రి సురేశ్ ప్రభును కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీఆర్ఎస్ నేతలు కోరారు. రాష్ట్ర మంత్రి పద్మారావు, టీఆర్ఎస్ ఎంపీలు వినోద్‌కుమార్, కొండా విశ్వేశ్వరరెడ్డి, కె.కవిత, సీతారాంనాయక్, మల్లా రెడ్డి తదితరులు మంగళవారం ప్రభును పార్ల మెంటులో కలిశారు. ఈ సందర్భంగా భూమి బదలాయింపు ప్రక్రియ పురోగతిపై చర్చించారు. గతంలో సికింద్రాబాద్ పరిధిలో రైల్వే భూమిని బదలాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తిపై సురేశ్ ప్రభు సానుకూలంగా స్పందించారు. అయితే భూమి బదలాయింపు ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో సంబం« దిత ప్రాంతంలో పేదలకు 4 వేల వరకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుకు టీఆర్ఎస్ నేతలు వివరించారు. రైల్వే భూమికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం మరోచోట భూమి ఇచ్చేందుకు, లేదా డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. స్పందించిన ప్రభు.. దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్‌తో ఫోన్లో మాట్లాడి భూమి బదలా యింపు ప్రక్రియకు సంబంధించిన నివేదికను త్వరితగతిన తయారు చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా రైల్వే భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప గించాలని సూచించారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం సందర్భంగా ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని రైల్వే సమస్యలను ప్రభు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే జీఎం అధ్యక్షతన ఎంపీలు హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. -
మహిళా క్రికెటర్లకు బంపర్ ఆఫర్..
న్యూఢిల్లీ: ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత మహిళా జట్టులోని రైల్వే క్రికెటర్లకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పదోన్నతులతో సహా నగదు ప్రోత్సాహకాలిస్తామని, భారత్ జట్టు ఫైనల్లో గెలువాలని ఆకాంక్షిస్తూ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్( ఆర్ఎస్పీబీ) సెక్రటరీ రేఖా యాదవ్ మీడియాకు తెలిపారు. మిథాలీ సేనలోని 15 మంది సభ్యుల్లో 10 మంది రైల్వే ఉద్యోగులు ఉండటం విశేషం. కెప్టెన్ మిథాలీతో సహా వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఎక్తా బిష్త్, పూనమ్ రౌత్, వేధ కృష్ణమూర్తి, పూనమ్ యాదవ్, సుష్మా వర్మ, మోనా మెశ్రామ్, రాజేశ్వరి గైక్వాడ్, నుజాత్ పర్విన్‌లు రైల్వే ఉద్యోగులే. వీరి అద్భుత ప్రదర్శనతోనే భారత్ ఫైనల్‌కు చేరిందని రైల్వే శాఖ సంతోషం వ్యక్తం చేసింది. మిథాలీ నిలకడగా ఆడుతూ వన్డెల్లో ప్రపంచ రికార్డు నమోదు చేయగా, వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సెమీస్‌లో ఆస్ట్రేలియా పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. రాజేశ్వరి గైక్వాడ్, ఎక్తా బిష్త్ బౌలింగ్‌తో చెలరేగగా, వేద కృష్ణమూర్తి న్యూజిలాండ్‌తో మెరుపు బ్యాటింగ్ చేసింది. -
ఫిర్యాదు చేస్తే వెకిలి నవ్వులు.. కేంద్ర మంత్రి ఫైర్
ముంబయి: ముంబయి లోకల్ రైలులో ఓ 22 ఏళ్ల విద్యార్థినిపట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. కళ్లతో సైగలు చేయడంతోపాటు వెకిలిచేష్టలు చేస్తూ చెప్పరాని విధంగా చేశాడు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా రైల్వే పోలీసులు కంప్లెయిట్ తీసుకోకపోగా వెకిలి నవ్వులు నవ్వడం మొదలుపెట్టారు. దీంతో తాను ఎదుర్కొన్న భయానక సంఘటనను ఫేస్బుక్ ద్వారా ఆమె సోషల్ మీడియాలోకి తీసుకొచ్చింది. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దర్యాప్తునకు ఆదేశించారు. ఘటన విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని, సదరు పోలీసులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ట్వీట్ కూడా చేశారు. బాధితురాలు ఫేస్బుక్లో తెలిపిన వివరాల ప్రకారం.. మరో ప్రయాణీకురాలితో కలిసి ఆమె ప్రత్యేక మహిళల రైలు బోగీలో కూర్చొని ఉంది. మరో బోగీకి వీరు కూర్చున్న బోగీకి మధ్య ఇనుప రెయిలింగ్ అడ్డుగా ఉంది. అవతలి బోగీలో ఉన్న ఉన్న వ్యక్తి ఆమె పక్కనే ఉన్న మహిళకు చేయి ఊపడం గమనించింది. అయితే, తొలుత ఆ వ్యక్తికి మతి స్థిమితం లేదని అనుకున్నారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం తన చేష్టలు ఆపకుండా నోటితో చెప్పలేని విధంగా చేస్తూ దుర్మార్గంగా వ్యవహరించాడు. అనంతరం వారిద్దరిని ఇబ్బందికరంగా తిట్టడమే కాకుండా లైంగిక దాడి చేస్తానంటూ బెదిరించాడు. ఇదే విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారు కేసు నమోదు చేసుకోకపోగా వారిని చూసి నవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఆమె సోషల్ మీడియాను ఆశ్రయించినట్లు తెలిపింది. -
విజయవాడ రైల్వేస్టేషన్‌కు మహర్దశ
► ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంతో కార్పొరేట్ హంగులు ► నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ► విజయవాడకు రానున్నరైల్వేమంత్రి సురేష్ ప్రభు విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ప్రతి ప్లాట్‌ఫాం అత్యాధునిక ఎస్కలేటర్లతో ప్రయాణికులకు ఆహ్వానం పలకనున్నాయి. 1, 6, 7, 8, 9 ప్లాట్‌ఫాంలపై అత్యాధునిక ఫుడ్‌కోర్టులు ఏర్పాటు కానున్నాయి. వీటితోపాటు మల్టీఫంక్షన్ హాల్లు, థియేటర్స్, షాపింగ్ మాల్స్, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, ఏసీ వెయిటింగ్ హాల్లు, పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కోసం మినీ థియేటర్స్ ప్రయాణికులకు వరల్డ్‌క్లాస్ సౌకర్యాలను తలపించనున్నాయి. రైల్వేస్టేషన్ (విజయవాడ): ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంతో విజయవాడ రైల్వే స్టేషన్‌కు కార్పొరేట్ హంగులు అమరునున్నాయి. రాజధాని నేపథ్యంలో విజయవాడకు ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయ్యింది. రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద 195 కోట్లతో పి.పి.పి(ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతిలో పనులు చేపట్టనున్నారు. రైల్వేమంత్రి సురేష్ ప్రభు విజయవాడలో గురువారం పనులను ప్రారంభించనున్నారు. నెలాఖరుకు బిడ్లను ఖరారు చేస్తారని రైల్వే వర్గాలు తెలిపాయి. విజయవాడ నగర శివార్లలో, రాయనపాడు సమీపంలో ఇప్పటివరకు నిరుపయోగంగా ఉన్న వందలాది ఎకరాల రైల్వే స్థలాలను సైతం పి.పి.పి పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. దీంతో డివిజన్‌తోపాటు విజయవాడ రైల్వేస్టేషన్ ఆదాయం కూడా గణనీయంగా పెరగనుంది. నిత్యం విజయవాడ మీదుగా 350కి పైగా ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం అన్‌సీజన్‌లో లక్ష, సీజన్లో లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు ఈ స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. రీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా విమానాశ్రయ తరహాలో సౌకర్యాలు అమరనున్నాయి. ప్రతి ప్లాట్‌ఫాంకు ఎస్కలేటర్... స్టేషన్‌లోని పది ప్లాట్‌ఫాంలపై అత్యాధునిక ఎస్కలేటర్లు, 1, 6, 7, 8, 9 ప్లాట్‌ఫాంలపై అత్యాధునిక ఫుడ్‌కోర్టులు, మల్టీఫంక్షన్ హాల్లు, థియేటర్స్, షాపింగ్ మాల్స్, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, ఏసీ వెయిటింగ్ హాల్లు, చిల్ట్రన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం మినీ థియేటర్స్‌ను నిర్మించనున్నారు. ఇప్పటికే వైఫై, డీజీ పే వంటి సౌకర్యాలు ప్రయాణికులకు అమరాయి. వివిధ రైళ్ల రాక ఆలస్యమైన ప్రయాణికులకు వినోదాన్ని అందించటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పీపీపీ పద్ధతిలో రైల్వే స్థలాల అభివృద్ధి... సత్యనారాయణపురం, సింగ్‌నగర్, రాయనపాడులో ఖాళీగా ఉన్న 200 ఎకరాల రైల్వే స్థలాలను పి.పి.పి పద్ధతిలో అభివృద్ధి చేయనున్నారు. అదే విధంగా ప్రయాణికులు బస చేసేందుకు అత్యాధునిక విశ్రాంతి మందిరాలను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ స్టేషన్ ఎదురుగా ఉన్న 2 ఎకరాల స్థలంలో అత్యాధునిక మల్టీలెవల్ ఫంక్షన్ హాల్, విశాలమైన కార్ పార్కింగ్ స్టాండ్, ద్విచక్రవాహనాల పార్కింగ్ స్టాండ్లను నిర్మించనున్నారు. ప్రయాణికుల లగేజీని భద్రపరుచుకునేందుకు అత్యాధునిక క్లోక్ రూంలను నిర్మించనున్నారు. గురువారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు పనులను ప్రారంభించనున్నారు. జూన్ నెలాఖరుకు టెండర్లను ఖరారు చేస్తారని రైల్వే వర్గాలు తెలిపాయి. వీటితో పాటు కొత్త రైళ్లు, పలు అభివృద్ధి పనులు ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారని సమాచారం. ఇప్పటికే రైల్వేస్టేషన్‌కు రోజుకు సుమారు రూ.80లక్షల ఆదాయం వస్తోంది. ఈ అత్యాధునిక సౌకర్యాల ఏర్పాటుతో ఈ ఆదాయం మరింత పెరగనుంది. అత్యాధునిక సౌకర్యాల కల్పనతో విజయవాడ రైల్వేస్టేషన్ ప్రయాణికులకు వరల్డ్ క్లాస్ స్టేషన్ అనుభూతిని కలిగించనుంది. -
తిరుపతి నుంచి ఢిల్లీకి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్
గురువారం ప్రారంభించనున్న రైల్వే మంత్రి తిరుపతి అర్బన్: ఢిల్లీ వెళ్లేందుకు పూర్తి ఏసీ బోగీలతో కూడిన ఎక్స్‌ప్రెస్ రైలు రాయలసీమ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. తిరుపతి–జమ్ముతావి మధ్య హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ పేరుతో నడవనున్న ఈ రైలును రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఈ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్(22705) ప్రతి మంగళవారం సాయంత్రం 5.10కి తిరుపతి నుంచి బయల్దేరి గురువారం రాత్రి 9.10కి జమ్ముతావి చేరుకుంటుంది. ఈ రైలు(22706) తిరిగి జమ్ముతావి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 5.30కు బయల్దేరి ఆదివారం ఉదయం 11.20కి తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుంచి రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, ఆదోనీ, మంత్రాలయం రోడ్డు, రాయచూర్ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఖాజీపేట, రామగుండం, నాగపూర్, ఢిల్లీ, అంబాలా, లూథియానా, మీదుగా జమ్ముతావి వెళుతుంది. -
‘స్వచ్ఛ’ సికింద్రాబాద్
- దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో రెండో స్థానం - విశాఖకు టాప్, విజయవాడకు నాలుగో స్థానం - ఏృ కేటగిరీ స్టేషన్లలో ఖమ్మం, మంచిర్యాల, వరంగల్ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే స్వచ్ఛ రైల్వేస్టేషన్‌గా విశాఖపట్నం స్టేషన్ గుర్తింపు పొందింది. తర్వాతి స్థానంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిలిచింది. విజయవాడ రైల్వే స్టేషన్‌కు నాలుగో స్థానం లభించింది. దేశంలో రద్దీ తీవ్రంగా ఉండే దాదాపు 75 రైల్వే స్టేషన్లలో స్వచ్ఛతపై థర్డ్ పార్టీ రూపొందించిన ఆడిట్ నివేదికను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. దీంతో పాటు స్వచ్ఛ రైల్ పోర్టల్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. పార్కింగ్ ప్రాంతం, ప్రధాన ప్రవేశ ప్రాంతం, ప్రధాన ప్లాట్‌ఫాం, వేచి ఉండే గది, ప్రయాణికుల స్పందన, తదితర పరిమితుల ఆధారంగా ఈ ఆడిట్‌ను నిర్వహించారు. ఇందులో అత్యంత స్వచ్ఛత పాటిస్తున్న ఏృ1 కేటగిరీ స్టేషన్లలో తొలి 10 స్థానాల్లో వరుసగా విశాఖ, సికింద్రాబాద్, జమ్ముతావి, విజయవాడ, ఆనంద్ విహార్ టర్మినల్, లక్నో, అహ్మదాబాద్, జైపూర్, పుణే, బెంగళూరు సిటీ స్టేషన్లు నిలిచాయి. అలాగే ఏృకేటగిరీ స్టేషన్ల జాబితాలో బియాస్, ఖమ్మం, అహ్మద్‌నగర్, దుర్గాపూర్, మంచిర్యాల, బద్నెర, రంగ్ ఇయా జంక్షన్, వరంగల్, దమో, భుజ్ టాప్ టెన్ ర్యాంకులు సాధించాయి. రైల్వే జోన్ల విభాగంలో ఆగ్నేయ మధ్య రైల్వే, తూర్పుకోస్తా రైల్వే, సెంట్రల్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, పశ్చిమ రైల్వే, నైరుతి రైల్వే, ఈశాన్య రైల్వే, వాయవ్య రైల్వే, దక్షిణ రైల్వే, ఉత్తర ఫ్రాంటియర్ రైల్వేలు తొలి పది ర్యాంకులు కైవసం చేసుకున్నాయి. కాగా ఏృ1 కేటగిరీ స్టేషన్లలో గడిచిన ఏడాదిలో స్వచ్ఛత విషయంలో గణనీయమైన వృద్ధి సాధించిన విషయంలో విశాఖ, విజయవాడ రైల్వేస్టేషన్లు ఉండగా ఏృకేటగిరీ స్టేషన్లలో ఖమ్మం, వరంగల్, అనంతపురం ఉన్నాయి. -
రైళ్లు ఆలస్యమయ్యాయో.. ఇక అంతే!
రైళ్లు ఆలస్యం అవుతున్నాయంటే పదే పదే ఫిర్యాదులు రావడంతో రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు సీరియస్ అయ్యారు. రైళ్లన్నీ సకాలంలో తిరిగేలా చూసుకోవాలని, లేకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు జారీచేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఒక సీనియర్ అధికారి తప్పనిసరిగా నైట్ షిఫ్టులో ఉండాలని, ఏవైనా సమస్యలుంటే పరిశీలించి వెంటనే వాటిని పరిష్కరించాలని, తద్వారా రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించాలని జోనల్ స్థాయి అధికారులను ఆయన ఆదేశించారు. జాతీయ రైలు విచారణ వ్యవస్థలో ఉన్న సమయాలకు, భారతీయ రైల్వే అధికారిక వెబ్సైట్లలో ఉన్న సమయాలకు మధ్య ఉన్న తేడాలను కూడా సురేష్ ప్రభు గుర్తించారు. ఈ రెండింటికి, రైళ్లు వాస్తవంగా నడుస్తున్న సమయాలకు కూడా తేడా ఉండటం గమనార్హం. ఈ సమస్యను కూడా తక్షణం పరిష్కరించాలని రైల్వే అధికారులను ఆయన ఆదేశించారు. గత సంవత్సరం ఏప్రిల్ 1-16 తేదీల మధ్య రైళ్లు సకాలంలో నడిచే తీరు 84 శాతం వరకు ఉండగా, ఈ సంవత్సరం అది 79 శాతానికి పడిపోయింది. రైళ్లు ఆలస్యం కావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదని, దీన్ని వెంటనే అరికట్టాలని గట్టిగా చెప్పారు. చుట్టుపక్కల డివిజన్లకు చెందిన అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆలస్యాలను నివారించాలన్నారు. -
అద్దాల రైల్లోంచి అరకు అందాలు చూసేద్దాం
-
అద్దాల రైల్లోంచి అరకు అందాలు చూసేద్దాం
సాక్షి, విశాఖపట్నం: ఇకపై అద్దాల రైల్లోంచి అరకు అందాలను చూడొచ్చు. విశాఖపట్నం–అరకు మధ్య నడిచే అద్దాల (విస్టాడోమ్) రైలు ఆదివారం ప్రారంభమైంది. ఈ రైలును రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు భువనేశ్వర్ నుంచి వీడియో లింక్ ద్వారా జాతికి అంకితం చేశారు. అద్దాల రైల్లో ప్రత్యేకతలివిగో...: ఒక్కో కోచ్‌లో 40 మంది కూర్చునేలా ఉన్న ఈ రెండు ఏసీ బోగీల్లో మొత్తం 80 మంది ప్రయాణించొచ్చు. ► ఈనెల 18 వరకు ఈ రైలును ప్రయోగాత్మకంగా నడుపుతారు. ►19 నుంచి కిరండోల్ పాసింజర్‌కు అనుసంధానం చేస్తారు. 18వ తేదీ నుంచి టిక్కెట్ల జారీ మొదలుపెడతారు. ► విశాఖ–అరకు మధ్య టిక్కెట్టు ధర రూ.650గా నిర్ణయించారు. ► ఈ రైలులో చుట్టూ, పైభాగంలో కూడా అద్దాలు అమర్చారు. ► కుర్చీలను 360 డిగ్రీల కోణంలో ఎటువైపైనా తిప్పుకోవచ్చు. ►ఎల్ఈడీ స్క్రీన్లు, సీసీ కెమెరాలు అమర్చారు. ► జీపీఎస్ అనుసంధానంతో ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ వ్యవస్థ ఉంటుంది. -
అద్దాల రైల్లో అందాల ప్రయాణం
విశాఖపట్నం: విస్టాడోం! విశాఖ–అరకు మధ్య అందాలను చూపించడానికి వచ్చిన అద్దాల కోచ్ పేరిది. పర్యాటక ప్రియులను మంత్రముగ్ధులను చేయడానికి సుందరంగా రూపుదిద్దుకుంది. అద్దాల్లోంచి ప్రకృతి రమణీయతను వీక్షించవచ్చు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వారి కల నెరవేర్చడానికి ఆదివారం ఉదయం నెరవేరింది. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు భువనేశ్వర్ నుంచి వీడియో లింక్ ద్వారా రైలును ప్రారంభించారు. రైలు 10 గంటలకు బయలుదేరింది. విశాఖపట్నం నుంచి అరకులోయ వరకు రెండు విస్టాడోం కోచ్‌లను నడపాలని రైల్వేశాఖ గతంలోనే నిర్ణయించింది. విశాఖ- కిరండోల్ పాసింజర్‌కు ఈ కోచ్‌లను అమర్చనుంది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా కోచ్‌లను చెన్నైలో తయారు చేయించింది. అతి విశాలమైన గ్లాసుల కిటికీలు, పైన ఆకాశాన్ని కూడా చూసేలా అద్దాల టాప్‌ను సుందరంగా రూపొందించారు. బోగీ నుంచి 360 డిగ్రీలు తిరిగేలా కుర్చీలను ఏర్పాటు చేశారు. కోచ్‌లో జీపీఎస్‌తో అనుసంధానించిన ఎల్సీడీ ఆడియో, వీడియోలు ఉన్నాయి. ఒక్కో కోచ్‌కు సుమారు రూ.3 కోట్లు రైల్వే శాఖ ఒక్కో కోచ్‌కు సుమారు రూ.3 కోట్లు వెచ్చించింది. వీటిలో ఒకటి శుక్రవారం రాత్రి విశాఖ వచ్చింది. రెండోది మరో పక్షంలో రానుంది. ప్రయోగాత్మకంగా రెండు రోజులు నడిపాక ఈ నెల 19 నుంచి కిరండోల్ పాసింజర్‌కు అనుసంధానం చేసి రోజూ నడుపుతారు. ఇటు నుంచి రోజూ ఉదయం 7.05 గంటలకు విశాఖలో బయలుదేరి 11.05 గంటలకు అరకు చేరుకుంటుంది. 128 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి నాలుగ్గంటల సమయం పడుతుంది. మార్గంమధ్యలో 11 చోట్ల ఆగుతూ 58 టన్నెల్స్‌ను, 84 వంతెనలను దాటుకుని వెళ్తుంది. అరకులో ఈ బోగీని తొలగిస్తారు. అటు నుంచి సాయంత్రం తిరుగు ప్రయాణంలో వచ్చే కిరండోల్–విశాఖపట్నం పాసింజర్‌కు అరకులో ఈ కోచ్‌ను తగిలిస్తారు. ఈ రైలు అక్కడ సాయంత్రం 4.10కి బయల్దేరి రాత్రి 8.50 గంటలకు విశాఖకు చేరుకుటుంది. ధర భారమే.. విశాఖ–అరకుల మధ్య ఈ విస్టాడోమ్‌లో ప్రయాణం ఒకింత భారం కానుంది. ప్రస్తుతానికి టిక్కెట్ ధర నిర్ణయించలేదు. కానీ రూ.500–550 వరకు ఉంటుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. పూర్తి ఏసీ బోగీ కావడం, అన్ని అత్యాధునిక సదుపాయాలు ఉండడం వల్ల ఈ ధర ఉంటుందని చెబుతున్నారు. విశాఖ నుంచి అరకుకు అదే రైలులో టిక్కెట్టు ధర రూ.30లు ఉంది. స్లీపర్‌కు రూ.150, సెకండ్ ఏసీకి రూ.400 వరకు ఉంది. బోగీకి 40 సీట్లు ఈ విస్టాడోం కోచ్‌కు 40 సీట్లు మాత్రమే ఉంటాయి. రెండో కోచ్ వస్తే అదనంగా మరో 40 సీట్లు పెరుగుతాయి. ఈ నెల 19 నుంచి రెగ్యులర్‌గా కిరోండోల్ పాసింజరుకు ఈ కోచ్‌ను అనుసంధానం చేసి నడపనున్నారు. ఇందుకోసం 18వ తేదీ నుంచి టిక్కెట్లను విక్రయిస్తారు. ఆదివారం నుంచి ఒక ఇంజన్‌తో విస్టాడోం కోచ్‌ను ట్రయలరన్గా నడుపుతారు. ప్రయాణికులను అనుమతించరు. -
కళ్యాణదుర్గం–కదిరి దేవరపల్లి లైన్ ప్రారంభం
వీడియో లింక్ ద్వారా ప్రారంభించిన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సాక్షి, న్యూఢిల్లీ/కళ్యాణదుర్గం రూరల్: రాయదుర్గం–తుముకూరు రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా ఇప్పటికే ట్రాక్ నిర్మాణం పూర్తయిన కళ్యాణదుర్గం–కదిరి దేవరపల్లి మార్గాన్ని కేంద్ర మంత్రులు సురేష్‌ప్రభు, అశోక్‌గజపతిరాజు బుధవారం ఢిల్లీ నుంచి వీడియోలింక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్(జీఎం) ఏకే గుప్తా, హుబ్లీ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ఏకే జైన్, చీఫ్ ఆపరేషన్ మేనేజర్ జీజే ప్రసాద్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అశోక్‌గుప్తా, సీపీఆర్వో విజయ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం–కదిరి దేవరపల్లి రైల్వేలైన్ (23 కి.మీ.) ప్రారంభమవ్వడంతో కళ్యాణదుర్గం, రాయదుర్గం, బళ్లారి, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం మీదుగా తిరుపతి వెళ్లే ప్యాసింజర్ రైలు (57477/57478)ను కదిరి దేవరపల్లి వరకు పొడిగించారు. ఈ రైలును బుధవారం కళ్యాణదుర్గంలో రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు పచ్చ జెండా ఊపి నూతన మార్గంలోకి పంపించారు. ఈ రైలు ప్రతిరోజూ తిరుపతిలో రాత్రి 10.30కి బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కదిరి దేవరపల్లికి చేరుకుంటుంది. తిరిగి అదేరోజు కదిరి దేవరపల్లిలో మధ్యాహ్నం 1.20కి బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.20కి తిరుపతి చేరుకుంటుంది. కాగా, ఈ సందర్భంగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ.. ఏపీలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ ప్రారంభం
-
పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ ప్రారంభం
హైదరాబాద్: పెద్దపల్లి-నిజామాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు శనివారం ప్రారంభించారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్ నుంచి రిమోట్ లింక్ ద్వారా రైల్వే లైన్ ను స్టార్ట్ చేశారు. మహబూబ్ నగర్ - సికింద్రాబాద్ రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు కూడా సురేశ్ ప్రభు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, టీఆర్ఎస్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, జితేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు డి. శ్రీనివాస్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రైల్వే లైన్ ను ప్రారంభించిన తర్వాత నిజామాబాద్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. మంగళ, గురువారాలు మినహా అన్ని రోజులు ఈ రైలు నడుస్తుంది. ఆ రెండు రోజులు నిజామాబాద్ స్టేషన్లోనే రైలును నిలిపివేస్తారు. నిజామాబాద్ నుంచి పెద్దపల్లి వరకు పదమూడు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. -
కేంద్ర మంత్రికి ట్వీట్.. మహిళా ప్యాసింజర్ సేఫ్
భువనేశ్వర్: సోషల్ మీడియాను మనం వాడుకునే తీరును బట్టి అది మనకు అనుకూల, ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఓ మహిళా ప్రయాణికులరాలికి మాత్రం సోషల్ మీడియా పోస్ట్ ఎంతో మేలు చేసింది. ఎలా అంటారా.. న్యూఢిల్లీకి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం ప్రయాణిస్తోంది. ఆ రైల్లోనే ఆమె ఉన్న కంపార్ట్మెంట్లో యాభైఏళ్ల ప్రయాణికుడు బని ప్రసాద్ మహంతి ప్రయాణిస్తున్నాడు. ఆ మహిళతో బని ప్రసాద్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఎంత చెప్పినా వినకుండా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయంపై ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ పోస్ట్ చూసిన ఓ బాధిత మహిళ స్నేహితురాలు విషయాన్ని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి తీసుకెళ్లింది. తన స్నేహితురాలికి సాయం చేయాలని రైల్వే మంత్రికి ట్వీట్ చేసింది. వెంటనే స్పందించిన సురేశ్ ప్రభు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. నిందితుడు బని ప్రసాద్‌ను టీటీఈలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది టాటానగర్ స్టేషన్లో అదుపులోకి తీసుకుని రైలు నుంచి దించేశారు. టాటానగర్ రైల్వే పోలీసులకు నిందితుడిని అప్పగించారు. వారు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు. నిందితుడు బని ప్రసాద్ ఒడిషాలోని ఖుర్దాకు చెందినవాడని రైల్వే పోలీసులు వివరించారు. -
మాచర్ల–నల్గొండ రైల్వే లైను కుదరదు :కేంద్రం
న్యూఢిల్లీః మాచర్ల–నల్గొండ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేమని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బుధవారం సమాధానం ఇచ్చారు. ఈ రైల్వేలైనును 1997–98 బడ్జెట్లో రూ. 125 కోట్ల అంచనా వ్యయంతో చేర్చారని, ప్రస్తుతం దీని అంచనా వ్యయం రూ. 815 కోట్లు అని తెలిపారు. సర్వే తుది దశలో ప్రజా ప్రతినిధులు ఈ మార్గాన్ని మార్చాలని సూచించారని, ఇదే సందర్భంలో దీనిపై రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ జరిపిన యోగ్యత అధ్యయనం ఈ ప్రాజెక్టులో ఆర్థిక యోగ్యత లేదని తేల్చిందని వివరించారు. స్పెషల్‌పర్పస్ వెహికిల్ విధానంలో గానీ, పీపీపీ విధానంలో గానీ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని తేల్చారు. ప్రజల్లో ఈ డిమాండ్ ఉన్నప్పటికీ నిధుల కొరత, ఇతరత్రా కారణాల వల్ల ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామని, కానీ ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయలేదని వివరించారు. -
ఐదేళ్లలో పట్టాలన్నీ బ్రాడ్‌గేజ్‌కి
లోక్‌సభలో రైల్వే మంత్రి వెల్లడి న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం రైల్వే నెట్వర్క్ వచ్చే ఐదేళ్లలో బ్రాడ్‌గేజ్‌లోకి మారనుంది. అన్ని రైళ్లలో బయో టాయిలెట్లు వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే శాఖకు నిధుల డిమాండ్ (డిమాండ్ ఫర్ గ్రాంట్స్)పై రాజ్యసభలో రెండు రోజుల చర్చకు బుధవారం సమాధానమిస్తూ ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోని మీటర్ గేజ్ పట్టాలన్నింటిని ఐదేళ్లలో బ్రాండ్ గేజ్‌లోకి మార్చి, 2019 అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నాటికి అన్ని రైళ్లలో బయో టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘రైల్వేలో వచ్చే ఐదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చేందుకు రోడ్ మ్యాప్ రూపొందించాం. రైల్వే నెట్వర్క్ భద్రతను పటిష్టం చేసేం దుకు రూ. లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేశాం’ అని వివరించారు. తర్వాత సభ మూజువాణి ఓటుతో నిధుల డిమాండ్‌ను ఆమోదించింది. పొరుగు దేశాలకు రైల్వే లైన్లు: వాణిజ్యం పెంపు, ఆసియాలో పేదరిక నిర్మూలనS కోసం పొరుగు దేశాలను రైల్వే మార్గాలతో అనుసంధానించాలని సురేశ్ ప్రభు ఢిల్లీలో జరిగిన ఐరాస సదస్సులో సూచించారు. -
15 మంది కేంద్ర మంత్రులతో వెంకయ్య సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న విభిన్న కేంద్ర ప్రాజెక్టులు, పథకాలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం 15 మంది కేంద్ర మంత్రులతో సమీక్ష జరిపారు. రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్ పరికర్, సురేష్ ప్రభు, ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, రవిశంకర్ ప్రసాద్, ఉమాభారతి, స్మృతీ ఇరానీ, నరేందర్‌సింగ్ తోమర్, రాధామోహన్ సింగ్, తావర్‌చంద్ గెహ్లాట్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, కల్రాజ్ మిశ్రా, మహేష్‌శర్మ, అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి తదితర కేంద్ర మంత్రులు ఈ చర్చలో పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపునకు అవసరమైన చట్ట సవరణను సత్వరం తీసుకురావాలని హోంమంత్రి రాజ్‌నాథ్, న్యాయ మంత్రి రవిశంకర్‌ను వెంకయ్య కోరారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేస్తున్నామని, తర్వాత కేబినెట్‌కు పంపుతామని వారు తెలిపారు. అలాగే ఐఎన్ఎస్ విరాట్‌ను పర్యాటక స్థలిగా మార్చేందుకు ఏపీకి సాయం చేయాలని, నాగాయలంకలో డీఆర్డీవో మిస్సైల్ టెస్ట్ కేంద్రాన్ని, బొబ్బిలిలో నావల్ ఎయిర్ స్టేషన్‌ను ఏర్పాటుచేయాలని రక్షణమంత్రి పరికర్ను కోరారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు ప్రకటన చేయాలని కోరగా.. ఈ అంశంలో పురోగతి ఉందని సురేష్ ప్రభు తెలిపినట్టు సమాచారం. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తే పవర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సిద్ధమని పీయూష్ గోయల్ తెలిపారు. ఈ చర్చల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, పలువురు టీడీపీ ఎంపీలూ పాల్గొన్నారు. -
'రైల్వే పాస్‌లకు ఆధార్‌తో లింకుపెట్టం'
ఢిల్లీ: రైల్వే పాస్‌లకు ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే ప్రతిపాదనేదీ తమ వద్ద ప్రస్తుతం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. రైలు పాస్‌లున్న వారు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం లేదంటూ ఆయన రైల్వే ఉద్యోగులు, పింఛనుదారులు మాత్రం ఏ పోర్టల్ నుంచైనా టికెట్లు బుక్ చేసుకునే విషయం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రైలుపాస్లున్న వారికి కూడా ఇలాంటి సదుపాయాన్ని కల్పించే అవకాశాలను చూస్తున్నామని మంత్రి వివరించారు. అన్ని విభాగాల్లో కలిపి సుమారు 13.30 లక్షల మంది రైల్వే శాఖ ఉద్యోగులకు పాస్‌లున్నాయని వెల్లడించారు. రైలు రద్దయిన సందర్భాల్లో టికెట్ రుసుమును వాపసు చేయటంలో కలుగుతున్న ఆలస్యాన్ని తగ్గించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
భద్రత, వేగానికి పెద్దపీట!
రైల్వే బడ్జెట్లో ప్రత్యేకంగా రూ.20 వేల కోట్లు! న్యూఢిల్లీ: తొంభై రెండేళ్ల సుదీర్ఘ సంప్రదాయానికి విరుద్ధంగా తొలిసారిగా సాధారణ బడ్జెట్‌తో ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్లో భద్రత, వేగం, మౌలిక సదుపా యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాటు రైళ్ల వేగాన్ని 200 కి.మీ. వరకు పెంచే చర్యలు చేపట్టనున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ చారిత్రక బడ్జెట్‌ను బుధవారం సమర్పించనున్నారు. తరచూ రైళ్లు పట్టాలు తప్పుతున్న నేపథ్యంలో కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, కొన్ని స్టేషన్ల ఆధునీ కరణ చేయనున్నారు. దీనికి రానున్న ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రైల్వే భద్రత నిధిని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ నిధిలో 2017–18 ఆర్థిక సంవత్సరానికి రూ.20 వేల కోట్లు కేటాయించవచ్చు. రైళ్ల భద్రతా ప్రమాణాలు మెరుగు పరిచేందుకు రూ.1.19 లక్షల కోట్ల ప్రత్యేక నిధి కేటా యించాలన్న రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు అభ్యర్థన మేరకు జైట్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రైళ్ల పర్యవేక్షణకు రైలు అభివృద్ధి సంస్థను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు హైస్పీడ్ రైల్ అథారిటీనీ ఏర్పాటు చేయవచ్చు. అలాగే టిక్కెటేతర ఆదాయాన్ని పెంచుకొనేందుకు కసరత్తు జరుగుతోంది. -
ఏపీకి ప్రత్యేక సాయం చేయండి
రైల్వే కేటాయింపులపై కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే కేటాయింపుల్లో ఏపీకి అవసరమైన మేరకు నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వివిధ మార్గాల్లో కొత్త రైళ్లను మంజూరు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కోరారు. మంగళవారం కేంద్ర మంత్రితో భేటీ అయిన సుబ్బారెడ్డి.. ఏపీకి, ఒంగోలు జిల్లాకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో రెండో టికెట్ బుకింగ్ కౌంటర్, రెండో ఎస్కలేటర్, లిఫ్ట్ సదు పాయం కల్పించాలని కోరారు. ఒంగోలు– సికింద్రాబాద్ మధ్య నడికుడి మీదుగా అమరావతిని కలుపుతూ పగలు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలని కోరారు. ఒంగోలు స్టేషన్లో కేరళ, జోధ్‌పూర్, జైపూర్, పాండిచ్చేరి ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలపాలని విజ్ఞప్తి చేశారు. టంగుటూరులో తిరుమల, హైద రాబాద్, సింహపురి ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వా లని అభ్యర్థించారు. అలా గే సింగరాయకొండ స్టేషన్లో పద్మావతి, చార్మినార్, మచిలీపట్నం, శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లకు, దొనకొండలో హౌరా ఎక్స్ ప్రెస్, కురిచేడులో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కోరారు. గుంటూరు– ముంబై రైలును నడపాలని, సికింద్రాబాద్–గుంటూరు మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ప్రవేశపెట్టడం, ప్రస్తుతం నడుస్తున్న సికింద్రాబాద్–గుంటూరు ప్యాసింజర్ రైలు ను ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని, మచిలీ పట్నం–యశ్వంత్‌పూర్ మధ్య నడుస్తున్న కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ను ప్రతిరోజూ నడపాలని, సికింద్రాబాద్‌లో రాత్రి 10.55 గంటలకు బయల్దేరే సింహపురి ఎక్స్‌ప్రెస్‌ను రాత్రి 10 గంటలకు మార్చాలని అభ్యర్థిస్తూ వినతిప్రత్రాన్ని సమర్పించారు. -
సాదాసీదాగా సర్వసభ్య సమావేశం
సీఎం, మంత్రి ఐకేరెడ్డి, రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం నిర్మల్ టౌన్ : ఆర్మూర్– నిర్మల్– ఆదిలాబాద్ రైల్వేలైన్ నను ఏర్పాటుచేసేందుకు సుముఖత వ్యక్తంచేసిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుకు, సీఎం కేసీఆర్‌కు, మంత్రి ఐకేరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మున్సిపల్ సర్వసభ్యసమావేశంలో సభ్యులు తీర్మానించారు. జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలోని సమావేశమందిరంలో బుధవారం మున్సిపల్ సర్వసభ్యసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి మాట్లాడారు. నిర్మల్‌కు రైల్వేలైన్ రావడానికి మంత్రి ఐకేరెడ్డి కృషిచేశారని తెలిపారు. పట్టణ అభివృద్ధికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలో పూర్తిగా ఎల్ఈడీ లైట్లు బిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. జిల్లాకేంద్రంలోని సోఫినగర్ నుంచి చించోలి(బి) వరకు డ్రెయినేజీ నిర్మించేందుకు రూ. 30లక్షలు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల టాకీస్ వద్ద ఉన్న మురుగుకాలువ పరిస్థితిపై మున్సిపల్ వైస్ చైర్మన్ అజీంబిన్ యాహియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చైర్మన్ మాట్లాడారు. తిరుమల టాకీస్ వద్ద ఉన్న మురుగుకాలువకు సంబంధించి ఇప్పటికే తాత్కాలిక చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి త్వరలోనే కల్వర్టు నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సమావేశానికి సగం మంది సభ్యులే హాజరుకావడంతో సమావేశం బోసిపోయింది. -
ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వే లైన్‌కు నిధులు
రైల్వే మంత్రితో భేటీ అనంతరం జోగురామన్న, ఇంద్రకరణ్ సాక్షి, న్యూఢిల్లీ: ఆర్మూర్– ఆదిలాబాద్ వయా నిర్మల్ రైల్వే లైన్ నిర్మాణానికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రైల్వే లైన్‌కు నిధులు కేటాయించాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాసిన లేఖను మంగళవారం ఢిల్లీలో సురేశ్ ప్రభును ఆయన కార్యాలయంలో కలసి మంత్రులు అందజేశారు. రైల్వే లైన్‌తో నిర్మల్, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఇంద్రకరణ్ పేర్కొన్నారు. రైల్వే లైన్ నిర్మాణ ఖర్చులో సగం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రికి వివరించినట్లు తెలిపారు. ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ప్రభు.. వచ్చే బడ్జెట్లో రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. నిధుల విడుదలను బట్టి ఈ ఏడాదిలోపు పనులు ప్రారంభిస్తామని జోగురామన్న తెలిపారు. భద్రాచలం–కొవ్వూరు, మణుగూరు–రామగుండం రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. సురేశ్ ప్రభును కలసిన వారిలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్ర తెజోవత్, ఎంపీ జి.నగేశ్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ ఉన్నారు. -
ఉమ్మడిగా రైల్వే ప్రాజెక్టులు
రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు - రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ సహకారం అభినందనీయం - వీడియో లింకు ద్వారా పలు అభివృద్ధి పనులు ప్రారంభం - జగిత్యాల–మోర్తాడ్ సర్వీసుకు పచ్చజెండా ఊపిన మంత్రి సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ, సహకారాలను అందిస్తోందని, ఇప్పటి వరకు చేపట్టిన రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేయగలమని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఢిల్లీలోని రైల్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో వీడియో లింకు ద్వారా ప్రారంభించారు. సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేసిన 500 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌గ్రిడ్‌ను, నాంపల్లి రైల్వేస్టేషన్లో నిర్మించిన ఆర్వోబీని, ఈ రెండు స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని, సికింద్రాబాద్ స్టేషన్లో ఎంఎంటీఎస్ బుకింగ్ కేంద్రాలను, ఎల్ఈడీ లైట్లను కేంద్ర మంత్రి బండారు దత్తా త్రేయ, ఎంపీ కవిత, రైల్వే ఉన్నతాధికారులతో కలసి ప్రారంభించారు. కరీంనగర్– లింగంపేట్– జగిత్యాల సెక్షన్లో నడుస్తున్న డెమూ ప్యాసింజర్ ను మోర్తాడ్ వరకు పొడిగింపునకు పచ్చా జెండా ఊపారు. రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా (ఉమ్మడి సంస్థగా) ఏర్పడి ప్రాజెక్టులను పూర్తి చేస్తా యన్నారు. కొన్ని ప్రాజెక్టుల వ్యయాన్ని పంచు కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ, సహకా రాన్ని అభినందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 790 కోట్ల రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నా యన్నారు. ప్రస్తుతం 104 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సదు పాయం ఉందని, 2017 చివరికి మొత్తం 200 స్టేషన్లలో ఈ సేవలను విస్తరించనున్నామ న్నారు. పూర్తి భద్రతతో కూడిన, మెరుగైన రైల్వే సేవలను అందజేయడమే తమ లక్ష్యమన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశకు అనుమతి: దత్తాత్రేయ ప్రధాని, రైల్వే మంత్రి పెద్దపల్లి–నిజామాబాద్ లైనుకు ప్రాధాన్యమిచ్చి త్వరితగతిన పూర్తి చేస్తుం డడం సంతోషకరమని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. 2017 చివరిలోగా ఈ రైల్వే లైను పూర్తవుతుందని ఆకాంక్షించారు. మౌలాలీ– సనత్ నగర్ మధ్య రక్షణ శాఖ భూముల్లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు అనుమతి లభించిందని చెప్పారు. ఇటు భువనగిరి, యాదాద్రి వరకు, అటు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయని తెలిపారు. సికింద్రాబాద్– కాజీపేట్ మార్గంలో మూడో లైన్ నిర్మించాలని, కాజీపేట్‌లో ని వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణంపై రైల్వే శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన ఆశిస్తున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం సంతోషిం చదగిన విషయమని నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొన్నారు. 2017 చివరి కల్లా పెద్దపల్లి–నిజామా బాద్ మధ్య రైల్వే సేవలు ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డెమూ రైలును మోర్తాడ్ వరకు పొడిగించడంపై కేంద్రానికి కృతజ్ఞతలు తెలి పారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రారంభో త్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, పట్నం మహేందర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మహ్మద్ అలీఖాన్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వశిష్ట జోహ్రీ తదితరులు పాల్గొన్నారు. -
జగిత్యాల-మోర్తాడు డెమో సర్వీసు ప్రారంభం
హైదరాబాద్: ఢిల్లీలో రిమోట్ వీడియో లింకు ద్వారా జగిత్యాల- మోర్తాడు డెమో సర్వీసును కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, బండారు దత్తాత్రేయ, ఎంపీ కవిత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 20 ఏళ్ల కల నిజమైందని తెలిపారు. 25 సార్లు కేంద్రమంత్రికి వినుతులు ఇచ్చినట్లు గుర్తుచేశారు. వచ్చే ఏడాది పెద్దపల్లి రైల్వే లైన్ క్లియర్ అవుతుందని, నిజామాబాద్ స్టేషన్ అభివృద్ధికి నిధులు ఇచ్చేలా రైల్వే మంత్రి హామి ఇచ్చినట్టు కవిత తెలిపారు. వచ్చే బడ్జెట్ నాటికి మరిన్ని ప్రతిపాదనలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణ అభివృద్ది పనులకు రూ.709 కోట్లు కేటాయిస్తున్నామని సురేష్ ప్రభు చెప్పారు. 2017 తెలంగాణకు రైల్వే పరంగా మంచి సంవత్సరం అవుతుందన్నారు. -
రండి పెళ్లి చేస్తాం...
ఖాళీగా అవసరం లేకుండా అలా పడిఉన్న రైల్వే స్టేషన్లను పెళ్లి మండపాలుగా మార్చితే ఎంత బాగుంటుంది. ఇలాంటి ఐడియాతోనే రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ముందుకొచ్చారు. ఖాళీగా పడిఉన్న రైల్వే స్టేషన్లను వేరే ప్రాంతాలకు తరలించే బదులు వాటిని పెళ్లి వేడులకు, ఇతర గ్రాండ్ ఈవెంట్లకు వాడాలని నిర్ణయించారు. వెడ్డింగ్ ఫంక్షన్లకు, ఇతర ఈవెంట్లకు రైల్వే స్టేషన్లను అద్దెకివ్వాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది. గత నెల న్యూఢిల్లీలో జరిగిన రైల్ వికాస్ శివిర్ మీటింగ్‌లో ఈ అద్భుతమైన ఆలోచనను ఎంపికచేశారు. రవాణా వ్యవస్థలో అత్యంత ప్రముఖమైన పాత్ర వహిస్తున్న రైల్వే కార్యకాలపాల అభివృద్ధికి వినూత్నమైన ఆలోచనలతో ముందుకు రావాలని ప్రధాని మోదీ ఈ మీటింగ్‌లో అధికారులకు పిలుపునిచ్చారు. రైల్వే అభివృద్ధికి రోడ్ మ్యాప్ చేయాలని ఆదేశించారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రైల్వే బోర్డు అడ్వయిజర్ అలోక్ రాజన్ తెలిపారు. -
29 నుంచి తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ రైలు
తిరుపతి: తిరుపతి-విశాఖపట్టణం మధ్య కొత్తగా ఏర్పాటుచేయనున్న డబుల్ డెక్కర్ రైలును రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ఈనెల 29వ తేదీన ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రి 29వ తేదీ ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. తిరుపతిలో డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించడంతో పాటు తిరుప్తిలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక లాండ్రీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. తిరుపతి రైల్వే దక్షిణం వైపున ఉన్న టీటీడీ స్థలాల్లో అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణం, కనెక్టివిటీ రోడ్డు పనులకు కూడా కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. -
రైల్వేలో పట్టాలెక్కబోతున్న మరో సంస్కరణ
రైల్వేలో మరో రెండో అతిపెద్ద సంస్కరణ పట్టాలెక్కబోతోంది. 92 ఏళ్ల సంస్కృతికి చరమగీతం పాడుతూ రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో కలిపిన కేంద్రప్రభుత్వం, చార్జీల మార్పునకు ప్రత్యేక ఏజెన్సీ నియమించాలని యోచిస్తోంది. చార్జీల ప్రతిపాదనకు ఓ స్వతంత్ర ఏజెన్సీ నియమించాలని కోరుతూ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు కేబినెట్‌ను ప్రతిపాదించనున్నారట. చైర్మన్‌తో కూడిన నలుగురు సభ్యుల డెవలప్మెంట్ అథారిటీని నియమించాలని రైల్వే ప్రతిపాదించింది. మంత్రి ఆమోదంతో ఈ వారంలోనే ఈ ప్రతిపాదన కేబినెట్ ముందుకు రాబోతుందట. వచ్చే వారంలోనే కేబినెట్ దీన్ని ఆమోదించబోతుందని తెలుస్తోంది. దీంతో రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసిన తర్వాత ఇదే రెండో అతిపెద్ద సంస్కరణ కాబోతుంది. ఈ విషయంపై ఇప్పటికే రైల్వే శాఖ వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాలను, నీతి ఆయోగ్ కామెంట్లను కూడా స్వీకరించింది. ప్రయాణికులకు అందిస్తున్న సబ్సిడీలతో దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా పేరున్న రైల్వేలు రూ.33,000 కోట్ల నష్టాలను మూటకట్టుకుంటున్నాయి. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ, సీనియర్ అధికారులతో సురేష్ ప్రభు చర్చించారు. వారు కూడా దీనికి సానుకూలంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు. మార్కెట్ డిమాండ్ బట్టి చార్జీల హేతుబద్దీకరణ చేపట్టనున్నట్టు రైల్వే తెలుపుతోంది. -
పట్టాలు తప్పిన రైలు.. ఇద్దరి మృతి
పట్నా నుంచి గువాహటి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఇద్దరు మరణించడగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని సముక్తల స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ఘటనకు కారణం ఏంటో ఇంకా తెలియలేదు. రెస్క్యూ బృందాలను హుటాహుటిన ఘటనా స్థలానికి తరలించారు. రైలు డ్రైవర్ సిగ్నల్‌ను పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంజన్, మరో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. వాటిలో ఒకటి ఎస్ఎల్ఆర్ కాగా, మరొకటి జనరల్ సెకండ్ క్లాస్ బోగీ. బిహార్‌లోని దానాపూర్ నుంచి గువాహటికి ఈ రైలు వెళ్లాల్సి ఉంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలో ఉన్న అలీపుర్దౌర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైలు ఆగిపోవడంతో ఇరుక్కుపోయిన దాదాపు 150 మంది ప్రయాణికులను కామాఖ్య-అలీపుర్దౌర్ జంక్షన్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో అలీపుర్దౌర్ తీసుకెళ్లారు. అక్కడ పట్టాలను బాగుచేసిన తర్వాత ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తారు. హెల్ప్‌లైన్ నంబర్లు ఈ ప్రమాదం విషయంలో ఏమైనా తెలుసుకోవాలంటే రైల్వేశాఖ హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. అవి.. 9002052957, 8585082833 మరియు 03564-259935. -
రైల్వే ప్రాజెక్టుల భాగస్వామ్యానికి రాష్ట్రాలు ఓకే
న్యూఢిల్లీ: కొత్త లైన్ల ఏర్పాటు, స్టేషన్ల అభివృద్ధిలో రాష్ట్రాలు పాలు పంచుకోవాలని రైల్వే శాఖ చేసిన విజ్ఞప్తికి ఆంధ్రప్రదేశ్ సహా 16 రాష్ట్రాలు అంగీకరించాయి. దాదాపు రూ.62,379 కోట్ల ఖర్చుతో కూడుకున్న 43 రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో పాలు పంచుకోవాలని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారని, ఇందుకుగాను 16 రాష్ట్రాలు ఒప్పుకున్నాయని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయంలో 25 నుంచి 66 శాతం వరకు రాష్ట్రాలు భరించనున్నాయని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల కోసం ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఉచితంగా స్థలాలను ఇస్తున్నాయని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ల అభివృద్ధి, కొత్త లైన్ల ఏర్పాటు, లైన్ల డబ్లింగ్ పనులు వంటి వాటిపై రైల్వే శాఖ దృష్టి సారించిందని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, కేరళ, ఒడిశా రాష్ట్రాలు జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకాలు చేశాయని ఆయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా జాయింట్ వెంచర్ కంపెనీలను ఏర్పాటు చేయడానికి అంగీకరించాయని చెప్పారు. -
ఆ రైల్వే స్టేషన్‌కు ఏం పేరు పెడతారో?
ముంబై: పశ్చిమ రైల్వే మార్గంలో కొత్తగా నిర్మించిన ‘ఓషివరా’ రైల్వే స్టేషన్ ప్రారంభానికిసిద్ధమైంది. కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఈ నెల 27న ప్రారంభించనున్నారు. ఆ తరువాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే స్లో అప్, డౌన్ లోకల్ రైళ్లకు హాల్టు ఇవ్వడంతో రాకపోకలు ప్రారంభమవుతాయి. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజలకు ఊరట లభించనుంది. ఖరారు కాని పేరు.. రూ.26 కోట్లు ఖర్చుచేసి కొత్తగా నిర్మించిన ఈ స్టేషన్‌కు ఏం పేరు పెట్టాలనేది ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం ఈ స్టేషన్ ఓషివరా ప్రాంతంలో ఉండడంవల్ల అదే పేరుతో పిలుస్తున్నారు. ఈ పేరే పెట్టాలని కొందరు స్థానికులు కోరుతుండగా ‘రాం మందిర్’ అని నామకరణం చేయాలని బీజేపీ వర్గీయులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రారంభోత్సవానికి ముందే స్టేషన్ బయట పెద్దపెద్ద ఎలక్ట్రానిక్ బోర్డులు, ప్లాట్‌ఫారాలపై వివిధ రకాల బోర్డులు, ఇండికేటర్లు, స్టేషన్ కోడ్, అనౌన్స్మెంట్ వంటి రకరకాల ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. టికెట్లు ఏ స్టేషన్ పేరుతో ఇవ్వాలో ముందే నిర్ణయిస్తే అన్ని స్టేషన్లలో టికెట్ జారీచేసే కంప్యూటర్లలో మార్పులు చేయడానికి వీలుపడుతుందని సిబ్బంది అంటున్నారు. సమయం దగ్గర పడుతోంది. కాని, ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోకపోవడంతో రైల్వే సిబ్బంది, అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
‘కాన్పూర్ రైలు’ మృతులు 146
- 83 మందికి కొనసాగుతున్న చికిత్స - ప్రమాదంపై రైల్వే విచారణ షురూ - వేగంగా పాత బోగీల తొలగింపు: మంత్రి సురేశ్ ప్రభు పుఖ్రాయా(యూపీ): ఇండోర్-పట్నా రైలు ప్రమాద మృతుల సంఖ్య సోమవారం 146కు పెరిగిందని కాన్పూర్ రేంజ్ ఐజీ జకీ అహ్మద్ చెప్పారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 79 మంది పరిస్థతి విషమంగా ఉందని తెలిపారు. కాన్పూరు సమీపంలో పట్టాలు తప్పిన 14 రైలు బోగీలను తొలగించారు. సుమారు 133 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించినట్లు కాన్పూర్ ముఖ్య ఆరోగ్యాధికారి రామాయణ్ ప్రసాద్ వెల్లడించారు. 24 శరీరాలను బిహార్‌కు, 25 మధ్యప్రదేశ్‌కు, 56 మృతదేహాలను ఉత్తరప్రదేశ్‌కు పంపినట్లు చెప్పారు. గాయపడిన 202 మందిలో 83 మందికి కాన్పూర్‌లో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. రైలు ప్రమాదానికి కారణం తెలుసుకునేందుకు రైల్వే భద్రతా కమిషనర్(తూర్పు సర్కిల్) పీకే ఆచార్య నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. సోమవారం ఆయన ప్రమాదం జరిగిన చోటును సందర్శించి విరిగిన పట్టాలు, దెబ్బతిన్న బోగీలను పరిశీలించి వీడియో తీశారు. బాధ్యులకు కఠిన శిక్ష : సురేశ్ ప్రభు కాన్పూర్ సమీపంలో ఆదివారం రైలు ప్రమాదానికి కారకులైన వారికి కఠిన శిక్ష తప్పదని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు హెచ్చరించారు. ఈ దుర్ఘటనపై అధునాతన సాంకేతికత, ఫోరెన్సిక్ విశ్లేషణల సాయంతో ప్రత్యేకంగా విచారణ జరిపిస్తామని ఆయన సోమవారం లోక్‌సభలో ప్రకటించారు. గత రైల్వే బడ్జెట్లో ప్రతిపాదించినట్లుగా ప్రమాదాలను తట్టుకోలేని పాత బోగీలను తొలగించే ప్రక్రియను త్వరితగతిన చేపడతామని చెప్పారు. సహాయ మంత్రి ప్రకటనపై రాజ్యసభలో అభ్యంతరం రైలు ప్రమాదంపై రాజ్యసభలో రైల్వే సహాయ మంత్రి రాజెన్ గొహెరుున్ ప్రకటన చేయగా ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశారుు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభుయే దీనిపై మాట్లాడాలని డిమాండ్ చేశారుు. గొహెరుున్ కేబినెట్ మంత్రి కారని, లోక్‌సభలో రైల్వే మంత్రి ప్రకటన చేసి రాజ్యసభకు సమాధానం ఇవ్వకపోవడం సభను అగౌరవపరచడమేనని కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ విమర్శించారు. కుటుంబాన్ని కాపాడిన చేతి కర్ర ఇండోర్-పట్నా రైలు ప్రమాదం జరిగిన సమయంలో ఓ వృద్ధురాలి చేతికర్ర కుటుంబంలోని ఏడుగురిని కాపాడింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ చౌరాసియా కుటుంబం పట్నాకు బయల్దేరుతూ ఇండోర్‌లో రెలైక్కింది. ప్రమాదం జరిగిన తరువాత తామంతా బీఎస్1 బోగీలో చిక్కుకున్నామని తన తల్లి చేతికర్రే తమను కాపాడిందని చౌరాసియా చెప్పారు. ఆ కర్ర సాయంతో కిటికీ తలుపులు పగలగొట్టి గంట తరువాత సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. తమ బోగీలోని సహాయకుడు, మరి కొందరు ప్రయాణికులు చనిపోగా మృత్యువు తమకు అతి సమీపం నుంచి వెళ్లిందని చౌరాసియా భార్య నందిని చెప్పారు. -
పట్టాలెక్కని టెక్నాలజీ
- మానవ అప్రమత్తతపైనే ఆధారపడ్డ రైల్వే - పట్టా విరిగితే ట్రాక్‌మెన్ గుర్తించాల్సిందే - అత్యాధునిక యంత్రాలకు తీవ్ర కొరత - పట్టాల బిగింపు, కంకర సరిచేసే టాంపింగ్ మెషీన్లూ అరకొరే - దినదినగండంగా రైళ్ల పరుగులు సాక్షి, హైదరాబాద్: ‘రైల్వేలను లాభాల బాట పట్టించటంతోపాటు ప్రమాదరహితంగా మార్చాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?’ కొద్దిరోజులుగా రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ల అధికారులను అడుగుతున్న ప్రశ్న ఇది! దీనిపై ఢిల్లీ సూరజ్‌కుండ్‌లో ఓ మేధోమథన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ నెల 18న ప్రారంభమైన ఆ సదస్సు ఆదివారమే ముగిసింది. దీని ప్రారంభ, ముగింపు కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ కూడా హాజరయ్యారు. ఈ సమావేశాలు జరుగుతుండగానే.. దేశంలోనే ఘోర రైలు దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయే ప్రమాదం యూపీలో చోటుచేసుకుంది!! దేశంలో సురక్షితంగా భావించే రైల్వే జోన్లలో దక్షిణ మధ్య రైల్వే ఒకటి. పట్టాలు విరగటం వల్ల ప్రమాదాలు జరిగిన దాఖలాలు ఇక్కడ అతి తక్కువ. యూపీ ప్రమాదం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. వాటిని పరిశీలిస్తే... పట్టాలపై మరింత జాగ్రత్త పట్టాలు, వాటి దిగువ ఉండే సిమెంట్ స్లీపర్లలో తలెత్తే లోపాలను సాధారణంగా ట్రాక్‌మెన్ సులభంగానే గుర్తిస్తారు. కానీ కొన్నిసార్లు ట్రాక్‌మెన్ పరిశీలించి వెళ్లిన తర్వాత రైలు వచ్చే సమయంలో పట్టా విరిగే అవకాశం ఉంది. దీన్ని నిరోధించటం కష్టంగా మారింది. పట్టా-పట్టాను జోడించే చోట ఉండే జారుుంట్లు ప్రమాదకరంగా మారుతున్నారుు. అలాంటి చోట్ల వెల్డింగ్ చేస్తారు. ఒక్కోసారి ఈ వెల్డింగ్ జారుుంట్లు ఊడిపోరుు పట్టాలు పక్కకు జరిగి రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది. ట్రాక్‌మెన్ అప్రమత్తతో వీటిని గుర్తించొచ్చు. కానీ జారుుంట్లలో చిన్న పగుళ్లను వారు గుర్తించటం కష్టమవుతోంది. ఈ పగుళ్లను కూడా గుర్తించేందుకు ప్రత్యేకంగా కొన్ని యంత్రాలుంటారుు. అల్ట్రాసానిక్ టెస్ట్‌ల ద్వారా, రోలింగ్ ఎగ్జామినర్ల ద్వారా వాటిని గుర్తించొచ్చు. కానీ మన వద్ద వాటి వినియోగం చాలా పరిమితంగా ఉంది. కంకర మెషీన్ల కొరత.. రైళ్ల వేగానికి పట్టాల దిగువన ఉన్న కంకర చెదిరిపోతుంది. ఎక్కువగా చెదిరితే అది ప్రమాదకరంగా మారుతుంది. రైలు వేగంగా దూసుకుపోతున్నప్పుడు పట్టాలు, వాటిని పట్టుకుని ఉండే స్లీపర్లపై భారం పడకుండా ఉండేందుకు ఈ కంకర కుషన్ మాదిరిగా ఉపయోగపడుతుంది. కంకర తగ్గితే పట్టాలపై భారం పడి ఏమాత్రం బలహీనంగా ఉన్నా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కంకర తగ్గితే ఆటోమేటిక్‌గా సరిచేసే టాంపింగ్ మెషీన్‌ను వినియోగిస్తారు. కానీ మన వద్ద ఆ యంత్రాలకూ కొరత ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ సమీపంలోని రాయనపాడు స్టేషన్ వద్ద ట్యాంపింగ్ మెషీన్ డిపో ఉంది. ఇలాంటి డిపోలను మరిన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. వాతావరణ మార్పులూ కీలకమే.. వాతావరణ మార్పులు కూడా పట్టాలపై ప్రభావం చూపుతారుు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు వేడికి పట్టాలు వ్యాకోచిస్తారుు. చలికి సంకోచిస్తారుు. దీంతో పట్టాల జారుుంట్ల వద్ద మార్పులొస్తారుు. అందుకే జారుుంట్ల వద్ద కొంత గ్యాప్ ఉంచుతారు. చలి పెరిగితే సంకోచం వల్ల ఈ గ్యాప్ మరీ ఎక్కువై చక్రం పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది. దీన్ని నిరంతరం గమనిస్తూ ఉండాలి. పట్టా జారుుంట్లు, వెల్డింగ్‌లను పరిశీలించేందుకు ప్రతి మూడు నెలలకోమారు వెల్డింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. దీనికి కావాల్సినన్ని అల్ట్రా సోనిక్ పోర్టబుల్ యంత్రాలు మరిన్ని సమకూర్చుకోవాల్సి ఉంది. విద్రోహ చర్యలు.. దేవుడిపైనే భారం రెండు పట్టాల మధ్య దూరం నిర్ధారిత ప్రమాణంలో ఉండాలి. ఇందుకోసం వాటిని దిగువ ఉండే కాంక్రీట్ స్లీపర్లతో కట్టి ఉంచుతారు. బలమైన ఇనుప కడ్డీతో ఈ బంధం ఉంటుంది. కానీ విద్రోహులు వాటికి ఉండే బోల్టులు తొలగిస్తున్నారు. అప్పుడు పట్టా పక్కకు జరిగి బోగీలు పట్టాలు తప్పుతారుు. విద్రోహులు వాటిని విప్పదీయకుండా ఉండే వ్యవస్థ అందుబాటులో లేదు. భారమంతా ట్రాక్మెన్పైనే... నిరంతరం పట్టాలపై గస్తీ తిరిగే ట్రాక్‌మెన్‌ను నమ్ముకునే రైళ్లు పరుగుపెడుతున్నారుు. ప్రతి ఐదారు కిలోమీటర్ల పరిధిలో ఇద్దరు ట్రాక్‌మెన్ ఉంటారు. చెరో చివరి నుంచి పట్టాలను పరిశీలించుకుంటూ మరో చివరకు వెళ్తారు. ఏ చిన్న లోపమున్నా వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తారు. వీరిపై కీ మెన్ వ్యవస్థ, వారిపై ఇన్చార్జిగా గ్యాంగ్మేట్ ఉంటారు. వారిపైన సూపర్వైజర్లు ఉంటారు. ప్రతి ఇరవై, ముప్పై స్టేషన్లకు ఓ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఉంటారు. ఈ వ్యవస్థలు పటిష్టంగానే ఉన్నా ఇవన్నీ మానవ అప్రమత్తతపైనే ఆధారపడుతున్నారుు. ఇందులో మరింత సాంకేతిక పరిజ్ఞానం జోడించాల్సి ఉంది. -
రైలు ప్రమాదం: 100 మందికి పైగా మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 100 మందికి పైగా మృతిచెందినట్లు ఆ రాష్ట్ర అదనపు డీజీ దల్జీత్ సింగ్ చౌదరి వెల్లడించారు. ఈ ఘటనలో 200 మందికి పైగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ 14 బోగీలు కాన్పూర్ సమీపంలోని పుక్రాయ వద్ద పట్టాలు తప్పడంతో ఈ దుర్ఘటన జరిగింది. తెల్లవారు జామున ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సైన్యం సహాయక చర్యలు చేపట్టాయి. రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో మాట్లాడారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మోదీ తెలిపారు. బాధితులకు రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతిచెందిన వారి కుటుంబానికి రూ.3.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ సంతాపం ఉత్తరప్రదేశ్ రైలు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
రైలు ప్రమాద బాధితులకు భారీ పరిహారం!
-
రైలు ప్రమాదం.. బాధితులకు భారీ పరిహారం!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నేటి(ఆదివారం) వేకువజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య గంటగంటకు పెరిగిపోతుంది. యూపీలోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్(రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్) రైలు 14 బోగీలు పట్టాలు తప్పిన ఘటనలో ఇప్పటివరకూ 63 మంది చనిపోయారని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ ఘటన బాధితులకు రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతిచెందిన వారి కుటుంబానికి రూ.3.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25వేలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.50 వేలు పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో ఏం జరుగుతుందో వారికి అర్ధం కాలేదు. పరస్థితి వారికి అర్థమయ్యేసరికే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే మెడికల్ స్టాఫ్ అక్కడికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించిన మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రులకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేపట్టిన సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. జేసీబీల సాయంతో పట్టాలు తప్పి అడ్డుగా ఉన్న బోగీలను తొలగిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం అఖిలేష్.. అధికారులను సహాయక చర్యల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఘటనకు కారణాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
మాటలు రావడం లేదు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడడం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. తన బాధను వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకొవాలని ఆకాంక్షించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి సురేశ్ ప్రభుతో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రమాదం జరగటానికి గల కారణాల గురించి అడిగారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఉత్తరప్రదేశ్ లోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో 63 మందిపైగా మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. -
రైలు ప్రమాదంపై స్పందించిన సురేశ్ ప్రభు
న్యూఢిల్లీ: పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పందించారు. సీనియర్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు సహాయ చర్యల్లో పాల్గొనాలని కోరారు. రైల్వే సహాయ మంత్రి ఘటనా స్థలానికి బయలుదేరారని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించాలని యూపీ డీజీపీని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ లోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో 63 మందిపైగా మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. -
నటి ట్వీట్‌కు స్పందించి మంత్రి సాయం
ముంబై: బాలీవుడ్ నటి రేణుక సహాని చేసిన ట్వీట్‌కు రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెంటనే స్పందించారు. అనారోగ్యానికి గురైన రేణుక వదినకు వెంటనే సాయం చేయాల్సిందిగా రైల్వే అధికారులను మంత్రి ఆదేశించారు. రేణుక భర్త అశుతోష్ రాణా సోదరి అయిన కామిని గుప్తా (63) ఢిల్లీ నుంచి ముంబైకి సువిధ ఎక్స్‌ప్రెస్‌లో ఒంటరిగా ప్రయాణిస్తోంది. శనివారం రాత్రి ఆమె రేణుకకు ఫోన్ చేసి, తనకు అస్వస్థతగా ఉందని చెప్పింది. రేణుక వెంటనే రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ట్వీట్ చేసి, సాయం చేయాల్సిందిగా కోరింది. మంత్రి ఆదేశాల మేరకు కొన్ని నిమిషాల్లోనే రైల్వే అధికారులు రేణుకను సంప్రదించి వివరాలు అడిగారు. రైలు రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌కు వెళ్లేసరికి అక్కడ వైద్యులు బృందం సిద్ధంగా ఉన్నారు. ఛాతినొప్పితో బాధపడుతున్న కామినికి వైద్యులు చికిత్స చేశారు. తాను మంత్రికి ట్వీట్ చేసిన తర్వాత కేవలం 15 నిమిషాల్లోపే తన వదినకు వైద్యులు చికిత్స చేశారని రేణుక తెలిపారు. కామిని ఎలాంటి సమస్య లేకుండా ముంబైకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారని చెప్పింది. సమస్యల్లో ఉన్న ప్రయాణికులు ఎవరు ట్వీట్ చేసినా రైల్వే మంత్రి వెంటనే స్పందిస్తారని, వివరాలు తెలుసుకుని సాయం చేయాల్సిందిగా ఆదేశిస్తారని అధికారులు తెలిపారు. -
కేంద్రమంత్రికి మహా కక్కుర్తి విజ్ఞప్తి!
ప్రభుత్వ మంత్రిత్వశాఖలన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా విదేశాంగ శాఖ, రైల్వేశాఖలు నెటిజన్ల విజ్ఞప్తులపై చురుగ్గా స్పందిస్తూ.. వారికి వేగంగా సేవలు అందిస్తున్నాయి. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ విదేశాల్లోని భారతీయులకు ఏ కష్టం వచ్చినా.. ట్విట్టర్లో ఒక చిన్న మాట చెప్తే చాలు.. వారి సమస్యలను తీరుస్తూ.. సూపర్ మామ్ గా పేరుతెచ్చుకుంటున్నారు. అటు సురేశ్ ప్రభు కూడా రైల్వేశాఖలోని సమస్యలను ట్విట్టర్ వేదికగా పరిష్కరిస్తున్నారు. కానీ రైల్వేమంత్రి సురేశ్ ప్రభుకు ఓ ఇటీవల ఓ ప్రయాణికుడు ఓ వింత మెసేజ్ పెట్టాడు. ‘నేను చిన్నపాపతో ప్రయాణిస్తున్నా. ఒక డైపర్ కావాలి. దయచేసి సాయం చేయండి’ అంటూ ప్రభాకర్ ఎస్ ఝా అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. రైల్వేశాఖకు, రైల్వేమంత్రి సురేశ్ ప్రభుకు ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ నెటిజన్లకు మంట పుట్టించింది. ట్విట్టర్లో అందుతున్న రైల్వేసేవలను జోక్‌గా మార్చడం సరికాదని, ఇలాంటి విజ్ఞప్తులు చేసి మూర్ఖుడిగా మిగలొద్దని ఓ నెటిజన్ సూచించగా.. ఇలాంటి మూర్ఖులకు టికెట్ ధర కంటే రెట్టింపు రేటుకు డైపర్ అందించి కుక్క కాటుకు చెప్పుదెబ్బ తరహాలో జవాబు చెప్పాలని మనో నెటిజన్ సూచించాడు. -
రైల్వే మంత్రికి ప్రముఖ నటి ఫిర్యాదు
-
రైల్వే మంత్రికి ప్రముఖ నటి ఫిర్యాదు
ముంబై: రైలులో ప్రయాణిస్తుండగా తన బ్యాగును ఎలుక కొరికేసిందని ప్రముఖ మరాఠి నటి నివేదిత సరాఫ్.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ఫిర్యాదు చేశారు. రైళ్లలో ఎలుకల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రైలులో తనకెదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రికి వివరించారు. సెప్టెంబర్ 22న లాతూర్ ఎక్స్‌ప్రెస్ లో ఏసీ బోగీలో ఆమె ప్రయాణించారు. తన బ్యాగును తల పక్కన పెట్టుకుని నిద్రపోయింది. లేచి చూసేసరికి ఆమె బ్యాగును ఎలుక కొరికేసింది. రైలు ప్రయాణం తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని ఆమె వాపోయింది. ఎలుక కొరికిన బ్యాగు ఫొటో కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీనిపై సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ స్పందించారు. ఎలుకలను పెస్ట్ కంట్రోల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పట్టుకుంటారని చెప్పారు. ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నామని సెంట్రల్ రైల్వే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. నివేదిత సరాఫ్ ఫిర్యాదు నేపథ్యంలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి చెబుతామన్నారు. 22 Sept Latur Express A1 27 rat did this to my bag while I was sleeping. bag was near my head. horrible @RailMinIndia @sureshpprabhu pic.twitter.com/9HYJaLKY8d — Nivedita Saraf (@nivisaraf) 26 September 2016 -
రైలు బీమా షురూ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం రైలు ప్రయాణికులకు ఐచ్ఛిక ప్రమాద బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. కొత్త పథకాన్ని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారమిక్కడ ప్రారంభించారు. టికెట్ బుకింగ్ సమయంలో బీమా సదుపాయం ఎంపిక చేసుకోవడం ప్రయాణికుడి ఇష్టం. ఏడాదిపాటు పెలైట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రీమియంగా రూ.92పైసలు మాత్రమే వసూలుచేస్తారు. రైలు ప్రమాదాల్లో ప్రయాణికుడు మరణిస్తే రూ. 10 లక్షల ప్రమాద బీమా అందిస్తారు. -
ఆలేరు రైల్వే గేట్ తెరవాలని రైల్వే మంత్రికి వినతి
భువనగిరి : ఆలేరు పట్టణంలో మూసివేసిన రైల్వే గేట్‌ను వెంటనే తెరిపించాలని భువనగిరి ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్ రైల్వే మంత్రి సురేష్ ప్రభును కోరారు. మంగళవారం రాత్రి ఎంపీ ఢిల్లీలో మంత్రిని కలిసి రైల్వేగేట్ మూసి వేయడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఆర్ఓబీ నిర్మించి గేట్‌ను మూసి వేశారని దీంతోపట్టణం రెండుగా విడిపోయిందన్నారు. రెండు ప్రాంతాలకు కాలిబాట సౌకర్యం పూర్తిగా పోయిందన్నారు. గేట్ మూసి వేయడంతో రేషన్ సరుకులు, రోగులు, విద్యార్థులు, మహిళలు, వద్ధులు, చిన్నారులు ఇలా అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. వెంటనే గేట్ తెరిపించడంతో పాటు, అర్యూబీని నిర్మించాలని ఎంపీ మంత్రికి విజ్ఞప్తి చేశారు. -
త్వరలో ఏపీతో రైల్వేస్ జాయింట్ వెంచర్
-
త్వరలో ఏపీతో రైల్వేస్ జాయింట్ వెంచర్
- రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు వెల్లడి - నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభం - రైల్వే జోన్ వస్తుందన్ననమ్మకం ఉంది: చంద్రబాబు సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జాయింట్ వెంచర్‌కు రైల్వే శాఖ త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటుందని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. ఈ ఒప్పం దంతో కొత్త రైల్వే లైన్లు, ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలవుతుందన్నారు. సీఎం చంద్రబాబు, మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కలసి సురేశ్ ప్రభు మంగళవారం విజయవాడలో నంద్యాల-ఎర్రగుంట్ల రైలు మార్గంతో పాటు నంద్యాల-కడప డెమూ రైలును వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రభు మాట్లాడుతూ.. రూ. వెయ్యి కోట్లతో చేపట్టిన ఈ రైలు మార్గం ద్వారా రాయల సీమను రాజధాని అమరావతికి అనుసంధానం చేశామన్నారు. త్వరలో ఈ మార్గం గుండా ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతామన్నారు. ఒలింపిక్ పతకం సాధించిన సింధు తండ్రి రైల్వే ఎంప్లాయి కాబట్టి ఆమెది తమ కుటుంబమేనని సురేశ్ ప్రభు అన్నారు. రాయ్‌పూర్-విశాఖ కారిడార్ ప్రకటించాలి: కేంద్ర రైల్వే శాఖ మంత్రి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో రైల్వే జోన్ వస్తుందన్న నమ్మకం తనకుందని సీఎం చంద్రబాబు అన్నారు. చెన్నై-ఢిల్లీ వయా విజయవాడ, విజయవాడ-ఖరగ్‌పూర్ వయా విశాఖ, ముంబై-ఖరగ్‌పూర్ వయా నాగ్‌పూర్ కారిడార్లను కేంద్రం ప్రకటించిందని, అలాగే రాయ్‌పూర్-విశాఖ కారిడార్‌ను ప్రకటించాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశానన్నారు. రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తే నిధులు సమీకరించి కొత్త లైన్లు, రైల్వే స్టేషన్ల సుందరీకరణ చేపట్టేందుకు వీలుంటుందన్నారు. రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఇంతకాలం ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. 1996లో నంద్యాల-ఎర్రగుంట్ల రైలుమార్గానికి తానే భూమి కేటాయించానన్నారు. ఈ మార్గం రాయలసీమకు కీలకమైనదని, సిమెంట్ ఫ్యాక్టరీలకు, సీపోర్టులకు కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. కృష్ణా పుష్కరాల్లో రైళ్లలో 41 లక్షల మంది ప్రయాణికులు ఇరువైపులా ప్రయాణించారన్నారు. పీవీ కల నెరవేరింది: కేంద్ర మంత్రి వెంకయ్య గతంలో రైల్వే మంత్రులు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 40 ఏళ్లు పడుతుందని, కొత్త రైళ్లు, హామీలు ఇవ్వవద్దని ప్రధాని మోదీ రైల్వే మంత్రికి సూచించారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. నంద్యాల -ఎర్రగుంట్ల రైలుమార్గం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కల అని, ఆ కల ఇన్నాళ్లకు నెరవేరిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పి.పుల్లారావు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, ఎంపీలు గోకరాజు గంగరాజు, మురళీమోహన్, పలువురు ఎమ్మెల్యేలు, దక్షిణ మధ్య రైల్వే ఏజీఎం ఏకే గుప్తా తదితరులు పాల్గొన్నారు. నంద్యాల-కడప డెమూ రైలు ప్రారంభం నంద్యాల: కేంద్ర మంత్రి సురేష్ ప్రభు నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైన్‌ను ప్రారంభించిన అనంతరం నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై ఎంపీ ఎస్పీవెరైడ్డి, ఎమ్మెల్యేలు గౌరుచరితారెడ్డి, భూమా నాగిరెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, పలువురు అధికారులు పచ్చజెండాలు ఊపడంతో నంద్యాల-కడప డెమూ రైలు కడపకు బయలుదేరింది. -
నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభించిన ప్రభు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. రైలుమార్గం ద్వారా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రాయలసీమను కలుపుతున్నామన్నారు. మంగళవారం డీఆర్ఎమ్ కార్యాలయంలో కేంద్రమంత్రి సురేష్ ప్రభు... నంద్యాల - ఎర్రగుంట్ల 123 కిలోమీటర్ల రైలుమార్గాన్ని రిమోట్ ద్వారా ప్రారంభించారు. అలాగే నంద్యాల - కడపకు డిమో రైలును సురేష్ ప్రభు, చంద్రబాబుతోపాటు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. నంద్యాల - ఎర్రగుంట్ల మార్గం ద్వారా విజయవాడకు నేరుగా రైలు మార్గం ఏర్పడింది. ఈ రైలు మార్గం నిర్మాణానికి రూ. 967 కోట్లు వ్యయం అయింది. -
కేంద్రమంత్రికి స్వాగతం పలికిన మంత్రులు
విజయవాడ : కృష్ణా పుష్కరాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కర స్నానం ఆచరించేందుకు న్యూఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్ చినరాజప్ప, మంత్రి కొల్లు రవీంద్ర ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలో పుష్కరస్నానం ఆచరించేందుకు వీఐపీకి ఘాట్‌కు కేంద్రమంత్రి సురేష్ ప్రభు... మంత్రులతో కలసి పయనమయ్యారు. ఆ తర్వాత సురేష్ ప్రభు... నగరంలోని డీఆర్ఎం కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నంద్యాల - ఎర్రగంట్ల రైల్వే లైన్, నంద్యాల - కడప పాసింజర్ రైలును రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనుల గురించి ఆ శాఖ ఉన్నతాధికారులతో సురేష్ ప్రభు సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సంగమం వద్ద పుష్కరాల ముగింపు కార్యాక్రమంలో సురేష్ ప్రభు పాల్గొంటారు. -
వరాలు ఇచ్చేనా
నేడు విజయవాడకు రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు రాక పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం నంద్యాల – కడప లైను ప్రారంభం సాక్షి, విజయవాడ : రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు మంగళవారం నగరానికి రానున్నారు. పున్నమి ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరిస్తారు. అనంతరం డీఆర్ఎం కార్యాలయం చేరుకుని అక్కడ నుంచే నంద్యాల – ఎర్రగంట్ల రైల్వేలైనును, నంద్యాల– కడప పాసింజర్ రైలును రిమోట్ వీడియో లింక్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు. ఏపీలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనుల గురించి ఆ శాఖ ఉన్నతాధికారోలనూ సమీక్షిస్తారని తెలిసింది. సాయంత్రం సంగమం వద్ద పుష్కరాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సురేష్ ప్రభు ఇప్పటికే రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.తొలిసారిగా ఆయన విజయవాడ వచ్చినప్పుడు విజయవాడ– అమరావతి రైల్వే లైను నిర్మాణానికి సర్వే చేయించేందుకు శ్రీకారం చుట్టారు. రెండవసారి వచ్చినప్పుడు విజయవాడ– సికింద్రాబాద్ సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేశారు. తాజాగా విజయవాడ–ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ను ఇచ్చి రాయలసీమ వాసులు రాష్ట్రానికి వచ్చేందుకు వీలు కల్పించారు. ఈసారి ఏమీ వరాలు ఇస్తారనే అంశంపై రైల్వే వర్గాలో చర్చ జరుగుతోంది. ఈ క్రింద అంశాలపై సురేష్ ప్రభు దృష్టి పెడితే ఈ ప్రాంతవాసులకు ఉపయుక్తంగా ఉంటుందని అధికార, అనధికార వర్గాలు భావిస్తున్నాయి. –విశాఖపట్నం–తిరుపతి, విశాఖపట్నం– సికింద్రాబాద్ వయా విజయవాడ మీదగా డబుల్ డెక్కర్ రైలు నడిపేందుకు ఇప్పటికే ట్రయిల్ రన్‌ను అధికారులు పూర్తి చేశారు. కేవలం రైల్వే బోర్డు నుంచి అనుమతులు వస్తే ఈ రైళ్లు నడిచే అవకాశం ఉంది. పుష్కరాల్లో వీటిని నడపాలని చూసినా రైల్వే బోర్డు నుంచి అనుమతి రాలేదు. వీటిని మంజూరు చేస్తే ఉపయుక్తంగా వుంటుంది. – విజయవాడ రైల్వే స్టేషన్లో మరో ఫుట్ఓవర్ బ్రిడ్జి చాలా అవసరం. గతంలో ఉన్న పుట్ ఓవర్ బ్రిడ్జికి ఒకవైపు మెట్లు తీసివేసి ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఒకవైపు రైలు ఎక్కేవాళ్లు దిగేవాళ్లు వస్తూ ఉండటంతో తొక్కిసలాట జరుగుతోంది. – పుష్కరాల సందర్భంగా గుణదల, మధురానగర్, కృష్ణాకెనాల్, రాయనపాడు రైల్వేస్టేషన్లను శాటిలైట్ స్టేషన్లుగా మార్చారు. పుష్కరాల తరువాత దీన్ని కొనసాగిస్తే విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. – విజయవాడ నుంచి నాగోర్ (నాగపట్నం), అహ్మదాబాద్, ముంబాయి, షిర్డీ, కోల్‌కతాలకు కొత్త రైళ్లు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – విజయవాడ– గుడివాడ– నర్సాపురం– భీమవరం– మచిలీపట్నం, గుంటూరు– తెనాలి లైన్ల డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.120 కోట్లు గతంలో ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో గుంటూరు–తెనాలి లైను రూ.20 కోట్లు మిగిలిన వంద కోట్లు మొదటి లైనుకు కేటాయిస్తారు. ఈ రెండు లైన్లు పూర్తి చేయడానికి రూ.1,140 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేయగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సగం భరించేందుకు ముందుకు వచ్చింది. ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీటిని వేగవంతం చేయించాల్సి ఉంది. -
త్వరలో 4 కొత్త రైళ్లు
వడోదర: రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు కొత్తగా నాలుగు రకాల రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. సాధారణ ప్రయాణికుల కోసం ఒకటి, రిజర్వుడు తరగతి ప్రయాణికుల కోసం మూడు రైళ్లను రెండు నెలల్లో ప్రవేశపెడతామన్నారు. ‘అంత్యోదయ తరగతి’ వారూ(పేదలు) రైల్లో ప్రయాణించాలన్న లక్ష్యమే ఈ కొత్త రైలు ప్రవేశపెట్టటానికి కారణమన్నారు. బుధవారం నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వే, ఎంఎస్ యూనివర్సిటీ ఆఫ్ బరోడాలు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ప్రభు మాట్లాడుతూ..దూర ప్రయాణ రైళ్లకు కూడా 2 నుంచి 4 ‘దీన్ దయాళ్’ బోగీలను సాధారణ ప్రయాణం కోసం జతచేస్తామని చెప్పారు. పూర్తి మూడో తరగతి ఏసీతో కూడిన ‘హమ్‌సఫర్’ రైలు ఒకటి, గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే తేజస్ రైళ్లు, ఉదయ్ (ఉత్కష్ట్ డబుల్–డెక్కర్ ఏసీ యాత్రి) రైళ్లను రిజర్వుడు తరగతి కోసం తెస్తామన్నారు. ఉదయ్ రైళ్లు అత్యంత రద్దీ మార్గాల్లో రాత్రివేళల్లో నడుస్తాయన్నారు. -
ఇక రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండదు!
న్యూఢిల్లీ: 92 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ సంప్రదాయానికి ఇక తెరపడనుంది. వచ్చే ఏడాది నుంచి రైల్వే బడ్జెట్ కేంద్ర సార్వత్రిక బడ్జెట్లో విలీనం కానుంది. ఈ మేరకు రైల్వేమంత్రి సురేశ్ ప్రభు చేసిన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆమోదం తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనంపై విధివిధానాలు ఖరారుచేసేందుకు ఆర్థికమంత్రిత్వశాఖ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ఆర్థికశాఖ, రైల్వే శాఖ సీనియర్ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ నెల 31నాటికి నివేదిక సమర్పించాల్సిందిగా కమిటీని ఆర్థికశాఖ ఆదేశించింది. 'కేంద్ర బడ్జెట్లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయాల్సిందిగా ఆర్థికమంత్రి జైట్లీకి లేఖ రాశాను. రైల్వే ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. విలీనం విధివిధానాలపై మేం కసరత్తు చేస్తున్నాం' అని ప్రభు పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. -
'తెలంగాణ అభివృద్ధికి పూర్తి సహకారం'
హైదరాబాద్: నవజాత శిశువు వంటి తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో హైదరాబాద్ - గుల్బర్గా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును సురేష్ ప్రభు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సురేష్ ప్రభు మాట్లాడుతూ... ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగమైన గుల్బర్గాతో ఇక్కడి ప్రజలకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. తెలంగాణలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారి అవసరాల కోసం కాజీపేట్ - ఎల్టీటీ ముంబై రైలును ప్రారంభించామని గుర్తు చేశారు. రైల్వే శాఖకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కార్గో రవాణాపై దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు. చర్లపల్లి, నాగులపల్లిల్లో అంతర్జాతీయ టెర్మినళ్ల నిర్మాణానికి తోడ్పడతామని సీఎం కేసీఆర్‌కు హామీ ఇచ్చినట్లు సురేష్ ప్రభు వెల్లడించారు. కాచిగూడలో టెర్మినల్తోపాటు ఎంఎంటీఎస్ సర్వీసును శంషాబాద్ విమానాశ్రయం వరకు పొడిగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే రైల్వేలను మరింత విస్తరించేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లైనును ఏడాదిలోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం రైల్వే మంత్రి సురేష్ ప్రభు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ రజతోత్సవాలకు హాజరైయ్యారు. ఉద్యోగుల బోనస్ సీలింగ్ విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తుందని ఆయన తెలిపారు. రైల్వే శాఖ సహాయ మంత్రి హంసరాజ్ గంగారం, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హాజరయ్యారు. -
గుల్బర్గా- హైదరాబాద్ ఇంటర్ సిటీకి పచ్చజెండా
హైదరాబాద్: గుల్బర్గా- హైదరాబాద్ ఇంటర్ సిటీ డైలీ, కాజీపేట్-ముంబయి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేమంత్రి సురేశ్ ప్రభు సోమవారం ప్రారంభించారు. ఆయన సోమవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వీడియో లింక్ ద్వారా పచ్చజెండా ఊపి రెండు రైళ్లను ఆరంభించారు. అలాగే వీటితోపాటు సికింద్రాబాద్ స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంలో ఏసీ రిటైరింగ్ రూం, డార్మిటరీ, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో వందశాతం ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పద్మారావు, మహేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, రైల్వే జీఎం రవీందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
భారతీయ ‘రైల్వేగీతం’ విడుదల
సాధారణ ప్రజలకు ఎంతో చేరువైన భారతీయ రైల్వే వ్యవస్థపై మంత్రి సురేశ్ ప్రభు శుక్రవారం ప్రత్యేక గీతాన్ని (రైల్ గీత్) విడుదల చేశారు. సంగీత దర్శకుడు శరవణ్ స్వరపరిచిన ఈ మూడు నిమిషాల గీతాన్ని గాయకులు ఉదిత్ నారాయణ్, కవిత కృష్ణమూర్తి ఆలపించారు. ఈ గీతం రైల్వే వినియోగదారులకు, ఉద్యోగులకు స్ఫూర్తినిచ్చి, భారతీయ రైల్వే అభివృద్ధికి తోడ్పడుతుందని మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రైల్వే శాఖకు సంబంధించిన కార్యక్రమాల ప్రారంభంలో ఈ పాటను ఆలపించనున్నట్లు వెల్లడించారు. అతి పెద్ద భారతీయ రైలే ్వ వ్యవస్థ సమర్థంగా పని చేసేందుకు కృషి చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల నిబద్ధత, అంకితభావానికి ఈ పాట ప్రతీక అని మంత్రి అభివర్ణించారు. -
రైల్వే బడ్జెట్ కు చరమగీతం?
న్యూఢిల్లీ : 92 ఏళ్ల క్రితం నాటి నుంచి ఆనవాయితీగా కొనసాగుతూ వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్ కు ఎన్డీయే ప్రభుత్వం చరమగీతం పాడనుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేయాలని కోరుతూ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. 92 ఏళ్ల నాటి నుంచి వస్తున్న ప్రత్యేక బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలపడాన్ని సురేష్ ప్రభు ప్రతిపాదించారని సీనియర్ రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు. జూన్ లోనే ఆర్థిక మంత్రికి ఈ లేఖను పంపించారని, ఇంకా అరుణ్ జైట్లీ నుంచి ఎలాంటి సమాధాన రాలేదని అధికారులు పేర్కొన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ డేబ్రోయ్ ఈ విలీనాన్ని మొదట ప్రతిపాదించిన అనంతరం, రైల్వేశాఖ సమాధానం కోరుతూ గత నెల ప్రధానమంత్రి కార్యాలయం ఈ లేఖను పంపింది. ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తూ.. ఆర్థికమంత్రికి ఈ లేఖను రైల్వే శాఖ పంపించింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో 2017-18 రైల్వే బడ్జెట్ లేదా 2016-17 బడ్జెట్, రైల్వేకు తుది బడ్జెట్ కానుందని అధికారులు చెప్పారు. ఈ విలీన ప్రతిపాదనతో, మొత్తం ఆర్థిక భారం ఇక నుంచి ఆర్థిక మంత్రి చేతులోకి వెళ్లనుంది. అయితే ఈ విలీనానికి సంబంధించి గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్యాసెంజర్ సెగ్మెంట్ లో రైల్వే రూ. 34,000కోట్ల నష్టాలను భరిస్తుంది. రాబడులు సైతం పతనమవుతున్నాయి. -
విజయవాడ-ధర్మవరం మధ్య ట్రై వీక్లీ రైలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం విజయవాడ నుంచి ధర్మవరం మధ్య ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైలును కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మంగళవారం ఢిల్లీలోని రైల్ భవన్లో జరిగే ఓ కార్యక్రమంలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు విజయవాడ నుంచి అనంతపురం మీదుగా ధర్మవరానికి వారానికి మూడు రోజులు నడుస్తుంది. -
యోగాతో ఆరోగ్యవంతమైన సమాజం
మనిషి మనిషిగా బతకాలంటే యోగా ద్వారానే సాధ్యం: చంద్రబాబు విజయవాడ స్పోర్ట్స్: యోగా ప్రాచీన భారతీయ వారసత్వ సంపదని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చిన్నారులు, యోగా గురువులతో కలిసి సురేష్ ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు యోగాసనాలు వేశారు. సురేష్ ప్రభు మాట్లాడుతూ... యోగాతో ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుందన్నారు. యోగా ఆత్మను, అంతరాత్మను కలుపుతుంద ని చంద్రబాబు చెప్పారు. మన వారసత్వ సంపద యోగాను ప్రపంచమంతా ఆచరిస్తోందన్నారు. యోగా ను శాస్త్రీయంగా సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని వెల్లడించారు. మనిషి మనిషిగా బతకాలంటే యోగా ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు యోగా గురువులను సీఎం సన్మానించారు. -
ఘనంగా అంతర్జాతీయ యోగా డే
విజయవాడ స్పోర్ట్స్: కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖలోని నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో విజయవాడలోని ఎ1- కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం అంతర్జాతీయ యోగా డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం 7 నుంచి 8గంటల వరకు చిన్నారులు, యోగా గురువులతో కలిసి రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎంపీలు, నెహ్రూ యువ కేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల శేఖర్‌రావు, శాప్ చైర్మన్, అధికారులు యోగాసనాలు వేసి స్ఫూర్తినిచ్చారు. మంత్రి సురేష్‌ప్రభు మాట్లాడుతూ.. యోగా ప్రాచీన భారతీయ వారసత్వ సంపదన్నారు. కేవలం సంపద ఉన్నంత మాత్రాన అగ్రస్థానానికి చేరుకోలేమని, ఆరోగ్యకరమైన జీవన విధానం ఎంతో ముఖ్యమన్నారు. పరిపాలనలో సానుకూల దృక్పథంతో పనిచేయడానికి యోగా తోడ్పడుతుందన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రధాన నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రపంచమంతా ప్రతి ఏడాది జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తోందన్నారు. యోగాతో శరీరం, మనస్సు, ఆత్మ అన్నీ లయబద్ధంగా పనిచేస్తాయన్నారు. తద్వారా మనుషులంతా సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకోవడంతో ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుందన్నారు. ఇందుకోసమే నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు. కేంద్రంలోని 57 మంది మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. యోగాను ఈ ఒక్క రోజే ఆచరించడం కాకుండా నిత్యం సాధన చేసి చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సురేష్ ప్రభు పిలుపునిచ్చారు. ఆత్మను, అంతరాత్మను కలిపేది యోగా: సీఎం చంద్రబాబు యోగా ఆత్మను, అంతరాత్మను కలుపుతుంద ని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చెప్పారు. మన పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపదైన యోగాను నేడు ప్రపంచమంతా ఆచరిస్తోందన్నారు. యోగా చక్కటి జీవన విధానాన్ని, ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఇది ఒక ప్రాంతానికి, కులానికి, మతానికి పరిమితం కారాదన్నారు. యోగా శాస్త్రీయంగా సాధనచేస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. మనిషి ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం వస్తుందని తెలిపారు. ఆ ఆరోగ్యం యోగాతో వస్తుందన్నారు. ఉద్యమ స్ఫూర్తిగా ఒక్కొక్కరు కనీసం నలుగురైదురికైనా యోగా నేర్పించాలని పిలుపునిచ్చారు. యోగాతో పాటు భారతీయ వారసత్వ సంపదైన కూచిపూడి నృత్యానికి కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. యోగా, పౌష్టికాహార మిషన్ కోసం ఆయుష్ శాఖకు రూ.25కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితమే అధికారులకు యోగాలో శిక్షణ ప్రభుత్వంలోని అధికారులందరికి ఇరవై ఏళ్ల కిందటే యోగా శిక్షణ తరగతులు ఇప్పించానని, అప్పట్లో యోగా ఎందుకని అందరూ నవ్వారని, నేడు అది విశ్వవ్యాపితం అయిందన్నారు. మనిషి మనిషిగా బతకాలంటే అది యోగా ద్వారానే సాధ్యమవుతుందన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి చెబుతూ, అమెరికాలో ఎన్నిసార్లు పెళ్లిళ్లు చేసుకున్నా అక్కడ నిజమైన ఆనందం లేదంటూ దాంపత్య జీవితాలపై తనదైన శైలిలో సీఎం వివరించారు. కుటుంబమంతా కలిసి ఉన్నప్పుడే నిజమైన ఆనందం ఉంటుందన్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈవోలు మనవారేనని గుర్తుచేశారు. ప్రకృతిని ఆరాధిస్తూ దాన్ని పెంచిపోషించాలన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే నాగరికతలో భారత్ ముందుందన్నారు. అలాగే భారతదేశంలో ఏపీ ముందుండాలని యువతకు పిలుపునిచ్చారు. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన నెహ్రూ యువ కేంద్ర జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల శేఖర్‌రావు నేతృత్వంలో జరిగిన ఈ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, డెప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీలు గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, కంభంపాటి రామ్మోహనరావు, విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీధర్, వైద్య-ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆయుష్ కమిషనర్ రేవతి, శాప్ చైర్మన్ పి.ఆర్.మోహన్, దక్షిణ మధ్య రైల్వే జి.ఎం. రవీంద్రగుప్తా, విజయవాడ డీఆర్ఎం అశోక్‌కుమార్, ఎన్సీసీ, స్కౌట్ అధికారులు, కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎ, పోలీసు కమిషనర్ గౌతమ్‌సవాంగ్, రెవెన్యు, క్రీడాఅధికారులు, యోగా గురువులు, ఎన్సీసీ కమాండెంట్ కల్న్ల్ రాజు పాల్గొన్నారు. అలరించిన యోగా విన్యాసాలు కార్యక్రమంలో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, విజయవాడలోని వీఎం రంగా నగరపాలక సంస్థ స్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన యోగా నృత్యాసనాలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయా జిల్లాలకు చెందిన యోగా గురువులను సీఎం సన్మానించారు. కానరాని ఎమ్మెల్యేలు... అంతర్జాతీయ యోగా వేడుకలకు నగర మేయర్ కోనేరు శ్రీధర్ మినహా ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులెవరూ హాజరుకాలేదు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కావడంతో వీరెవరూ హాజరుకాలేదని తెలుస్తోంది. -
రాజధానికి రెండు గంటల్లో చేరుకోవాలి
- వేగంగా నడిచే రైళ్లు నడపండి - రైల్వేమంత్రికి సీఎం వినతి - విజయవాడ-సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ రైలు ప్రారంభం సాక్షి, విజయవాడ: చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు నగరాల నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి తక్కువ సమయంలో వచ్చే, అత్యంత వేగంగా నడిచే రైళ్లు కావాలని సీఎం చంద్రబాబు రైల్వేమంత్రి సురేష్ ప్రభును కోరారు. ఆయా నగరాల నుంచి రైళ్లు రెండు గంటల్లో రాజధానికి చేరుకోవాలన్నారు. విజయవాడ- సికింద్రాబాద్ మధ్య కొత్తగా ఏర్పాటుచేసిన సూపర్‌ఫాస్ట్ రైలు 5.30 గంటల్లో కాకుండా నాలుగు గంటల్లోనే గమ్యం చేరుకునేలా వేగం పెంచాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం విజయవాడలోని రైల్వే ఇనిస్టిట్యూట్ హాలులో విజయవాడ-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును రైల్వే మంత్రి సురేష్ ప్రభు, సీఎంలు రిమోట్ వీడియో లింకు ద్వారా ప్రారంభించారు. గుంతకల్-కల్లూరు రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు, రూ.240 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం వద్ద మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కుకు శంకుస్థాపన చేశారు. 3 లాజిస్టిక్ పార్కులు: సురేష్ ప్రభు రైల్వే మంత్రి మాట్లాడుతూ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్రంలో మూడు లాజిస్టిక్ పార్కులను రూ.1,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇం దులో భాగంగా పొట్టి శ్రీరాములు నెల్లూ రు జిల్లా కృష్ణపట్నం వద్ద మల్టీమోడల్ లాజి స్టిక్ పార్కుకు ఇప్పుడు శంకుస్థాపన చేశామన్నా రు. రాబోయే రోజుల్లో విశాఖపట్నం, కాకినాడల్లో కూడా ఇదే తరహాలో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. అత్యుత్తమ వ్యవసాయ హబ్‌గా ఏపీ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యవసాయ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో ఏరువాక పున్నమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
‘ప్రభు’ వెనకడుగు!
రైల్వే జోన్ ప్రకటనపై సందిగ్ధం? విశాఖపట్నం : విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుపై కే ంద్ర ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తందానతాన పాడుతోంది. ఈ రైల్వే జోన్‌పై ప్రకటనే తరువాయి అంటూ తొలుత లీకులివ్వడం, వాటిని అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించడం పరిపాటిగా మారింది. ఇప్పుడు తాజాగా రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వస్తున్నారని, అదే రోజు విశాఖకు రైల్వే జోన్‌పై ప్రకటన చేస్తారని ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా హడావుడి చేస్తున్నారు. ఇటీవలే సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన ఈ నెల 20న విజయవాడ వస్తున్నారు. ఆ రోజు రాత్రి విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త రైలును ప్రారంభించనున్నారు. ఆ మర్నాడు విశాఖలో యోగా దినోత్సవంలో పాల్గొంటారని తొలుత సమాచారం అందించారు. అయితే తాజా సమాచారం ప్రకారం సురేష్ ప్రభు 21న విశాఖ రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోజు రైల్వే మంత్రి విశాఖ వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. దీనిపై రైల్వే వర్గాలు కూడా స్తబ్దుగానే ఉన్నాయి. రైల్వే మంత్రి రాకపై ఆ వర్గాలు స్పష్టత ఇవ్వడం లేదు. శనివారం రాత్రి వరకూ విశాఖలోని బీజేపీ శ్రేణులకు కూడా రైల్వే మంత్రి పర్యటన ఖరారయినట్టు సమాచారం లేదు. ఒకవేళ ఆయన ఆఖరి నిమిషంలో వచ్చినా విశాఖకు రైల్వే జోన్‌పై ప్రకటన అనుమానమేనని చెబుతున్నారు. ఆందోళనల భయంతోనే..? రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు తాత్సారం చేస్తూ వస్తోంది. విశాఖ రైల్వే జోన్ కోసం టీడీపీ, బీజేపీలు తప్ప వైఎస్సార్సీపీ, వామపక్షాలు, లోక్‌సత్తా, పలు ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, న్యాయవాదుల సంఘాలూ ఉద్యమాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఏప్రిల్‌లో అమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖకు రైల్వే జోన్ ఆకాంక్ష ఉత్తరాంధ్ర వాసుల్లో బలంగా నాటుకుపోయింది. ఈ పరిస్థితుల్లో యోగా దినోత్సవం నాడు విశాఖ పర్యటనకు వచ్చిన ఆయనను ఆయా పార్టీల నేతలు, వివిధ సంఘాల నాయకులు రైల్వే మంత్రిని గట్టిగా నిలదీసే అవకాశాలున్నాయి. ఈ సంగతి తెలిసే ఆయన విశాఖ రాకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రధానితో విభజన చట్టంలో పేర్కొన్న కీలకమైన రైల్వే జోన్‌పై ప్రకటన చేయించాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న వాదన కూడా వినిపిస్తోంది. -
వీవీఐపీల ఫోన్ ట్యాపింగ్ సంచలనం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తల దగ్గర్నుంచి, న్యాయవాదుల వరకు ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనే వార్త ఇపుడు సంచలనం మారింది. ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ 2001-06 మధ్య కాలంలో ఈ ట్యాపింగ్ కు పాల్పడిందని ఓ సుప్రీంకోర్టు న్యాయవాది వాదిస్తున్నారు. ఈ మేరకు ఆయన పిల్ కూడా దాఖలు చేశారు. క్యాబినెట్ మంత్రులు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి కార్పొరేట్ వేత్తలు, ప్రముఖ న్యాయవాదుల ఫోన్ల ను ఎస్సార్ సంస్థ ట్యాప్ చేసిందని ఆరోపిస్తున్నారు. ఈ నెల 1న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది సురేన్ ఉప్పల్ దీనిపై 29 పేజీల పిర్యాదు చేశారని కథనాలు తెలుపుతున్నాయి. ఈ ఫిర్యాదు మేరకు ఎస్సార్ మాజీ ఉద్యోగి అల్ బాసిత్ ఖాన్ ఈ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎస్సార్ సంస్థలో భద్రతా అధిపతిగా చేసే కాలంలో ఖాన్ ప్రముఖుల ఫోన్లకు అంతరాయం కలిగిస్తూ వారి సంభాషణలను రికార్డు చేసేవాడని, మేనేజ్ మెంట్ ఆదేశాల మేరకు అతను ఈ చర్యలకు పాల్పడినట్టు న్యాయవాది పేర్కొన్నారు. కొన్నేళ్లపాటు యథేచ్చగా సాగిన ఈ వ్యవహారం, 2011 మేలో తేడా వచ్చి, ఖాన్ ను సంస్థ నుంచి బయటికి పంపేశారని ఫిర్యాదులో చెప్పారు. ఈ పరిమాణానికి షాకైన ఖాన్ తన దగ్గరున్న టేపులను బయటపెట్టాలనుకున్నాడని, తనను కలిసేందుకు కూడా ప్రయత్నించాడని న్యాయవాది పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించడానికి ప్రస్తుతం ఖాన్ అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. ఫోన్లకు, మెసేజ్ లకు అతను అందుబాటులో లేడని ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టు చేసింది. ఈ విషయాలపై మరిన్ని నిజనిజాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫోన్ల ట్యాపింగ్ ను ఎస్సార్ సంస్థ ఖండిస్తోంది. న్యాయవాది స్టేట్ మెంట్ పూర్తిగా తప్పుడు సమాచారమని, అసలు దీనికి ఆధారాలే లేవని ఎస్సార్ సంస్థ పేర్కొంది. అతని డిమాండ్లను సంస్థ నెరవేర్చకపోవడం వల్లే, ఇలా నిందలు వేస్తున్నారని మండిపడింది. అసలు ఎస్సార్ సంస్థ ఎవరి పోన్లపై ఎప్పుడు నిఘా ఉంచలేదని, దీనికోసం అసలు వ్యక్తులనే నియమించలేదని తెలిపింది. ప్రస్తుత రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, మాజీ మంత్రి ప్రఫూల్ పటేల్, రామ్ నాయక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, ఏడీఏజీ చైర్మన్ అనిల్ అంబానీ, అతని భార్య టీనా అంబానీ, కంపెనీల్లోని వివిధ ప్రముఖ అధికారులు, మాజీ కేబినెట్ మంత్రి ప్రమోద్ మహాజన్, ఎంపీ అమర్ సింగ్ ల ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాని తెలుస్తోంది. ఈ లిస్టులో ఇంకా చాలామందే ప్రముఖులున్నట్టు సమాచారం.ఈ ట్యాపింగ్ వ్యవహరంపై రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. దీనిపై కేంద్రం వెంటనే విచారణ చేపట్టాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఓ దిగ్భ్రాంతికరమైన వ్యవహారమని, ప్రైవేట్ సర్వీసు ప్రొవేడర్లు చేసే ఈ చర్యలు దేశ రక్షణకు, భద్రతకు హానికరమని జేడీయూ అగ్రనేత శరద్ యాదవ్ అన్నారు. -
ఒక్క రూపాయికే ఫ్యూరిఫైడ్ వాటర్..!
న్యూఢిల్లీ : ఇక నుంచి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు చాలా తక్కువ ధరకు అంటే ఒక్కరూపాయికే శుద్ది చేసిన మంచినీరు దొరకనుంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) ప్రయాణికులకు శుద్ధిచేసిన మంచినీటిని చవగ్గా అందించేందుకు చొరవ తీసుకుంటోంది. ఇప్పటికే వివిధ రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు చవగ్గా ఫ్యూరిఫైడ్ నీటిని అందించడానికి 'వాటర్ పాయింట్' స్టాల్స్ ఏర్పాటుచేసింది. సెవన్ స్టేజ్ ఆర్ఓ మెకానిజమ్ ద్వారా స్టాల్స్ లో ఈ వాటర్ ను అందిస్తోంది. ప్రయాణికులు తెచ్చుకున్న బాటిల్స్ లేదా కంటైనర్లలో 300 మిల్లీలీటర్ల నీటిని కేవలం ఒక్క రూపాయే చెల్లించి నింపుకోవచ్చు. ఒకవేళ ప్రయాణికులు సొంత సీసాలు, క్యాన్లు లాంటివి తెచ్చుకోకపోయినా.. చాలా తక్కువ ధరకే స్టాల్స్ లో నీళ్లను పొందవచ్చు. ప్రస్తుతం ఈ సౌకర్యం న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లోనూ, కాన్పూర్ రైల్వే స్టేషన్ లోనూ ఐఆర్సీటీసీ అందుబాటులో ఉంచింది. ఇది పేద, సామాన్య ప్రజలకు ఎంతో సాయపడనుందని ప్రయాణికులు అంటున్నారు. -
21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ
♦ ఏపీలోని మార్గాల్లో ♦ రూ.22వేల కోట్ల పనులు ♦ రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెల్లడి సాక్షి, విజయవాడ/తిరుమల: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 21 రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల తరహాలో ఆధునికీకరిస్తామని రైల్వేమంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు. రాష్ట్రం నుంచి వెళ్లే రైలు మార్గాల్లో రూ.22వేల కోట్లతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం విలేకర్ల సమావేశంలో సురేష్ ప్రభు మాట్లాడుతూ కలకత్తా-చెన్నై, అమరావతి-బెంగళూరు మధ్య హైస్పీడ్ రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎయిర్ పోర్టులు, పోర్టులను రైల్వే లైన్లకు అనుసంధానం చేసే విషయంపై చర్చించామన్నారు. ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్యాలెస్ ఆన్ వీల్స్ తరహాలో రైలును ప్రారంభించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీని సరుకు రవాణా హబ్‌గా, ఎగుమతులు దిగుమతులు కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రత్యేక జోన్‌ను అవకాశం ఉన్నంత వరకు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ రైల్వేమంత్రితో సమావేశంలో రైల్వేలైన్లు, కొత్తరైళ్లు, సరుకు రవాణాకు ఏర్పాట్ల అంశాలపై చర్చించామని తెలిపారు. విభజన చట్టంలోనే ఉన్నందున రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరామని చెప్పారు. అంతకుముందు ఉదయం తిరుమల వెళ్లిన రైల్వే మంత్రి శ్రీవేంకటేశ్వర స్వామివారిని ద ర్శించుకుని మొక్కులు చెల్లించారు. -
అమరావతికి రైలు కనెక్టివిటీ కల్పిస్తాం: సురేష్ ప్రభు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు కనెక్టివిటీని కల్పిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. ఏపీలోని 21 రైల్వే స్టేషన్లను ఎయిర్పోర్ట్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. సరకు రవాణాకు ఏపీ హబ్‌గా ఉంటుందని తెలిపారు. రైల్వే జోన్ అంశాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావించారని, సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నామన్నారు. అమరావతి లింకేజీ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. ఏపీ రైల్వే మార్గాల్లో రూ.22 వేల కోట్ల పనులు జరుగుతున్నాయని సురేష్ ప్రభు తెలిపారు. అంతకు ముందు ఆయన శనివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. రాజ్యసభకు ఎంపికపై ఈ సందర్భంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఏపీ నుంచి ఎన్నిక కావడం సంతోషంగా ఉందని సురేష్ ప్రభు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే ప్రాజెక్టులపై చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
'ఏపీ అభివృద్ధికి రైల్వేశాఖ ద్వారా అన్ని అవసరాలు తీరుస్తాం'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రైల్వేశాఖ ద్వారా కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. శనివారం తిరుచానూరు క్రాసింగ్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి సురేష్ ప్రభు తిరుపతి రైల్వేస్టేషన్లో ఆన్లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం సురేష్ ప్రభు మాట్లాడుతూ.... ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత తిరుపతి నుంచి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. నిత్యం లక్షల మంది ప్రయాణికులతో కిటకిటలాడే తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం నిర్ధుష్ట ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన చెప్పారు. నెలరోజుల్లో టీటీడీ ఈవో, ఛైర్మన్‌ను ద.మ.రై. జీఎంతో వచ్చి కలుస్తానని తెలిపారు. రైల్వే బడ్జెట్ రూ. 40 వేల కోట్ల నుంచి రూ. లక్షా 20 వేల కోట్లకు పెరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైల్వే బడ్జెట్లో నిధులు పెరగడం వల్ల అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో మౌలిక వసతులదీ కీలక పాత్ర అని సురేష్ ప్రభు స్పష్టం చేశారు. అనంతరం సురేష్ ప్రభు విజయవాడకు బయలుదేరారు. అంతకుముందుకు సురేష్ ప్రభు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. -
ధ్రువపత్రాలు తీసుకున్న సురేశ్ ప్రభు, సుజనా, టీజీ
- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తా: సురేశ్ ప్రభు - విభజన హామీల అమలుకు ప్రయత్నిస్తాం: టీజీ, సుజనా - నేడు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎం సమక్షంలో చర్చించనున్న రైల్వే మంత్రి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు (బీజేపీ), వై.సత్యనారాయణచౌదరి (టీడీపీ), టీజీ వెంకటేశ్ (టీడీపీ)లు శుక్రవారం రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రాలు తీసుకున్నారు. ఎన్నికల అధికారి, ఏపీ శాసనసభ ఇన్చార్జ్ కార్యదర్శి కె. సత్యనారాయణ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకు వీరికి ధ్రువపత్రాలు అందజేశారు. ఏపీ నుంచి ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాలకు ఐదుగురు అభ్యర్ధులు నామినేషన్ దాఖలు చేయగా వైఎస్సార్సీపీ డమ్మీ అభ్యర్ధి సునందారెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోవటంతో నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లైంది. తొలుత ధ్రువపత్రం తీసుకున్న సురేశ్ ప్రభు వెంట కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, బీజేపీ నేతలు కావూరి సాంబశివరావు, కంతేటి సత్యనారాయణ రాజు తదితరులున్నారు. ఆ తరువాత సుజనా, టీజీ ధ్రువపత్రాలు తీసుకున్నారు. వీరి వెంట ఏపీ మంత్రి సిద్ధా రాఘవరావు, ఎంపీ అవంతి శ్రీనివాస్, ఏపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ టీడీ జనార్దనరావు తదితరులున్నారు. ఈ సందర్భంగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ ఏపీ నుంచి ఎన్నిక కావటం సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. సుజనా, టీజీ మాట్లాడుతూ విభ జన హామీలు అమలుకు కృషి చేయటంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. అంతకు ముందు ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి ఇచ్చిన విందులో వీరందరూ పాల్గొన్నారు. ఎన్నికల ధ్రువపత్రం తీసుకున్న అనంతరం ప్రభు తిరుమల వెళ్లారు. అక్కడ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని శనివారం ఉదయం విజయవాడ చేరుకుంటారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ రైల్వే శాఖ ఉన్నతాధికారులతో ఏపీ పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలపై చర్చిస్తారు. ఆ తరువాత విజయవాడలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్సీపీ అభ్యర్ధి వి. విజయసాయిరెడ్డి ధ్రువపత్రం తీసుకోవాల్సి ఉంది. -
కల్యాణ వెంకటేశుని సన్నిధిలో కేంద్ర మంత్రి
చంద్రగిరి(చిత్తూరు): కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకటేశ్వరస్వామిని శుక్రవారం రాత్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. కేంద్రమంత్రి వెంట టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, తదితరులు ఉన్నారు. -
నలుగురి ఏకగ్రీవం ఇక లాంఛనమే
రాజ్యసభ నామినేషన్లకు ముగిసిన గడువు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి నలుగురు రాజ్యసభ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక ఇక లాంఛ నమే కానుంది. వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీల నుంచి వీరు ఎన్నిక కానున్నారు. జూన్ 3న నామినేషన్ల ఉపసంహరణ అయిన తరువాత వీరి ఏకగ్రీవ ఎన్నికను అధికారి కంగా ప్రకటించనున్నారు. నామినేషన్ల దాఖ లుకు చివరిరోజు మంగళవారం ైవె ఎస్సార్సీపీ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి మరోసెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఇంతకుముందు 2 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి సతీమణి సునందరెడ్డి వైఎస్సార్సీపీ డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బీజేపీ, టీడీపీ అభ్యర్థులుగా కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, కేంద్ర మంత్రి వై. సుజనాచౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి టీజీ వెంకటేష్ నామినేషన్లు వేశారు. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య ఐదుకు చేరింది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు. ఆ తర్వాత సునంద తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటే.. మిగతా నలుగురు ఏకగ్రీవం గా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ ప్రకటిస్తారు. 3న సాయంత్రం 3 గంటలకు ఆ నలుగురూ రాజ్యసభకు ఎన్నికైనట్లుగా ధ్రువపత్రాలను అందజేస్తారు. ముగ్గురిని ప్రతిపాదించిన చంద్రబాబు బీజేపీ, టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి కె. సత్యనారాయణకు అందచేశారు. సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌ల అభ్యర్థిత్వాలను ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి, టీడీ పీ అధినేత చంద్రబాబునాయుడు తొలి సంతకం చేశారు. అనంతరం సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌లు తాము ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం ఉ. 11.07 గంటల నుంచి 11.50 గంటల మధ్య నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆయన అసెంబ్లీకి రావడం ఇదే తొలిసారి. బాబుకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభు లోకేష్, సుజనాచౌదరి, టీజీ వెంకటేష్ తదితరులతో కలసి అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడిన అనంతరం సురేష్ ప్రభు అక్కడి నుంచే చంద్రబాబుకు ఫోన్ చేసి తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతోనూ ప్రభు ఫోన్లో మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. -
'ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిద్యం వహించడం సంతోషంగా ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజ్యసభ అభ్యర్థిగా సురేష్ ప్రభు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం సురేష్ ప్రభు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము చేయవలసిందంతా చేస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. -
సురేశ్ ప్రభుకు సీటుపై వెంకయ్య హర్షం
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సురేశ్ ప్రభు పోటీ చేస్తున్నందుకు కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. తన మిత్రుడు సురేశ్ ప్రభు అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చిన టీడీపీకి కృతజ్ఞతలు తెలిపారు. -
రాజ్యసభకు ప్రముఖుల నామినేషన్లు
దాఖలు చేసినవారిలో వెంకయ్య, సిబల్, జైరాం, జెఠ్మలానీ న్యూఢిల్లీ: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా సోమవారం పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతిలు వివిధ పార్టీల తరఫున నామినేషన్ పత్రాలు సమర్పించారు. 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 11న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ దాఖలు చేసిన ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు బీరేంద్ర సింగ్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, కపిల్ సిబల్, అంబికా సోనీలు ఉన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఓం ప్రకాశ్ మాథుర్, రామ్‌కుమార్ వర్మ, హర్షవర్ధన్ సింగ్‌లు బీజేపీ తరఫున రాజస్థాన్ నుంచి నామినేషన్ వేశారు. వీరిలో హర్షవర్ధన్ రాజస్థాన్ మాజీ స్పీకర్ లక్ష్మణ్ సింగ్ మనువడు కాగా, వర్మ ఆర్బీఐ మాజీ ఉన్నతాధికారి. జెఠ్మలానీ, మీసా భారతి, జేడీయూ నేత శరద్ యాదవ్, రామచంద్ర ప్రసాద్ సింగ్‌లు ఆర్జేడీ-జేడీయూ కూటమి తరఫున బిహార్ నుంచి నామినేషన్లు సమర్పించారు. కూటమి తరఫున పోటీ చేస్తున్న అందరూ విజయం సాధిస్తారని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. కర్నాటక నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేష్, ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో పాటు కేసీ రామమూర్తి(కాంగ్రెస్), బీఎం ఫరూక్(జేడీఎస్)లు నామినేషన్ వేశారు. యూపీ నుంచి కపిల్ సిబల్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఛండీగఢ్‌లో బీజేపీ తరఫున గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్(హరియాణా), కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా సోనీ(పంజాబ్), జార్ఖండ్ నుంచి కేంద్ర మంత్రి నక్వీ(బీజేపీ), ఒడిషా నుంచి బీజేడీ తరఫున ప్రసన్న ఆచార్య, బిష్ణు దాస్, ఎన్.భాస్కర్ రావులు నామినేషన్ దాఖలు చేశారు. జూన్ 1న నామినేషన్లు పరిశీలిస్తారు. ఉపసంహరణకు చివరితేది జూన్ 3. 55 మంది సభ్యులు జూన్, ఆగస్టు మధ్యలో పదవీ విర మణ చేస్తుండడంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏపీ నుంచి సురేశ్ ప్రభు సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభకు మరో ఆరుగురు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు టీడీపీ సహకారంతో ఏపీ నుంచి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. సోమవారం విడుదల చేసిన రెండో విడత జాబితాలో సురేశ్‌ప్రభుతో పాటు మధ్యప్రదేశ్ నుంచి ఎం.జె.అక్బర్, మహారాష్ట్ర నుంచి వినయ్ సహస్రబుద్దే, డాక్టర్ వికాస్ మహాత్మే, యూపీ నుంచి శివ్ ప్రతాప్ శుక్లా, జార్ఖండ్ నుంచి మహేష్ పొద్దార్లు ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పేరు వినిపించినా అవకాశం దక్కలేదు. బ్రాహ్మణ వర్గానికి చెందిన శుక్లా ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన సీనియర్ నేత. వచ్చే ఏడాది యూపీ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు చోటు కల్పించారు. -
హైదరాబాద్ చేరుకున్న సురేష్ ప్రభు
హైదరాబాద్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరపున సురేష్ ప్రభు రాజ్యసభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ ఓ రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా, సురేష్ ప్రభుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు హైదరాబాద్ చేరుకున్నారు. ఆంద్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేయడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. -
ఏపీ నుంచి సురేష్ ప్రభు
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. సోమవారం బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ ఓ రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా, సురేష్ ప్రభుకు అవకాశం కల్పించారు. సురేష్ ప్రభు ఈ రోజు రాత్రి హైదరాబాద్‌కు చేరుకుని, రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీజేపీ రాజ్యసభ అభ్యర్థులుగా మహారాష్ట్ర నుంచి వినయ్ సహస్త్ర బుద్ధే, వికాస్ మహాత్మే, మధ్యప్రదేశ్ నుంచి ఎంజే అక్బర్, ఉత్తరప్రదేశ్ నుంచి శివప్రసాద్ శుక్లా, జార్ఖండ్ నుంచి మహేష్ పొద్దార్‌ను ఎంపిక చేశారు. ఏపీ నుంచి సురేష్ ప్రభు పోటీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఏపీ నుంచి సురేష్ ప్రభు రాజ్యసభకు ఎన్నిక కావడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా వెంకయ్య నాయుడు రాజస్థాన్ నుంచి బీజేపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజె, ఇతర మంత్రులు తన పేరును ప్రతిపాదించినట్టు ట్విట్టర్లో తెలియజేశారు. -
బలం లేకున్నా బరిలోకి
- రాజ్యసభ ఎన్నికలపై టీడీపీ నిర్ణయం - నాలుగో అభ్యర్థిని పోటీ పెట్టే యోచన - మరికొందరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించే యత్నాలు - సీటు కోరిన బీజేపీ... అంగీకరించిన చంద్రబాబు - రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పోటీ చేసే అవకాశం సాక్షి, హైదరాబాద్: గెలుపున కు అవసరమైన బలం లేకపోయినా నాలుగో అభ్యర్థిని రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పెట్టాలని తెలుగుదేశం పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. విజయవాడలో సోమవారం జరిగే పొలిట్ బ్యూరో, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో చర్చ అనంతరం ఈ విషయమై అధికారికంగా ప్రకటన చేయనుంది. పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పొలిట్‌బ్యూరో సభ్యులతో చంద్రబాబు ఆదివారం రాత్రి తిరుపతిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను నేతలు చంద్రబాబుకు కట్టబెట్టారు. ఈ మేరకు ఆయన సోమవారం విజయవాడలో పొలిట్‌బ్యూరో, ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతారు. నాలుగో రాజ్యసభ సీటును కూడా గెలుచుకోవాలంటే ఎంతమంది ఎమ్మెల్యేలు ఇంకా అవసరమవుతారో చంద్రబాబు ఆదివారం సమావేశంలో చర్చించారు. కనీసం 15 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సి ఉంటుందని పొలిట్‌బ్యూరో సభ్యులు స్పష్టం చేశారు. అయినా వెనక్కు తగ్గవద్దని, ఎంత ఖర్చైనా భరించేందుకు సిద్ధమని చంద్రబాబు చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు ఇప్పటికే వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. వారి ద్వారా మరో 15 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించి నాలుగో సీటు కూడా దక్కించుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. టీడీపీకీ ప్రస్తుతం ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులను గెలిపించుకునే బలం మాత్రమే ఉంది. నాలుగో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే తప్పకుండా ఎమ్మెల్యేల ఫిరాయింపును ప్రోత్సహించాలి. వాటిని ప్రోత్సహించేందుకే నాలుగో అభ్యర్థిని బరిలోకి దించాలనే ప్రతిపాదనను చంద్రబాబు చేశారని సమాచారం. రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను చంద్రబాబు చెప్పకపోయినా ప్రతి పార్టీ ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిని ఎంపీలుగా మళ్లీ రాజ్యసభకు పంపుతోందని పరోక్షంగా సుజనా చౌదరి పేరును ఖరారు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం నుంచి రైల్వే మంత్రి? రాష్ట్రంనుంచి బీజేపీ ఒక సీటు కోరుతోందని చంద్రబాబు సమావేశంలో చెప్పారు. గతంలో ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించిన నిర్మలా సీతారామన్ కర్ణాటక వెళుతున్నారు కాబట్టి ఆమె స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాల్సి ఉంటుందని, రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఇక్కడి నుంచి పోటీచేసే అవకాశం ఉందని తెలిపారు. రాజ్యసభ సీటు ఇవ్వాలని బీజేపీ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తనకు ఫోన్ చేసి కోరారని నేతలతో చెప్పారు. బీజేపీ కోరిన వెంటనే సీటు ఇస్తే చులకన అవుతాం కాబట్టి రాష్ట్రానికి ఏదో ఒక సాయం చేస్తామని బీజేపీ ప్రకటిస్తే సీటు ఇస్తామని ప్రతిపాదించానని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ఎస్సీ సామాజికవర్గం నుంచి హేమలత, మసాల పద్మజ, లలితకుమారి సీటు ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి సీటు ఇవ్వాలో చంద్రబాబు సోమవారం రాత్రికి ఖరారు చేసే అవకాశం ఉంది. మూడో సీటుకు బీసీల నుంచి బీటీ నాయుడు, ఎస్సీల నుంచి జేఆర్ పుష్పరాజ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే పలువురు నేతలు పుష్పరాజ్ పేరును సూచించగా చంద్రబాబు మౌనంగా తలాడించినట్లు సమాచారం. ఇక నాలుగో అభ్యర్థిగా నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని బరిలోకి దించుతారు. -
ఏపీ టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా సుజనా
తిరుపతి: కేంద్రమంత్రి సుజనా చౌదరి మరోసారి రాజ్యసభకు ఎంపిక కానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా సుజనా చౌదరి పేరును టీడీపీ ఖరారు చేసింది. ఆదివారం తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. టీడీపీ మరో రాజ్యసభ సీటును మిత్రపక్షమైన బీజేపీకి టీడీపీ కేటాయించింది. కేంద్రమంత్రి సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉంది. మూడో రాజ్యసభ సీటు రేసులో మాజీమంత్రి పుష్పరాజ్ పేరు వినిపిస్తోంది. నాల్గో రాజ్యసభ సీటుపై చర్చ కొనసాగుతోంది. -
500 కిలోమీటర్లు.. 2 గంటల్లో వెళ్లిపోవచ్చు!
న్యూఢిల్లీ: దేశంలో తొలి బుల్లెట్రైలు 2023 నాటికి పట్టాలెక్కుతుందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. భారత ఉపఖండ రైల్వేల్లో ఇది మైలురాయిగా నిలుస్తుందన్నారు. ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య అండర్ సీ టన్నెల్ లో ఈ బుల్లెట్రైలు పరుగు తీయనుంది. దీని గరిష్ట వేగం 350 కి.మీ కాగా, నిర్వహణా వేగాన్ని 320 కి.మీకి తగ్గించారు. దీని ద్వారా ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లోపు చేరుకోవచ్చు. నిర్మాణ పనులు 2018లో మొదలయ్యే అవకాశం ఉంది. రూ. 97,636 కోట్లతో ఈ ప్రాజెక్టును పట్టాలకెక్కించనున్నారు. ఇందులో 81 శాతం నిధులను జపాన్ నుంచి తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఈ మొత్తాన్ని 0.1 శాతం వార్షిక వడ్డీతో 50 ఏళ్లలో తిరిగి చెల్లించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను జపనీస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ(జేఐసీఏ) తయారు చేసిందని తెలిపారు. -
'విశాఖ రైల్వేజోన్‌పై మార్గాలు అన్వేషిస్తున్నాం'
ఢిల్లీ: విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ...రైల్వేజోన్ అంశంపై నిపుణులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సురేష్ ప్రభు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కంటే రాష్ట్రాలకు రెండింతలు బడ్జెట్‌ను పెంచామన్నారు. ప్రతి రోజుకు 7.8 కిలో మీటర్ల బ్రాడ్‌గేజ్ నిర్మాణం చేస్తున్నామని.. దీన్ని 19 కి.మీ వరకు పెంచడం తమ లక్ష్యమని ఆయన తెలిపారు. -
హామీ నిలబెట్టుకోండి..
♦ విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయండి ♦ కేంద్రానికి వైఎస్సార్సీపీ విజ్ఞప్తి ♦ రైల్వేమంత్రిని కలసి వినతిపత్రం అందజేసిన పార్టీ ప్రతినిధి బృందం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు విశాఖలో ప్రత్యేక రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ ప్రతినిధి బృందం శుక్రవారం కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభును కలసి వినతిపత్రం సమర్పించింది. బృందంలో పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, పి.వి.మిథున్‌రెడ్డి, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు తదితరులున్నారు. భేటీ అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడారు. చట్టప్రకారం ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆరు మాసాల్లోనే విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ను ఏర్పాటుచేయాల్సి ఉందని, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు తదితర డివిజన్లను ఇందులో కలపాల్సి ఉందని చెప్పారు. అయితే కేంద్రం ఇప్పటివరకు దీనిని ఆచరణలోకి తేలేదన్నారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన రైల్వేజోన్ ప్రకటించాలని మంత్రిని కలసి కోరామని, సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా ఇవ్వట్లేద ని, నిధులివ్వట్లేదని, అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారేగానీ ఢిల్లీ వచ్చి మాట్లాడిన పాపాన పోవట్లేదని ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి టీడీపీ నేతలపై మండిపడ్డారు. విభజన హామీలపై కేంద్రం మౌనం దాల్చడం బాధాకరమని గుడివాడ అమర్నాథ్ అన్నారు. -
24 గంటలు ఉచిత వైఫై
- కాచిగూడ, విజయవాడ రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ సేవలు షురూ - వీడియో లింకేజీ ద్వారా ప్రారంభించిన రైల్వే మంత్రి హైదరాబాద్సీటీ : కాచిగూడ, విజయవాడ రైల్వే స్టేషన్లలో 24 గంటల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని వినియోగించుకొనే హైస్పీడ్ వైఫై సేవలు గురువారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. న్యూఢిల్లీ రైల్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైల్వేమంత్రి సురేష్ ప్రభు, కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి వీడియో లింకేజీ ద్వారా వైఫై సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాచిగూడ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, దక్షిణమధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఎకె గుప్తా తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ ఇండియా’లో భాగంగా డిజిటల్ రైల్-డిజిటల్ ఇండియా’ కార్యక్రమానికి రైల్వే అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ఏజీఎం అన్నారు. దక్షిణమధ్య రైల్వేలోని అన్ని ఎ1, ఎ,బి కేటగిరి రైల్వేస్టేషన్లకు వైఫై సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో నాంపల్లి, వరంగల్, తిరుపతి, గుంటూరు, నాందేడ్ స్టేషన్లలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్లో వైఫై సేవలను ఆధునీకరిస్తామన్నారు. దక్షిణమధ్య రైల్వేలో మొత్తం 74 స్టేషన్లలో వైఫై సర్వీసులను దశలవారీగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. హోమంత్రి నాయిని మాట్లాడుతూ, దక్షిణమధ్య రైల్వే పనితీరు అభినందించారు. ప్రయాణికులకు సదుపాయాల కల్పనలో, సేవలలో దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఉన్న కాచిగూడ స్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సూచించారు. హైస్పీడ్ సామర్ధ్యం ఉన్న వైఫై సేవలు ప్రారంభించడం వల్ల ప్రయాణికులు ముఖ్యమైన ఫైళ్లను కూడా డౌన్లోడ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని, సాంకేతిక రంగంలో దక్షిణమధ్య రైల్వే అందజేస్తున్న సేవలు ఎంతో బాగున్నాయని నగర మేయర్ ప్రశంసించారు. సేవల వినియోగం ఇలా.... రైల్వేశాఖకు అనుబంధంగా పని చేస్తున్న రైల్‌టెల్ రైల్వేస్టేషన్లలో వైఫై సేవలను విస్తరిస్తోంది. గూగుల్ సాంకేతిక భాగస్వామిగా సేవలను అందజేస్తుంది. ప్రతి రోజు 40 వేల మంది ప్రయాణికులు రాకపోక లు సాగించే కాచిగూడ స్టేషన్లో 27 యాక్సెస్ పాయింట్లు, 12 యాక్సెస్ స్విచ్‌లు ఏర్పాటు చేశారు. స్టేషన్లో ఎక్కడి నుంచైనా వైఫై సేవలను పొందేవిధంగా హైస్పీడ్ నెట్‌వర్క్‌తో అనుసంధానించారు. దీనివల్ల ప్రయాణికులు అత్యంత వేగంగా ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. హెచ్డీ వీడియో ఫైల్స్‌ను కూడా క్షణాల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వాడొద్దు పక్కన పెట్టాలి. స్మార్ట్ ఫోన్, లేదా లాప్టాప్లో వైఫై రావాలంటే కింది విధంగా చేయాలి. -కాచిగూడ స్టేషన్లోకి ప్రవేశించగానే రైల్‌టెల్ వారి రైల్ వైర్ వై-ఫై నెట్వర్క్ డిస్ప్లే అవుతుంది. -వెంటనే దానికి కనెక్ట్ కావాలి. -బ్రౌజర్ ఓపెన్ చేయగానే మొబైల్ నెంబర్ అడుగుతుంది. -మీ మొబైల్ నెంబర్ ఇవ్వగానే మీకు నాలుగు అంకెల వన్‌టైమ్ పాస్వర్డ్ (ఒటిపి) వస్తుంది. -ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. -
కాచిగూడ రైల్వేస్టేషన్లో హైస్పీడ్ వైఫై
కాచిగూడ రైల్వేస్టేషన్లో గురువారం నుంచి ప్రయాణికులకు హైస్పీడ్ వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు న్యూఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు వీడియో లింకేజీ ద్వారా వైఫై సేవలను ప్రారంభిస్తారు. అదే సమయంలో కాచిగూడ రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం వద్ద జరుగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇప్పటికే సికింద్రాబాద్, విజయవాడ స్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. -
దక్షిణమధ్య రైల్వేకు అవార్డుల పంట
ఆరు విభాగాల్లో జాతీయ అవార్డులు విజయవాడ (రైల్వేస్టేషన్): 2015-16 సంవత్సరానికిగాను పలు విభాగాల్లో నిర్వహణ, సామర్థ్యం ప్రదర్శించినందుకు దక్షిణ మధ్య రైల్వే ఆరు జాతీయ స్థాయి అవార్డులు పొందింది. 61వ జాతీయ రైల్వే వారోత్సవాల ముగింపు వేడుకలు శనివారం భువనేశ్వర్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ప్రభు చేతుల మీదుగా దక్షిణమధ్య రైల్వే జి.ఎం రవీంద్రగుప్తా అవార్డులు అందుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, స్టోర్స్, సివిల్ ఇంజనీరింగ్, భద్రత, వాణిజ్య విభాగం, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే ఆరు జాతీయ అవార్డులు అందుకుంది. జాతీయ స్థాయిలో విశిష్ట సేవా అవార్డులు పి.చైతన్య (ఆపరేషన్స్ మేనేజర్ సికింద్రాబాద్ డివిజన్), ఎం.రమేష్‌కుమార్ (గుంతకల్ డివిజన్ ఇంజనీర్), డి.జయకర్ (సీనియర్ సెక్షన్ ఇంజనీర్), ఎన్.తారకేశ్వర్ (టెక్నీషియన్ లాలాగూడ) గెజిటెడ్ విభాగంలో హరికిషోర్ (సి.సి.ఎం. కార్యదర్శి), నాన్ గెజిటెడ్ విభాగంలో ఫిరోజ్ ఫాతిమా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే సహాయ మంత్రి మనోజ్‌సిన్హా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
దక్షిణ మధ్య రైల్వేకు అవార్డుల పంట
విజయవాడ: 2015-16 సంవత్సరానికి గాను పలు విభాగాల్లో నిర్వహణ, సామర్థ్యం ప్రదర్శించినందుకు దక్షిణ మధ్య రైల్వే ఆరు జాతీయ స్థాయి అవార్డులు పొందింది. 61వ జాతీయ రైల్వే వారోత్సవాల ముగింపు వేడుకలు శనివారం భువనేశ్వర్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే జి.ఎం రవీంద్రగుప్తా అవార్డులు అందుకున్నారు. ఆరోగ్య సంరక్షణ, స్టోర్స్, సివిల్ ఇంజినీరింగ్, భద్రత, వాణిజ్య విభాగం, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే ఆరు జాతీయ అవార్డులు అందుకుంది. జాతీయ స్థాయిలో విశిష్ట సేవా అవార్డులు పి.చైతన్య (ఆపరేషన్స్ మేనేజర్ సికింద్రాబాద్ డివిజన్), ఎం.రమేష్‌కుమార్ (గుంతకల్ డివిజన్ ఇంజినీర్), డి.జయకర్ (సీనియర్ సెక్షన్ ఇంజినీర్), ఎన్.తారకేశ్వర్ (టెక్నీషియన్ లాలాగూడ) గెజిటెడ్ విభాగంలో హరికిషోర్ (సి.సి.ఎం. కార్యదర్శి), నాన్ గెజిటెడ్ విభాగంలో ఫిరోజ్ ఫాతిమా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే సహాయ మంత్రి మనోజ్‌సిన్హా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
గతిమాన్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది
-
దాంతో పాటు ఈ ఏడు..
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత వేగంగా పయనించే ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్లే గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలును కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు మంగళవారం ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో ఇదే అత్యంత వేగంగా నడిచే రైలు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే దీన్ని అత్యంత అధునాతనంగా రూపొందించారు. అన్నిహంగులతో పట్టాలెక్కిన ఈ రైలు ఆగ్రా-డిల్లీ మధ్య 200 కిలోమీటర్ల దూరాన్ని గంటా నలభై నిమిషాలలో కవర్ చేస్తుంది. అంటే వంద నిమిషాలలో ఆగ్రా వెళ్లిపోవచ్చు. విశేషం ఏమిటంటే ఇదే దూరాన్ని ఇదే ట్రాక్ లో పాసింజర్ రైలు ఏడున్నర గంటల పాటు ప్రయాణిస్తుంది. ఈ నేపథ్యంలో దేశంలో నడిచే టాప్ 7 సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ మీ కోసం.. 1. న్యూఢిల్లీ- భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఇది గంటకు 150 కి.మీ వేగంతో దూసుకెళుతుంది. 2. ముంబై- న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ముంబై, ఢిల్లీ మధ్య నడిచే అతి వేగమైన రైళ్లలో ఇప్పటి వరకు దీనిది రెండోస్థానం 3. కాన్పూర్ - ఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ 4. న్యూఢిల్లీ హౌరా మధ్య నడిచే హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ 5. సెల్దా- న్యూఢిల్లీ దురంతో ఎక్స్ ప్రెస్ 6. న్యూఢిల్లీ అలహా బాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ 7. హజ్రత్ నిజాముద్దీన్ -ముంబై బాంద్రా గరీబ్ రథ్ ( పూర్తి ఎయిర్ కండిషన్డ్) -
పట్టాలెక్కిన గతిమాన్ ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు 'గతిమాన్ ఎక్స్‌ప్రెస్' పట్టాలెక్కింది. మంగళవారం ఉదయం రైల్వే మంత్రి సురేష్ ప్రభు జెండా ఊపి రైలును ప్రారంభించారు. దేశంలో 160 కిలోమీటర్ల వేగంతో నడిచే మొట్టమొదటి రైలు ఇది. ఈ తొలి హైస్పీడు రైలు ఢిల్లీ, ఆగ్రాల మధ్య పరుగులు పెడుతోంది. గతిమాన్ ఎక్స్‌ప్రెస్ హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఆగ్రా స్టేషన్ మధ్య గల 184 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 100 నిముషాల్లో చేరుకోనుంది. ఉదయం 10 గంటలకు ఢిల్లీ నిజాముద్దీన్ రైల్వేస్టేషన్లో బయలుదేరి, 11:40 నిమిషాలకు ఆగ్రా కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. గతిమన్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం తప్ప మిగితా అన్ని రోజులు అందుబాటులో ఉంటుంది. దీంతో 28 ఏళ్ల తర్వాత భారతీయ రైల్వే తన అత్యధిక వేగమైన రికార్డును తిరగరాసినట్లు అయింది. కాగా ప్రస్తుతం గంటకు 150 కిలోమీటర్ల వేగంతో భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ నడుస్తున్నది. గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారమ్, జీపీఎస్ బేస్డ్ పాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కోచ్‌లకు స్లైడింగ్ డోర్లతో పాటు ప్రయాణికులకు సమాచారం, వినోదం అందించేందుకు టీవీలు కూడా అందుబాటులో ఉన్నాయి. రైల్వే బడ్జెట్లో పేర్కొన్న విధంగా ఈ రైలులో విమాన సర్వీసులకు దీటుగా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. -
పట్టాలెక్కనున్న సెమీ హై స్పీడ్ రైలు
న్యూ ఢిల్లీ: దేశంలో 160 కిలోమీటర్ల వేగంతో నడిచే మొట్టమొదటి రైలు.. గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు మంగళవారం ఢిల్లీలో ప్రారంభించనున్నారు. రైల్వే బడ్జెట్లో పేర్కొన్న విధంగా ఈ రైలులో విమాన సర్వీసులకు దీటుగా ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫైర్ అలారమ్, జీపీఎస్ బేస్డ్ పాసెంజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కోచ్ లకు స్లైడింగ్ డోర్లతో పాటు ప్రయాణికులకు సమాచారం, వినోదం అందించేందుకు టీవీలు కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విమానాల్లో మాదిరిగానే సేవికలను నియమిస్తున్నామని, ఆహార పదార్థాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని తెలిపారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఆగ్రాలోని కాంట్ స్టేషన్ల మధ్య ప్రయాణించనున్న ఈ గతిమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు వారంలో ఆరురోజులు(శుక్రవారం తప్ప) ప్రయాణికులకు సేవలందించనుంది. -
ప్రభు స్పందించాడు! 20 నిమిషాల్లోనే సాయం!!
న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వశాఖ, రైల్వేమంత్రి సురేశ్ ప్రభు మరోసారి వార్తల్లో నిలిచారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న తన కొడుకును ఆదుకోవాలంటూ ఓ తండ్రి ట్విట్టర్లో చేసిన విజ్ఞప్తికి.. 20 నిమిషాల్లోనే స్పందించి, సాయమందించి మరోసారి ప్రయాణికుల నుంచి ప్రశంసలందుకున్నారు. @sureshpprabhu @RailMinIndia need medical attention..One of the child 6yrs old fell off upper seat..cut back of the head — Bibhuti (@goneinseconds) 31 March 2016 మార్చి 31న న్యూఢిల్లీ నుంచి వైష్ణో దేవీ ఆలయానికి తన కుటుంబంతోపాటు బిభూతి రైల్లో బయలుదేరి వెళ్లారు. అయితే, ప్రయాణిస్తుండగా అప్పర్ బెర్తు నుంచి తన ఆరేళ్ల కొడుకు కిందపడి.. తల వెనుకభాగంలో తెగిన గాయమైంది. ఈ విషయాన్ని ట్విట్టర్లో సురేశ్ ప్రభు, రైల్వే మంత్రిత్వశాఖలకు ట్యాగ్ చేస్తూ వెంటనే ట్వీట్ చేశారు బిభూతి. తన కొడుకుకు రక్తస్రావం జరుగుతోందని, వెంటనే సాయమందించాలని వేడుకున్నాడు. కనీసం బ్యాండేజ్ అయినా అందించాలని ప్రార్థించాడు. కేవలం 20 నిమిషాల్లోనే ఆయన ట్వీట్‌కు స్పందన లభించింది. రైల్వేమంత్రిత్వశాఖ బిభూతికి సాయమందించేందుకు ముందుకొచ్చింది. ఆయన ఫోన్ నంబర్ ఇవ్వాల్సిందిగా కోరింది. తదుపరి స్టేషన్ లుధియానాలో ఆ బాలుడికి వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికి తన బిడ్డకు సత్వరమే వైద్యసాయమందినందుకు బిభూతి రైల్వే మినిస్ట్రీకి ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపాడు. @sureshpprabhu @RailMinIndia it's bleeding..pls help..atleast bandage — Bibhuti (@goneinseconds) 31 March 2016 @sureshpprabhu @RailMinIndia I am thankful to all of you for providing medical facility to my son in quickest possible time. Awesome support — Bibhuti (@goneinseconds) 31 March 2016 నిజానికి గోయింగ్ ఇన్ సెకండ్స్ పేరిట ట్విట్టర్లో ఖాతా కలిగిన బిభూతి అంతకుముందు రైల్వేమంత్రిత్వశాఖను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. తాము ప్రయాణిస్తున్న రైల్లో టాయ్‌లెట్ సరిగ్గా లేదని, దోమలు కుడుతున్నాయని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు కూడా రైల్వేశాఖ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించింది. ఇటీవల ట్విట్టర్లో ప్రయాణికులు చేస్తున్న విజ్ఞప్తులకు రైల్వేశాఖ వెంటనే స్పందిస్తున్నది. గత ఫిబ్రవరిలో ఓ జంట తమ బిడ్డ రైల్లో తప్పిపోయిందని ఫిర్యాదు చేయగా.. వారి బిడ్డను తిరిగి వారికి చేర్చడంలో సాయపడింది. అలాగే ఇతన విజ్ఞప్తుల విషయంలోనూ రైల్వేశాఖ సహకారమందిస్తుండటంతో రైల్వేమంత్రి సురేశ్ ప్రభు ప్రయాణికుల మన్ననలు అందుకుంటున్నారు. -
408 రైల్వేస్టేషన్లలో ఈ కేటరింగ్ సదుపాయం
న్యూఢిల్లీ: ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయాల కల్పనతో పాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు మంగళవారం నాలుగు కొత్త సర్వీసుల్ని ప్రారంభించారు. 45 స్టేషన్లకే పరిమితమైన ఈ-కేటరింగ్ సర్వీసులను 408 స్టేషన్లకు విస్తరించామంటూ రైల్వే శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కేటరింగ్ విభాగంలో స్వయం సహాయక బృందాలకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించింది. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు ఈ-టికెట్ బుకింగ్ సదుపాయాన్ని రైల్వే మంత్రి ప్రారంభించారు. సరకు రవాణాను పెంచేందుకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. గూడ్స్ రైళ్ల ప్రయాణ దూరాన్ని 400 నుంచి 600 కి.మీ.కు పెంచారు. -
కొత్త పట్టాలెక్కిన రైలు బండి
అభిప్రాయం రాజకీయవేత్తలు.. భారత రైల్వేలనే అద్భుత సంస్థను ఓటర్లకు, నియోజకవర్గాలకు చిల్లర మల్లర ప్రయోజనాలను కలుగచేసేదిగా మార్చినప్పుడే అది కుప్పకూలడం మొదలైంది. ఏదేమైనా ఎట్టకేలకు మన రైల్వేలు సరైన దిశలో వేగంగా ముందుకు కదులుతున్నాయి. మన ప్రభుత్వాలు దుర్వార్తల విషయంలో సంస్థాగతమైన వైఖరిని చేబడుతుంటాయి. తగి నంత దీర్ఘకాలం పాటూ విస్మరిస్తే సమస్య దానికదే పరిష్కారమై పోతుందనేది మొదటి ఆశ. అది, తన తర్వాత వచ్చే మరో మంత్రి సమస్యగా మారేంత వరకు దాని పరిష్కారాన్ని వాయిదా వేస్తూ పోవడం రెండవది. బ్రిటిష్ పాలకుల నుంచి మనకు మహత్తర వారసత్వంగా సంక్రమించిన భారత రైల్వేలను వరుసగా మన ప్రభుత్వాలన్నీ క్షీణ దశకు చేర్చడానికి చెప్పదగిన వివరణ నిస్సందేహంగా ఇదొక్కటే. బ్రిటిష్ పాలకులు తమ వ్యూహాత్మక, వాణిజ్య అవసరాల కోసమే రైల్వేలను నిర్మించారనడం పూర్తిగా నిజం. అయితే ఆ క్రమంలో వారు దేశవ్యాప్తమైన మౌలిక సదుపాయాలను, నిర్వహణా వ్యవస్థను నెలకొల్పారు. అదే స్వతంత్ర భారత దేశపు జీవ వాహినిగా, ప్రజలకు సేవచేసే అద్భుత రవాణా వ్యవస్థగా మారింది. ఆర్థిక వ్యవస్థను పెంపొందింపజేస్తూ, ఐక్యతకు నిజమైన ఆర్థాన్నిచ్చే అనుసంధానాలను ఏర్పరుస్తోంది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజాభీష్టానుసారం సాగేది. మన స్వతంత్ర దేశంలో పౌరులు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి భారత రైల్వేలు వెళ్తాయి. వైమానిక సేవలు ఒక పౌర విమాన సంస్థ కట్టడిలోంచి విముక్తి చెందడానికి ముందటి ఐదు దశాబ్దాలలో రైల్వేలు... భిన్న భాషలు, సంస్కృతులతో కూడిన దేశంలోని నలుమూలల ప్రజలు ఒకరినొకరు తెలుసుకోడానికి, పరిచయాలు చేసుకోవడానికి సాధనమయ్యాయి. అవి ఆర్థిక వ్యవస్థ నాడీ స్పందన కూడా అయ్యాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్రమానుగతంగా ఆకలితో అల్లాడే పరిస్థితులు తలెత్తున్నప్పుడు రైల్వేలే ఆ ప్రదేశాలకు ఆహారాన్ని రవాణా చేశాయి. దేశ ఐక్యతకు ఏ ప్రభుత్వం కన్నా మిన్నగా కృషి చేసినది బాలీవుడ్ సినిమాయేనని అప్పుడప్పుడూ అంటుండటం కేవలం పరిహాసోక్తే కాదు. ప్రజా ప్రచార సాధనాల శక్తిని తక్కువగా అంచనా వేయలేం. అయినాగానీ, 1950లు, 1960లలో పొగలు చిమ్ముకుంటూ, ఆవిర్లు వదులుకుంటూ పరుగులు దీసిన రైళ్లూ, ఆ తర్వాతి దశాబ్దాలలో డీజిల్, విద్యుత్ రైళ్లూ దేశ ఐక్యతకు అంతకంటే ఎక్కువే చేశాయి. ప్రజాదరణ, జనాకర్షణకు తల వంచడం ప్రారంభమైనప్పటి నుంచి రైల్వేల క్షీణత ప్రారంభమైంది. పేర్లను ప్రస్తావిస్తే దివంగతులైన కొందరు గౌరవనీయుల పట్ల అగౌరవాన్ని చూపినట్టవుతుంది. కాబట్టి పేర్లు వద్దు గానీ. మహత్తరమైన, దాదాపు విభ్రాంతికరమైన మన రైలు వ్యవస్థను రాజకీయవేత్తలు... ఓటర్లకు, నియోజక వర్గాలకు చిల్లర మల్లర ప్రయోజనాలను చేకూర్చే సాధనంగా మార్చినప్పటి నుంచి అది కుప్పకూలిపోవడం ప్రారంభమైంది. నియామకాలు, దయ, అనుగ్రహాల కటాక్షంగా మారాయి. ప్రజలకు సేవ చేయడానికి బదులు రైల్వేలు రాజకీయవేత్తలకు ఊడిగం చేయడం ప్రారంభించాయి. ఒకప్పుడు పార్లమెంటు వార్షిక కార్యక్రమంలో ముఖ్యమైనదిగా ఉండిన రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజు స్వీయ వంచనగా దిగజారింది. ఒక బూటకపు ఫార్ములాను మంత్రులు పూర్తి స్థాయిలో వాడుకున్నారు. రైల్వేలు అవసానదశకు చేరే రోగగ్రస్తతలోకి దిగజారిపోతుంటే,.. ఒక ఆస్పిరిన్ దుకాణాన్ని ఏర్పాటు చేసి, నొప్పిని దాచి పెట్టేస్తే ఎవరూ ఆ రోగాన్ని గుర్తించలేరని వారు ఆశించారు. ఆస్పిరిన్ పరిష్కారానికి తోడు దీపావళి బాణసంచా లాంటి వాగ్దానాల గుప్పింపూ ఉంటుంది. వాటిలో అత్యధికం భ్రమాత్మకమైనవే. ఆహూతులంతా పెదవులు కదిలిస్తూ, త్రేన్పులు తీస్తూ ఉండే బెర్మిసైడ్ విందు భోజనానికి పౌరులను ఆహ్వానించడం లాంటిదే ఇది (అరేబియన్ నైట్స్ కథల్లో ఒకదానిలో బెర్మిసైడ్ అనే ధనికుడు, బిచ్చగాడికి ఇలాగే ఉత్తుత్తి భోజనం పెడతాడు). గత రైల్వే మంత్రులంతా బెర్మిసైడ్లే అనడం సమంజససం కాదు గానీ, చాలా మంది ఆ బాపతే. ఆవర్జా పుస్తకంలో సానుకూల చిట్టాలో కనిపించే వాటిలో రెండు పేర్లు గుర్తుకొస్తున్నాయి. మాధవ్‌రావ్ సింథియా, తాను ప్రవేశపెట్టిన ఏకైక రైల్వే బడ్జెట్లో ఈ సమస్యకు సంబంధించి సమంజస స్థాయి అవగాహనను కనబరి చారు. ఇక దినేష్ త్రివేదీ, ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు గానీ, ఆయన చేతులు కట్టేసి ఉండటంతో చేసింది దాదాపు ఏమీ లేదు. సురేశ్ ప్రభు ముందున్న సవాళ్లు చాలా స్పష్టంగానే ఉన్నాయి. ఆయన ఈ క్షీణతను ఆపడమే కాదు, దాన్ని వ్యతిరేక దిశకు మరల్చాల్సి ఉంది. క్షీణత విచ్ఛిన్నత దిశగా దిగజారిపోతుండగా ఆయన పగ్గాలు చేపట్టారు. ఆయన తన ఉత్పత్తిని మెరుగుపరచాల్సి ఉంది. ప్రయాణికుల కోచ్‌లు, సరుకు రవాణా బోగీలు, రైళ్లు, పట్టాలు, సేవల నాణ్యత, వ్యవస్థలు, స్టేషన్లు అన్నిటినీ ఆయన మెరుగుపరచాలి. అది కూడా అనూహ్యమైన వేగంతో చేయాలి. ఎటు చూసినా మీకు సమస్యలే కనిపిస్తాయి. యూపీఏ ప్రభుత్వ హయాం నాటి భయానక కథనాలను గుర్తు చేసుకోవడంలో అర్థం లేదు. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకునేది సమస్యలను పరిష్కరించడానికే తప్ప, గతాన్ని తలుచుకుని నిట్టూర్పులు విడవడానికి కాదు. గత ప్రభుత్వం ఘోరంగా లేకపోతే వారు దాన్ని ఎందుకు మారుస్తారు? ప్రభును తీవ్రంగా విమర్శించేవారు సైతం రైల్వేలందించే సేవలలో, పర్యావరణంలో నాణ్యత పెరుగుతున్న క్రమంలో ఉన్నదని ఒప్పుకుంటారు. దేశంలోని వందలాది పట్టణాలలోని 400 రైల్వే స్టేషన్లను చిన్నపాటి ఆర్థిక కేంద్రాలుగా పరివర్తన చెందించడం ప్రభు సాఫల్యతకు కీలకమైన కొలబద్ద అవుతుంది. తాజాగా పెట్టుబడులను పెట్టడం ద్వారా రద్దీ అత్యధికంగా ఉన్న మార్గాల్లో ప్రపంచ స్థాయి రైళ్లను ప్రవేశపెట్టి సాధించాల్సిన పరివర్తన అంతకంటే కష్టమైన సవాలు. ముంబై, అహ్మదాబాద్‌ల మధ్య హైస్పీడ్ రైలును ప్రవేశపెట్టడం అసమంజసమని లేదా ఉన్నత వర్గాలకు అనుకూలమైనదనీ భావించేవారు... రైలు మార్గాల విద్యుదీకరణను చేపట్టినప్పుడు అది అన్ని చోట్లా ఒకేసారి మొదలు కాలేదని గుర్తుకు తెచ్చుకోవాలి. మన రైల్వేలు భారీ సంస్థ కాబట్టి దానికి పెట్టాల్సిన పెట్టుబడులు కూడా భారీగానే ఉంటాయి. పెద్ద ఎత్తున వాటిని విదేశాల నుంచి సమకూర్చుకోవడం అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ వంటి దేశాలతో అందుకు కావాల్సిన కష్టభరితమైన సన్నాహక కృషిని చేశారు. అయితే ఆ రైలు బండి కదిలేలోగా పరిపూర్తి చేయాల్సిన గురుతర కర్తవ్యాలు చాలానే ఉంటాయి. ఏదేమైనా ఎట్టకేలకు మన రైల్వేలు సరైన దిశలో కదలుతున్నాయి. వేగంగా వెనుకకు గాక, వేగంగా ముందుకు పోతున్నాయి. ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు, వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
ఏపీ ఎక్స్‌ప్రెస్ వేగం అంతే..!
న్యూఢిల్లీ : విశాఖ-న్యూఢిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా 110 కి.మీ. వేగంతో మాత్రమే వెళ్తుందని కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేసింది. అందువల్ల ప్రస్తుత ప్రయాణ సమయాన్ని కుదించడం సాధ్యం కాదని పేర్కొంది. రాజ్యసభలో సభ్యుడు ఎం.ఎ.ఖాన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు శుక్రవారం సమాధానమిచ్చారు. ఈ ఎక్స్‌ప్రెస్ పేరును రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా గానీ, దురంతో ఎక్స్‌ప్రెస్‌గా గానీ మార్చడం సాధ్యపడదన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలను దేశరాజధానితో అనుసంధానించేందుకు ఉద్దేశించినందున 19 హాల్టింగ్‌లతో నడుస్తోందని చెప్పారు. రాజధాని, దురంతో తరహాలో పనిచేసే అవకాశం కూడా ఈ ఎక్స్‌ప్రెస్‌కి లేదని తెలిపారు. అందువల్ల అటు వేగం పెంచడం గానీ, ఇటు హాల్టింగ్‌లు కుదించడం గానీ సాధ్యపడదని చెప్పారు. అయితే ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకి నాన్ -ఏసీ బోగీలను కలపాలని వినతులు వెల్లువలా వచ్చాయని గుర్తు చేశారు. అయితే 2014-15 బడ్జెట్లో ఏపీ ఎక్స్‌ప్రెస్‌గా ప్రకటించిన నేపథ్యంలో దానిని మార్చలేమని వివరించారు. -
'గౌరవం సరే.. కష్టాల్ని పట్టించుకోరా?'
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకొని తమకు అరకొర సంతోషాన్ని మాత్రమే ఇచ్చిన కేంద్రం ప్రధాన సమస్యను మాత్రం పక్కకు పెట్టిందని రైల్వే సహాయక్ (కూలీలు)లు అభిప్రాయపడ్డారు. ఆర్థిక సమస్య తమను పట్టి పీడిస్తున్న అసలైన సమస్య అని, దీంట్లో నుంచి తమను బయటపడేసేలా నిర్ణయం తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని చెప్పారు. అయితే, బడ్జెట్ లో ప్రకటించినట్లుగా కొత్త డ్రెస్ కోడ్, కూలీలనే పేర్ల స్థానంలో సహాయక్ అనే కొత్త పేరు తమకు కొంత గౌరవాన్ని మాత్రం కట్టబెడుతుందని అభిప్రాయపడ్డారు. 'కొత్త యూనిఫాం, స్టేటస్ మాకు గౌరవాన్ని ఇస్తుంది. ఇది మా అందరికి మంచి విషయమే. కానీ మాకు అతిపెద్ద సమస్య ఆర్థికపరమైన సమస్య. దీన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. మాకంటూ ముందే నిర్ణయించబడిన రేట్లు లేనందువల్ల ప్రయాణీకులతో నిత్యం వాగ్వాదాలు తప్పడం లేదు. ప్రయాణీకులు మా కష్టం అర్థం చేసుకోరు. కేంద్ర ప్రభుత్వం కూడా తమ రైల్వే బడ్జెట్లో ఇంత వరకు ఈ విషయాన్ని స్పృషించలేదు' అని రైల్వే సహాయకులు అంటున్నారు. -
అరకొర విదిలింపులే
బడ్జెట్లో తెలంగాణకు రూ. 790 కోట్లు కేటాయింపు ♦ ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2,823 కోట్లు ♦ హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్-2 పీపీపీ విధానంలోనే.. ♦ ఊసేలేని కాజీపేట డివిజన్, రైల్వే విశాఖ జోన్ ♦ విభజన చట్టంలోని హామీలకూ మొండిచెయ్యే! సాక్షి, న్యూఢిల్లీ రైల్వే బడ్జెట్లో తెలంగాణకు అరకొర నిధులే దక్కాయి. రాష్ట్రానికి మొత్తంగా రూ. 790 కోట్లు కేటాయించారు. రెండు కొత్త మార్గాలకు నిధులు కేటాయించడంతోపాటు మూడు కొత్త మార్గాలకు సర్వే పనులను చేపట్టనున్నట్లు రైల్వే బడ్జెట్లో ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలను మాత్రం విస్మరించారు. కాజీపేటలో రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీల ఏర్పాటు ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కొత్తగా రైళ్లను కూడా వేయలేదు. హైదరాబాద్‌లో ఘట్కేసర్-యాదాద్రి ఎంఎంటీఎస్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించినా... దానిని పీపీపీ విధానంలోనే ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా రైల్వేమంత్రి సురేష్‌ప్రభు తన బడ్జెట్ ప్రసంగంలో ఇటు తెలంగాణ ప్రస్తావనగానీ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనగానీ తీసుకురాకపోవడం గమనార్హం. ఇక ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 2,823 కోట్లు కేటాయించారు. ఏపీలో రెండు నూతన రైల్వే మార్గాలకు నిధులివ్వడంతోపాటు కొత్తగా పది మార్గాలకు సర్వే పనులు కేటాయించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను సుందరీకరిస్తామని, విజయవాడ-ఖరగ్‌పూర్ మధ్య సరుకు రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. -
ఏపీకి రిక్తహస్తం!
♦ రూ.2,823 కోట్ల పనులు కేటాయింపులతోనే సరి ♦ ఏపీలో 9 కొత్త మార్గాలకు సర్వే ♦ విశాఖ రైల్వే జోన్ ఊసే లేదు ♦ విభజన చట్టంలోని హామీలకూ కేంద్రం మొండి చెయ్యే సాక్షి, న్యూఢిల్లీ: ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర రైల్వేశాఖ రిక్తహస్తం చూపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన హామీలనూ విస్మరించింది. అరకొర కేటాయింపులతో చేతులు దులుపుకుంది. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పెడచెవిన పెట్టింది. కొత్త రైళ్ల ఊసే లేదు. రాష్ట్రానికి 2016-17లో మొత్తంగా రూ.2,823 కోట్ల మేర ప్రాజెక్టుల పనులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఏపీలో కొత్తగా 10 మార్గాలకు సర్వే పనులు కేటాయించారు. రాష్ట్రంలో రెండు నూతన రైల్వే మార్గాలకు నిధులు కేటాయించారు. రైల్వే మంత్రి సురేష్‌ప్రభు తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే చేయకపోవడం గమనార్హం. తిరుపతి రైల్వే స్టేషన్‌ను సుందరీకరిస్తామని ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే విజయవాడ-ఖరగ్‌పూర్ మధ్య సరకు రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇలా.. యూపీఏ-2 హయాంలో సగటున ఏటా రూ.886 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఎన్డీయే హయాంలో సగటు రూ.2,195 కోట్లుగా ఉంది. తాజాగా రూ.2,823 కోట్లు కేటాయించారు. కొత్తగా రైల్వే మార్గాల నిర్మాణం మార్గం దూరం అంచనా(రూ.కోట్లలో) గుంతకల్లు-గుంటూరు (డబ్లింగ్) 443 4,000 గద్వాల-మాచర్ల 184 3,500 డబ్లింగ్‌కు కేటాయింపులు రూ.కోట్లలో గుత్తి-ధర్మవరం-బెంగళూరు 30 కల్లూరు-గుంతకల్లు 60 రేణిగుంట-ధర్మవరం-వాడీ బైపాస్ 75 విజయవాడ-కాజీపేట్-బైపాస్ లైన్ 27 గత మూడేళ్లుగా ఇలా.. 2014-15 రూ.1,105 కోట్లు 2015-16 రూ.2,659 కోట్లు 2016-17 రూ.2,823 కోట్లు నిర్మాణంలో ఉన్న మార్గాలకు కేటాయింపులు (రూ. కోట్లలో) మార్గం కేటాయింపు నంద్యాల-ఎర్రగుంట్ల 50 మాచర్ల-నల్లగొండ 0.2 గద్వాల-రాయిచూర్ 5 కాకినాడ-పిఠాపురం 50 కోటిపల్లి-నర్సాపూర్ 200 ఓబులవారిపల్లె-కృష్ణపట్నం 100 జగ్గయ్యపేట-మేళ్లచెర్వు-జాన్‌పహాడ్ 110 కడప-బెంగళూరు 58 నడికుడి-శ్రీకాళహస్తి 180 గూడూరు-దుగరాజపట్నం 5 భద్రాచలం-కొవ్వూరు 15 కంభం-ప్రొద్దుటూరు 1 -
నిరాశే మిగిలింది నేస్తం
సురేష్ ప్రభు రైల్వేబడ్జెట్ నగరానికి నిరాశే మిగిల్చింది. హైదరాబాదు నగరానికి ఈ సారి ప్రాధాన్యత లభిస్తుందనుకున్న నగరవాసికి నిరాశే మిగిలింది. ప్రధాన రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తామన్నారే కానీ.. ఆ వివరాలేవీ ప్రకటించలేదు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు కాస్త ఊరటనిచ్చింది. రాజేంద్రనగర్ ప్రజల చిరకాల వాంఛ అయిన ఎంఎంటీఎస్ పొడిగింపు అంశం ఈ బడ్జెట్లో కూడా లేదు. గురువారం రైల్వేమంత్రి ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్‌పై పలువురు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.. ఆ వివరాలు వారి మాటాల్లోనే.. - సికింద్రాబాద్/రాజేంద్రనగర్/పహాడీషరీష్/కాచిగూడ రైల్వే బడ్జెట్ భేష్ ఆడంబరాలు,అబద్దాలు లేకుండా కేంద్ర రైల్వే బడ్జెట్ వాస్తవానికి అద్దం పట్టింది. తెలంగాణాకు మొత్తం 569 కోట్ల ప్రాజెక్ట్‌లను కేటాయించారు. ఇందులో ముఖ్యంగా మల్కాజిగిరి నియోకజవర్గంలోని చర్లపల్లి టర్మినల్ విస్తరణ, అధునాతన సదుపాయాల కోసం రూ.80 కోట్లను కేటాయించటం సంతోషకరమైన అంశం. చర్లపల్లి టర్మినల్‌ను విస్తరిస్తే ప్రయాణీకులు రైళ్లలోనే గంటల తరబడి నిరీక్షించే అవసరం లేకుండా పోతుంది. అదే విధంగా సికింద్రాబాద్ స్టేషన్ నుండి వెళ్లే ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనంగా రెండు అన్ రిజర్వుడు బోగీలను వేయాలని నిర్ణయించటం హర్షణీయం. - సీహెచ్ మల్లారెడ్డి, ఎంపీ మల్కాజిగిరి జంట నగరాలకు మొండిచేయి రైల్వే బడ్జెట్ జంట నగరాల ప్రయాణీకులను నిరాశ పరిచింది. గతంలో సికింద్రాబాద్ స్టేషన్ ఎన్డీఏ ప్రకటించిన ప్యాకేజీని పక్కన బెట్టి, కేవలం యాదాద్రికి ఎంఎంటీఎస్ లైన్, చర్లపల్లి టర్మినల్‌కు నిధులు తప్పితే మరేవీ లేవు. - నగేష్ ముదిరాజ్, రైల్వే సలహా సంఘం మాజీ సభ్యులు ఆమోదయోగ్యం బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉంది. టికెట్ చార్జీలను పెంచకపోగా, ప్రయాణికులకు వసతుల కల్పనలో పెద్దపీట వేశారు. రైలు ప్రయాణాల్లో భద్రత ప్రమాణాలు పెంచేందుకు, బీమా వంటి సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేయడం అభినందనీయం. బడ్జెట్లో ప్రతిపాదించిన అంశాలను త్వరగా అమలులోకి తెస్తే మంచిది. -రమేశ్, ప్రయాణికుడు వసతులు కరువు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ నిరాశ పరిచేలా ఉంది. ఎంఎంటీఎస్ రెండో దశకు అధిక ప్రాధాన్యత ఇస్తారనుకున్నాం. సికింద్రాబాద్ వంటి పెద్ద రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు కూడా ప్రాధాన్యం లభించలేదు. ప్రయాణికులకు వసతులు కరువై ఇబ్బందుల పాలవుతున్నా స్టేషన్ల ఆధునీకరణ కోసం బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం విచారకరం. -ఖాజా మోహినుద్దీన్, ప్రయాణికుడు -
గ్లోబల్ మార్కెట్లలో రైల్వే ‘రూపీ’ బాండ్లు
నిధుల సమీకరణ కోసం కొత్త రూట్.. న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ఇక గ్లోబల్ మార్కెట్ల బాట పట్టనున్నాయి. రైల్వే మౌలిక సదుపాయాల కోసం వచ్చే ఆర్థిక సంవత్సరం(2016-17)లో రూ.1.21 లక్షల కోట్ల భారీ వ్యయ ప్రణాళికలను ప్రకటించిన నేపథ్యంలో రైల్వే శాఖ నిధుల సమీకరణ కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే విదేశీ మార్కెట్లలో రూపీ బాండ్లను జారీ చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు బడ్జెట్లో ప్రకటించారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్ల ఏర్పాటు, కొత్తగా ప్రభుత్వ-ైప్రైవేటు భాగస్వామ్యాలు(పీపీపీ), వివిధ సంస్థలతో జట్టుకట్టడం ద్వారా ప్రాజెక్టులకు అవసరమైన నిధులను సమకూర్చుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది రైల్వేల సగటు పెట్టుబడి వ్యయాలు దాదాపు రెట్టింపు కానున్నాయని.. గతంలో ఎన్నడూ ఇంతగా పెంచలేదని చెప్పారు. 2009-14 వరకూ రైల్వేల సగటు వార్షిక పెట్టుబడి వ్యయాలు రూ.48,100 మాత్రమేనని ప్రభు వివరించారు. ‘దేశంలో మౌలిక వృద్ధికి రైల్వేలు ఇంజిన్‌గా పనిచేయనున్నాయి. తొలిసారిగా భారతీయ రైల్వేలు పెట్టుబడి నిధుల కోసం అంతర్జాతీయ మార్కెట్లలోకి అడుగుపెట్టనున్నాయి. వెచ్చించే ప్రతి రూపాయికీ ఆర్థిక వ్యవస్థలో ఐదు రూపాయల మేర ఉత్పాదకతను పెంచే సామర్థ్యం రైల్వేలకు ఉంది. దేశ ఆర్థిక వృద్ధి రేటుపై రైల్వేల పెట్టుబడి ప్రణాళికలు అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపుతాయి’ అని ఆని ప్రభు వ్యాఖ్యానించారు. -
కొత్త రైళ్లు నిల్
కొత్త రైళ్లకు రెడ్‌సిగ్నల్ మూడు ప్రాజెక్టులతో సరి ఉమ్మడి ప్రాజెక్టులకే గ్రీన్‌సిగ్నల్ స్పష్టతలేని రైల్వేస్టేషన్ల అభివృద్ధి రూ.330 కోట్లతో యాదాద్రికి ఎంఎంటీఎస్ చర్లపల్లి, నాగులపల్లిలో రైల్వేటర్మినళ్లు సిటీబ్యూరో: రైల్వే బడ్జెట్ ఊరించి ఉసూరుమనిపించింది. మరోసారి నిరాశే మిగిలింది. ముచ్చటగా మూడు అరకొర ప్రాజెక్టులు తప్ప నగరానికి పెద్దగా ఒరిగింది శూన్యం. సికింద్రాబాద్ నుంచి జహీరాబాద్ తప్ప కొత్త లైన్ల ఊసే లేదు. సురేష్ ప్రభు బడ్జెట్ రైలు నగరంలో ఆగీ ఆగకుండానే పరుగులు పెట్టింది. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. కానీ నిధుల కేటాయింపు లేదు. ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే అంశంలోనూ స్పష్టత లేదు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు గతంలో చేసిన ప్రతిపాదన అటకెక్కింది. వరల్క్లాస్ స్టేషన్ స్థాయిని కాస్తా ప్రస్తుతం ఏ-1 కు హోదాకు పరిమితం చేశారు. మొత్తంగా రూ.330 కోట్లతో యాదాద్రికి ఎంఎంటీఎస్ పొడిగింపు, రూ.80 కోట్లతో చర్లపల్లిలో 4వ రైల్వే టర్మినల్, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో వట్టి నాగులపల్లిలో 5వ రైల్వే టర్మినల్ ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో నగరానికి లభించాయి. ఈ మూడు ప్రాజెక్టుల్లోనూ దక్షిణమధ్య రైల్వే, రాష్ర్టప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో పనులు చేపడుతారు. అయ్యే ఖర్చులో రాష్ర్టం వాటాగా 51 శాతం, రైల్వే వాటాగా 49 శాతం చొప్పున భరిస్తాయి. మొత్తంగా రైల్వే బడ్జెట్ ఈసారి ఒకింత ఆశ..మరింత నిరాశనే మిగిల్చింది. యాదాద్రికి ఎంఎంటీఎస్... లక్షలాది మంది సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్ పరుగులు తీయనుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఈ ప్రాజెక్టుకు రైల్వేశాఖ కూడా ప్రాధాన్యతనిచ్చింది. సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వరకు చేపట్టిన రెండో దశ ఎంఎంటీఎస్ పనులు సాగుతుండగా... ఇప్పుడు మూడో దశ కింద ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 34 కిలోమీటర్ల వరకు రైల్వేలైన్లను పొడిగించి విద్యుదీకరిస్తారు. రూ.330 కోట్లతో చేపట్టనున్న ఈ పనుల్లో రాష్ర్టప్రభుత్వం తన వంతు వాటాగా 51 శాతం నిధులను సమకూర్చనుంది. ఈ ఆర్థిక సంవత్సరం పనులు ప్రారంభించి వచ్చే రెండు, మూడేళ్లలో దీనిని పూర్తి చే స్తారు. నగరంలోని ఆరు మార్గాల్లో చేపట్టిన రెండో దశ ప్రాజెక్టును వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశ పూర్తయిన అనంతరం మూడోదశ కింద యాదాద్రికి ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తారు. దీంతో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులు సికింద్రాబాద్ నుంచి నేరుగా రాయగిరి వరకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల వరకు రోడ్డు మార్గంలో యాదాద్రికి వెళ్లవ లసి ఉంటుంది. నగరం నుంచి నేరుగా యాదగిరిగుట్టకు వెళ్లే రైల్వే సదుపాయం అందుబాటులోకి రావడంతో ఈ మార్గంలో వ్యాపార కార్యకలాపాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి మహర్దశ పట్టనుంది. ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కోరడంతో రైల్వేశాఖ ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిచ్చింది. ఎంఎంటీఎస్ పొడిగింపునకు అయ్యే ఖర్చులో రాష్ర్టం తన వంతు వాటాను భరిస్తుందని సీఎం స్పష్టం చేయడంతో రైల్వేశాఖ తన వంతు వాటాను కూడా అందజేసి ఎంఎంటీఎస్‌ను పొడిగించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఎంఎంటీఎస్ ప్రస్తానం ఇదీ... 2003లో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టారు. సికింద్రాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, నాంపల్లి-ఫలక్‌నుమా, తదితర మార్గాల్లో లోకల్ రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. {పస్తుతం ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. లక్షా 40 వేల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు.హైదరాబాద్ నగర శివార్లను కలుపుతూ 2013లో ఎంఎంటీఎస్ రెండో దశను ప్రారంభించారు. సికింద్రాబాద్-ఘట్కేసర్, మౌలాలి-సనత్‌నగర్, పటాన్చెరు-తెల్లాపూర్, ఫలక్‌నుమా-ఉందానగర్ తదితర మార్గాల్లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు జరుగుతున్నాయి.ఉందానగర్-శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రెండో దశలో పొడిగించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ విమానాశ్రయంలో రైల్వేస్టేషన్ నిర్మాణానికి జీఎమ్మార్ నిరాకరించడంతో ప్రస్తుతానికి ఆ లైన్ నిర్మాణం వాయిదా పడింది. తగ్గనున్న భారం... ప్రతి రోజు సుమారు 250కి పైగా రైళ్లు నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 4 లక్షల మంది నిత్యం ఈ స్టేషన్లను సందర్శిస్తున్నారు. దీంతో ఈ మూడింటిపైన ఒత్తిడి బాగా పెరిగింది. ఔటర్ రింగురోడ్డుకు అందుబాటులో ఉన్న చర్లపల్లిలో రైల్వే టర్మినల్ ఏర్పాటు చేయడం వల్ల విజయవాడ , కాజీపేట్ మీదుగా వచ్చేరైళ్లను చర్లపల్లిలో నిలుపుతారు. ఎఫ్‌సీఐ, ఎన్ఎఫ్సీ, హెచ్‌పీసీఎల్, ఐఓసీ వంటి భారీ పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో ఉండడం రవాణా రంగం అభివృద్ధికి విస్తృత అవకాశంగా రైల్వే భావించింది. ప్రస్తుతం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లలో కనీసం 150 రైళ్లను చర్లపల్లి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఢిల్లీ, ముంబయి, విజయవాడ, విశాఖ, తిరుపతి, చెన్నై తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లను ఇక్కడి నుంచి నడిపేందుకు అవకాశం ఉంటుంది. స్టేషన్ల అభివృద్ధికి నిధులే లేవు... దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్ల రీ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా నగరంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా ప్రకటించారు. కానీ ఇందుకోసం ఎలాంటి నిధు లు కేటాయించలేదు. 2010లో ప్రతిపాదించిన సికిం ద్రాబాద్ వరల్డ్‌క్లాస్ అంశాన్ని పక్కన పెట్టి రీ డెవలప్మెంట్ పేరుతో ఏ తరహా అభివృద్ధి చేస్తారనే అం శంలో స్పష్టత లేదు. నాంపల్లి రైల్వేస్టేషన్లో లిఫ్టులు, ఎస్కలేటర్ల ఏర్పాటు అంశాన్ని పక్కన పెట్టేశారు. కొత్త రైళ్ల ఊసే లేదు... {పయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి పలు మార్గాల్లో కొత్త రైళ్లను నడపాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. మరోవైపు గతంలో ప్రకటించిన రైళ్ల ప్రస్తావన కూడా లేకుండానే ఈ బడ్జెట్ నగర ప్రయాణికులను నిరాశకు గురి చేసింది.సికింద్రాబాద్ నుంచి షిరిడీకి వెళ్లేందుకు ప్రస్తుతం మన్మాడ్ వరకు అజంతా ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఉంది. సికింద్రాబాద్ నుంచి సాయినగర్ వరకు నేరుగా వెళ్లేందుకు మరో రైలు నడపాలనే ప్రతిపాదకు మోక్షం లభించలేదు.కాచిగూడ నుంచి బెంగళూర్‌కు ప్రస్తుతం రెండు రైళ్లే అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో 2 కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన సైతం పట్టించుకోలేదు.హైదరాబాద్-గుల్బర్గా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రస్తావన లేదు. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ ప్రీమియం ట్రైన్ ఊసు లేదు. చర్లపల్లిలో భారీ రైల్వే టర్మినల్.. చర్లపల్లి వద్ద భారీ రైల్వే టర్మినల్ మరో అతిపెద్ద ప్రాజెక్టు. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు కోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.80 కోట్లు కేటాయించారు. మొదట 5 ప్లాట్‌ఫామ్‌లతో ప్రారంభించి దశలవారీగా 10 నుంచి 15 ప్లాట్‌ఫామ్‌ల వరకు అభివృద్ధి చేస్తారు. వీటిలో రైళ్లను శుభ్రం చేసేందుకు పిట్లైన్లు కూడా ఉంటాయి. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో రాష్ర్టం తన వంతు వాటాను భరిస్తుంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లపై పెరుగుతున్న ఒత్తిడి, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి, వట్టినాగులపల్లిలో రైల్వే టర్మినళ్లు నిర్మించాలని చాలాకాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్ల తరువాత నగరంలో ఇది 4వ అతిపెద్ద రైల్వే టర్మినల్ కానుంది. 5వ టర్మినల్‌గా వట్టినాగులపల్లిలో 250 ఎకరాల్లో పీపీపీ మోడల్లో నిర్మిస్తారు. -
పాత పట్టాల పరుగే
అందరినీ సంతృప్తి పరచాలనే తాపత్రయం అతి తరచుగా ఎవరినీ సంతృప్తి పరచకుండా ముగుస్తుంటుంది. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రెండవ రైల్వే బడ్జెట్ సరిగ్గా అలాంటిదే. కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్ల ఆశలు చూపని ఈ బడ్జెట్లోని ప్రధాన ఆకర్షణ ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీలను పెంచకపోవడమే. 2015-16 రైల్వే బడ్జెట్ రూ. 1.83 కోట్ల రాబడిని లక్ష్యంగా పెట్టుకున్నా, సవరించిన అంచనాల ప్రకారం అది రూ. 1.67 కోట్లకు మించకపోవచ్చు. ఈ రాబడి లోటుకు తోడు ఏడవ పే కమిషన్ సిఫారసుల ప్రకారం వేతనాల పెరుగుదల రూ. 32.000 కోట్ల అదనపు భారాన్ని కూడా మోయాల్సి ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవస్థ మంద గమనం వల్ల రవాణా చార్జీలను, ప్రయాణికుల చార్జీలను స్వల్పంగా పెంచినా రాబడిలో చెప్పుకోదగిన మార్పేమీ ఉండబోదనీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం శాసనసభ ఎన్నికలు ఈ ఏడాదే జరగాల్సి ఉండగా భారీ చార్జీల పెంపుదల రాజకీయంగా మంచిది కాదనీ ఆ జోలికి పోలేదనిపిస్తుంది. తర్వాత వడ్డింపులకు ఎలాగూ అవకాశం ఉంటుంది. చార్జీలు పెంచకుండానే రైల్వే మంత్రి ఈ ఏడాది కంటే 10 శాతం ఎక్కువ రాబడిని, రూ.1,84,820 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాదిలోనే రాబడి లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైన ైరైల్వేలు వచ్చే ఏడాది రాబడిని ఎలా పెంచుకోగలవో అర్థం కాదు. ఆపరేటింగ్ వ్యయాల నిష్పత్తిని... ప్రతి రూ. 100 రాబడి కోసం ఖర్చు చేయాల్సివచ్చే వ్యయాన్ని... ప్రస్తుత రూ.97.8 నుంచి రూ.92కు తగ్గిస్తా మన్నారు. మన రైల్వేలను పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక రుగ్మతలైన అనవసర, వృథా వ్యయాలు, అసమర్థత, అలసత్వాలను ఒక్క ఏడాదిలో మటుమాయం చేయగల చిట్కా ఏమిటో అంతుపట్టదు. గత ఏడాది దాదాపు లక్ష కోట్లుగా ఉన్న వ్యయాన్ని ఈ బడ్జెట్లో రూ. 1,21,000 కోట్లకు అంటే 21 శాతం పెంచారు. నిధులను జీవిత బీమా సంస్థ వచ్చే ఐదేళ్లలో అందజేయనున్న 1.5 లక్షల కోట్ల సులభ షరతుల రుణం నుంచి, విదేశాలలో బాండ్ల అమ్మకం ద్వారా సమీకరిస్తామన్నారు. భారత రైల్వేల ఆత్మ ప్రజలే అంటూ ప్రభు రైల్వేలను ప్రయాణికులకు అనుకూలమైనవిగా మార్చడానికి పలు చర్యలను ప్రతిపాదించారు. టెలిఫోన్ ద్వారా టికెట్ల రద్దు, ఎస్ఎమ్ఎస్ ద్వారా క్యాటరింగ్, ఉచిత వైఫై సర్వీసులు, పిల్లలున్న తల్లుల కోసం ప్రత్యేక సదుపాయాలు వంటి పలు మెరుపులు మెరిపించారు. ప్రయాణికులకు సదుపాయాలను, స్టేషన్లు, రైళ్లలో పారిశుద్ధ్యం, సమాచార వ్యవస్థలను మెరుగుపర్చడం అవసరమనడం నిస్సం దేహం. తద్వారా ప్రయాణికులను ఆకట్టుకోగలమని భావించడంలోని సహేతుకత అంతుబట్టదు. సరుకుల, ప్రయాణికుల రవాణా రాబడులు పడిపోవడానికి ప్రధాన కారణం పారిశ్రామిక క్షీణత, రెండేళ్లుగా వ్యవసాయ రంగం దె బ్బ మీద దెబ్బతినడం. వినూత్నమైన, సృజనాత్మకమైన ఆలోచనలకు తావిచ్చిందంటున్న ఈ బడ్జెట్ మన సంప్రదాయక ఆలోచనల పరిధి నుంచి బయటపడ లేకపోయింది. స్వల్ప దూరాలకు ప్రయాణ సాధనాలుగా రైల్వేలు అట్టడుగు స్థాయిల్లో ఉండ టంలోని అర్థరాహిత్యాన్ని ఎందుకు గ్రహించలేరో అర్థం కాదు. చిన్న పట్టణాలను, నగరాలను గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానించడానికి తక్కువ దూరపు లైన్ల నిర్మాణం, గ్రామీణ, సబర్బన్ రైళ్ల నిర్వహణ చేపట్టడం లాభదాయకమే కాదు, రాబడిని పెద్ద ఎత్తున పెంచుకునే మార్గం కూడా. పాత బాటనే నడిచిన ప్రభు బడ్జెట్ కూడా అటు దృష్టి సారించలేదు. దేశంలోని రైల్వే క్రాసింగులలో 35 శాతం, అంటే 10 వేలకు పైగా కావలి లేనివి. ప్రతి రైల్వే మంత్రీ, ప్రతి రైల్వే బడ్జెట్లోనూ ఈ సమస్యను పరిష్కరిస్తామంటూనే ఉన్నారు. గత ఏడాది ప్రభు కూడా వాగ్దానం చేశారు. గత ఆరు నెలల్లో 156 లెవెల్ క్రాసింగ్‌ల వద్ద మాత్రమే సిబ్బందిని నియమించ గలిగారు. ఈ లెక్కన ఈ సమస్య పరిష్కారానికి మూడు దశాబ్దాలు పడుతుంది. రాబోయే 3-4 ఏళ్లలోనే ఆ పని పూర్తి చేసేస్తామని మంత్రి ఎలా హామీ ఇచ్చారో తెలియదు. ప్రస్తుత సగటు వేగం 30 కిలోమీటర్లను రెట్టింపు చేస్తామనడం, మిషన్ జీరో యాక్సిడెంట్ వంటి ఆశలన్నీ దీర్ఘకాలిక ప్రణాళికలే తప్ప ఏడాది బడ్జెట్లో సాధ్యం కానివి. దేశంలోని 40 శాతానికి పైగా లైన్లు ఇప్పటికే 100 శాతానికిపైగా సామర్థ్యంతో పనిచేయాల్సి వస్తోంది. 2011-12 నుంచి కొత్తలైన్ల నిర్మాణం క్షీణిస్తూ వస్తోంది. ఇప్పుడున్న లైన్ల మీదే రిజర్వేషన్లేని ప్రయాణికులకు అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌లను, హమ్‌సఫర్, తేజస్ ఉదయ్, ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెడతామన్నారు. వీటిలో తేజస్ 130 కిలోమీటర్ల లగ్జరీ ఎక్స్‌ప్రెస్. ఇవన్నీ విపరీతమైన రద్దీ భారాన్ని మోస్తున్న లైన్లపై మరింత భారాన్ని మోపుతాయి. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు సహా ప్రభు 44 భాగస్వామ్య ప్రాజెక్టులను, రెండు రైలింజన్ల ఫ్యాక్టరీలను ప్రకటించారు. ఈశాన్యం తదితర ప్రాంతాలలో ఇప్పటికే ఉన్న లైన్లను బ్రాడ్గేజీకి మార్చడం, ఆధునీకరించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం సమంజసమే. అయితే ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులను పరిపూర్తి చేయడం వల్ల ఒక్క ఏడాది కాలంలో తక్కువ వ్యయాలతో ఎక్కువ ఫలితాలను రాబట్టవచ్చని విస్మరించడం విచారకరం. ఆనవాయితీ అన్నట్టుగా ఈ బడ్జెట్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల పట్లా సమాన నిర్లక్ష్యాన్ని చూపింది. తెలంగాణలో కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఊసే ఎత్తలేదు. మనోహరాబాద్-కొత్తపల్లి-భద్రాచలం-సత్తుపల్లి లైన్, దశాబ్దిన్నర క్రితమే సగం పూర్తయిన పెద్దపల్లి-కరీంనగ ర్-నిజామాబాద్ మార్గం సహా ఏదీ పూర్తి అయ్యే అవకాశమే లేకుండా అన్ని ప్రాజెక్టులకూ చిల్లర డబ్బులు విదిల్చినట్టు నిధులను కేటాయించడంలోని సహేతుకత ఏమిటో అంతుబట్టదు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే వైఖరి చూపిన బడ్జెట్... విశాఖపట్నం రైల్వే జోన్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన సమయంలో చేసిన వాగ్దానాన్ని సైతం విస్మరించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీరని అన్యాయంగా భావించడం అసహజం కాదు. జాతీయ ప్రయోజనాల రీత్యానే అత్యంత కీలకమైన శ్రీకాళహస్తి -నడికుడి రైల్వే లైన్‌ను పూర్తి చేయడానికి సిద్ధపడకపోవడంలోని ఔచిత్యం ఏమిటో అర్థం కాదు. పలు ఆకర్షణల మెరుపులతో ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పాత పట్టాల మీద పరుగే. -
పట్టాలు తప్పిన రైల్ షేర్లు
ఆకట్టుకోని రైల్వే బడ్జెట్ లాభాల్లో లాజిస్టిక్స్ షేర్లు పలు రైల్వే షేర్లకు నష్టాలు ముంబై: దలాల్ స్ట్రీట్‌లో సురేశ్ ప్రభు ఆధ్వర్యంలోని ట్రైన్ నంబర్ టూజీరోవన్సిక్స్(2016) పట్టాలు తప్పింది. రైల్వే షేర్లు లాభాల ప్లాట్‌ఫామ్‌పై ఆగకుండా నష్టాల పట్టాలపై పరుగులు పెట్టాయి. ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీల పెంపుకు సురేష్ ప్రభు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినప్పటికీ, స్టాక్ మార్కెట్... ప్రభు బడ్జెట్‌కు రెడ్ సిగ్నల్నే ఇచ్చింది. రైల్వే బడ్జెట్ నేపథ్యంలో రైల్వే షేర్లు బాగా నష్టపోయాయి. కొన్ని షేర్లు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి. రైల్వే బడ్జెట్లో మూలధన కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేవని నిపుణులంటున్నారు. రైల్వే బడ్జెట్‌కు ముందు ఒడిదుడుకుల్లో ట్రేడైన రైల్వే షేర్లు..సురేశ్ ప్రభు బడ్జెట్ ప్రసంగం మొదలైన తర్వాత నష్టాల బాటలో సాగాయి. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత మరింతగా క్షీణించాయి. రైల్వే మంత్రి తన పరిధి మేరకు మంచి బడ్జెట్‌నే అందించారని డాల్టన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎండీ యూ. ఆర్. భట్ పేర్కొన్నారు. అయితే వ్యాగన్లు తయారు చేసే కంపెనీలకు భారీ ఆర్డర్లేమీ లేవని పెదవి విరిచారు. ప్రతిపాదనలు-షేర్ల ప్రతిస్పందన 2,000 కిమీ రైల్వే లైన్ల విద్యుదీకరించాలని ప్రతిపాదించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ విద్యుదీకరణ బడ్జెట్ 50 శాతం అధికం. అయినప్పటికీ, రైల్వేల విద్యుదీకరణతో సంబంధమున్న షేర్లు మిశ్రమంగా స్పందించాయి. కేఈసీ ఇంటర్నేషనల్ 3 శాతం లాభపడి రూ.106 వద్ద ముగిసింది. సీమెన్స్, ఆల్స్టోమ్ టీ అండ్ డీ ఇండియా షేర్లు క్షీణించాయి. వ్యాగన్లు తయారు చేసే కాళింది రైల్, టెక్స్మాకో రైల్, టిటాఘర్ వ్యాగన్స్ 8-9శాతం రేంజ్లో నష్టపోయాయి.రైల్ సైట్ లాజిస్టిక్ పార్క్‌ల అభివృద్ధి చేస్తారన్న ప్రతిపాదన, రవాణా చార్జీలు పెంచకపోవడం, ప్రతిపాదిత కొత్త రవాణా కారిడార్ల కారణంగా రవాణా వ్యయం తగ్గడం తదితర కారణాల వల్ల లాజిస్టిక్స్ కంపెనీలైన కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గేట్ వే డిస్ట్రిపార్క్స్, అల్కార్గో లాజిస్టిక్స్ గతి, టిమ్కెన్లు మాత్రం 0.4 శాతం నుంచి 3 శాతం వరకూ పెరిగాయి. మరింత భద్రత కోసం రైల్వే స్టేషన్లలో సీసీటీవీలను ఏర్పాటు చేస్తారన్న ప్రతిపాదన కారణంగా రైల్వే సంబంధిత టెక్నాలజీ కంపెనీలు మిశ్రమంగా ముగిశాయి. మిక్ ఎలక్ట్రానిక్స్ 0.5 శాతం, జికామ్ ఎలక్ట్రానిక్స్ 6.2 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే ఇదే కేటగిరిలోని స్టోన్ ఇండియా 6 శాతం వరకూ క్షీణించింది. రైల్వే ఆర్డర్లపై ఆధారపడి కార్యకలాపాలు నిర్వహించే కంపెనీల షేర్లు క్షీణించాయి. టెక్స్మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ 8.8 శాతం, కాళింది రైల్ నిర్మాణ్ 9.2 శాతం, టిటాఘర్ వ్యాగన్స్ 8 శాతం, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, 4.8 శాతం, హింద్ రెక్టిఫైర్స్ 7.6 శాతం, భెల్ , బీఈఎంఎల్ 4 శాతం, స్టోన్ ఇండియా 6 శాతం చొప్పున నష్టపోయాయి. వంద స్టేషన్లలో వైఫై సేవలందించనున్న ప్రతిపాదన కారణంగా డి-లింక్ ఇండియా షేర్ ఇంట్రాడేలో 12 శాతం లాభపడి రూ.140ను తాకింది, చివరకు 2 శాతం లాభంతో రూ.126 వద్ద ముగిసింది. స్మార్ట్‌లింక్ నెట్వర్క్ సిస్టమ్స్ 20 శాతం అప్పర్ సర్క్యూట్ తో రూ.97 వద్ద ముగిసింది. షేర్ల బై బ్యాక్ చేస్తామని కంపెనీ ప్రకటించడం కూడా ఈ కంపెనీ జోరుకు కలసి వచ్చింది -
స్మార్ట్ రైళ్లు.. సినిమా తెరలు
న్యూఢిల్లీ: హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లుగా త్వరలో భారతీయ రైళ్లు మెరిసిపోనున్నాయి. కళ్లను కట్టిపడేయనున్నాయి. త్వరలోనే స్మార్ట్ (స్పెషల్లీ మోడిఫైడ్ ఆస్తేటిక్ రిఫ్రెషింగ్ ట్రావెల్) కోచెస్ రానున్నాయి. వీటిలో ఉండే సౌకర్యాలు వింటే అబ్బుర పడాల్సిందే. ఇది ఎక్కువమంది ప్రయాణీకులను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతోపాటు ప్రయాణీకులు రాగానే వాటంతట అవే తలుపులు తెరుచుకుంటాయి. అలాగే, బార్ కోడ్ రీడర్స్, బయో వాక్యూమ్ టాయిలెట్స్, వాటర్ లెవల్ ఇండికేటర్స్, ఆధునిక డస్ట్ బిన్స్, కొత్త విధానంలో సీటింగ్ వ్యవసథ, వెండింగ్ మెషిన్స్తోపాటు ఎంటర్ టైన్ మెంట్ తెరలు, ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులు ఇందులో ఉంటాయి. దీంతోపాటు, ఇండియన్ రైల్వేలో రైల్ మిత్ర సేవ రానుంది. ఇప్పటికే కొంకణ్ రైల్వే లో ఉన్న సారథి సేవను దాదాపుగా అన్ని రైళ్లకు విస్తరించి దివ్యాంగులకు సేవలు అందించనున్నారు. విశ్రాంతి గదుల బుకింగ్ గంటగంటకు చేసుకునే అవకాశం కలగనుంది. దీనిని పూర్తిగా ఐఆర్సీటీసీకి అప్పగించనున్నారు. -
ఇంతకీ ప్రయాణీకుల సౌకర్యాలేమిటి?
న్యూఢిల్లీ: రూ.1.21 లక్షల కోట్ల కేపిటల్ ప్లాన్‌తో లోక్ సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు అన్నింటికి అరకొర కేటాయింపులే చేశారు. ప్రయాణీకులను మెప్పించేలా కొన్ని ప్రకటనలు చేశారు. అయితే, ఇదివరకే ఉన్నవాటిని కాస్తంత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు, ఆధునీకరణ దిశగా ముందుకెళుతున్నాం అని చెప్పేందుకు ఆయన కొన్ని అంశాలు వెల్లడించారు. వాటిని సంక్షిప్తంగా పరిశీలిస్తే.. పూర్తిగా ఐవీఆర్ఎస్ వ్యవస్థకు అంకితమై సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకొని ప్రయాణీకులకు అనుసంధానమవడంతోపాటు వారి ప్రతి స్పందనలను తెలుసుకునేందుకు పెద్ద పీఠ వేశారు. అదనంగా 65,000 బెర్త్ లను ఏర్పాటుచేయనున్నారు. 2,500 వాటర్ వెండింగ్ మెషిన్స్ను ఏర్పాటుచేస్తారు అత్యాధునిక పద్ధతిలో తీర్చిదిద్దిన బోగీలతో మహామన ఎక్స్ ప్రెస్ రైలును ప్రకటించారు 17 వేల బయో టాయిలెట్లను రైళ్లలో ప్రవేశ పెట్టనున్నట్లు ఇందుకోసం ప్రపంచంలోనే తొలి బయో వ్యాక్యూమ్ టాయిలెట్లను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఈ టికెటింగ్ వ్యవస్థను బలపరచనున్నట్లు ప్రకటించిన ఆయన ఇందుకోసం 1,780 ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్స్ను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. మొబైల్ ఆప్స్‌ను, గో ఇండియా స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతున్నారు. నిమిషానికి రెండు వేల టికెట్లు వచ్చేలాగా ఈ టికెటింగ్ వ్యవస్థ రానుంది. ఇప్పటికిప్పుడు 100 స్టేషన్లలో వైఫై సేవలు.. మరో 400 స్టేషన్లలో త్వరలో వైఫై ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగుల కోసం ఆన్ లైన్లోనే వీల్ చైర్లు ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. భద్రత కోసం మరిన్ని సీసీటీవీ కెమెరాలు, హెల్ప్ లైన్ సెంటర్లు పెంచనున్నారు. -
తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులివీ...
న్యూఢిల్లీ: రైల్వే మంత్రి సురేశ్ ప్రభు 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కూడా కొంతమేరకు కేటాయింపులు ఉన్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు కొంతమేర నిధులు కేటాయించగా.. ఏపీలోని వేర్వేరు లైన్లకు బడ్జెట్లో కేటాయింపులు కోటిపల్లి - నరసాపురం : రూ.150 కోట్లు కాకినాడ - పిఠాపురం : రూ.25 కోట్లు నంద్యాల - ఎర్రగుండ్ల : రూ. 50 కోట్లు ఓబులవారిపల్లి - కృష్ణ పట్నం : రూ.100 కోట్లు విష్ణుపురం-జనాపహార్: రూ.5 కోట్లు జగ్గయ్యపేట - మేళ్లచెరువు : రూ.110 కోట్లు కడప - బెంగళూరు లైన్ అభివృద్ధికి : రూ. 29 కోట్లు నడికుడి-శ్రీకాళహస్తి :రూ.180 కోట్లు కంభం-ప్రొద్దుటూరుకు :కేవలం రూ.10లక్షలు గూడురు-దుగ్గరాజపట్నం: రూ.5కోట్లు మాచర్ల - నల్గొండ : రూ.20 లక్షలు గుంతకల్-గుంటూరు మరియు గుంతకల్-కల్లూరు: రూ.87 కోట్లు ధర్మవరం-పాకాల : రూ.25 లక్షలు గుత్తి-ధర్మవరం-బెంగళూరు: రూ.1.05 కోట్లు గుత్తి-ధర్మవరం-బెంగళూరు డబ్లింగ్: రూ.80 కోట్లు విజయవాడ-హైదరాబాద్ మధ్య డబుల్ డెక్కర్ రైలు విశాఖ-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు గూడూరు-రేణిగుంట, రేణిగుంట-తిరుపతి డబ్లింగ్:రూ.1.05 కోట్లు గుంటూరు-తెనాలి డబ్లింగ్: రూ.50కోట్లు విజయవాడ-గుడివాడ, భీమవరం-నర్సాపూర్,గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు డబ్లింగ్: రూ.75కోట్లు ఖాజీపేట-విజయవాడ: రూ.50కోట్లు విజయవాడ-గూడూరు: రూ.100 కోట్లు దువ్వాడ-విజయవాడ: రూ.50కోట్లు కల్లూరు-గుంతకల్: రూ.50 కోట్లు .................................... తెలంగాణలోని వేర్వేరు లైన్లకు బడ్జెట్లో కేటాయింపులు పెద్దపల్లి-నిజామాబాద్ : రూ.70కోట్లు మునీరాబాద్-మహబూబ్ నగర్: రూ.90 కోట్లు ముథోడ్-ఆదిలాబాద్: రూ.1 కోటి మనోహరాబాద్-కొత్తపల్లి : రూ.20 కోట్లు గద్వాల్-రాయ్‌చూర్ : రూ.5 కోట్లు అక్కన్నపేట-మెదక్ : రూ.5 కోట్లు నాగరాఘవపూర్-మందమర్రి : రూ.15 కోట్లు కాజీపేట-విజయవాడ ట్రిప్లింగ్ పనులకు రూ.114 కోట్లు భద్రాచలం-కొవ్వూరు : రూ. 5 కోట్లు భద్రాచలం-సత్తుపల్లి :రూ.కోటి కొండపల్లి-కొత్తగూడెం: రూ.10 కోట్లు మణుగూరు-రామగుండం: రూ.10 కోట్లు డిచ్పల్లి-నిజామాబాద్ రోడ్ ఓవర్ బ్రిడ్జికి: రూ.10 కోట్లు సికింద్రాబాద్ -మహబూబ్ నగర్ డబ్లింగ్‌కు: రూ.80 కోట్లు బోధన్ నుంచి బీదర్‌కు కొత్త రైల్వే లైన్ ఏర్పాటు పెద్దపల్లి-జగిత్యాల మధ్య సబ్‌వేల నిర్మాణానికి రూ.5 కోట్లు కాజీపేట-వరంగల్ మధ్య రోడ్ ఓవర్ బ్రిడ్జికి రూ.5 కోట్లు కొత్తగా మణుగూరు - రామగుండం - కొత్త లైను కోసం లక్ష రూపాయలు కేటాయింపు కాజీపేట-బలార్షా : రూ.30కోట్లు సికింద్రాబాద్-మహబూబ్ నగర్ :రూ.80 కోట్లు