సాధారణ ప్రజలకు ఎంతో చేరువైన భారతీయ రైల్వే వ్యవస్థపై మంత్రి సురేశ్ ప్రభు శుక్రవారం ప్రత్యేక గీతాన్ని (రైల్ గీత్) విడుదల చేశారు. సంగీత దర్శకుడు శరవణ్ స్వరపరిచిన ఈ మూడు నిమిషాల గీతాన్ని గాయకులు ఉదిత్ నారాయణ్, కవిత కృష్ణమూర్తి ఆలపించారు.
ఈ గీతం రైల్వే వినియోగదారులకు, ఉద్యోగులకు స్ఫూర్తినిచ్చి, భారతీయ రైల్వే అభివృద్ధికి తోడ్పడుతుందని మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రైల్వే శాఖకు సంబంధించిన కార్యక్రమాల ప్రారంభంలో ఈ పాటను ఆలపించనున్నట్లు వెల్లడించారు. అతి పెద్ద భారతీయ రైలే ్వ వ్యవస్థ సమర్థంగా పని చేసేందుకు కృషి చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల నిబద్ధత, అంకితభావానికి ఈ పాట ప్రతీక అని మంత్రి అభివర్ణించారు.