Udit Narayan
-
19 ఏళ్ల తర్వాత మరో కేసు పెట్టిన మొదటి భార్య!
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్.. లేటు వయసులో లేని పోని చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. మొన్నటికి మొన్న ఓ ప్రోగ్రామ్ లో పాట పాడుతూ మహిళా అభిమానికి లిప్ కిస్ ఇచ్చి కాంట్రవర్సీకి కారణమయ్యాడు. ఇప్పుడు మొదటి భార్య వల్ల మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఏమైందంటే?(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఛావా' డైరెక్టర్.. ఎందుకంటే?)తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో ఎన్నో హిట్ పాటలు పాడిన ఉదిత్ నారాయణ్.. 69 ఏళ్లొచ్చినా ఇంకా తనదైన శైలిలో అలరిస్తూనే ఉన్నారు. సినిమా సాంగ్స్ కూడా పాడుతున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఈయన మొదటి భార్య రాంజన ఇప్పుడు ఈయనపై కోర్టులో కేసు వేసింది. ఉదిత్ నారయణ్.. తనకు సంబంధించిన భూమిని తనకు చెప్పకుండా అమ్మేశాడని, అందులో తనకు దక్కాల్సిన రూ.11 లక్షల్ని తీసేసుకున్నాడని, ఆ డబ్బు తిరిగి తనకు ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇందులో భాగంగానే ఉదిత్.. ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యాడని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)ఉదిత్ వ్యక్తిగత విషయానికొస్తే.. 1985లో దీప అనే సింగర్ ని పెళ్లి చేసుకుని ముంబైలో సెటిలైపోయాడు. వీళ్లకు ఆదిత్య నారాయణ్ అనే కొడుకు ఉన్నాడు. దీపని పెళ్లి చేసుకోవడానికి ముందే ఉదిత్.. తనని పెళ్లి చేసుకున్నాడని రాంజన అనే మహిళ బయటకొచ్చింది. తొలుత బుకాయించాడు గానీఆమె, కోర్టుని ఆశ్రయించడంతో ఒప్పుకొన్నాడు. అదే ఏడాది న్యాయబద్ధంగా ఉదిత్-రాంజన విడాకులు కూడా తీసుకున్నారు.విడాకులు తీసుకున్నప్పుడు భరణం కింద.. ఇల్లు, కొంత బంగారం, నెలకు రూ.15 వేల మొత్తాన్ని రాంజనకు ఇచ్చేలా బిహార్ మహిళా కమిషన్ ముందు ఉదిత్ ఒప్పుకొన్నాడు. అవి చెల్లిస్తున్నాడు కూడా. తాజాగా రాంజన మరోసారి కోర్టు మెట్లక్కెడంతో ఉదిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?) -
రెండు రోజుల క్రితమే వివాదంలో సింగర్.. అంతలోనే మరో వీడియో వైరల్!
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ చేసిన పని ఇటీవల తీవ్ర వివాదానికి దారితీసింది. ఓ మహిళా అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఆయన ఏకంగా ముద్దులు ఇవ్వడంతో పలువురు మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఈ వయసులో ఇలాంటి పనులేంటని సింగర్‌ను నిలదీశారు. అభిమానంతో ఫోటోలు దిగితే అందరిముందే అలా ప్రవర్తించడం ఏంటని ఉదిత్ నారాయణ్‌ను ప్రశ్నించారు.అయితే ఈ సంఘటన జరగకుముందే మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో మహిళకు ముద్దు పెడుతూ కనిపిచంారు. ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇది కొత్త వీడియోనా.. గతంలో జరిగిందా అనే విషయంపై క్లారిటీ లేదు. కాగా.. గతంలో ఉదిత్ నారాయణ్.. సింగర్స్ అల్కా యాగ్నిక్, శ్రేయో ఘోషల్ అనుమతి లేకుండా వారికి ముద్దు పెట్టాడు. ఏదేమైనా అనుమతి లేకుండా మహిళ అభిమానులతో అలా ప్రవర్తించడంపై ఆయనపై విమర్శలొస్తున్నాయి.(ఇది చదవండి: 'మహిళా అభిమానులకు ముద్దులు'.. వివాదంపై స్పందించిన సింగర్)కాగా.. ఉదిత్ నారాయణ్ బాలీవుడ్ సింగర్. ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో పాటలు ఆలపించాడు. నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది.Another video of Udit Narayan pic.twitter.com/dYGWgPfUHl— Savage SiyaRam (@SavageSiyaram) February 5, 2025 -
'మహిళా అభిమానులకు ముద్దులు'.. వివాదంపై స్పందించిన సింగర్
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ (Udit Narayan)పై తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. అతనితో సెల్ఫీలు దిగేందుకు వచ్చిన మహిళ అభిమానులకు ముద్దులు పెట్టి వార్తల్లో నిలిచారు. అంతేకాకుండా ఓ మహిళ అభిమానికి ఏకంగా లిప్ లాక్ కిస్ ఇవ్వడంతో ఆయనపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో ఆయన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 69 ఏళ్ల వయసులో ఇలాంటి పనులేంటని నిలదీస్తున్నారు. గతంలోనూ ఆయన చాలాసార్లు అలానే ప్రవర్తించారు. గతంలోనూ ఉదిత్.. సింగర్స్ అల్కా యాగ్నిక్, శ్రేయో ఘోషల్ అనుమతి లేకుండా వారికి ముద్దు పెట్టాడు.తాజాగా తనపై వస్తున్న విమర్శలపై ఉదిత్ నారాయణ్ స్పందించారు. అభిమానులతో అలా ప్రవర్తించినందుకు తనకేలాంటి బాధలేదని అంటున్నాడు. సోషల్‌మీడియాలో వచ్చిన వీడియోల్లో మీరు చూసింది మా మధ్య ఉన్న ప్రేమకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. దీనిపై చింతించాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదంటున్నాడు. వారు నన్ను అభిమానించడం వల్లే నా ప్రేమను తెలియపరిచానని వెల్లడించారు. నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేనప్పుడు బాధపడాల్సిన అవసరం కూడా లేదన్నారు.(ఇది చదవండి: అభిమానితో సింగర్ ముద్దులాట.. ఈ వయసులో ఇదేం పని?)ఉదిత్ నారాయణ్ మాట్లాడుతూ..'నా కుటుంబానికి చెడ్డపేరు తీసుకువచ్చే పని ఎప్పుడూ చేయలేదు. సోషల్‌మీడియాలో వీడియోల్లో కేవలం అభిమానులపై నేను చూపిస్తున్న ప్రేమ. వాళ్లు నన్ను ఏలా ప్రేమిస్తున్నారో..అలాగే వారిని కూడా ప్రేమిస్తున్నా. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఎక్కడుంది? నా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. నేను వారి వల్లే మరింత ఫేమస్ అయ్యా' అని అన్నారు.కాగా.. ఉదిత్ కొన్నిరోజుల క్రితమే లైవ్ కన్సర్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళా అభిమానులు ఆయనతో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న ఉదిత్ నారయణ్ వారికి ముద్దులు పెట్టాడు. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు.ఉదిత్ నారయణ్ తెలుగులో పలు చిత్రాలకు పాటలు పాడారు. బాలీవుడ్ సింగర్ అయినప్పటికీ ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో పాటలు ఆలపించాడు. నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది -
అభిమానితో సింగర్ ముద్దులాట.. ఈ వయసులో ఇదేం పని?
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ (Udit Narayan)పై నెట్టింట ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఓ మహిళా అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఈయన ఏకంగా లిప్‌కిస్ ఇవ్వడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో ఉదిత్.. సింగర్స్ అల్కా యాగ్నిక్, శ్రేయో ఘోషల్ అనుమతి లేకుండా వారికి ముద్దు పెట్టాడు.లైవ్ షోలో..తాజాగా వైరలవుతున్న వీడియోలో ఉదిత్.. స్టేజీపై లైవ్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. ఇంతలో ఓ మహిళా అభిమాని అతడితో సెల్ఫీ తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ఫోటో తీసుకోవడంతో పాటు సింగర్ చెంపను ముద్దాడింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న ఉదిత్.. ఏకంగా ఆమె పెదాల్ని ముద్దాడాడు. ఊహించని చర్యతో అభిమాని నోరెళ్లబెట్టింది. ఈ వయసులో ఇదేం పని?69 ఏళ్ల వయసులో ఇలాంటి పనులేంటని జనాలు మండిపడుతున్నారు. కూతురి వయసున్నవారితో ఇలాగేనా ప్రవర్తించేంది? నీ పేరు నువ్వే చెడగొట్టుకుంటున్నావ్.. ఛీ, ఇంత చీప్ అనుకోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కొందరు మాత్రం మొదట ఆ అమ్మాయే తనంతట తానుగా సింగర్ దగ్గరకు వెళ్లిందని.. ఇందులో ఆమె తప్పు కూడా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అటు సింగర్‌కు, ఇటు షోలో అతడి దగ్గరకు వెళ్లిన అమ్మాయిలకు సిగ్గు లేదని తిట్టిపోస్తున్నారు.ఉదిత్ నారాయణ్ బాలీవుడ్ సింగర్. ప్రాంతీయ భాషల్లోనూ ఎన్నో పాటలు ఆలపించాడు. నాలుగుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది. Can't believe veteran Singer Udit Narayan behaving so lewd in a live concerts show 😔 But my question is Who's more disgusting - Female Audiences or the Artist #UditNarayan? #shameless pic.twitter.com/W6epY8Nmr4— Filmi Woman (@FilmiWoman) February 1, 2025చదవండి: క్యూట్ గెటప్‌లో అల్లు అర్హ, అయాన్ డ్యాన్స్.. -
ఆ సింగర్‌తో ఉదిత్ నారాయణ రిలేషన్.. రియాక్ట్ అయిన సతీమణి
ఉదిత్ నారాయణ.. బాలీవుడ్‌ను తన పాటలతో మ్యాజిక్ చేశారు. అలా ఆయన హిందీ చిత్రసీమకే పరిమితం కాలేదు. భారతీయ పలు భాషల్లో చిత్రాల్లో తన గాత్రాన్ని వినిపించి ఎనలేని అభిమానులను సంపాదించుకున్నారు. వాస్తవంగా నేపాల్‌లో పుట్టిన ఉదిత్ నారాయణ తన పాటలతో ఎల్లలను చెరిపేశారు. రేడియో గాయకుడిగా మొదలైన ఆయన ప్రస్థానం భారతదేశ చిత్రపరిశమలన్నింటిలోనూ ప్రముఖ గాయకుడిగా అభిమానం సంపాదించుకునే దిశగా సాగింది. తన గాన ప్రతిభతో ఉదిత్ నారాయణ్ ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యాడు. 34 భాషల్లో 25 వేల పాటలకు పైగా పాడారు. మూడు సార్లు ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారాలు సాధించారు. ఉదిత్ నారాయణ పాటల ప్రయాణంలో సింగర్ అల్కా యాగ్నిక్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. వీరిద్దరూ కలిసి పాట పాడితే అది హిట్ కావాల్సింది. దీంతో నిర్మాతలు కూడా వీరిద్దరితో పాటలు పాడించేందుకు ఎక్కువగా ఇష్టపడుతారు. వీరిద్దరూ కలిసి ఇండస్ట్రీకి ఎన్నో సూపర్‌హిట్ పాటలను అందించారు. బాలీవుడ్లో ఎక్కువగా నటులు-నటీమణుల మధ్య రూమర్స్ వస్తుంటాయి. కానీ అక్కడ ఈ సింగర్స్ జోడీ మధ్య ఉన్న రిలేషన్‌పై చాలా పుకార్లు వచ్చాయి. బాలీవుడ్లో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఈ టాపిక్ గురించి ఉదిత్ నారాయణ సతీమణి దీప చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఒక కార్యక్రమంలో ఉదిత్ నారాయణ తన సతీమణితో పాటుగా పాల్గొన్నారు. అక్కడకు సింగర్ అల్కా యాగ్నిక్ కూడా వచ్చింది. అక్కడ సందడిగా ఉన్న ఆమెకు ఉదిత్ నారాయణ, అల్కా మధ్య ఉన్న సంబంధం గురించి ప్రశ్న ఎదురౌతుంది. అందుకు సమాధానంగా.. 'వారి సంబంధాన్ని నేను అంగీకరిస్తున్నాను' అంటూ దీప మరింతగా నవ్వేస్తుంది. 'వారిద్దరి స్నేహం పట్ల నాకు నమ్మకం ఉంది. మాకు పెళ్లై 30 ఏళ్లు దాటింది. అయినా వారి స్నేహంలో ఎలాంటి మార్పు లేదు. ఉదిత్, అల్కా మధ్య సంబంధం నిజంగా చాలా ప్రత్యేకమైనది. వారి దశాబ్దాల స్నేహం పట్ల నాకు గౌరవం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా వారి ప్రయాణం కొనసాగుతుంది. వారి గురించి ఇతరులు ఎన్ని మాటలు అన్నా కూడా అవన్నీ ఇంటి బయటి వరకే ఆగిపోతాయి. మేము అందరం ఒకే కుటుంబంలా ఉంటాం. అందుకే ఎన్ని రూమర్స్ వచ్చినా మా రెండు కుటుంబాలు కలిసే ఉంటున్నాయి. వారిద్దరూ ఎల్లప్పుడూ గౌరపరంగా ఉంటారు. భర్తలకు కూడా స్నేహితురాలు ఉంటుందనేది మనం గుర్తుపెట్టుకుంటే ఎలాంటి గొడవలకు తావు ఉండదు. అని దీప చెప్పారు. తన భర్త పట్ల ఇంతటి నమ్మకాన్ని చూపిన దీపను గౌరవిస్తూ సోషల్‌మీడియాలో పాజిటివ్‌గా కామెంట్లు వస్తున్నాయి. -
నా ఇంటి ఖరీదు రూ.10.5 కోట్లు: సింగర్
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ వివాహం కొద్ది రోజుల క్రితమే అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. చిరకాల స్నేహితురాలు, నటి శ్వేత అగర్వాల్‌ను మనువాడి వివాహ బంధంలో అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత వీరద్దరు కొత్త ఇంటికి మారారు. ప్రస్తుతం దాని గురించి సోషల్ మీడియాలో డిబెట్ నడుస్తోంది. ఈ ఇంటి ఖరీదు సుమారు 4 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి మీడియాలో కూడా కొన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆదిత్య నారాయణ్ వీటిపై స్పందించారు. మీడియా తనను తక్కువ అంచనా వేస్తోందన్నారు. తన కొత్త ఇల్లు పదిన్నర కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుందన్నారు. (తనతో నా పెళ్లి ఫేక్.. టీఆర్పీ కోసమే: సింగర్) ఈ సందర్భంగా ఆదిత్య నారాయణ్ మాట్లాడుతూ.. ‘నా ఇంటి ఖరీదు నాలుగు కోట్ల రూపాయలా.. అంత తక్కువా.. కాదు. మీరు తక్కువ అంచాన వేశారు. దాని విలువ 10.5 కోట్ల రూపాయలు. నేను బాల్యం నుంచే సంపాదించడం మొదలు పెట్టాను. టీవీ నాకు ఎంతో చెల్లించింది’ అని తెలిపారు. ఆదిత్య సింగర్‌గా మాత్రమే కాక రియాలిటీ షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తను ‘ఇండియన్ ఐడల్’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేస్తున్నారు. ఇక వివాహం తర్వాత ఆదిత్య కొత్త ఇంటికి మారారు. తండ్రి ఉంటున్న ఇంటికి మూడు ఇళ్ల అవతల ఈ నివాసాన్ని తీసుకున్నారు. ఇక దీనిలో మొత్తం ఐదు బెడ్రూమ్లున్నాయి. ఇక డిసెంబర్ మధ్యలో హనీమూన్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు ఆదిత్య నారాయణ్. ప్రస్తుతం ఇంటిని సర్దుకోవడంలో బిజీగా ఉండటంతో హనీమూన్‌ని డిసెంబర్‌కు వాయిదా వేశామన్నారు. -
వాళ్లు పదేళ్లు సహజీవనం చేశారు: ప్రముఖ సింగర్
ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు, సింగర్ ఆదిత్య నారాయణ్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. నటి శ్వేతా అగర్వాల్‌ను పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. డిసెంబర్ 1న ముంబైలోని ఇస్కాన్ టెంపుల్ వీరి ఏడడుగుల బంధానికి వేదికగా మారింది. ఒక్కగానొక్క కొడుకు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని ఉదిత్ ఎన్నో కలలు గన్నా కోవిడ్ ఆయన ఆశల మీద నీళ్లు చల్లింది. ఫలితంగా పెద్ద పెద్ద ఆడంబరాలకు పోకుండా తక్కువ మంది మధ్యే సంబరాలు జరుపుకోవాల్సి వచ్చింది. తాజాగా ఆయన తన కొడుకు ప్రేమ, పెళ్లి గురించి స్పందించారు. (చదవండి: దిల్జిత్.. కరణ్ పెంపుడు జంతువు: కంగన) "నాకు ఏకైక సంతానం ఆదిత్య. వాడి పెళ్లిని ఎంతో ఘనంగా చేయాలనుకున్నా. కానీ కరోనా వల్ల గ్రాండ్‌గా చేసుకునే వేడుకలకు దూరమవాల్సి వచ్చింది. నిజానికైతే ఈ కరోనా ధాటి తగ్గిన తర్వాతే వాడి పెళ్లి చేద్దామనుకున్నా. కానీ నా కొడుకుతో పాటు శ్వేత, ఆమె కుటుంబం కూడా ఇప్పుడే చేసేద్దామన్నారు. ఆదిత్య, శ్వేత పదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించాల్సిన సమయం వచ్చింది అని అనుకుంటున్నా" అని చెప్పుకొచ్చారు. తన కోడలు శ్వేత గురించి చెప్తూ.. 'ఆమె నా కొడుకుకు స్నేహితురాలిగానే తెలుసు. ఓ రోజు ఆదిత్య నా దగ్గరకు వచ్చి శ్వేతను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఓ క్షణం షాకైన నేను వాడి మాటను కాదనలేకపోయాను. అయితే తర్వాత ఏం జరిగినా నన్ను నిందించొద్దు అని చెప్పాను' అని చెప్పుకొచ్చారు. (చదవండి: శ్వేత అగర్వాల్‌ను పెళ్లాడిన ఆదిత్య) -
నటిని వివాహమాడిన సింగర్!
ముంబై: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు, నటుడు ఆదిత్య నారాయణ్ ఓ ఇంటివాడయ్యాడు. చిరకాల స్నేహితురాలు, నటి శ్వేత అగర్వాల్‌ను మనువాడి వివాహ బంధంలో అడుగుపెట్టాడు. ముంబైలోని ఇస్కాన్ టెంపుల్లో మంగళవారం వీరి పెళ్లి జరిగింది. కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో ఇరు కుటుంబాల సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: ‘నేను స్త్రీలోలుడిని అని భయపడింది’) ఈ క్రమంలో వధూవరులు ఆదిత్య, శ్వేతతో పాటు బంధువులు సరదాగా గడిపిన వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లికొడుకు తల్లి దీపా నారాయణ్ బారాత్‌లో కొడుకుతో కలిసి సందడి చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కాగా సింగర్, టీవీ షోల హోస్ట్‌గా అందరికీ సుపరిచితమైన ఆదిత్య నారాయణ్, శ్వేత అగర్వాల్‌తో కలిసి ‘షాపిత్’ అనే సినిమాలో నటించాడు. షూటింగ్లో భాగంగా ఈ జంట మధ్య స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో పదేళ్ల పాటు ప్రేమించుకున్న వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి మంగళవారం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. (చదవండి: అవును.. పెళ్లిచేసుకోబోతున్నాం) View this post on Instagram A post shared by Saroj_Mahara (@saroj_maharaa) -
తనతో నా పెళ్లి ఫేక్.. టీఆర్పీ కోసమే: సింగర్
గత కొంతకాలంగా ప్రముఖ గాయని నేహా కక్కర్ ఇండియన్ ఐడల్ సీజన్ 11 మ్యూజిక్ షో యాంకర్ అదిత్య నారాయణ్‌లు త్వరలో వివాహం చేసుకోబుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా అంగీకరించినట్లు ఇండియన్ ఐడల్ షోలో స్పష్టం చేశారు. ఇక అప్పటి నుంచి నేహా, అదిత్యల జోడి కుదరినట్లేనని అందరూ ఫిక్సైపోయారు. నేహా అభిమానులైతే ఆమె పెళ్లి తేదీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేహా అందరికి షాకిస్తూ... వారి పెళ్లి అంతా అబద్ధమని, కేవలం టీఆర్పీ కోసమే.. పెళ్లి ఎపిసోడ్ పేరుతో షోలో అలా నటించామని వెల్లడించింది. ఇక అదిత్య ఈ ఏడాది చివరిలో తన చిరకాల ప్రియురాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా చెప్పింది. అదే విధంగా దీనిపై అదిత్య తండ్రి, గాయకుడు ఉదిత్ నారాయణ్ ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘అదిత్యను కావాలనే నేహాను పెళ్లి చేసుకోమ్మంటూ ఆటపట్టించేవాడిని.. కానీ అదిత్య కొట్టిపారేస్తూ.. ప్రస్తుతం తన కెరియర్‌పై దృష్టి పెడుతున్నానని.. ఇప్పట్లో పెళ్లి చేసుకొనని చెప్పేవాడు. అయినా వినకుండా అదిత్యతో, నేహాను పెళ్లి చేసుకొమ్మంటూ ఏడిపిస్తూనే ఉంటాను’ అని చెప్పాడు. ఆ షో జడ్జ్‌తో హోస్ట్ పెళ్లి! కాగా ఇండియన్ ఐడల్ షోకి నేహా జడ్జీగా వ్యవహరించగా.. ఆదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పెషల్ వెడ్డింగ్ ఎపిసోడ్ పేరుతో టెలికాస్ట్ చేసిన ఈ షోలో ఆదిత్య తండ్రి ఉదిత్ నారాయణ్, తల్లి దీప నారాయణ్‌లతో పాటు నేహా తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో షోలో అందరి ముందు నేహాను తమ కోడలిగా చేసుకుంటామని ఉదిత్ నారాయణ్ దంపతులు ప్రకటించగడంతో.. నేహా తల్లిదండ్రులు కూడా తమ కూతురిని వారింటికి కోడలిగా పంపించడానికి ఒప్పుకున్నట్లుగా షోలో చూపించారు. అంతేగాక ఇటీవల న్యూ ఈయర్ వేడుకలో భాగంగా గోవా బీచ్‌లో నేహా, ఆదిత్యలు సందడి చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక నేహా, ఆదిత్యల పెళ్లి ఎపిసోడ్ ఫేక్ అని తెలిసి ఆమె అభిమానులు నిరాశ పడుతుంటే.. మరికొందరు తమని ఫూల్ చేసినందుకు షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. ‘గుర్తింపు కోసమే.. నా పేరు వాడుకుంటున్నారు’ -
ఆ షో జడ్జ్‌తో హోస్ట్ పెళ్లి!
ఇండియన్ ఐడల్ సీజన్ 11 హోస్ట్ ఆదిత్య నారాయణ్, జడ్జ్ నేహా కక్కర్లు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో ఈ షో ప్రారంభం అయినప్పటి నుంచి ఆదిత్య, నేహాల మధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తోంది. దీనికి ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇటీవల ఆదిత్య నేహాకు ప్రపోజ్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది. వృత్తిరీత్యా ఇద్దరు సింగర్లు కావడంతో వారి మధ్య మంచి అవగాహన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఆదిత్య, నేహా తల్లిదండ్రులు ఇండియన్ ఐడల్ షోకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆదిత్య తండ్రి ఉదిత్ నారాయణ్.. నేహాను ఆటపట్టించాడు. నేహాను తన కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. ఆదిత్య తల్లి దీప కూడా అదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ షోను ప్రసారం చేస్తున్న చానల్ కూడా నేహా, ఆదిత్యలు ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోనున్నట్టు ఓ ప్రొమోలో తెలిపింది. అయితే ఇది షో ప్రమోషన్ కోసం చేసిందా లేక నిజంగానే ఫిబ్రవరి 14న నేహా, ఆదిత్యలు పెళ్లి చేసుకోనున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే చాలా మంది మాత్రం నేహా, ఆదిత్యలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా తాము పెళ్లి చేసుకోనున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు వీరిద్దరు కలిసి గోవా బీచ్‌లో నేహా సోదరుడు టోని కక్కర్ రూపొందించిన ఓ సాంగ్ షూట్లో పాల్గొన్నారు. ఈ వీడియోను ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నేహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. View this post on Instagram #GoaBeach 🏖 Out on 10th feb ❤️😇 . . #TonyKakkar #NehaKakkar #AnshulGarg #AdityaNarayan #KatKritian #DesiMusicFactory A post shared by Neha Kakkar (@nehakakkar) on Feb 1, 2020 at 11:19pm PST -
ఉదిత్ నారాయణ్ కోడలు కాబోతున్న సింగర్!
ముంబై: ప్రముఖ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్-11 వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బాలీవుడ్ టాప్ సింగర్ ఉదిత్ నారాయణ్, గాయని అల్కా యాగ్నిక్ అతిథులుగా సందడి చేశారు. అయితే వీరిద్దరితో పాటు ఈ షో జడ్జి నేహా కక్కర్ తల్లిదండ్రులు కూడా వేదిక మీదకు రావడంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యారు. షో హోస్ట్, ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ తమకు బాగా నచ్చాడని.. అతడిని అల్లుడిగా చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పడంతో నేహా కంగుతిన్నారు. నటుడు, బుల్లితెర హోస్ట్‌గా గుర్తింపు పొందిన ఆదిత్య నారాయణ్ ప్రస్తుతం ఇండియన్ ఐడల్ షో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగా జడ్జి నేహా కక్కర్‌ను ప్రేమిస్తున్నానంటూ తరచుగా ఆమెకు ప్రపోజ్ చేయడం... ఆమె సమాధానం ఇవ్వకుండా దాటవేయడం వంటి పరిణామాలతో షో సందడిగా సాగుతోంది. (‘జరిగిందేదో జరిగిపోయింది..గతాన్ని మార్చలేను’) ఈ క్రమంలో ఆదివారం నాటి షోకు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఉదిత్ నారాయణ దంపతులతో పాటు నేహా కక్కర్ తల్లిదండ్రులు కూడా వేదిక మీదకు వచ్చారు. నేహను తన ఇంటి కోడలిగా చేసుకోవాలని భావిస్తున్నట్లు ఉదిత్ నారాయణ పేర్కొన్నారు. ఆయన భార్య దీపా నారాయణ్ సైతం ఇదే ఆకాంక్షను వెలిబుచ్చారు. అంతేగాక నేహా తల్లిదండ్రులు కూడా పెళ్లి ఖాయం చేశామంటూ వ్యాఖ్యానించడంతో నేహా సహ జడ్జీలు ఆమెను ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఫిబ్రవరి 14న నేహా-ఆదిత్యల వివాహం జరుగనుందంటూ ప్రోమోలో పేర్కొనడంతో..ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే.. ‘ఇదంతా నిజమా లేదా షో రేటింగ్‌ను పెంచే క్రమంలో భాగంగానో తెలియదు గానీ.. మీ జంట బాగుంటుంది నేహా- ఆదిత్య’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ‘ఇండియన్ ఐడల్’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్.. తర్వాతి సీజన్లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాలా చష్మా, దిల్బర్ రీమిక్స్ వంటి పలు బాలీవుడ్ హిట్ సాంగ్స్ ఆలపించిన నేహా.. నటుడు హిమాంశు కోహ్లితో ప్రేమలో ఉన్నట్టు ఇండియన్ ఐడల్ వేదికపై గతంలో ప్రకటించారు. అయితే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడిపోయారు. Taareekh teh ho chuki hai, Mummy-Papa ne bhi apni haan de di hai! Kya Aditya finally Neha ko apni dulhan banaane mein kaamiyaab hoga? Dekhiye #IndianIdol11 #AlkajiUditjiSpecial mein, iss Sunday raat 8 baje. #AlkaYagnik #UditNarayan #AdityaNarayan @iAmNehaKakkar @VishalDadlani pic.twitter.com/odf47CSwMH — Sony TV (@SonyTV) January 9, 2020 -
ఉదిత్ నారాయణ్ కుమారుడి అరెస్ట్
సాక్షి, ముంబై : బాలీవుడ్ ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడిని ముంబై పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదిత్య నారాయణ్ తన కారుతో ఓ ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, అందులోని మహిళా ప్రయాణీకురాలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారు ఆదిత్య నారాయణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 338, 279 కింద అతడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. ఆదిత్య నారాయణ్ గాయకుడిగానే కాకుండా వ్యాఖ్యాతగా, నటునిగా కూడా రాణిస్తున్నాడు. అతడు పలు టీవీ కార్యాక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు. -
భారతీయ ‘రైల్వేగీతం’ విడుదల
సాధారణ ప్రజలకు ఎంతో చేరువైన భారతీయ రైల్వే వ్యవస్థపై మంత్రి సురేశ్ ప్రభు శుక్రవారం ప్రత్యేక గీతాన్ని (రైల్ గీత్) విడుదల చేశారు. సంగీత దర్శకుడు శరవణ్ స్వరపరిచిన ఈ మూడు నిమిషాల గీతాన్ని గాయకులు ఉదిత్ నారాయణ్, కవిత కృష్ణమూర్తి ఆలపించారు. ఈ గీతం రైల్వే వినియోగదారులకు, ఉద్యోగులకు స్ఫూర్తినిచ్చి, భారతీయ రైల్వే అభివృద్ధికి తోడ్పడుతుందని మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రైల్వే శాఖకు సంబంధించిన కార్యక్రమాల ప్రారంభంలో ఈ పాటను ఆలపించనున్నట్లు వెల్లడించారు. అతి పెద్ద భారతీయ రైలే ్వ వ్యవస్థ సమర్థంగా పని చేసేందుకు కృషి చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల నిబద్ధత, అంకితభావానికి ఈ పాట ప్రతీక అని మంత్రి అభివర్ణించారు.